headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

24. ఎఱ్ఱన ధర్మవ్యాధోపాఖ్యానం: ధర్మవిశేషాలు

డా. కె.ఎల్. జ్యోతిర్మయి

ఆంధ్రోపన్యాసకురాలు
ఎస్.వి.జె.వి. సంస్కృత కళాశాల
కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494008879, Email: lalithajyothirmayee@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

మహర్షుల తపఃశక్తితో దర్శించిన అతింద్రీయ జ్ఞాన విశేషాలన్నింటిని కలిపి హిందూమతం అని పేరు. ఋషులు ఇచ్చిన జ్ఞానం కావున దీనిని ఆర్ష సంస్కృతి అంటారు. దీనికే సనాతన ధర్మం, వేద ధర్మం, హిందూ ధర్మం అని పేరు. వేద ధర్మాన్ని అంతటా ఒక్క దగ్గర అందించాలి అనే ఉద్దేశ్యంతో వ్యాసుడు మహాభారతాన్ని రచించెను. “ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు” ఇది మహాభారతం యొక్క ప్రత్యేకత. సామాన్యులైన మానవ ధర్మాన్ని, కష్టజీవి మొదలుకొని పండితుల వరకు అందరికీ సంబంధించిన అన్ని ధర్మాలు మహాభారతంలో చెప్పబడినవి. ముఖ్యంగా హిందూ ధర్మానికి విజ్ఞాన సర్వస్వం అని చెప్పగలిగేవి రెండు పర్వాలు. 1) శాంతిపర్వం 2) అనుశాసనిక పర్వం. మహాభారతంలో వ్యాసుడు ధర్మాన్ని చెప్పడానికి అనేక ప్రక్రియల్ని అవలంబించాడు. మహాభారతము మానవ జీవితానికి సంబంధించిన అన్ని ప్రయోజనాల్ని ఇవ్వగలిగిన గ్రంథము అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధర్మాన్ని తెలియజేయడంలో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలగు అనేక కావ్యాల్లో వివరింపబడింది. ప్రాచీన కవుల నుండి ఆధునిక కవుల వరకు అనేకమంది వారి కావ్యాల్లో చతుర్విధ పురుషర్ధాల్ని ఇనుమడింపజేసి రచనలు జేసెను. అలా చేసిన వాటిలో ప్రాచీన కావ్యమైన ఆంధ్ర మహాభారతము కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతముతో ఎఱ్ఱనామాత్యుడు రచించిన అరణ్య పరవశేషములో పంచమాశ్వాసంలో చెప్పబడిన ధర్మవ్యాధో- పాఖ్యానంలో తెలిపిన ధర్మము విశేషములు తెలియజేయుట నా ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యము.

Keywords: ధర్మం శబ్దార్ధము, ధర్మవ్యాథోపాఖ్యానం, ఇతివృత్తం, ధర్మం, విశేషాలు, వర్ణధర్మం, ధర్మవ్యాధుని వ్యక్తిత్వం, వృత్తి ధర్మం, శిష్టాచరణ ధర్మం.

1. ధర్మము - వివరణ:

ధర్మ శబ్దము గురు ధాతువు నుండి నిష్పన్నమైనది. ‘ధృఞ్ ధారణే’ అని ధారణముగా మోయుట అని అర్థము.

 “ధరతీతి ధర్మః” ధరించినది కావున ధర్మం. “ధరతి విశ్వం ధర్మః” విశ్వాన్ని ధరించేది ధర్మం. “డు ధాఙ్ ధారణ పోషణయోః” అని ధర్మ శబ్దానికి వ్యుత్పత్తి. ధారణ, పాలన లక్షణాలు కలిగినది ధర్మము. అలాగే “ధారణాద్దర్శ” అనగా ధరించునది ధర్మం. “ధ్రియతే యేన సధర్మః” అనగా ఏది సమస్త విశ్వాన్ని ధరించునో అది ధర్మం అని చెప్పబడింది. ధర్మము గురించి విజ్ఞాన సర్వస్వం ఈ విధంగా వివరించింది.

