headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. అనువాద మూల్యాంకన

డా. ప్రత్తిపాటి మాథ్యూ

చీఫ్ రిసోర్స్ పర్సన్ (అకాడెమిక్), నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్,
భారతీయభాషాసంస్థ (CIIL), విద్యామంత్రిత్వశాఖ,
మానసగంగోత్రి, హుణసూరు రోడ్, మైసూర్-570006.
సెల్: +91 09482989241, Email: pmatthewntm@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

అనువాద బోధన, అభ్యాసంలో మూల్యాంకనం కీలకమైన అంశం. అయితే, మూల్యాంకనాన్ని చేయటానికి ఏ విధానాన్నిఅనుసరించాలి? విద్యార్థులు ఎంత బాగా నేర్చుకొని అనువర్తన అభ్యాసం చేయగలుగుతున్నారు? ఒక బోధన అంశంగా మూల్యాంకన విజయవంతమైందని నిర్ధారించటం ఎలా? అనువాద విషయంలో మూల్యాంకన ప్రభావం ఈ అనువాదవిద్యా సామగ్రి మీద ఎంతమేరకు ఉంది? అనువాద మూల్యాంకన మార్గనిర్దేశనానికి అనువర్తింపజేసే సూత్రాలు లేదా సూచనలు ఏమైనా ఉన్నాయా? మూల్యాంకన ద్వారా అనువాదాల మంచి చెడులనునిగ్గుతేల్చే పరిణామ క్రమంలో అనేక ఆలోచనలు వివిధ రకాల సాహితీ, సాహిత్యేతర ప్రక్రియలపై రావటం అత్యంత సహజం. అయితే ఈ వ్యాసం అనువాదమూల్యాంకన సర్వసాధారణ అభ్యాసప్రవృత్తిని బహిర్గతంచేయటానికి ప్రయత్నిస్తుంది.

Keywords: అనువాదం, అనువాద మూల్యాంకన, మూల్యాంకన పర్యాయపదాలు, అనువాద మూల్యాంకన చారిత్రక విభజన, అనువాద సమీక్ష, బైబిలు అనువాద మూల్యాంకనకు నాలుగు ప్రశ్నలు, అనువాద మూల్యాంకన కీలక పరిభాష, అనువాద మూల్యాంకన దశలు.

1. ఉపోద్ఘాతం:

సాధారణంగా, అనువాదం అనేది ఒక మూల భాష (Source Language) నుంచి ఒక  లక్ష్య భాష (Target Language)లోనికి అనువాదం చేసే ప్రక్రియగా పరిగణిస్తారు. అనువాదం ఒక ప్రక్రియగా ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉండటం మాత్రమే కాకుండా ఈ కోణంలో అది ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కాలం,సమయం, సందర్భాన్ని ఆయా మూలసాహిత్యాలలో పరిణామ క్రమ మార్పులకు  అనువాదసాహిత్యంలోకూడా మార్పుకు కలగటం సహజం, అనివార్యం కూడా. సాధారణంగా పదాలు లేదా వచనాన్ని ఒక భాష నుండి మరొక భాషలోకి అనువదించే ప్రక్రియ దీనిని గ్రహిస్తుంటారు. సంస్కృతంలో అనువాద్ అంటారు; దాని అర్థం ఒక వచనాన్ని అనుసరించే చెప్పే చర్య (‘అను’ అంటే ‘తరువాత చెప్పే’,  ‘వాద్’ అంటే ‘పాఠం లేదా వచనం’). ఇది మూల వచనం వివరణ, విమర్శ, తిరిగి రాయడం వంటి లక్షణాలను కలిగి ఉంది. ప్రాచీన భారతీయ రచయితలు ఎల్లప్పుడూ అనువాదాన్ని తిరిగి రాసే ప్రక్రియగానూ ఒక సంపూర్ణ సృజనాత్మక ప్రక్రియ పరిగణించారు. లాటిన్ పదం “translatio” (trans “across” + latio > latus “to carry or “to bring”)  అనేది రెండు పదాల కూర్పు: ట్రాన్స్+లాటస్ "తీసుకొనిపోవు లేదా కొనసాగించు” అనే అర్థంలో  ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ట్రాన్స్' అంటే 'అంతటా' , 'లాటస్' అంటే 'తీసుకెళ్ళడం'. చాలా మంది పండితులు వారి అనువాద అనుభవంలో చోటుచేసుకున్న ప్రాధాన్యతను బట్టి భావనలను గ్రహించి  నిర్వచించారు.

