headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. ‘లండ సాంబమూర్తి’ కవిత్వం: ఉద్దాన ప్రాంతపు సమస్యలు

శీలంకి గోవిందరావు

పరిశోధక విద్యార్ధి,
తెలుగు అధ్యయనశాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 84640345478, Email: govisjgc43@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

శ్రీకాకుళం జిల్లా పేరు వినగానే పోరాటాలకు పురిటిగడ్డ అని గుర్తొస్తుంది ఈ జిల్లాలో కవులు వివిధ రకాల నేపథ్యాలతో రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా కథ, నవల, నాటకం గేయం మొదలైన ప్రక్రియలో రచనలు చేయడం జరిగింది. కానీ కవితా ప్రక్రియలో రచనలు చేసిన వారు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే జిల్లాలో కవులు ఇతర ప్రక్రియలపై చూపినంత శ్రద్ద కవిత్వంపై చూపకపోటమే. కానీ ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా విస్తృతంగా కవిత్వం వెలువడుతుంది. జిల్లా కవులు తమ ప్రాంతపు సమస్యలను,ప్రాంతపు అస్తిత్వాన్ని తమ కలాలతో, గలాలతో సమాజానికి తెలియజేస్తున్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా నుంచి కవిత్వాన్ని వెలువరిస్తున్న కవుల్లో సీరపాణి, చింతాడ తిరుమలరావు, కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి, అరుణ్ భవేర మొదలైన వారు ప్రసిద్ధి చెందిన కవులగా చెప్పవచ్చు. “శ్రీకాకుళం జిల్లా కవిత్వం - పరిశీలన” అనే పరిశోధన అంశంలో భాగంగా ఉద్దాన ప్రాంతపు సమస్యలను, ఆ ప్రాంతపు అస్తిత్వాన్ని, అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్యలు మొదలైన అంశాలు ఈ వ్యాసంలో తెలుసుకోవచ్చు. నా ఈ పరిశోధన వ్యాసానికి సంబంధించి జిల్లాలో ఉద్దాన ప్రాంత సమస్యలపై స్పందించి కవి వెలువరించిన కవితలను వివరణాత్మకంగా అధ్యయనం చేసి కవి అనుసరించిన పద్ధతులను విశ్లేషించి ఈ వ్యాసాన్ని తీసుకురాగలిగాను.

Keywords: కట్టివాదర, గరళం, నుదిరి కొమ్మ, ప్రేత కళ, వల్లె వేసుకోవటం, గడప.

1. ఉపోద్ఘాతం:

శ్రీకాకుళంజిల్లాలో ఉద్దాన ప్రాంతం గురించి మన దేశంలో తెలియని రాష్ట్రం, తెలియని జిల్లా, మండలం, గ్రామం అంటూ ఉండదు. శ్రీకాకుళం పోరాటాలకు పుట్టినిల్లు అనడం ఎంత నిజమో సమస్యలకు కూడా పుట్టినిల్లు అనటంలో అంతే నిజం దాగి ఉంది. అటువంటి సమస్యల్లో ఉద్దాన ప్రాంతపు కిడ్నీ వ్యాధి  సమస్య అనేది సంవత్సరాల తరబడి అక్కడి ప్రజలను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య.  నేటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకకపోవటం అనేది గమనార్హం.

ఉద్యానవనంగా పిలవబడే  ఆ ప్రాంతం వాడుకు భాషలో “ఉద్దానం”గా మారింది కానీ ఇప్పుడు ఆ అర్థం కూడా మారిపోయింది.  ఉద్దాన ప్రాంతం పేరు చెప్పగానే కిడ్నీ బాధిత ప్రాంతంగానే అందరికీ గుర్తొస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారంప్రపంచంలో ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న దేశాలుగా పేరుగాంచిన  నికరగువ, కోస్టారికా, శ్రీలంక మొదటి మూడు స్థానాల్లో ఉంటే  తరువాతి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ప్రాంతమైన “ఉద్దానం” ఉండటం అనేది అందరినీ కలత చెందించే విషయం. ఉద్దాన ప్రాంతంలో ప్రతి గడపలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కిడ్నీవ్యాధిబాధితులు ఉంటారు. అక్కడి ప్రజలు కిడ్నీవ్యాధి బారిన ఎందుకు పడుతున్నారో  పూర్తిస్థాయి పరిశోధన జరగలేదు. గత పది సంవత్సరాల్లో దాదాపు 5,000 మంది ఈ వ్యాధితో మరణించగా, ఇంకా 35,000 మంది కిడ్నీ సంబంధిత జబ్బులతో బాధపడుతున్నారు.  ఉద్దాన ప్రాంతం జనాభాలో  దాదాపు 33% ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.” (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ రిపోర్ట్ 2020). అటువంటి ఉద్దాన ప్రాంతం కిడ్నీ వ్యాధిని గురించి, ఆ ప్రాంతపు సమస్యల పై స్పందించి కవిత్వాన్ని వెలువరించిన కవి  యొక్క కవితలను ఇందులో వివరించబోతున్నాను. 

