headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797

2. పురాణ పరిశీలన: చేపకథా సాగరము

డా. జొన్నలగడ్డ మార్కండేయులు‌

పేరవరం, ఆత్రేయపురమండలం,
తూర్పుగోదావరిజిల్లా-533235, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440219338. Email: hydjmlu@gmail.com

Download PDF


Keywords: అష్టాదశపురాణాలు, కథ, చేప, మత్స్యము, వ్యాసుడు, ఇతిహాసాలు, మానవజాతి, సృష్టి

ఉపోద్ఘాతం:

భగవంతుడు సకలచరాచర జీవరాశిలోను గోచరించి ప్రబోధించిన విషయము గ్రహింపజేయడానికి పురాణకోణము భిన్నమైనది. సకలజీవరాశిలోను ప్రబోధాత్మక ప్రతీక భగవంతుడిని గుర్తించి గౌరవించాలన్నది పురాణలక్ష్యము. మత్స్య పురాణముతోబాటు అష్టాదశ పురాణములలో స్థానము పొందిన కూర్మ వరాహాది పురాణములు ఈసందేశాన్ని ధ్వనిస్తాయి. ఆధునిక దృక్పధము అవసరము. పురాణాలను మతగ్రంథకోణములో మాత్రమే పరిశీలన అన్న లక్ష్యమునుండి బయటపడాలి.

వానరులను రామాయణము కాలమువారివలె మనము కూడ హనుమజ్జాతి అని నమ్ముతున్నాము. సహజీవన జాతిగ ఉనికిని పురాణగాథగ నిర్ధారించ ప్రయత్నిస్తాము. చెట్లపై, ఇంటి పైకప్పులపై సంచారము నేటికోతిజాతిది ఉనికి. రామాయణ వానర నాగరికజాతికి తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలములో నేటివానపల్లి గ్రామము రామాయణకాల వానరపల్లిగ కిష్కింధకు గుర్తింపు నమ్మకము. నాగరిక వానరజాతి ఆనవాళ్ళులేవు. గమనార్హము. సహజీవనము? రామాయణహనుమంతుడు గొప్ప సంస్కృతపండితుడు. హిమాలయాలలో యతి ఉనికి జాతిగ ఆలోచనలు చేస్తున్నారు. సగము మనిషి, సగముసింహాకృతిజాతి ఉనికిగ చెంచులజాతికి ఆరాధ్యదైవము నారసింహనామము. నాగజాతి ఉనికిగ నాగశబ్దము ముందుచేరిన అయ్య, రాజు, వర్మ నామవాచకాంతములు ప్రసిద్ధము. కూర్మ వరాహ ఎలుగులు మనతో మానవప్రవర్తనతో సహజీవనము గావించాయి. అష్టమహిషీ కల్యాణవరుసలో జాంబవతి మానవకాంతకాదు. శ్రీకృష్ణ పరిణయగాథ, నరకాసురుడి తండ్రిగావరాహరూపుడు పురాణగాథలు. కల్పనకాదని నమ్మించాలని చెప్పడము ఉద్దేశము కాదు. ప్రత్యేకజాతి ఉనికిగ నామదేయులుగా మానవేతరప్రాణుల నామధారణ జాతిగ పరిశోధనలకు ఉపకరించే బలమైన అంశము.

‘వేలాది సంవత్సరాలక్రితం ఏదోఒక అంతరిక్షనౌక అనంత ఆకాశంలో ప్రయాణం చేస్తూ భూమిమీదకు పడిపోయింది. అందులోని మానవాతీతజాతి ఒకశాస్త్రీయప్రయోగకోసం భూమిమీద వదిలివేసిన మానవేతరప్రాణి జంటలు యీనాటి ఐక్యరూపమానవజాతితో సంబంధమను ‘వెలికోవ్ స్కీ’ వాదాన్ని కొట్టిపారేయలేమని’ ఇ. వేదవ్యాస మనదేశము-మనసంస్కృతి గ్రంథములో (68వ పేజి) అభిప్రాయపడ్డారు.