ధర్మము:

కర్తవ్యం( ఐహికము – ఆముష్మికము) న్యాయము, సత్ప్రవర్తన, శాసనము, మతము, నీతి శాస్త్ర నియమము సదాచారము అను అర్ధాలలో ధర్మం అను పదము వాడుకలో ఉంది. సత్ప్రవర్తన ధర్మమునకు కర్మసూత్రముతో సంబంధం కలదు. ఉత్తమ ప్రవర్తనకు సత్ఫలితము దౌష్ట్యాచరణకు ఉచిత దండన తప్పక సిద్ధించి తీరుతాయని కర్మ సూత్రాలు చెప్పుచున్నవి. ధర్మము అను మాటకు సాధారణ వ్యవహారములే ‘కర్తవ్యం’

ధర్మం - శబ్దార్ధము:

ధర్మ శబ్దానికి సంస్కృత నిఘంటువులు, తెలుగు నిఘంటువులు ఇచ్చిన అర్థాలు. ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో విజ్ఞాన సర్వస్వంలో ఇచ్చిన వివరణలు ఇందు పొందుపరిచెదను.

DHARMA :

"The older form of the RV is DHARMA q. v. that which is established or steadfast decree. Statute ordinance law usage practice,  customary obeservance or prescribed conduct, duty, right, justice, virtue, nbrality, veligion, religious, merit, good works"1

“ధర్మం అనేది లోకాన్ని ధరించేది. లోకాన్ని మంచి స్థితిలో నిలబెట్టేది. 1. శ్రుతి స్మృత్యాదులందు విహితమైన కృత్యం. 2. సుకర్మణ చేయగలుగుటచే కలుగు అదృష్టం, పుణ్యం. 3. న్యాయం 4. ఆచారం 5. స్వభావం,  గుణం 6. అహింస 7. యజ్ఞం 8. ఉపనిషత్తు 9. దానం 10.ఉపమ, సామ్యం 11. విల్లు 12. కత్తి 13.సత్సంగం 14. జ్యోతి

ఉదా:  గృ హీత ధ ర్మాః ఆదృత ధ ర్మాః నివృ త్త ధ ర్మాః” 2. శరీర వ్యాపారం, వాగ్ వ్యాపారం, మనో వ్యాపారం మానవులకు సహజాలు. ఇవి శ్రుతి సమ్మతమైనప్పుడు ధర్మం అనబడుతుంది. శ్రుతి స్మృతి విరుద్ధాలైనప్పుడు అధర్మం అనబడుతుంది. ధర్మాధర్మ స్వరూపం అగోచరమై శాస్త్రం చేతనే గోచరించునదై ఉంది. కావున పరిగ్రహించవలసిన ధర్మం, పరిత్యజించవలసిన ధర్మం తెలుసుకోవడానికి శాస్త్రం మీదనే ఆధార పడవలసి ఉన్నాము.3 అనేకాక విస్తృత అర్థం కలదు. ఒక కులానికి లేదా ఒక వర్గానికి రూఢమైన ఆచారానికి కూడా ధర్మం అని వ్యవహారముంది. సంఘంలో వివిధ మార్గముల వారికి గల సాంఘిక కర్తవ్యం అను అర్థంలో ధర్మానికి ప్రయోజనం సంఘ సౌష్ఠవాన్ని కాపాడటం “ధర్మమను పదము ఒక్కొక్కప్పుడు మతమను అర్ధములో వాడటం కూడా ఉంది.”4

ధర్మము అనగా మానవుడు నిర్వహింపవలసిన వివిధములైన విధులు, కర్తవ్యములను నిర్దేశించేదని తెలియుచున్నది. మానవుని వ్యక్తిగత, సామాజిక బాధ్యతలను నిర్దేశించేది ధర్మం. మానవుడు ప్రవర్తింపవలసిన విధానం, ప్రవర్తింపకూడని విధానాన్ని సూచించేదని తెలుస్తుంది. మానవుని నైతిక, ఆధ్యాత్మిక జీవితాన్ని తీర్చిదిద్దినదిగా, మానవుడు మంచి మార్గంలో నడిచేటట్లు చేసి, చెడుని నిరోధింపజేసేది ధర్మమని తెలుస్తోంది. మానవ సమాజానికి ఒక సక్రమమైన, ఒక నియమబద్ధమైన ఒక సువ్యవస్థితమైన గతిని నిర్దేశించేది ధర్మము.