2. లండ సాంబమూర్తి – పరిచయం :

శ్రీకాకుళం జిల్లాలో నేటి తరం కవులు తమ కవిత్వం ద్వారాసమాజాన్ని గురించి, ఆ ప్రాంతపు సమస్యల గురించి తన కలం ద్వారాతెలియజేస్తున్న కొద్ది మంది రచయితల్లో లండ సాంబమూర్తిగారు ముందు వరుసలో ఉంటాడనటంలోఅతిశయోక్తి లేదు. “ఒక కవిగా మిగిలిపోవడానికి/  ఎన్నిసార్లు మరణించి/  మళ్ళీ మళ్ళీ మొలకెత్తానో లెక్కలేదు" అంటూ "నేను కలం పట్టాక/ నాలో లోలోన ఏదోతృప్తి/ కవిత్వం నన్ను నడిపించే దీప్తి"  (గాజు రెక్కల తూనీగ. పుట – 14) అంటాడు సాంబమూర్తి.

లండ సాంబమూర్తి శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు (మండలం) ఒంకలూరు గ్రామంలో సుమిత్ర, రామస్వామి దంపతులకు 1980 అక్టోబర్20న జన్మించారు. ఈయన ఎం.ఎస్సీ (మ్యాథమ్యాటిక్స్), ఎం.ఎ (ఎడ్యుకేషన్), బి.ఎడ్.విద్యార్హతలు కలిగి ఉన్నారు. చదివిన చదువు వేరయినప్పటికి తెలుగుసాహిత్యం పై ఉన్నఅభిమానంతో,ఇష్టంతో ఎన్నో రచనలు తన కలం ద్వారా అందించగలుగుతున్నారు. వృత్తిరీత్యా పాఠశాల ఉపాధ్యాయునిగా దాదాపు 17 సంవత్సరాల నుండి తమ సేవలను అందించగలుగుతున్నారు. సాధారణంగాకవులు కలల్ని నింపుకుంటారు. కవితల నిండా కలల్ని వొంపుతుంటారు. కలలు మంచివే కావచ్చుమంచిని కోరేవే కావచ్చు. ఆదర్శపూరితాలవ్వచ్చు. కానీ అన్ని కలలూ సాకారం కావు, అందుకేనేమో ఓ సినీ కవి "కలలేమనకు మిగిలిపోవు కలిమి చివరకూ, ఆకలిమిని కూడా దోచుకునే దొరలు యెందరో”అంటాడు.

సాంబమూర్తిగా కలలు కనడాన్ని ప్రజలకు విడిచిపెట్టారు. ప్రపంచమంతా కాసిన్ని కలల్ని కప్పుకొని నిద్రపొమ్మంటాడు. వారి కలలు చెదిరిపోకుండా చౌరస్తాలో నిల్చోని అక్షరాలకు పహారా కాస్తుంటానంటాడు. అందరి నిస్సహాయతలను భుజాన మోస్తానంటాడు. సాంబమూర్తి. ఈయన రాసిన 'గాజురెక్కల తూనీగ' , “నాలుగు రెక్కల పిట్ట” ఈ రెండు  కవితా సంపుటిలో ఆ ప్రాంతపు సామాన్య  ప్రజల  ఆశలు, ఆక్రోశాలు, ఆవేశాలు, ఆక్రందనలు, నీవీ, నావీ, అందరివీ! సరిహద్దు కాపలా కాసే సైనికుల నుంచి పక్కదనాల పల్లె పరాయీకరణ దాకా, రైతు, కార్మికుడు, ఉద్యోగీ యెందరెందరి జీవితాల్లో కావ్యవస్తువులైనాయి.

