headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. 'కాణిపాకం లింగన్న' కథలలో స్త్రీల సమస్యలు: పరిష్కారం

డా. కె. ధనశ్రీ

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, నంద్యాల,
నంద్యాల, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7386893278, Email: dr.prof.reddy@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కాణిపాకం లింగన్న కథా సాహిత్యంలో "స్త్రీల సమస్యలు పరిష్కారం" అనేవి ఈవ్యాసానికి విషయ సామాగ్రి. వివిధ ప్రామాణిక గ్రంధాలు, పత్రికా వ్యాసాలు ఈ పరిశోధనకుద్వితీయ విషయ సామాగ్రి. ఎంపిక చేసుకొన్న కథా సాహిత్యంలో "స్త్రీల సమస్యలు పరిష్కారం” విశ్లేషించే పద్ధతిలో ఈవ్యాసం రూపుదిద్దుకుంది. నేను రాయలసీమ బాలసాహిత్యం పరిశీలన అనే అంశంపై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీమతి. ఆర్. రాజేశ్వరమ్మ పర్యవేక్షణలో పి.హెచ్.డి చేశాను. అందులో భాగంగా కాణిపాకం లింగన్న పోలీసు కథలు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకొని ఈవ్యాసం రాసాను.

Keywords: స్త్రీ ఉనికి, స్త్రీ సమస్యలు, పరిష్కారం, ఇతిహాస స్త్రీలు, ప్రకృతి, సమాజం, కుటుం-బం, ప్రభుత్వం ఆవేదన, ఆదర్శం.

1. ఉపోద్ఘాతం:

కాణిపాకం లింగన్న గారు 1936 సంవత్సరం, మే నెల 22వ తేదిన జన్మించారు దిగువతడకం గ్రామంలో వరద పిళ్ళై తన భార్య లక్ష్మమ్మకు లింగన్నగా ప్రశిద్ధులైన లింగ పిళ్ళై జన్మించారు. ఈ దంపతులకు అయిదవ సంతానం. కాణిపాకం లింగన్న యమ్.ఏ. తెలుగు, మరియు హింది భాషలలో ప్రావిణ్యం సంపాదించారు. ఈయన బాలలకు చాలా ఎక్కువ రచనలు చేశారని చెప్పవచ్చు. బాలలకు నవలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలు, మేల్కోపే సందేశాత్మక గీతాలు, నీతి పద్యాలు వ్రాశారు. ఈయన రాసిన పోలీసు కథలనుంచి స్త్రీల సమస్యల ఇతివృత్తం కల్గిన కథలను ఈ వ్యాసంలో విశ్లేషించాను.

"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత" ఇది ఆర్యోక్తి. ఏ సమాజంలో స్త్రీలుగౌరవించబడతారో, పూజించబడతారో ఆ సమాజంలో లక్ష్మినివసిస్తుందని అర్ధం. లక్ష్మిసిరిసంపదలకు, సుభిక్షానికి ప్రతిరూపం. ఆంటే భారతీయ కుటుంబ జీవనవిధానంలో మన సమాజం ప్రపంచ దేశాలతో పోలిస్తే, మన భారతదేశం శిఖరాగ్రభాగాన నిలవడానికి స్త్రీశక్తియే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. “స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి ప్రతిరూపమే స్త్రీ. ఆకాశ౦లో సగం స్త్రీ. సమాజంలో సగం స్త్రీ. ఏ సమాజానికైనా మూలం స్త్రీనే. స్త్రీలేని సమాజాన్నిఊహించలేము” అని సమాజంలో స్త్రీల గురించి డాక్టర్కె.ఉమాదేవిగారుచెప్పారు. స్త్రీకూడా మనిషే అనిఆమెకు కూడా రంగు, రుచి, వాసన కావలసి వుంటుందని గుర్తించాలనిఅంటూ “స్త్రీకి శరీరం వుంది, దానికివ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడువుంది,దానికి అనుభవం ఇవ్వాలి” అని చలంగారు ఆంటారు.స్త్రీహృదయపులోయల్ని మానసికక్షోభను వారి అంతరంగిక ఆవేదనను క్షుణ్ణంగా పరిశీలించారు చలంగారు.అందుకు “నాకు ఒక్కనిమిషం విశ్రాంతినివ్వక, మహాప్రణయ మారుతవేగం మీదనో ఆగాధ వియేగభారం కిందనో చీల్చి నలిపి ఊపిరాడనీక నా జీవితాన్ని పాలించేస్త్రీ లోకానికినివేదితము”అని“స్త్రీ”పుస్తకానికి ఆంకితం రాస్తూ చలంగారు అన్నారు స్త్రీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే సమాజమేలేదనిచెప్పవచ్చు. ఆమె అవసరం. సమాజానికి ప్రాణంతో సమానం. స్త్రీ గొప్పతనం ఏ వ్యక్తి అయితే గుర్తిస్తారోఅలాంటి వారి కుటుంబాలల్లో స్త్రీకి ఎటువంటి సమస్యలు వుండవు. స్త్రీనిఎక్కడఅయితే గౌరవించరో ఆక్కడ సమస్యలు స్త్రీకి తలెత్తుతూవుంటాయి. సమాజంలో స్త్రీలకు సమస్యలురావడం సహజమే అయితే వాటిని ఎదిరించి తమ బ్రతుకును కాపాడుకోవాలి. కొంతమంది స్త్రీలు ఆ సమస్యలను పరిష్కరించుకోలేక తమ జీవితమును నాసనం చేసుకుంటూ వుంటారు. మరి కొంతమంది స్త్రీలు తమకు వున్న తెలివితో తమ సమస్యలకు పరిష్కారంవెతుక్కుంటూ వుంటారు. ఇలాంటి స్త్రీలను సమాజానికి ఆదర్శంగాతీసుకోవాలి. కాణిపాకం లింగన్న గారు తన కథలలో స్త్రీల సమస్యలను ఎత్తిచూపి, ఆ సమస్యలకు పరిష్కారం ఎలా చేసుకోవాలో కొన్ని పాత్రల ద్వారా చూపించారు. అటువంటికథల విశ్లేషణ ఈవ్యాసంలోగమనించవచ్చు.