వేదోఖిలో ధర్మమూలమ్….”5 “వేదో ధర్మమూలము…”6 అని వేదమే ధర్మమునకు మూలమని మనుస్మృతి, గౌతమస్మృతి మొదలగునవి చెపుతున్నాయి. వేదాలలో ధర్మము సూటిగా చెప్పబడింది.

            ధర్మోహి పరమోతకే ధర్మే సత్యం ప్రతిష్టితమ్”7

          “ధర్మాదర్ధః ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖమ్”8

          “ధర్మణ లభతే సర్వం ధర్మసార మిదం జగత్"9

సకల పురుషోర్ధాలలో ధర్మం ఉత్కృష్టమైనది. ధర్మంనందే సత్యం నెలకొని ఉంది. ధర్మం వలననే అర్థం సిద్ధించునని, ధర్మంనందే సుఖశాంతులు లభిస్తాయని, సకలము మానవునకు ధర్మము నుండి లభిస్తుంది. కావున జగత్తుకు ధర్మమే మూలమని శ్రీమద్రామాయణం చెప్పుచున్నది.

             ధారణా ద్ధర్మ మిత్యాహు ర్థర్మో ధారయతే ప్రజాః

          యత్స్యా ద్ధారణ సంయుక్తం సధర్మ మితి నిశ్చయా”10

ధరించునది ధర్మం. ఏది ధరించే శక్తి కలిగి ప్రజలను ధరించునో అదే ధర్మం అని మహాభారతం చెప్పుచున్నది.

    “తర్కో ప్రతిష్ఠ శ్శ్రుత యోపి భిన్నానైకో ఋషిర్యస్య వచః ప్రమాణమ్

    ధర్మస్య తత్వమ్ నిహితమ్ గుహాయామ్ మహాజనో యేన గతస్స పంథాః”11

మానవునకు ఆచరణీయములుగా చెప్పబడిన వివిధములైన కర్తవ్యములు, విధులు అన్నీ ధర్మములే. తన జీవితంలో వివిధ దశలలో నిర్వర్తింపవలసిన క్రియా కలాపములు, ఆచరించవలసిన కర్మలన్నీ మానవుడు మృత్యు పర్యంతం నిర్వహించవలెను. బాల్యం, కౌమారం, వార్థక్యంలో నిర్వహింపవలసిన పుత్ర, శిష్య, వ్యక్తి, సంఘ ధర్మములు మొదలైనవన్నీ మానవ ధర్మములే అనబడును. ఇందులో కొన్ని సామాన్య ధర్మములు కాగా, మరికొన్ని విశేష ధర్మములు. ప్రతీ మానవుడు నిర్వర్తించు కొన్ని విశిష్టమైన వ్యాపారములు కూడా ధర్మములే అనబడుచున్నవి.  దైహిక, మానసిక, లౌకిక, పారలౌకిక మొదలగునవి ఇట్టి ధర్మములు.

తర్కము చంచలము. శ్రుతి అనేక విధములు. ఏ ఒక్క ఋషి వచనమో ప్రమాణమని చెప్పుట వీలు లేదు. ధర్మం యొక్క మూలతత్వం అవగాహనకు అందనట్టిది. కావున మహా జనులు లేదా లోకోత్తర పురుషులు ఏ మార్గాన్ని అనుసరించారో అదే ధర్మానికి ప్రమాణము.

ధర్మవ్యాధోపాఖ్యానము - ఇతివృత్తం:

సూతుడు నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంగా మహాభారత కథను వినిపించాడు. మార్కండేయ మహర్షి ఎన్నో పుణ్యకథలను చెప్పగా విని సంతృప్తి చెందిన ధర్మరాజు ఆ మహర్షితో గొప్ప పతివ్రతల మహాత్మ్యాలను గూర్చిన కథలు చెప్పమనగా..

పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు పల్లెటూరిలో నివసిస్తూ ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, తపస్వి, నిత్యం వేదాలను వల్లే వేస్తూ జీవనం గడిపేవాడు. ఒకరోజు ఒక చెట్టు మొదట కూర్చొని వేదం వల్లివేస్తూ ఉండగా ఆ చెట్టు పైన ఉన్న కొంగ రెట్ట వేయగా ఆగ్రహంతో కొంగను చూడగా ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నిష్కారణంగా కొంగ ప్రాణాలు తీశాను అని పశ్చాతాపం చెంది, పలు రీతులు విచారించి చేసేదేమీ లేక బ్రాహ్మణ గృహాలకు భిక్షాటనకై వెళ్ళగా అంతటా ఆ ఇల్లాలు మిక్కిలి వేగంతో భిక్ష వేయడానికై పాత్రను శుభ్రం చేయగా ఇంతలో ఆమె పెనిమిటి రావడంతో ఆయనకు అన్ని పరిచర్యలు చేసి తర్వాత బ్రాహ్మణ బ్రహ్మచారికి బిచ్చం పెట్టడానికి పాత్రలో అన్నం నింపుకొని వెళ్లింది. అది చూచిన కౌశికుడు కూడా ఆగ్రహించి దుర్భాషలాడెను. ఆ పతివ్రత అయిన ఇల్లాలు భర్త ప్రాముఖ్యాన్నిచెబుతూ, బ్రాహ్మణులంటే ఎవరు? వారి వృత్తి ఏంటి? వారికి ఆగ్రహం వస్తే ప్రపంచం ఏ విధంగా ఉంటుంది? మొదలగు విషయాల్ని చెప్పి, నీవు తీవ్ర కోపంతో కూడిన స్వభావం కలవాడవని నాకు తెలుసు, నీ కోపం వలన కొంగ చనిపోయిందని నేను నా పాతివ్రత్య మహిమ వల్ల గమనించాను. అంటూ కౌశికునికి ధర్మం గురించి వివరిస్తూ "నీవు కేవల స్వాధ్యాయ పరుండవు గాని ధర్మ సూక్ష్మత యెఱుంగవు"12 కావున మిధిలా నగరానికి వెళ్లి ఆ పట్టణంలో ధర్మవ్యాధుడు అనే పేరుతో బోయ వాడిని సందర్శించు. ఆయన ధర్మ సూక్ష్మవేత్త. అతడు నీ సంశయాలన్నింటినీ  పోగొట్టి నీకు విచక్షణా జ్ఞానాన్ని ప్రదర్శించగలడు అని చెప్పగానే కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వెళ్లి ధర్మ విశేషాల్ని తెలుసుకున్నాడు.

3. ధర్మము - విశేషములు:

3.1. ఆచరణాత్మకధర్మం:

ధర్మరాజు పతివ్రతా లక్షణాల్ని చెబుతూ “అరికట్టడానికి వీలు లేని ఇంద్రియాలు అరికట్టి, వాటిని మనస్సుకు లోబడేటట్లుగా చేసి, ఆ మనస్సును అహంకారానికి లోను కాకుండా చేసి, తన పెనిమిటికీ ఎల్లప్పుడు సేవ చేసే వనిత అన్ని జగాలలో గొప్పది" అటువంటి లక్షణాలు కలిగిన ఉత్తమమైన ఇల్లాలిచే కౌశికునికి బ్రాహ్మణుడు అంటే ఎవరు? నిర్వర్తించవలసిన ధర్మం ఏమిటి? అనేవి చెబుతూ, ధర్మం మిక్కిలి క్లిష్టమైనది. స్థూల దృష్టికి ఒక విధంగా, సూక్ష్మ దృష్టికి ఒక విధంగా కనిపిస్తుంది. ధర్మం యొక్క తీరుపు అనేక రకాలు. నీవు వేదాలను వల్లివేయడంలో మాత్రమే నిష్ణాతుడివి. ధర్మసూక్ష్మత  గుర్తించగలిగిన విచక్షణత నీలో లేదు అని పేర్కొనెను. పెద్దల నుండి ఆచరణీయంగా కొంత ధర్మాన్ని తెలుసుకోవచ్చు అనేది ఇందులో ఒక అంశము. సమాజంలో స్త్రీలు ఏ విధంగా ఉన్నారు అన్నది, మానవీయ విలువలకు ఎంతటి స్థానం కలదో దీని ద్వారా మనకు తెలుస్తుంది.

