headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. రాయలసీమ కథలు: విద్యార్థుల విభిన్నధోరణులు

కె. నాగరాజు

పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం,
కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9390020376, Email: pulikondaraju.nagaraju19@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కథల్లో చాలా వరకు కల్పనలకే ప్రాధాన్యముండవచ్చు. కానీ సాంఘిక, సాంస్కృతిక ఇతివృత్తం నేపథ్యంలో వచ్చిన కథలు వాస్తవికచిత్రణలకే ఎక్కువ ప్రాతినిథ్యాన్ని కల్పిస్తాయి. సంఘటనాత్మక కథాకథనాలలో పాత్ర చిత్రణలతో కథలు వెలుగుచూస్తుంటాయి. రాయలసీమ కథా రచయితలు తమ కథల్లో విద్యార్థినిబద్ధత, విద్యార్థివ్వక్తిత్వం, విద్యార్థి మానసిక ఆందోళన, విద్యార్థుల భక్తి - విచిత్ర ధోరణి, విద్యార్థుల క్షవరం మొదలైనాంశాలును సూక్ష్మంగా పరిశీలిస్తూ ఈ వ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిలో చర్చిస్తుంది. రాయలసీమ ప్రాంతనేపథ్యంతో వెలువడిన ఎంపికచేసుకున్న కథాసంపుటాలు ఈ పరిశొధనకు ప్రాథమికాకరాలు. స్వయంవిశ్లేషణకు ఉపకరించిన వివిధ గ్రంథాలు, వ్యక్తిత్వవికాస సంబంధ కరదీపికలు ఈ వ్యాసానికి ద్వితీయవిషయసామగ్రి.

Keywords:రాయలసీమ, కథలు, విద్యార్థుల ప్రవర్తనలు, ధోరణులు, నిబద్ధత, ఆందోళన

1. ప్రవేశిక:

ఒక విద్యార్థి విశిష్టమైన వ్యక్తిగా ఆవిర్భవించడంలో ఉపాధ్యాయుని పాత్ర అపరిమితమైంది. క్రమశిక్షణ, సమయపాలన, మంచి అలవాట్లు కలిగి ఉండటం, పరిసరాలపట్ల శ్రద్ధ కనపరచడం, మానవతా విలువలకు పెద్దపీట వేయడం, బాధ్యత తెలుసుకొని ప్రవర్తించడం, లక్ష్య సాధన దిశగా, నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే విశిష్ట వ్యక్తిత్వంగల వ్యక్తిగా గుర్తింపు పొందగలుగుతారు. ఎవరైనా సరే పిల్లల్లో ఆది నుంచి ఈ లక్షణాలను పెంపొందించుకోవడంలో తల్లిదండ్రులతో పాటు టీచర్ల బాధ్యత కూడా ఉందని గట్టిగా చెప్పవచ్చు.

పిల్లలు బాల్యంలో చిలిపితనం, కొంటెతనం, పెంకితనంతో కొంత మొండిగా వ్యవహరించడం ఎవరికైనా సహజమే. అందమైన పువ్వుకి రంగులు, పరిమళం ఎంత సహజ సిద్ధంగా ఎలా అమరుతాయో, అదేవిధంగా అల్లరి, ఆకతాయితనం, చదువుని భారంగా భావించడం వంటివి పిల్లల్లో సర్వసాధారణంగా ఉండే లక్షణాలు. అయితే ఇవి శృతిమించకుండా అదే సమయంలో బాల్య లక్షణాలను కోల్పోకుండా చూడడం గురువు బాధ్యత.

ఉపాధ్యాయులు ప్రకృతిలో ఉన్న అతి సున్నితమైన, సుకుమారమైన, సౌందర్యభరితమైన, అద్భుతమైన అంశాలను గమనించి, వాటి సౌకుమార్యాన్ని, ఆ అందాన్ని ఆస్వాదించగల తత్వాన్ని పిల్లలకు నేర్పించగలగాలి.

