headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-02 | February 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. ఎన్. కె. బాబు కథాసంకలనాలు: మహిళాజీవితచిత్రణ

గిరిబాబు దుప్పట్ల, డా. కె. జ్యోతిలక్ష్మి

తెలుగు జూనియర్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) శ్రీకాకుళం,
పరిశోధకులు, డా. బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440167620, Email: giribabu.duppatla@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 19.01.2026        ఎంపిక (D.O.A): 30.01.2026        ప్రచురణ (D.O.P): 01.02.2026


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్య ప్రక్రియలలో కథకు విశేష పాఠకాదరణ ఉంది. ఉత్తమమైన అనుభూతిని కలిగించే కథలను పాఠకులకు అందించడానికి కథా సంకలనాలు కీలక పాత్ర పోషిస్తాయి. అనుభవజ్ఞులైన రచయితలతో పాటు వర్ధమాన రచయితలను ప్రోత్సహిస్తూ, విభిన్నమైన కథలను అందించడం వీటి ఆవశ్యకత. ఈ నేపథ్యంలో, నిడగంటి కృష్ణబాబు (ఎన్.కె.బాబు) సంపాదకత్వంలో వెలువడిన కథా సంకలనాలలో మహిళా జీవిత చిత్రణను విశ్లేషించడం ఈ పరిశోధన ముఖ్యోద్దేశం. ఈ అధ్యయనం ఎన్.కె.బాబు ప్రచురించిన 'కథా సౌరభాలు', 'కథాపరిమళాలు', 'కథా కుసుమాలు', 'కథా లోగిలి' అనే ముఖ్య సంకలనాలను ప్రాథమిక ఆధారాలుగా గ్రహిస్తుంది. ఈ కథలలోని మహిళల సామాజిక స్థితిగతులు, కుటుంబ సంబంధాలు, వారి భావోద్వేగాలను గుణాత్మక విశ్లేషణ పద్ధతిలో లోతుగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశోధన, ఎన్.కె.బాబు కథలలో మహిళలు ఎదుర్కొనే సంక్లిష్ట సమస్యలను, వారి అనుభవాలను వివరిస్తుంది. ఉదాహరణకు, 'తెల్ల ఏనుగు' కథ సాధారణ మహిళ సామాజిక అంచనాలను అధిగమించలేని పరిస్థితిని ఆవిష్కరిస్తుంది. 'అమ్మ' కథ ఆడపిల్ల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళనలను, అమ్మతనం అంతర్గత సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. 'బెదిరింపు' కథలో మహిళల ఆత్మగౌరవం, కుటుంబ కలహాలపై వారి ప్రతిస్పందనలు స్పష్టంగా కనిపిస్తాయి. 'సుజాత' కథ బాలిక విద్యాకాంక్ష, అడ్డంకులను అధిగమించే పట్టుదలను ప్రదర్శిస్తుంది. ఈ కథల రచనా శైలి సరళంగా, సూటిగా ఉంటుంది. ప్రకృతి వర్ణనలో, గ్రామీణ వాతావరణ చిత్రణలో ప్రాంతీయ భాషా పదజాల వినియోగం కథలకు సహజత్వాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత పరిశోధన సమకాలీన తెలుగు కథా సాహిత్య ప్రపంచంలో మహిళల బహుముఖ జీవిత చిత్రణపై విలువైన అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ అధ్యయనం ఎన్.కె.బాబు కథా సంకలనాలకు పరిమితమైనప్పటికీ, భవిష్యత్ పరిశోధనలు విస్తృతమైన కథాసంకలనాలను పరిశీలించవచ్చు. తద్వారా తెలుగు కథా సాహిత్యంలో మహిళా చిత్రణపై సమగ్ర అవగాహన ఏర్పరచవచ్చు. ఈ పరిశోధన మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి, వారి జీవితపార్శ్వాలపై అవగాహన కల్పించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాము.

Keywords: తెల్ల ఏనుగు, ట్రంకు పెట్టె, చెమట కాయలు, కర్తవ్యం, భావోద్వేగములు, అక్షయపాత్ర, కనబడని శత్రువు, అమ్మతనం. ఎదురుచూపు, ఆవేదన.

