AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
22. హిందీ-తెలుగు నవలలు: ఆధునికగిరిజనజీవనం
డా. షేక్. బేనజీర్
హిందీ అధ్యాపకులు,
ఎస్.వి.సి.ఆర్. గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,
పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7382786328, Email: sbr.shaik0786@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో గిరిజనప్రస్తావన చాలా చోట్ల కనిపిస్తుంది. ఆ ప్రస్తావన కావ్యాలు ప్రబంధాలు ఆధునిక సాహిత్య ప్రక్రియలైన నవల ఆ నాటకం కదా కవితలలో ఉంది. గిరిని ఆధారంగా చేసుకుని బ్రతికే గిరిజనులు అంటే అడవుల పైన ఆధారపడి జీవించే వారు. విశాఖపట్నం మొదలు చిత్తూరు జిల్లా వరకు దాదాపు 33 గిరిజన తెగలు కనిపిస్తాయి. ఈ వ్యాససంగ్రహంలో గిరిజన నవల గురించి, గిరిజనసాహిత్యం గురించి, ఆధునికకాలంలో గిరిజనుల స్థితిగతుల గురించి పరిశీలించడమే ముఖ్య ఉద్దేశం. సమాజంలో గిరిజనులది ఒక ప్రత్యేకమైన జీవిత విధానం. వాళ్ల సంస్కృతి, సంప్రదాయం, ఆచారవ్యవహారాలు ప్రస్తుతసమాజంలో ప్రపంచీకరణ ఫలితంగా నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి. గిరిజన్లో కూడా సాహిత్యం నెమ్మదిగా దూరమవుతూ వస్తుంది. దానికి ముఖ్య కారణం అది మౌఖికమే తప్ప లిఖితం కాదు. మైదానాలకు దూరంగా కొండకోనల్లో జీవించేవారు గిరిజనులు. నాగరికతకు దూరంగా నివసించే వీరి సంస్కృతి, జీవనశైలి అత్యంత ఆసక్తిని గొలుపుతాయి. గిరిజనులలో ఉన్న మూఢనమ్మకాలు, వ్యవహారాల వల్ల దుర్భర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి నెలకొన్నది. సాహిత్యకారులు సమకాలినసమాజంలో గిరిజనుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఉన్నారు. అడవిలో వెన్నెల, అడివంటుకుంది, గోదావరి మన్యం కథలు, ఇప్పపూలు పోడుపోరు మొదలైన సంపుటాలు గిరిజనుల జీవితాన్ని కళ్ళకి కట్టినట్లు వివరిస్తాయి. మహా శ్వేతా దేవి బెంగాలీలో ఉన్న గిరిజనుల వెతులని బెంగాలీ భాషలో నవలలుగా రాశారు. అవి తెలుగులోకి అనువదింపబడినాయి. ఎవరిదీ అడవి, రాకాసి కోర, ఒక తల్లి, ఆమె రాసిన కథలు కూడా తెలుగులోకి అనువదించబడ్డాయి. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "తెలుగు కథా సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల గురించీ, సంచార జీవనుల గురించి కథలు రాసిన వాడు చింతా దీక్షితులు.
Keywords: అన్యాయం, నాగరికత, సంస్కృతి, ప్రకృతి, సాహిత్యం
1. ఉపోద్ఘాతం:
ఆధునిక సాహిత్య ప్రక్రియలలో కథ చాలా ప్రముఖమైనది. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ కథ ఆనందంతో పాటు సమాజంలోని సంఘటనలు కూడా కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. వర్ణనలు, సంఘటనలు క్రమ పద్ధతిలో ఉన్నప్పుడే కథకు గుర్తింపు కలుగుతుంది. సాహిత్యం లేని లోకాన్ని మనము ఊహించలేము. సాహిత్యం, సమాజానికి ఉన్న సంబంధం చాలా గొప్పది. అందుకే సాహిత్యం సమాజానికి అద్దం వంటిది అంటారు.
