headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-12 | November 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. అధిభౌతికవాది డా. వాసిలి వసంతకుమార్: రచనావైశిష్ట్యం

ఆచార్య కె. ఆశాజ్యోతి

శాఖాధ్యక్షులు, తెలుగు అధ్యయన విభాగం,
బెంగళూరు విశ్వవిద్యాలయం,
బెంగళూరు, కర్ణాటక.
సెల్: +91 9449672394, Email: ashajanardan@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

వర్తమానంలో అనుసరణీయ ఆలోచనలద్వారా సమాజాన్ని చైతన్యపరిచే సాధకులు, సిద్ధయోగులు అనేకులు తారసపడుతూ ఉంటారు. ఈ పంక్తిలో అగ్రగణ్యులు విశ్వర్షి వాసిలి వసంతకుమార్ - సాధనామార్గంలో సమున్నతమైన, ప్రత్యేకమైన దృక్పథాన్ని పాఠకులకు అందించే వ్యక్తిక్తవికాసాత్మక, మనోవిశ్లేషణాత్మక, తత్త్వ, యోగ, రహస్యబోధన గ్రంథాలతో పాటు సుందరమైన సాహిత్యాన్వితమైన ఎన్నో విలువైన రచనల్ని చేసారు. డా. వాసిలి కవిత్వంలో వ్యక్తిత్వాన్ని, రచనావైశిష్ట్యాన్ని, ఆత్మబోధాత్మక సిద్ధాంతాలను వివరిస్తూ... విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. వీరి రచనల్లో అధిభౌతికవాదాన్ని సోదాహరణంగా దర్శింపజేస్తూ, సమాజహితాన్ని కాంక్షించే సాహిత్యసృజనకు నిరుపమ నిదర్శనం - డా. వాసిలి రచనాసమాహారంగా నిరూపించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. యోగాలయ రీసెర్చి సెంటర్ హైదరాబాద్ వారు ప్రచురించిన, ఎంపిక చేసిన కొన్ని 'వాసిలి'  రచనలు ఈ వ్యాసరచనకు ఉపకరించిన ప్రధానవనరులు. భగవద్గీతాది అధ్యాత్మగ్రంథావళి పరిశోధనాంశ విశ్లేషణలకు తోడ్పడిన ద్వితీయ విషయసామాగ్రి.

Keywords: అధిభౌతికవాదం, ఆధ్యాత్మికత, చైతన్యం, సాహిత్యం, యోగ, వాసిలి.

1. ఉపోద్ఘాతం:

జీవితాన్ని దొర్లించేస్తుంటే ఉప్పగానే ఉంటుంది

జీవితాన్ని కదిలించగలిగితే కర్పూరమే అవుతుంది” - శార్వరి

విశ్వర్షి వాసిలి ఏకోన్ముఖజీవి. తండ్రి శార్వరి ఆశలను, ఆశయాలను అంది పుచ్చుకున్న తనయుడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలన్న ఆకాంక్ష. అధిభౌతిక తత్వం ఆవహించిన ఆధాత్మిక జీవి. పుంఖానుపుంఖాలుగా అక్షరధారలు కురిపించిన యౌగిక బాటసారి. సంఘజీవిగా ఉంటూ ఆధ్యాత్మికతను ధరించి, అధిభౌతికతను ప్రవచించిన యోగి. కాలంతో సాగిపోక కలంతో కొత్త దివిటీలను వెలిగించిన వైవిధ్య వ్యక్తిత్వం. మనసును గెలవడం కోసం ఎన్నో దారులు అన్వేషించిన అధిభౌతికవాది. అన్నిటికీ మించి ఆశావాది. మనిషి అభ్యున్నతిని కోరుకున్న ఆశావాది. ‘సేవాదృక్పథంతో స్పందిస్తుండడమే జీవన శ్వాస’ అంటాడు. (జీవన గీత- కర్మక్షేత్రమే కానీ క్రీడాక్షేత్రం కాదు- పుట:146) తన చుట్టూ ఉన్న సమాజం కూడా తాను ఆవాహన చేసుకున్న తత్వాన్ని అర్థం చేసుకోవాలనీ, ఆచరించాలనీ, అనుసరించాలనీ అపేక్షించిన అధిభౌతికవేత్త.

