AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. అనంతపురం జిల్లా తెలుగు-కన్నడ జానపదగేయాలు
డా. కొంకా మల్లికార్జున
అతిధి అధ్యాపకులు,
కె.టి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
రాయదుర్గం, అనంతపురం జిల్లా.
సెల్: +91 7306112307, Email: malliactor@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
అనంతపురం జిల్లాభారతదేశంలో జైసల్మీర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా. ఈ జిల్లాలో వర్షపాతం తక్కువగాఉన్నాసంస్కృతి సంప్రదాయాలకు కొదవలేదు మీరు తమ కష్టాలను బాధలను మర్చిపోవడానికి శ్రమ చేసే సమయంలో పాటలు వాడుకుంటారు ఈ పాటలు వెలికి తీయడానికి అమ్మదూరు పి ఆలేరు బండమీద పల్లి వంటి మొదలైన గ్రామాలను పర్యటించి జానపద గేయాలను వెలికి తీయడం జరిగింది . ఇలా ఈ జిల్లాలో అనేక జానపద గేయాలు మరుగున పడ్డాయి. ఈ పాటలను వెలికి తీసి ఈ వ్యాసం ద్వారా తెలియజేయడమే ప్రధాన ఉద్దేశం.
Keywords: అనంతపురం జిల్లా జానపద సాహిత్యం గేయాలు
1. ఉపోద్ఘాతం:
అనంతపురంజిల్లా దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా కలిగి ఉండటంతో రెండు రాష్ట్రాలలోని సంస్కృతి సాంప్రదాయాలు ఈ జిల్లాలో కలిసిపోయాయి. కొన్ని సందర్భా లలో ఏది ఏ ప్రాంతానికి చెందిన సాంప్రదాయమో విడదీయడానికి కష్టమవు తుందంటే అతిశయోక్తి కాదు. ఇక భాషా విషయంలో చెప్పవలసిన అవసరం లేదు. ఇది సరిహద్దు ప్రాంతాలలో మరి ఎక్కువగా కనిపిస్తుంది .మీరు ఉదయం లేచిన మొదలు సాయంత్రం తమ పనులను ముగించుకొని విశ్రమించేంత వరకు నిరంతరం ఏదో పని చేస్తూ ఉంటారు. ఈ అలసటను తీర్చుకొనే సమయంలో గానీ, తమ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించే క్రమంలో గానీ గేయాలు పాడుకోవడం సాధారణంగా నేటికి జరుగుతూనే ఉంది. జానపద గేయాలను ఆంగ్లంలోని ఫోక్ సాంగ్స్ అనే పదానికి సమానార్థకంగాహళ్లియ, హడుగళ్ళు (పల్లె పాటలు) జానపదగీతేగలు జానపద గీతములు అని పర్యాయపదాలు కలవు.
గేయం, గీతం,గానం, పాట అన్న నాలుగు మాటలు నేడు దాదాపు సమానార్థకాలుగా వాడబడుతున్నాయి. గేయాన్ని గానం చేసేవారు గాయకుడు పాడేది పాడ ఒడేది గీతం.పాడాటానికి వీలైంది గేయం పాడదగింది గేయం అని నైఘంటికార్థం,. వీటితో పాటు గేయమానమైంది గేయం అని కూడా వ్యవహారంలో ఉన్నా గురజాడ రాఘవశర్మ గారు మృదుమధుర పద సమన్వతం గేయమంటారాయన. గేయం అనగానే ముందుగా జానపద గేయాలే స్పురిస్తాయి. జానపదులు అనే శబ్దంలో జానపదం అనగా జన బాహుళ్యానికి స్థానం, నివాసం అని అర్ధం. జానపద గేయాలలో నవరస భూయిష్టాలైన కరుణ,వీర, శృంగార,హస్యం, భక్తి వెలువరించేవి కోకొల్లలు. ఈ గేయాలే ప్రజా హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకొని నేటికి సజీవములై విరాజిల్లుతున్నాయి. జానపదగేయం మౌఖిక సాహిత్యానికి చెందినదై నియమాలకు అతీతమైంది. వీటిలో భాందర్య గేయాల్లో ఆత్మపరత్వం కనిపిస్తే,శృంగార గేయాల్లో సంబాషణరీతి కనిపించడమేగాక అపార జీవనానుభూతి చవి చూస్తుందనటంలో అతిశయోక్తి లేదు.
