"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక
AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797
7. సదా యాదిలో సామల
తిప్పర్తి మంజుల
తెలుగు ఉపన్యాసకురాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేట (స్వయం ప్రతిపత్తి),
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9390112401. Email: tipparthimanjula@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
వేగవంతమైన నేటి సమాజంలో మనిషి యంత్రాలకు అలవాటు పడి పుస్తక పఠనం మరిచి సాహిత్యాన్ని పక్కనపెట్టి శ్రమ చేయకుండా ఎక్కువ పలితాలను ఆశించే స్థితిలో ఉన్నాడు. కాబట్టి సామల సామాన్య జీవన శైలిని కొనసాగిస్తూనే విద్యార్థిని సమగ్ర అభివృద్ధికి కృషి చేసే విధంగా తాను ఉపాధ్యాయ వృత్తి దిశలో ప్రయాణిస్తూ మానవతా విలువలతో పాటు కొన్ని భాషల్లో సృజనాత్మక శైలిలో రచనలు చేసి తన రచన ప్రభావం, భక్తితత్వం,చిత్రాల ద్వారా వినూత్నంగా పాఠకుల హృదయాలను ముచ్చట్లతో నింపి వారిని తన జ్ఞాపకాల ను మరిచిపోలేని విధంగా సమస్త ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా అనేక విషయాలను మన మదిలో నిలిపిన సామల సదా చిరస్మరణీయులు.
Keywords: రచనల ప్రాముఖ్యత, వ్యక్తిగతం, భక్తితత్పరత, భాషాప్రావీణ్యత
ఉపోద్ఘాతం:
సత్యం, ధర్మం, న్యాయం ధార్మిక జీవన సూత్రాలని ఆదర్శంగా నిలుపుకొని సంగీత సాహిత్య చిత్రకళ రంగాలను ‘ఆర్తి’తో అధ్యయనం చేసి వాటి సౌరభాన్ని సమాజానికి ప్రసరింపజేసిన ‘మలయమారుతం’ డాక్టర్ సామల సదాశివ అనేక భాషలలో ఎన్నో రచనలు చేసిన సాహితీ శిఖరం. పండిత పామర లోకానికి చిరస్మరణీయులు.
ప్రధానవిషయం:
వేగవంతమైన నేటి సమాజము యాంత్రిక జీవనంలో మసకబారుతున్న మానవీయ విలువలు పెంపొందించబడాలి. ఆయన ఆదర్శవంతమైన నైతిక జీవన విధానం ద్వారా అందరి మదిలో నిలుపుకోవడానికి తోడ్పడేదే సామల అక్షర సేద్యం అదే అక్షర సత్యం.
ప్రణాళిక:
ఎక్కడో మారుమూల ప్రాంతమైన గ్రామంలో ఉదయించిన కవి సాహితీ రవిగా వెలుగొంది న విధానాన్ని సాహితీ ప్రస్తానాన్ని తెలియజేయడమైనది. సామల బాల్యం వ్యక్తిగతం భక్తి తత్వం బహుభాషా ప్రావీణ్యం మరియు ఒకలా నైపుణ్యం అనే విభాగాలుగా అధ్యయనం చేసి వారి సాహితీ క్రమ వికాసాన్ని పొందుపరిచాను.
పరిశోధనా పద్ధతి:
అంతర్జాలంలోని వారి ఆడియో వీడియో ప్రసంగాలను విని, ‘సామల సదాశివ మోనోగ్రామ్’లోని విషయాలను సేకరించడం అయినది.
ఆశించే ఫలితం:
నేటితరం విద్యార్థులకు పాఠక లోకానికి సామాన్యంగా కనిపించే అసమాన్య సారసోత మూర్తి డాక్టర్ సామల విద్యార్థుల యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే విధంగా వీరి విలక్షణమైన బోధన పద్ధతి ద్వారా విద్యార్థులు ఇష్టంగా నేర్చుకుంటారు ఈ విధంగా సంగీత సాహిత్య కళా రంగాలలో సదాశివునిగా వెలుగొందిన సామల బహుముఖ ప్రజ్ఞను అధ్యయనం చేసి నేటి తరం భావి జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దడానికి అందించాలని ఆశిస్తున్నాను.
