AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం: విప్లవోద్యమాల పాత్ర
డా. జి. తిరుమల వాసుదేవరావు
ఉపన్యాసకుడు మరియు చరిత్ర శాఖ అధ్యక్షుడు,
ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాల,
నగరి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భారత స్వాతంత్రపోరాటం ప్రధానంగా శాంతియుతంగానే జరిగింది. ఇందులో ఒక వర్గం శాసనబద్ధమైన విజ్ఞప్తులు మీద ఆధారపడగా, మరొక వర్గం ప్రజా పోరాటాల మీద నమ్మకం కలిగి ఉండేది. శాసనబద్ధమైన విజ్ఞప్తుల మీద గాని, ప్రజా పోరాటాల మీద గాని నమ్మకం లేని మూడో వర్గం స్వాతంత్రం సాధించాలనె లక్ష్యం కొరకు సాయుధపోరాటం మార్గం ఎన్నుకున్నారు. హింసాయుత మార్గాల ద్వారా దేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలనను అంతమొందించి సొంత పరిపాలన స్థాపించడం వారి లక్ష్యం. ఈ విప్లవవాదులలో ఎక్కువమంది పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కలిగిన వారు మరియు నిరుద్యోగులు. రష్యాలోని నిహిలిస్టులు, ఇటలీలోని కార్బోనరీలు, ఐర్లాండ్ లోని సిన్ పిన్ ఉద్యమదారుల కార్యకలాపాలు వీరికి ప్రేరణ కలిగించారు. ఈ ఉద్యమాలు స్వేచ్ఛ మరియు స్వాతంత్ర స్ఫూర్తిని నింపి, భారతీయ ప్రజలను ఉత్తేజపరిచాయి. భారతదేశ చరిత్రలో ఈ కీలక ఘట్టాలను సమగ్రంగా విశ్లేషించడం ద్వారా ఈ వ్యాసం భారతదేశ సార్వభౌమాధికారం కోసం పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచిన విప్లవ వీరుల పై అంతదృష్టిని ఏర్పరుస్తుంది.
Keywords: స్వాతంత్ర్యపోరాటం, బ్రిటిష్ వలసపాలన, చిట్టగాంగ్, కకోరి కుట్ర, వామపక్షభావజాలం
1. ఉపోద్ఘాతం:
1857 తిరుగుబాటు వైఫల్యం తరువాత దేశంలో విప్లవ కార్యకలాపాలు కొంతకాలం బలహీనంగా కొనసాగినా వేగంగా బలం పుంజుకుని భారత స్వాతంత్ర పోరాటంలో అంతర్లీనంగా తమ పాత్రను పోషించాయి. ఈ పోరాటాలకు పరాకాష్టగా ఆజాద్ హింద్ పౌజ్ కార్యకలాపాలను మనం గమనించవచ్చును. బెంగాల్ విభజన సందర్భంగా జరిగిన వందేమాతరం ఉద్యమం సందర్భంగా అతివాద నాయకుల దేశభక్తి, జాతీయవాదం ఈ విప్లవ వాదులకు సైద్ధాంతిక భావజాలం అందించాయి. ఈ విప్లవ కార్యకలాపాలు ప్రధానంగా మహారాష్ట్ర బెంగాలు పంజాబ్ ప్రాంతాలలో కేంద్రీకృతమయ్యాయి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే విప్లవ వాదులలో ప్రారంభకుడిగా పిలుస్తారు[1]. 1857 తిరుగుబాటులో చురుకుగా పాల్గొన్న మహారాష్ట్ర ప్రాంత ప్రతినిధిగా ఫడ్కేను మనం గమనించగలం.బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని హైదరాబాదు నిజాము బ్రిటిష్ వాళ్లకు అప్పగించాడు. బ్రిటిష్ వాళ్ళు ఇతడిని ఆడిన్ జైలుకు తరలించగా ఫిబ్రవరి 17, 1883న అక్కడనే మరణించాడు[2].