1. ప్రవేశిక

తెలుగు సాహిత్య ప్రక్రియలలో కథకు చక్కని పాఠకాదరణ ఉంది. పాఠకులకు మంచి అనుభూతిని కలిగించడానికి వివిధ ప్రాంతాల రచయితల నుండి కథలను సేకరించి కథా సంకలనాలు ప్రచురింపబడ్డాయి. వివిధ రచయితల కథలను సేకరించి ఒక పుస్తకం రూపంలో ప్రచురించడమే కథా సంకలనం అనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్.కె.బాబు (నిడగంటి కృష్ణబాబు) పలువురు కథా రచయితల కథలను సేకరించి కథా సంకలనాలను ప్రచురించారు. ఈ సంకలనాలలో వివిధ కోణాలలో వివరించబడిన మహిళా జీవితం గురించి విశ్లేషించడమే ఈ పరిశోధన ఉద్దేశం.

2. కథాసంకలనాలు – ఆవశ్యకం

మంచి కథలను పాఠకులకు అందించాలన్న తపనతో కథా సంకలనాలు తెలుగు సాహిత్యంలో వెలువడడం మంచి పరిణామం అని చెప్పవచ్చు. కథా సంకలనాలలో అనుభవం ఉన్న కథా రచయితలకు, వర్ధమాన కథా రచయితలకు చోటు కల్పించడం ద్వారా వారి సాహిత్య కృషిని ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ కథా సంకలనాల ద్వారా వైవిధ్యభరిత కథలను పాఠక లోకానికి అందించగలము.

3. ఎన్.కె.బాబు కథాసంకలనాలు

ఎన్.కె. బాబు (నిడగంటి కృష్ణబాబు) వివిధ ప్రాంతాలకు చెందిన రచయితల నుంచి కథలను సేకరించి 'కథా సంకలనాలు' ఎన్.కె. పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించారు.

  1. కథా సౌరభాలు
  2. కథా పరిమళాలు
  3. కథా కుసుమాలు
  4. కథా లోగిలి

ఈ సంకలనాలలో మహిళా జీవితం గురించి చక్కగా వివరించబడింది.

3.1 కథా సంకలనాలు - భాష

ఎన్.కె.బాబు కథా సంకలనాలలోని కథలలో భాష సరళంగా, సూటిగా ఉంటుంది. నిత్యజీవిత వ్యవహారంలో ఉన్న భాషా పదజాలం వినియోగించబడింది. ప్రకృతి, గ్రామాలు, అడవులు, నదులు, గిరిజనులు మొదలైన అంశాల వర్ణనలో ఆయా ప్రాంతాలకు చెందిన భాషా పదజాలానికి ఈ కథా సంకలనాల కథలలో చోటు కల్పించబడింది అని చెప్పవచ్చు.