2. డా. వాసిలి వ్యకిత్వం:

తండ్రి శార్వరి డా. వాసిలి రాసిన ‘మనకే తెలియని మన రహస్యాలు’ పుస్తకానికి ముందు మాట రాస్తూ “సరిగ్గా చెప్పాలంటే ఇదొక సీక్రెట్ డాక్ట్రిన్! ఎలుగెత్తి చెప్పలంటే సెల్ఫ్ డాక్ట్రిన్. మనసు రుగ్మతలకు మందులిచ్చే డాక్టరు కాకపోయినా, మానసిక చేష్టలకు విచికిత్స చేయగల మౌన ప్రాభావికవేత్త ... వసంతకుమార్ రచయిత మాత్రమే కాదు ... అక్షరాల యోగి ... మనసును సైతం దాటి పోయి ఆత్మ ప్రాంగణాలలో విహరిస్తున్నవాడు ... ప్రయోజనాలను ఆశించి బ్రతుకు సాగించలేదు కాబట్టి ప్రతిభాశాలిగా మిగిలాడు ... బ్రతుకులోను, రచనా వ్యాసంగంలోను తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు ... రిలీజియస్ కాదు కానీ, ఏ రీజియన్స్ కు లొంగని రిలీజియన్ అతడిది ... ఒక సైకాలజిస్ట్ ... ఒక ఫిలాసఫర్ కలగలిసిన సామాజిక - తాత్విక ప్రభంజనం డా. వాసిలి” (పుట : 12-13) అంటూ భిన్నపార్శ్వాలను కలిగిన డా. వాసిలి వ్యక్తిత్వాన్ని కళ్ళ ముందు నిలిపారు.

డా. వాసిలి ‘జీవనగీత’ను తండ్రికి అంకితమిస్తూ-

         ‘భౌతికంగా నాన్న గారిది శార్వరీయ జీవనం

         అధిభౌతికంగా గురువుగారిది శార్వరీయ యోగం

         ఆ జీవన వొత్తిళ్ళ యౌగిక పొత్తిళ్ళ

         అద్వైతిని నేను

         అందుకే ఆ అద్వితీయునికే

         ఈ పుస్తకం’

అంటాడు. భౌతికత - అధిభౌతికత కలనేత అద్వైతరుపంగా తానుండడానికి కారణమైన శార్వరికే, ఆ అద్వితీయ శార్వరికే అంకితమిచ్చాడు.

3. వాసిలి రచనలు – ఆత్మబోధ:

డా. వాసిలి ఆత్మ కేంద్రంగా రచనావ్యాసంగం సాగించాడు. అంతర్గతదృష్టితో ఆత్మవిశ్వజ్ఙతను అందుకోగలదని నమ్మిన వ్యక్తి. ఆత్మకు వైరుధ్యాలు, వైవిధ్యాలు ఉండవన్న నమ్మకం, ఏకత్వభావన పొటమరిస్తుంపుతో మానవసంక్షేమమే మరో జన్మఫలితం అన్న సంకల్పమే ఆత్మ పరిణితిగా రూపొందుతుందని అంటారు డా. వాసిలి. (యోగాలయ, పుట: 99) ప్రాపంచికవాసనల నుండి దృష్టి మరల్చి విశ్వాత్మపై మనసును మగ్నం చేయడం యోగసాధన. యోగదర్శనాల వల్ల విశ్వదర్శనాలను, విశ్వరహస్యాలను అందుకోగలమన్న వివరణ తెలిపే ప్రయత్నం డా. వాసిలి చేస్తారు. ఆత్మజ్ఙతతో జ్ఙానులం కాగలమన్నది వాసిలి ఉవాచ.

