headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. జనప్రియరామాయణము: సామాజికాంశాల విశ్లేషణ

తుళ్ళూరు రవి

పరిశోధక విద్యార్థి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం,
రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9959977393, Email: ravithulluru786@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సరస్వతిపుత్ర శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు రచనల్లో ఎన్నో పేరు పొందిన కావ్యాలు ఉన్నాయి. వాటన్నీంటిలో చెప్పుకోదగిన రచన 1979 సంవత్సరంలో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన జనప్రియ రామాయణము. ఈ రచనలలో నైతికత, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థ, సమసమాజం పట్ల గౌరవం, భాష, సంస్కృతి వంటి విషయాలను దర్శించడం కోసం ఈ వ్యాసాన్ని ఎంచుకున్నాను. ఈ పరిశోధనకు వివిధ గ్రంథాలయాలలో లభించిన పుట్టపర్తివారి రచనలు, వివిధ విమర్శగ్రంథాలలో వచ్చిన వ్యాసాలు ప్రధాన ఆకరాలు. అంతర్జాలంలో పుట్టపర్తి వారితో ఇదివరకే జరిపిన ముఖాముఖి ఈ పరిశోధనకు భూమిక వహించింది.

Keywords: సంస్కృతి, భాష, జీవనశైలి, నైతికత, పరిశీలనదృష్టి, రామాయణంలోని ప్రతీకలు.

1. ఉపోద్ఘాతం:

వేదం ప్రభు సమ్మితం. ఇలాగే జరగాలి అని చెప్తుంది. పురాణం మిత్ర సమ్మితం. మంచి చెడ్డలను స్పష్టంగా చెప్తుంది. కావ్యం కాంతా సమ్మితం. విషయాన్ని మెత్తగా, మనసుకు హత్తుకొనేలా చెప్తుంది. రామాయణ, భారత, భాగవత పురాణాలు భారతీయుల, తెలుగువారి ఆరాధ్య నిదర్శనానికి ప్రతీకలు. పంచమ వేదంగా భారతం ధర్మప్రతిపాదనతోపాటు రాజనీతిని, సమాజానికి ఉపయోగపడే విలువలు అందరికి చిరకాలముద్రను వేశాయి. భాగవతం నవవిధభక్తిమార్గాలతో భగవంతునికి భక్తునికి అనుసంధాన రాచబాటలను వేసింది. ఇక రామాయణం విశ్వమానవజగతికి అనుసరణీయమైన. ఆచరణాత్మకమైన కుటుంబ జీవనవైశిష్ట్యాన్ని, మానవీయవిలువలను అనుబంధాలను తెలిపే కావ్యం. రామాయణ దర్శనం మానవ సంపూర్ణ దర్శననానికి నిదర్శనం. అందుకే యుగాలు మారినా... తరాలు గడిచినా నిత్యపఠనీయంగా భారతీయ ఆదర్శాలకు నిలిచింది. మానవుని మనస్సుకి పట్టేలా అర్థం చేసుకొనేలా చదవడం వేరు. ఈ పురాణాలను మేము చదివాము అని గొప్పగా చెప్పుకొనేవారు ఎందరో... కానీ నిజంగా చదివితే వైయక్తిక జీవితంలోని ఆలోచన, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను దర్శించవచ్చు.

2. పుట్టపర్తి నారాయణాచార్యులు- పరిచయం:

1914 మార్చి 28న అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు. తల్లి కొండలమ్మ సంస్కృతాంధ్ర భాషల్లో, సంగీతంలో నిష్ణాతులు. తండ్రి శ్రీనివాసాచార్యులు మహాపండితులు. సంగీతం, నృత్యం, సాహిత్యరంగాలపై తండ్రివల్ల చిన్నతనంలోనే ఆసక్తి కల్గింది. స్వయం కృషితో సంస్కృతాంధ్ర, కన్నడ, మలయాళ, తమిళభాషలతో పాటు హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రవీణుడయ్యారు. వారి ఇంట్లో ఎల్లప్పుడూ పండిత చర్చలు, గోష్ఠులు జరగడంవల్ల వీరిలో చిన్న వయస్సులోనే సాహిత్యాభిలాష అలవడింది.