2.1 విజయభేరి:

“విజయభేరి” కథలో ప్రకాశ్-విజయ ప్రేమించుకుంటారు. కాని విజయ తండ్రిపదిలక్షలు కట్నం ఇచ్చి, అమెరికా సంబంధం ఏర్పాటు చేస్తాడు. కాని విజయకు, కట్నంఇచ్చిపెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. ఈవిషయం చైతన్య అనే పోలీసుకు చెపుతారు. పెళ్ళిసమయంలో విజయ తండ్రి అమెరికా వాళ్ళకు డబ్బు కొంత తక్కువ అయిందని ప్రాధేయపడుతుంటాడు. ఇంతలో పోలీసు వచ్చి వరకట్న సమస్య క్రింద వారిని జైలులో పెడతాడు.విజయ ధైర్యంగా ప్రకాశన్ను పెళ్ళి పీటల మీద కూర్చోపెట్టి తాళి కట్టించుకుంటుంది.” (1) ఈ కథలో విజయ పాత్ర ద్వారా రచయిత “వరకట్న”సమస్యను చిత్రీకరించాడు. ఈ కథలో విజయ తన వరకట్న సమస్యను చాలా తెలివిగాపరిష్కరించుకు-ంది. అందరుమెచ్చదగిన విషయం. కొంతమంది స్త్రీలు సమస్యను పరిష్కరించుకోలే కప్రాణత్యాగంచేస్తుంటారు. ఈకథలో విజయ అలాంటి తెలివితక్కువ పని చేయకుండా చాలా ధైర్యంగా సమస్యతో పోరాడి తను అనుకున్న జీవితమును దక్కించుకుంది. ఒకప్పుడు తెలియకస్త్రీ, పురుషులు ఇద్దరు ఒకరికి ఒకరు డబ్బులు ఇచ్చి వివాహం చేసుకొనేవారు.అంటే పశువులను సంతలో కొన్నట్టు మనుషులను కొని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒకప్పటిసాంప్రదాయం.అపుడుపెద్దవాళ్ళు తెలిసి తెలి- యక తప్పు చేశారు. ఇప్పుడు కాలం మారింది. కాలంతోపాటువ్యక్తులు కూడా మారాలి. ఈకథలో విజయ తండ్రి లాగా డబ్బులుతో సంబంధాలు కొనకూడదు. అన్ని బంధాలు అలా వుండవు. మనస్సుతో బంధాలు ఏర్పాటుచేసుకోవాలి. అది శాశ్వతంగా ఈలోకంలో నిలిచిఉంటుంది. అలాంటి బంధాన్ని ఈ కథలో విజయ ఎంచుకొన్నది.నేడు అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది. పురుషులు ఎక్కువుగా ఉన్నారు. అక్కడక్కడా కన్యాశుల్కం కూడా ఇస్తున్నారు. ఇది కూడా యువతఖండించాలి. ధనం అనేది ఒకరిదగ్గర ఉండచ్చు. మరొకరి దగ్గర లేకపోవచ్చు. అయితే అవసరానికి ఒకరికి ఒకరు ఆదుకోవాలి. ధనం అందుకోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆంతేగాని మనుషులను పెళ్ళి అనే పేరుతో అడ్డం పెట్టుకొని పవిత్రమైన రెండు జీవిత బంధాలను వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నాజరిగినా చూసినా ఎవ్వరు అయినా పోలీసులకు తెలియజేయాలి. వరకట్న నిషేద చట్టాన్ని ప్రభుత్వం అమలు చేసినా ఏవరూ దీనిని పాటించడం లేదన్నది సత్యం.

