AUCHITHYAM | Volume-5 | Issue-3 | March 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
1. విద్య ద్వారా పూర్వుల భాషాసంరక్షణ: బహుభాషీయ 'మారిషస్' దేశంలో తెలుగు పరిస్థితి
డా. శైలేంద్ర యంకన్న
తెలుగు అధ్యాపకులు,
ఫ్లాక్,
మారిషస్ దేశం.
సెల్: +91 23059072747, Email: shailendrayenkanah@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
మారిషస్ బాహుభాశీయ దేశం. ఇక్కడ పూర్వుల భాషాలుగా గుర్తింపబడిన భాషలలో తెలుగు ఒకటి. ఈ పత్రం జాతీయ స్థాయిలో తెలుగు భాష స్థితిగతులను గురించి తెలుపుతూ భాషా పరిరక్షణకై విద్యా విధానాల పాత్రను విశ్లేషిస్తుంది. అభిజ్ఞాశక్తి (cognitive abilities) మెరుగుపరచడంలో/ పెంపొందించడంలో విద్యాప్రణాళిక అమితంగా తోడ్పడుతుంది. అయితే మారిషస్ దేశాన్ని పరిశీలించి చూస్తే పూర్వుల భాషలు (ప్రధానంగా భారతీయ భాషలు) ఎందుకు ప్రవేశం అయ్యాయి అన్నది తెలుసుకోవాలి. పూర్వుల మూలం (ancestral roots) కాపాడటానికి, బహుభాషా సమాజాన్ని సృష్టించటానికి అనేవి ప్రధానకారణాలు. ఈ భాషలు పూర్వులు అందించిన వారసత్వానికి ప్రతీక. ప్రవాసులు తెలుగు భాషాసాంస్కృతుల పట్ల అనురక్తి చూపించారు. వాళ్ల భాషాసాంస్కృతుల నష్టం విరుద్ధంగా నిర్విరామంగా పోరాడారు. ఈ భాషల పునరుజ్జీవనంలో దేశ రాజకీయం ముఖ్యమైన పాత్ర వహించింది. స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వం భాషాపునరుజ్జీవన ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం భారతీయ భాషల పరిరక్షణకై కృషి చేస్తుంది. ప్రధానంగా ఉపయోగించే సాధనం విద్య.
Keywords: పూర్వుల భాష, తెలుగు, మారిషస్, భాషా ప్రణాళిక, వారసత్వ భాష.
1.పరిచయం:
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రధాన భాష తెలుగు. భారత దేశంలోనే కాకుండా తెలుగు భాషా వాడుక ప్రపంచంలో నాలుగు కోణాల్లో వ్యాపించి ఉంది. మారిషస్ సందర్భంలో ఇది మైనారిటీ పూర్వుల భాష. బ్రిటిష్ వాళ్లు ద్వీపంలో కూలీలను తీసుకువచ్చారు (Bhaskar, 2017). ఆంధ్ర రాష్ట్రం నుంచి మారిషస్ దేశానికి వలస వచ్చిన కూలీలు తెలుగు భాషను తీసుకువచ్చారు. పూర్వుల భాషలను మాతృభాషలుగా, అంటే ఇంటి భాషాలుగా వాడలేక కొన్ని చోట్లో మాత్రమే తెలుగులో మాట్లాడేవాళ్లు.
అసలు ప్రస్తుతం మారిషస్ దేశంలో క్రియోల్ మాతృభాష. ఫ్రెంచ్ భాష కూడా చాలా మంది ఉపయోగిస్తారు. ఆంగ్ల భాష అధికారికంగా ఉపయోగించబడుతుంది. పూర్వుల భాషలు (Ancestral Languages) పాఠశాలలో ఐచ్ఛిక భాషలుగా ప్రవేశమయ్యాయి. వారి పాఠ్యాంశ లక్ష్యం ప్రధానంగా దేశం యొక్క బహుళ సాంస్కృతిక సంపదను కాపాడటం. దాని కోసం ప్రభుత్వం కొన్ని సంరక్షణ విధాన చర్యలు అమలు పెట్టారు. పైగా పూర్వుల భాష రక్షణకై లెక్కలేని సౌకర్యాల అందజేస్తుంది ప్రభుత్వం . ద్వీపంలో వలస వచ్చిన పూర్వుల మాతృ భాష కాబట్టి తెలుగును 'అసలైన' పూర్వుల భాషలలో ఒకటిగా వర్గీకరించారు (Natchoo, 2020; Yenkanah et al, 2023). నేడు భాషా ఉనికి భాషా విధానాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ పునరుజ్జీవన ఏజెంట్లు/వ్యూహంగా (as a strategy) తరచుగా విద్య సాధనంగా ఉపయోగిస్తారు.. మారిషస్ తెలుగువాళ్లు తెలుగు సంస్కృతి పట్ల చూపించినంత ఆప్యాయత తెలుగు భాష పట్ల చూపరు అని చిత్రీకరిస్తున్నాo. భాష చదువుకున్న వాళ్ల తప్ప తెలుగు మాట్లాడే వాళ్లు అరుదు. కాగా, పూర్వుల సంస్కృతికి ప్రతీక భాష. కాబట్టి దాని పట్ల భద్రత వహించటం తప్పనిసరి. విశేషం ఏమిటంటే, పూర్వుల భాషల స్థాయిని/స్థితిని పెంచారు. అవి అధికారిక పాఠ్యాంశాల్లో ఐచ్ఛిక భాషలుగా బోధించబడతాయి. విద్యార్థులు పరీక్షలు కూడా రాస్తారు.