తిరుపతిలోని ఓరియంటల్ కళాశాలలో పుట్టపర్తి వారికి ప్రవేశం లభించలేదు. దాంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ సమక్షంలో సంస్కృతంలో ఆశుకవితాధారణ చేయడంతో, ఆశ్చర్యంతో ప్రిన్సిపాల్ పుట్టపర్తివారు కోరిన తరగతి కంటే పైతరగతిలో చేర్చుకున్నారట. పుట్టపర్తివారు 1940 ప్రాంతంలో ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూలులో తెలుగు పండితునిగా, తర్వాత అనంతపురం ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా, కడప రామకృష్ణ హైస్కూలులో 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యులుగా వున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించింది. పుట్టపర్తివారు 1990లో సెప్టెంబరు ఒకటో తేదీన కన్నుమూశారు.

కవిగా, విమర్శకుడిగా, వాగ్గేయకారుడిగా, అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా, అవధానిగా తెలుగు సాహితీ క్షేత్రంలోనేగాక – అనేక భారతీయ భాషల్లో విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన శ్రీ పుట్టపర్తి నారాయణదార్యులు సరస్వతీపుత్రులు, తెలుగు సాహిత్యంలో ఆయన కీర్తి అజరామరం.

3. రచనల పరిచయం:

పెనుగొండ లక్ష్మి(కావ్యం), షాజీ(కావ్యం), ఆశ్రుతర్పణము(స్మృతి కావ్యం), అగ్నివీణ (కావ్యం), పురోగమనము(కావ్యం), మేఘదూతము(కావ్యం), పండరీ భాగవతము(కావ్యం), జనప్రియ రామాయణము(కావ్యం), శ్రీ శ్రీనివాస ప్రబంధము(కావ్యం), శివతాండవం(కావ్యం), ఏకవీర(మళయాళ అనువాద నవల), చారుదత్త(ఆంధ్రానువాద నవల), సిపాయి పితూరి (కావ్యం), భామపాద్యము(కావ్యం), విభూతి శతకము(కావ్యం), బేదన శతకము(కావ్యం), అస్త సామ్రాజ్యము (కావ్యం) అరవిందుల రచనల తెలుగు అనువాదం అనేక రచనలు ఉన్నాయి.

పుట్టపర్తివారు చిన్నతనంలోనే తెలుగు, సంస్కృత భాషల్లో అవధానాలు చేశారు. తమ 18వ ఏటనే “పెనుగొండ లక్ష్మి” అనే మొదటి కావ్యాన్ని రాశారు. ఈ కావ్యమే వీరికి విశేష గుర్తింపు తెచ్చి పెట్టింది. వీరు 1938లో విద్వాన్ పరీక్షకు వెళ్ళగా, వీరి “పెనుగొండ లక్ష్మి” కావ్యం పాఠ్యగ్రంథంగా ఉందట. ఇది సాధారణంగా ఆశ్చర్యపరిచే విషయం. ఇలాంటి అనుభవం ఏ సాహిత్యవేత్తకు ఎదురుకాదని పుట్టపర్తివారే స్వయంగా పేర్కొన్నారు. అలాగే భావకవుల ప్రభావంతో రాయప్రోలు, విశ్వనాథ కావ్యాల ఆదర్శంతో వీరు తమ తొమ్మిదవ ఏటనే “షాజీ” అనే కావ్యాన్ని రాశారు. వివాహానంతరం పుట్టపర్తివారు “ఆశ్రుతర్పణము” అనే స్మృతి కావ్యాన్ని రాశారు. వీరికి సాహితీ. లోకంలో దీనివలన శాశ్వతస్థానం ఏర్పడింది. కారల్మార్క్స్ ప్రభావంతో “అగ్నివీణ”, “పురోగమనము”, “మేఘదూతము” అను కావ్యాలను సామ్యవాద సిద్ధాంతాలతో రాశారు. మరాఠీ, హిందీ సాహిత్యాల్లోని భక్తిభావం ఆయనను బాగా ఆకర్షించింది. తుకారాం, మీరాబాయి. వామ్డేవ్ వంటి భక్తుల చరిత్రలను “పండరీభాగం” అనే పేరుతో కావ్యాలు రాశారు.