2.2 ఇందిరాహైలెట్:

“ఇందిరాహైలెట్” అనే కథలో ఇందిరను తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఒక రోగికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. ఒక మగబిడ్డకు తల్లి అవుతుంది. భర్త మరణిస్తాడు. అప్పటి నుండి ఆవీధిలోని రౌడీలు ఇందిరను వేధించడం ప్రారంభిస్తారు. చైతన్య అనేపోలీసు ఆ వీది రౌడీలనఎజైలులో పెడతాడు. ఇందిరకు చైతన్య అనే పోలీసు నీతిమాటలు చెప్పిరెండోపెళ్ళిచేస్తాడు.(2)ఈ కథలో లాగ స్త్రీలకు బాల్యంలో వివాహం చేయకూడదు.ఎందుకంటేవివాహంఅంటే ఏమిటో తెలియదు. ఎలా ఇతరులతో ఉండాలో తెలియదు. ఏదైనా సమస్య వస్తే దానిఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. "అర్ధం గాని చదువు వ్యర్థం” అన్నట్లు అర్ధంకాని జీవితం వ్యర్ధం అయింది ఈ కథలోని ఇందిర జీవితం. ఇందిరను ఒకఆరోగ్యవంతునికి ఇవ్వకుండా రోగికి ఇచ్చారు. అసలు రోగులకు పెళ్ళి చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యాధిభార్యకు, పిల్లలకు అంటుకుంటుంది. తద్వారా సమాజంలో కూడా వ్యాప్తిచెందుతుందిఈ కథలో ఇందిరను తెలిసి తెలిసి రోగికి ఇచ్చి వివాహం చేశారు. ఇలాంటితల్లిదండ్రులునాడు, నేడు ఎక్కువగానే ఉన్నారు.

ఇలాంటితల్లిదండ్రులకు,చేసుకున్నవాళ్ళకుతగినశిక్ష ప్రభుత్వం వేయాలి. అపుడే సమాజంలోని ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. భర్త చనిపోయిన స్త్రీ మరలా వివాహం చేసుకోవచ్చు. అందులో తప్పు లేదు. సంసారం అనేది రెండు చక్రాల బండి.అందులో ఒక చక్రం పోతే మరో కొత్త చక్రం వేసుకుంటారు. మరలా బండి నడుపుతారు. పురుషులు కూడా భార్య చనిపోతే మరలా పెళ్ళి చేసుకొని మరలా బ్రతుకుబండి నడుపుతుంటాడు. అదే విధంగా స్త్రీ కూడా తన బ్రతుకు బండిని నడపడానికి మరో భర్తను చేసుకొవచ్చు. ఈ కథలో ఇందిర రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకొని మంచి పని చేసింది. ఇదిఅందరు అభినందించవలసిన విషయం. సమాజంలో స్త్రీలకు జరిగే అన్యాయాలను ఎత్తి చాపి, ఆ సమస్యలకు రచయిత పరిష్కార మార్గాలు కూడా చూపించాడు. నేటి స్త్రీలు ఇలాంటి సమస్యలు నుండీ, జాగ్రత్తగా ఉండాలనీ రచయిత ఈ కథద్వారా మనకు సందేశం ఇచ్చారు.