2. రెండు భాషల్లో జానపదగేయాలు:
జానపదులు శ్రమజీవులు వీరు తమ శ్రమను మర్చిపోడానికి అనేక జానపద కళారూపాలైన కోలాటం, చెక్కభజన మొదలైనవి ప్రదర్శిస్తుంటారు. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపం కోలాటం. అనాటి నుండి ఈనాటి వరకూ ఏ పనిని ప్రారంభించేముందైనా విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ పాడతారు.ఇది తెలుగు, కన్నడ రాష్ట్రాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
తెలుగు :
శరణు శరణు సేరనూ విఘ్నేశ్వరా
శరణు శరణు సేరనూ రామా
శరణు సేసేదమయ్యా శివుని ముద్దుల తనయా " 2 "
సిరులిచ్చి కృప చూడుమూ విఘ్నేశ్వరా " 2 "
మారేడు నేరేడు గరికా టెంకాయలూ " 2 "
గరిక టెంకాయలూ గణమైన కుడుములు " 2 "
నీకు అర్పన సేతుమూ విఘ్నేశ్వరా " శరణు శరణు "
కన్నడ :
నీను బారో విజ్ఞారాయ గననాథ
నిన్న గానమాడి నేనిదెవయ్యా గననాథ
యెక్కవ్వ కక్కేపత్రి గననాథ
నిమ్మ నత్తిమేలే బిళ్వ పత్రి గననాథ
నీను బారో విజ్ఞారాయ గననాథ
నిన్ను గానమాడి నెనిదెవయ్యా గననాథ.
మోటారు వ్యవస్థ రాకమునుపు రైతులు తామువేసిన పంటపొలాలకు నీరందించటానికి కపిలను వాడేవారు.ఈ క్రమంలో వీరు కావోయిల తొలుతు గంగమ్మ తల్లిని పైక్ కపిల పాటలు రెండు భాషల్లోను కనిపిస్తాయి. వీరు కపిల తోలే సమయంలో గంగమ్మ తల్లిని పైకి రమ్మని వేడుకుంటూ, తమ పంట పొలలకు బాగా నీరందాలని గంగమ్మని పైకి రమ్మంటూ పూజిస్తూ ఈ విధంగా పాడుకుంటారు
తెలుగు :
బాయికి మేమోచ్చినాము - బాయి గంగా మేలుకో
ఎద్దులు మేమిద్దరాము - బాయి గంగా మేలుకో
వలపుటెద్దు వగలుకాడు - దాపటెద్దు ధర్మరాజు
ఏడుకొండల యెంకటేషా - కాసుకొని సూడవయ్య
వలపుటెద్దు వగలుకాన్ని - వదిన కల్లు నుంచి తెచ్చి
దాపటెద్దు ధర్మరాజును - ధర్మవరము నుంచి తెచ్చి " బాయికి మేమోచ్చినాము "
కన్నడ:
బాయి గంగే ఈ సేకు బారమ్మ
ఒలుగెయ్యి బాసే కొడివేను
ఒలుగెయ్యి బాసే కొడివేను గంగమ్మ
నూరొందు పూజే తక్కండు ఓల్డు బారమ్మ
వొందేలే వొందడికే ఒందు తెంగినకాయి
ఒందు కొబ్బనకోలు తక్కుండుతాయి మునిగెరికి ఓరుడమ్మ
హెల్డ్ లే హెల్డ్డి కె హెల్డ్ తెంగిన కాయి
హెల్డ్ సెలిబిండి పిడిసె తక్కండు
తాయి బారమ్మ మునిగెరిగె
నూరెలె నూరడికే నూరు తెంగినకాయి
తక్కండు బందేగంగమ్మ తాయిబారే నీను మునిగిరిగె…….. అంటూ పాడతారు.