అష్టాదశపురాణముల రచయితగా ఖ్యాతి వ్యాసునిది. వ్యాసుని జన్మకథ నమ్మశక్యముగాని అసత్యమన లేము. మానవాతీత జాతులపరస్పర కలయికగ యీ భూమిమీద గుత్తాధిపత్యానికై జరిగిన వైజ్ఞానిక యుద్ధములలో నేటి మానవజాతి నిలద్రొక్కుకుంది. ఒకప్పటి మానవేతర ప్రాణుల సమ్మిశ్రిత నాగరికత నేటిమానవరూపము. జల, మృగ, వనచర సహజీవనముగల జాతినామ ధేయములు మానవజీవన జాతికి సంక్రమించాయి.అవతారపురుషుల కథలదశావతార చరిత్రలలో మానవజాతి పరిణామదశ మత్స్యజాతివంటి పురాణనామధేయజాతి కోణము పరిశీలనకు శ్రీకారమవాలన్నది నా అభిప్రాయము.

పురాణపుణ్యశ్రవణజాతి ఖ్యాతిగ చేప కథాసాగరము:

‘పరమంబగు వైవస్వతు

చరితంబతిభక్తి వినిన జదివినను మహా

దురితంబులడగు జనులకు

నిరవుగసిద్ధించుననఘ యిహపరసుఖముల్.’ (ఎఱ్ఱన అరణ్యపర్వము చతుర్ధాశ్వాసము 233).

విష్ణువు చేపాకృతిగ సృష్టిజీవరాశిని సంరంక్షించిన హిందూప్రాచీనగాథది. బైబిలు లొనోవా, నోవాతోబాటు కొన్ని జంతువులు ఒకనౌకలో జలప్రళయమునుండి తప్పించు కున్న ప్రపంచ ప్రాచీన వాజ్ఞ్మయములోఉంటున్న కథలకు మార్కండేయముని జలప్రళయసాక్ష్యముగ అద్భుత వ్యక్తి.

నిదురించినా కన్నుమూయనిది చేప. మహాభారతములో యక్షప్రశ్నకు జవాబుగ ప్రసిద్ధి. భారతములో ధర్మరాజు సమాధానముగా ఇది యక్షప్రశ్నని తెలియని వారికి కూడ నిదురించీ కన్నులుమూయనిది చేపని ప్రచారమైంది. యక్షప్రశ్నజవాబుగా సరే! యావద్భారత ఖ్యాతితో బాటు, జలచరముగ కాదనలేని విశ్వఖాతి (celebrity) చేపది. చేప శ్రీమహావిష్ణువు అవతారముగ వైవస్వతమన్వంతర రక్షణ కథకు, వేదరక్షణకు సోమకాసుర సంహారకథకు మానుషప్రవర్తన ప్రసిద్ధము. 

మత్స్యావతారము కథను మాట్లాడి చెప్పలేవు. అంతేకాదు విష్ణ్వాంశలుగా గర్వము నెత్తికెక్కలేదు. ఈవిషయం చెప్పడానికి రేయింబవళ్ళు కళ్ళుతెరుచుకుని ఉంటున్నాయి  చేపలు.  మత్స్యపురాణము మొదలుకొని అష్టాదశపురాణ కర్తగ వ్యాసభగవానులవారు, అద్రికఅనేచేపకు పుత్రిఅయిన సత్యవతికి కుమారుడు. వ్యాసునికి చేపలు ఆవిధంగా అమ్మమ్మ తరపు చుట్టాలు? కౌరవ, పాండవులకూ బాదరాయణ చుట్టరికమువద్దు. భారతకథా సాగరమీదులాటలో కనిపిస్తున్నాయి. శాపగ్రస్తులై జనహిత ఆహారమవు తున్నాయని చెప్పబడ్డాయి. కన్ను మూయకుండా మానవులు చంపి తినేస్తారని కూడ అప్రమత్తంగా ఉంటున్నాయి చేపలు. పురాణపాత్రగ చుట్టరిక చేపలవృత్తాంతాలుగ చేపలు కథలు చెబుతున్నాయి. కొన్ని ప్రబోధాత్మకములుకూడ. మీనరాశిగ నక్షత్ర జాతకచక్రప్రభావము చెబుతాయి.