3. రచనలు :

  1. గాజురెక్కల తూనీగ (కవితా సంపుటి) - ప్రచురణ - 2020
  2. నాలుగు రెక్కల పిట్ట (కవితా సంపుటి) - ప్రచురణం - ఆక్టోబర్ 2022

4. సాహిత్య కృషి - గుర్తింపు :

ఈయన చేసినసాహిత్య కృషికి మెచ్చి వివిధ సంస్థలు, సంఘాలవారుఈయనకు వివిధ బహుమతులతోపాటు, సత్కారాలు చేశారు. 1. బాలసాహిత్యంలో చేసిన కృషికిగాను “బాలరంజని” ఆంధ్రప్రదేశ్, బాలమిత్ర పురస్కారం 2018లో అందుకున్నారు. 2. ఎక్స్-రే ఉత్తమ కవితా అవార్డ్స్ (2009). 3. నవమల్లెతీగ పత్రిక నిర్వహించిన కవితల పోటీలో ప్రోత్సాహక బహుమతి (2019) 4. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, శ్రీకాకుళంవారు నిర్వహించిన ఉపాధ్యాయ రంగస్థలం సంక్రాంతి కవితల పోటీల్లో ప్రథమ బహుమతి (2020).

5. కిడ్నీ వ్యాధి సమస్యకు ప్రధానకారణం :

సాధారణంగా రక్తంలో క్రియాటిన్ 1.2mg./D.l మించి ఉండకూడదు. దీన్ని ఉద్దాన ప్రాంతంలో పాయింట్లు కొలుస్తారు. దాదాపు 15 వేలమందిలో సీరం క్రియాటిన్ 3 నుంచి 25 పాయింట్లు ఉంటుంది. అది 6 పాయింట్లు దాటిన వారికి డయాలసిస్ తప్పనిసరి. (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ రిపోర్ట్ 2020) కరోనా సమయంలో ఎవరికైనా దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే ముందుగా కరోనా టెస్ట్ చేయించి తర్వాత మిగతా వ్యాధులకి టెస్టులు చేశారు.  కానీ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతపు ప్రజలకు ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా ముందుగా డయాలసిస్ టెస్ట్ చేయించి అది అవునో, కాదో నిర్ధారణ అయ్యాక మాత్రమే మిగతా టెస్టులు చేసేవారు ప్రస్తుతం కూడా చేస్తున్నారు.

ఉద్దానం ప్రాంతంలో ఎక్కువ గ్రామాలే కావడం, అక్షరాస్యత తక్కువగా ఉండటంతో అక్కడ ప్రజలు ఇంకా నాటు వైద్యాన్ని నమ్ముతున్నారు. గ్రామంలో దొరికే ఒక మొక్క ఆకులను నీటిలో మరిగించి తాగితే కిడ్నీ వ్యాధి తగ్గుతుందని నమ్ముతున్నారు “అంబలమాడు” అనే ఈ మొక్కను పునర్వనవ అని పిలుస్తున్నారు. అంటే సంస్కృతంలో “పునర్జన్మ”  ఇచ్చేది అని అర్థం. ఈ కిడ్నీ సమస్యకు ప్రధాన కారణం ఆ ప్రాంతపు భూగర్భ జలాల్లో ఉన్న రసాయనాలు, భారలోహాలు అని కొన్ని పరిశోధనలు పేర్కొన్నాయి.దీంతో ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి  సంబంధించి ఉద్దానం కిడ్నీ సమస్యకు మించిన మరో అంశం ఉండదు. ఆ సమయంలో అన్ని  పార్టీలు కూడా ఇదే జపం చేస్తాయి. 1985 నుండే ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు నమోదు అవుతున్నాయి. అయితే 1993లో సోంపేటకు చెందిన డా. వై. కృష్ణమూర్తి చేసిన పరిశోధనలతోనే ఉద్దానం కిడ్నీ వ్యాధిత ప్రాంతంగా గుర్తింపు పొందింది.  ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అవసరమైన చర్యలను తీసుకొని, వాటిని పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించినట్లైతే ఆ వ్యాధిని నిర్మూలించడం అంత కష్టమేమి కాదు.