( ముత్యాలమ్మ ఎగుపల్లి గ్రామం- వయస్సు 48 సంవత్సరాలు)
జానపద సంస్కృతి, సంప్రదాయల్లో మగవారికన్నా స్రీలు చేయవలసిన ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో పిల్లల బారసాల సమయంలో, రజస్వల, వివాహ, శ్రీమంతం వేడుక మొదలైన సమయాలలో స్త్రీలు పాటలు పాడటం జరుగుతుంది.
3. వివాహ వ్యవస్థ:
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలలో మానవ జీవితానికి ముడిపడిన వాటిలో వివాహవ్యవస్థ ఒకటి. ఇది పెళ్లిచూపులు కార్యక్రమంతో మొదలవుతుంది. ఈ ఆచారాన్ని కొన్ని ప్రత్యేక నియమాలతో కూడి పాటిస్తారు. పూర్వం పెళ్లిచూపులకు వెళ్లేముందే వారి కంకణం తెలుసుకొని సరి కంకణం వారైతే సంబంధం చూసుకోవడానికి వెళతారు. పెళ్లిపీటల మీద కూడా పత్తికంకణం వారయితే తమలపాకుతో కూడిన దారాన్ని చేతికి కట్టించడం, ఉణ్ణి కంకణం దారులైతే నల్లకంబడితో కూడిన లేదా గొర్రె బొచ్చుతో కూడిన దారంను వధూవరుల చేత పరస్పరం ఒకరితో ఒకరికి కులపెద్ద కట్టిస్తాడు. జానపదులు పెళ్ళిసంబంధం అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడఅమ్మాయికి కాళ్లు, చేతులుబాగున్నాయలేవా అని, మాటలు వస్తాయో రావోనని పరి విధాలుగా పరీక్షిస్తారు. దీనినే పాటల రూపంలో క్రింది విధంగా పాడుకుంటారు.
అ) ముక్కోటి కొండమీద మున్నూరు దేవతలు " 2 "
మున్నూరు దేవతలు మున్నూరు జనులు " 2 "
జనులా మీరొచ్చిండే పనులేమి పనులు " 2 "
శ్రీలక్షి నీయింట సీతుండాదంట " 2 "
అయోధ్య రామునికి అడగానొస్తిమి " 2 "
మా సీత సిన్నాదే మేమియ్యలేము " 2 "
అంతకన్నా సన్నోడా అయోధ్యరామ " 2 "
నడిపించు మీసీతా నడపొద్దుతాను
నడిపించు మీసీతా నడకాచూద్దాము. " 2 "
నడకేమి చూసేవు హంసనడకల్లా " 2 "
పలకించు మీసీత పలుక చూద్దాము. " 2 "
పలుకేమి జూసేవే చిలకపలుకల్లా " 2 "
నగుపించు నీసీత నగువు చూద్దాము " 2 "
నగువేమి చూసేవు నారాయణ నగువ " 2 "
అంతకన్నా సన్నోడా అయోధ్యరా " 2 "
నడిపించు మీసీతా నడపొద్దుతాను " 2 "
నడిపించు మీసీతా నడకాచూద్దాము. " 2 "
నడకేమి చూసేవు హంసనడకల్లా " 2 "
పలకించు మీసీత పలక చూద్దాము " 2 "
పలకేమి జూసేవే చిలకపలుకల్లా " 2 "
నగుపించు నీసీత నగువు చూద్దాము " 2 "
నగువేమి చూసేవు నారాయణ నగువ " 2 "
నగువు చీరలు మీవాయ సీతామాదాయ " 2 "
రయికలూ మీవాయ రవిని మావాయ " 2 "
గంధాము మీవాయ గౌరీమాదాయ " 2 "
అయోధ్యరాముడికి అతగా నొస్తిమి. " 2 "
సీతారాముల పెండ్లి చేసేము మేము
(రామాంజనమ్మ , లింగమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ)
లింక్: https://drive.google.com/file/d/1KCN_lfBw4WYNe8KyuppemOn9eW8tvRIT/view?usp=drive_link
ఆ)
ఎవరమ్మామీరు మాయింట నుండేటవారు " 2 "
వివరమేలాగు తెలుపండమ్మామాకి
విన్నపాలు తెలుపండమ్మా మాకు
సుబద్ర నీ చెల్లెలా సుగుశాలి నీ చెల్లెలా " 2 "
సుబద్ర నీ చెల్లెలన్నా నేను భాగ్య సంపన్నురాలినన్నా
వచ్చివాకిట నిలిచి వాదింప జేసేవు
వచ్చిన పనులేమమ్మా నీవు వచ్చిన పనులేమమ్మా.