4. ఎన్.కె.బాబు కథా సంకలనాలు - మహిళా సామాజిక జీవితం

"కథా సౌరభాలు" సంకలనంలో "తెల్ల ఏనుగు" అనే కథలో కాంతం సామాజిక జీవితం చక్కగా వివరించబడింది. అటెండర్‌గా పనిచేసే శ్రీరాములు తన భార్య కోరికను తీర్చాలి అనుకుంటాడు, ఆర్థిక పరిస్థితులను అధిగమించలేక వాయిదా వేసుకుంటాడు. కాంతం ఎప్పుడు పోరు పెట్టలేదు. "ఎండాకాలం ఇంట్లో ఉక్కపోతకు ఉండలేకపోతున్నాం. బాబుకు ఒళ్లంతా చెమటకాయలు వచ్చేసాయి. అవి చిరమరలాడుతుంటే వాడు పడుకోవడం లేదు. ఒక ఫ్యాన్ తీసుకురండి" (`"తెల్ల ఏనుగు"` 28) అని కాంతం తన భర్తకు చెబుతూ ఉండేది. శ్రీరాములు ఒక రోజు భార్యపై ప్రేమతో తన బకాయిలు రావడంతో 700 రూపాయలు ఖర్చు చేసి పచ్చ రంగు పట్టుచీర ఇంటికి తెచ్చాడు. ఆ పట్టుచీర కట్టుకుని తన భర్త, బాబుతో పెళ్లికి కాంతం బయలుదేరింది. తన పెళ్లికి పాలిస్టర్ చీర కట్టుకుంది. అప్పటికే ఆ పాలిస్టర్ చీర అంటే తనకు ఎంతో గొప్ప. ఇప్పుడు పట్టుచీర తన శరీరానికి ఎంత అందంగా కనిపిస్తుందో అనుకుని ఆ రోజు కోసం ఎదురుచూసింది కాంతం. కాంతం ఆ పట్టుచీర కట్టుకుని తన భర్త, తన కొడుకుతో పెళ్లికి బయలుదేరింది. ఆడవాళ్ళ కళ్ళు ఆమె చీరపై పడ్డాయి. అలంకారం ఎంత అందాన్ని ఇస్తుందో కాంతంకు అప్పుడే తెలిసింది. కావున మరింత హుందాతనం ప్రదర్శించింది. తన కొడుకు చాక్లెట్లు తింటూ అమ్మ అని చీర చెంగు పట్టబోయాడు. వద్దు అని వారించి బాబును పక్కకు తప్పించింది. బాబు మరో చేతితో కాంతం కొంగు పట్టుకుంటే "ఛీ...ఛీ... మట్టి చేతులతో వద్దంటే పైన పడతావా?" (`"తెల్ల ఏనుగు"` 35) అని కొంచెం కోపంతో చిన్నారి చేతుల్ని విదిలించింది. ఆ తాకిడికి తట్టుకోలేక బాబు రోడ్డుపైకి దొర్లిపోగా అటుగా వస్తున్న ఆటో బాబును గుద్దుకుంది. బాబు ఏడుస్తున్నాడు. పట్టుచీర అంతా రక్తం, మట్టి. అప్పుడు కాంతం "ఛీ వెధవ చీర" అని ఏడ్చింది. ఇంటికి వచ్చి చీర విప్పి నిత్యం కట్టుకునే నేతచీర ధరించింది. పట్టుచీరను తెల్ల ఏనుగుతో పోల్చడం జరిగింది. ఒక సాధారణ మహిళ సమాజంలో తన స్థాయికి మించి హుందాతనం ప్రదర్శించకూడదనే సత్యం ఈ కథలో ఆవిష్కరించబడింది.

5. మహిళ - కుటుంబ సంబంధాలు

"కథాలోగిలి" సంకలనంలోని "అమ్మ" కథలో కుటుంబ బాంధవ్యాలు చక్కగా వివరించబడ్డాయి. రామం, సీత ఆదర్శ దంపతులు. వారి అమ్మాయి పేరు నందిని. తెలిసిన వారి ద్వారా ఓ పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు అజయ్. అమ్మాయితో మాట్లాడాలన్నాడు. డాబా పైకి వచ్చారు. సన్నజాజి అందంగా నవ్వింది. "నీ ఎదుట నేను, వా నీవు- మా ఓ మామా ఎప్పుడు ఉంటావు?" (`"అమ్మ"` 56) అనే ఆత్రేయ సినీ గేయం నందినికి ఆ సమయంలో గుర్తుకొచ్చింది. వారిద్దరికీ సంతోషంగా వివాహం జరిగింది. తమ వియ్యంకురాలు ద్వారా నందిని గర్భవతి అయిందని విషయం తెలుసుకుని, నందిని దంపతులు సంతోషంతో నందిని అత్తవారింటికి వెళ్లి, వియ్యంకుల అనుమతితో నందినిని పుట్టింటికి తీసుకువచ్చారు. నందిని ముభావంగా ఉంది. అల్లుడి నుండి ఫోన్ రాలేదు. సీత సలహాతో రామం అల్లుడికి ఫోన్ చేస్తే అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు. తన కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిన తర్వాత నందిని అబార్షన్ చేసుకుంటానని పేచీ పెట్టింది. తన అత్తవారికి అబార్షన్ ఇష్టం లేదు. విషయం తెలిసిన తల్లిదండ్రులు నందిని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు నందిని "తెలుసమ్మా నేను చేసేది తప్పు అని... అసలు ఆ టెస్ట్ చేయకుండా ఉంటే నాకు ఆలోచన వచ్చేది కాదని" (`"అమ్మ"` 59) సమాధానం ఇచ్చింది. నందిని తల్లి "అమ్మతనం నీకు తెలుసా?" అని ప్రశ్నించగా, "నేను ఆడదాన్నే, అమ్మతనం తెలిసినదాన్నే, అందుకే అమ్మాయిని కని క్షణక్షణం భయం భయంగా గడపడం నాకు ఇష్టం లేదు" (`"అమ్మ"` 59) అని చెప్పి, ఆడపిల్లకు పూర్తి రక్షణ కల్పించే వరకు ఎవరూ ఆడపిల్లలను కనకూడదని ఆవేశంగా నందిని మాట్లాడింది. ఒక అమ్మాయి ఆవేశం, అమ్మతనం గురించి ఈ కథ ద్వారా ఈ పరిశోధన వ్యాసంలో వివరించబడింది.