తెలంగాణలో మారుమూల గ్రామంలో సామల జన్మించినప్పటికీ
చదువుతోపాటు సాహిత్యాన్ని స్వతహాగా అవలీలగా అలవర్చుకొని ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులను సక్రమ మార్గంలో
నడిపించడానికి చేసిన కృషి నేటి సమాజానికి చాలా అవసరం. తన భాషా సాహిత్యాన్ని సదా ముచ్చట్ల రూపంలో
విద్యార్థికి నీతులను బోధించేవారు. ఇది నేటి తరానికి ఆదర్శం కావాలి మరియు ఈయన రాసిన యాది గ్రంథం నిత్య
విద్యార్థికి స్వగతం ఒకనిత్య కృషివళుని శ్రమ గీతం.
సదా యాదిలో
సామల శీర్షిక ఉద్దేశ్యం:
సదా యాదిలో సామల జ్ఞాపకాలు ఆయన రచనలు నిజమైన మానవీయ విలువలను తెలుపుతూ కొత్తవారిని రచనలు చేసే దిశగా ఆలోచనలు కలిగించడానికి దోహదపడతాయి.
సామల సదాశివ 1928 మే నెల 11వ తేదీన జన్మించినట్లు సర్వీసు పుస్తకంలో నమోదైన దానినే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఆయన జన్మించిన తేదీ మాత్రం క్రీ.శ. 1928 ఆగస్టు 9వ తేదీన జన్మించినట్లు జన్మ పత్రిక ద్వారా తెలుస్తుంది. ఈయన జన్మదిన తేదీ లాగానే పుట్టిన ఊరు కూడా మారిపోయింది. ఆయన జన్మించిన ఊరు ఆదిలాబాద్ జిల్లా. కానీ ప్రస్తుతం కొమరంభీం జిల్లాగా మారింది. సదాశివ కొమరంభీంజిల్లా ‘దహేగాం’ మండలం ‘తెనుగు’ పల్లెలో “శ్రీమతి చిన్నమ్మ-నాగయ్య” గార్లకు ఏకైక పుత్రుడుగా జన్మించాడు. ఇతనికి ఒక చెల్లె పుట్టి చనిపోయింది. ఇతని తల్లి. తండ్రి. తాత. మేనమామలు అందరూ విద్యావంతులు కావడం వలన సదాశివ చిన్ననాటి నుండే గ్రంథాలను చదివే అలవాటు చేసుకున్నారు. సదాశివకి నిరంతరం అధ్యయనం చేసే అలవాటు తన తల్లి వల్లనే వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో సదాశివ జన్మించినప్పటికీ భాషా విద్వాంసుల మెప్పు పొంది తెలుగు, ఉర్దూ, పారసీ, హిందీ, సంస్కృతం, మరాఠీ భాషల సౌందర్యాన్ని ఆపోసన బట్టి, తాను అనుభవించిన ఆనందాన్ని తెలుగు పాఠకులకు అందించాలని సంకల్పంతో ఆయా భాషల సౌందర్య రసానుభూతిని ముచ్చట్ల రూపంలో విడమర్చి చెప్పారు. రియాజుల్ రెహ్మాన్ మౌల్విసాహెబ్.కు సంతానం లేకపోవడంతో అతడు సదాశివపై పుత్రవాత్సల్యంతో పారసీ భాషను నేర్పించాడు.