యోగం అన్నది ఇంద్రియతత్వం నుండి అతీంద్రియతత్వంగా పరిణామం చెందడం అంటాడు వాసిలి. Physical Immortality అంటే, అతీత కాయకల్ప స్థితి. భౌతిక శరీరానికి అతీతమైన అతీంద్రియ స్థితి కలగటం. ఇటువంటి స్థితిని భౌతిక శరీరనికి కల్పించడం Physical Immortality. దీనికి యోగా పరమ సాధనం అన్నది వాసిలి అభిప్రాయం. ప్రకృతిలో పంచధర్మాలున్నట్టే శరీరంలో కూడా ఐదు ఆకాశిక, వాయు, అగ్ని, జల, భూతత్వాలనబడే ప్రకృతి తత్వాలుండడం యోగ సాధనకు అనుకూలించే అంశం.

మనసును గెలవాలి’ అనే రచనలో వాసిలి ‘మన కళ్ళే కాదు - మనసూ మూసుకుపోతుంది. మనం కేవలం ప్రాపంచికంగా మగ్నమై ఉన్నంత కాలం మెదడులోని కొంత భాగమే పని చేస్తుంటుంది. అంటే మనసు వర్తనం పాక్షికం అవుతుంటుంది. భౌతికాన్ని వీడి అధిభౌతికం పై మనసు మళ్ళితేనే కదా ప్రపంచంతోనే ఆగిపోక విశ్వం ఆవిష్కృతమయ్యేది... సృష్టి దర్శనం అయ్యేది’ అంటాడు వాసిలి.

మనకే తెలియని మన రహస్యాలు’ చాలా ఉన్నాయంటాడు వాసిలి. ఈ రచనను “Archeology of The Self” అని పిలిచాడు వాసిలి. అందులో వ్యక్తి సంఘజీవిగా తాను తనను ఎలా మలచుకోవాలో భిన్న కోణాలలో వివరించాడు. ప్రతి మనిషి వ్యక్తిగా వెలగాలంటే జీవితాన్ని పరిమళభరితం చేసుకోవాలి. మనిషి తన అస్తిత్వం ద్వారా చైతన్యవంతుడై ఆధ్యాత్మిక ప్రజ్ఙతో పరిసరాలను పరిమళ భరితం చెయ్యాలి. మనిషి మనసు ప్రతి అంశాన్ని స్వీకరిస్తుంది. శరీరానికి కష్టం కలిగితే స్పందించేది మనసు. ప్రతీ బాధా మనసుకు ఎక్కాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి మనిషీ ప్రతీ ఆలోచనను తోసి పుచ్చడమనే పంథాను అలవరచుకోవడం సరికాదు. దేన్నైనా దూరంగా ఉంచడమంటే మానసిక బలహీనతకు గుర్తు. మనిషి బాహిరమైన రూపం కంటే ఆంతరంగిక ఔన్నత్యం ఆత్మ గౌరవాన్ని కలిగిస్తుంది. మనిషికి ఆత్మగౌరవం దక్కాలంటే సమాజం కలిగించే లేదా సమాజం నుంచి ఎదురయ్యే ఆటు పోట్లను తట్టుకుని నిలబడాలి. వైవిధ్యత వ్యక్తిత్వాన్ని రాణింపజేస్తుంది. పదిమందిలో ప్రత్యేకతను కలిగిస్తుంది.

వ్యక్తి తన అస్తిత్వాన్ని తెలపడానికి తన గురించి తాను శోధించడం, ఆత్మ విశ్వాసం, బలమైన వ్యక్తిత్వ నిర్మాణం, తప్పులు దాటుకుని వ్యక్తిగా నిలబడడం, తనను తాను ఉన్నతీకరించుకోవడం, తన పట్ల తనకు అరాధన ఉండడం, విలువల నిర్మాణం - అనుసరణ, అంత:వాణి అందించే సద్విమర్శల స్వీకరణ, ప్రజ్ఙా ధురీణత్వం, అస్తిత్వ స్పృహ, మానసిక వికాసం ద్వారా అభ్యున్నతి, బలహీన ప్రవృత్తి, అహంభావ తిరస్కరణ, ఆత్మాధిక్యతా నియంత్రణ, స్వీయాభివ్యక్తి, స్వ-పరభేదం లేని ఆత్మ ప్రయాణం, ప్రతినాయకత్వాన్ని తొలగించి నాయకుడుగా ఎదగడం వంటి అంశాల చర్చ, వివరణలతో కూడిన రచన ‘మనకే తెలీని మన రహస్యాలు’.

