headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

15. కర్నూలు జిల్లా కథలు: వస్తువైవిధ్యం

కె. వెంకటస్వామి

పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయన శాఖ,
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9052961440, Email: swamy.ma82@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్య ప్రక్రియల్లో కథాప్రక్రియ ఆనందదాయకమైన హల్లాదకరమైన మనోవైజ్ఞానిక ప్రక్రియ.మనిషిని ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ కొత్త ఆలోచనల్ని పెంపొందించి,సామాజిక పురోగాభివృద్ధి దిశగా నడిపిస్తుంది.సామాజిక సమస్యలు, మార్పులు, వైఖరులు, సాంప్రదాయాలు, అభివృద్ధి ఆటంకాలు, రాజకీయాంశాలు, సామాజిక వివక్షలు, ప్రాంతీయ వివక్షలతో కూడిన కథలు సాహిత్యంలోకి వచ్చాయి. అనేక రకాల ఇతివృత్త వైవిధ్యములతో కలగలిపిన కథలు సాహిత్యంలోకి విస్తరించాయి. కథాప్రక్రియల్లో రచయితలు తన అనుభవాలను, వాస్తవికతను,శిల్ప రూపంగా తీర్చిదిద్ది కొత్త, కొత్త సమస్యలను వస్తువుగా స్వీకరించి కథలను వెలువరించారు. కర్నూలు జిల్లా కథా ప్రక్రియ వైవిధ్యంలో, సామాజిక జీవనంతో ముడిపడి, స్థానికత సంబంధం, ప్రాంతీయతా భావాలు, ప్రాంతీయ వెనుకబాటుతనం, ప్రాంతీయ వివక్షతలు, ప్రాంతీయ రాజకీయ పరిణామాలతో కథలు వచ్చాయి. గత రెండు దశాబ్ధాల నుండి రచయితలు ఏదో ఒకే కథా వస్తువును కాకుండగా ప్రాంతీయంగా ఉండే ప్రతి సమస్యను, మార్పును, భవిష్యత్ ప్రణాళికను గుర్తించేటట్టుగా, వాస్తవిక పరిస్ఠితులకు ప్రతిరూపాలుగా, ప్రతి సామాజికాంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పట్టికప్పుడు కర్నూలు జిల్లా కథా సాహిత్యంలోకి వైవిధ్యమైన కథలకు శ్రీకారం చుడుతూ రచయితలు కథా ప్రక్రియలో నూతన అధ్యయానికి నాంది పలికినారని స్పష్టంగా చెప్పవచ్చు

Keywords: కర్నూలు జిల్లా కథలు, కథా ప్రక్రియ వైవిధ్యం, సాంస్కృతికాంశాలు, ప్రాంతీయ అస్థిత్వం, రాజకీయాంశాలు, సామాజికాంశాలు, స్థానికాంశాలు, ఆధునిక ధోరణులు, ప్రాంతీయ స్పృహ, కర్నూలు జిల్లా కథా రచయితలు.

1. ఉపోద్ఘాతం:

కర్నూలు జిల్లా కథా రచయితలు ఎవరికి వారే ప్రత్యేకమైన శైలితో రచనలు చేశారు, చేస్తూనే ఉన్నారు. భవిష్యత్లో కూడా కొత్త ప్రయోగాలకు అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన కథా సంపుటాలలో ఆలోచనా ప్రతిపాదనల మీద రాస్తే, మరికొన్నింటిని ప్రస్తుతం ఉన్న కొత్త ఆలోచనా విధానాన్ని పుణికిపుచ్చుకొనేలా రాశారు. ఇలా ఆలోచన తీరు రచయితలకి ఉండటం వలన స్పష్టంగా కథా ప్రక్రియలో వైవిధ్యమైన వస్తువుకు చోటు దక్కినదనే చెప్పవచ్చును. వైవిధ్యమైన కథా వస్తువుతో వచ్చిన కథలు తాత్విక ఆలోచనల నుండి సామాజిక ఆలోచనలకు, ఆ తరువాత స్థానికతతో సంబంధంకు దారితీసేలా ఉన్నాయి.