2.3 జయమ్మ-నిశ్చయమ్ము:

“జయమ్మ-నిశ్చయమ్ము” కథలో జయమ్మ పల్లెటూరి అమ్మాయి. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులు టైలర్ పని చేసే వ్యక్తికి ఇచ్చి వివాహంచేస్తారు. ఒక సంవత్సరానికి పిల్లలపుట్టలేదని ఇంటినుండి తరిమివేస్తారు. భర్తలో లోపం ఉంటుంది. ఆ విషయం తెలుసుకోనీఅందరి ముందు భర్త లోపం తెలియచేయడానికి నిర్ణయించుకుంటుంది. టీచర్గాపనిచేస్తున్న వెంకట్ను రెండో పెళ్ళి చేసుకొనీ, ఒక బిడ్డకు తల్లి అవుతుంది. ఆవిషయం తెలుసుకొని మొదటి భర్త తలదించుకుంటాడు.(3) సమాజంలో చాలా మంది భర్తలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం భార్యలే అనిఈకథలో టైలర్లాగా నిందిస్తూ ఉంటారు. అసలు ఎవరిలో లోపం ఉంది అని డాక్టరు వద్ద చూపించుకొని, తరువాత నిర్ణయం తీసుకోవాలి. వెనుక ముందు ఆలోచించకుండా, మానవత్వం మరచీ, ఒక రాక్షసుడిలాగా పెళ్ళినాటి ప్రమాణాలు మరిచీ, నార్ధాక్షిణ్యంగా ఇంటినుండి బయటకు తరమడం అమానుషం. అలాంటి వాళ్ళు ప్రాణాలతో భూమి మీద బ్రతికే అవకాశం నేటి సమాజం ఇవ్వకూడదు. అలాంటి వారిని గ్రామాల నుండి వెలివేయాలి. ఈకథలో జయమ్మ తన మొదటి భర్తకు బుద్ధి చెప్పి వదిలివేసింది. కాని అలా కాకుండా, వాడిని కఠినంగా శిక్షించాలి. అపుడే ఇలాంటి తప్పుడు పనులు చేసే ఇతరులకు బుద్ధి, భయంవచ్చి అలాంటి పనులకు దూరంగా ఉంటారు. ఈకథలోని జయమ్మలాగా నేటిస్త్రీలు తమకు వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలి. సరైననిర్ణయం తీసుకోవాలి. ఇతరులకు ఆదర్శంగానిలబడాలి. అలాకాకుండా వచ్చిన సమస్యలను కొంతమంది స్త్రీలుపరిష్కరించుకోలేక, భయపడిపోయి ప్రాణత్యాగం చేస్తుంటారు. అలాంటి వారిని పిరికివాళ్ళగా పిలవబడతారు. “కష్టాలు మానవులకు కాకుండా మానులకు వస్తాయా?” రావు. ఒకవేళకష్టాలు వచ్చినా జీవితాంతం వుండవు. బండి చక్రం లాగా కష్ట సుఖాలు కొద్ది కాలమేఉంటాయి. ఆ కొద్ది కాలంలో వచ్చే కష్టాలకు భయపడి ప్రాణత్యాగం చేయకూడదనే తార్కిక విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.

2.4 జైజైదుర్గా:

“జై జై దుర్గా” కథలో దుర్గ భర్త గురునాధ్ (తాగుబోతు). ప్రతి రోజు ఇంటికి తాగా వచ్చీ, పిల్లల ముందు అసహ్యంగా కొట్టీ, తిట్టీ హింసించేవాడు. వాటికి కూడా దుర్గ ఓపికగా సహించింది. ఒక రోజు గురునాధ్ తన స్నేహితుని ఇంటికి తీసుకు వస్తాడు. అతనితో సంసారం చేయమని చెపుతాడు. అపుడు దుర్గ మానవత్వం మంటలో కలిసిపోయింది. దుర్గ శక్తి స్వరూపిణిలాగా మారిపోయి ఒక కొయ్య తీసుకొనీ భర్త తల మీద కొట్టి చంపేసింది (4)ఈ కథలోని గురునాధ్ లాగా దురలవాట్లు ఉన్నవాళ్ళు నేటి సమాజంలో ఎక్కువగానే ఉన్నారు. కొంతమంది త్రాగుబోతుల త్రాగిన మత్తులో మానవత్వం మరచి పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. భార్య, బిడ్డ, తల్లి, చెల్లి అనే తేడా లేకుండా మదం అహంకారంతో  కళ్ళు మూసుకుపోయి, ఇంటిలో ఆందరిన్ని కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా “వేశ్య” అనే మురికి గుంటలోకి తోసి, వారితో డబ్బు సంపాదించడం, ఆడబ్బుతో పొట్ట పోషించుకోవడం నేటి సమాజంలో ఒక వృత్తి లాగా మారిపోయింది. ఈ కథలో గురునాధ్ కూడా తన భార్య చేత వ్యభిచారం చేయించడానికి పూనుకున్నాడు. ఇదిఎలా ఉందంటే “కంచే చేను మేసినట్లుంది” ఇలాంటి భర్తలు రోజు మనం మన చుట్టుప్రక్కల, టి.వి లల్లో, వార్తా పత్రికలలో, చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. ప్రభుత్వం కఠినమైన శిక్ష వేయాలి. ఇంటినుండి, గ్రామాల నుండి వెలివేయాలి. అపుడేమిగతావారికి బుద్ధి వస్తుంది. ఈ శిక్షలు ఇలాంటి వారికి సరిపోవు.