చేపలవేట మానవులకు సరదా. ముఖ్య ఆహారదినుసుగా ఆదిమ మానవుని కాలంనుంచీ ఉంది. మన ఎరకు గురయి, గేలానికో లేదా జాలర్ల వలలోనో చిక్కుకుంటున్నాయి. భూమిమీదకు వస్తే అంతేసంగతులు విశ్వజనహిత ఫలహారమవుతాయి. అలా ప్రాణంపోతున్నా కన్నుమూయని చేపలు జనహిత ఫలహారశాపమేంటి? పురాణకథ తెలుసుకోవాల్సిందే! పితృలోకంలో పితరులు కూడ ఆబ్దికాలలో వారసులు పిండప్రదానంలో చేప మాంసం వడ్డిస్తే సంతోషిస్తారు. అంపశయ్య మీద భీష్ముడు అనుశాసనిక పర్వంలో ధర్మోపదేశాలలో ధర్మరాజుకు శ్రాద్ధవిధి చెప్పినపుడు చెప్పాడు.

కాబట్టి చేపలుమనకు తినే ఆహారముగ బాగా తెలుసు. మనజానపదకథలలో రాజుగారి కొడుకులైనా చేపల్ని వేటాడారు. ఎండబెట్టి మరీ దాచి మాగాయి ముక్కల్లా ఎండేక తినే సరదా ఎండుచేప, ఉప్పుచేప కథలున్నాయి. కష్టపడి తెచ్చుకున్న చేపఎండడానికి అడ్డంకులుండకూడదు. అడ్డంకికి కారణము పిల్లవాడి ఏడుపైనా  బంగారుకన్నంలో వేలుపెడితే కుట్టనా అన్న చీమగర్వము కథ అనగా అనగా రాజుకథ. రాజుకేడుగురు కొడుకులూ వేటకెళ్ళి తెచ్చి ఎండబెట్టిన ఏడు చేపలు కథ బాల్యము నుంచి వింటున్నాము. ఎండుచేప రుచికరమా!? లేక ఎండుచేపకథలు ప్రబోధాత్మకములా?

జానపద పరిశోధకులు భక్తవత్సలరెడ్డి ఈ కథకు ఆధారము 1883 లో Macmillan & co, London Folktales of Bengal లాల్ బెహరీ సేకరించి ఇంగ్లీషులోకి అనువదించాడని చెప్పారు. శంభు అమ్మ కథగ ముగింపులోని పాటను అనువాదము చేసారు. ఈ కథలో నతియ అనే  చెట్టు ముల్లా అంటే ముల్లు ఎండిపోవనందుకు కారణమై మనచేపకథలా సాగింది అమ్మ. గొల్లవాడి సంభాషణ. చీమకుట్టడం కారణానికి దానిజవాబు జానపదం మూలం బెంగాల్ వంటి భారతీయభాషలలో ఉన్నాయి. అందుచేత వృత్తి ఆధారంగా జీవించే సమాజంలో సహజీవన గాథల పాటలు అన్నింటిలోను చేపవంటి ప్రాణులు ఉన్నాయనిపిస్తుంది (‘సహృదయసాహిత్యవేదిక’-వాట్సాప్ తేది. 20 అక్టోబర్).

నవ్వినఎండిన ఎండుచేపకథ కథాసరిత్సాగరంలో ఉంది. ఈ ఎండుచేప నవ్వినకథ అనుకరణగా చేపనవ్విన కథ పంచతంత్రములోనూ కనిపిస్తుంది. ఒకతరాన్ని విశేషంగా ఆకట్టుకున్న కాశీమజలీ కథలు మొదటి భాగంలో ఈకథ మిక్కిలి ప్రాచుర్యమయింది. కథాసరిత్సాగరం మొదటి లంబకంలో ఉన్న చేప నవ్విన కథ ఈకథకు ఆధారము. మధిరసుబ్బన్నదీక్షితులు గారు ఈకథను పెంచిరాశారు. అంతఃపురంలో స్త్రీ రూపములు ధరించి తిరుగుతున్న పురుషులను గుర్తించలేని రాజును చూసి ఎండుచేప నవ్వింది. రాజు సిగ్గుపడి స్త్రీవేషంలో ఉన్న ఆపురుషులను శిక్షించాడు. ఈ చిన్న అంశము ఆధారముగా దీక్షితులు తన కల్పనాబలంతో జీవకళ ఉట్టిపడేవిధంగా మలిచాడని మాదిరాజు బ్రహ్మానందం తన సిద్ధాంతగ్రంథము (కాశీమజిలీకథలు-కథాసంవిధానము, పుట.127)లో అభిప్రాయ పడ్డారు. ఇనుపచిక్కాలతో వ్రేలగట్టబడి స్త్రీల ఆకారంతో ఉన్న పురుషుల వృత్తాంతాన్ని అడిగిన గోపునికి మణిసిద్ధుడు చెప్పిన కథగా మారింది