2. రైతు సంబంధకథాప్రక్రియ:

పినాకపాణి రాసిన కొన్ని కథా ప్రక్రియల్లో కథ, కథకు పూర్తి స్థాయిలో వైవిధ్యము కనిపిస్తుంది. “నది పారని నేల”అనే కథలో ‘బతకడం కష్టం’ అనే మాట వినగానే ఈడిగ లింగన్న శవం కళ్లలో కనిపించింది,ఏమి చెప్పాలో తెలియక కాళ్లలో వణుకు మొదలైంది గణేష్ కి. ఎందుకంటే శనగ పంట చేతికొస్తే దానిని అమ్మడానికి మార్కెట్ కి వెళ్ళిన లింగన్నకు చేతిలోకి రెండువేల రూపాయలు మాత్రమే వచ్చాయి. కానీ సేద్యానికి పెట్టుబడి అయిన ఖర్చు నాలుగు లక్షలు అప్పుగా మిగిలింది. పోనిలే ఈ సారికిలా అయింది ఇంతే మరొక పంటకైనా వస్తుందనుకుంటే అదీ కూడా జరగనిది ఇది ప్రతీ సంవత్సరము ఎదురయ్యే సమస్యనే వానలు కురిసేది లేదు,పంటలకు ధర దొరికేది లేదు. చేతికొచ్చిన రెండు వేల రూపాయలను తీసుకొ అప్పులు ఎలా కట్టాలని దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు ఆడపిల్లలు, భార్య దిక్కులేని కుటుంబం అయింది. ఇది కేవలం ఒక రైతు కుటుంబంకి సంబందించినది.కానీ ఆ లింగన్న చనిపోయిన రెండు దినాలకు గణేష్ తమ్ముడికి ఫోన్ చేస్తే అవతలివైపు-నుండి వచ్చిన సమాధానం "అన్నా నాకు భయమైతుందన్నా "ఈడ బతకడం,చాలా కష్టంగా ఉంది,చెఱువులో నీళ్ళు వదులుతామని చెప్పడమే అదీ కనిపించడం లేదు, తినడానికి తిండి లేక అలమటిస్తుంటే ఫైనాన్సోడెమో వడ్డీ కట్టమని ఒక్కటే వేదింపులు, సుగ్గికి పోదామంటే నీ మరదలకు ఒక్కటే కడుపు నొప్పి అంటుంది. మరీ ఏమి చేసేదన్నా కర్నూల్లో ఏదయినా అంగట్లో సంచులు మోసేదో, మూటలు కట్టేదో పని చూస్తవా?"-1 అని చెప్పిన సమాధానంతో గణేష్ కాళ్లలో వణుకు మొదలైంది.ఈ కథలోని సమస్య ఒకరిదిగా ఉంటే,ఆ సమస్య కళ్ళెదుట ఉండే కుటుంబంలోకి పాకుతూ చివరికి సమాజం అంతటికి పాకుతుంది. మరి ఇలాంటి సమస్యల పరిష్కారమునకు స్థానికమైన సమస్యా పరిష్కార మార్గాలు అవసరం. లేదంటే విప్లవ పోరాటంతో కూడా పరిష్కరించవచ్చును అని ఒక విప్లవ ఉద్యమకారిణిగా సుజాత వంటి పాత్రతో కథా వస్తువును మలిచిన తీరుతో పాణిని గారి యొక్క కథా వైవిధ్యం ఎంతలా రూపుదిద్దుకొన్నదో తెలియజేస్తుంది.

3. సామాజికవైవిధ్యకథాప్రక్రియ:

పౌరోహిత్యం  చేస్తూనే, సేద్యంపై మమకారంతో బతికిన కుటుంబం నుండి వచ్చిన కథాసేద్య రచయిత, రాయలసీమ కథాసాహిత్యంలో ప్రామిస్డ్ రైటర్ గా గుర్తింపు పొందిన కర్నూలు కథారచయిత మారుతి పౌరోహితం. ప్రతి కథలోనూ ఒక ఆ ఒదార్పు, ఒక నిటూరార్పి, అప్పటికప్పుడు మొలకెత్తే ఆశల కంటి పొరలపై కన్నీటి మేఘం కమ్ముకొనేటట్లుగా ప్రతి కథలో ఒక బలమైన నిజ జీవిత సంఘటన చుట్టూ కథంతా తిరిగేలా వాస్తవిక జీవితానికి ప్రతిబింబంగా తీర్చిదిద్ది ప్రాంతీయ భాషతో,ప్రాంతీయతకు పరిమితమైన కథానిర్మాణంతో సామాజిక చైతన్యము కల్గించే వైవిధ్యమైనటు వంటి కథలు జీవం పోసుకున్నాయి.”ఊరిమర్లు” కథలోని మనిషి మమకారంను,మట్టిని నమ్ముకుని బతుకీడుస్తున్న రైతు చుట్టూ కబళించిన దోపిడి, ఆర్థిక పరిస్థితులు, మానవ సంబందాలు అనేది ఏదీ కూడా దూరం చేయలేవు అని వెంకటేసు పాత్రతో ముడిపెట్టి తెలియజేశాడు.దేవుని భూమి ఇనాంగా ఇస్తే దానికి పరిహారంగా వెంకటేసు ఆ ఊరి దేవాలయంలో పూలుకట్టేపని,పెళ్ళిలప్పుడు బాసింగాలు కట్టేపని, కల్లంకాడ గింజలు, ఆకు పూజలపుడు ఆకులు ఎక్కించడం, సేద్యంలోనూ, పండుగలప్పుడు, ఉత్సాహవాలలోనూ, నాటకం వేయడంలోనూ వెంకటేసును మించినవాడు ఎవరూ లేరని అలాంటి వెంకటేసు భవిష్యత్లోకి కాలం అనే దారిలో మార్పులు వచ్చి నీళ్ళు పారుతున్న కాలువలోకి నీళ్ళు రావడం ఆగిపోయాయి, పిడికెడు గింజలు దొరికేది కష్టంగా అయింది, ఎద్దులకు మేతలేక సంతలో అమ్ముడున్నాడు, చివరికి కుటుంబం గడవ లేని పరిస్థితులు వస్తే  భార్య ఈరమ్మ వేరే ఊరికి వెళ్ళి బతుకుదామంటే “ఊరు ఇడిసేకి సుతారముగా ఒప్పుకోల్యా, గిడ్డయ్య గుడిని, సేనుని ఇడిసిపెట్టి యాకిచ్చేదిలేదు. తల్లిలా ఇన్ని రోజులు సాకిన పొలాన్ని బీడు పెట్టడానికి మనస్సు వొప్పదు. కాలం అనేది ఒక్కొక్క సారి ఇట్లా,అట్లా అయితే ఉంటుంది ఓపిక పట్టాల్ల”-2 అని పుట్టిన ఊరిపై, పుట్టిన మట్టిపై, మమకారంతో భార్య పిల్లలకు దూరంగా ఒంటరి జీవితంతో జీవిస్తూ ఊరి కాలువల్లో మళ్ళీ నీళ్ళు తీసుకుని రండి అని ముందు తరానికి తెలియజేసిన వెంకటేసు పాత్రతో కథలో మానవ విలువలు, బంధాలు, అనురాగాలు, స్నేహం, బ్రతుకులు ఎలా ఉంటాయి అనడానికి నిదర్శనమైన సామాజిక కథా ప్రక్రియగా నిలిచిపోయింది.

4. రాజకీయవైవిధ్యం:

రాయలసీమ కథా ప్రక్రియల్లో రచయితలు చరిత్రలో జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రజాస్వామ్యంలో రాజకీయ ఎత్తుగడులకు,వారి వాగ్దానాలకు ఎక్కడా పొంతన ఉండదు.కేవలం సమాజాన్ని నమ్మించడమే పనిగా కాలం గడుపుతున్న రాజకీయాలను,వారి అబద్దపు వాగ్ధానాలు,వారి అధికార కాంక్ష కోసం దేనినైనా రూపురేకలను మార్చగలరనే వాస్తవికతతో వచ్చిన కథగా “శవాల ఖజానా”లో ప్రజాస్వామ్యానికి ఈ రాజకీయాలు ఎంత ప్రమాదకరమో నేటి రాజకీయ పరిస్థితులను చూస్తేనే తెలుస్తుంది.అయితే పాణి రాసిన శవాల ఖజానా కథ ద్వారా సమాజాన్ని రాజకీయం ఏవిధంగా బలి తీసుకుంటుందనే వాస్తవిక నిజాన్ని తెలియజేసేందుకు ప్రపంచాన్ని జయించే వరం కోసం మాంత్రికుడు రోజుకో అందమైన అమ్మాయిని అమవాస్య నుండి అమవాస్య దాకా బలి ఇవ్వాల్సిందే అన్నట్లుగా తెలియ పరిచాడు. “మీ నగరంలో రోడ్లు విశాలం చేస్తాం...పదమూడు వేల ఇండ్లు కట్టిస్తాం....ఈ సీమ సమస్యను తీరుస్తాం...కరువుతీరా నీరందిస్తాం…అభివౄద్ది మా విధానం. ఇక నగర వాసులు బతికేందుకు ఇంతకు ముందులా కష్టపడాల్సిన పని లేదు.మీ అభివృద్ది మా భాద్యత అది మాకు వదిలేయండి. మీరు చేయలిసిందల్లా ఒక్కటే రాబోయే ఎన్నికల్లో యాభై వేల ఓట్లతో మా అభ్యర్థిని గెలిపించండి”-3 అని అంటూ రాజకీయ నాయకుల వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతున్న విషయాన్ని తెలియజేసాడు.