4. జీవనగీత- చైతన్యం:

జీవనగీత (మొదటిభాగం)- “భౌతిక జీవనాన్ని అపేక్షిస్తున్న తరుణంలో అధిభౌతిక చింతనాపరులకు నిగ్రహం అవసరం. భౌతిక జీవనం విశ్రమిస్తున్న సమయంలో అధిభౌతిక జీవనం జాగృతమ వుతుంది. కాబట్టి పారలౌకిక ఆనందమే మిన్న” (జీవనగీత, పుట: 11).  భగవద్గీత రహస్యలను ఛేదిస్తూ ‘గీతాసారం సంసార యోగమే’ అంటాడు. జీవితాన్ని జాగృతపరిచే చైతన్యమే గీతా సారంగా వాసిలి భావించాడు. ‘నిజానికి భగవత్గీతలో ఉన్నది సంసారయోగం. అంటే భౌతికంగా సన్యసించిన డిటాచ్‌మెంట్ కాదు... అధిభౌతికంగా సన్యసించని అటాచ్ మెంట్. ... సంసారం అంటే భౌతిక జీవనం సాగిస్తూ అధిభౌతిక యానం సాగించటం. గీతలో అడుగడుగునా మనిషిలోని ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనాలే కృష్ణార్జునులు- సంసయమూ, సామరస్యమూ రెంటికీ కృష్ణార్జునులు ప్రతీకలు’ (పుట : 16) అలాగే భగవద్గీతలో శ్లోకం -

         కులక్షయే ప్రణస్యంతి కులధర్మా స్సనాతనా:

         ధర్మే నష్టే కులం కృత్స్న మధర్మోభి భవత్యుత”

పై శ్లోకానికి వాసిలి వ్యాఖ్యానం హృద్యమంగా ఉంది. “కులం అంటే మానవకులం - సమజం నశిస్తే కులధర్మాలు అంటే సామాజిక, మానవీయ ధర్మాలు నశిస్తాయి. ఈ మానవీయ ధర్మాలు నశిస్తే అధర్మ వర్తనంతో మానవ జాతి భ్రష్టు పడుతుంది” (పుట: 30) వంటి అభ్యుదయకర ఆలోచనలు నిజంగానే గీతను కొత్త కోణంలో ఆవిష్కరించడం చైతన్యవంతం. ఇది వాసిలికి సమాజం పట్ల గల ఆత్మీయతకు నిదర్శనం. అలాగే కృష్ణుడు గీతలో -

         “నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్య కర్మణ:

         శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణ:”

మనిషి నిరంతరం కష్టించాలి. పని చేస్తుండాలి. నిర్వ్యాపారంగా ఉండడం హర్షణీయయం కాదు. 11వ శతాబ్దంలో బసవేశ్వరుడు “కాయకవే కైలాస” అనే నినాదంతో ఒక సామాజికఉద్యమం నడిపి మొత్తం సమాజం శైవంలోకి మార్చగలిగేంత ఉప్పెన కలిగించాడు. అంతటి ఉద్యమానికి మూల సూత్రమే ‘కాయకవే కైలాస’ అంటే “శారీరక కష్టమే మోక్షానికి దారి”.

కార్య మిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున:

సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగ స్సాత్త్వికో మత:”

కృష్ణుడి కర్తవ్యగీత ప్రపంచీకరణనేపథ్యంలో కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాసిలి 21వ శతాబ్దంలో కూడా గీత మానవాళికి మార్గదర్శకమని భావించాడు. ఇది వాసిలి వారి ఔచిత్యగ్రహణకు నిదర్శనం.

         అలాగే భగవద్గీతలో మొదటి శ్లోకం-

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:

మామకా: పాణ్డవాశ్చ కిమకుర్వత సంజయ”

ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రసంగ్రామంలో జరుగుతున్న విషయాలను చెప్పమన్న సందర్భంలోని శ్లోకం. ఈ విషయాన్ని వివరిస్తూ వాసిలి భగవద్గీత ఆకాశిక్ రికార్డ్ గా అభివర్ణించారు. (పుట:58) ఆకాశిక్ రికార్డ్ అంటే -

“In the religion of theosophy and the philosophical school called anthroposophy, (anthroposophy is a spiritualist movement founded in the early 20th century by the esotericist (is a term scholars use to categorize a wide range of loosely related ideas and movements that developed within Western society) Rudolf Steiner that postulates the existence of an objective, intellectually comprehensible spiritual world, accessible to human experience. Followers of anthroposophy aim to engage in spiritual discovery through a mode of thought independent of sensory experience. They also aim to present their ideas in a manner verifiable by rational discourse and in studying the spiritual world seek comparable precision and clarity to that obtained by scientists investigating the physical world.)”