బ్రాహ్మణులు శాకాహారము తింటారు. అయినా బెంగాల్ బ్రాహ్మణులు, ఉత్తరాదిని కొన్నిప్రాంతాలు లోను బ్రాహ్మణులు చేపను ఇష్టంగా తింటారుట! శాపకారణమా? విధిలిఖితమా? ఆహారజలచరమా?

పురాణల ప్రకారం నీటిలోనే చేపలకు ఒకలోకముంది. చాలావైభవంగా ఉండేరాజును కలిగి ఉంటాయి. భాగవతములో ఆలోకపు రాజును  గరుత్మంతుడు ఎత్తుకుపోయాడనేకథ ఉంది. ఈ చేపలరాజును సౌభరి అనేముని కాపాడాడు. సౌభరి జలమధ్యలో తపోనిష్టలో ఉంటూండేవాడు.ఈ సౌభరిముని జలమధ్యములో తపస్సు చేసుకునే వాడని విష్ణు పురాణము కూడ చెప్పింది. గరుత్మంతుడు ఎత్తుకుపోయి నప్పుడు భాగవతంలో ఈ మునిని చేపలన్నీ ప్రార్ధించి తమరాజును రక్షించుకున్నాయని చెప్పబడింది. రామాయణకథాకాల బలవంతులైన సుగ్రీవ వానరజాతి వంటిది బలాకృతి చేపజాతి?

విష్ణుపురాణకథయితే ఈ సౌభరి మొదట్లో విరాగి. కాని జలమధ్యములో తపస్సు చేసుకుంటూ ఆ జలంలో మత్స్యరాజు అనుభవిస్తున్న సుఖాలను, సంసారసుఖాలను చూసి ప్రభావితుడయ్యాడు. తపస్సు మానేసి మాంధాతృ అనే మహారాజు కుమార్తెలందరినీ వివాహమాడాడు. అత్యున్నతిగల జీవితముతో ఇనుపగోచీల జితేంద్రియ మునులను కూడ ప్రభావితము చేయగల చేపలుగా సౌభరివంటిమునులు రక్షించే స్థాయిలో ఉండేపాత్రలుగా కథలు మనకున్నాయి. చేపపేరు ధ్వనిస్తున్న మత్స్యజాతి అనే నాగరికత ప్రత్యేకముగ ఉండేదా?

సౌభరి ముని రక్షకుడు. కాని వంచనతో ఆమునిననుకరించే  కొంగ జపాలు చేపల్ని వంచించిన కథలు ఉన్నాయి. కొంగ చేసే ఈజపము మీనరాజుల సిరిసంపదలు చూసికాదు. వాటిమేని రుచి. ఆమిషముగా ఆరగిస్తాయి. టక్కరికొక్కెరగ చేపల్ని నమ్మించిన దొంగమునికొంగ అవతారాన్ని ఎండ్రి తెలివితేటలతో అంతంచేసిన కథ పిల్లలకు చాలా యిష్టము. నీటిలో ఉన్నా, ఎండుచేపల దుస్థితికి చేరుకోవాల్సి వచ్చిన చెడుకాలము కథలకు చేపజాతి గురవడము వెనుక అగ్నిదేవుని శాపముంది. అగ్నిదేవుడు చాలాగొప్పవాడు. పెద్దకుటుంబీకుడు. అగ్నివంశీకులందరూ అగ్నిదేవుడిపేరుతోనే ప్రసిద్ధి. అందుచేత అగ్నికి చాలాపేర్లున్నాయి. అలా ఒకప్పుడాయనపేరు అద్భుతనాముడు.