2. ప్రాచీనసాహిత్యంలో గిరిజన ప్రస్తావనలు:
ప్రాచీనసాహిత్యంలో గిరిజన ప్రస్తావనలను దృష్టిలో పెట్టుకొని విట్ట వేణుగోపాల్ "ఆర్యులు మాతృస్వామ్య పద్ధతిలో జీవించు నిమ్న జాతి స్త్రీలతో సంపర్కం జరపగా పుట్టిన సంతానం. తమ తల్లుల వద్దనే పెరిగి అటవీ ప్రాంతాలలోనే తమ జీవితాలను గడిపారు. వారంతా కూడా అనార్య సంప్రదాయాలను ఆటవిక లక్షణాలను కడిగి ఉండేవారు. పితృస్వామ్యానికి చెందిన వారంతా మైదానాలకు చేరి పెద్ద పట్టణాలు కట్టి నాగరికతకు పునాదులు వేస్తే మాతృస్వామ్యం వారు వీలైనంతవరకు అరణ్యాలలో ఉండి ప్రాకృతిక జీవితాన్ని అవలంబించారు అయినా వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం తెగిపోలేదు. మాతృస్వామ్యానికి చెందిన వారు అరణ్యాలలో ఉన్న వారంతా ప్రాచీన ఆటవిక సంస్కృతిని పెంచి పోషించారు. వీరిదంతా గిరిజన సంస్కృతే"1 అని అభిప్రాయపడ్డారు.
3. నవలలు – గిరిజనులు:
నవల జనజీవనాన్ని చక్కగా ఆవిష్కరిస్తుంది. ప్రధానంగా గిరిజనుల జీవితంలోని సాధక బాధకాలను అక్షరీకరించే క్రమంలో నవల ప్రధాన భూమికను పోషించింది. ముఖ్యంగా 20వ శతాబ్దంలో గిరిజనుల జీవితాలను ఇతివృత్తాలుగా గ్రహించి నవలలు రాయడం జరిగింది. ముఖ్యంగా 1982లో సాహు, అల్లం రాజయ్యులు ఉమ్మడిగా రాసిన కొమరం భీమ్ నవల మొదలు 2004లో జయశ్రీ మోహన్ రాజ్, ఎస్. మోహన్ రాజుల రాసిన 'తాండా' నవల వరకు గిరిజన నవలలు ఎక్కువ సంఖ్యలో వెలుపడ్డాయి. గిరిజన నవలలో వస్తువు ఇతివృత్తం గిరిజన జీవితాన్ని ఆశ్రయించి ఉంటుంది. హిందీ రచయిత్రి మైత్రేయి పుష్ప రాసిన 'ఇదన్నమ్' నుండి మెహ్రూనీసా పరవేసజ్ రాసిన కోర్జా ఉపన్యాసం వరకు గిరిజన జీవితాలను అక్షరబద్ధం చేశారు.
‘సోనాబాయి పరిణయం’ అనే నవలలో తొలిసారిగా తెలుగు నవలా సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావన చేయడం జరిగింది. లంబాడోళ్ళ రాందాసు నవలల్లో కథను చూసినట్లయితే గిరిజన తెగల్లో ఒక తెగైనటువంటి లంబాడీల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. లంబాడీల రోజువారి జీవితం వారి మాటలు, తిట్లు, ఆచారాలు, వ్యవహారాలు, వారి పండగలు, కొన్ని నమ్మకాలు, విశ్వాసాలు, మూఢనమ్మకాలు సైతం ఈ నవలలో రచయిత కొర్రపాటి గంగాధర్ రావు గారు చూపించారు. ఈ నవలలో రాందాసు గిరిజనే తరుడు 'చిక్కి' అనే లంబాడి అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుంటాడు. రాందాస్ మంచితనాన్ని, అతని వ్యవహార శైలిని తండావాసులు అంతా మెచ్చుకుంటారు. నెమ్మదిగా రాందాసు లంబాడోళ్ళ రామదాసు గా మారిపోతాడు. రామదాసు అంటే గిట్టని వాళ్లు రాందాస్ ని చంపాలని చూస్తూ ఉంటారు ఒకరోజు సింగం నాయకుడి కొడుకు చనిపోతాడు అతన్ని బ్రతికించమని తండావాసులంతా రాందాస్ని అడుగుతారు. అది చేయకపోవడంతో లంబాడోళ్ళు రాందాస్ ని చంపేస్తారు. రచయిత నవలల్లో లంబాడీల జీవితాన్ని అతి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. లంబాడోళ్ళ రామదాసు గిరిజన జీవితం ఉన్న తొలి గిరిజన నవలగా ప్రసిద్ధికి ఎక్కింది.