3.2. వర్ణధర్మం:

కౌశికుడు ధర్మవ్యాధునితో నీవు ధర్మమార్గం బాగా తెలిసిన వాడివి కదా! ‘జీవహింస’ను బ్రతుకు తెరువుగా ఎంచుకోవడం న్యాయమా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఎవరికి అనువైన ధర్మాలు వారు ఆచరించవలసి  ఉన్నది అంటూ…

బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మాలు: తపస్సు, వేదాధ్యయనం, సత్యం, శౌచం, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహంతో కూడిన జ్ఞానసముపార్జన చేయడం.

క్షత్రియులు ఆచరించవలసిన ధర్మాలు: శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, దండనీతితో కూడిన పరిపాలన.

వైశ్యులు ఆచరించవలసిన ధర్మాలు: వ్యవసాయం, వర్తకం , పాడిపంటలు అభివృద్ధి చేయడం.

శూద్రులు ఆచరించవలసిన ధర్మాలు: పరిచర్య

వ్యాధులు ఆచరించవలసిన ధర్మం: మాంస విక్రయం

3.3. ధర్మవ్యాధుని వ్యక్తిత్వం:

ధర్మవ్యాధుడు కౌశికుడు అడిగిన ప్రశ్నకు  ఏ వర్ణం వారు ఏ ధర్మాన్ని పాటించాలో వివరిస్తూ, నేను నా వృత్తి ధర్మాన్ని పరిత్యజించలేను. నేను స్వయంగా జీవహింస చేయను. మాంసాన్ని క్రయం చేసి, మొక్కలు చేసి విక్రయిస్తాను. ఇది నా బ్రతుకు తెరువు. ఇందులో నాకు మనశ్శాంతి కలుగుతుంది. దీనితో పాటుగా ధర్మవ్యాధుని ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో కూడా మనకు వివరించాడు.

వినయము విస్తరిల్ల గురు వృద్ధ జనాతిథి విప్ర దేవతా

ర్చన లొనరింతు, సత్యమును శౌచము నేమఱ, నీగి మన్ననం

దనువుదు భృత్య బంధుతతి, దాల్మి వహింతు, నసూయ జేయ, నెం

దును మది దృష్ణ చొన్ప, బరదోష కథావిముఖుండ నెప్పుడున్”12

అను పద్యంలో వృత్తిధర్మంతో పాటు పెద్దలకు సేవ చేస్తాను, విప్రులను, దేవతలని ఆరాధిస్తాను,  సత్యశౌచ్యాలను  పాటిస్తాను, పని వారిని దయతో చూసుకుంటాను. ఓర్పుతో, అసూయకు లోను కాక, ఆశకు పోక, పర దూషణం చేయక, ఏకపత్నీ వ్రతంతో, వ్రతనిష్ఠలలో సమచిత్తంతో జీవిస్తాను.  కాబట్టి తక్కువ కులంలో పుట్టినా పవిత్రుడనే. అంటూ తన గురించి చెప్పే ధర్మ విశేషాలు వివరించాడు.

ఏ జాతి వారు ఏ ఏ వృత్తులు ఆచరించాలి, మనిషి ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ధర్మవ్యాధుడు తాను ఆచరిస్తున్న విధానాన్ని మనకు తెలియపరిచాడు. ఎవరు ఏ వృత్తిని ఆచరించినా సమాజంలో ఏ విధంగా మెలగాలో ధర్మవ్యాధుడు  కౌశికుడికి తెలిపెను. కానీ ప్రస్తుత సమాజంలో బ్రతుకు తెరువు కోసం వృత్తి, ప్రవృత్తి అనేవి ఏర్పడడం చేత ఏ వృత్తి వారు   ఆ వృత్తిని నిర్వహించకపోవడం మనం చూస్తున్నాం. ఆంగ్లేయుల పరిపాలనతో సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. ప్రపంచీకరణ, యాంత్రీకరణతో  దేశం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నా, ఇంకా అక్కడక్కడ వృత్తి ధర్మాలు పాటించడం వల్ల భారతదేశంలో ధర్మం నిలిచే ఉందని చెప్పవచ్చు.