2. పూర్వుల భాష:
'పూర్వుల భాష' అనే పదం సాధారణంగా మారిషస్ విషయంలో ప్రవాసులు తీసుకువచ్చిన భాషలసమూహాన్ని (హిందీ, ఉర్దూ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు ఆధునిక చైనీస్) సూచిస్తుంది. వాటిని "ఆసియన్" లేదా "ఓరియంటల్" భాషలు అని కూడా పరిగణిస్తారు (Bissoonauth, 2010; Natchoo, 2020). పూర్వుల భాష అనే పదం బ్రిటీష్ వలసరాజ్యాల కాలం నాటిది. ఈ భాషల వర్గం మారిషస్‌లో స్థిరపడిన వివిధ ప్రవాస సమూహాల పూర్వుల వారసత్వం, సాంస్కృతిక గుర్తింపు మరియు ప్రత్యేకతను కాపాడే సాధనంగా ఉపయోగపడింది. ఈ భాషలు, ఫ్రెంచ్ మరియు ఇంగ్లీషు వలె కాకుండా, అధికారిక/పరిపాలన సందర్భాలలో ఉపయోగించబడలేదు (Rajah-Currim, 2005). 1950ల కాలం నాటి నుండి పాఠ్యాంశాల్లో దీని పేరులో కాలాగుణంగా మార్పు చెంది , దీనిని "ఓరియంటల్ లాంగ్వేజెస్", ఆసియా భాషలు మరియు ఐచ్ఛిక భాషలు అని పిలుస్తారు. అయితే, ఈ పదాలన్నీ ఆసియా ప్రవాసులు తీసుకువచ్చిన భాషను సూచిస్తుంది. వాటికి ప్రతీకాత్మక విలువ ఉంటుంది. అవి సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించినవి (Varma, 2006; Harmon, 2017; Natchoo, 2020). అనేక బహుభాషా సందర్భాలలో, సారూప్య పరిస్థితుల్లో ఉన్న భాషలు 'హెరిటేజ్ లాంగ్వేజ్'గా పరిగణిస్తారు (Fishman, 2001; Campbell & Peyton, 1998; Valdes, 2005; Polinsky & Kagan, 2009). "హెరిటేజ్" అనేది 'పాతది' అని నిర్వచించబడింది. 'హెరిటేజ్ లాంగ్వేజ్' హెరిటేజ్ లాంగ్వేజ్‌ను "పుట్టుక లేదా DNA వంటి పుట్టుక ద్వారా పొందిన లక్షణం లేదా ఆస్తి"తో పోల్చవచ్చని సూచిస్తుంది (Baker & Jones, 1998). Brutt-Griffler (2005) ప్రకారం, హెరిటేజ్ వక్తగా అర్హత సాధించడానికి ఒకరికి భాషలో ప్రావీణ్యం అవసరం లేదు. 'హెరిటేజ్' అనే గుర్తింపు ఒక భాషకు దాని భాషా లక్షణాల ఆధారంగా కాకుండాఆ భాష మాట్లాడేవారి సామాజిక స్థితి ఆధారంగా ఇవ్వబడుతుంది (Brutt-Griffler, 2005; Valdes, 2005).
3. పూర్వుల భాషగా తెలుగు:
భారతీయ కూలీలుగా దాదాపు 40,000 మంది తెలుగువాళ్లురావడంచేత మారిషస్‌లో తెలుగు భాష వచ్చింది. వాళ్లు ప్రధానంగా కోరింగ, విశాఖపట్నం, రాజమండ్రి మరియు కాకినాడ àd⁹!వంటి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంత గ్రామాల నుండి వచ్చారు (Prabhakarran, 1994; Appadoo, 2002; Bhaskar, ; Lutchmoodoo, 2013). ఇతర భారతీయ ప్రవాసులలాగే , తెలుగువాళ్లు కూడా స్థిరపడటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్వీపం లోపల వారి గుర్తింపును రూపొందించడం కూడా కష్టం (Prabhakarran, 1991; Bhaskar, 2007; Peerthum, 2010). ద్వీపంలో తెలుగు మాట్లాడే వారు తక్కువే. దానికి తోడు , తెలుగు ప్రజలను విభజించి ద్వీపమంతా వివిధ ప్రాంతాలకు వ్యాపించి ఉన్నారు . భారతీయులలో భోజ్‌పురి భాష మాట్లాడేవాళ్లు అధికం కాబట్టి తెలుగు భాష త్వరగా క్షీణించిపోయింది.. సౌలభ్యం కోసం తెలుగు కాక భోజ్‌పురి లో మాట్లాడే అలవాటు వచ్చింది (Prabhakarran, 1997; Sokappadu, 2016). సందర్భానుసారంగా తెలుగు భాషా నష్టాన్ని చవిచూసినా, ప్రవాసులు మతపరమైన పాటలు, ఆచారవ్యవహారాల రూపంలో తెలుగుతానాన్ని చూపేవాళ్లు (Prabhakarran, 1994; Appadoo, 2002; Bhaskar, 2012; Venkanah & Auleear-Owoodally, 2023).