4. గిరిజన నవలలో జీవనచిత్రణ:
గిరిజన జీవితాన్ని నవలలుగా రాసిన నవలాకారులు గిరిజనుల సాంఘిక జీవనం, వారి ఆర్థిక రాజకీయ పరిస్థితులు, శ్రమదోపిడీలు, ఆధునీకరణ నేపథ్యంలో జీవనాధారులు కోల్పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురికావడం, ప్రభుత్వ పథకాలు గిరిజనులకు అందకపోవడం వంటి అనేక సమకాలీన విషయాలను ఈ నవలా రచయితలు తమ నవలలలో వివరించారు.
గిరిజనుల్లో గుస్సాడీ, దింసా, కొమ్ముకోయ, లంబాడీ స్త్రీ నృత్యం, నెమలీకల నృత్యాలు ఈ విధంగా ఎన్నో ప్రత్యేకమైన నృత్యాలను ప్రకృతి ఒడిలో ఆడటం మనకు గిరిజన నవలల్లో కనిపిస్తుంది. ఆధునీకరణ నేపథ్యంలో లంబాడి నృత్యాలు, గిరిజన సంస్కృతి కొత్తతరం వారి పట్ల చిన్నచూపు చూసే ప్రవృత్తి వలన పూర్తిగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది.
గిరిజన జీవనచిత్రణ చేస్తూ అందులో భాగంగా వారి బాల్యాన్ని పుట్టుకని సూక్ష్మంగా చూపించిన మరొక నవల ఏకుల వెంకటేశ్వర్లు రాసిన 'ఎన్నెల పువ్వు' యానాది నవల. 2011లో ప్రచురణమైన ఈ నవలలో యానాదుల జీవితాన్ని నేపథ్యంగా చేసుకుని కథ అల్లడం జరిగింది. ‘సిటికెలోడు’ అనే పాత్ర ద్వారా పిల్లల్ని విడిచి వెళ్లే సందర్భంలో దగ్గరకు తీసుకున్న తన బిడ్డలను మనసారా చూసుకున్నాడు. నూనె కూడా లేక అంటలు కట్టి చిక్కు పడ్డ తన పిల్లల తలలు పట్టుకొని తన చేతి వేళ్లతోనే జుట్టును ఆప్యాయంగా దువ్వాడు. మట్టిలో ఆడుకుని దుమ్ముకొట్టుకుని ఉప్పు సారికలు పట్టి ఉన్న ఆ బిడ్డల శరీరాలు ప్రేమగా నిమరుతున్నాడు సిటికెలోడు.'2
చదువు లేక బడికి వెళ్లే పరిస్థితి లేక మట్టికి సన్నిహితంగానే ఉంటారన్న విషయాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు. గిరిజన జీవితాల్లోని విద్యా వ్యవస్థ తీరుని చదువుకునే అవకాశాలు ఉండి కూడా పథకాల అమల్లో జరిగే అవకతవతలు, నిర్లక్ష్యాల వంటి విషయాలని చెప్పిన మరొక గిరిజన నవల పునరావాసం. రచయిత అట్టాడ అప్పలనాయుడు గారు అడవి మధ్య బ్రతికే గిరిజనులు జీవితాన్ని ఆవిష్కరించారు. నవలలో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లల స్థితిని చెబుతూ –
“మధ్యాహ్నం భోజనాలకు గంట మోగింది. పిల్లలంతా పల్లాల కోసం పరిగెత్తారు. ఆశ్రమ పాఠశాల ముందర భారత దేశ పటం ఆధారంలో క్రోటన్ మొక్కలు పెంచారు. వాటి మధ్య అన్నం డేక్ష, కందిపప్పు చారు తపేలా మోయించుకొచ్చి ఉంచేసి ఎటో వెళ్లిపోయాడు. పల్లాలు పట్టుకుని పిల్లలందరూ వరుసలో నిలిచినారు. పల్లాలు పట్టుకొని నిల్చున్న పిల్లలతో ఆ దృశ్యం భారతదేశం పటంలా కనిపిస్తుంది. ఓ విద్యార్థి అన్నం గరిటను మరో విద్యార్థి పప్పుచారు గరిటను పట్టుకుని వరుసలో కదులుతూ వస్తున్న భారత దేశ పటమాకారంలో నిలిచిన పిల్లలు ఒక్కొక్కరికి వడ్డెన చేస్తున్నారు.’’3
హిందీ రచయిత హిమాన్షి జోషి రాసిన ‘సమయ్ సాక్షి హై’ నవలలు వర్తమాన పరిస్థితులను చాలా చక్కగా వివరించారు. వాళ్ల మీద జరిగే అన్యాయాలు, పండిస్తున్న పంటలు కబ్జాకి గురు కావడం, పట్వారి వ్యవస్థ, గిరిజన యువతి లపై అత్యాచారాలు, పట్టపగలు గిరిజన వ్యక్తులపై తుపాకీ తో కాల్చడం ఇలా ఎన్నో అన్యాయాలను తన రచనలు పొందుపరిచారు. ‘అడవి తల్లి’ నవల లో పులుగు శ్రీనివాస్ గారు పోలీసుల గిరిజన గుడాలకు వచ్చి వారిపై జరిపే అత్యాచారాలను పత్రికా విలేకరుల నేపథ్యంలో వివరించారు.