వెయ్యావులు చిన్నా వానికి వెయ్యావుల చిన్నాదాన్ని
వియ్యాములడగా వస్తినన్నా నేను " 2 "
ఇచ్చేకేమి ఇచ్చినగానీ కుచ్చుల చెడినివ్వడు.
ఎచ్చుకాడక్కా బావ అతడు బోగచ్చుల కాడక్కా భావ
ఎచ్చుగా మమ్ముజాకి మొచ్చినయ్యాకిచ్చి
వెచ్చుతగ్గావు లెంచు న్యాయమా వన్నా " 2 "
చదువున నా పుత్రుడు సమురంతుడు నీ యల్లుడు. " 2 "
చదువుతో కజ్జుమంతుడన్నా పల్లుడు. " 2 "
చదువున నీపుత్రుడు సమురంతుడల్లుడు కాదని " 2 "
ఇచ్చేకేమి ఇచ్చినగానీ కుచ్చుల చెడినివ్వడు.
ఎచ్చుకాడక్కా బావ అతడు బోగచ్చుల కాడక్కా భావ
ఎచ్చుగా మమ్ముజాకి మొచ్చినయ్యాకిచ్చి
వెచ్చుతగ్గావు లెంచు న్యాయమా వన్నా
చదువూన నా పుత్రుడు సమురంతుడు నీ యల్లుడు.
చదువుతో కజ్జుమంతుడన్నా వల్లుడు.
చదువూన నీపుత్రుడు సమురంతుడల్లుడు కాదని " 2 "
బామాలందరూ చెప్పేరక్కా నాతో చేడీలు చెప్పేరక్కా " 2 "
ఆమాట వారు పలికేరు జనులెల్లా " 2 "
ఆమాట మరియు నొంచద్దన్నా
ఇచ్చేకేమి ఈకున్నా వియ్యాము లేకున్నా " 2 "
వొదిన్నడిగి చెప్పేరన్నా నీవు మా వొదిన్నడిగి చెప్పేరన్నా
ఏమేఏమే భామా యింటివా మాటలన్నీ
సమ్మితి మేమే ముద్దుగుమ్మాన్నీకి " 2 "
సమ్మతము మనకున్న నమ్మకము ఆయమ్మకున్ని
ఆయమ్మకు నాచుట్టాలెవురూ మనకి
ఆయమ్మకు నా బందువులెవరు
ఆమాట వదినచెప్పె జగమంతా సమ్మతించి
వోలి ఏమి తెచ్చావు చెల్లెలా సొమ్ములేమి తెచ్చినావు
వేయి వరహాల సొమ్ము మంగళసూత్రము
మనవి తెచ్చిన క్షకోనమ్మా నీవు " 2 "
పసుపును కుంకుమ మంగళ రూకలతో
మనవి తెచ్చిన శ్రీ కోనమ్మా
(లింగమ్మ, రామాంజనమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ)
వధూ వరులను తయారు చేసేవిధానం:
జానపదులు వివాహ కార్యక్రమానికి ముందు పెళ్లికొడుకు, పెళ్లికూతుర్ని చేసే సాంప్రదాయం ఉంది. వీరిని తయారు చేయడానికి కొన్ని ప్రాంతాలలో పీఠలు వాడతారు. ఈ కార్యక్రమానికి కంబడి పరచి, దానిపైన ముగ్గులేసి పీఠలు వేస్తారు. ఆ సమయంలో వరుణ్ణి పీఠలమీదకు రమ్మని పిలిచే సందర్భంలో ఈ క్రింది విధంగా పాడుకుంటారు.