4. మారిషస్ సమాజంలో బహుభాష:
మారిషస్ లో తెలుగుభాష ప్రత్యేక ప్రదేశాలకే పరిమితం. తెలుగు పాఠశాలలు వాటిలో ఒకటి. పాఠశాలలో తప్ప, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ భాషలు వాడుకలో ఉంటాయి. తెలుగు ప్రార్థనలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రధాననిలయం తెలుగు దేవాలయం. అందరూ మాట్లాడకపోయినా భాష అక్కడ వినబడుతుంది. వారానికోసారి ప్రార్థనలు జరుగుతాయి మరియు తెలుగు సమాజం హాజరవుతారు (Prabhakarran, 1991; Appadoo, 2002; Bhaskar, 2017; Sokappadu, 2023). తెలుగు జాతి ప్రజలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా మంది మధ్య వయసుగలవాళ్లకు మరియు యువకులకు భాష చదవడం లేదా వ్రాయడం రాదు. సింహాద్రి అప్పన పూజ, రామభజన మరియు అమ్మోరు పండగ అనే మూడు మతపరమైన పండుగలు కూలీలు తీసుకొచ్చారు (Nirsimloo-Anenden, 1982; Prabhakarran, 1991; Bhaskar, 2007; Sokappadu, 2017). మరోవైపు, ఉగాది (హిందూ నూతన సంవత్సరం), శ్రీ వేంకటేశ్వరవ్రతం, ఆంధ్రా దినోత్సవం వంటి పండుగలు తరువాతి దశలో ప్రవేశమయ్యాయి. కానీ వాటిని తెలుగు సమాజంలో గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. సంస్కారాలు అని పిలువబడే ఆచారాలు ప్రధానంగా పుట్టుక, వివాహాలు మరియు మరణం వంటి ముఖ్యమైన జీవిత సంఘటనల సమయంలో గమనించవచ్చు.
5. మత భాషాసాంస్కృతులు మరియు ప్రవాసీ మూలాల మధ్య అంతర్గత సంబంధం:
సందర్భానుసారంగా 'తమిళం' మరియు 'మరాఠీ' భాషల లాగే 'తెలుగు' అనే పదం ఒకటి భాష, రెండవది జాతి సమూహం రెండింటినీ సూచిస్తుంది. కాబట్టి, తెలుగు జాతి గుర్తుగా వాడబడుతుంది. ఇక్కడి తెలుగు ప్రజలు జాతిపట్ల చూపినంత అనుబంధం భాషపట్ల చూపరు. వారికి భాషపై పట్టు లేదు. అందువల్ల, మతసంస్కృతులు ఒక సందర్భంలో ఉనికిలో ఉంది. భాషకు వసతి కల్పించబడింది (Prabhakarran, 1994; Appadoo, 2002). భాష, సంస్కృతి మరియు మతం మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి అని కొందరు పరిశోధకులు వాదించారు. (Fishman, 2007; Balraj & Sing, 2020). మతసంస్కృతుల విశ్వాసాలను ప్రతిబింబించటానికి భాష ఒక శక్తివంతమైన సాధనం . ఇది వ్యక్తులు మరియు సంఘాల గుర్తింపును రూపొందిస్తుంది (Balraj & Sing, 2020). సంస్కృతి ద్వారా భాషను అర్థం చేసుకునే, వ్యక్తీకరించే మరియు ఆనందించే సందర్భం ఏర్పడుతుంది.మతం తరచుగా మార్గదర్శక శక్తిగా పనిచేస్తుంది, పవిత్రమైన అర్థాలతో భాషాసంస్కృతిని నింపుతుంది.