2. నిబద్ధత విద్యార్థి:

కొందరు విద్యార్థులు నిబద్దతతో చదువుకుంటారు. తల్లిదండ్రులు గానీ, ఉపాధ్యాయులు గానీ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి బాగా పొద్దుపోయినంతవరకు చదివి అలసటతో పడుకుంటే, తెల్లవారుఝామున అతన్ని లేపటానికి తల్లిదండ్రులకు మనసురాదు. ఇలాంటి విద్యార్థి నిబద్ధతను గూర్చి కథకుడు డా. కొమ్మిశెట్టి మోహన్ ఇలా తెలిపారు.

"ఒరే! బాబూ! లేవరా! తెల్లవారుతోంది. అయిదు గంటలు కావస్తోంది. లేచి చదువుకో! నేను ఆకాశ్ని నిద్ర లేపడం ఇది రెండవసారి. మామూలుగా ఆకాశ్ని ఇన్నిసార్లు లేపనవసరం లేదు. రోజు తెల్ల‌వారుఝామున‌ నాలుగున్నరకు అలారం మోగగానే వాడే ఠక్కున లేచి కూచుంటాడు. కానీ రాత్రి చాలా పొద్దుపోయే వరకు చదువుకున్నాడు. దాదాపు ఒంటిగంట వరకు మేల్కొనే ఉన్నాడు. సాధారణంగా రోజు పదకొండు గంటలకే నిద్ర పొమ్మంటాను. మళ్లీ తెల్ల‌వారుఝామున‌ లేచి చదువుకుంటాడు. పరీక్షలు ఇక రెండు రోజులే ఉన్నందున వాడు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రాత్రి ఒంటిగంట వరకు మేల్కొనే చదువుకున్నాడు. అందుకే తెల్ల‌వారుఝామున‌ వాన్ని నిద్ర లేపడం నాకు శాంతికి కూడా ఇష్టం లేదు కానీ మళ్ళీ వాడు ఎందుకు లేపలేదని గొడవ చేస్తాడు. అందుకని లేపక తప్పలేదు.” (పూల పరిమళం పరీక్ష - పుట 7, డా. కొమ్మిశెట్టి మోహన్) అంటూ బాగా చదివే విద్యార్థి క్రమశిక్షణ కలిగిన విద్యార్థి చదువుకునే తీరును కథకుడు డా. కొమ్మిశెట్టి మోహన్ తెలిపాడు.

ఇలాంటి విద్యార్థులకు మంచి విద్యనివ్వాలి. సలహాలు సూచనలు ఇవ్వాలి. వాని పురోగతికి సకల వసతులు కల్పించాలి. అలాంటి విద్యార్థి భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్త కావచ్చు. ఇంజనీర్ కావచ్చు. మంచి రాజనీతిజ్ఞుడు కావచ్చు. అందరికంటే మిన్నగా ఒక మంచి ఉపాధ్యాయుడూ తయారు కావచ్చు.

ఏ స్కూల్ లోనైనా ఉన్న విద్యార్థులను భవిష్యత్తులో ఏమవుతావని అడిగితే దాదాపు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామంటారు. ఇతర శాఖల అధికారులౌతామని గానీ, రైతునవుతానని గానీ, మంచి ఆదర్శ రాజకీయ నాయకుడిని అవుతానని ఎవరు చెప్పడం లేదు. దీనిని బట్టి ప్రజల వ్యవహారం, ఆలోచన తీరు ఎలా ఉందో అర్థమవుతున్నది. 'యథారాజ తథా ప్రజా' అన్నట్లు తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎంత గాఢంగా పడుతున్నదో ఈ ఘటన ద్వారా విస్పష్టంగా చెప్పవచ్చు.