అగ్ని సర్వభక్షకుడు. కాని సర్వజనహితుడు. అగ్నిలేకపోతే విశ్వానికి పచనమైన ఆహారము లభించదు. దేవతలకు కూడ హవిస్సులద్వారా ఆహారమందిస్తాడు. అందుచేత ఈపనులకు అద్భుతనాముడు విసుగు చెందాడు. తనపనిని అథ్వరుడనేవాడికప్పచెప్పి సముద్రములో దాక్కున్నాడని భారతములో ఉంది. కాని  దేవతలు అద్భుత నాముడి మీద అభిమానమును దాచుకోలేక పోయారు. వెదకసాగారు.

సముద్రములోని చేపలన్నీ దేవతల మెప్పుపొందాలనుకున్నాయేమొ, అద్భుతనాముని ఉనికిని పట్టిచ్చాయి. కోపమొచ్చి అగ్నిదేవుడు “జనులు నిర్దాక్షిణ్యంగా వధించుగాక’’ అనిచేపలకు శాపమిచ్చాడు. మనుషులు లొట్టలు వేసుకుని మరీ పట్టి తినేయడం అందుకేట! విశ్వజనహితమెలా ఉన్నా ఈచేపలలో పులసజాతి చేపను ఎంతఖరీదైనా కొని తింటున్నారు. పుస్తె అమ్మి అయినా పులసచేపకూర వంటకముతో ముద్ద తినితీరాల్సిందేనని గోదావరిజిల్లాల మత్స్యాహారప్రియుల నినదము. కొరమీను, మట్టగిడస, బొమ్మిడాయి రకరకాల వంటకాలుగా చేపనారగిస్తారు.

శ్రాద్ధాలలో యజ్ఞాలలో వేదం తెలిసిన హింసచేత దోషముండదు. కాని మాంసపురుచి మరిగి తినటానికై ప్రాణిని చంపితే పాపమొస్తుందన్నది భీష్ముని అభిప్రాయము. అయినా శ్రాద్ధం అగ్నిపూజతో కలిపి చేస్తే రాక్షసులు సమీపించరు. పితృదేవతలు సంతోషిస్తారు. అందుచేత చేపలు నియమితాహారవేళ  నిష్కారణ బలిలో పుణ్యమునే సాధిస్తాయా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాది సకలవర్ణాలు వరి, చెరకువంటి పంటలతోబాటు పొలాలలో చేపల చెరువులు సాగు చేస్తున్నారు. చేపలలో చాలా రకాలుంటాయి. విశ్వవ్యాప్త ఈ రకాలన్నిటిని ఏకరువుపెడితే సిద్ధాంతగ్రంథముతో ఆధునిక విద్యార్థి పట్టా సాధించగలడు. అంత ప్రత్యేక అధ్యయనమున్న జాతి అది.

మృత్యువు తప్పదు. కాని తప్పించుకునే ప్రయత్నముండాలి. ఒకనదిలో నివసిస్తున్న మూడుచేపలకథగా భీష్ముడు ఒక చక్కటి కథాసందేశాన్నిచ్చాడు. దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడను చేపలు ఒకకొలనులో ఉండేవి. చెరువుఎండిపోతోందని జాలర్లు సమయము కోసము చేపలు పట్టడానికి ఎదురు చూస్తున్నారు. అది గ్రహించి దీర్ఘదర్శిలా ముందుజాగ్రత్త, ప్రాప్తకాలజ్ఞుడిలా తప్పించుకునే ఉపాయ నేర్పు లేనివారు దీర్ఘసూత్రుడిలా ప్రాణాలు పోగొట్టుకునే మానవ మనస్తత్త్వమునకు అన్యాపదేశముగ హెచ్చరిక కథ అది. చేపల మనస్తత్త్వము కన్నులుమూయని నిద్రగా వెంటాడు తుందన్న ప్రబోధాత్మక కథ భీష్ముని మూడుచేపలకథ. పంచతంత్రములో కూడ ఈకథ ఉంది.

చేపవృత్తాంతములుగా కథలు చాలా ఉండవచ్చు. సర్పకన్యలున్నట్లే మత్స్యకన్యలున్నారని మన నమ్మకం. జలచరాహారముగా క్షుధను తీర్చినా సంసారముచేసి పిల్లలను కన్న కథలు కల్పితముగా కనిపిస్తాయి. మానవ సంతానాన్ని కన్న అద్రికచేప కథ మహాభారతము. అద్రిక అప్సరస. జలక్రీడలాడుతూ మునిగి తేలుతూ అది నీటిలో ధ్యాన నిష్టలో ఉన్న ఒకముని పాదాలను తాకి శాపానికి గురయి చేపయింది. ఫలితముగా బిడ్డలను గర్భంతో ఉన్న చేపగానే మరణించి అద్రిక రూపుతో వెళ్ళిపోయింది. చేపయి ఉపరిచరవసువు వీర్యము మ్రింగి మత్స్యగంధిని, మత్స్యరాజుకు జన్మనిచ్చినా  చేపరూపంలో దాంపత్య సుఖ సంసారము చేయని అద్రిక శాస్త్రీయకోణము.