2. మిత్ర మేళ - అభినవ భారత్:
చాప్లేకర్ సోదరులు అని పిలవబడే బాలకృష్ణ చాప్లేకర్ మరియు దామోదర్ చాప్లేకర్ అనే సోదరులు 1893లో “హిందూ ధర్మ పరిరక్షణ సభ” అనే విప్లవ సంఘాన్ని పూనాలో స్థాపించారు [3,4,5]. 1897 లో పూనాలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు. ప్లేగు కమిషనర్ గా పని చేస్తున్న ర్యాండ్ అనే బ్రిటిష్ అధికారి నియంతృత్వం గా వ్యవహరించి ప్రజల మత భావాలను దెబ్బతీయడంతో అతడిని ఈ సోదరులు హత్య చేశారు[6]. ఆంగ్ల ప్రభుత్వం వీరిని ఉరితీసింది. సావర్కర్ సోదరులు గణేష్ సావర్కర్ మరియు వినాయక్ దామోదర్ సావర్కర్ అనే సోదరులు[7], 1899 నందు నాసిక్ లో “మిత్ర మేళ” అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు[8]. 1904 ఈ సంస్థ పేరును తరువాత “అభినవ భారత్” గా మార్చారు[9]. ఈ సోదరులను బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్ ద్వీపాలలో గల కాలాపాని జైల్లో నిర్బంధించి శిక్ష విధించింది. ఈ విప్లవ సంస్థలోని మరొక విప్లవవాది మదన్ లాల్ ధింగ్రా లండన్ లో కర్జన్ విల్లి అనే ఆంగ్ల అధికారిని జూలై 1, 1909 లో హత్య చేసి ఉరిశిక్షకు గురి అయ్యాడు[10]. బ్రిటిష్ ప్రభుత్వం పై భారతీయ యువకులలో ఏర్పడిన వ్యతిరేకత, అసంతృప్తి ఈ సందర్భంగా వెల్లడి అవుతున్నది.
మహారాష్ట్ర బెంగాల్ ప్రాంతాల్లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక హింస కార్యకలాపాలు దక్షిణ భారతదేశంలో కూడా ప్రతిధ్వనించాయి. తమిళనాడులో దేశభక్తిని మతపరమైన బాధ్యతగా భావించిన యువకుల సమూహం నీలకంఠ బ్రహ్మచారి, వాంచీ అయ్యార్ మొదలగువారు “భారతమాత అసోసియేషన్” అనే విప్లవ సంస్థను స్థాపించాడు[11].
ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా వాంచీ అయ్యార్ తిరునల్వేరి కలెక్టర్ అష్ ను హత్య చేసి, సంచలనం సృష్టించాడు. నీలకంఠ బ్రహ్మచారి నిర్బంధానికి గురికాగా, వాంచీ అయ్యార్ ఆత్మహత్య చేసుకున్నాడు[6].
3. అనుశీలన సమితి:
బ్రిటిష్ వారి వలస పాలనకు మొదటిగా గురి అయిన బెంగాల్ ప్రాంతం విప్లవ కార్యకలాపాలకు పుట్టినిల్లుగా మారింది. “అనుశీలన సమితి” అను సంస్థ ప్రభావశీలమైన బెంగాల్ ప్రాంతానికి చెందిన ప్రముఖ విప్లవ సంస్థ. ఈ సంస్థ డాకా లోను కలకత్తా లోనూ వేరు వేరుగా ఏర్పడింది. ఈ సంస్థకు చెందిన విప్లవ వాదులు ప్రజా వ్యతిరేకులైన ఆంగ్ల అధికారులను హత్య చేయడానికి ప్రయత్నించారు. సంధ్య, యుగాంతర్ పత్రికలను నడిపారు.1908 ముజఫర్ పూర్ జిల్లా జడ్జి డగ్లస్ కింగ్స్ ఫర్డ్ వాహనంపై బాంబులు వేసిన సంఘటనలో ఇద్దరు ఆంగ్ల మహిళలు మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న ప్రపుల్ల కుమార్ ఆత్మహత్య చేసుకోగా, కుదిరామ్ బోస్ ను 1909 లో ఉరి తీశారు[12]. డిసెంబరు23, 1912 లో రాస్ బిహారీ బోస్, సచిద్రసన్యాలు అనే విప్లవ కారులు ఢిల్లీలో వైస్రాయ్ పై బాంబులువేసి హత్యాయత్నం చేశారు. ఈబాంబుదాడి నుండి హార్డింగ్ కొద్దిలో తప్పించుకున్నాడు[13] .