3. విద్యార్థి వ్య‌క్తిత్వం:

చిన్న పిల్లల ప్రేమ కల్మషం లేకుండా ఉంటుంది. రిషిక అనే పాప తన బహుమతులను తన స్నేహితురాలికి ఇస్తుంది. ఆ పాప పేదది. బర్త్ డే ఆడంబరంగా జరుపుకోలేక పోతున్నదని ఇచ్చానంటుంది. గిఫ్ట్ విష‌య‌మై మొదట కోప్పడిన తల్లి తండ్రులు, ఆ తరువాత అసలు విషయం తెలిశాక సంతోషం వ్యక్తం చేస్తారు. చెప్పమ్మా! అమ్మ అడుగుతుంది కదా! ఏం చేశావు? స్కూల్లో మరిచిపోయి వచ్చావా? లేక ఎవరైనా దొంగలించారా? శాంతి బుజ్జగింపుగా అడిగింది లేదు అని పొడిగా సమాధానం చెప్పి, రిషిక మళ్లీ మౌనం దాల్చింది! అడిగిన దానికి సమాధానం చెబుతావా లేక నాలుగు అంటించమంటావా? వాళ్ళమ్మ గట్టిగా కోపగించుకుంది. రిషిక ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్లు మెల్లగా, శాంతి ఉన్నచోటుకు వచ్చి నిలబడింది. సంజాయిషు ఇచ్చుకుంటున్నది. వాళ్ళ అమ్మకి అయినా నానమ్మ ఉద్దేశించి అంది. అది కాదు నానమ్మ! మా క్లాసులో రాధిక అని ఒక అమ్మాయి ఉంది. చాలా మంచిది. ఆ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్! నేనింటి నుంచి తీసుకువెళ్లిన బొమ్మలు, చాక్లెట్లు ఆ అమ్మాయికి ఇచ్చేశాను. ఈసారి బర్త్ డే బాగా చేసుకోమని చెప్పాను. మొదట ఆ అమ్మాయి తీసుకోలేదు. వద్దంది. నేనే బలవంతంగా ఇచ్చాను. ... కోప్పడరులే! నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా! కాబట్టి నీ బర్త్ డే కి గిఫ్ట్ ఇచ్చానని చెప్పు. నువ్వు తీసుకోకపోతే, నువ్వు నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా అనుకోవడం లేదని నేను బాధపడతాను. తరువాత నీ ఇష్టం అన్నాను. అప్పుడు గాని ఆ అమ్మాయి తీసుకోలేదు. మీతో ముందుగా చెబితే కోప్పడతారేమోనని చెప్పలేదు. రిషిక పాఠం అప్ప చెప్పినట్లు త్వరత్వరగా చెప్పేసి, చేతులు కట్టుకొని నిలబడింది. (పూల పరిమళం - బర్త్ డే గిఫ్ట్ - పుట 87 - డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్) అంటూ కథకుడు కల్మషం ఎరుగని పిల్లలు ప్రేమకు తార్కాణంగా రిషిక అనే బాలిక ఉదార గుణాన్ని చిత్రించాడు. బాల్యంలో అందరూ ఉదారగుణం కలిగి ఉంటారు. పెద్ద అవుతుండగా వారిలో కల్మషం కూడా పెరుగుతూ వస్తుంది. స్వార్థాన్ని పెద్దలను చూసి నేర్చుకుంటారని చెప్పవచ్చు.

4. మానసిక ఆందోళన:

కొందరు విద్యార్థులు అసాధారణమైన ప్రతిభ చూపుతారు. అయితే వారి కుటుంబంలోని తల్లిదండ్రుల కలహాలు వారిపై చెరగని ముద్ర వేస్తాయి. దాంతో వారు మానసికంగా శారీరకంగా కృంగిపోతారు. అలాంటి విద్యార్థుల మనస్తత్వాన్ని కథకుడు డా. శాంతి నారాయణ ఇలా తెలిపాడు.