అనువాదం అనేది అనేక రకాలుగా అర్థం చేసుకోగలిగే ఒక అద్భుతమైన విస్తృత భావన. ఉదాహరణకు, అనువాదాన్ని ఒకరు దానిని ప్రక్రియగాను లేదా ఉత్పత్తిగాను భావించి ప్రకటించుకోవచ్చు.  ఉదాహరణకు సాహిత్య అనువాదం, సాంకేతిక అనువాదం, ఉపశీర్షిక, యంత్ర అనువాదం వంటివి. ఇంకా వాటిని ఉప-రకాలుగా కూడా విభజించి గుర్తించవచ్చు. అంతేకాకుండా, సాధారణంగా ఇది రాత గ్రంథాల బదిలీని సూచిస్తుంది. ఈ పారిభాషికపదం కొన్నిసార్లు వ్యాఖ్యానాన్ని కూడా సూచిస్తుంది. మంచి అనువాదానికి ఏకైక ప్రమాణం - మూల పాఠ రచయితలు ఏమి చెప్పారో, మూలభాష శ్రోతలు ఏమి విన్నారో దానిని అనువాదం ఖచ్చితంగా తెలియజేయటం.

2. అనువాద మూల్యాంకన :

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనువాదం ఎంతో  అవసరం. అనువాదాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయటం ద్వారా అనువాద ప్రక్రియ, సిద్ధాంతపరమైన అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడంతోపాటుగా మూలభాష - లక్ష్యభాషల పరస్పర సాంస్కృతిక సంబంధాలను, విభేదాలపై చక్కని  అవగాహన ఏర్పడుతుంది.  అనువాదం కలిగించే  శాస్త్రీయ నిశిత దృష్టి,  అనువాదానికి సాంకేతికతను ఉపయోగించుకోగలిగిన పరిజ్ఞానం  అనువాదకులకు ఉంటే, ఆయా భాషా సాంస్కృతిక విషయాలను త్వరగా గ్రహించుకొని మరింత సమర్ధవంతంగా అనువాదం చేయగలుగుతారు. సమస్యాత్మక అంశాలను గుర్తించి, విశ్లేషణాత్మక మార్గాల్లో వాటిని అన్వేషించి వేగంగా పరిష్కరించగలుగుతారు. ఇంకా సరికొత్త అనువాద వ్యూహాలకు, సిద్ధాంతాలకు మార్గదర్శకాలకు రూపకర్తలవుతారు. ప్రాధమికంగా, ఇది రెండు భాషల మధ్య జరిగే ప్రక్రియ గనుక భావన, సాంస్కృతికతలలో సారూప్యాలూ వైవిధ్యాలు ఉండటం సర్వసాధారణం.  అనువాద గుణగణాలను నిగ్గుతేల్చడాన్ని అనువాద మూల్యాంకన అంటారు.

అనువాద మూల్యాంకన అనేది నిర్దిష్ట సిద్ధాంత అనువాదం ఆధారంగా అనువాదాన్నిగానీ అనువాద చిత్తుప్రతులను విశ్లేషించడం, విలువగట్టడం, ప్రామాణికతను నిర్ధారించటం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకొని కొనసాగే ఒక ప్రక్రియ.  ఈ ప్రక్రియలో మూలభాషలోని పాఠాన్ని లక్ష్యభాషలోనికి అనువదించిన తరువాత  ఆ అనువాదాన్ని విలువగట్టటం ద్వారా ప్రాముఖ్యతను నిర్ధారించే ఒక క్రమబద్ధమైన ప్రక్రియను మూల్యాంకన అంటారు. ఇది అనువాద విద్యలో అత్యంత ప్రాముఖ్యతనుగలిగివుంది. మూలభాష పాఠ లక్ష్యాన్ని లేదా మూలభాష రచయిత/రచన లక్ష్యాన్ని లక్ష్యభాషలోనికి అనువాదం చేసినప్పుడు అదిమూలరచనకు ధీటుగా ఉందా? లేదా ? ఒకవేళ ఉంటే, అది ఎంత మేరకు ఉంది? అనువాదం సరైన, సమగ్ర అనువాదమా లేదా పాక్షిక అనువాదమా అనే అంశాలను కనుగొనడానికి ఉపయోగించే ప్రక్రియ.దీనికి విభిన్న నమూనాలను,  ప్రమాణ కొలమానాలను, మానవ, యంత్ర పద్ధతులను, విలువైన వివిధ మూల్యాంకన సాధనాలను ఉపయోగించటం జరుగుతుంది. తద్వారా మూలభాష రచయిత/రచనకు ప్రఖ్యాతికలగవచ్చు లేదా అపఖ్యాతికలగవచ్చు. ప్రతిభావంతమైన అనువాదం ఆయా లక్ష్యభాషా సాహిత్యాలకు ఒక ప్రసిద్ధ సుస్థిర సంపద.