6. ఎన్.కె.బాబు కథా సంకలనాలు - మహిళా భావోద్వేగాలు

6.1 బెదిరింపు కథలో భావోద్వేగాలు

ఎన్.కె.బాబు (నిడగంటి కృష్ణబాబు) సంపాదకత్వం వహించి ప్రచురించిన 'కథా కుసుమాలు' సంకలనంలోని 'బెదిరింపు' కథలో మహిళా భావోద్వేగాలు చక్కగా విశ్లేషించబడ్డాయి. అలివేలు కుమారుడు అరవింద్. అరవింద్ భార్య అర్చన. అర్చన తల్లికి బాగులేదని, ఆసుపత్రిలో చేర్చారని తన తమ్ముడి ద్వారా తెలుస్తుంది. అమ్మను చూసేందుకు వెళ్తానని తన భర్తతో చెప్పగా, అరవింద్ తన తల్లికి అత్త అనారోగ్యం గురించి చెప్పాడు. అప్పుడు అలివేలు, "శభాష్ రా కొడకా... ఈ ఇంట్లో నీ తల్లిని, నీ పెళ్ళానికి అత్తను, నేను ఒక్కత్తినే ఇక్కడ ఉన్నానన్న ధ్యాస లేనట్టుంది మీ ఇద్దరికీ. నాకు చెప్పాలని గాని, నా అనుమతి తీసుకోవాలని లేదు గదూ మీకు?" (`"బెదిరింపు"` 43) అని ఆ ముసలమ్మ కొడుకు, కోడలిపై రుసురుసులాడుతూ బెదిరించింది. ఆ సమయంలో అర్చన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. భార్యను చూసి అరవింద్ ఎంతగానో బాధ పడ్డాడు. అరవింద్ వెళ్లమని చెప్పినా అర్చన వెళ్ళలేదు. తన కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన చూసి, తెలివిని సంపాదించి, అర్చన తమ కూతురును ఎత్తుకుని, సూట్‌కేస్ పట్టుకుని ఎదురుగా ఉన్న అత్తతో "అత్తయ్య, నేను మా అమ్మగారి ఊరు వెళ్తున్నాను... ఏవండీ... నన్ను బస్టాండ్‌లో డ్రాప్ చేసి వెళ్లండి" (`"బెదిరింపు"` 47) అని పలికింది. కొడుకుతో కలిసి గుమ్మం దాటుతున్న కోడలిని చూస్తూ అలివేలు హడలిపోయింది. ఈ 'బెదిరింపు' కథలో సగటు మహిళ భావోద్వేగాలు వివరించబడ్డాయి.