6. బళ్ళో ప్రవేశమయ్యే ముందు తెలుగు సంఘంలో భాషా బోధన:
బ్రిటీషు పరిపాలించే కాలంలో బళ్ళో తెలుగు భాషాబోధన జరిగేది కాదు. ప్రవాసీ కూలీలలో చాలా మంది విద్యకు ప్రాముఖ్యత ఇవ్వటంలేదు. సాయంత్రపు బళ్ల ద్వారా తెలుగు భక్తి పాటల ద్వారా ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా ఇచ్చేవాళ్లు. (Luthmoodoo, 2013; Sokappadu, 1992). 1940లలో భారతీయ భాషలకు ప్రాముఖ్యత ఇచ్చిన కాలంలో అనధికారిక సందర్భాలలో భాషాబోధన మొదలయ్యాయి. భాష నేర్చుకోటానికి ఉత్సాహం పెరిగింది. కొందరు తెలుగువాళ్లు మారిషస్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి పయనం అయ్యి తెలుగు భాష నేర్చుకున్న తరువాతే అధికారిక స్థాయిలో తెలుగు భాషా బోధన మొదలయింది. తెలుగు భాషాసంస్కృతుల ప్రచారానికై స్థాపింపబడిన మారిషస్ ఆంధ్రమహాసభ (ప్రస్తుతం, మారిషస్ తెలుగు మహాసభ) అనే సామాజికసాంస్కృతిక సంఘం వచ్చాక తెలుగు భాషా బోధనలో ఒక కొత్త కిరాణం ఏర్పడింది. తెలుగు భాషా బోధన కోసం తెలుగు వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లి తెలుగు భాష నేర్చుకోటానికి ప్రోత్సాహం రెండింతలయింది. దక్షిణాఫ్రికా లాగే పాఠశాల లేదా సాయంత్రపు బడి అని పిలవబడే సాయంత్రపు తెలుగు పాఠశాలలు మారిషస్ తెలుగు మహాసభ వివిధ శాఖలలో జరపబడ్డాయి (Prabhakarran, 1991,1994).
7. మారిషస్ దేశంలో భాషా ప్రణాళిక:
చారిత్రక, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ విషయాల మీద ఆధారపడి ఉంటూ మీడియా, పరిపాలన, విద్య వంటి వివిధరంగాలలో భాష వాడుకను తెలుగు భాషావిధానాలు (language policies) నిర్ధారించారు (Spolsky, 2008; Moraru, 2016). దేశ స్వాతంత్ర్యం అనంతరం బోధనా భాషగా శాసనసభ భాషగా ఆంగ్లమే సురక్షితమైనది అని అనుకున్నారు అధికారులు. ఏ ఒక్క జాతికీ ఆంగ్లముతో వ్యక్తిగత సంబంధం లేదు. ఆ నిర్ణయం వల్ల ఆ నాటి వాడుక భాషగా ఉన్న క్రీయోల్ వెనకబడిపోయింది. అధికారభాషగా ప్రత్యేక బోధనా విషయంగా ఆంగ్లభాషాబోధనతోపాటు ఫ్రెంచ్ భూస్వాముల భాష అయిన ఫ్రెంచి prestigious భాషగా సంభాషణ కోసం ప్రవేశపెట్టబడింది. పైగా optional భాషగా ఓరియంటల్ భాషలు నేర్చుకునే అవకాశం విద్యార్థులకు అందింది. దానికి కారణం దేశంలో బానీసల భాష పూర్తిగా నశించిపోయే విధంగా భారతీయ ప్రవాసుల వారసత్వం కూడా పోకుండా చేయటానికే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం (Srilata, 2010; Rughoonundun- Chellapermal, 2020). ఈ సందర్భంలో పూర్వుల భాష స్థాయి పదింతలయింది. Ethnonationalist ఆదర్శాలను అనుసరించి విద్య వంటి మాధ్యమాల ద్వారా పూర్వుల భాష అనే ఆలోచన ముందుకు వచ్చింది.
8. భాషా పునరుజ్జీవణకై విద్య యొక్క పాత్ర:
‘విద్యా విధానంలో భాష’ అనే వ్యూహం పాశ్చాత్య భాషా బోధనకు తోడు ఆసియా భాషల ప్రచారానికి కూడా పచ్చ జెండా ఊపింది ప్రభుత్వం. ప్రాపంచిక భాషల బోధన మరియు సంస్కృతిసంప్రదాయాలలో కట్టుబడి ఉన్న ఆసియాభాషల బోధనల మధ్య సమతుల్యత స్థాపించే అనుకూలరంగంగా విద్య పని చేసింది (Rughoonundun Chellapermal, 2020).
9. భాషా పదవి ప్రణాళిక language planning:
1940 ప్రాంతంలో అప్పటి ప్రధానమంత్రి అయిన సర్ శివసాగర్ రామ్ గులాం ఆసియా భాషల పదవి మెరుగుపరచటానికి కొన్ని భాషా విధానాల నిర్ణయాలు తీసుకున్నారు. 1990లో సర్ అనిరుఢ్ జగన్నాథ ఆయన అడుగుజాడలోనే నడిచారు. పూర్వుల భాష పరంగా ఏర్పడిన అస్తిత్వ సమస్యలు (identity crisis) నివారించటానికి విద్య అనుకూలమైన వ్యవస్థ అని నిర్ధారించారు (Tirvassen & Ramasawmy, 2017). ఆసియా భాషల ప్రచారం కోసం మారిషస్ దేశంలో ఉన్న వివిధ భాషలు ప్రామాణికం చెందిన తరువాత ప్రవేశమయ్యాయి. పైగా ఉపాద్యాయులకు భాషా బోధన మీద శిక్షణ ఇప్పించింది (Luthmoodoo, 2013).