తులసీ రామాయణం గానానికి అకూలంగా కంబ తులసీ రామాయణంలోని అంశాల్ని పొందుపరిచి “జనప్రియ రామాయణం” అను కావ్యాన్ని రాశారు. ఇది అసంపూర్ణం. దీనిలో కిష్కింద, బాలకాండలు మాత్రమే వెలువడ్డాయి. దీనికి 1979 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. బ్రహ్మాండపురాణంలో చెప్పిన వేంకటేశ్వరస్వామి కథను “శ్రీనివాస ప్రబంధము” పేరుతో కావ్యంగా రాశారు. వీరి రచనల్లో ప్రముఖమైంది “శివతాండవం”. గంభీరస్వరంతో, భావోద్వేగంతో ఆయన శివతాండవాన్ని పఠించడం వంటివి కవి విశేషాలు. వీరు తెలుగు కావ్య నిర్మాణమేగాక, అనేక ఇతర భాషల్లోకి అనువాదాలను కూడా చేశారు. వాటిలో అరవిందుల రచనలు, “ఏకవీర” మలయాళ అనువాదం, “దారుదత్త” ఆంధ్రానువాదం పేరు పొందినవి దాదాపు నూరుకుపైగా రచనలు చేశారు. పుట్టపర్తి నారాయణాచార్యుల వారి లేఖిని నుండి జాలువారిన మధుర కావ్యాలలో ఉత్తమ కావ్యంగా ఎంచదగింది జనప్రియ రామాయణం.

4. జనప్రియ రామాయణము:

కిష్కింధాకాండం యొక్క ప్రాధాన్యాన్ని గూర్చి ప్రముఖమైన శ్లోకమొకటుంది. “న జన్మనూనం మహతోనసౌభగం నవాక్ న బుద్ధి: నాకృతిస్తోషహేతు:/ తై యద్విశిష్టానపినో వనౌక సోచకార సఖ్యేబత లక్ష్మణాగ్రజ:” ఇది భాగవతం పంచమస్కంధంలోనిది. ఆంజనేయుడు పలికింది.

“ఉత్తమ కులం కాకపోయినా, చక్కటి వాక్కు లేకున్నా, దృఢమైన నిశితమైన బుద్ధి లేకున్నా, వికారమైన ఆకారం ఉన్నా, మాతో రాముడు సఖ్యాన్ని ఆచరించాడు. మమ్మల్ని అనుగ్రహించడానికే రాముడు దివ్య భవనాల్ని విడిచి అడవికి వచ్చినాడని వానరులమైన మేము భావిస్తాం” అని చెప్పిన దానిలో రాముడంటే వానరులకు, హనుమతునికి ఎంతటి భక్తిభావముందో గమనించవచ్చు. ఈ కిష్కింధాకాండం మైత్రీ ధర్మానికి ప్రసిద్ధమైంది. ఆంజనేయుడు రామభక్తుడుగా ఈ కాండలోనే ప్రసిద్ధుడవుతాడు.

తెలుగులోని రామాయణాల్లో మొదటిది రంగనాథరామాయణం. భారతీయభాషల్లో సాధారణంగా గ్రంధకర్తల పేర్లతోనే రామాయణాలు వెలిశాయి. వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, తులసీ రామాయణం మొదలైనవి. ఆధునిక కాలంలో కవులు వారి అభిరుచులకు అనుగుణంగా తమ గ్రంథాలకు పేర్లు పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం, పుట్టపర్తి నారాయణచార్యులు జనప్రియ రామాయణం మొదలైనవి.
పుట్టపర్తి నారాయణాచార్యులు వందకిపైగా గ్రంథాలు, ఆయన రాయని ప్రక్రియలేదు. మొదట జనప్రియరామాయణములో బాలకాండం, తర్వాత కిష్కింధాకాండం మాత్రమే రాశారు. మిగిలిన కాండలు రాయకపోవడానికి వారి మాటల్లోనే-

నారాయణ రచనలో మొట్టమొదట నేను కిష్కింధాకాండమే వ్రాసినాను. ఇందులో వాల్మీకి కవితా శక్తి పరాకాష్టనందుకొన్నదనే నా భావం. మొదట కిష్కింధమును వ్రాయడానికి కొంత భయపడినాను. కూడా. తరువాత ఒకసారి అకాడమి సమావేశాలలో పెద్దలు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, బెజవాడ గోపాలరెడ్డిగారు, దేవులపల్లి రామానుజరావుగారు తక్కిన పండితులు - వారి యెదుట కొంతభాగం చదవటం తటస్థపడింది. వారు రచన చాలా బాగుందన్నారు. దానితో ధైర్యం తెచ్చుకుని రామాయణ రచనకు ఉపక్రమించినాను......... బాలకాండ ప్రతులన్నీ యింట్లో మూలల్లో మూల్గుతున్నాయి. వాని జతకు యీ కిష్కింధాకాండ కూడా చేరుతుంది. పుస్తకాలు అమ్ముకోవడంలో కావలసిన మనస్తత్వం- నాలో సుతరామూ లేదని అనుభవం వల్ల చాలా బాగా తెలుసుకున్నాను. ఇక తక్కిన కాండలు వ్రాయడానికి యేమాత్రమూ మనస్సు పూనుకోవడంలేదు.” అని వారు వెలిబుచ్చిన దయనీయ పరిస్థితులేనని తెలుసుకోవచ్చు. లేకుంటే వారి లేఖిని నుండి మిగిలిన కాండలు కూడా వెలువడి, తెలుగు పాఠకులకు అందించే భాగ్యం దొరికేది.