6.2 సుజాత కథలో బాలిక ఆవేదన

"కథా పరిమళాలు" అనే కథా సంకలనంలోని "సుజాత" కథలో ఒక బాలిక ఆవేదన బాగా విశదీకరించబడింది. వీరయ్య కూతురు సుజాత. సుజాత చదువును మధ్యలో విడిచిపెట్టి టి.సి. తీసుకోవాలనుకుంటాడు సుజాత తండ్రి. ఈ నేపథ్యంలో "మా నాన్న రేపు మీ దగ్గరికి వచ్చి టి.సి. ఇమ్మని అడుగుతాడు. ఇవ్వకండి" (`"సుజాత"` 211) అని గాబరాగా సుజాత ప్రధానోపాధ్యాయుడికి చెబుతుంది. పనుల కోసం విజయవాడకు కుటుంబంతో వెళ్ళానని, తన తల్లికి తోడుగా సుజాతను ఇక్కడ ఉంచి ఎనిమిదో తరగతి చదివిస్తున్నానని, ఇప్పుడు ముసలమ్మతో పాటు సుజాతను కూడా తీసుకువెళ్లి విజయవాడలో చదివిస్తానని వీరయ్య చెప్పాడు. "సార్, నాకు చదువుకోవాలని ఉంది. నోట్స్ కూడా రాసేస్తానండి. ఆదివారాలు ఇక్కడ గాజు ఫ్యాక్టరీలో పనికి వెళ్తాను. ఆ డబ్బులతో నోట్స్ కొని రాసేస్తాను సార్" (`"సుజాత"` 212) అని సుజాత ప్రాధేయపడింది. అయితే ఆ బాలిక పట్టుదలను చూసి వీరయ్య మనసు మార్చుకున్నాడు. ఈ పరిశోధన వ్యాసంలో సుజాత భావోద్వేగం చక్కగా వివరించబడింది.

ఉపసంహారం

తెలుగు సాహిత్య వికాసంలో కథా సంకలనాల పాత్ర చాలా ముఖ్యమని ఘంటాపథంగా చెప్పవచ్చు. కథా సంకలనాలలోని కథల ద్వారా అనుభూతిని పొందడానికి అవకాశం ఉంటుంది. వైవిధ్యంతో కూడిన కథలు కథా సంకలనాల్లో ప్రచురించడం వలన తెలుగు కథా సాహిత్యం విస్తరిస్తుందని ఆశించవచ్చు.

  • ఈ కథా సంకలనాలలోని కథల ద్వారా వివిధ ప్రాంతాల మహిళల గురించి, వారి సంస్కృతి విశేషాల గురించి పాఠకులు తెలుసుకుంటారు.
  • ఎంతోమంది కథా రచయితల కథలు ప్రచురింపబడతాయి. తద్వారా ఆ కథా రచయితలకు సాహిత్య ప్రోత్సాహం లభిస్తుంది.
  • కథా రచయితలలో సాహిత్యాభిలాషను పెంపొందింపవచ్చును.
  • వివిధ ప్రాంతీయ మాండలికాల గురించి పరిశోధన వ్యాసంలో వివరించడం జరిగింది.
  • ఈ పరిశోధన వ్యాసంలోని కథల ద్వారా మహిళా జీవితంలోని వివిధ అంశాల గురించి అవగాహన, వారి పట్ల సానుకూల దృక్పథం పాఠకులకు కలుగుతుందని ఆశించవచ్చు.
  • ఎన్.కె.బాబు సంకలనాలలోని కథలు మహిళల సామాజిక స్థితిగతులు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత భావోద్వేగాలను విస్తృతంగా చిత్రించాయి.
  • "తెల్ల ఏనుగు" వంటి కథలు మహిళల సామాజిక పరిమితులను, "అమ్మ" కథ కుటుంబ బంధాలలో సంక్లిష్టతలను ప్రదర్శించాయి.
  • "బెదిరింపు", "సుజాత" కథలు మహిళల పోరాటం, ఆవేదన, పట్టుదలను స్పష్టంగా తెలియజేశాయి.
  • ఈ కథలు తెలుగు కథా సాహిత్యంలో మహిళా జీవన వైవిధ్యాన్ని, వారి అంతరంగ సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. 

ఉపయుక్త గ్రంథసూచి

  1. బాబు, ఎన్.కె. కథా కుసుమాలు. ఎన్.కె. పబ్లికేషన్స్, 2024.
  2. పైదే. కథా లోగిలి. ఎన్.కె. పబ్లికేషన్స్, 2025.
  3. పైదే. కథా పరిమళాలు. ఎన్.కె. పబ్లికేషన్స్, 2023.
  4. పైదే. కథా సౌరభాలు. ఎన్.కె. పబ్లికేషన్స్, 2022.
  5. శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్య చరిత్ర. ప్రతిభ పబ్లికేషన్స్, 1998.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]