3.4. వృత్తి ధర్మం:

           తన కుల ధర్మము విడవక

          మనుట పరమధర్మమండ్రు మాన్యులు చి త్తం

          బున కృప గలుగుట ముఖ్యపు

          బని సైరణ  వలయు నఖిల భావములందున్”

మానవుడు ప్రతీ ఒక్కడు తన కుల ధర్మాన్ని పరమధర్మంగా పాటించాలి. మనసులో దయ కలిగి ఉండాలి. అందరి భావాలనూ విని సహించి విషయ వాంఛలు వదులుకోవాలి. సత్యహిత వచనం, సుజనుల పట్ల గౌరవభావం, కామ క్రోధ విద్వేషాలతో మనసు కలుషితమైనా ధర్మం తప్పకుండా ఉండాలి. ద్వంద్వాతీత  ప్రవృత్తిని కలిగి ఉండడం, కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం అనే గుణాలు ఉత్తమ లక్షణాలు. ఇతరులకి కీడు చేస్తే ఆ పాపమే వాడికి కీడు చేస్తుంది. పాపం తెలియచేసినా దానికి విచారిస్తే సగం పోతుంది. ఇకమీద అలాంటి పాపం చేయను అని సంకల్పించినా ఆ పాపమంతా  పోతుంది. క్రోధ లోభాలు మహాపాపాలు. వాటిని జయించినవాడు ఉత్తముడు. నాస్తికుల మాటలు విని ధార్మికులు తమ ధర్మాల పట్ల ఆసక్తిని కోల్పోరాదు అంటూ కౌశికుడికి ధర్మ బోధలు చేసెను. ఇవి అన్నీ మానవ జన్మ ఎత్తిన ప్రతీ  ఒక్కరికీ  ఉపయోగపడేవి మరియు ఆచరించవలసినవి.

3.5. శిష్టాచరణ ధర్మం:

ధర్మవ్యాధుడు కౌశికునికి కుల ధర్మాలు, ఉత్తమ లక్షణాలు, పాపములు గురించి బోధిస్తూ అన్ని పాపాలలో మిక్కిలి చెడ్డవైన పాపాలు కోపం, లోభం. ఈ కోపలోభాల్ని జయించిన వాడు ధర్మాత్ములలో గొప్పవాడు. అటువంటి వారిని ఎవరూ ఎక్క డా ఎంచరు. అంటూ సజ్జనులు పాటించని కొన్ని మార్గాలు పైకి ధర్మాలుగా కనిపిస్తాయి. అందువల్ల దూరం నుండే కపట ధర్మాల్ని విడిచి పెట్టాలి. శిష్టాచారాల్ని స్వీకరించి ఆచరించటం ధర్మ లక్షణం. అని చెప్పగా కౌశికుడు శిష్టాచారాలు ఏవి? వాటిని తెలపండి అని ప్రశ్నించెను. ధర్మవ్యాధుడు దానం, సత్యం, తపస్సు, యజ్ఞం, కామలోభ రాహిత్యం, గురుజన శుశ్రూష, కోపం లేకపోవడం, దమం సంతోషం, నిరంతర అధ్యయన దైన్య రాహిత్యం, అసూయరాహిత్యం, అహంకార రాహిత్యం, ధర్మానురక్తి, శీలాన్ని రక్షించుకోవడం, పుణ్యతీర్ధాలు సేవించడం, శౌచం, భూత దయ మిత హితోక్తి  అనేవి శిష్టాచారాలు. ఇవి చెప్పడానికి కారణం ఈ శిష్టాచారంలో ధర్మానికి ప్రాముఖ్యం ఉంటుంది. సత్యం, అహింస దానికి తోడుగా ఉంటాయి. అహింస ధర్మాలన్నింటిలో  మిన్న.  అందుకే “అహింస పరమోధర్మ” అన్నారు. అది సత్యంతో కూడి ఉండటం చేత శిష్టాచారాలలో సత్యానికే అధిక ప్రాధాన్యత ఉంటుందని పండితులు పేర్కొన్నారు అంటూ ఇంకా ధర్మం మూడు రకాలు 1. వేద విహితాలు 2. శాస్త్రవిహితాలు 3. శిష్టాచారాలు. ఈ మూడు ఉత్తమ గతులు కలిగిస్తాయి.