అభిజ్ఞాశక్తి మరియు సంభాషణ పెంపొందించడం అనేవి ముఖ్య లక్ష్యంగా పెట్టుకుని ఆధునిక భాషాలుగా బోధింపబడతాయి. మరో వైపు, ఆసియాభాషలు అస్తిత్వం, ‘మనవాళ్లు’ అనే భావన ఏర్పరచటానికి, భారతదేశంతో గట్టి సంబంధం పెంచటానికి విద్యా ప్రణాళికలో స్థానం సంతరించుకుంది. అలా భాషాబోధన అసలు సంభాషణకోసం బోధించాలా సంస్కృతికి సంబంధమైన ఒకరి అస్తిత్వాన్ని గురించి నేర్పించాలా అనే సమస్య ఏర్పడుతుంది. వివిధ భాషల ఉనికి మరియు బోధన మీద అనేక వైరుధ్యాలు చూడవచ్చు.
పూర్వుల భాష చదివే విద్యార్థుల సంఖ్య ఆ ప్రత్యేక జాతి జనాభా మీద ఆధారపడి ఉంది. అయితే భాష ఎంపిక విద్యార్థి జాతితో ముడిపడి ఉంది. రెండోది ఒక భాషకు సంబంధించిన ప్రత్యేక జాతివాళ్ళ సంస్కృతిని ప్రచారం చేయటానికే వివిధ భాషల లక్ష్యం. 1990 ల మధ్య కాలం నాటి వరకు పూర్వుల భాషల బోధనకు అధికారిక విద్యా ప్రణాళిక వర్తించలేదు.
మారిషస్ దేశంలో భాషాపోషణ మరియు సంరక్షణలో విద్య ఒక కీలక పాత్ర వహిస్తుంది. పైగా దేశ సామాజిక-భాషాపరమైన (sociolinguistic) స్థితిని సృష్టించటానికి విద్య పాత్ర అమూల్యం (Bissoonauth, 2010; Srilata, 2010). వివిధ సంస్థల ద్వారా కొన్ని భాషా పునరూజీవనానికి తోడ్పడినా ఆసియా భాషలు చదివే విద్యార్థుల సంఖ్య తక్కువ అయినా ఆ భాషల మీద అమితమైన డబ్బు ఖర్చు అవుతున్నది. Rughoonundun-Chellapermal (2022) ప్రకారం యువ తరాల భాషా దృశ్యాన్ని(linguistic profile) రూపుదిద్దుకోవడం అత్యవసరం. ప్రాథమిక విద్య స్థాయిలో ఆసియా భాషలు లేదా అరబిక్ భాష చదువుకునే పిల్లలు కనీసం 70 శాతం. వాళ్లు దైనందిన సంభాషణల్లో ఆ భాషలు వాడకపోయినా జాతిపరమైన, భాషాపరమైన అస్తిత్వాన్ని సృష్టించటానికి / రూపుదిద్దుకోటానికి ఈ అనుభవం సహకరిస్తుంది (Payaneeandee, 2008; Rughoonundun-Chellapermal, 2022).
10. విద్య వ్యవస్థ, పరీక్షల ప్రాముఖ్యత మరియు వాటి గురించి చర్చలు:
ఆసియా భాషలను ఇంకా శక్తి నివ్వటానికి ఆసియా భాషలకు పరీక్షలు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు (ranks) అందించటానికి ఆసియా భాషలు కూడా లెక్కలో తీసుకోవడం చాలా మంది ఆసియా భాషల నిపుణులే/ ప్రముఖులే (proponents) ఒప్పుకోలేదు (Sokappadu, 2009). దానికి నిదర్శనం తెలుగు స్థితే. 1992 ప్రాంతంలో తెలుగు ఐచ్ఛిక భాష స్థాయి ఇప్పించటానికి మారిషస్ తెలుగు మహా సభ (M.T.M.S) ఒప్పుకోలేదు. దానికి ముఖ్య కారణం: తగిన వనరులు లేకపోవటంవల్ల విద్యార్థులు తెలుగు వదిలేసి వేరే ఆసియా భాష చదువుకుంటాడు అనే భయం వాళ్ళలో ఏర్పడింది. వేరే ఆసియా భాషలు చదువుకునే పిల్లలు తెలుగు చదువుకునే విద్యార్థి తగిన వసతులు లేకపోవటంచే పరీక్షలు బాగా రాయకపోవటం అనే భయం కూడా ఉండేది (Sokappadu, 2009). ఎన్నో విరుద్ధాలు అయినా ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి చర్యల వల్లే ఆసియా భాషలు ఇప్పటి దాకా ఉనికిలో ఉన్నాయి. కనుక గట్టి భాషా పోషణ లేకపోతే భాషా మార్పిడి (language shift) తప్పదు అని గ్రహించాలి. పైగా గట్టి భాష పోషణ చర్యలు తీసుకోకపోతే మూడు తరాల లోపు తక్కువ వాడుకలో ఉన్న భాషలు మాయమైపోతాయి.
మారిషస్ దేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరీక్షలు ఏర్పాటు చేసే మారిషస్ పరీక్షల సంస్థ (MES) లాగా కొన్ని భాగ్యస్వాములు ఆధునిక భాషగా తెలుగులో పరీక్షలు జరిపిస్తారు. మహాత్మా గాంధీ సంస్థ (M.G.I) వంటి ఇతర భాగ్యస్వాములు భాషకు సంబంధమైన సాంస్కృతిక, పూర్వుల మూలాన్ని అర్థం చేసుకుని పాఠ్య ప్రణాళిక తయారు చేస్తుంది.