రచయిత రాజకీయ నేతలు తమ పదవుల కోసం, తమ రాజకీయ జీవితం కాపాడు కోవడం కోసం అభివృద్ధి అనే మాటను అస్త్రంగా చేసుకొని ప్రజాస్వామ్యం మీదికి ప్రయోగించి సమాదులు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు తన సంపదను పోగు చేసుకోవడం కోసం ఎంత మంది రైతులు చచ్చిపోయినా,అభివృద్ధి మార్గాన్ని వదిలి పెట్టి,అభివృద్ధి అనే పేరుతో పోయేవాళ్ళు పోనీ… ఇంకా ఈ రాష్ట్రంలో ఎందరు  లేరు? అనే దృక్పథంతో రాజకీయాలు,వాటిలో ఉండే వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు వంశపార్యంపరం అన్నట్లుగా ఆచరిస్తున్న పద్దతిని ఎండ గట్టిన తీరును శవాల ఖజానా కథలో అవగతమౌతుంది. చరిత్రలో నాగరికత అనవాళ్ళు భవిష్యత్ ప్రణాళిక సూచికలుగా అయితే దానికి విరుద్దంగా నేటి సమాజంలో రాజకీయ పరిస్థితులు మాత్రం పారుతున్న నది ఎండిపోయాక ఆ ప్రాంతం జనాలు కరువు వాత పడి చనిపోవడంతో వాళ్ళ శవాలే శిలాజాలుగా కనిపిస్తాయి అనేది నిజమైవుతుంది. ఎందుకంటే నేటి ప్రజాస్వామ్యంలో నాగరికత చిహ్నాలకు విలువ నిచ్చే పరిపాలన కనిపించదు, కేవలం మెజారిటీ, పదవులు, ఆస్థులు కాపాడుకోవడం, సంపాదించడం, పొలిటికల్ అట్రాక్షన్, ఉన్నతమైన హోదా, హంగులూ, ఆర్భాటూలు, వ్యాపారాలకు ప్రాధాన్యతను కల్గిండేటట్లుగా రాజకీయాలు ఉన్నాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

5. సాంస్కృతికాంశాల వైవిధ్యం:

రాయలసీమ ప్రాంతము భౌగోళికంగా ఎంత ప్రత్యేకమైనదో ప్రజాజీవన విధానం,వారి భాష,సాంస్కృతి సాంప్రదాయాలల్లో కూడా అంతే ప్రత్యేకమైనది.నాగరికతల్లో మార్పు వచ్చినప్పుటి నుండి సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవు తున్నాయి.కానీ రాయలసీమ ప్రాంతంలో జనజీవనానికి తిండికి కష్టమున్నా పరువాలే లేదు కానీ కొన్ని సాంప్రదాయాలకు,ఆచారాలకు మాత్రం జీవపోస్తూనే ఉన్నారు.కర్నూలు జిల్లా కథారచయితలు తమ కథా రచనల్లో గ్రామీణ సాంస్కృతికాంశాలకు చెందిన కళారూపాలల్లోని "కుశలంబేగదా ఆంజనేయ" అనే కథలో ఉరుసు సాంప్రదాయమప్పుడు శ్రీరామాంజినేయ యద్దం నాటకం ద్వారా గ్రామీణులలో నాటక కళపై గల మక్కువను తెలియజేసేలా రచయిత రచించిన తీరు సాంస్కృతికాంశాల వైవిద్యతకు అద్దం పదుతుంది."యలే అన్నీ మీరే అనుకుంటే ఎట్లలే?ఉర్ల పెద్దా సిన్నా ఉండొద్దా?పెద్దమనుసులను ఒక మాట అడగాల కదా? డ్రామంటే ఉరికందరికీ సంబరం ఉంటాది. నీకి,నాకి ఒక్కటే కాదు. అందరూ సేయి పడితేనే డ్రామా ప్యాసు అయ్యేది. ల్యాకుంటే ఆ పెద్దమరీడోల్ల డ్రామా మాదిరి అయితాది సూడి"-4 అని కాజన్న అనే పెద్దమనిషి హెచ్చరించాడు.