3. మూల్యాంకనకు ఉపయోగిస్తున్న వివిధ పర్యాయపదాలు  వాటి అర్థాలు – అవి :

Assessment  మదింపు చేయటం, rating వెలకట్టడం, tax  పన్ను,  judgment తీర్పు, calculation లెక్కింపు, Evaluation  మూల్యాంకన, appraisal విలువగట్టటం , estimation అంచనా వేయటం,  testing  పరీక్షించటం, vetting జాగ్రత్తగా,  విమర్శనాత్మకంగా పరిశీలించడం, Editing పరిష్కరణ, సంకలనం, reviewing  సమీక్షచటం, పునరవలోకనం, పునర్విమర్శ,  Quality Check నాణ్యత నిర్ధారణ,  గుణ నిర్ధారణ, Quality Assurance నాణ్యత హామీ,  గుణ హామీ,     ఇలా అనేక  పర్యాయపదాల పేర్లు వాడుకలోనూ నిఘంటువులలోను ఉన్నాయి. అయితే వీటిలో మూడు పేర్లు మాత్రమే అనువాదాల విషయంలో ప్రాచుర్యం పొందినవి. అవి వాటి ప్రాధాన్యత, పౌనపున్యాన్ని బట్టి క్రమం: Evaluation  మూల్యాంకన, Assessment  మదింపు చేయటం,  vetting జాగ్రత్తగా,  విమర్శనాత్మకంగా పరిశీలించడం -  Editing పరిష్కరణ, సంకలనం (జంటగా ఉపయోగించటం) ఇంకా Quality Check నాణ్యత నిర్ధారణ,  గుణ నిర్ధారణ, Quality Assurance నాణ్యత హామీ వంటిని సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయి.

మంచి అనువాద ప్రమాణాలను గురించి ఆలోచిస్తే రెండు భాషలు తెలిసిన ఎవరైనా మంచి అనువాదం చేయగలరనే అభిప్రాయం  చాలా మందిలో ఉంటుంది. కానీ  ఇది అన్నిసార్లూ నిజం కాదు. అనుభవరాహిత్యంతో అనువాద సందేశాన్ని ఖచ్చితంగా బదిలీ చేయలేక సంక్లిష్టస్థితిలో అర్థరాహిత్యంగా అనువాదం ముగుస్తుంది. తద్వారా నాణ్యత, మూల్యాంకన ప్రస్థావన వస్తుంది. మూల్యాంకన అనువదించిన పాఠ నాణ్యతను స్థాపించడానికి ఉద్దేశించిన కార్యాచరణ.

అనువాద నాణ్యత మూల్యాంకన  అనేది తరచుగా ప్రభావాత్మకవాద విధానానికి విరుద్ధమైనది. అత్యంత సౌందర్యం ఆధారంగాచేసే తీర్పులు, అనుభవపూర్వకత మూల్యాంకనను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాయి. పాఠ వర్గీకరణ విధానం, అనురూపత, సమన్వయం, వ్యావహారిక సమానత్వం, లక్ష్యపూర్వక పరామితుల నేపథ్య పొందిక ఆధారంగా కూడా ఒక నాణ్యత మూల్యాంకన  నమూనా ఏర్పరచవచ్చు.