11. మహాత్మా గాంధీ సంస్థ (ఎమ్ . జి . ఐ )
శాసన సభ పెట్టుకునే చట్టం ద్వారా మహాత్మా గాంధీ సంస్థ స్థాపింపబడింది. 1970 ల లో ఆసియా భాషల ప్రచారం కోసం విద్యాశాఖ మంత్రాలయం జతగా మహాత్మా గాంధీ సంస్థ పని చేస్తుంది. మారిషస్ దేశంలో భారతీయ భాషల ప్రాచారంలో మరో పీఠికగా (landmark) మారిషస్ ప్రభుత్వం, భారతీయ ప్రభుత్వం రెండూ కలిసి ఈ సంస్థకు ఆర్థికపరమైన విషయాలను చూసుకుంటాయి (Peerthum, 1997). మహాత్మా గాంధీ సంస్థ భారతీయ భాషయాసంస్కృతుల ప్రచారానికి కావలసిన వసతులు కలిగి ఉంది. మహాత్మా గాంధీ సంస్థలో ఉన్నత స్థాయిలో భారతీయ భాషలలో బోధన జరుగుతుంది. అయితే మారిషస్ దేశంలో ఆసియా భాషలు నేర్పించే ఉపాధ్యాయులు ఈ సంస్థలో పయనం అయ్యారు. వివిధ భాషలలో ఉపాధ్యాయుల శిక్షణ కల్పిస్తుంది మహాత్మా గాంధీ సంస్థ. విద్య ప్రణాళిక మరియు పాఠ్య పుస్తకాల తయారీకి సంబంధించిన బాధ్యతలు మహాత్మా గాంధీ సంస్తది. కాబట్టి భారతీయ భాషాభివృద్ధికి, ప్రచారానికి ప్రభుత్వానికి గల ప్రయత్నం అద్భుతం అని చెప్పాలి. Kloss (1977) మరియు తరువాతి కాలంలో May (2015) చెప్పినట్టు ‘promotion-oriented language rights' మహాత్మా గాంధీ సంస్థకు వర్తిస్తుంది. దానికి ఫలితంగా వివిధ సందర్భాలలో, ముఖ్యంగా బళ్ళో భారత ప్రవాసీ భాషల నైపుణ్యం మరియు వాడుక పెంపొందించటం జరుగుతుంది.
12. తక్కువ వాడుకలో ఉన్న తెలుగు వంటి భాషల మీద ప్రభుత్వ విధానాల మంచి ప్రభావం:
మారిషస్ పరిస్థితిని పరిశీలించి చూస్తే మైనారిటీ భాష మరియు మెజారిటీ భాషల భేదం నిర్ధిష్టమైన సంక్లిష్టత మీద ఆధారపడి ఉంది. ఒక పక్క కొంత మంది సామాజిక- భాషశాస్త్రజ్ఞులను బట్టి ఒక భాష మాట్లాడేవాళ్ళ సంఖ్య మీద ఆధారపడి ఉంది. దానికి తోడు ఆ భాషకి ఉన్న పదవిని కూడా సూచిస్తుంది. వ్యంగ్యమైన విషయం ఏమిటంటే ఒక దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషకు తక్కువ స్థాయి ఉండవచ్చు. ఎక్కువమంది మాట్లాడే తెలుగు భాష మారిషస్, మలేషియా, దక్షిణాఫ్రికా, కెన్యా, ఫిజి వంటి దేశాలలో మైనారిటీ భాషగా పరిగణిస్తారు.
అయినా మారిషస్ దేశంలో మంచి భాషా విధానాల కారణంగా విధ్యార్థుల సంఖ్య ఏమైనా బళ్ళో భాషా బోధన జరపటం ఖాయం. తరచుగా తెలుగు, తమిళం, మరాఠీ వంటి మైనారిటీ భాషలలో ఉపాద్యాయుడు- విద్యార్థి సంఖ్య(ratio) 1:3. గుర్తింపదగిన విషయం ఏమిటంటే ఐచ్ఛిక భాష చదువుకోటానికి కావలసిన పిల్లల సంఖ్య పది. కనుక మంచి విద్య విధానాలు లేకపోతే పూర్వుల భాషా బోధన జరగనే జరగదు. ఉపాధ్యాయుల శిక్షణ మరియు పాఠ్య పుస్తకాల తయారీ వంటి కార్యాలు ప్రభుత్వం వాళ్లు సహకరిస్తేనే భాషా వర్ధిల్లు అయింది అని చెప్పడంలో అతిశయోక్తిలేదు.