రుడాల్ఫ్ స్టీనర్ ప్రకారం మానవ అనుభవంలో విచలితంగా ఉన్న ఆలోచనలు ఒక సూత్రానికి అందాలంటే పదార్థ విజ్ఙానాన్ని అందుకోగలిగిన బలమైన ఆధారం ఆధ్యాత్మిక ప్రపంచమే.

“The Akashic records are a compendium (is a comprehensive collection of information and analysis pertaining to a body of knowledge. A compendium may concisely summarize a larger work. In most cases, the body of knowledge will concern a specific field of human interest or endeavour(for example: hydrogeology, logology, ichthyology, phytosociology or myrmecology), while a general encyclopedia can be referred to as a compendium of all human knowledge) of all universal events, thoughts, words, emotions and intent ever to have occurred in the past, present, or future in terms of all entities and life forms, not just human.”

ఆకాశిక్ రికార్డ్స్ అంటే మానవాంశం మాత్రమే కాక, విశ్వాంతరాళంలోని అద్భుతాలను, భూత, భవిష్యత్, వర్తమానాలను, ఉద్వేగాలను, జీవితాంశాలన్నింటినీ అందించే జ్ఙానాత్మక శరీరం.

“They are believed by theosophists (theosophy is a religion established primarily by the Russian Helena Blavatsky and draws its teachings predominantly from Blavatsky's writings.) to be encoded in a non-physical plane of existence known as the mental plane. There are anecdotal (Anecdotal evidence is evidence based only on personal observation, collected in a casual or non-systematic manner.) accounts but no scientific evidence for the existence of the Akashic records. Helena Blavatsky ప్రతిపాదించిన సీక్రెట్ డాక్ట్రిన్ (Akasha is the Sanskrit word for "aether", "sky", or "atmosphere")”

ఒక్క అకాశిక్ రికార్డ్ ను అర్థం చేసుకోవడానికి వివరణ ఇంత ఉంది. ఆధ్యాత్మికత నుండి అధిభౌతికానికి ప్రయాణం నిర్మోహంగా ఉంటే తప్ప చేరుకోలేనిది. సాధించలేనిది.

         శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మా త్స్వనుష్ఠితాత్

          స్వ ధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావవహ:”

స్వధర్మాచరణలో మరణించటం మేలంటుంది గీత (పుట:202). స్వధర్మమే పంచ ధర్మాల సమహారం అంటాడు వాసిలి. పంచధర్మాలు దేహధర్మం నుండి వికసించవలసినవే. అందుకే దేహ ధర్మం ఆత్మ దర్శనానికి పునాది అని డా. వాసిలి అభిప్రాయం.

5. ఆత్మగీత- ఆధ్యాత్మికత:

భగవద్గీత రహస్యాలను కొత్త కోణంలో చూస్తూ వాసిలి “ఆత్మగీత”లో (రెండవ భాగం) వివరించాడు. గీతలో కృష్ణుడు -

         విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని

         శుని చైవ శ్వపాకే చ పండితా: సమదర్శిన:” (పుట: 344) అంటాడు.