సాహెబ్ భార్య కూడా సొంత కొడుకులా ఆదరించిందని
సదాశివ తెలిపారు. ఇలా అనేక భాషలు నేర్చుకుని అనేక రచనలు చేశాడు. సామల సదాశివ అంటేనే వివిధ భాష సంప్రదాయాల
సంఘ స్థలం అని అంటారు. ఆసిఫాబాద్.లో సదాశివ ఏడవ తరగతి చదువుతున్నప్పుడు, జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన
విప్లవ వీరులు కొమరంభీమ్ అతని అనుచరుల శవాలను పోస్టుమార్టం కోసం ఉంచిన సంఘటన కల్లారా చూసి చలించిపోయాడట. ఈ
విషయం ఎలాగైనా అందరికీ తెలియాలని అనుకున్నాడు. అందుకే 1980లో ఏపీ ప్రభుత్వం పాఠ్యపుస్తక ప్రచురణ సంస్థ నుండి
ఏడవ తరగతి తెలుగు వాచకాన్ని రాయమనే ఆదేశం వచ్చినప్పుడు ఆ వాచకంలో కొమరంభీమ్ పాఠ్యాంశాన్ని పొందుపరచి అతని
విరోచిత గాధను లోకానికి తెలియజేశాడు. ఈ విధంగా తెలంగాణలో మరుగునపడిన వీరున్నిమొదటిసారిగా సమాజ దృష్టికి
తీసుకొచ్చిన ఖ్యాతి సదాశివ కి దక్కింది. ఈయన బహుభాషా కోవిదుడు.
రచనల ప్రాముఖ్యత:
తెలుగువారిని గురించి ‘సీయాసిత్’ అనే
ఉర్దూ దినపత్రికలో చాలా వ్యాసాలు రాస్తుండేవాడు. 21 సంవత్సరాల వయసులో ‘ప్రభాతము’ అనే పద్య
కావ్యాన్ని ప్రచురించుకున్నాడు మరియు తర్వాత కాలంలో సాంబశివ శతకం, నిరీక్షణము, మంచి మాటలు అనే పద్య సంకలనాలు
అచ్చు వేయబడ్డాయి. తను రాసిన ఉర్దూ సాహిత్య రచనలను ‘సాఖీనామ’ పేరుతో తెలుగులో రమ్యమైన పదాలతో
పద్యాలు రాస్తూ పాఠకుల కోసం భారతి, జ్యోతి, సుజాత పత్రికలలో ప్రచురించారు. ఇలా పద్య, గద్య రచనలను ఉర్దూ,
ఫారసీ భాష సాహిత్యాలను పాఠకులకు విలక్షణ శైలిలో సదాశివ పరిచయం చేశారు. ఎంతటి కఠినమైన విషయాన్ని కూడా సులభంగా
పాఠకులకు అర్థమయ్యేలా ముచ్చట్లు చెప్పినట్లుగా చెప్పగల ప్రత్యేక నేర్పు సదాశివ కి కలదు. అసంఖ్యాకమైన
వ్యాసాలు వ్యక్తి చిత్రణలు పీటికలను, లేఖలను చూసినట్లయితే వారి బహుముఖమైన పాండిత్యం బహిర్గతం అవుతుంది.
ఇంతవరకు చర్చించిన విషయాలు సదాశివ జీవించి ఉన్నప్పుడు జరిగినవి. ఇంకా ఆయన మరణించిన తర్వాత వారి గురించి
వెలువడిన వ్యాసాలు ప్రచురిస్తే ఒక ఉద్గ్రంధమే అవుతుంది. సదాశివ స్మృతి వ్యాసాల పేరిట రాజమండ్రి
విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థి కిషోర్ 2014లో M.Phil. చేసి బం పథకాన్ని గెలుచుకున్నాడు.
వ్యక్తిగతం:
సదాశివ ఉన్నత స్థితి నుండి విశ్లేషించి ఆ స్థితి తనలో లయిoప చేసుకున్న మహాత్ములను గురించి పరిచయం చేయడం గమనిస్తే ఆయన రచనా శైలి ‘కథన పద్ధతి’ అని తెలుస్తుంది. సత్యం-ధర్మం-న్యాయం అనే మాటలను ఆదర్శంగా తీసుకొని ఆయన రచనలు కొనసాగించాడు. ఆయన రాయడం కోసం కలం పట్టలేదు, మాటల్లో చెప్పాలంటే ఆయన స్వరహతులు. ఆయన పరిచయం చేసేది, భౌతికంగా కనిపించే ఒక వ్యక్తిని కాదు. ఆ వ్యక్తిని ఆవహించుకున్న కళా శక్తిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశాడు. సంగీత సాహిత్య విషయాలను సంభాషణ రూపంలో గానీ రాతపూర్వకంగా గాని వివరించేటప్పుడు చాలా సరళంగా సహజంగా చెప్పేవారు. కళకు సంబంధించిన ప్రతి చిన్న విషయాలను కచ్చితంగా బెరీజుచేయగల సామర్ధ్యమున్న గొప్ప కళాభిజ్ఞుడు. మనుషుల్లో ప్రేమ నశించిపోతున్న తరుణంలో అసలు మనుషుల్లోని మానవత్వాన్ని, మనసులోని లలిత్వాన్ని, మనిషి తత్వాన్ని, సంగీత సాహిత్యం అనే రహస్య తత్వంతో నింపి రచనలు చేసే నిజమైన మనిషి సదాశివ.