కథలో గువ్వలదొడ్డి గ్రామ ప్రజలు ఉరుసును పురస్కరించుకొని గ్రామంలో నాటకం వేయాలనుకోవడం నాటకం ఏర్పాటుకు గ్రామపెద్దల నిర్ణయం, పొలాల పనులంతా చూసుకున్నాకే నాటకం నేర్చుకొనేలా ఉండేటట్లుగా కట్టుబడటం,నాటకం నేర్పించడానికి వచ్చిన మాష్టర్ కి ఇచ్చిన గౌరవం పల్లె ప్రజల కల్మషంలేని హృదయాలుగా కనిపించడం,కులమత భేదం లేకుండా నాటకంలో పాత్రలకు సరిపడ్డ వారినే నిర్ణయించడంతో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే వారికి కళలన్నా, కళాపోణనన్నా ఉండే గౌరవం, కళా సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో,ఆచారాలను కాపాడాలనే అభిప్రాయంతో రసూల్ రాముడి వేషం ఇచ్చినా అతడి గడ్డం తీయకుండానే పాత్రను అభినయించడం,రసూల్ కూడా రాముడి వేషం వేస్తున్నాను కదా! అని నిష్టలతో మాంసం,గుడ్డు లాంటివి కూడా తినకుండా ఏడు నెలలు పాటు రాముడి పాత్రకే అంకితమైన సన్నివేశాలను చిత్రించిన రచయితకు ప్రాంతీయంగా ఉండే సంస్కృతుల పట్ల మక్కువను అనుభవాలను,విలువలను,గ్రామీణ ప్రాంతీయ ఆదరాభిమాలను సమాజమునకు వెలకట్టలేని సంపదగా, వారసత్వ సంపదలు గుర్తుకు తెచ్చింది.

6. స్థానిక వైవిధ్యం:

కథా ప్రక్రియల్లో ఒక్కొక్క రచయితది ఒక్కొక్క శైలి ఉంటుందనడానికి నిదర్శనం కర్నూలు జిల్లా రచయితల కథా ప్రక్రియలను చదువుతున్నప్పుడు కథా ప్రక్రియల్లో ఉన్నటు వంటి వైవిద్యం అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రాంతీయంగా ఉండే విషయానికి ప్రాధాన్యతను కల్పించి కథగా మలిచిన విధానాన్ని బట్టి మిగతా కథలకు ఇక్కడుండే కథలకు వైవిధ్యము కనబడుతుంది. ఈ వైవిద్యానికి మరో ముఖ్యమైనది స్థానికంగా ఉండే యాసను అర్థవంతమైన భావోద్రేకాలు కలిగిన పాత్రకు తగిన భాషను అందించడం అనేది ఆ ప్రాంత పరిస్థితులు, జీవన విధానం తెలిసిన రచయితకే సాద్యమవుతుందని వివిధ కథా ప్రక్రియల్లో వ్యక్తమైంది. “వితరణ” కథలో-