ఉచ్ఛనీచాలు అన్నది లేకుండా గుణవంతుడు అన్నిటినీ సమదృష్టితో చూస్తాడు. నిష్కామభావన వల్ల మాత్రమే సమదృష్టి, సమతాభావన ఏర్పడుతుంది. “లౌకికంగా విచలితునడౌతున్న అర్జునుణ్ణి కర్మిష్ఠిని చేసే ప్రయత్నంలో అష్టాదశ మార్గాల ‘స్వయం సంపూర్ణుని చేసిన వాడు కృష్ణుడు. ONENESS అని చెప్పుకుంటున్నది ఆ పరమ తత్వాన్నే” (పుట: 371) అంటారు వాసిలి. ఊడలు దిగిన అశ్వత్థ వృక్షాన్ని చూస్తే మొదలేదో, ఊడల ప్రారంభమేదో తెలీదు. మొదలూ ఊడలూ కలిసిపోయి ఏక మాత్రంగా అనిపిస్తుంది. కృష్ణుడు తత్త్వమూ అంతే అంటాడు వాసిలి. ఊర్థ్వముఖంగా లేచి అధోముఖంగా సాగడం పరార్థజగతి నుండి పదార్థజగతిలోకి ఊడలుగా దిగడమే అని వివరిస్తారు.

ఆత్మ తత్వాన్ని వాసిలి బహుముఖాలుగా వివరిస్తాడు. మనిషి దేహస్వరూపమే ఆత్మ స్వరూపంగా రచయిత వివరిస్తాడు. ఆత్మస్వరూపం వెలుతురుతో కూడిన తెల్లటి స్వరూపంగా అభివర్ణిస్తాడు రచయిత. ఆత్మ కాంతి స్వరూపమే కాదు భారరహితం కూడానంటాడు. ఘన,ద్రవ,వాయు స్థితులలో కూడా ప్రయాణిస్తుంది. అందువల్ల ఆత్మ వెలుగుల స్వరూపంగా కళ్ళకు సాక్షాత్కరిస్తుంది.

6. అతీంద్రియ రహస్యాలు – అవగాహన:

అతీంద్రియ రహస్యాలు’ డా. వాసిలి ప్రముఖ రచనలలో ఒకటి. సాహిత్య పాఠకుడికి కొత్త జ్ఙానాన్ని అందించే ప్రయత్నం ఇందులో కనబడుతుంది. బ్లవత్స్కీని సంపూర్ణంగా పరిచయం చేస్తారు వాసిలి. ఆమె వాసిలిని బాగా కదిలించిన అతీంద్రియ శక్తులను కలిగిన వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. “హెలెనా పెత్రోవా బ్లవత్స్కీ అంటే అతీంద్రియ రహస్యాల పుట్ట . ఒక సీక్రెట్ డాక్ట్రీన్, ఒక ఐసీస్ అన్ వీల్డ్, ఒక కీ టు థియోసఫీ, ఒక వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఒక బుక్ ఆఫ్ ధ్యాన్” (పుట:5) అంటారు వాసిలి. ఈమె పై వాసిలి వారికి అపారమైన ఆత్మీయత ఉంది. ఆమెను “భువినే కాన్వాసుగా చేసుకుని దివ్య జ్ఙానంతో సర్వ మానవాళిని అక్కున చేర్చుకున్నారు” (పుట:11) అంటారు. బ్లవత్స్కీ రచన - SECRET DOCTRINE - To revive and create in the world a new society తన ధ్యేయంగా భావించింది. “థియోసఫీ మతం కాకపోయినా మతంగా అంగీకరించటానికి కారణం -విశ్వజనీనత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని అకాంక్షించటం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించడం” (పుట: 10)

“Theosophy in its practical work is the alchemic of the medieval alchemist. It transmutes the apparently base metal of every ritualistic and dogmatic creed into the gold of fact and truth” - H. P. Blavatsky. థియోసొఫీ ఒక నిరంతర రసాయనిక చర్య. ఈ ఖనిజం ఆచారాలను, సిద్ధాంతాల నమ్మకాలను, వాస్తవం - సత్యం అనే బంగారంగా మారుస్తుంది.

7. పెళ్ళి – హితబోధ:

వాసిలి మరో రచన ‘పెళ్ళి’ పుస్తకం. ఈ పుస్తకం కొత్త జంటకు ఎంత అవసరమో, షష్టి పూర్తి చేసుకున్న వృద్ధ జంటకు అంతే అవసరం. జీవితాన్ని కాచి వడపోసిన అనుభవసారం ఇందులో కనబడుతుంది. దాంపత్యానికి ఆలుమగల శారీరక, మానసిక సాన్నిహిత్యం ఎంత అవసరమో వివరించే రచన. 