మా క్లాసులో అందరికంటే రంగస్వామికే ఎక్కువ మార్కులు వచ్చేవి. అందువల్ల టీచర్లకు, పిల్లలకు వాడంటే ఎంతో ఇష్టం. అందరితోనూ కలిసి మెలిసి సంతోషంగా గడుపుతూనే అప్పుడప్పుడు వాడు నా దగ్గర తన తండ్రి మితిమీరిన తాగుడూ, తమ ఇంటి పరిస్థితిని చెప్పుకొని కన్నీళ్లు కార్చేవాడు. తన పస్తుల బ్రతుకును, తనకోసం తన తల్లి పడుతున్న కష్టాన్ని తలుచుకొని బాధపడేవాడు. తన కన్నతల్లి కళ్ళల్లో సంతోషపు తృప్తిని చూడాలని ఆశపడేవాడు. అందుకోసమే తాను ఎలాగైనా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని కలలు కనేవాడు (నమ్ముకున్న రాజ్యం - తులసి వనంలో తుమ్మ చెట్టు - పుట 94 శాంతి నారాయణ) అంటూ ఒక విద్యార్థి కుటుంబ నేపథ్యాన్ని కథకుడు డా. శాంతి నారాయణ చక్కగా తెలిపాడు. ఒక విద్యార్థి చదువులు రాణించాలంటే మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం ఉండాలి. అవి రెండూ ఉండాలంటే కుటుంబంలోని తల్లిదండ్రులు సఖ్యతగా ఉండాలి. అలా లేకుంటే కుటుంబంలోని కలతలు పిల్లలపై ప్రభావం చూపుతాయి.

5. విద్యార్థుల భ‌క్తి - విచిత్ర ధోర‌ణి:

కొందరు విద్యార్థులు ఏదో ఒక దేవుని పేరుతో మాల వేస్తారు. ఆ సందర్భంలో వారిని స్వామి అని పిలవాలి అంటారు. దీనిని అందరూ అంగీకరిస్తారేమో కానీ అభ్యుదయవాదులు అంగీకరించరు. అలాంటి ఒక సన్నివేశాన్ని కథకుడు డా. శాంతి నారాయణ ఇలా తెలిపాడు.

నీరజ కాలేజీ వదిలేయడానికి కారకులైన విద్యార్థులే విద్యార్థి యూనియన్ సెక్రటరీ, ఎమ్మెల్యే గారి కుమారుడు, మా కొలీగ్ భాస్కర్ రెడ్డి కొడుకు, అందరూ ప‌ది మంది ఉన్నారు. వాళ్ళందరూ నల్లని బట్టలు వేసుకొని భుజాల మీద కాషాయం రంగు గుడ్డలు కప్పుకొని నుదుట తెల్లని తిరుమణి బొట్టు పెట్టుకున్నారు. మెడలో మాలలు వేసుకున్నారు. విద్యార్థుల అటెండెన్స్ తీసుకోవడం మొదలు పెట్టాను. అతడు తనను పేరుతో పిలవకూడదు అని, స్వామి అని పిలవాలని సలహా ఇచ్చాడు. నేను అలా పిల‌వ‌న‌న్నాను. కావాలంటే అటెండెన్స్ వేస్తాన‌న్నాను. అదేం కుద‌ర‌దు. త‌న‌ను స్వామి అని పిల‌వాల‌నీ, అప్పుడే తాను ప్ర‌జెంట్ ప‌లుకుతాన‌ని నిల‌దీశాడు. ప్రియ మిత్రుడైన తోటి లెక్చరర్ భాస్కర్ రెడ్డి బాధపడుతూ స్వామి అంటే మన సొమ్ము ఏం పోతుంది. ఈరోజు మన విద్యార్థులు ఈ వేషంలో వచ్చి తమను స్వామి అని పిలవమంటే అలాగే పిలుద్దాం. రేపు దిగంబ‌రంగా వ‌చ్చి యోగీశ్వ‌రా అని పిలువ‌మంటే అలాగే పిలుద్దాం రా.” (నమ్ముకున్న రాజ్యం - స్వాములు - పుట 29) అంటాడు ఒక సాటి లెక్చరర్ కథకునితో. ఆ లెక్చరర్ తన కుమారుని మందలించకుండా సమర్థిస్తూ వెనకేసుకొస్తాడు. అలా చేసిన ఆయనకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పవచ్చు.