“జయీభవ విజయీభవ! దిగ్విజయీభవ అనుకుంటూ అంజినయ్యోల్లింటి తల వాకిలికి కొడుతుండ్య. అది గురుతు అన్నమాట,ఆ యింటికి వొచి పొయ్యేరని,ఆతుక్కు కొంత మంది,ఈతుక్కు కొంతమంది లైను నిలబడి,ఈ పాటని ఒక్కొక్క లైనుని ఒక్కొ తుక్క ఉండేటోల్లు పాత మిద్దెల్ మన్ను రాలేతట్ల గెట్టిగా పాడతా ఉండిరి. పిల్లొల్ల అరుపులకి కుక్కలు బెదురుకొని పారి ఆంత దూరం పోయి కుయ్యో అని మూతి ఆకాసానికి ఎత్తి అరుస్తుండ్య! గాడిపాటీ కాడ ఉన్న ఎనుముగొడ్లు దబుగ్గున లేసి తలుగు తెంచుకొనెకి సూస్తుండ్య. ఇంటి ముందుకు పోతే పిల్లోల్లని ఎప్పుడూ ఉరికించే పింజరి గోకారోల్ల కుక్కని మాత్రం పిల్లోల్లే ఉరికిస్తుండిరి. కచ్చంతా ఆ పొద్దే తీర్చుకొంటుండ్రి. ఊర్ల ఉన్న కుక్కలు, దూడలు, పిల్లులు, ఆవులు, ఎనుములు పిల్లోల్ల అరుపులకి బేదిరెకొద్ధీ కోతి శ్యాష్టలు ఇంకింత సేస్తుండిరి”-5

బాల్యం జ్ఞాపకాలలో పల్లెల్లో దశరా పండుగ వచ్చిందంటే గ్రామంలో ఉండే హడావిడీలు, ఒకరికి మరొకరికి మధ్య ఉండే స్నేహభావాన్నీ, ధాన్యం సేకరించుట, బడిపిల్లలు అందరూ కలిసి ఊరంతా చందాలు పోగుచేసి వచ్చిన డబ్బుతో బొరుగులు,పప్పులు బెల్లం, బత్తాసులు తెచ్చుకోవడానికి కలిసికట్టుగా వెళ్ళిన బాల్యం అంతా ఊరి వీధులతోనూ, ప్రతి ఇంటి గడపతోనూ సంబంధం చెప్పలేని అనుభవంగా పల్లెటూర్లలో కొన్ని సాంప్రదాయాలను తెలుపుతూ, వైవిధ్యమైన కథల్లో రచయితలు కథావస్తువును రూపొందించారు. “ఇంగ కాల్వకి రిపేర్లుల్యాగిపేర్లుల్యా, యానాకొడుకన్నా పట్టించుకునేడనా? కాల్వ ఎండిపోయినంక బోర్లు కూడా ఎండిపాయ. ఊరంతా నాశనం అయ్యిడిస్య, ఎమోల్యాప్పా మా దరిద్రం ఇట్లుండాది”-6 అని అంజినయ్య అన్న మాటలకి ఆ కాల్వకి రైతుకు ఉండే అనుబంధంను తెలియజేస్తుంది.కాల్వ అనే కథలోని అనుమేసప్పా పాత్ర ద్వారా చిన్ననాటి గ్రామీణ జీవితం సాగిన తీరు,సొంతూరు విడిచిపెట్టి వెళ్ళిన వారికి మళ్ళీ కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి వస్తే అద్వానంగా ఉండే ఊరి పరిస్థితులు కనిపించడము,ఎండిపోయిన కాలువలు,బీడు భూమి పొలాలు,ఎండిపోయిన బోర్లుతో దరిద్రం అంటే ఇట్లుంటుందా?అన్నంతగా కథా వస్తువును తీర్చిదిద్దడంలో రచయితకి స్థానికతపై ఉన్నపట్టు వైవిద్యతకు అద్దం పదుతుంది. స్థానికంగా ఉండే పరిస్థితులకు సమస్యలను ఎవరో ఒకరు భుజం మీద మోసుకోవాలనే విషయం తెలిసిన యువకుడు గ్రామంలోని తాగునీరు,సేద్యం నీరు కోసం పోరాడుతుంటే మిగిలిన వాళ్ళు ఉండి ప్రయోజనము ఏమిటి అనే వాదాన్ని సమాజంపైకి వదలడం వలన ప్రజల్లో అంజినయ్య కొడుకు లాంటి విప్లవాదము కలిగిన వాళ్ళు అవసరమనే విషయాన్ని గుర్తుకు తెచ్చెలా రచయిత కాల్య కథల్లో చిత్రించాడు.