పుట్టపర్తి వారు తమ జనప్రియ రామాయణాన్ని మొత్తం ఐదు భాగాలుగా రాశారు. మొదటి భాగాన్ని మొదటి పుట నుండి 93వ పుటవరకు, రెండవ భాగాన్ని 94వ పుటనుండి 182 పుటవరకు, 3వభాగాన్ని 183వ పుట నుండి 297వ పుట వరకు, 4వ భాగాన్ని 298వ పుటనుండి 399వ పుటవరకు, 5వభాగం 400 పుట నుండి చివరి పుట 548వ పుట వరకు రచించారు.
ఈ జనప్రియరామాయణాన్ని నిర్వచనోత్తరంగా రాశారు. అది కూడా సులభశైలిలో ఉంది. సామాన్యులు కూడా చదవగలిగే పద్ధతిలో రాశారు. అందుకే సర్వజనాలకు ప్రియమయ్యే రామాయణం కాబట్టి దీనికి జనప్రియ రామాయణమనే పేరు పెట్టారు.

రామలక్ష్మణులు రావణునితో హరించిన సీతను గూర్చి వెదుకుతూ అరణ్యమార్గంలో అణువణువూ వెతుకుతున్న సమయంలో బద్ధ శత్రువులైన వాలి సుగ్రీవులు కలహించుకొంటూ ఒకరినొకరు అంతం చేయాలనుకుంటున్నారు. రామలక్ష్మణులు అదే మార్గంలో వస్తున్నారు. అంతకు పూర్వం రామలక్ష్మణులను గురించి వినడంకాని, చూడటంకాని జరగలేదు. అందుకే వాలి మనల్ని అంతం చేయడానికి వారినిక్కడికి పంపిస్తున్నాడని, మనం వేరొక రహస్యప్రదేశానికి వెళ్ళడం మంచిదని హనుమంతునితో చెబుతున్నాడిలా సుగ్రీవుడు.

“సంతతమును నను సాధించుటకే
పంతము పట్టిన పాము వంటి యా
వాలి వీరినిటుఁబంచె గావలయు
నాపై రోషము లెసకొల్పీ......”
మనమిట నుండుట మంచిది గాదని
మనమున దట్టెడు మునుమున గనుఁడా
ధనువులు మహంసతలముల యందున
వ్రేలాడు వాసుకిఁ బోలినవి......” (కిష్కి, పుట:210) 

పాము పగబట్టిన శత్రువును అంతంచేసే వరకు పగ చల్లారదనీ, అలాంటి వాడే వాలికూడా మన మీదికి వీరిని పంపించాడు. వారి ధనువులు వాసుకిలాగా ఉన్నాయి. వాసుకి సర్పరాజులలో ఒకటి. అలాంటి  ధనుస్సులు కూడా శత్రువుల్ని పతనం చేయడానికి వెనుకాడడనీ తెలుతుంది. ఈ విధంగా కొన్ని వందల పద్యాల్లో రాసిన ఈ కిష్కింధాకాండము అచ్చ తెలుగు పదాలతో, సామాన్యుల దరిచేర్చారు పుట్టపర్తివారు.

లక్ష్మణుడు తన అన్నను గురించి మనస్సు ద్రవించిపోయేటట్లు హనుమంతునితో వివరించాడు. అది అంతా విన్న హనుమంతుడు ఇలా పలుకుతున్నాడు.