4. వామపక్ష విప్లవవాద సంస్థలు:
1917లో రష్యాలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతం కావడం ప్రపంచాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. కార్ల్ మార్క్స్ శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతం ప్రజలలో బహుళ ప్రచారం పొందింది. దీని ప్రభావం భారతదేశ మీద కూడా పడి విప్లవవాద సంస్థలను ప్రభావితం చేసింది. వలస ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన, దుర్భర ఆర్థిక పరిస్థితులు, మొదలైన కారణాలు భారతదేశంలో వామపక్ష సామ్యవాద భావజాలం బలపడడానికి కారణమైనది. భారత కమ్యూనిస్టు పార్టీ సంస్థను ఎం .ఎన్. రాయ్1920 లో తాస్కెంట్ ఏర్పరిచారు[14]. ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేసే ఉద్దేశంతో భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం1924 లో కాన్పూర్ కుట్ర కేసు ద్వారా అనేకమంది వామపక్ష నాయకులను బంధించింది. ఈ విధంగా1929 మార్చి 20వ తేదీన మీరట్ కుట్ర కేసు ద్వారా అనేకమంది విప్లవ వాదులను ప్రభుత్వం నిర్బంధించింది[15] .
5. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్:
అఖిల భారత స్థాయిలో ఏర్పడిన విప్లవాత్మక సంస్థ “హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్”, దీనిని కాన్పూర్ నగరంలో 1924లో సచింద్ర సన్యాల్ మరియు జోసెఫ్ ఛటర్జీ స్థాపించారు[16]. చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ అనే మొదలైన విప్లవకారులు ఇందులో క్రియాశీలంగా పాల్గొన్నారు[17]. భారతదేశంలో బ్రిటీష్ వారి పాలనను అంతం చేసి భారతదేశాన్ని రిపబ్లిక్ దేశంగా చేయడమే దీని లక్ష్యం. మరొక ప్రముఖ విప్లవకారుడు భగత్ సింగ్ 1925లో ఈ సంస్థలో చేరాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ పేరు లో “సోషలిస్టు” అనే పదాన్ని కలుపుతూ ‘హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్” గా మార్చాడు[18]. ఈ సంస్థకు అనుబంధంగా1926లో లాహోర్ నందు తాను కార్యదర్శిగా ”నవ జవాన్ సభ” అనే యువజన సంస్థను స్థాపించాడు[19] . సహాయ నిరాకరణ ఉద్యమం వైఫల్యం తరువాత కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న యువకులకు ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ అసోసియేషన్ స్వాతంత్ర సాధనకు ప్రత్యామ్నాయ మార్గంగా గుర్తింపు పొందింది.
హిందుస్థాన్ రిపబ్లిక్ ఇన్ అసోసియేషన్ విప్లవవాదులు 1925 లో లక్నో నుండి బయలుదేరిన రైలును కోకరి రైల్వే స్టేషన్ లో దోపిడీ చేశారు[20]. ఈ సంఘటనలో పాల్గొనిన 40 మంది విప్లవవాదులను ప్రభుత్వం అరెస్టు చేసింది. వీరిలో రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, అష్ఫాఖుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్ లను ఉరి తీశారు[21]. సచింద్ర సన్యాల్ కు యావత్ జీవ కారాగార శిక్ష విధించారు. ఈ కాకోరి రైలు దోపిడీ భారతీయ విప్లవవాదుల చర్యలలో పంచలనంగా నిలిచింది. విప్లవ వాదుల కార్యక్రమాలలో ప్రముఖ సంఘటనైన దీనిని కాకోరి సంఘటన అని పిలుస్తారు.
ఫ్రాన్స్ లో అగస్టే వైలెంట్ అనే విప్లవకారుడు ప్రభుత్వ చర్యలపై తన నిరసన తెలుపడానికి ధైర్యంగా ఫ్రాన్స్ శాసనసభలో బాంబు విసిరి మరణదండనకు సిద్ధపడ్డాడు. అతనిని ఆదర్శంగా తీసుకుని భగత్ సింగ్ మరియు బత్కేశ్వర్ దత్ లు కేంద్ర శాసనసభలో పొగ బాంబులు విసిరారు[22]. తమ విప్లవ చర్యలకు ప్రజలలో ప్రాచుర్యం కల్పించడానికి విప్లవ నినాదాలు చేస్తూ పోలీసులు చేత అరెస్టు కాపడ్డారు.
23 మార్చి 1931లో లాహోర్ జైలులో భగత్ సింగ్ రాజగురు మరియు సుఖ్ దేవ్ లను సాండర్స్ హత్య కేసులో ఉరి తీశారు. ఈ సంస్థకే చెందిన మరొక విప్లవవాది జితేంద్రనాథ్ 63 రోజులు నిరాహార దీక్ష చేసి మరణించాడు. 1931లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కీలక నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ అలహాబాద్ లో పోలీసులతో పోరాడుతూ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి[23].