12. సాయంత్రపు బళ్ల ఉనికి:
నేడు బళ్ల విద్య ప్రాణాళికతోపాటు సాయంత్రపు బడి లేదా పాఠశాల అని పిలవబడే సామాజిక- సాంస్కృతిక సంస్థలు ఆసియా భాషా బోధన సాగుతాయి. ముందుగా చర్చించినట్టు ఇతర పూర్వుల భాషాలాగే తెలుగు భాష బోధన బళ్ళో ప్రవేశం అయ్యే ముందు భాషను తెలుగు సమాజండవారా ప్రచారం అయ్యేది. కొత్త భాషా పరిస్థితి వల్ల తమ భాషా దోపిడి అవకుండా సంరక్షించటానికి కొందరు ఒక్క రూపాయి తీసుకోకుండా భాషా ప్రచారం చేసేవాళ్ళు. 1935 లోపు దాదాపు 48 సాయంత్రపు బళ్లలో హిందీ, ఉర్దూ, తమిళం భాషలు నేర్పేవాళ్ళు.కొన్ని ఏళ్ల తరువాత తెలుగు, మరాఠీ, చీనీ భాషలు బోధించే సాయంత్రపు బళ్ళు వచ్చాయి. 1976 లో భాషా ప్రచారానికి మరియు దేశ నిర్మాణానికి (nation building) ప్రభుత్వంవాళ్లు అటువంటి బళ్ల ప్రాముఖ్యతను గ్రహించారు. ఇటువంటి సాయంత్రపు బళ్ల ప్రాముఖ్యతను గ్రహించి విద్యా శాఖ మంత్రాలయం ఆ సాయంత్రపు బళ్ల ఉపాధ్యాయులకు నెలాన డబ్బు (allowance) ఇవ్వటానికి నిర్ణయం తీసుకుంది (Yenkanah et al, 2023). ఇలా పూర్వుల వారసత్వాన్ని, భాషసంస్కృతులను పరిరక్షించటం అనే ప్రాముఖ్యత గ్రహింపబడింది. 1996 లో ప్రభుత్వం సాయంత్రపు బళ్ల ఉపాధ్యాలులకు కేటాయింపబడిన డబ్బు పెంచి ఆ బళ్ల మంచి నడువడి కోసం నిర్మాణం ఇచ్చింది. భారతీయ భాషల పరిరక్షణ వెనక సామాజిక- రాజకీయ పాత్ర విలువైనది. Payneeandy (2009) ‘మారిషస్ లో సమాజం మరియు పిల్లల పరిస్థితి’ అనే పరిశోధనను బట్టి వివిధ నేపాధ్యాలలో పిల్లల పెంపకం గురించి వివరించింది. సాయంత్రపు బళ్లు వెళ్ళే భారతీయ ప్రవాసీ పిల్లల మధ్య జాతిపరమైన చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది.
13. తెలుగు భాషా ప్రచారం కోసం ఇతర సంస్థలు:
1. ప్రసార మాధ్యయమాలు
మారిషస్ లో పూర్వుల భాషాప్రచారానికి మీడియా కీలకపాత్ర వహిస్తుంది. జాతీయ మీడియా సంస్థ అయిన మారిషస్ బ్రోడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (MBC) టీవీ మరియు రేడియొలో తెలుగు కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది.
2. జాతీయ నాటిక పోటీలు
కళా సాంస్కృతిక వారసత్వ మంత్రాయలం పది భాషలలో నాటిక పోటీలు ఏర్పాటు చేస్తుంది. ఈ పోటీ వాచిక తెలుగును ఎక్కువగా ప్రోత్సహిస్తుంది (Prabhakaran, 1994; Bhaskar, 2017).
3. ప్రభుత్వేతర సంస్థలు
2003 లో తెలుగు సంస్కృతి ప్రచారం కోసం కళా సాంస్కృతిక వారసత్వ మంత్రాలయ ఆర్థిక సాయంచే మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం అనే సంస్థను స్థాపింపబడింది. 2008 లో అదే మంత్రాయల ఆధ్వర్యంలో తెలుగు భాషా సంఘం స్థాపింపబడింది. ఈ సంస్థ తెలుగు భాషాభిమానుల మధ్య తెలుగు రాయటం మరియు మాట్లాడడం ఆనే ఆసక్తి పెంపొందించటానికి సరుసతిమపబడింది (MACH, 2022).
14. ముగింపు:
- ఈ పత్రం ద్వారా మారిషస్ దేశంలో పూర్వుల భాష, ముఖ్యంగా తెలుగు గురించి వివరింపబడింది. తెలుగుకు నిదర్శనంగా తాతలు అందించిన వారసత్వంగా తీసుకుని భాషా ప్రచారానికి పట్టు పట్టారు ప్రవాసులు అని నిరూపింపబడింది.
- అనుకూలమైన భాషా విధానాల వల్ల, విద్య వల్ల ఈ భాషతోపాటు ఇతర పూర్వుల భాషలు ఇప్పటి దాకా ఉనికిలో ఉందని గ్రహింపబడింది.
- పూర్వుల భాషలు నేర్చుకున్న విద్యార్థులు తక్కువ అయినా బళ్ళో నేర్పించి పునరుజ్జీవనం సాధించింది.
- ప్రభుత్వపు సంస్థలతోపాటు ఇతర సంస్థలు విద్య ద్వారా భాషా ప్రచారంలో నిమగ్నమై ఉంటాయని వివరింపబడింది.