"చిత్తరే యిల్లలికి చిక్కన ముగ్గుపెట్టి
చిలక ముగ్గుల మీద సల్లబడురా
నలుగుకు రారా! సుందరి రాజు! కుమారా"
(రామాంజనమ్మ , ఎం..లింగమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ )
4. నలుగు పాట :
కుంకాము తీసుకోని కూతురిని తోలుకొని - కుంకాము తీసుకోని కూతురిని తోలుకొని
నలుగూకూ రావయ్య నందాకుమారా- వేగానా రావాయ్య వేణు గోపాల
గందాము తీసుకోని గౌరిని తోలుకొని - గందాము తీసుకొని గౌరినీ తోలుకొని "
నలుగూకూ రావయ్య నందాకుమారా- వేగానా రావాయ్య వేణు గోపాల
సీరాలూ తీసుకొని సీతానూ తోలుకోని సీరాలూ తీసుకొని సీతానూ తోలుకోని
"నలుగూకూ రావయ్యా"
సొత్తూలు తీసుకొని సీతాను తోలుకొని సొత్తూలు తీసుకొని సీతాను తోలుకొని "నలుగూకూ రావయ్యా"
వక్కాలు తీసుకొని అక్కలను తోలుకొని వక్కాలు తీసుకొని అక్కలను తోలుకొని "నలుగూకూ రావయ్యా"
హారతులు తీసుకొని అందరినీ తోలుకొని హారతులు తీసుకొని అందరినీ తోలుకొని "నలుగూకూ రావయ్యా"
(అంజనమ్మ బృందం కుందుర్పిగ్రామం - ముఖాముఖి చర్చ )
ఇదే సంధర్భాలలో కన్నడ సాహిత్యంలో పై భావాన్ని న్పూరించే విధంగా జానపదలు గానాన్ని ఆలపించుకోవడం జరుగుతుంది.
ఆలు సక్కరిట్టు మగళన లోలదిందసాకి ఆలు స్కక్కరిట్టు మగళన లోలదిందసాకి
కొడుబోదు ఈ అళియెగె కొడుబోదు ఈ అళియె యనిగె మనసిళ్ళా
కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి యనిగె మనసిళ్ళా కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి
తుప్ప బాణయిట్టు మగళన ఓప్పదిందసాకి తుప్ప బాణయిట్టు మగళన ఓప్పదిందసాకి "కాడుబోదు" కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి యనిగె మనసిళ్ళా కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి
బియల్ బియల్ ఓదిసి మగళన యసల్ పాసుమాడి
కొడుబోదు ఈ అళియెగె కొడుబోదు ఈ అళియెగె యనిగె మనసిళ్ళా
కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి యనిగె మనసిళ్ళా కంకణ బ్రహ్మ కట్టిదనళ్ళి
అదే విధంగా జానపదులు ధాన్యాన్ని విసురుకుంటూ ఆ పనిలో ఆలుపు మరచిపోవడానికి విసురురాతి పాటలు పాడుకుంటారు.
తెలుగు:
శాటాడురాగులాయ - శానాపనులాయా
సెయ్యిడి గౌరమ్మ - సెయ్యిడి తల్లీ
గంపెడు జొన్నలాయా - ఇంటి పనులాయా
సెయ్యిడి గౌరమ్మ - సెయ్యిడి తల్లీ
ఈ ఇంటి ఆడబిడ్డ ఎంత రోసినది - ఈ రాతి పిండమ్ము ఎంత దరుదరుకు
మా అవ్వ కర్రెమ్మ మనుములాడించు - నల్ల కోడిపెట్ట పిల్లలాడించు
కన్నడ:
అగలూటా ఆలూరు బిగులుటా బేలూరు మధ్యానదావూటమైసూరుగే
మధ్యానదావూట మైసూరు పేటాగే నిద్దే బరువాదు నిడిగల్లు
ఇలుకాతే మనిముందే గనువాదు సెండువ్వ
గాలి బీసిదరే గమగమ గాలి విసిదరే గమగమ ముక్కమ్మ
కెయ్యి బీసిదెరే కైలాసే సన్నసిరే ఉడిసి ఉన్న బదిలాగే అయిదళ.