క్రమశిక్షణ విషయంలో సామాజిక బాధ్యత పెంచే విషయంలో మొహమాటానికి అవకాశం ఇవ్వరాదు. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో మరి నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలు తాము ఏదో ఒక దేవుని పేరుతో మాలధారణ చేస్తే, ప్రజలందరూ స్వామి అని పిలుస్తారని, దాని ద్వారా తమ ఇమేజ్ ఎంతో పెరుగుతుందని భావిస్తున్నారు. దానిని హీరోయిజంగా కొందరు భావిస్తున్నారు. ఈ దృక్పథం లేదా భావజాలం పిల్లలను లేదా విద్యార్థులను చెడుదారుల్లో పయనింప చేస్తుందని గట్టిగా చెప్పవచ్చు.

ఇలాంటి వేలం వెర్రి భక్తిని గూర్చి గజ్జలమల్లారెడ్డి ఇలా 'భక్తి రసం' అనే గేయంలో ఇలా తెలిపారు.
తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతుంది డ్రైనేజీ స్విమ్ లేక డేంజర్గా మారుతుంది (మల్లారెడ్డి గేయాలు - పుట 68 - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, హైదరాబాద్ 1985) అంటాడు. ఈ చరణాలు ఆంధ్రదేశంలో ఒకప్పుడు మారుమ్రోగాయి.”

6. విద్యార్థులు – క్షవరం (హేర్ కటింగ్‌)

విద్యార్థులపై సినిమాల ప్రభావం బలంగా పనిచేస్తుంది. హీరోలు ఎలా వ్యవహరిస్తే అలా పిల్లలు, యువత నడుచుకుంటారు. అలాంటి వాటిలో ప్రధానమైనది హెయిర్ కటింగ్. నేడు పిల్లలు చేయించుకుంటున్న హెయిర్ కటింగ్ గురించి కథకురాలు ఆర్. శశికళ ఇలా అంటారు.
ఎర్రగా బొద్దుగా ఉన్నాడు శివ. ఈమధ్య చిప్పకటింగ్ కొట్టించినట్లుంది. వాడి క్రాప్ చూస్తే నవ్వొస్తుంది.” (మా తుఝె సలాం- లొంగుబాటు పుట్ట. 40 - ఆర్. శశికళ) అంటారు కథకురాలు శశికళ.

నాన్నకు ప్రేమతో సినిమాలో హీరో జూనియర్ ఎన్టీ రామారావు చిప్ప కటింగ్ చేయించుకొని నటిస్తాడు. దాన్ని చూసిన విద్యార్థులు, యువకులు అలా కటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అది చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. దీని ఉపాధ్యాయులు గట్టిగా వ్యతిరేకిస్తున్నా తల్లిదండ్రులు మాత్రం సమర్థిస్తున్నారు. అలా కటింగ్ చేసుకోవడం సభ్యత కాదని, చిన్న పనిష్మెంట్ ఇస్తున్న ఉపాధ్యాయులపై దాడులకు కూడా దిగుతున్నారు. నేటి కటింగ్ వికృత రూపాన్ని ఇలా పేర్కొనవచ్చు. చుట్టూ బోడిగా కొట్టించుకుని పైన జుట్టు పెంచడం సంవత్సరం నెంబరు రూపంలో కటింగ్ చేయడం.

చుట్టూ జుట్టు కత్తిరించుకొని నడి నెత్తిన వెంట్రుకలు పెంచి ముఖం ముందుకు వెనుకకు వేయడం. చుట్టూ కత్తిరించుకొని మధ్య వెంట్రుకల్లో కొంత భాగానికి రంగులు వేసుకోవడం వంటి వికృతి కటింగ్ చేష్టలకు పాల్పడుతున్నారు.
ఇలాంటి వికృతి చేష్టలు మంచివి కాదని రూఢిగా చెప్పవచ్చు ఇందులో తల్లిదండ్రుల బాధ్యత ప్రధానంగా ఉంది.