6. అస్తిత్వవాదవైవిద్యం:

మారుతి పౌరోహితం వంటి రచయిత ప్రాంతీయంగా ఉండే సామాజిక జీవనంపై మంచి పట్టున్నవారిగా“కెంపు” కథ ద్వారా ప్రాంతీయ ఆధిపత్యపోరు ఎలా కొనసాగుతుందో చదివేలా మలిచాడు. కర్నూలు జిల్లా గ్రామీణ ప్రాంతం అనునిత్యము ఏదో ఒక రకమైన సమస్యలు, సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వలసలు,ఫ్యాక్షన్,కరువులు,ఆత్మహత్యలు అప్పులు, అనేవి ఈ ప్రాంతంలో ఉండేవారిని ఎప్పుడూ చుట్టుముట్టే ఉంటాయి. వీటన్నింటి కారణం పలురకాలైనప్పటికీ? ముఖ్యమైనది మాత్రం ప్రాంతీయ అస్తిత్వం. ప్రాంతీయ అస్తిత్వంతో పాటు, ప్రాంతీయ స్పృహ, ప్రాంతీయ అస్తిత్వ చైతన్యం కూడా కనబడేలా చిత్రించాడు. బోయలు, కురువలు మెజారిటీగా ఉన్న ఊర్లలో రెండు, మూడు కుటుంబాలే ఉన్న గౌడల ఆదిపత్యం మెజారిటి ఎక్కువుగా ఉన్న కులాల మధ్య  దూరాన్ని పెంచి వారి అధిపత్యాన్ని ఎలా చెలాయించుకుంటారనేది తెలియజేస్తూ, బోయ కులాలకు, కురువ కులాలకు మధ్య ఉన్నటు వంటి దూరాన్ని తగ్గించేలా చేయాలంటే అది కేవలం రెండు కులాలకు వైద్యం చేయడమే పరిష్కారం అని గ్రహించే ప్రాంతీయ అస్తిత్వ స్పృహను, చైతన్యంను రచయిత బయటపెట్టాడు.“నిర్ణయం”కథలో-

 “బయటకు మంచి వారనిపించుకున్న మొగవాళ్ళు ఇంట్లో భార్యల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించేవారిని తను ఎంత మందిని చూడలేదు. ఎవరిదాకా ఎందుకు? తన భర్తే తనను మానసికంగా ఎంత వేదించలేదు, ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిచేవాడు? రోజుల తరబడి ఇంటికి వచ్చేవాడే కాదు జీవితం అంతా పేకాట అప్పులకే సరిపోయేది”-7 అని పార్వతమ్మ పాత్ర ద్వారా రచయిత కథలో అస్తిత్వవాదాన్ని బయటపెట్టాడు.

నిర్ణయం కథ స్త్రీవాదముతో వస్తే అందులో ఒక స్త్రీ వివాహం తరువాత కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో భర్త వైపునుండి ఆధిపత్యము బాధలను భరించి చివరికి వృద్ధాశ్రమం చేరుతుంది.వృద్ధాశ్రమంలో ఉన్న తల్లి బాధ్యత తెలిసిన, ప్రేమ కలిగిన కొడుకు తల్లికి తోడు వెతకడం మంచిదే అయినప్పటికీ ఆ స్త్రీ మూర్తికి మాత్రం అది బంధించే సంకెళ్ళె అవుతాయి అని చెప్పడమే కాకుండా అస్తిత్వవాదమునకు దారి తీస్తుందనే విషయాన్ని ప్రతిబింబించేలా రచయిత ప్రాంతీయ అస్తిత్వంలో మరో ముందడుగు వేసి “మాదార్ హులిగికి పోయి హైందవ సాంప్రదాయం ప్రకారం జోగతి తీసుకున్నడు. ఉచ్చంగి ఎల్లమ్మ గుడిలో ఉన్నాడు. అతను మా మతంలో లేన్నట్లే. మా సాంప్రదాయం మతేతరులను మా ఖబరస్తాన్ లోఖననం చేయడానికి ఒప్పుకోదు”-8  అని ఒక ముస్లిం మత పెద్ద చెప్పడంలో వివక్షత అర్థమవుతుంది.