“మా విభుఁడగు సుగ్రీవుడు నిటులే
పడతిని గోల్పడీ - పుడమిని గోల్పడి
చెట్టుల పుట్టల జీవించుచు ను
న్నాడొక యనాధుడై నేడూ” (బాల, పుట:210)

బాధితులిద్దరూ తారసపడ్డారు. ఇరువురూ భార్యను పోగొట్టుకున్నవారే. రాముని విషయాన్ని లక్ష్మణుడు, సుగ్రీవుని విషయాన్ని హనుమంతుడు పరస్పరం తెలియజేసుకున్నారు. ఇరువురూ ఒకే రకమైన బాధలతో ఉన్నారు కనుకనే ఒకటయ్యారు. రాబోవు రామరావణ యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇది మొదలు హనుమంతుడు రామభక్తుడవుతాడు. అదే విధంగా సుగ్రీవుడు కూడా. రామ లక్ష్మణులను చూచి సుగ్రీవుడు వారి శరీరసౌష్టవాన్ని, వేషధారణను వర్ణించిన తీరులో క్షత్రియ కుమారులను మునుపెన్నడూ చూడని విధం తెలియజేశారు.

“దీర్ఘ దీర్ఘ భుజసారులు కార్ముక
ధారులు శరతూణీరులు శత్రువి
దారి ఖడ్గసంచారులు వీరులు .
వారలఁ గని భయమవదటీ!”(కిష్కి, పుట:350)

పొడవైన భుజకీర్తులు కలిగి, ధనుర్బాణాలతో శత్రువుల్ని తుదముట్టించుటలో గొప్ప వీరులైనవారిని చూస్తే ఎవరికైనా భయం కలగకుండా వుంటుందా అని సుగ్రీవుని అనుమానం. అది నిజమే. కపివరులకు ధనుర్బాణాల ప్రయోగం అంతవరకు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే అంత విశేషంగా వర్ణించారు.

ఏ చిన్న సంఘటనకైనా భయపడే సుగ్రీవుని చేష్టలకు హనుమంతునికి కొంత చికాకు, విసుగు కలింది. అందుకే-

అదిగో పులియన! నిదిగో తోక యని
యదురున బారెద వౌరా! బాగా
యెనులే! చపలులు వనచరులను పలు
కింతకు సార్థక మయ్యెనులే! – (కిష్కి, పుట:220)

అని హనుమంతుడు వానరుల గూర్చి పలికిన మాటలు సత్య సన్నిహితాలు. వనచరులు కనుకనే చపల స్వభావంగల వారయ్యారు. “అదిగో పులియన, నిదిగో తోక” అనేది లోకోక్తి. భార్యను పోగొట్టుకొని, సుగ్రీవుడు వాలి అంటేనే సింహస్వప్న మయింది కాబట్టి ఏది చూసినా వాలి తనను చంపడానికి ఏర్పాటు చేసినదిగా తలుస్తున్నాడు. లోకంలో అమితంగా ఆరాధించే భార్యను పోగొట్టుకున్న వాడెంతటి బలశాలి, వీరుడైనా కొంత మానసికంగా, శారీరకంగా బలహీనుడవటం సహజం. ఆ భావాలే సుగ్రీవునిలోను ప్రతిబింబింప చేశాడు కవి.

వాలి రామబాణ తగిలి కిందపడినప్పుడు పలికిన పలుకులు వాలి దయాగుణాన్నీ  తెలుపుతుంది. కానీ యుద్ధానికి వెళ్లే ముందు భార్యతో అన్న మాటల్లో వాలి ఎలాంటివాడో తెలుస్తుంది.

“తమ్ముడు ప్రియుడే! తమ్మునిలోఁ గల
గరువ మభీష్టము గాదు గదా! యా
గర్వమడంతును గాని సూర్యజుని
జంపను మానుము సంద్రమమూ”(కిష్కి, పుట:113)

లోకంలో సోదరులంతా కొంత స్వార్థపూరిత మనుస్కులై, దానికి తగ్గట్టే చేష్టలు కూడా కలిగి ఉంటాం. వాలిపైకి ఎంత దుర్మార్థుడుగా ఉన్నా, సోదరుడంటే ఒకింత అభిమానమున్న మనిషిగనే చిత్రించారు. అలాంటి వాలి రామబాణంతో నిహతుడైనపుడు రామునితో పలికిన పలుకులు వాలి గుణగణాల్ని, తన అంతరంగాన్ని తెలియజేసేవిగా ఉన్నాయి.

“సానుకోశుడు సరసుండనీ యిం
కేమేమో ప్రజలెన్నిన గుణములు
ఆ పొగడింతల కర్ధమిదేనా?