15. ఉపయుక్తగ్రంథసూచి:
- Appadoo, R. (2002). Maintenance of Telugu language in Mauritius. Osmania papers in linguistics, 28(1), 49-64
- Bhaskar, T. (2017). Telugu Language in Mauritius. Unpublished article.
- Bhaskar, T. (2007). Global Indian Diasporas: Exploring Trajectories of Migration and Theory. Amsterdam University Press.
- Bissoonauth, A. (2010). Language Shift and Maintenance of Ancestral Languages in Mauritius. Journal of Multilingual and Multicultural Development 32(5), 1-14.
- Brutt-Griffler, J. (2005). The use of heritage language: An African perspective. Modern Language Journal, 89, 609-612.
- Campbell, R., & Peyton, J. K. (1998). Heritage language students: A valuable language resource. The ERIC Review, 6(1), 38 – 9.
- Fishman, J. A. (1977). Standard versus dialect in bilingual education: An old problem in a new context. Modern Language Journal, 61, 315-325.
- Kloss, H. (1977). German-American Language Maintenance Efforts. In J. Fishman, V. Nahirny, J. Hofman and R. Hayden (Ed.), Language Loyalty in The United States.
- Lutchmoodoo, R. (2013). Teaching of Telugu in Mauritius- An Evaluation. Star Press.
- Mahatma Gandhi Institute. (2020). Language Evolution. [Unpublished School of education report]
- May, S. (2015). The problem with English(es) and linguistic (in)justice. Addressing the limits of liberal egalitarian accounts of language. Critical Review of International Social and Political Philosophy, 18(2), 1-18.
- Moraru, A. (2016). Understanding how second-generation multilingual immigrants reproduce linguistic practices with non-autochthonous minority languages in Cardiff, Wales. [Doctoral Dissertation, Cardiff University]
- Natchoo, N. (2020). A creolizing Curriculum: Multicultural Education, Ethnopolitics and Teaching Kreol Morisien [Doctoral Dissertation, University of Kansas].
- Nirsimloo-Anenden (1982). Telugu Identity in Mauritius. University of London.
- Payneeanandee, M. (2009). Society and the condition of the Child in Mauritius. Mauritius Research Council.
- Peerthum, S. (2010). ‘They came to Mauritian shores’: The Life-Stories and the History of the Indentured Labourers in Mauritius (1826–1937). Appravasi Ghat Trust Fund.
- Prabhakaran, V. (1991). The Telugu Language and its influence on the cultural lives of the Hindu ‘Pravasandhras’ in South Africa. [Doctoral dissertation, University of Durban-Westville].
- Prabhakaran, V. (1994). The Religio-cultural dynamics of the Hindu Andhras in the diaspora. [Doctoral dissertation, University of Durban-Westville].
- Prabhakaran, V. (1997). The parameters of maintenance of the Telugu language in South Africa. Language Matters, 28(1), 51–80. https://doi.org/10.1080/10228199708566120.
- Rajah-Carrim, A. (2005). Language Use and Attitudes in Mauritius on the basis of the 2000 population census. Journal of Multilingual and Multicultural Development.
- Rughoonundun-Chellapermal, N. (2020). Taking research out of the test-driving zone. An option for strategic research. Journal of Education. Epistemology, Methodology and Research in Language Studies, 2(1), 1-30. Sokappadu, R. (2017). Telugu Culture in Mauritius. The Star Press.
- Spolsky, B. (2008). Language policy. Cambridge University Press.
- Srilata, K. (2010.) Indianités francophones / Indian Ethnoscapes in Francophone Literature. The Johns Hopkins University Press, 2(4), 29-45.
- Tirvassen, R., & Ramasawmy, S. (2017). Deconstructing and re-inventing the concepts of multilingualism: A case study of the Mauritian linguistic landscape. Stellenbosch Papers in Linguistic Plus, (51), 41-59.
- Valdes, G. (2005). Bilingualism, heritage. language learners, and SLA research: Opportunities lost or seized? Modern Language Journal, 89, 410- 426.
- Venkanah, S. & Auleear-Owoodally, M. (2023). Keertanam and Bhajanam: The Faith (Literacy) Practices of the Telugu Community in Plural Mauritius. Heritage Language Journal, 20(1), 1-35.
- Wiley, T. G. (1996). Language planning and policy. Sociolinguistics and language teaching, 103-147.
- Yenkanah, S., Pillay, P., Rughoonundun-Chellapermal, N. & Govender, N. (2023). Maintaining ancestral languages through extension schools: the case of telugu in Mauritius. South Asian Diaspora, 15(1), 97-111. DOI: 10.1080/19438192.2023.2168883
- Yenkanah, S. (2024). Teachers’ experiences of teaching an ancestral language in a multilingual context; the case of Teluguin Mauritius. [Doctoral Thesis. University of KwaZulu-Natal].
- Yuksel, P, & Brooks, P. (2017). Encouraging usage of an endangered ancestral language: A supportive role for caregivers’ deictic gestures. First Language, 37(6), 561–582.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.