సాంప్రదాయం, పితృస్వామ్యం అని చెప్పుకునే ఈ సమాజంలో మతాలలోనూ థర్డ్ జెండర్ కూడా అన్యాయానికి, వినక్షతకు గురవుతూ, కుటుంబం చేత, సమాజం చేత గుర్తింపు పొందడానికి చివరికి చావులోనైనా గౌరవం దక్కడం లేదనే వాస్తవిక జీవితానికి నిదర్శనంగా నాగవ్వ అనే యువత పాత్ర, మదార్ బీ వంటి పాత్రలతో “తృతీయ ప్రకృతి” కథలో హిజ్రాలు మొక్క జీవితాన్ని కథా వైవిధ్యంలో ఇనుమడింపజేశారు కథకుడు.

7. ముగింపు:

కర్నూలు జిల్లా కథా రచయితలు కలం నుండి వెలువడిన కథలు, కథాసంకలనాలు, కథాసంపుటాల్లో కొత్త కథా వస్తువును రూపొందించుటలో స్థానికాంశాలను, మారుతున్న జీవన పరిస్థితులను, సాంకేతిక పరిణామాలను, ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన మర్పులనూ అంచనవేస్తూ, భవిష్యత్ తరాలను ఆలోచింపజేసే కథా ప్రక్రియలను విభిన్నమైన ధోరణులతో రాశారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలోకి అడుగు పెట్టిన కథాప్రక్రియ వస్తువు వైవిధ్యానికి కొత్త మార్గదర్శకాలుగా మారి నూతన రచయితలకు కూడా భిన్నమైన పద్దతిలో రచనలు చేయడానికి మంచి ఉదాహరణలుగా సుస్థిరమైన స్థాన్నాని సంపాదించుకున్నాయి.

కథకులు తమ కథలన్నింటిన్నీ ఏ కథా వస్తువు ఏ ప్రాంతంలోని సంఘటనను కేంద్రబిందువుగా చేసుకొని మలిచారో ఆ వస్తువును, ఏమాత్రం సంకోచం లేకుండా డొంకతిరుగుడు తత్వం ఎక్కడా కథా ప్రక్రియలో  కనిపించకుండా, స్థానికంగా మార్పులను, రాజజీయంగా అభివృద్ధి లోపాన్ని, సామాజిక ఎదుగుదల అణిచివేతను, అస్తిత్వవాద ధోరణులను, సాంస్కృతికాంశాల్లో వచ్చిన మార్పులకు ఎక్కడా కూడా విస్మరించకుండా వెనుకబడిన కర్నూలు జిల్లా ప్రాంతం యొక్క మార్పు కోసం కథా వస్తువును బాణాలుగా సందించి ప్రాంతీయ వైరుద్యాలపై వదిలిన కథా ప్రక్రియలకు కర్నూలు జిల్లా రచయితల జీవితాలే కథా వస్తువుకు ముడిసరుకుగా తీసుకొని కొత్త కొత్త కథా ప్రక్రియలకు జీవం పోశారు.

8. పాదసూచికలు:

  1. నది పారని నేల: పాణి: పుట:115
  2. ఊరిమర్లు: మారుతి పౌరోహితం: పుట: 44
  3. శవాల ఖజానా: పాణి: పుట: 55
  4. కుశలంబేగదా ఆంజనేయ: మారుతి పౌరోహితం: పుట: 53
  5. వితరణ: మారుతి పౌరోహితం:పుట: 123
  6. కాల్వ:  మారుతి పౌరోహితం: పుట: 75
  7. నిర్ణయం: మారుతి పౌరోహితం:పుట: 99
  8. తృతీయ ప్రకృతి: మారుతి పౌరోహితం: పుట: 90

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కథలపంట. విరసం వర్క్ షాప్ కథలు. ఆంధ్రప్రదేశ్ విప్లవ రచయితల సంఘం, 2008
  2. చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. మన నవలలు మన కథానికలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ 2013
  3. దక్షణమూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు. నవోదయ పబ్లిషర్స్ విజయవాడ, 1988
  4. నారాయణస్వామి, బండి.  రాయలసీమ సమాజం-సాహిత్యం  పర్ స్పెక్టివ్స్  హైదరాబాద్, 2019.
  5. పాణి . నేరేడురంగు పిల్లవాడు కథలు.  విప్లవ రచయితల సంఘం, 2020
  6. మారుతి పౌరోహితం, ఊరిమర్లు. ప్రచురణలు కర్నూలు 2022
  7. శ్రీదేవి, కిన్నెర. సీమకథ-అస్తిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,  విజయవాడ, 2016.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]