8. నేను – దీర్ఘకావ్యం:

వాసిలి రచనా ధార అంతా సమాజ హితమే అనడానికి ప్రబల నిదర్శనంగా కనబడేది, ఆత్మీయంగా మనలను హత్తుకునేది “నేను” అనే దీర్ఘ కావ్యంలో కనబడే కవిత. ఈ కవితలో అనుభూతి, ప్రకృతి ఆవాహన, పర్యావరణం పట్ల ప్రేమ ప్రిదిలుతూ చదువుతున్న ప్రతీ గుండెను తడి చేస్తుంది.

            “వృక్షమా ! మిత్ర పక్షమా !

             కలిసి మెలిసి కమిలి పోతున్నాం మిత్రమా

             బక్క చిక్క బరువెక్కి పోతున్నాం మిత్రమా

             నువ్వు

             వెయ్యి విత్తనాలైతేనే నాకు వందేళ్ళు

             నేను

             వందేళ్ళుంటేనే నీకు నీకు వెయ్యి మొలకలు

             నువ్వు ముక్క చెక్కలవుతున్నావు

             నేను చెక్కని జీవితమవుతున్నాను !

             ఒకప్పుడు నువ్వు

             నా గడపవు, గుమ్మానివి

             నా చూపు దూసుకు పోయిన కిటికీవి

             ఇంటి చూరువి , వంటింటి పెత్తందారువి!

             అన్నట్టు మిత్రమా

             కడ చూపుకు

             నేనూ కట్టెనే , నువ్వూ కట్టెవే

             కట్ట కడపటికి

             మనది విభూతి యోగమే!

వాసిలి ఈ కవిత అనుభూతి తాదాత్మ్యతకు, ఉదాత్త స్థితికి నిదర్శనం. అంతులేని ఆవేగాన్ని, ఉద్విగ్నతను కలిగించే కవిత. మానవాళి మననం చేసుకోవలసిన కవిత.   

9. ముగింపు:

పుట్టుక కలిగిన ప్రతి మనిషీ అనుసరించి ఆచరించవలసిన విషయాలను వాసిలి తదేక మనసుతో వ్యక్తీకరిస్తాడు. ధ్యానం, యోగ, భౌతికత, అధిభౌతికత, ఆత్మ జ్ఙానం, సాధించడానికి అంతులేని సహనం కావాలి. వాసిలి సహనశీలి. మానవ సమూహాన్ని తనదిగా చేసుకోవడానికి, తన మార్గంలో సమాజం నడవడానికి విశ్వమంత సహనం ప్రదర్శిస్తాడు. అధిభౌతికతను ఆస్వాదిస్తూ, భౌతిక సమాజాన్ని విశ్వాంతరాళాలలోకి తీసుకెళ్ళడానికి, అక్కడి Celestial beauty, Universal Brotherhood, పరిచయం చేసి ఆత్మ ప్రయాణానికి అధిభౌతిక దారులు వేసి, సుగమం చేసిన ఆత్మ చోదకుడు.

Winner, Mind your Mind ప్రజ్ఙాన రహస్యాలు, మనసును గెలవాలి, అయినా గెలవాల్సిందే, అతీంద్రియ రహస్యాలు, యోగాలయ, జీవనగీత, ఆత్మగీత, నాయకగీత, యౌగికగీత వంటి సుమారు 50 రచనలు డా. వాసిలి అధిభౌతిక జీవన గతికి నిలువెత్తు నిదర్శనాలు. యోగసాధన వల్ల అసమాన జీవనం సాగించవచ్చునని తెలిపిన వ్యక్తి. ప్రేమంటే మనసును తీర్చి దిద్దే కళ అని నమ్మిన వ్యక్తి. మోసాలూ, హాలూ మనిషిని - మనిషి కాకుండా చేస్తాయి అని ప్రబలంగా భావించిన వ్యక్తి. భౌతికతను దాటి అధిభౌతికతను ఆత్మ చేరవలసిన అగత్యం, శరీరాన్ని దాటి ఆత్మ చేయగల ప్రయాణం, అతీంద్రియ ఆనందానికి మార్గం సుగమం చెయ్యగల నిర్దేశం ఆనుపానులు అందించి వ్యక్తి. ఆత్మ శక్తివంతమైనది. ఆత్మకు శరీరం తృణప్రాయమైనది. విశ్వాత్మలోని దివ్యత్వం ఆత్మలోనిదే అంటాడు డా. వాసిలి. వీరి సాహిత్యమంతా ఆత్మ దివ్యత్వాన్ని ప్రవచించేదే. ఆత్మను అర్థం చేసుకున్న అద్భుత సాధకుడుగా, Deep analytical personality గా డా. వాసిలి కనబడతారు. మనిషిలోని ‘ప్రాణలయ’ అవగతం కావాలంటే ధ్యానమగ్నం కావాల్సిందే! అదే ధ్యాన ధ్యాస ! అది ఆత్మ ధ్యాస అంటారు వాసిలి.

