"తెలుగు శతకసమీక్షణం"
ప్రత్యేకసంచిక
(పి.ఆర్.ఆర్. & వి.యస్. ప్రభుత్వకళాశాల, విడవలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్)
AUCHITHYAM | Volume-5 | Issue-13 | November 2024 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed
సంపాదకీయం
ఆంధ్రవాఙ్మయాన్ని సుసంపన్నం చేసిన అనేకానేక ప్రక్రియల్లో విశేషప్రాచుర్యం పొందినది శతకం. నన్నయభారతంలో బీజప్రాయంగా మొదలై, నన్నెచోడుని కుమారసంభవంలో అంకురించి, పాల్కురికి సోమనాథుని వృషాధిపశతకంతో సర్వలక్షణసమన్వితంగా పరిఢవిల్లిన ప్రక్రియ శతకం. నాటి నుంచి నేటి వరకు తెలుగు సాహితీక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న సజీవ స్రవంతిగా శతక ప్రక్రియను చెప్పుకోవచ్చు. ఈ శతక ప్రక్రియకు పూర్వోత్తరాలు వచ్చిన చాలా ప్రక్రియల్లో కొన్ని నేడు సృజించబడడం లేదని చెప్పవచ్చు. పండితపామర జనులందరినీ రంజింపజేసిన ఏకైకప్రక్రియ శతకం. శతక పద్యాలు తెలియని తెలుగు వారుండరనేది అతిశయోక్తి కాని విషయం. ఇప్పటికీ ఎన్నో శతకపద్యపంక్తులు సామెతల రూపంలో తెలుగుప్రాంతంలో బహుళప్రచారంలో ఉన్నాయి. సుమారు వెయ్యేండ్ల ప్రస్థానం కలిగిన శతకప్రక్రియను గురించి చెప్పడం కొండను అద్దమందు చూపినట్లే అవుతుంది. సాగర పర్యంతశతకవాఙ్మయాన్ని వ్యాసాల రూపంలో వ్యక్తపరిచే చిరుప్రయత్నం ఈ “తెలుగు శతకసమీక్షణం” అనే ప్రత్యేకసంచిక. తెలుగుశతకాల సమీక్షణలకు ఈ ప్రత్యేకసంచిక ఒక కరదీపిక కాగలదని భావిస్తున్నాం.
ఈ ప్రత్యేక సంచిక కోసం సకాలంలో వ్యాసాలను పంపిన వ్యాసకర్తలకు, సహృదయంతో సలహాలు, సూచనలు ఇస్తూ, సకాలంలో సంచికను ప్రకటించిన “ఔచిత్యమ్” యూజీసీ-కేర్ లిస్టెడ్ జర్నల్ ప్రధానసలహాదారు డా. రాంభట్ల వేంకటరాయశర్మ గారికి, ప్రధానసంపాదకులు శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ గారికి, ఔచిత్యమ్ పత్రికాసంపాదకవర్గానికి ప్రత్యేకకృతజ్ఞతలు.
ప్రత్యేక సంచిక సంపాదకులు
డా. గోపవరం పద్మప్రియ & సంపత్ కుమార్ బానోజి
ఎమ్. ప్రదీప్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