6. మన్యం తిరుగుబాటు - రంప విప్లవం:
గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతాన్ని ఏజెన్సీ ప్రాంతం అని పిలుస్తారు. గోదావరి విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం విస్తరించి ఉండేది. ఈ ప్రాంతంలోని గిరిజనులు పోడు వ్యవసాయాన్ని నిషేధించడం లాంటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయాల వలన అనేక ఇబ్బందులకు గురి అయ్యారు[24]. అల్లూరి సీతారామరాజు అనే విప్లవవాద దేశభక్తుడు ఈ ప్రాంతంలో గిరిజనులకు నాయకత్వం వహించి 1922 -1924 మధ్యకాలంలో విప్లవ పోరాటాన్ని నిర్వహించాడు.
ఈ పోరాటాన్ని మన్యం తిరుగుబాటు లేదా రంప విప్లవం పేర్లతో పిలుస్తారు[25]. అల్లూరి సీతారామరాజు తన పోరాటంలో భాగంగా పోలీస్ స్టేషన్ ల పై దాడి చేసి ఆయుధాలను సేకరించేవాడు. బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటును అణిచివేయడానికి అస్సాం రైఫిల్స్, మలబారు పోలీసులు మొదలైన ప్రత్యేక రక్షక దళాలను మొహరించడంతోపాటు రూథర్ పోర్ట్ అనె సమర్థవంతుడైన ప్రత్యేక కమీషనర్ను కూడా నియమించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వ తీవ్ర నిర్బంధాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఎంతోమంది విప్లవకారులు మరణించారు.ఈ పరిస్థితులలో లొంగిపోవాలని రామరాజు నిర్ణయించుకుని లొంగిపోయే ప్రయత్నంలో పోలీసుల ఎన్ కౌంటర్ కు గురై మరణించాడు. సీతారామరాజు మరణించి నా అతడు వెలిగించిన స్వాతంత్ర స్ఫూర్తి తెలుగు ప్రాంతాల ప్రజలను చైతన్యవంతం చేసింది.
7. చిట్టగాంగ్ ఆయుధ గారం పై దాడి:
1916 లో డిగ్రీ విద్యను పూర్తి చేసిన సూర్య సేన్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించాడు. 1918 లో భారత జాతీయ కాంగ్రెస్ చిట్టగాంగ్ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు [26]. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఇతడు విప్లవ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు అన్న ఆరోపణపై 1926 ప్రభుత్వం ఇతడిని అరెస్టు చేసి రెండు సంవత్సరాల కాలం పాటు నిర్బంధించింది[27].1930 లో చిట్టగాంగ్ ఆయుధ గారం పై దాడి తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఇతడిని బ్రిటిష్ ప్రభుత్వం1933 లో అరెస్టు చేసి1934 జనవరిలో ఉరి తీసింది. సూర్యసేన్ నాయకత్వంలో 1930 ఏప్రిల్ చిట్టగాంగ్ ఆయుధశాల పై ప్రణాళిక బద్దంగా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఈ ఆ తర్వాత ప్రజా పీడకులైన ప్రభుత్వ అధికారుల పైన కూడా దాడులు జరిగాయి. ఆయుధగారం పై దాడిలో ప్రీతిలత, కల్పనా దత్త మొదలగు యువతులు కూడా పాల్గొన్నారు[28]. ప్రభుత్వం విప్లవకారులపై ఉక్కు పాదం మోపింది చాలామందిని అరెస్టు చేసి పలు రకాల కేసులు పెట్టి విచారణ జరిపింది.
8. లాహోర్ కుట్ర కేసు:
సైమన్ గో బ్యాక్ ఉద్యమం సందర్భంగా లాహోర్ లో జరిగిన లాఠీ చార్జీలో ప్రముఖ జాతీయ నాయకుడు లాలా లజపతిరాయ్ తీవ్ర గాయాల పాలై ఆరోగ్యంతో మరణించాడు. దీనికి ప్రతీకారంగా నాటి చార్జీకి ఆదేశించిన పోలీసు అధికారి సాండర్స్ ను విప్లవవాదులు కాల్పులు జరిపి చంపివేశారు. ఈ సంఘటనలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ,రాజ్ గురు మొదలైన విప్లవవాదులు పాల్గొన్నారు. దీనిని లాహోర్ కుట్ర కేసు అని పిలుస్తారు. శాండర్స్ హత్య కేసులో ప్రభుత్వం భగత్ సింగ్ ను విచారించింది[29]. కోర్టులో యువ విప్లవకారుల ప్రకటనలు భయమెరగని వారి వైఖరి ప్రజలలో విప్లవవాద సిద్ధాంతాలకు సానుభూతిని సంపాదించాయి. ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ప్రభుత్వం ఉరితీసింది.