ఈ కథలో రచయిత దుర్గా పాత్ర చేత, వ్యభిచారం చేయమన్న తన భర్తను కొయ్యతో తల మీద కొట్టి చంపడం చాలా సమంజసంగా ఉంది. ఇది అందరు అర్ధం చేసుకోవలసిన విషయం. ఇది ఎలా ఉందంటే ఒక పాముగానీ, చీమగానీ మనలను కరచినపుడు వాటి ను౦డి మన ప్రాణాలను కాపాడుకోవడానికి వాటిని చేతితోను, కర్రతోను చంపేస్తాం. ఈవిషయం అందరు అంగీకరించినపుడు, దుర్గా చేసిన పని కూడా అందరు అంగీకరించవలసిన విషయమే. ఆమేను తప్పు పట్టవలసిన పనిలేదు. పురుషులు ఈ కథలోని గురనాధ్గాతవ ౩ భార్యల దగ్గరగానీ, ఇతర స్త్రీల దగ్గరగానీచెడుగా ప్రవర్తించకూడదు. ఒక వేళ అలాప్రవర్తిస్తే ఈ కథలో గురునాధ్గా ప్రాణాలుకోల్పోవలసి వస్తుందనీ రచయిత ఈ కథల లోని దుర్గ పాత్ర ద్వారా మనకు సందేశం ఇచ్చారు.

2.5 కళ్యాణమస్తు:

“కళ్యాణమస్తు” కథలో ఆనంద్ కొడుకు జానకిరాము. ఇంజనీరింగ్ చదివే, కలెక్టరు కూతురు జ్యోతిని ప్రేమిస్తాడు. ఈ విషయంను ఆనంద్ కలెక్టరుకు చెపుతాడు. కలెక్టరు తన కూతురు మీద ఉన్న నమ్మకంతో నమ్మడు. ఇంతలో జ్యోతి ధైర్యంగా తండ్రితో ఇలాఅంటుంది. “నాన్నగారు నిజంగానే జానకిరామును ప్రేమించాను” అని చెపుతుంది. కలెక్టరు ఆమే ఇష్టాన్ని అంగీకరించి వివాహం జరిపిస్తాడు. (5)ఈ కథలో జ్యోతి తమ ప్రేమ విషయంలో జంకు, పిరికితనం, భయం లేకుండా నిజాయితీగా, ధైర్యంగా తన తండ్రితో చెప్పింది. తండ్రి తన కూతురును అర్ధం చేసుకొని వివాహం జరిపిస్తాడు. ఇది ఆయన సంస్కారాన్ని ఈ పాత్ర ద్వారా రచయిత మనకు తెలియజేసాడు. ఇలాంటి తండ్రులు సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు.జ్యోతిలాంటిఅమ్మాయిలుకూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు. అమ్మాయి అంటే ఇలాఉండాలి. కాని కొంతమంది అమ్మాయిలుతన ప్రేమ విషయం ఇంటిలో చెప్పడానికి భయపడి పోతూ ఉంటారు. తల్లితండ్రులు తిడతారు అనీ, ఆత్మహత్యకు గురిఅవుతూ ఉంటారు. కాని అలా చేయడం క్షమించరాని తప్పు. “అమ్మ అయినా అడగనిదే పెట్టదు” అనే సామెతఉంది. అంటే ఏదైనా సరే మొహమాటం లేకుండా ఈ కథలోని జ్యోతిలాగా అడగాలి. ఆ నిర్ణయం భవిష్యత్తు తరాలవారికి ఆదర్శంగా ఉండాలి. అందరూ తిట్టుకొనే విధంగా ఉండకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తల్లితండ్రులు, పిల్లలు ఒకరిపట్ల మరొకరికిగౌరవం, ప్రేమాభిమానాలు ఈ కథలోని వ్యక్తుల మధ్య ఉన్నట్లు ఉండాలనే రచయిత సందేశం. ఈ కథలో రచయిత జ్యోతి పాత్రను "ధైర్యవంతురాలుగా” తీర్చిదిద్దడం నేటిస్త్రీలకు ఆదర్శం అయ్యింది.