                        వేద విహితంబులును శాస్త్రవిహితములును

                      శిష్ట చరితంబులును నన జెప్ప నొప్పి

                     ధర్మములు మూడు విధముల దనరుచుండు

                     గడగి యిన్నియు సద్గతి కారణములు”

4. ముగింపు:

ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. దానికి వేదాలు ఎంత ప్రమాణమో, పెద్దల ఆచారం కూడా అంతే ప్రమాణం. జీవులు మేలు కోసం పలికే అబద్ధం సత్య వాక్య ఫలాన్ని ఇస్తుంది. జీవులకు భయం కలిగించే అచ్చమైన సత్యం కూడా అసత్యం అవుతుంది. ప్రాణ రక్షణలో, పెండ్లిలో అబద్ధమాడినా సత్యం కంటే మించిన ఫలాన్ని ఇస్తుంది. ఇటువంటివి ధర్మ సూక్ష్మాలు. ఈ విధంగా కౌశికునికి ధర్మవ్యాధుడు  ధర్మ సూక్ష్మాల్ని వాటిని ఆచరించవలసిన విధానాల్ని వివరించెను.

నేటి సమాజంలో మానవులు ఎవరి ధర్మాన్ని వారు పాటించినట్లయితే నేడు దేశంలో  ఇంతటి దుస్థితి ఉండేది కాదేమో. సమాజంలో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అన్యాయం, అక్రమాలు, లంచగొండితనం, మోసపూరిత కుట్రలు  కుతంత్రాలు ఇవి ఇంతలా ప్రబలడానికి కారణం ఎవరి ధర్మాన్ని వారు ఆచరించకపోవడమే. ఒక విధంగా చెప్పాలంటే నేటి విద్యా విధానం కూడా కొత్త దోహదం చేస్తున్నదనే చెప్పాలి. కావున నేటి విద్యా విధానంలో పోటీ తత్వంతో పాటు చతుర్విధ పురుషార్ధాలు అయిన ధర్మ, అర్ద, కామ, మోక్షాలని తెలియజేసేలా ఉన్నా మన ప్రాచీన కావ్యాలను పాఠ్యాంశాలుగా పొందుపరిచి విద్యార్థులలో సత్ప్రవర్తన అలవడే విధంగా వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన నాడు సమ సమాజ స్థాపనకు యువత వారి యొక్క కృషి ఫలితాన్ని అందించగలరని నా అభిప్రాయం.

5. పాదసూచికలు:

  1. A sanskrit English Dictonary - sir Williams. Page no :510
  2. సూర్యరాయాంధ్ర నిఘంటువు- చతుర్థ సంపుటం, పుట. 401, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ
  3. సంగ్రహంధ్ర విజ్ఞాన కోసం- 5వ భాగం, పుట. 57
  4. విజ్ఞాన సర్వస్వం - 7వ సంపుటం (దర్శనములు – మతములు), పుట. 481, 482
  5. మనుస్మృతి, ద్వితీయ అధ్యాయం, శ్లో. 6
  6. గౌతమ ధర్మసూత్రములు - 1-1
  7. శ్రీమద్రామాయణము- అయోధ్యకాండము- 21వ సర్గ, శ్లో. 40
  8. శ్రీమద్రా మాయణము- అరణ్యకాండము- 9వసర్గ, శ్లో. 30
  9. మహాభారతం- కర్ణపర్వం- 69వ సర్గ, శ్లో. 59
  10. మహాభారతం- అరణ్యపర్వం - శ్లో. 312
  11. మహాభారతం- అరణ్యపర్వం- శ్లో. 315
  12. శ్రీమదాంధ్ర మహాభారతం – అరణ్యపర్వం- పంచమా శ్వాసం, పుట. 686

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఎఱ్ఱాప్రెగ్గడ. (2006) కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం, అరణ్యపర్వం, పంచమాశ్వాసం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి.
  2. తిక్కన సోమయాజి. (2012). శ్రీమదాంధ్ర మహాభారతం, కర్ణపర్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి
  3. పాపయ్యశాస్త్రి. కావూరి. (1996). శ్రీమద్రామాయణ కల్పవృక్షం- శ్రీరాముని మనుజ ధర్మం, వెంకటరమణ ముద్రణాలయం, వరంగల్.
  4. సూర్యరాయాంద్ర నిఘంటువు, చతుర్ధసంపుటం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.
  5. Sir monier Williams, (2011). A sanskrit English Distinary motilal banarasidass punlishers.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]