అయితే మత్స్యగంధికి పరాశరముని ద్వారా వ్యాసజననము సద్యోగర్భముగా జరిగింది. ఈ మహాభారతకథ ప్రసిద్ధము. శకుంతలాదుష్యంతుల కథను అభిజ్ఞానశాకుంతలమును చేపచుట్టూ త్రిప్పి విశ్వవిఖ్యాతము చేశాడు కవికులతిలకుడు. కాళిదాసుగారి చేపకడుపులో దొరికిన ఉంగరము చేపకథే. ఆఖరికి లీలామానుషుడు కృష్ణుడికొడుకు ప్రద్యుమ్నుడు చేపకడుపులోంచే బయటపడి పెరిగిపెద్దయిన కథ చేప ప్రాముఖ్యమే! మత్స్యావ తారముగా విష్ణుప్రీతిపాత్రమైంది. మత్స్యజాతిగ మాంసాహార భోజనప్రియులను లొట్ట లేయించినా కాలక్షేప కథలతోబాటు పుణ్యకథాశ్రవణములో వ్యాసుని వంటి విద్వాంసుల జన్మవారసుల పాత్రల అద్రిక నిలయభారత కథాసాగరము చేపలు.

ముగింపు:

చేపకు సంస్కృతనామము మత్స్యము. మాంసప్రియగనుక ఆపేరు వచ్చింది. మత్స్య శబ్దాన్ని ధ్వనిస్తూ జనావాసమైన మత్స్యదేశము ప్రసక్తి మహాభారతములో ఉంది. ఈ మత్స్యదేశము జరాసంధునికి అధీనముగా భయపడేది. జరాసంధుడుని రాజసూయదిగ్విజయయాత్రలో భీముడు చంపాడు. విష్ణువు మత్స్యావతారగాథను మత్స్యపురాణముగ రోమహర్షణుడు శౌనకాదిమునులకు చెప్పాడు. అష్టాదశ పురాణాలలో ఒకటిగా పేరుపొందింది. శివుడు పార్వతికి చెప్పిన విజ్ఞానాన్ని నాథయోగిగ  చేపరూపములో విన్నాడు. మత్సేంద్రనాథ్ గా తొమ్మిదిమంది నాథ యోగులలో ఒకడుగా ప్రసిద్ధికెక్కాడు. విజయనగరప్రాంతములో మత్స్యేంద్ర నాథుడి విగ్రహాలు చేపపై విహరిస్తున్నట్లు ఇతరయోగులతో కలిపి కనిపిస్తాయి. ఇప్పుడు ఏలియన్లు అనే గ్రహాంతరవాసులకథలు వింటున్నాము. మనపురాణగాథలలోని మృగ పక్షి జలచరాకృతులు యుగాలచరిత్రలో అంతమైపోయిన డైనోసార్సులవలె బలదర్పిత జీవజాతిఆకృతులు మనతో సహజీవనముగ విలీనమైపోయి ఉన్నాయి. ఒకప్పటి ఏలియన్ వంటిఅద్భుతగాథలుగ నేటి మృగపక్షి జలచరాకృతికి నిక్షిప్తమై ఉన్నాయన్న పరిశీలన అవసరం ఉందని నాకనిపించింది.

ఉపయుక్త గ్రంథసూచి:

  1. వేదవ్యాస. ఇ, (1970). మనదేశము- సంస్కృతి, USCEFI PUBLICATIONS.
  2. మహాభారత, భాగవత, రామాయణ విష్ణుపురాణ గాథలు.
  3. బ్రహ్మానందం, మాదిరాజు. కాశీమజిలీకథలు- సంవిధానము
  4. భక్తవత్సలరెడ్డి, వాట్సాప్ - సహృదయవేదిక.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]