9. విదేశాలలో స్వాతంత్ర పోరాటం:
స్వతంత్ర పోరాటం పై స్వదేశంలో ఉన్న నిర్బంధ పరిస్థితుల నుండి తప్పించుకుని స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించడానికి కొంతమంది దేశభక్తులు విదేశాలకు వెళ్లి ఇక్కడి నుండి స్వాతంత్ర పోరాటాన్ని నిర్వహించారు. ఇటువంటి వారిలో శ్యాంజి కృష్ణ వర్మ లండన్ నుండి కార్యకలాపాలు నిర్వహించాడు. ఇండియన్ సోషయాలజిస్ట్ అనే పత్రికను నడిపాడు[30]. మేడం బికాంజి రుస్తోమ్ కామ అనే విప్లవ వనిత ప్యారిస్ లో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించారు. వందేమాతరం అన్న పత్రికను నడిపారు. 1907లో జర్మనీలోని స్టట్ గార్డ్ నగరంలో తాను రూపొందించిన భారత జెండాను ఎగురవేశారు[31].
వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఒక కార్యకలాపాలను కొనసాగించాడు.జర్మనీ తో కలిసి జిమ్మరిల్లిన్ ప్లాన్ ను రూపొందించారు. దీని ప్రకారం ఇంగ్లాండ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయ విప్లవకారులకు జర్మనీ ఆయుధాలు అందజేయబడ్డాయి[32]. 1915 లో ఆఫ్ఘనిస్తాన్ లోని కాబుల్ లో విప్లవవాదులు రాజమహేంద్ర ప్రతాప్ అధ్యక్షుడిగాను, బర్కతుల్లా ప్రధానమంత్రి గాను ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటు చేశారు[33]. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో విప్లవవాదులు హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా నీ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గద్దర్ పార్టీ గా వ్యవహరించబడింది. సోహన్ సింగ్ భక్నా, లాలహరదయ్యాల్ లు ఈ విప్లవ సంస్థ కార్యకలాపాలలో కీలక బాధ్యతలు పోషించారు[34].
10. సుభాష్ చంద్రబోస్ - ఆజాద్ హింద్ పౌజ్:
నిరంతరం ప్రభుత్వ నిర్బంధానికి గురవుతున్న సుభాష్ చంద్రబోస్ గారు విదేశాల నుండి స్వాతంత్రోద్యమ కార్యకలాపాలు నిర్వహించాలని భావించి 1941 జనవరి నెలలో గృహనిర్బంధం నుంచి తప్పించుకొని జర్మనీ చేరుకున్నాడు. ఆగష్టు 25 న, సుభాస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క సుప్రీం కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అతను 21 అక్టోబరు 1943న స్వేచ్ఛా భారతదేశం యొక్క తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆగ్నేయ ఆసియాలో నివసిస్తున్న పది లక్షల మందికి పైగా గల భారతీయ ప్రజలను ప్రభావితం చేశాడు. పంజాబీలు, ముస్లింలు, సిక్కులు ,పఠాన్లు, తమిళలు మలయాళీలు అందరూ అతని సైన్యంలో కలిసిపోయారు[35]. ఈ ఆజాద్ హింద్ పౌజ్ అంతర్గత నిర్మాణంలో మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం, హిందూ ముస్లిం ఐక్యతను సాధించడం లాంటి అంశాలు అంతర్లీనమై ఉన్నాయి. సింగపూర్ లో స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ చలో ఢిల్లీ అన్న నినాదంతో ఇండో-బర్మా సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. జపాన్ వాళ్లు ఆక్రమించుకున్న అండమాన్ దీవులను సుభాష్ చంద్రబోస్ కు అప్పగించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ పరాజయాలు వలన ఆజాద్ హింద్ పౌజ్ కు సైనిక సహాయం ఆగిపోవడం తో బ్రిటిష్ సైన్యానికి లొంగి పోవాల్సి వచ్చింది. జపాన్ లొంగిపోయిన కొద్ది రోజులకే ఒక విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావించబడింది. గాంధీ బోస్ ను “దేశభక్తులలో రాకుమారుడు” అని ప్రస్తుతించాడు.