సదాశివ తన వ్యక్తిగత సాహిత్య జీవనయానంలో నిమ్నోన్నతులను బహుసుందరంగా ‘యాది’ గ్రంథంలో వెలువరించారు. ‘విననివాళ్లకు – విన్నవాళ్లకు మేలగుగాక’ (పుట39) అనే మాట వీరి సౌజన్యానికి సంకేతం. సంగీత సాహిత్యాలలో అశేష గురుశిష్యుల ప్రేమానుబంధాలతో, సంఘసేవకులతో, మానవతామూర్తులతో పెనవేసుకున్నది వారిజీవితం. ‘జ్ఞాన సంపన్నుడైనట్టి వాని వయస్సు చూడరాదు కులంబును చూడరాదు’ అని సదాశివ చెప్పుటయే కాదు, గొప్ప కులం వాడినని గర్వపడటం నీచ జాతి వాడినని దిగులు పడటం రెండూ సరియైనవి కావని లౌకిక విలువలను గూర్చి తన లఘుకావ్యమైన ‘ప్రభాతము’లో వివరించాడు.
మానవీయ విలువలను బుద్ధుడు సమాజంలో వ్యాపింప
చేయడానికి కృషి చేసినట్లు, సదాశివ సర్వమానవ సమానత్వానికి సర్వస్వదానము చేశారు మరియు ఉపాధ్యాయుడిగా
గుర్తింపబడాలనే కోరిక విద్యార్థుల కోసం చాలా సూక్తులను ‘మంచి మాటలు’అనే పేరుతో ప్రచురించాడు.
కందుకూరి వీరేశలింగం అన్నట్లు ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో లేదా ఒక మంచి పుస్తకం అయినా
కొనుక్కో’ అన్నట్లుగా సదాశివ కూడా విద్యార్థుల కోసం “దుస్తులు ఎట్లున్న నేమి ఎందులకు చింత
పుస్తకములు సుమ్ము - నీ భూషణములు” అనే పదాలతో పాఠశాల గోడల పై రాయించారు.
భక్తితత్పరత:
సదాశివ ‘మానవసేవయే మాధవ సేవ’ అని నమ్మిన వ్యక్తిగా మరియు శక్తిగా అనడానికి రుజువులు కనిపించాయి. ఎందుకంటే మధురాంతకం రాజారాం ఎన్నిసార్లు పిలిచినా తిరుపతికి వెళ్లలేదంట కానీ భక్తి భావంతో ‘ఆర్తి’ అనే పేరుతో ‘వృషభగిరి నివాస వెంకటేశ’ అనే ఒక శతకాన్ని రాశాడు మరియు శ్రీ వేంకటేశ్వరున్ని ‘అతసీకుసుమోపనునీలగాత్ర’ అని సంబోధించాడట9 (పూట31). సంస్కృతంలో ‘అతసీ కుసుమము’ అంటే “అవిసె పువ్వు” అని అర్థం. ఈ పూలు శ్రీ వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. ఈ విధంగా తన భక్తి భావాన్ని గుడిలోకి వెళ్లకుండా భక్తితత్వాన్ని మాటలు రూపంలో, రచనా రూపంలో వెల్లడి చేశారు. తన రెండవ కుమారుడైనా రాజవర్ధన్ ను రాజారాం కథలపై M.Phil. చేయమని తిరుపతికి పంపించాడట. సదాశివ తన జ్ఞాపకాలను సమాచారంలా కాకుండా ప్రతి అనుభవం నుండి ప్రతి సన్నివేశం నుండి నేర్చుకున్న విషయాలను పాఠకుల హృదయాలను కదిలించే విధంగా తన ముచ్చట్లతో ఆసక్తిగా తెలియపరచే వారు. భాషాభివృద్ధికి సంగీత సాహిత్య అభివృద్ధికి కంకణం కట్టుకొని కృషి చేసిన వారు ముగ్గురే ముగ్గురు. వారు సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, సదాశివ అని వెల్చాల కొండలరావు అన్నారు. వీరు ముగ్గురే తెలంగాణలో భాషా సాహిత్యరంగాలకు పితామహుడు లాంటివారు. ఎందుకంటే భాషను సాహిత్యాన్ని సంగీతాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి చాలామందికి వాటి అభిరుచిని పరిచయం చేశారు.