వీటి రద్దుకు ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సి ఉంది.

  • తల్లిదండ్రులను చైతన్యవంతం చేయడం
  • బార్బర్లకు హెచ్చరికలు జారీ చేయడం
  • ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం
  • పోలీసులు కఠినంగా వ్యవహరించడం
  • సెన్సార్ వారు అనుమతించకపోవడం వంటి చర్యలు తీసుకుంటే ఈ వికృతి చేష్టలను సమాజం నుంచి దూరం చేయవచ్చు

పిల్లలు ఇలా తయారు కావడాన్ని పర్సనాలిటీ డిసార్డర్ అంటారు ఈ విషయాన్ని గూర్చి డా. బి.వి. పట్టాభిరామ్ ఇలా అంటారు.

సహజంగా వ్యక్తిత్వంలోని లక్షణాలు ఇలా ఉంటాయి. అభిమానం, మొండితనం, కలుపుగోలుతనం, దాతృత్వం, తెలివి, అతి తెలివి, స్వతంత్ర స్వభావం, నెమ్మదితనం, విశ్వాసం, ఆవేశం, అధికార తత్వం, మితభాషితం, సున్నితత్వం, శ్రమ పడటం, పట్టుదల, కృషి, దీక్ష, ఓపిక, స్నేహం. అన్నింటికీ భయం, తెగింపు, దేనికి భయం లేకపోవడం, ఆధారపడటం, ఎవరిని లెక్క చేయకపోవడం, స్వయంకృషి, ఆత్మాభిమానం, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం... ఇలా అనేక లక్షణాలు ఉంటాయి. వీటి సమ్మేళనమే పర్సనాలిటీ ప్రతి మనిషి జీవితంలో కొన్ని పాత్రలను తప్పక పోషించి తీరాలి అదేవిధంగా వయసును బట్టి తాహతును బట్టి కూడా కొన్ని లక్షణాలను మనం తెచ్చుకోవాలి అలవాటు చేసి కోవాలి ఉదాహరణకి టీజర్ దగ్గర మాట్లాడే విద్యార్థి ఎంత స్వతంత్ర భావాలున్న టీచర్ తో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అలాగే టీచర్లు పిల్ల‌ల్లాగా మాట్లాడిన లేదా పిల్లల చేత బుద్దులు చెప్పించుకునే పరిస్థితి వచ్చినా వారి పర్సనాలిటీలో తేడా వచ్చినట్లే దీన్ని పర్సనాలిటీ డిసార్డర్ అంటారు.” (మాస్టర్ మైండ్ - పుట 61 - ప్రచురణ: ఎమ్ఎస్కో విజయవాడ - జనవరి 2004) అని తెలిపారు. కాబట్టి విద్యార్థి పర్సనాలిటీని అభివృద్ధి చేసుకోవాలి గాని, వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు.

7. ఆడ‌పిల్ల‌లు - వివక్ష:

చాలామంది తల్లిదండ్రులు బాలిక విద్య పట్ల వివక్ష చూపుతున్నారు. వారికి చదువు పెద్దగా అవసరం లేదని, ఇంటిపని చేయాలని భావిస్తుంటారు. చైతన్యవంతులైన బాలికలు ఎదురు తిరిగితే వారిపై భౌతిక దాడులు చేస్తారు. బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇది నేటికీ కొనసాగుతున్నది.