బ్రిటిష్ ఆర్మీకి లొంగిపోయిన ఆజాద్ హింద్ పౌజ్ సైన్యాధికారులైన షా నవాజ్, గురుదయాల్ సింగ్ థిల్లాన్, ప్రేమ్ సెహగల్ల పై బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో చేరినప్పుడు చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించారని దేశద్రోహ నేరం ఆరోపింపబడి నవంబర్ 1945న ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణ జరపబడింది [36]. దేశమంతా వీరికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున బులాభాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్నాథ్ కట్జూ, అసఫ్ అలీ మరియు జవహర్‌లాల్ నెహ్రూలతో కూడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ డిఫెన్స్ కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. వీరిపై జరిగిన విచారణ దేశ ప్రజలను చైతన్యవంతులను చేసింది. రాయల్ నేవి తిరుగుబాటు రూపంలో ప్రతిధ్వనించింది. బ్రిటిష్ ఇండియా సైన్యంలో జాతీయ భావం అంకురించింది[37]. సైనిక కోర్టు వీరిని దోషులుగా దారించినా దేశ ప్రజల భావోద్రేకాలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం ఇది శిక్షలను తాత్కాలికంగా నిలిపివేసి వీరిని విడుదల చేసింది.
11. ముగింపు:
1857 తిరుగుబాటు విఫలం తరువాత కొంతకాలం పాటు భారతదేశంలో సాయుధ తిరుగుబాట్లు ఆగిపోయాయి. అయితే వందేమాతరం ఉద్యమం సందర్భంగా విదేశీ పరిపాలనపై సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించే భావజాలం ప్రజలలో బలంగా వ్యాపించింది. శాసనబద్ధమైన రాజకీయ సంస్కరణలు నత్త నడకన సాగడం, కొంతమంది బ్రిటిష్ అధికారుల జాతి అహంకార ధోరణులు, విద్యావంతులైన యువకులలో విస్తృతంగా వ్యాపించిన నిరుద్యోగ సమస్య మరియు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లోకి వచ్చిన యూరోపియన్ వ్యతిరేక ధోరణులు భారతీయ యువకులను హింసాత్మక చర్యల వైపుగా ప్రోత్సహించాయి. భారత స్వాతంత్ర పోరాటంలో నెలకొన్న నిరాశకర పరిస్థితులు దేశ యువతలో అశాంతిని పెంచింది. మతపరమైన, కమ్యూనిస్టుపరమైన ఆలోచన ధోరణులు ఈ విప్లవ ఉద్యమాలకు సైద్ధాంతిక పరమైన భూమికను సమకూర్చాయి. భారతదేశంలో బ్రిటిష్ వారి ప్రధాన స్థావరాలైన మద్రాసు, బొంబాయి, కలకత్తా ప్రాంతాలలో విప్లవ కార్యకలాపాలు విస్తృతంగా జరిగినట్లు మనం గమనించవచ్చు. తమ ఆత్మ బలిదానాల వలన దేశ ప్రజలలో చైతన్యం తెచ్చి, స్వాతంత్రోద్యమాన్ని ఉధృతపరచాలని కొంతమంది అతివాదం దేశభక్త యువకులు ఈ కార్యకలాపాలలో తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి త్యాగం చేశారు.నిరాశ, నిస్పృహ మరియు భయం దేశ ప్రజలలో విస్తరించి ఉన్న సమయంలో ఈ విప్లవకారుల చర్యలు ప్రజలకు కొత్త ధైర్యాన్ని కల్పించి, భవిష్యత్ పై ఆశలను సజీవంగా నిలిపింది. ఈ విప్లవ ఉద్యమాలు పెద్దగా విజయం సాధించలేకపోయినా దేశ యువతలో ఆత్మధైర్యాన్ని సజీవంగా నిలపగలిగాయి.ఈ విప్లవ వాదుల కార్యకలాపాలు దేశ స్వాతంత్ర పోరాటానికి సమగ్రతను సమకూర్చాయి.
12. పాదసూచికలు & ఉపయుక్తగ్రంథసూచి:
- హటేకర్, నీరజ్. "జాతీయవాదం మరియు సామాజిక సంస్కరణ." (2006): పే. పే.485-488.