“అంగిట బెల్లం బాత్మ విషమ్మును
గలిగి పాపముల కలుకక పులుగ
ప్పిన కూపము రఘువిభుడని దెలియక
వచ్చింది”-
“పెద్ద వంశమట! విద్దెలు నేర్చితి
వట! పెద్దలకడ నధ్యయనం బట!
నీ యంటంటలు నిజమయ్యెనులే!
చేసిన పనితో శ్రీరామా!

“రాజకులంబని తేజుగలుగుద
ర్మంబని కపటవు మదితో వేసము
గట్టి తిరిదెదవు కాంక్షించిన ఫల
మేమో! తెలుపుము నెఱకాడా!” (కిష్కి, పుట:113)

ఈ ఘట్టంలో రచయిత తన్మయుడై వర్ణించిన తీరు కన్పిస్తుంది. అంతిమ ఘడియల్లో ప్రతి వ్యక్తి సత్య సన్నిహితాలే మాట్లాడతాడనడానికిని నిదర్శనాలు. ఆ సమయంలో పలికిన పలుకులు ప్రతి ఒక్కరిని మనస్సు కదిలిస్తుంది. అప్పటి వరకు లోకం దృష్టిలో వాలి దుర్మార్గుడైనా, ఈ సమయంలో ఒక ఆప్తుడుగా కనబడతాడు. ఇది కవి నేర్పుకి మచ్చుతునక.
విశాలాపురాధీశుని వీడ్కొని కొంతదూరం పోగా శ్రీరామ లక్ష్మణ విశ్వమిత్రులకు తమాల వృక్షం బహుళమైన వనం ఇక్కడ కన్పిస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు-

నెఱి నిక్ష్వాకుల నుండివారు నిమినుండి వీరునున్ మైథిలుల్
మఱి వైశాలికులున్ దమాలవని యీమధ్యంబునం దెల్లయై
గుఱుతై కానుగు చెట్లకై పొదలకై గూడన్ వివాదం బాటం
చెఱుగన్ బోరు తమాల కాననమ దిట్లే యెన్ని యేండ్లుండెనో! (బాల, పుట:787)

“వివాదంబటం చెఱుగన్” అన్న వాక్యంలో పుట్టపర్తి కైకొన్నట్లుంది. 
శ్రీరామ సుగ్రీవ సంభాషణలు, వాలి మాయావి దుందుభులతో రణం చేయటం జనప్రియ మనోజ్ఞభీకరాలుగా వర్ణించింది.

తనకే జయమని తలచును దుందుభి
తనకే జయమని తలచును కపిపతి
యిరువురి నడుమ జయేందిర సొగసులు
దొలుకగ బోబూచుల నాడెన్ (కిష్కి, పుట:770)

జయేందిరి దోబూచులాడటంలో కవితాకళ విరిసింది.

సుగ్రీవుడు వాలి బలానికి రాముని బలం ఎక్కువ కాదో అనే సంశయం కలవాడు. ఆ మాట చెప్పేందుకు ధైర్యం చాలదు.

కానీ వాలి యఖండ వీరతకు
కనుకలి సాక్ష్యము, కరాళమగు నీ
వీరత్వమునకు వినుకలి సాక్ష్యము
తలుపుము బలవత్తర మేదో! (కిష్కి, పుట:840)

శ్రీరాముని బలపరాక్రమాలను తగ్గించకూడదు. వాలిని జయింపగలడా? అనే సందేహం కార్యసాధన కావాలి. సుగ్రీవుని స్థితిని వివరించాడు.
తూర్పు దిశకు వెళ్తూన్న వినతునికి సుగ్రీవుడు మార్గంలోని కొండల పట్టణాల నదీనదాల విశేషాల తెల్పుతూండే ఘట్టంలో

కాళ్ళు గడిగి చక్రయుధునకు దన
కన్నె నొసగు భాగ్యమ్ములు విలిచిన
విష్ణుచిత్తునకు.........................(కిష్కి, పుట:337)
వినయంగా నమస్కరించమంటాడు.

5. జనప్రియరమాయణం భాష:

పదాలను ఎంపిక, పదబంధాలను, వాక్యాలకూర్పులోని వైవిధ్యం వంటి అంశాలన్నీ భాష జనప్రియ రామాయణంలో శైలి ఉదాత్తమైందిగా ఉంటుంది. సమయానికి అనూకులంగా చక్కని పదాలతో అర్థంవంతంగా చెప్పడం పుట్టపర్తికి తెలిసింత మరోక కవికి తెలియకపోవచ్చు.