తండ్రికి కాపీ అందిస్తూ ఏమిటన్నట్లు చూశాడు. నాన్నా ఈ పూట శేఖర్ని పనులు చూసుకోమని చెప్పండి. నేను చదువుకుంటాను. ఇంట్లోనే ఉన్నాడు కదా. చదువుకోలేదు. క్రికెట్కు పోలేదు. నేను చెప్తే నా మీద పోట్లాడుతున్నాడు - రజని. ఆ... అదేదో వినకూడని, నేరమైన విషయమన్నట్లు ముఖం పెట్టి ఒసేయ్‌ లక్ష్మీ... చూడే నీ కూతురి ఘనకార్యం. చదువు అప్పుడే మాన్పిద్దామంటే విన్నావు కాదు. నేను వాడు వంట చెయ్యాలట. అదేమో చదివి వూళ్ళేలుతుందట. పైన అతి మాటలు కూడా నేర్చింది. ఆడదాన్ని ఎంతట్లో పెట్టాలో అంతట్లో పెట్టకపోతే' - ఇలా సాగుతుంది ఆయన మాటల ధోరణి” (చదువు కథలు - పాము-కప్ప - పుట 182 - శశికళ) అంటారు కథకురాలు శశికళ. కథకురాలి మాటలు నూటికి నూరు శాతం యథార్థమని గట్టిగా చెప్పవచ్చు.

ఈ వివక్షను గూర్చి డా॥ రమాదేవి ఇలా అంటారు.

స్త్రీలు ఇల్లు కనిపెట్టుకొని ఉండాలి. పిల్లల్ని పెంచాలి. అందరికీ సేవ చేయాలి. పురుషుడు సంపాదించాలి. వగైరా బాధ్యతలు ఇవ్వడం మారాయి. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. అపుడు ఇంటిపనులు పిల్లల పనులు, సేవలూ పంచుకోవాలి. ఉద్యోగం చేసినా సరే అన్నీ ఆడదే చేయాలంటే ఆ కుటుంబంలో ఎంత కాలం సయోధ్య ఉంటుంది. ఉద్యోగం చేయాలి కానీ సంపాదనపై హక్కు లేదంటే... సాగుతుందా? పాతరోజుల మాదిరే అన్ని అంశాల్లో అహంకారం చూపితే ఊరుకుంటుందా? అట్లా అహంకరించడం సరైందా? కుటుంబంలో హింస, ఆధిపత్యం కొనసాగితే కుటుంబం స్థిరంగా ఉంటుందా? కాబట్టి కుటుంబం స్థిరంగా ఉండాలంటే కుటుంబంలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు సమాన బాధ్యతలు ఉండాలి. ఎవరి వ్యక్తిగత అవసరాలు అవకాశాల మేరకు వారు పని పంపకం చేసుకోవచ్చు. అంతే కాని, మూసపాత్రల మాదిరిగా స్త్రీలు పురుషులు ఉండాలనటం కుటుంబానికి, సమాజ పురోభివృద్ధికి ఆటంకం. కాబట్టి జెండర్ గురించీ, వివక్షత గురించీ, స్త్రీల పట్ల చిన్న చూపు గురించి, స్త్రీలను ఆటంక పరిచే అలవాట్లు, ఆచారాల గురించి మాట్లాడటం ప్రారంభించగానే మనకు తెలియకుండానే మనం దాన్ని వ్యతిరేకించటం మూసపాత్రలను సమర్థించటం చేస్తాము. ఇది మార్పు పట్ల మనిషికి ఉండే అంతర్గతమైన భయంలో భాగమే," (జెండర్పై ఉపాధ్యాయ కరదీపిక - పుట 9 - ప్రచురణ: రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్, 2006) అంటారు. ఒకప్పుడు స్త్రీలపట్ల వివక్ష ఉండేది. నేడది క్రమంగా తగ్గుతూ వస్తున్నది. దీనికి ప్రధాన కారణం స్త్రీలు విద్యావంతులు కావడం, ఉద్యోగాలు చేయడం, చైతన్య వంతులు కావడంగా పేర్కొనవచ్చు.