డా. వాసిలి రచనలన్నీ వస్తు పరంగా ఎంత ప్రత్యేకమైనవో, భాష పరంగా కూడా అంతే విశిష్టమైనవి. చాలా పదప్రయోగాలు సామాన్యుడికి అంతు పట్టనివి. శార్వరి గారు చెప్పినట్టు తరచి తరచి చదివితే తప్ప డా. వాసలి కానీ, డా. వాసిలి పదప్రయోగాలు కానీ అంతు చిక్కవు. అర్థం కావు. అక్షరాలన్నీ వర్ణమాలలోవే. సృజించిన పద రూపాలన్నీ సామాన్య మెదడుకు త్వరగా అందనివి. చదివే కొద్దీ, ఆస్వాదించే కొద్దీ శరీరంలోకి, మెదడులోకి ఇంకడం ప్రారంభం అవుతుంది.

ఏదేమైనా యోగాతో ప్రారంభమైన వాసిలి వారి జీవన ప్రస్థానం అనేక మజిలీలు చేరి ఆత్మ అధిభౌతికతను అందుకునే స్థితికి చేరి, నిర్మాలిన్యమైన మనసుతో విశ్వాంతరాళాలను ఛేదించి, ఆత్మానుభూతిని అందుకున్న విశ్వజీవి, సమాజం ఆ స్థితికి చేరుకోవాలని అపేక్షించిన అమృతహృదయుడు డా. వాసిలి. వారి అకాంక్షలో సమాజ శ్రేయస్సు ఉంది. సమాజ హితముంది. అందరూ ఆత్మ తత్వాన్ని గ్రహించి యోగాత్మక జీవనం సాగించాలన్న తపన ఉంది. అందుకై అంతులేని పోరాటం ఉంది. డా.వాసిలి విజయుడు కావాలని సమాజమంతా కోరుకోవాలి. ఆ దిశగా నడవాలి.

“People are successful not necessarily because they work hard. They just do the right thing” - Sadhguru

డా. వాసిలికి ఈ మాటలు అన్వయిస్తూ సమాజహితసాహిత్యం మరింత సృజించాలని ఆకాంక్షిస్తున్నాను.

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. వసంతకుమార్, వాసిలి. జీవనగీత. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, డిసెంబర్ 2015.
  2. పైదే. అతీంద్రియ రహస్యాలు : బ్లవట్స్కీ. 5వ ముద్రణ, యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, మే 2021.
  3. పైదే. ఆత్మగీత. మూడవ ముద్రణ, యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, డిసెంబర్ 2015.
  4. పైదే. నేను, యౌగిక కావ్యం. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, మూడవ ముద్రణ, మార్చి 2020.
  5. పైదే. పెళ్లి మైనస్ పెటాకులు. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, మే 2012.
  6. పైదే. మనకే తెలీని మన రహస్యాలు. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, ఫిబ్రవరి 2014.
  7. పైదే. మనసును గెలవాలి. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, నవంబర్ 2012.
  8. పైదే. యోగలయ. యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, సెప్టెంబర్, 2015.
  9. పైదే. సిగ్గు పడితే సక్సెస్ రాదు. మూడవ ముద్రణ, యోగాలయ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్, జులై 2015.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "OCTOBER-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-SEPTEMBER-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "OCTOBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]