వాల చాలనా భీల రూపిణే
ప్రావృషేణ్య ఘన పరమాద్భుత తన
వే! నిటలాంబర వేల్లిత తార్తీ
యీక నేత్ర! యని నలు డనియెన్
భృకుటీ నటన క్షోభ్య మాణ పొ
పస్త్యబలాయ! జ్వల త్కోట్యర్యమే
నిభ పూర్య దిశా నిస్తుల వానర ముఖాయ (కిష్కి, పుట:538)

ఇలాక అచ్చతెలుగు, నిబిడ సంస్కృత సమాసాలు సమయానూలకంగా  చెప్పిన సందర్భాలు దర్శమిస్తాయి.

5.1. పదప్రయోగాలు, నుడికారాలు, సామెతలు:

బాసాడె, మనసుమాలినవాడు, మగదిక్కు, ఎదసుమించుట, పొదుగంత సిగ్గు, ఎండమావులు దాహం తీర్చుట, తాతకు దగ్గులు నేర్పుట, కప్పఎలుగుపాము, కత్తికి గండగనఱకుట
ఎలమించు = బాగుగా పండిన అనే అర్థంలో
రవపాటు కాలము =  క్షణకాలం అనే అర్థంలో
కైజా= వాగె బిగించుట అనే అర్థంలో
ఇలాగే ఎన్నో తెలుగు పలుకుబళ్ళు, సామెతలు, నుడికారాలు ఉన్నాయి. సున్నితమైన భావాలు, పదప్రయోగాలు “ముక్కాలు మువ్వీసం” తేట తెలుగులతో ఉన్నా భాష పదాలు ఉన్నాయి.

6. వర్ణనలు:

6.1. ప్రయాణ వర్ణన:

గతి అంటే ప్రయాణం లేదా యుద్ధానికి బయదేరడం అనే అర్థం చెప్పవచ్చు. విశ్వామిత్రుని యాగరక్షణకు రామలక్ష్మణుడు పయనించడం వారి మిథిలా ప్రయాణం, దశరథుడు సపరివారంగా సీతారామ కల్యాణానికి మిథిలకు బయలుదేరడం, నాలుగు దిక్కులకు సీతాన్వేషణకు వానరలు వెళ్ళడం వంటి వర్ణనలు

ముత్తెముల జాలరులు
గుత్తుముగ వ్రేలాడు
తెలివి వెన్నెల యందలమ్మూ
గౌసల్య కులనిధానమ్మూ, తత్పార్శ్వ
మున నున్నది సుమిత్ర కనుల కావడులుగా
నానందమును బూని యర్యమ కులజ్యోతి
..................................................
ఒక నగర మేగునట్లున్నది ప్రయాణంబు
..................................................
నాల్గుదినముల త్రోవనడచినది....... దర్శనంబొసగె మిథిలయు.(బాల, పుట:210)

6.2. రణ వర్ణన:

విశ్వమిత్ర యాగ సంరక్షణ సమయంలో శ్రీరాముడు చేసిన యుధ్ధం, వాలిసుగ్రీవుల యుద్ధం, వాలి దుందుభిల యుద్ధం, సీతాన్వేషణకు వెళ్ళినపుడు అంగదుడు ఒక రాక్షసునితో చేసిన యుద్ధం అతి భీకరంగా వర్ణించాడు.

అదె వచ్చు నదె వచ్చె
నని రక్కసుల గుంపు
పడబారె పసి చెదరినట్లూ యమ మహిష
మది వెంటబడి తరిమినట్లూ, మిత్తి
యగ్గలిక సిగబట్టి కొని నిలువరించ యట్లు
యగ్గశువు కైవడి సుభాహు నూల్కొనియె(బాల, పుట:502)

6.3. సముద్రవర్ణన:

సీతాన్వేషణకు పంపేటప్పుడు సుగ్రీవుడు క్షీరజలధీ, వానరలు దక్షణ సముద్ర తీరంలో ఉన్నప్పుడు జరిగిన సముద్రవర్ణన-

అచటి సముద్రము నవలోకింపుడు
డనిలోద్ఢత భంగాకులమై రే
బవళులు శబ్దబ్రహ్మము తాండవ
మునరించు రంగము దలపించున్