(అంజనమ్మ బృందం కుందుర్పిగ్రామం - ముఖాముఖి చర్చ)
5. చదివింపులు:
వివాహ కార్యక్రమం ఖర్చుతో కూడిన పని కాబట్టి ఆ ఇంటి వాళ్లకు కలిగే సమస్యలను ఎదర్కొనేందుకు పదిమంది కలిసిచేసే సహాయాన్నే చదివింపులు అంటారు. పెళ్లి కూతురికి సంబంధించిన బంధువులు పెళ్లికూతురికి బంగారు నగలు, డబ్బులు, పాత్రలు, రకరకాల కానుకలు సమర్పిస్తారు. అలాగే పెళ్లి కొడుకు బంధువర్గం, ఆత్మీయులు పెళ్లి కొడుక్కి డబ్బులు, వస్తువుల్ని చదివింపులు చదివిస్తారు. ఈ తంతు 'పెళ్లి వారికి కొంత ఆర్థికంగా చేయూతనిస్తుంది. కానీ ఇది అనంతపురంజిల్లాలోనేకాక అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తుంది. అయితే ఈ ఆచారం నేడు కనుమరుగవుతోందని చెప్పవచ్చు.
వివాహకార్యక్రమంలో తలంబ్రాలు అయిపోయిన తర్వాత వధూవరులను ఇంటిలోకి పిలుచుకునేటప్పుడు గుమ్మందగ్గర (వాకిళ్ల) వధూవరులను ఉద్దేశించి వారిని సీతారాములుగా భావించి పాటలు పాడతారు. వీటినే తలుపు వాకిట పాటలని అని కూడా అంటారు. ఈ పాటలు కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం కాలేదు. వీటిని అందరూ ఆయాప్రాంతాలలో పాడుకుంటూ ప్రతి పాటలోనూ తాత్త్విక చింతనతో ఆలోచింపచేసే విధంగానూ, నిత్యజీవితంలో భార్యభర్తలు ఏ విధంగా మెలగాలో ఈ క్రింది విధంగా వారు పాటల రూపంలో పాడుకుంటారు.
“వసుదేవపుత్రా వైకుంఠవాస శ్రీలక్షీలోలా
రారా గోపాలకృష్ణా తుంటరి తనమేలా
కన్నతల్లి కోతలు పెడితే లోకామెక్కడిదో
వసుదేవపుత్రా వైకుంఠవాస శ్రీలక్ష్మీలోలా ||2|| 'రారా' 'రారా'
చిన్ననోరని తెలియకనీవు మన్నుతినవకురా
https://drive.google.com/file/d/1E39EUwTc1OFwl3Ejhye3RZp--rQ2ZFVV/view?usp=drive_link
(లింగమ్మ, రామాంజనమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ)
అంటూ నాటి స్త్రీలు, పెద్దలు ఇప్పటిలాగా చెప్పదల్చుకున్న విషయాలను కొన్నింటిని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా ఇతరులకు అర్థమయ్యేవిధంగా మాటలు, పాటల రూపంలో చెప్పేవారు. పై గేయంలో వారు నేడు జరిగేటువంటి భ్రూన హత్యలను ఆనాడేగుర్తించి స్త్రీమూర్తి తన బిడ్డను గర్భంలోనే ఉన్నట్లుగా తొలగిస్తే ఈ సృష్టి అనేటువంటింది.ఉండదు. సృష్టికి మూలం స్త్రీనే. కావున స్త్రీకి సంతానం మగ, ఆడ పిల్లలు ఎవరుపుట్టినా ఇద్దరిని సమానంగానే చూడాలనే తాత్విక చింతనను నూతన వధూవరులకుపరోక్షంగా సందేశాన్నిస్తారు. అదేవిధంగా మరికొన్న తలుపులు (వాకిళ్లు) పాటలు కూడా ఈ కిందివిధంగా పాడుకుంటారు.