4. అనువాద మూల్యాంకన చారిత్రక విభజన :

అనువాద అధ్యయనాల దృష్టిలో చారిత్రకంగా  ఈ మూల్యాంకనను 3 వర్గాలుగా విభజించి పరిశీలించవచ్చు.
1) అనువాద అధ్యయన సాహిత్య వర్గం (ప్రాధాన్యత : లక్ష్యభాష పాఠానికి, పాఠకులకు)
2) ఆధునిక – యంత్ర, స్థానికీకరణ సంస్థల అనువాద సాహిత్య వర్గం (ప్రాధాన్యత : మూలభాష పాఠానికి, పదానికి)

మూల్యాంకనలో  అనువాద నాణ్యత అంచనా అనేది అనువాద అధ్యయనాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉప-రంగం. ఇది మూల పాఠాన్ని  లక్ష్య పాఠం లోకి అనువదించే నేపథ్యంలో వాటి మధ్య సంబంధాలపై దృష్టి పెడుతుంది. 

5. రెండు సాధారణ పద్ధతులు:

ఈ అనువాదాల నాణ్యతను అంచనా వేయడానికి సహజంగా  రెండు సాధారణ పద్ధతులను ఉపయోగిస్తారు.

మొదటిది :  మంచి అనువాదానికి ఉండవలసిన లక్షణాలు 

  • అనువాదం అసలు కృతి ఆలోచనలను పూర్తి స్థాయిలో ఇవ్వాలి.
  • రాసే శైలి, విధానం అసలైన సహజ లక్షణాన్ని కలిగి ఉండాలి.
  • అనువాదం అసలు కూర్పు సౌలభ్యాలన్ని కలిగి ఉండాలి.
  • ఖచ్చితత్వం, స్పష్టత, ప్రామాణికత, తగిన స్వరం, శైలి, సాంస్కృతిక సముచితత్వం, స్థిరత్వం సమకాలీన భాష వంటివి మరి కొన్ని లక్షణాలు.

రెండవది:  అనువాదంలోని అంతర్గత-బహిరంగ లోపాలను సూచించించటం

బహిరంగ లోపాలు సందర్భం వెలుపల కూడా స్పష్టంగా కనిపిస్తాయి, అయితే అంతర్గత లోపాలు సందర్భంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. బహిరంగ లోపాలు ఏడు ఉపవర్గాలుగా వర్గీకరించబడ్డాయి: 

1) అనువదించ లేదు; 2) అర్థంలో కొంచెం మార్పు; 3) అర్థంలో ముఖ్యమైన మార్పు; 4) అర్థం వక్రీకరణ; 5) మూల భాషా వ్యవస్థ, వ్యాకరణ నియమ ఉల్లంఘన; 6) స్వేచ్ఛాపూర్వక సృజనాత్మక అనువాదం;  7) సాంస్కృతిక వడపోత  మొదలైనవి.

పైన పేర్కొన్న రెండు రెండు సాధారణ పద్ధతులుకూడా మూల్యాంకనలో భాగమే.

మరొక రకమైన మూల్యాంకన పద్ధతి: అనువాద యోగ్యతను లేదా విలువను లేదా ప్రాముఖ్యత నిర్ణయించడాన్ని సూచించడం. ఇది  విలువను  నిర్థారించే ప్రమాణాలకు సంబంధించినది. ఈ ప్రమాణాలు నైతికంగా, సౌందర్యంగా, ప్రయోజనకరంగా అన్నివేళలా నిష్పాక్షికంగా,  నిర్దిష్టంగా ఉంటాయా అనేది మొదటి నుండి ప్రశ్నార్థకమే.

అనువాద విద్య ప్రక్రియలో వివిధ రకాల అనువాద మూల్యాంకన వ్యూహాలు ఉపయోగించటం జరుగుతుంది. మూలగ్రంథాన్ని అనువాదంతో పోల్చటం మొట్టమొదటిది. ఇది సాంప్రదాయ విధానం. మరొకటి కొత్త సాధనాలతో ఆధునిక మూల్యాంకన విధానం - సమాంతర గ్రంథాల పరీక్షణం, బహు గ్రంథాల పరిశీలన, వాటి క్రమబద్ధత అధ్యయనం చేయడం. అత్యంత అత్యుత్తమ వ్యూహాల అధ్యయనంలో సమగ్రత, ప్రామాణికత, విశ్వసనీయత, నిష్పాక్షికత, శైలి వంటివాటి నమూనా గల పరిశీలనాత్మక వ్యూహం శ్రేష్టమైన మూల్యాంకన ఫలితాన్నిస్తుంది.