భక్తి పూర్వకంగా సదాశివ తెలుగులోనేగాక ఫారసి, ఉర్దూ సాహిత్యాలలో రుబాయలరూపంలో ‘తాను చెట్టు అయితే, నీరు పరమాత్మ’ అని ‘తాను వెన్నెలయితే, చంద్రుడు పరమాత్మ స్వరూపం’ అని ‘పలికేది తనైనా పలికించెడువాడు పరమాత్ముడేనని’, ‘నీవు లేకున్నా - నేను ఎట్లుండు’ అని భాషాపరంగా నిరాడంబరమైన భావపరంగా గంభీరమైన పదాలతో తెలుగులో రుబాయలను అందించాడు. ఉర్దూ భాష కోసం సర్వస్వాన్ని ధారపోసిన మహా మనిషి అయిన ప్రొఫెసర్ హబీబురహమాన్ ని సదాశివ చాలా ఇష్టపడేవారు. హిమాయత్ నగర్ లోని రాజప్రసాదం లాంటి భవనాన్ని ఉర్దూ భవన్ కోసం హబీబురహమాన్ ఇచ్చాడంట. ఉర్దూ భాష కోసం నిరంతరం శ్రమించిన ప్రొఫెసర్ ని అసలైన భాషాభిమానిగా వ్యక్తికరించాడు సదాశివ.
వ్యక్తి చిత్రణగురించి కూడా ఇలా తెలిపారు ‘ఉల్లాసంతో ఉరకలు వేస్తున్నప్పుడు లేదా మనసు రోదిస్తున్నప్పుడు’ రాసే రచనల్లో మన భావానికి తగ్గట్టు తగిన శబ్దాలు వాటికవే వచ్చి కూర్చుంటాయి బలవంతంగా, ఏదో రాయాలని రాసే వాక్యాలు అందంగా ఉండవచ్చు కానీ మన మాటలు ఎదుటి వాళ్ళ మనసులను తాకలేవు. అని సుకుమారంగా వ్యక్తి చిత్రణగురించి తెలిపారు. ఇలా జీవితంలో జీవితమంతా సంగీత సాధన చేసి దాన తపస్వినిగా పేరుగాంచిన చిన్న వయసులోనే అన్నింటిని త్యజించి దత్త భక్తురాలైన అంజనీ భాయ్ లాంటి వారివి ఎందరివో వ్యక్తి చిత్రణలో సదాశివ కలం నుండి జాలువారినవి.