"మాతా బృందావనమా భారతమాతా! రావమ్మ తులసిమాతా
పావనమైన తులసి వైకుంఠపురంలో వెలసి
అయినా ఇద్దరు కలసి జయమంగళ లక్ష్మీ తులసి
శ్రీ మహావిష్ణువు కలసి జయంగళ లక్ష్మీ తులసి.
లేవమ్మా తులసిమాతా బృందావన భారతమాతారావమ్మ తులసిమాత
రాదారుక్మిణీదేవి నినుకారి మదిలో దలసి
అభినయమున నొసగుమునమ్మా నీకృష్ణుని త్రాసులు తూగి
మహా మహా మునులకెల్లా పరమాత్ముని వాక్యలకెల్లా
సాహసముగా నీదళము సమస్త కళనే బలము
అజ్ఞాన భూమిలో నీవు సుజ్ఞాన మొలవమై మలచి
ప్రజ్ఞాకర రూపమును నీవు సుజ్ఞాన వశమున వెలసి
పతివ్రత స్త్రీలో కెల్లా నీ వ్రతమే పావనమమా
సతీసావిత్రుల సుమతి నిను నేర్చర గొలుతురు మదిలో * 2 *
*లేవమ్మా తులసిమాతా*
పసుపు కుంకుమ తెచ్చి నీసేవలు చేసెదమమ్మా * 2 *
కాయా కర్పూరాలు నీ సేవలు చేసెదమమ్మా * 2 *
*లేవమ్మా తులసిమాతా*
https://drive.google.com/file/d/1HUatjLg9B8bmm2GxGJ8Xb2_Vbr7X94sa/view?usp=drive_link
6. ముగింపు:
ఈ విధంగా అనంతపురం జిల్లాలో వివాహ సందర్భాలలో పాడేచదివింపులు, తలుపుల పాటలు మాత్రమే కాక పుష్పవతి సమయంలో, పేరంటాల సమయంలో, శ్రీమంతం చేసే సమయంలో ఇలా పుట్టుక నుంచి చావు వరకు జరిగే అన్ని సందర్భాలకు సంబంధించిన పాటలు, వ్యవసాయపనులు చేసుకునే సమయంలో పాడే పాటలు ఈ జిల్లాలో అనేకం ఉన్నాయి.వీటి మీద కొంతమేర పరిశోధన జరిగినప్పటికీ ఇంకా పరిశోధించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.ఇప్పటికీ అనేక ఇప్పటికే అనేక రకాల పాటలు మారుతున్న కాలానుగుణంగా., ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించే క్రమంలో, వ్యవసాయ పనులు చేసేందుకు యాంత్రికీకరణ ప్రవేశించడంతో అనేక పాటలు అంతరించిపోయాయి. వీటన్నింటినీ వెలుగులోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
7. పాదసూచికలు:
- ముత్యాలమ్మ ఎగుపల్లి గ్రామం- వయస్సు 48 సంవత్సరాలు
- రామాంజనమ్మ , లింగమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ
- లింగమ్మ, రామాంజనమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ
- రామాంజనమ్మ , ఎం..లింగమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ
- అంజనమ్మ బృందం కుందుర్పిగ్రామం - ముఖాముఖి చర్చ
- అంజనమ్మ బృందం కుందుర్పిగ్రామం - ముఖాముఖి చర్చ
- లింగమ్మ, రామాంజనమ్మ బృందం- పి ఆలేరు గ్రామం ముఖాముఖి చర్చ
8. ఉపయుక్తగ్రంథసూచి:
- దోణప్ప తూమాటి. జానపదకళాసంపద. (అభినందన సమితి ప్రచురణ). 1987.
- ప్రేమలత రావి. తెలుగు జానపద సాహిత్యం- పురాగాథలు, శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2011.
- మోహన్ జి,ఎస్. జానపద విజ్ఞానాధ్యయనం. శ్రీనివాస పబ్లికేషన్, బెంగుళూరు.
- రాధాకృష్ణ మూర్తి, మిక్కిలినేని. తెలుగువారి జానపద కళారూపాలు. శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- రామరాజు బిరుదురాజు. తెలుగు జానపదగేయసాహిత్యం. జానపదవిజ్ఞానప్రచురణ, 1978.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.