- సర్కార్, టి . (2006). ఒక దేవత యొక్క జననం:'వందేమాతరం', "ఆనందమఠం", మరియు హిందూ జాతీయత. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 3959-3969.
- డోరన్, ఎ., మరియు జెఫ్రీ, ఆర్. (2018). దేశం యొక్క వ్యర్థాలు: భారతదేశంలో చెత్త మరియు పెరుగుదల. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్.
- సంపత్, విక్రమ్. సావర్కర్: మరచిపోయిన గతం, 1883–1924 నుండి ప్రతిధ్వనిస్తుంది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2019.
- శారదా, ఆర్. (2022). సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం: ఇతర సంస్థలు మరియు సాంస్కృతిక జాతీయవాదం. ఇండియన్ హిస్టారికల్ రివ్యూ, 49(1), S120-S138.
- గుప్తా, ఎ. కె. (1997). డెఫైయింగ్ డెత్: భారతదేశంలో జాతీయవాద విప్లవవాదం, 1897-1938. సామాజిక శాస్త్రవేత్త,pp. 3-27.
- బఖ్లే, జె. (2010). మొదటి దేశం? వినాయక్ దామోదర్ సావర్కర్ (1883–1966) మరియు ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ రచన. పబ్లిక్ కల్చర్, 22(1), pp.149-186.
- పాటిదార్, కె. (2021). విప్లవ జాతీయవాదం. ఇష్యూ 3 ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లా మేనేజ్‌మెంట్ అండ్ హ్యుమానిటీస్., 4(3), 2094.
- సిరోహి, ఎస్. (2022). వీర్ సావర్కర్: నిజమైన దేశభక్తుడు, రచయిత మరియు దయ పిటిషన్‌లకు మించిన మనిషి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎకనామిక్ పెర్స్పెక్టివ్స్, 16(4), 58-72.
- బిర్చ్‌నెల్, టి., & బిర్చ్‌నెల్, టి. (2013). చీకటి యుగాలలో కాఠిన్యం. ఇండోవేషన్: ఇన్నోవేషన్ అండ్ ఎ గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీ ఇన్ ఇండియా, 39-62.
- వెంకట్రామన్, వి. (2018). తమిళనాడుకు చెందిన స్వదేశీ మిలిటెంట్ జాతీయవాదులు. ఎస్ఎస్ఆర్ఎన్ 3137382లో అందుబాటులో ఉంది.
- దాస్‌గుప్తా, ఎ. (2010). బెంగాల్‌లోని నలుగురు మిలిటెంట్ జాతీయవాదుల అమరవీరుల శతాబ్ది. సోషల్ సైంటిస్ట్, 38(1/2)pp. 77-87.
- ముఖర్జీ, యు. (1966). ఇద్దరు గొప్ప భారతీయ విప్లవకారులు-రాస్ బిహారీ బోష్ & జ్యోతీంద్ర నాథ్ ముఖర్జీ. ఫర్మా కె. ఎల్ ముఖోపాధ్యాయ.
- హైత్‌కాక్స్, జె. పి. (2015). భారతదేశంలో కమ్యూనిజం మరియు జాతీయవాదం: MN రాయ్ మరియు కమింటర్న్ విధానం, 1920-1939. ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్.
- లౌరో, ఎం. ఎల్ ., & స్టోల్టే, సి. (2013). తులనాత్మక మరియు అంతర్జాతీయ కోణంలో మీరట్ కుట్ర కేసు. సౌత్ ఆసియా, ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ యొక్క తులనాత్మక అధ్యయనాలు, 33(3), pp.310-315.
- ఛటర్జీ, ఎస్. ఎ . (2015). చిత్రీకరణ వాస్తవికత: భారతదేశంలో స్వతంత్ర డాక్యుమెంటరీ ఉద్యమం. సేజి పబ్లికేషన్స్ ఇండియా.
- రానా, బి. ఎస్. (2005). చంద్ర శేఖర్ ఆజాద్ (భారతదేశం యొక్క అమర విప్లవకారుడు). డైమండ్ పాకెట్ బుక్స్ (ప్) లిమిటెడ్.
- సిన్హా, కె. (1996). హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (వాల్యూం. 57, పేజీలు. 688-695). ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్.
- మోఫాట్, సి. (2019). భారతదేశం యొక్క విప్లవాత్మక వారసత్వం: రాజకీయాలు మరియు భగత్ సింగ్ యొక్క వాగ్దానం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్.