8. ముగింపు:

గ‌త‌కాల‌పు విద్యార్థుల‌తో పోల్చి చూస్తే నేటి విద్యార్థుల్లో అనేక వింత ధోర‌ణులు క‌నిపిస్తున్నాయి. భావిభార‌త పౌరులైన ఈ విద్యార్థుల ధోర‌ణులు స‌మాజానికి హిత‌క‌ర‌మైనవి కావ‌ని చెప్ప‌వ‌చు్చ‌. ఈ వాస్త‌వాన్ని గుర్తించిన రాయ‌ల‌సీమ క‌థ‌కులు చ‌క్క‌ని సామాజిక స్పృహ‌తో వాటిని చిత్రించి దిశానిర్దేశం చేశారు. ఆ మార్గంలో విద్యార్థులు ప‌య‌నించేట‌టు్ల చేయాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులు, ఉపాధా్య‌యుల‌, మేదావుల‌పై ఉంద‌ని గ‌ట్టిగా చెప్ప‌వ‌చ్చు.

ఈ  వ్వాసం విద్యార్థుల్లోచైతన్యానికి సంకేతంగా , జీవనానికి ప్రతిభింబంగా చెప్పవచ్చు.  విద్యార్థుల పై తల్లిదండ్రుల ప్రభావం ఏవిధంగా ఉంటుందో తెలియజేస్తూ,  బాల్యంలో అందరూ ఉదారగుణం కలిగి ఉంటారు . పెద్ద అవుతుండగా స్వార్దాన్ని పెద్దలను చూసి నేర్చుకుంటారని కథారచయిత కొమ్మిశెట్టి మోహన్ తమకున్న సమాజిక  స్పృహతో తెలియజేశారు. 

ఒక విద్యార్థి చదువులో రాణించాలంటే మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, కుటుంబంలోని తల్లిదండ్రులు సఖ్యతగా ఉండాలని రచయిత శాంతినారాయన తెలియజేశారు . పిల్లలపై  సినిమా ప్రభావం ఏవిధంగా ఉంటుందో రచయిత ఆర్.శశికళ తెలియజేశారు. దీనికి కారణం రచయితకు  సమాజంపట్ల ఉన్న అవగాహన, సామాజిక సృహయేనని చెప్పవచ్చు.

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. జెండర్పై ఉపాధ్యాయకరదీపిక, ప్రచురణ: రాష్ట్ర విద్య, పరిశోధన శిక్షణ సంస్థ, హైదరాబాద్, 2006.
  2. మల్లారెడ్డి గేయాలు,  ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిక్ హౌస్, హైదరాబాద్, 1985.
  3. మాస్టర్ మైండ్. ప్రచురణ: ఎమ్ఎస్కో, విజయవాడ, జనవరి 2004.
  4. మోహ‌న్‌ , కొమ్మిశెట్టి. పూల పరిమళం. విజ‌య‌వాణి ప్రింట‌ర్స్‌, చౌడేప‌ల్లి, చిత్తూరు జిల్లా, 2016.
  5. విశ్వ‌నాథ రెడ్డి, కేతు. స‌త్య‌నారాయ‌ణ‌, పోలు. చ‌దువు క‌థ‌లు. ప్లానోగ్రాఫ‌ర్స్‌, హైద‌రాబాద్ , 1994.
  6. వెంక‌ట‌సుబ్బ‌య్య‌, వ‌ల్లంపాటి. క‌థాశిల్పం.  విశాలాంధ్ర ప‌బ్లిక్ హౌస్, విశాకపట్నం, 2016.
  7. శ‌శిక‌ళ‌, ఆర్‌. మా తుఝే స‌లాం. చ‌రిత ఇంప్రెష‌న్స్‌, ఆజామాబాద్‌, హైద‌రాబాద్, 2017.
  8. శాంతి నారాయ‌ణ‌. న‌మ్ముకున్న రాజ్యం. చరితా గ్రాఫిక్స్‌, సికింద‌రాబాద్, 2004.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]