6. అనువాద సమీక్ష :

అనువాద సమీక్ష ను కూడా మూల్యాంకన లో భాగంగానే పరిగణిస్తారు సమీక్ష విషయంలో  పరిగణనను  కూడా కలిగి ఉండవచ్చు. దోష వర్గాలనువిభజనూ కలిగి ఉండవచ్చు.

అ) భాషాశాస్త్రం: విరామ చిహ్నాలు, వ్యాకరణం, అర్థం  ఆ) పఠనీయ సరళత్వం  ఇ) పదజాలం ఈ)  అదే లోపాన్ని పునరావృతం చేయటం ఉ) అనువాదకుని ప్రాధాన్యత  ఊ) మూల పాఠ సమస్యలు.

మొదటి మూడు (అ, ఆ, ఇ) వర్గాలను దోషాలుగా పరిగణించవచ్చు. చివరి మూడు (ఈ, ఉ, ఊ) వర్గాలను  దోషాలుగా పరిగణించకపోవచ్చు.  అంశ దోష తీవ్రతను బట్టి ముఖ్యమని లేదా అముఖ్యమనే పరిగణన ఉంటుంది.

7. అనువాద మూల్యాంకనలో ఉపయోగించే కొన్ని కీలక పదాలు:

ఖచ్చితత్వం: మూల పాఠం అర్థాన్ని అనువాదం ఎంత విశ్వసనీయంగా తెలియజేస్తుందో సూచిస్తుంది. ఇందులో వాస్తవిక ఖచ్చితత్వం, అలాగే ఉద్దేశించిన స్వరం, పరిభాష,  శైలిని తెలియజేయడంలో ఖచ్చితత్వం ఉండాలి.

పటిమ: అనువాదం ఎంత సహజంగా చదవదగినగా ఉంటుందో సూచిస్తుంది. అనువాదం మొదట లక్ష్య భాషలోనే రాసినట్లుగా ధ్వనించాలి.

సమానత్వం: మూల పాఠం, లక్ష్య పాఠం మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అధికారిక సమానత్వం – రూపాత్మక సమానార్థకం (పదానికి-పదానికి అనువాదం),అర్థపర సమానార్థకం (అర్థం-ఆధారిత అనువాదం), సందేశప్రభావ సమానార్థకం (లక్ష్యభాషా ప్రేక్షకులపై సందేశ ప్రభావం మీద దృష్టి పెడుతుంది) వంటి వివిధ రకాల సమానత్వాలు ఉన్నాయి.

విశ్వసనీయత: అనువాదం మూల పాఠానికి ఎంత దగ్గరగా కట్టుబడి ఉందో ఇది సూచిస్తుంది. ఇది అసలైన పద క్రమం, వాక్యనిర్మాణం, శైలిని సంరక్షించడం వంటి అంశాలను పై దృష్టి పెడుతుంది.

పరిభాష: ఇది ఉపయోగించిన భాషకు సంబంధించిన  వాడుక స్థాయిని సూచిస్తుంది. అనువాద పరిభాష లక్ష్యభాష ప్రేక్షకులకు మూలపాఠ ఉద్దేశ్యానికి తగినదిగా ఉండాలి.

సాంస్కృతిక సున్నితత్వం: లక్ష్యం ప్రేక్షకులను కించపరచడం లేదా దూరం చేయడాన్ని అనువాదం ఎంతవరకు నివారిస్తుందో ఇది సూచిస్తుంది. సాంస్కృతిక మూస పద్ధతులను నివారించడం, సాంస్కృతిక సూచనల గురించి తెలుసుకోవడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

సహజత్వం: అనువాదాన్ని లక్ష్య భాషలోనే మూల పాఠాన్ని రాసినట్లుగా ఎంత బాగా ఉందో అనిపించేవిధంగా ఉండాలి. వికారంగా లేదా అసహజంగా ఉండకూడదు.