2.6 తిరస్కారంకాదు పరిష్కారం కావాలి:

“తిరస్కారం కాదు పరిష్కారం కావాలి” కథలో కళావతి కూతురు దివ్య-ప్రసాద్ అనేయువకుని చేతిలో మోసపోయి గర్భవతి అవుతుంది. ఆ విషయం తల్లి తెలుసుకొని,దివ్యను తిట్టకుండా అండగా నిలబడుతుంది. నీ బ్రతుకు చక్కదిద్దుతానని ప్రతిజ్ఞ చేస్తుంది. చైతన్య అనే పోలీసు కూడా కళావతితో పాటు ప్రసాద్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఇద్దరికి వివాహ౦చేస్తారు.(6) ఈకధలోని దివ్యలాగా నేటి ఆడపిల్లలు ప్రవర్తించకూడదు. “ఆడపిల్లఅరటిఆకులతో సమానం”. అంటే ఆకు వచ్చి ముల్లును గుచ్చుకున్నా, ముల్లు వచ్చి ఆకును గుచ్చుకున్నా నష్టపోయేది ఆకు మాత్రమే. ఈ ఆకు పరిస్థితే ఈ కధలోని దివ్యకు వచ్చిందనిస్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఆమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషులతోమాట్లాడవచ్చు. అయితే హద్దులు, మన సాంప్రదాయాలు, నియమ నిబంధనలను, అతిక్రమించకూడదు, దాటకూడదు. ఆలా దాటితే ఈ కధలో దివ్యలాగా ఏడుస్తూ కూర్చోవాలి. ఆడపిల్లఅమాయుకంగా ఉండకూడదు. ఒక ఆడపిల్లను చూడగానే ఇతరుల మనస్సులో భయం కలిగించాలి. ఎలా అంటే అది ఆడపిల్లకాదు అగ్గిపిల్ల, ఆడపులి, సింహం అనే భావం అవతల వారికి కలగాలి. అంటే మన మాటలతోను, చేతలతోను, కళ్ళతోను అవతలవారి గుండెలల్లో దడ పెట్టించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న ఆడపిల్లలు తమను కాపాడుకోడమే కాకుండా, తన చుట్టూఉన్న ప్రజలను కూడా రక్షిస్తారు. కాకిలా కలకాలం బ్రతకడంకంటే హంసలా ఆరు నెలలు బ్రతికినా చాలు.

అంటే స్త్రీలు అందరిచే అవమానాలు పొందుతూ, బానిస బ్రతుకుబ్రతకకూడదు. కొన్ని రోజులు జీవించినా “అబ్బా” అనిపించాలి. అలాంటి జీవితం ప్రతి ఒక్కరు కోరుకోవాలి.అలాంటి స్త్రీలు నాడు, నేడు ఉన్నారు. వారిని నేటి ఆడపిల్లలు ఆదర్శంగా తీసుకోవాలి. తల్లితండ్రులకు ఎందుకు ఈ ఆడపిల్లలు అని విరక్తి కలిగే విధంగా ప్రవర్తించకూడదు. మనల్నిఎవరు అయినా చూస్తే వారి మనస్సు ఏమి అనిపించాలంటే “నాకు ఒక ఆడబిడ్డ పుట్టి ఉంటే ఎంత బాగుండు” అని మనస్సులో పశ్చాత్తాపడాలి. ఆ విధంగా ఇతరులు ఆడపిల్లలు మీదఆశ పెంచుకోవాలంటే ప్రవర్తన బాగుండాలి. మన ప్రవర్తన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అలా ఎవరు అయితే ఉంటారో వారే అసలైన ఆడపిల్లలు. అలా లేనివారు ఊరు పేరు లేని హీనమైన జాతికి చెందినవారు అవుతారు.