“నా పేరు శ్రీమంతు సాబ్, వీని పేరేమో నారాయణ మాది కచ్చిబోజ్ జిల్లా సాబ్ అన్నాడు ఆ వృద్ధుడు భయం భయంగా...... మరి మీరు ఎందుకు దొంగల్లా అంతగా భయపడుతున్నారు అడిగాను నేను. మీరు పోలీసులా, ఫారెస్ట్ వాళ్ళ అని భయపడుతున్నాం సార్ అన్నాడతను. లేదులే మేము వాళ్ళం ఎవరమూ కాదు. పత్రికల వాళ్ళం, కాబట్టి రాసుకుంటున్నాం. అయినా వాళ్లంటే మీకు ఎందుకంత భయం? అడిగాను నేను అనునస్తున్నట్లు..... అమ్మో! వాళ్ళు వస్తే మాకు మూడినట్టే సార్ ! రొట్టెలు, మాంసం, సారా కావాలని కొడతారు తాగిన తర్వాత కంటికి ఎదురైన ఆడపిల్లలను పాడు చేస్తారు సాబ్ ! అన్నాడు ఆ వృద్ధుడు కళ్ళనీళ్ళ పర్యంతమై"4
దాశరధి రంగాచార్య రాసిన చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు జానపదనవలలు గిరిజన సమస్యని చిత్రీకరిస్తాయి. దాశరధి నిజాం రాజ్యం నాటి తెలంగాణ ప్రజల జీవితాన్ని ఇతివృతంగా నవలలు రాశారు. గిరిజనులు పడుతున్న బాధలను పై అధికారులు హింసిస్తున్న తీరును రచయిత మోదుగు పూలు నవలల్లో చిత్రీకరించారు. తెలుగు సాహిత్యంలో గిరిజన రచయితలు, గిరిజనేతర రచయితలు తమ నవలల్లో గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను గిరిజన సాహిత్యం లో పొందుపరిచారు. గిరిజన సాహిత్యాన్ని రాసిన గిరిజన రచయితలు చాలామంది ఉన్నారు వారిలో ప్రముఖులు నరహరి గోపాల కృష్ణమ శెట్టి, చింతా దీక్షితులు, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరధి రంగాచార్యులు, సాహు, అల్లం రాజయ్య, సాధన, బి.యన్ రాయలు, డాక్టర్ కేశవరెడ్డి, అప్పలనాయుడు, అరుణ, వసంతరావు దేశ్ పాండే, పులుగు శ్రీనివాస్, భారతి, ఫణి కుమార్, భూషణం, కలుకలూరి ఇనాక్, గీతాంజలి, విద్యాసాగర్, డాక్టర్ రాసాని.
హిందీసాహిత్యంలో మెహరున్నీసా పర్వేజ్ గారు రాసిన ‘కోర్జా’ నవల లో గిరిజన యువతులను, పట్టణ యువకులు మోసం చేసే తీరు వివరించడం జరిగింది. పట్టణ సంస్కృతిని అలవాటు చేసి తమ ఉద్యోగం అయిపోయిన వెంటనే తిరిగి పట్టణాలకి వెళ్లిపోవడం అక్కడ ఒక సాంప్రదాయంగా మారింది. గిరిజన యువతులు గిరిజన సంస్కృతి, పట్టణ సంస్కృతి మధ్య నలిగిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. పట్టణ సంస్కృతికి అలవాటు పడిన గిరిజన యువతులు ఆ గిరిజన తండాలలో నివసించలేక, పట్టణ యువకుల గురించి జాడ తెలీక పడే వేదనను రచయిత్రి చాలా చక్కగా వివరించారు. ఈ నవలలో సుమిత్ పాత్ర ద్వారా రచయిత్రి గిరిజనలలో మార్పు తేవడానికి ఒక ప్రయత్నం చేశారు.