సదాశివ తమ రచనల్లో అక్కడక్కడ కొంతమంది కళాకారుల
వ్యక్తిత్వాన్ని పరిచయం చేశాడు. కానీ వారి వ్యక్తిగత విషయాలు సన్నగిల్లకుండా పాఠకులకు ఆ వ్యక్తిపై ఎలాంటి
అగౌరవం ఏర్పడకుండా చూశాడు. ఇక్కడ కళాకారులను పాఠకుల పట్ల పాటించిన అద్భుత సమతూకం తెలుస్తుంది. తనకు తెలియని
పాఠకుడితో దశాబ్దాల పరిచయమున్న దోస్తులతో మాట్లాడినట్లు చెప్పడం సదాశివ కి సాధ్యమైంది. వారి
‘స్వరలయలు’ కావ్యంలో వివిధ కవుల మీద కవుల వ్యక్తిత్వాలను గూర్చి వ్యాసాలు రాశాడు. సాహిత్య
విమర్శ పరిభాష వారి రచనల్లో కనిపించవు. నేను ‘సాహిత్య రసజ్ఞుడినే కానీ విమర్శకుడిని కాను’
అన్నారు. స్వీయ ఆసక్తితో రచనలు చేశాడు. రచనల వెనుక ఉన్న రచయిత యొక్క వ్యక్తిగత జీవితం మరియు సామాజిక
స్థితిగతులను గూర్చి వివరిస్తూ వాటి మధ్య ఉన్న సమన్వయాన్ని విశ్లేషించాడు మరియు చరిత్రకారుల గుణ దోషాలను
కూడా ఎత్తిచూపి సవరించారు.
భాషాప్రావీణ్యత:
సదాశివ ఉర్దూ, ఫారసీ, హిందీ, మరాఠీ సాహిత్యాన్ని
తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదాలను వచనానువాదం, పద్యనువాదంగా రెండు రకాలుగా పాఠకులకు పరిచయం చేశారు. తన
ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులను కూడా ఎప్పుడు పద్యాలను కంఠస్థం చేయమని చెప్పలేదట వారు చెబితే
పాఠం చెప్పినట్లు ఉండేదట విషయం అంత అర్థమై పద్యం నోటికి వచ్చే విధంగా విలక్షణమైన పద్ధతిలో విద్యార్థులకు
బోధించేవారట. ఇది నేటి సమాజానికి ఎంతో అవసరం ఎందుకంటే విద్యార్థి ఇష్టపూర్వకంగా అర్థం చేసుకుంటే ఎప్పటికీ
మర్చిపోలేరు. ప్రస్తుతం విద్యార్థికి సమాచారం అంతా నెట్లో (Internet) లభిస్తుంది. కానీ దాన్ని అతడు అర్థం
చేసుకోకుండా పరీక్ష కోసమే అన్నట్లుగా భావించి అందులోని అసలు విషయాలను గ్రహించడం లేదు. సదాశివ విద్యార్థికి
పాఠ్యాంశంతో పాటు ఇతర నైతిక విలువల సమాచారాన్ని తెలుపుతూ ఆ వ్యక్తి యొక్క సమగ్ర స్వరూపాభివృద్ధికి దోహదపడేలా
బోధించాలని అన్నారు. సదాశివ చిన్ననాటి నుండి ఏ విషయంలోనైనా ఒక పనిని మొదలుపెట్టినాడు అంటే, దాని అంతు చూడందే
వదిలేవాడు కాదు. పద్య రచనల్లో, అనువాదాల్లో, సంగీతంలో, చిత్రలేఖనంలో అద్వితీయమైన అధికారాన్ని సంపాదించినా
కూడా ఏమీ తెలియని వారి వలె సామాన్యంగా ఉండిపోయేవారు సదాశివ అదే వారి గొప్పతనం. వారి గ్రామంలో దీపావళి
పండుగకు గోడలపై అందమైన చిత్రాలు వేసేవారు ఆ చిత్రాలను గమనించి తాను కూడా చిత్రాలను వేసేవాడట.
కళాపోషణ:
ఒకసారి ‘నలదమయంతి’ అనే సినిమాను చూశాడట. ఇంటికి వచ్చి తెల్ల కాగితంపై ఉదా రంగు సిరాల ముంచిన కలంతో ఆ సినిమాలోని దృశ్యాలను చిత్రించడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఆయన వేసిన చిత్రాలను లక్ష్మయ్య గారనే డ్రాయింగ్ మాస్టర్ ముగ్దులై సదాశివ తో బొంబాయి J.J. ఆర్ట్స్ కళాశాల పరీక్షలకు కూర్చోబెట్టారట. అంటే ఆయనలో ఏది చూస్తే అది నేర్చుకోవాలని తపన కనిపిస్తుంది. ఇలా ఎన్నో రకాలైన కళా నైపుణ్యాలను సాధించాడు.