- పాటిదార్, కె. (2021). విప్లవ జాతీయవాదం. ఇష్యూ 3ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లా మేనేజ్‌మెంట్ అండ్ హ్యుమానిటీస్., 4, 2094.
- వైదిక్, ఎ. (2021). స్వరాజ్ కోసం నిరీక్షణ: భారతీయ విప్లవకారుల అంతర్గత జీవితాలు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్.
- సింగ్, బి. (1981). భగత్ సింగ్. అమర్ చిత్ర కథ, (234).
- ఝా, ఎ. కె. (2007). బీహార్‌లోని హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ. ఇన్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ (వాల్యూం. 68, పేజీలు. 840-847). ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్.
- రావు, పి., మనోహర్, కె., & రావు, డి. పి. (1982). ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివాసీ ఉద్యమాలు. భారతదేశంలో గిరిజన ఉద్యమాలు, మనోహర్ పబ్లికేషన్స్, న్యూఢిల్లీ.
- అట్లూరి, ఎం. (1984). అల్లూరి సీతారామ రాజు మరియు మన్యం తిరుగుబాటు 1922-1924. సామాజిక శాస్త్రవేత్త, pp.3-33.
- సేన్, ఎస్., & పార్టీ, జె (2008). 246 సూర్య సేన్. భారత స్వాతంత్ర్య సమరయోధులు (నాలుగు సంపుటాలలో), 245
- కుమార్, సి. (2023). భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సాయుధ పోరాటం పాత్ర. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ ఫర్ ఇంటిగ్రల్ హ్యూమనిజం, మంథన్. 44(2). pp.19-22
- గుప్తా, ఎస్. డి. (2013). డెత్ అండ్ డిజైర్ ఇన్ టైమ్స్ ఆఫ్ రివల్యూషన్. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 59-68.
- షెర్మాన్, టి. సి. (2008). రాష్ట్ర ఆచరణ, జాతీయవాద రాజకీయాలు మరియు లాహోర్ కుట్ర కేసు ఖైదీల నిరాహారదీక్షలు, 1929–39. కల్చరల్ అండ్ సోషల్ హిస్టరీ, 5(4), pp.497-508.
- వర్మ, జి. ఎల్. (1993). శ్యామ్‌జీ కృష్ణవర్మ తెలియని దేశభక్తుడు. పబ్లికేషన్స్ విభాగం సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ.
- యాంటికలోనియలిజం మరియు పారిస్‌లోని ఇండియన్-రష్యన్ రివల్యూషనరీ నెట్‌వర్క్స్, 1907-17. ఇన్ హిస్టరీ వర్క్‌షాప్ జర్నల్ (వాల్యూం. 90, పేజీలు. 96-114). ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్.
- బోస్, పి. (2014). జాతీయ ప్రతిఘటన మరియు కల్పిత సత్యాలు: వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, ఆగ్నెస్ స్మెడ్లీ మరియు భారత జాతీయవాద ఉద్యమం. ఇన్ సౌత్ ఆసియన్ ట్రాన్స్‌నేషనల్స్ (పేజీలు. 46-65). రూట్లెడ్జ్.
- బాగెల్, ఆర్. ఎన్. (2012). భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రాజ మహేంద్ర ప్రతాప్ పాత్ర మరియు సహకారం.
- సోహి, ఎస్. (2014). ‘విద్రోహం’, విముక్తి సైట్‌లు: గురుద్వారాలు, గదర్ పార్టీ మరియు వలస వ్యతిరేక సమీకరణ. సిక్కు ఫార్మేషన్స్, 10(1), 5-22.
- టాయ్, హెచ్. (1984). ది ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, 1941-42. జర్నల్ ఆఫ్ ఆగ్నేయాసియా స్టడీస్, 15 (2), 365-381.
- గ్రీన్, ఎల్. సి. (1948). ఇండియన్ నేషనల్ ఆర్మీ ట్రయల్స్. మోడ్. ఎల్. రెవ్., 11, 47.
- స్పెక్టర్, ఆర్. (1981). 1946 యొక్క రాయల్ ఇండియన్ నేవీ సమ్మె: వలసవాద సాయుధ దళాలలో సమన్వయం మరియు విచ్ఛిన్నం యొక్క అధ్యయనం. సాయుధ దళాలు & సొసైటీ, 7 (2), 271-284.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.