"పట్టణ సంస్కృతికి అలవాటు పడకు ..... పట్టణ ప్రజలు మిమ్మల్ని దోచుకుంటారు, నిలువునా ముంచేస్తారు... ఈ మార్పు ఈ పట్టణం వైపు ఆకర్షణ వీళ్లను చాలా దుఃఖాలకి గురిచేస్తుంది."5
ఆదివాసీ మహిళలు వ్యక్తిగతమైనా, ఆర్థికమైనా తమ స్వేచ్ఛకు పిల్లలు విఘాతం కలిగిస్తున్నారని భావిస్తున్నారు. అందుకే వారిని నల్లమందుకు బానిసలుగా చేస్తున్నారు.
"శ్రామిక స్త్రీలు నల్లమందు కొని, వారి గొంతులో కొద్దిగా నల్లమందు రుద్దడం ద్వారా పిల్లలకు ఇవ్వండి, పిల్లవాడు నల్లమందు మత్తులో రోజంతా నిద్రపోతాడు మరియు వారే కూలీ పనులకు వెళతారు."6
అతడు అడవిని జయించాడు నవలలలో తాగుడు దుర అలవాటుని చిత్రీకరించారు. “ముసలివాడి గుడిసెలోకి వెళ్లి గోడకు వేలాడుతున్న దుత్తను రెండు చేతులతో తీసుకొని పెదవులకు అంటించుకున్నాడు. కల్లు నోటిలో కమ్మని రుచి కలిగిస్తూ గొంతు వెంబడి దిగి కడుపులో కుదురుకుంటుంది. ఒక్క పెట్టిన అతడు దూతను ఖాళీ చేసి గోడకు తగిలించాడు. పెదవులను తుడుచుకొని లొట్టలేశాడు"7
గిరిజనులు వారి పండగ సందర్భాలలో, నొప్పులని మర్చిపోవడానికి, వాళ్ళ బాధలను మర్చిపోవడానికి తాగుతారు అన్న విషయాన్ని కేశవరెడ్డి గారు బహుబాగా చిత్రీకరించారు.
కొమరం భీమ్ నవల రచయితలు గోండుల ఆహారపు అలవాట్లు ఎంత ప్రత్యేకత కలిగి ఉంటాయో వివరంగా వర్ణించడం జరిగింది. అడవి సర్వసరంగా భావించే అడవి బిడ్డలు అడవిలో దొరికేటువంటి ఆహార పదార్థాలను అదేవిధంగా జంతువేట ద్వారా దొరికే మాంసాన్ని, అలాగే ఆకుకూరలు, పండ్లు ఫలాలు, ఆహారంగా స్వీకరించడం ప్రధానమైందిగా కొమరం భీమ్ నవలల్లో సాహు, అల్లం రాజయ్య చిత్రీకరించిన విధానం ప్రశంసనీయం. అడవి జీవనాధారంగా జీవించే గిరిజనులు విప్పపూవు సారా, అంబలిని ఆహారంగా, మాంసాన్ని ప్రధాన ఆహారంగానూ స్వీకరిస్తారు. వారి సాంప్రదాయాలను పరిశీలిస్తే గుండులు తమ ఇళ్ళను దేవాలయాలుగా భావిస్తారు. చెప్పులతో ఇంటిలోకి ప్రవేశించరు.
ఈ నవలలో "క్యాకర్తే అన్నాడు కుర్దు అప్పటికే చెప్పులు తోడుకొని బంగ్లాలకు పోవడం అలవాటుగా మారింది."8
గోండుల సంప్రదాయం ప్రకారం చెప్పులు తడుక్కొని ఇంట్లోకి వెళ్లడం నేరం. సమాజం ఆధునిక ప్రపంచంలో ముందుకు దూసుకుపోతూ ఉంటే గిరిజన సమాజం ఆధునికతను అందుకోవడంలో పూర్తిగా విఫలం అవుతూ ఉన్నది. ఒకవైపు అభివృద్ధి చెందుతున్న నాగరికత సమాజం, మరొకవైపు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలను వదిలలేని స్థితి రెండింటి మధ్య గిరిజన సమాజం కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టు రచయితలు స్పష్టంగా వివరించారు.