ఒకచో బండిన యొప్పున గదలని
జలము లదానిని, సతలాకుల వాః
పూరమ్ముల నొకచో రభసంబుగ
నాడెడు నటులుండెడు దానిన్.......(కిష్కి, పుట:514)

6.4. మధుపాన వర్ణన:

కిష్కింధకాండలో సుగ్రీవ విషయంలో మధుపానవర్ణన చేశారు. అంతే కాకుండా లక్ష్మణుని దగ్గరకు వచ్చే సమయంలో తార స్థితి  వర్ణించారు.
స్తనమండల సాక్షాత్కృత పీయూ
షమయ మనాక్చంచల కలశభ్రమ
యై చిరత్న రత్నాంచితకుండల
రుచి కృత సిత ఘాట్టాణకయై
తార నడిచె గందర్పు యాఱవ
బాణము వడువున.....(కిష్కి, పుట:254)
ఈ విధమైన కమనీయ ఘట్టాలతో కూడి, అనేక వర్ణలతో, అచ్చమైన తెలుగు పదాలు,  రసరమ్య సన్నివేశాలతో చిత్రించిన జనప్రియరామాయణం ఒక మధుర కావ్యంగా తెలుగువారి హృదయాల్లో ఎల్లకాలం నిలిచి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 

7. ముగింపు:

రామాయణంలోని నైతిక విలువలు ప్రతిష్టాపన, మానవ విలువలు సత్యం, ధర్మం  ప్రస్తావన రాజ్యపరిపాలన వంటి విషయాలను  సోదాహరణంగా వివరించారు.

నేటి సమాజంలో యువకర్తలు యుగకర్తలుగా మారే క్రమంలో సమసమాజంలో జరిగే విషయాలను అవగాహన చేసుకోవాలి అంటే మన ఇతిహాసాలు వైపు తొంగిచూడాల్సిన అవసరం ఉంది.

కొత్తతరం నేడు మారుతున్న సమాజం ఎటువైపు పోతుందో అంచన వేయడం కష్టంగా మారుతుంది.

సమసమాజంలో దురలవాట్లకు ఎక్కువుగా గురి అవ్వడం జరుగుతుంది. వీటన్నింటికి అడ్డుకట్ట వేయాలంటే భారత చరిత్రలో ఉన్న సాహిత్య విలువలను తెల్సుకోవడం, చదవాల్సిన అవసరం ఉంది.

భారతం, రామాయణాల్లో మన సంస్కృతి, భాష, జీవనశైలి వంటి విషయాలు తెల్సుకోవడానికి ప్రతీక.

8. పాదసూచికలు:

  1. జనప్రియ రామాయణం - తొలిమాట : పుట : iii
  2. జనప్రియ రామాయణం, కిష్కి, పుట:514
  3. జనప్రియ రామాయణం, కిష్కి, పుట:254
  4. జనప్రియ రామాయణం, కిష్కి, పుట:337
  5. జనప్రియ రామాయణం, కిష్కి, పుట:538
  6. జనప్రియ రామాయణం, బాల, పుట:910
  7. జనప్రియ రామాయణం,బాల, పుట:502
  8. జనప్రియ రామాయణం పుట:  బాల.18 సర్గ నుండి నుండి 20శ్లో వరకు
  9. జనప్రియ రామాయణం పుట: బాల. 162 నుండి 175 పుట వరకు

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జానమద్ది, పుట్టపర్తి నారాణాచార్యులు ఇంటర్వూ- Archived from the original on 20202-07-12. Retrieved 2019-10-06.
  2. నాగయ్య, జి: 2022, తెలుగు సాహిత్య సమీక్ష, నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాదు. 
  3. నారాయణ రెడ్డి, సి: 1975, ఆధునికాంధ్రకవిత్వం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు.
  4. నారాయణాచార్యులు, పుట్టపర్తి:1938,  జనప్రియ రామాయణం, కిష్కిందకాండ,  యస్.జె.కె. పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు. 
  5. నారాయణాచార్యులు, పుట్టపర్తి:1938,  జనప్రియ రామాయణం, బాలకాండ,  యస్.జె.కె. పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.  
  6. నారాయణాచార్యులు, పుట్టపర్తి:1957, రాయలనాటి రసికత జీవనము, విద్యోదయ పబ్లికేషన్స్, కడప.
  7. రామమోహన్ రాయ్, కడియాల: 1980, తెలుగు కవితా వికాసం (1947-1980) సాహిత్య అకాడమీ ప్రచురణలు, హైదరాబాదు.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]