పఠన సరళత: అనువాదాన్ని అర్థం చేసుకోవడం ఎంత సులభమో ఇది సూచిస్తుంది. ఇది సంక్లిష్టమైన పదజాలం, వాక్య నిర్మాణాలు లేకుండా ఉండాలి.

పరిధి: మూల్యాంకనలో చేర్చిన వివరాల స్థాయిని సూచిస్తుంది. ఒక సమగ్ర మూల్యాంకన పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే మరింత పరిమిత మూల్యాంకన వీటిలో కొన్ని కీలక అంశాలపైన మాత్రమే దృష్టి పెట్టవచ్చు.

లక్ష్యభాషా ప్రేక్షకులు: అనువాదం ఉద్దేశించిన వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. మూల్యాంకన లక్ష్యభాషా ప్రేక్షకుల అవసరాలు, అంచనాలను పరిగణనలోకి తీసుకోవాలి.

అనువాద మూల్యాంకనలో ఉపయోగించే అనేక పదాలలో ఇవి కొన్ని మాత్రమే. మూల్యాంకన సందర్భాన్ని బట్టి ఉపయోగించే ఈ నిర్దిష్ట పదాలు మారుతూ ఉంటాయి.

8. బైబిలు  అనువాదాల గురించి :

20వ శతాబ్దపు గత యాభై సంవత్సరాలలో క్రైస్తవ గ్రంథాల విస్తరణను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇంతకు ముందు సాధ్యం కాదని భావించిన మార్గాల్లో కూడా లేఖనాలను పొందగలిగారు.బైబిలు అనువాదం జరిగిన భాషలు, జరుగుతున్న భాషలను బట్టి అనువాద రంగంలో గొప్పవిప్లవం వచ్చిందని చెప్పవచ్చు. కొత్త వనరులు పెద్ద పరిమాణంలో అందుబాటులోకి రావటం వలన  బైబిలు అనువాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అనువాదం చేయడానికి అవసరమైన కొత్త పద్ధతులు బోధించబడ్డాయి. అనువాదకులు కూడా మెరుగైన శిక్షణ పొందారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైబిలు పాఠకులకు స్పష్టమైన, అర్థమయ్యేవిధంగా, మూల గ్రంథాలకు విశ్వాసనీయమైన అనువాదాలు అందుబాటులోనికి వచ్చి వాటి ప్రయోజనాన్ని పొందారు.

9. అనువాద మూల్యాంకనకు నాలుగు ప్రశ్నలు*** :

1. ఇది సరైన మూలపాఠం ఆధారంగా ఉందా?

దేవుని వాక్యం ఎన్నటికీ గతించదని యేసు వాగ్దానం చేశాడు (మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు). మేము చాలా నమ్మదగిన రాతప్రతులతో ఆశీర్వదించబడ్డాము. అనువాదకులు బైబిలు మూల హీబ్రూ, అరామిక్ లేదా గ్రీకు పాఠాన్ని జాగ్రత్తగా అనుసరించారా?

2. ఇది ఈ మూలపాఠాన్ని విశ్వసనీయంగా అందజేస్తుందా?!

మూల బైబిలు పాఠంలోని ప్రతి పదం దేవుని ప్రేరేపిత, దోషరహిత పదం (వాక్ రూప సమాచారం) అని గుర్తుంచుకోండి. అనువాదం దేవుని పరిశుద్ధ వాక్యం మూలపాఠం లాగా నమ్మకంగా, ఖచ్చితంగా అదే అర్థాన్ని తెలియజేస్తుందా?

3. ఇది సిద్ధాంతపరంగా భద్రపరచినదేనా? !