5. ముగింపు:
గిరిజనుల సంస్కృతి ప్రత్యేకంగా ఉంటుంది గిరిజన్లో నమ్మకాలు ఎక్కువగా ప్రకృతిక శక్తుల నుండి తమరు తమ రక్షించుకోవడానికి తమ సమూహాన్ని కాపాడుకోవడానికి వేట చేసుకోవడానికి వ్యవసాయం చేసుకోవడానికి ప్రకృతి శక్తులపై ఆధారపడతారు అనగా ఆ సత్తుల్ని పూజించడం బలి ఇవ్వడం లాంటి విశ్వాసాలు నమ్మకాలు కలిగి ఉంటారు మానవుల్లో పెరిగిన మానసిక స్థితి జానపద లో మూఢనమ్మకాలు కలగడానికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని నమ్మకాలు మారాయి అని కూడా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం. గిరిజన ప్రాంతాల్లో నివసించే గుండెల జీవితాన్ని వారి స్థితిగతులను వివరించిన మరో నవల వసంతరావు దేశ్ పాండే గారు రాసిన అడవి. గిరిజనులు తిరగబడిన సన్నివేశాలు వాళ్లలో వచ్చిన మార్పు అడవి నవల లో అంతగా కనిపించకపోయినా భూమి కోసం వారు జరుపుతున్న సుదీర్ఘ పోరాటం ఈ నవలల్లో చిత్రీకరించడం జరిగింది. ఇది మార్పుకు సంకేతం అని చెప్పుకోవచ్చు.
గిరిజన నవలల్లో గిరిజన ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాలను చర్చించడం జరిగింది. ఈ నవల్లో ఎక్కువగా గిరిజన ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం కనిపిస్తుంది. చైతన్యం పొందడం మంచి దిశగా భావిస్తూ గిరి పుత్రులు అభివృద్ధివైపు నడుస్తూ కనిపించడం జరుగుతుంది. కానీ గిరిపుత్రులపై సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా దోపిడీ కొనసాగుతూనే ఉంది. వారి జీవన విధానం కూడా మారిపోతూ ఉంది.
6. పాదసూచికలు:
- విట్టవేలు గోపాల్, ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజన జీవన చిత్రణ, పుట - 65
- ఎన్నెల నవ్వు- వెంకటేశ్వర్లు, పుట - 100
- అట్టాడ అప్పలనాయుడు - పునరావాసం - 63
- పులుగు శ్రీనివాస్, అడవి తల్లి - పుట- 66
- మెహరున్నీసా ఫర్వేజ్ - కోర్జా- 107
- మెహరున్నీసా ఫర్వేజ్ - కోర్జా- 107
- డాక్టర్ కేశవరెడ్డి -అతడు అడవిని జయించాడు- పుట -6
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పలనాయుడు, అట్టాడ. (2010) పునరావాసం. సాహిత్యం రెండవ సంపుటం నాలుగు నవలికలు శ్రీకాకుళ సాహితి.
- కేశవరెడ్డి. (2012) అతడు అడవిని జయించాడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- గోపాల్ విట్టవేలు, (మార్చి, 2017) ప్రాచీనాంధ్రసాహిత్యంలో గిరిజన జీవనచిత్రణ. గిరిజనకెరటం. సామాజికసాంస్కృతిక మాసపత్రిక, హైదరాబాద్
- ఫర్వేజ్ మెహరున్నీసా. (2011). కోర్జా. మూడో ముద్రణ, వాణీ ప్రకాశన్, కాన్పూర్
- ఫర్వేజ్ మెహరున్నీసా . (2011). కోర్జా. మూడో ముద్రణ, వాణీ ప్రకాశన్, కాన్పూర్
- వెంకటేశ్వర్లు. (మార్చి, 2017). ఎన్నెల నవ్వు. గిరిజనకెరటం. సామాజిక సాంస్కృతిక మాసపత్రిక, హైదరాబాద్.
- శ్రీనివాస్, పులుగు. (1999) అడవి తల్లి కొమరం సోంబాయి. చేతన పబ్లికేషన్స్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.