6. కిడ్నీ వ్యాధి సమస్యపై వెలువడిన కవిత్వం :

“అంతం లేని ఆవేదన”  అనే  కవిత లో ఉద్దాన ప్రాంత ప్రజల గురించి కవి  లండ సాంబమూర్తి-
            “ ఏదో ఉన్నామన్న మాటే కానీ
              ఎప్పుడు ఆరిపోతామో మాకే తెలీదు”  అని (గాజు రెక్కల తూనీగ. పుట – 69)  
కవి రాసిన మొదటి పంక్తులను మనం గమనించినట్లయితే ఆ ప్రాంతపు ప్రజలు ఎంత ఆవేదన గురవుతున్నారో అర్థమవుతుంది.
            “ప్రతి ఇంట్లో ఎవరో ఒకరి కళ్ళల్లో
              ప్రేతకల ఉట్టిపడుతుంటుంది
              ప్రతి ఊర్లో కిడ్నీ వ్యాధుల మరణ మృదంగం
              వారానికోకమారైనా  మోగుతూనే ఉంటుంది”. (గాజు రెక్కల తూనీగ . పుట – 69)  
అనటంలో ఆ ప్రాంత వాసులకు “మృత్యుఘోష” అనేది ప్రతిరోజు ఉదయం గుడిలో పాడే సుప్రభాతం గా మారింది అనటంలో సందేహం లేదు.
            “పరామర్శలు, ఓదార్పులు, వాగ్దానాలు
              ప్రతీసారి వాడిన చెట్టు మొదట్లో
              కాసిన్ని  చన్నీళ్లు చల్లిపోతుంటాయి
              ఈ అంతం లేని వేదనకు అంతమెప్పుడో!
              ఈ మరణ మృదంగం ఆగేదెప్పుడో!
            ఉద్దానం మల్ల  పచ్చగా నవ్వేదేప్పుడో”        (గాజు రెక్కల తూనీగ. పుట – 70)  
ఉద్దాన బాధితులు చనిపోయినప్పుడు వారి కుటుంబీకులకు పరామర్శ, ఓదార్పులను కలిగిస్తారు.  ఈ పరామర్శలు నీళ్లు లేని  మొక్కకు మొదట్లో చల్లిననీళ్లులాంటివని, అవి  పూర్తిగా మొక్క దాహాన్ని తీర్చక, అరకొరగా వేర్లకు అందని నీళ్ళులాగా బాధితులను ఆ సమస్య నుండి  బయటపడటానికి మార్గం చూపక, పైకి చెట్టు మొదట్లో చల్లిన నీళ్ళు లాగా  ఓదార్పు మాటలు ఉంటాయని చక్కని ఉపన ఉపమానంతో వివరించారు.
కవి తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఆ ప్రాంతపు ప్రజల ఆవేదనకు శాశ్వత పరిష్కారం కనుక్కొని మరణాలు ఆపగలిగినట్లయితే మళ్లీ ఉద్దానంలో ప్రజలు  సంతోషాలతో జీవిస్తారు అని కవి యొక్క భావన.
    “శోకతీరం” అనే మరో కవితలోకవి  లండ సాంబమూర్తి ఈ విధoగా తెలియజేశాడు.
            “వందల ఏళ్లకు ముందు
            మేమిక్కడ మొదలయ్యే నాటికి
            సముద్రం ఒక్కటే ఒంటరిగా తన పాట తానేపాడుకునేది.” (నాలుగు రెక్కల పిట్ట. పుట – 46)

కొన్ని సంవత్సరాలకు ముందు ఉద్దాన ప్రాంతం ఏర్పడిన నాటికి అక్కడ సముద్రం, సముద్రపు అలలు తప్ప అక్కడ ఏమీ లేదని తెలుపుతూ…..
          “అలలు నేర్పిన పాఠాల్ని వల్లే వేసుకుంటూ
          పల్లె పల్లెలుగా విస్తరించా”      (నాలుగు రెక్కల పిట్ట. పుట- 47)
క్రమంగా ఆ సముద్ర తీరం చుట్టూ చిన్న చిన్న పల్లెలుగా ఏర్పడుతూ “ఉద్దానం”అనే ఏడు మండలాల తీర ప్రాంతం చెందిన ప్రజలుగా మారాo.
            “కాలం
            కత్తి వాదర  మీద వెనక్కి వెనక్కి నడిచింది
            కలల తీరం కోతకు గురవుతూనే ఉంది
            ఏళ్లుగా ప్రవహించిన నిర్లక్ష్యంమిప్పుడు
            గరళమై ఉద్దానగర్భాన్ని విచ్ఛిన్నం చేసింది.” (నాలుగు రెక్కల పిట్ట పుట – 47)