ప్రొఫెసర్ ఆర్మిన్ పానింగ్ ఈ విధంగా పేర్కొన్నాడు: “ఈ ప్రకరణం అనువాదం ఇతర భాగాలలో విషయం గురించి దేవుడు చెప్పిన దానితో ఏకీభవిస్తున్నదా? మనకు స్వచ్ఛత సిద్ధాంతం అనువాదానికి అవసరమైన పరీక్షగా ఉండాలి. సజీవమైన లక్షణాలను కలిగి ఉన్న అనువాదాన్ని ఆమోదించడానికి సమకాలీన ఇంగ్లీషును కలిగి ఉన్న అనువాదాన్ని ఆమోదించడమనేది ఒక నవలలాగా చదువుతున్నట్లనిపించినప్పటికీ, సూక్ష్మంగా తప్పును మిళితం చేయడం లేదా దేవుని పరిశుద్ధ వాక్యం విశ్వసనీయతపై పాఠకుల విశ్వాసాన్ని బలహీనపరచడమనే విపత్తుకు దారి తీస్తుంది:

అనువాదాన్ని అనంతంగా భద్రపరచడం ఉత్తమం. అయితే చదవడం అంత తేలిక కాకపోవచ్చు, తాజా పాండిత్యం దానిలో చేర్చకపోవచ్చు, కానీ ఇది దేవుని రక్షణ ప్రణాళికలో ప్రభువైన యేసుక్రీస్తు సరైన స్థానానికి అనుగుణంగా ఉండాలి. మనం దీనిని అంగీకరిస్తున్నామనుకుంటే,  ఆ అంశంపై అంత అగత్యంగా తలబాదుకోము. విషయాన్నిగురించి మొత్తుకోవలసిన అవసరం లేదు.

4. లక్ష్య (గ్రాహ్య) భాష ఆమోదయోగ్యమైనదా?

ఇది తీర్పుకు, రుచికి సంబంధించిన విషయం. ఏ అనువాదం పరిపూర్ణమైనది కాదు. కానీ అది చెప్పేది అర్థం చేసుకోగలరా? ఆచార్య పానింగ్ జోడించింది: "పునరావృతమయ్యే ప్రమాదంలో, అనువాదంలో ఉపయోగించాల్సిన భాషా శైలిపై రాజీ పడడం అనేది విషయంపైన, సిద్ధాంతంపైన రాజీ పడటం లాంటిది కాదని నేను నొక్కి చెబుతున్నాను."

10. అనువాద మూల్యాంకన దశలు:

అనువాదాన్ని మూల్యాంకన చేసేటప్పుడు పరిగణించవలసిన కొన్ని దశలు:

1) మూలపాఠంతో పోల్చడం: 

మూలపాఠాన్ని చదివి, అనువాద పాఠంతో పోల్చడం. అర్థం, స్వరం లేదా శైలిలో ఏవైనా ముఖ్యమైన వ్యత్యాసాలను చూడడం. అనువాదం మూలపాఠ సారాంశం, ఉద్దేశాన్ని సంగ్రహిస్తుందో లేదో అంచనా వేయడం.

2) ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయండి: 

మూలపాఠ నిర్దిష్ట వివరాలు, సూక్ష్మ నైపుణ్యాలు, సందర్భాన్ని ఎంత బాగా తెలియజేస్తుందో పరిశీలించడం ద్వారా అనువాద ఖచ్చితత్వాన్ని అంచనా వేయం. ఏవైనా తప్పుడు అనువాదాలు, లోపాలు లేదా చేర్పులు గుర్తించాల్సి. కీలక పారిభాషికపదాలు, నుడికారాలు సాంస్కృతిక ఉపయుక్తాలు సరిగ్గా అనువాద చేయబడి ఉన్నాయా అనేది ధృవీకరించాలి.

3) లక్ష్యభాష ప్రేక్షకులను పరిగణించడం: 

అనువాదం ఉద్దేశించిన ప్రేక్షకులకు సముచితంగా ఉందో లేదో అంచనా వేయడం. వయస్సు సమూహం, విద్యా స్థాయి, సాంస్కృతిక నేపథ్యం వంటి అంశాలను పరిగణించండి. భాష స్పష్టంగా ఉండాలి, లక్ష్య పాఠకులకు అందుబాటులో ఉండాలి.

4) పఠనీయత సరళత్వ అంచనా వేయడం: 

అనువదించబడిన మూల పాఠ పఠనీయత సరళత్వ మొత్తాన్ని అంచనా వేయండి. ఇది సహజంగా పొందికగా ఉండాలి, ఇబ్బందికరమైన లేదా గందరగోళ నిర్మాణాలను నివారించాలి. రచయిత ఉద్దేశించిన స్వరాన్ని, శైలిని కొనసాగిస్తూ అనువాదం సజావుగా ఉండాలి.