తల్లితండ్రులు పిల్లలకు జన్మనివ్వడం సహజం. ఆ పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతారు. ఒక రాజుకు భటులు ఏవిధంగా సేవలు అందిస్తారో, అంతకన్నా ఎక్కువగా తల్లితండులు పిల్లలకు అందిస్తారు. కాని పిల్లలు వారికి ఇచ్చే బహుమానం ఏమిటంటేచుట్టుప్రక్కలవారి చేత అవమానాలు పొందడం. ఇలాంటి తిట్టులు వినడానికేనా, వాళ్ళు మీకు జన్మనిచ్చింది. ఒకసారి ఆలోచించండి. అసలు జీవితం అంటే ఏమిటి అని మనం ముందుచేసుకొవాలి. జీవితం అంటే కేవలం పెళ్ళి చేసుకొని పిల్లలు కనడం కాదు. ఆజీవితంలో చాలావిషయాలు దాగి ఉంటాయి. మొదట చదవాలి. చదువు పూర్తి అయి ఒక వృత్తిలో స్థిరపడాలి.ధర్మబద్ధంగా వివాహం చేసుకోవాలి. పిల్లలను కనాలి. పిల్లలను ఉత్తమంగా పెంచాలి. ఇలాంటి సంప్రదాయం మన భారతీయులు ప్రతి ఒక్కరు పాటిస్తారు. పురుషార్థాలు మనకు నాలగు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష అంటే వ్యక్తులు ఏపని చేసినా అందులో ధర్మం ఉండలి. కాని ఈ కథలో దివ్య- ప్రసాద్ చేసిన పనుల్లో ధర్మం లేదు. క్రమంలేదు. ఒక పద్ధతి లేదఎ. ఇలాంటి వ్యక్తులు నేటి సమాజంలో కోకొల్లలుగా కనిపిస్తారు. పిల్లలు, పెద్దలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొనీ, తమ జీవితంను అక్రమ పద్ధతిలో కాకుండా క్రమ పద్ధతిలో కొనసాగించాలనీ రచయిత ఈ కథ ద్వారా మనకు సందేశంఇచ్చారు.

2.7 పరిష్కార మార్గం:

“పరిష్కార మార్గం” ఈ కథలో ఒక గ్రామంలో ఒక పసిబిడ్డను చెట్టు క్రింద వదిలిపెట్టి విళ్ళిపోతారు. ఎస్.ఐ. చైతన్య ఒక అవ్వ ద్వారా బిడ్డ వివరాలు తెలుసు కుంటాడు, బిడ్డ తల్లిని జైలుకు రప్పించి వివరాలు అడుగుతాడు. సరళ పోలీసులతో మోహన్ అనే అతను నన్ను మోసం చేశాడు. నేను ఏమి చేయలేక చెట్టు క్రింద వదిలి పెట్టాను అని చెబుతుంది. పోలీసులు ఇద్దరికి నచ్చచెప్పిబిడ్డను వాళ్ళకు అప్పచెపుతాడు.(7) నేటి యువత ఈ కథలో మోహన్, సరళలాగా ప్రవర్తించకూడదు. పెద్దలకు తెలియకుండా పెళ్ళికాక మునుపే భార్యా భర్తలు లాగా ప్రవర్తించడం తప్పు. అది ధర్మానికి విరుద్ధంగా తయారు అవుతుంది. అంతేకాకుండా ఒక బిడ్డకు జన్మనివ్వడం, ఆ బిడ్డను మరలా బరువు అని ఒక అనాధలా వీధిలో వదిలివేయడం ఎలా ఉందంటే జంతువుల కంటే హీనంగావర్తించారనీ ఈ కథలోని సరళ, మోహన్ పాత్రల ద్వారా మనకు రచయిత తెలియజేశాడు.సహజంగా మన దేశంలో తల్లికి మొదటి స్థానం ఇవ్వబడింది. రెండవది తండ్రికి, మూడవస్థానం గురువుకు ఇవ్వబడింది. ఇది మనందరికి తెలిసిన విషయమే. పురుషుడుకు ఓపిక ఉండదు. కాని ఈ కథలో సరళకు ఏమయింది. ఒక తల్లిగా ఆలోచించకుండా ఒక కసాయి వాడిలాగా ఆలోచించి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదిలి వెళ్ళడం క్షమించరాని నేరం.ఇలాంటి తల్లులు నేటి సమాజంలో రోజూ వార్తా పత్రికలల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటితల్లులు ఏ జాతికి చెందినవారో వారే నిర్ణయించుకోవాలి. నేటి అమ్మాయి ఈ కథలో సరళలాగాచేయకుండా జాగ్రత్త పడాలి. మానవత్వం మరచిన, పశువులాగా ప్రవర్తించిన సరళ,మోహన్లు లాగా నేటి యువత ప్రవర్తించకూడదు. మనస్సున్న మానవులుగా సమాజంలో మెలగాలనీ రచయిత ఈకథ ద్వారా మనకు సందేశం ఇచ్చారు. నేటి యవత అంటే విద్యార్ధులు, పెద్దలు అందరు ఇలాంటి కథలను మరెన్నో చదివి మంచి ఏదో, చెడఏదో గుర్తించి సమాజంలో మెలగాలన్నా, తమ జీవతమును ఉత్తమ జీవితముగా సరిదిద్దు కోవాలన్నా, ఈవాస సందేశం.