ఆ “ఉద్దానం” ఏడు మండలాలకు చెందిన ప్రజలు నిత్యం కిడ్నీ వ్యాధులతో బాధపడుతూనే ఉంటున్నారు  వారానికి కనీసం ఒక మృతదేహమైన బయలుదేరుతుంది.  క్రమంగా ఆ కలల తీరం కోతకు గురవుతూనే ఉంది ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన భవిష్యత్తులో “ఉద్దానం” అనే ప్రాంతం కనుమరుగుతుందేమో అని సందేహాన్ని కవి తెలియజేస్తున్నాడు.
          “ఒంటరి దుఃఖాలు” అనే కవితలో లండ సాంబమూర్తి ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిని గురించి, వారి బాగోగులను గురించి పట్టించుకునే నాదులు లేకపోయారు అని బాధదగ్ధ హృదయంతో చెబుతూ, ఆ ఊళ్లను ప్రకృతి పగబట్టిందని, ఆ ఊళ్ళో మరణ రంగు గాలులుoటాయని కవి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
        “మావి
          వలస ఎడారులు
          వసంతాలు ముఖం చాటేసిన వనాలు
          ఈ గడపల్లో ఏ ఉషోదయాలు వాలవు”  (నాలుగు రెక్కల పిట్ట. పుట- 151 )
  అంటూ..
          “పదేళ్లకే అనాధలై
          గుజరాత్ తీరానికేసి సాగిపోయే పాదాల
          కథ ఐదేళ్ల కాపురానికే
          ఎండిపోయే నుదిరికొమ్మల కథ
          కన్నీళ్ళకు తెలుసుంటుంది?”    (నాలుగు రెక్కల పిట్ట. పుట – 152)
అక్కడ యువతీ,యువకుల పైన ఆ సమస్య తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ కిడ్నీ వ్యాధి సమస్య వలన ఎంతోమంది పెళ్లికాక, ఒక వేళ పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే కాపురాలు కూలిపోవడం అనేది అత్యంత విషాదకర విషయం. పెళ్లయిన కొద్ది సంవత్సరాలకి భర్తను కోల్పోయిన భార్యల వేతల గురించి ఏ కన్నిళ్ళ కు తెలుస్తుందoటాడు. అంతేకాకుండా ఎంతోమంది చిన్న పిల్లలు చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలి తమ ప్రయాణం ఏ తీరం వైపో అర్థం కాక వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని  కవి ఎంతో  ఆవేదన వ్యక్తపరుస్తూ రాసిన కవిత ఇది.

7. ముగింపు:

ప్రపంచంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న నికరగువ, కోస్టారిక శ్రీలంక దేశాల తర్వాత స్థానంలో ఉద్దాన ప్రాంతం  ఉంది అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ ఉద్దాన ప్రాంతపు కిడ్నీ వ్యాధి సమస్యల పైన కథలు నవలలు  రచించారు రచయితలు కానీ, కవిత్వం మాత్రం వెలబడలేదు.

కవిత్వ ప్రక్రియ ద్వారా ఆ ప్రాంతపు సమస్యలను బయట ప్రపంచానికి తెలియజేయటానికి ఒక సాహసం చేసిన మొదటి వ్యక్తిగా లండ సాంబమూర్తిని చెప్పవచ్చు.

లండ సాంబమూర్తి  లాంటి కవులు ఇంకా కొంత మంది ఆ ప్రాంతపు  సమస్యలను గుర్తించి, వాటి పైన తమ కలాలతో  స్పందించినట్లైతే సమాజానికి ఆ ప్రాంతపు ప్రజల పడుతున్న ఆవేదనలు అర్థమవుతాయి. 

ముఖ్యంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆ ప్రాంతపు ప్రజలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించినట్లయితే ఆ ఉద్దానం మరల ఉద్యానవనంగా మారుతుందని ఆసిద్దాం.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగాధర్, మంచాల. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవధోరణలు – ఒకవిశ్లేషణ
  2. భుజంగరావు, కంచరాన. నీటి గింజల పంట (2023). దక్కన్ ప్రెస్, హైదరాబాద్
  3. ముత్యం, కె. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం, శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ.
  4. వెంకట్. శ్రీకాకుళంజిల్లా గిరిజన రైతాంగ ఉద్యమం(2007). మైత్రిబుక్ హౌస్, విజయవాడ.
  5. సత్యనారాయణ, మానేపల్లి. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం జన సాహితి మైత్రి బుక్హౌస్- విజయవాడ.
  6. సాంబమూర్తి, లండ. నాలుగు రెక్కల పిట్ట(2022). లిశoక ప్రింట్ సొల్యూషన్ -హైదరాబాద్
  7. సాంబమూర్తి, లండ. గాజురెక్కల తూనీగ (2020). చరిత్ర ఇంప్రెషన్ -హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]