5) సాంస్కృతిక సందర్భాన్ని పరిగణించడం: 

మూల, లక్ష్య భాషల రెండింటి సాంస్కృతిక సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోండి. సాంస్కృతిక ఉపయుక్తాలు, ఆచారాలు, సున్నితత్వాలు అనువాదంలో ఖచ్చితంగా సముచితంగా అనువాదం చేసిందీ లేనిదీ నిర్ధారించుకోవడం.

6) ప్రతిపుష్టినికోరడం : 

అనువాద నాణ్యతపై విభిన్న దృక్కోణాలను పొందడానికి స్థానికంగా మాట్లాడేవారు లేదా లక్ష్య భాషలో నిపుణుల నుండి అభిప్రాయాన్ని పొందడం. వారి నివిష్టం అభివృద్ధి ప్రాంతాలను ప్రముఖంగా చూపిస్తుంది. ఇంకా విస్మరించిన అంతర్దృష్టులను అందిస్తుంది.

7) ఉద్దేశ్యం,  లక్ష్యాలను పరిగణించడం: 

అనువాదం దాని ఉద్దేశించిన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుందా, కోరుకున్న లక్ష్యాలను సాధిస్తుందా అని అంచనా వేయడం. వివిధ అనువాదాలు అక్షర ఖచ్చితత్వం, పఠనీయత లేదా నిర్దిష్ట వేదాంత దృక్పథాన్ని తెలియజేయడం వంటి వివిధ అంశాలకు ప్రాధాన్యతనిస్తాయి.

11. ముగింపు:

ఇంకా అనేక అంశాలు చర్చించవలసి ఉంది. అనువాదంలో వ్యక్తిగత ప్రాధాన్యతలు లేదా పక్షపాతాలు మూల్యాంకనాలను ప్రభావితం చేయవచ్చు. మూల్యాంకన ప్రక్రియను నిష్పక్షపాతదృష్టితో పరిశీలించడం చాలా అవసరం, మొత్తం నాణ్యత, మూలపాఠానికి విశ్వసనీయత,  వీటితోపాటుగా వదిలివేసిన భాగాల గుర్తింపు, తప్పుగా అనువాదంచేసినవి, అర్థంచేసుకోడానికి కష్టంగా అనిపించే లోపాలుగల విభాగాల గుర్తింపు, అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు - చేర్పులు చేసినవి, వర్ణక్రమ, వ్యాకరణ దోషాలు, సందర్భోచితం కాని ప్రత్యామ్నాయ పదాల వాడుక,  (ఆధునిక) ప్రామాణిక శైలి ఉపయోగించటం, లక్ష్యభాష పాఠకుల ఆమోదయోగ్యత  ఈ అంశాలన్నింటి పరీక్షణం మూల్యాంకన భాగంగానే పరిణించటం జరుగుతుంది.

11. పాదసూచికలు:

***Pastor Brain R Keller (2011): Evaluating Bible Translations, Evangelical Lutheran Synod publication <https://els.org › wp-content›, pp. 4-5. 

12. ఉపయుక్తగ్రంథసూచి:

  1. E. A. Nida (1964): Toward a Science of Translating. With Special Reference to. Principles and Procedures Involved in Bible Translating, Brill, Leiden.
  2. House, J. (1981): A Model for Translation Quality Assessment, Tübingen, Gunter Narr. https://andhrabharati.com/dictionary/index.php
  3. Helsinki: Finn Lectura. Sager, J. C. (1989): Quality and Standards: The Evaluation of Translations, The Translator’s 
  4. Handbook (C. Picken, ed.), London. Séguinot, C. (1989): Understanding Why Translators Make Mistakes, TTR, 2-2, pp. 73-102.
  5. Reiss, K. (1977/1989). Text types, Translation Types, and Translation Assessment. In A. Chesterman (Ed.) Readings in Translation Theory (pp. 105–115).
  6. Williams, M. (1989): The Assessment of Professional Translation Quality: Creating Credibility out of Chaos, TTR, 2-2, pp. 13-33.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]