3. ముగింపు:

స్త్రీలకు సమస్యలు రావడం ఈరోజు కొత్త కాదు. పురాణకాల స్త్రీలకు గానీ, ఇతిహాస కాలయునాటి స్త్రీలకు గానీ సమస్యలు వచ్చాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు, గెలిచారు. ఉదా: ద్రౌపతి, సీత, సత్యభామ వీరి కథలను తెలుసుకుంటేనే వాళ్ళు ఎలా తమ సమస్యలను తిప్పికొట్టారో మనకు తెలుస్తుంది. అలాంటి స్త్రీల కథలు నేటి స్త్రీలు ఆదర్శంగాతీసుకోవాలి. స్త్రీ సబల కాదు అబల అని చెప్పేవారికి నేటి స్త్రీలుబుద్దిచెప్పాలి.స్త్రీలకు సమస్యలు రాకుండా వుండాలంటే ముందు కుటుంబ- సభ్యులలో మార్పురావాలి. ఇంటిలోని అమ్మాయిలకి సమస్యలు ఎదురు అవుతుంటాయి. ఎలా అంటే లింగ భేదం చూపుతారు. అక్కడే అమ్మాయిలు మనసికంగా క్రుంగిపోతున్నారు. సమాజంలోమార్పు రావాలి. ఎలా అంటే అమ్మాయిలను చూడగానే సమాజం హేళన చేస్తుంది. ఎలా అంటే నువ్వు ఆడపిల్ల అనే ప్రశ్నలను లేవనెత్తుతారు. ప్రభుత్వం కూడా స్త్రీలకురక్షణఏర్పాటుచేశారు. అది కొంతవరకు మత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇంకా మరెన్నో రక్షణమార్గాలు తీసుకు రావాలి. వాటిని స్త్రీలు ఉపయోగించుకోవాలి. కొన్ని రక్షణ మార్గాలు వచ్చినా అవి అన్ని కొంతవరకు మాత్రమే రక్షణ కల్పిస్తాయి. అసలైన రక్షణ మార్గం స్త్రీకి ఒకటిఉంది. ఆది “ధైర్యం”. ఇది ఉంటే ఎలాంటి సమస్యనైనా స్త్రీలు పరిష్కరించుకుంటారని నాఉద్దేశం.

4. పాదసూచికలు:

  1. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-33
  2. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు - 17
  3. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-9
  4. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-13
  5. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-57
  6. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-45
  7. కాణిపాకం లింగన్న - పోలీసు కథలు - పు-5

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆనంద లక్షి, .సి. తెలుగు నవలలో కుటుంబ జీవనం, నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ, 1979.
  2. కుసుమకుమారి. సి. సాహిత్యం జెండర్ స్పృహ, సి.యస్.ప్రింటర్స్, ప్రకాశం రోడ్,తిరుపతి, 2005.
  3. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష, 2వ సంపుటము 18-1-700, తిరుపతి.
  4. శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్య చరిత్ర, 2014.

    లింగన్న, కాణిపాకం, పోలీసు కథలు, సాహితిక్షేత్ర ప్రచురణలు, చిత్తూరు, 2009.
  5. పైదే. భారత్ మహాన్, బాలల కథలు, చిత్తూరు, 2006.
  6. పైదే. వినాయక విజయం, శ్రీ బాలాజి ప్రెస్, చిత్తూరు, 1999.
  7. రాఘవయ్య, రెడ్డి, బాల సాహిత్య నిర్మాతలు, తెలుగు బాలల రచయితల సంఘం (1952-2002)
  8. వెంకటప్పయ్య, వెలగ బాలసాహితి వికాసం, సాద్దార్ధ పబ్లికేషన్స్ విజయవాడ, 1982.
  9. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి, కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లికేషన్ హౌస్, హైద్రాబాద్, 2008.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]