సదాశివ ఏదైనా ఒక కావ్యం రాసేముందు దానికి సంబంధించిన చిత్రాన్ని గీసుకునేవారు. విశ్వామిత్రము అనే కావ్యాన్ని రాసినప్పుడు రామలక్ష్మణులు, విశ్వామిత్రుడు, అహల్య చిత్రాలను వివిధ భంగిమలలో చిత్రించినారట. ఈనాటి ప్రఖ్యాత చిత్రకారులు కాపు రాజయ్య (పుట70) సదాశివ వద్ద నూనె రంగులు ఏ విధంగా వేయాలనే విషయంలో మెలకువలు నేర్చుకున్నారట. వీరిద్దరి మధ్య అనుబంధం చాలా ఆత్మీయంగా ఉండేదట. ఇలా చిత్రలేఖనమే కాదు, సంగీత శాస్త్ర పరిజ్ఞానం కూడా సదాశివ కి ఉంది. సంగీత శాస్త్ర పరిజ్ఞానం గురించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు సదాశివ ఫణికుమార్ తో అన్నమాటలు అక్షరసత్యాలు. ‘శాస్త్ర జ్ఞానం అంటూ ఏదీ ఉండదు’ అదేదో ఉందని దాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేక సాధన కూడా అవసరం లేదు. “రోజు సంగీతం వినడమే మార్గం - క్రమంగా రాగ రహస్యాలను చెవియే పసిగడుతుంది” అనే వాక్యాలు ఫణికుమార్ రాసిన సదాశివ మాస్టారు వ్యాసంలో కనపడతాయి. ఇలా సదాశివ సాహిత్యం వలన సంపాదించుకున్నది కీర్తి ప్రతిష్టలు మరియు పాఠకుల ప్రేమానురాగాలు.
సదాశివ కి ఎర్రన, పోతన పద్యాలు అంటే చాలా ఇష్టం మరియు ఆధునిక కవుల్లో జాషువా పద్యాలను ఇష్టపడే వారట. ప్రతి విజయ వంతుడైన ‘పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అనేది పెద్దల మాట. సదాశివ ప్రతిభ వివిధ కోణాల్లో వికసించడానికి కారకురాలు వారి సతీమణి సులోచనబాయి మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మహారాష్ట్ర నుండి వచ్చి తెలుగు నేర్చుకుని ఒక సాహితీ కృషి వలుని జీవిత సహచరినిగా, మామకి అణుకువ గల కోడలిగా, అత్తకి సొంత కూతురుగా, ముగ్గురు పుత్రులకు తల్లిగా, సదాశివ శిష్యులకు అనురాగవల్లిగా, బంధుమిత్రులకు ఆత్మీయురాలిగా, వివిధ రూపాలలో దర్శనమిచ్చిన శ్రీమతి సులోచన భాయి ధన్యజీవి అని సదాశివ ఆమె చేసిన సేవకు గుర్తుగా సదాశివ ఇంటి పేరు “సులోచన నిలయం” అని పేరు పెట్టారు. వెన్నెల రాత్రుల్లో మనుమరాళ్లను తీసుకొని పారిజాతం చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని వాళ్లతో కథలు చెప్పించుకుని మురిసిపోయేవారు. ఇలాంటి విషయాలు ఎన్నో తన “యాది” గ్రంథం లో వివరించాడు. ఈ ‘యాది’ గ్రంధాన్ని తన పెద్ద మనుమడు నాగ కార్తీక్ కు అంకితం ఇచ్చాడు. ఇలా స్వయంగా “నిరీక్షణము” లాంటి ఎన్నో రచనలు చేసి, 2011లో “స్వరలయలు” అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సదాశివ ‘విభిన్న భాషా సంస్కృతుల వారధిగా’ ప్రావీణ్యాన్ని సంపాదించి, నిరాడంబర జీవితాన్ని గడిపి, పాఠకుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఇలా సదాశివ ఎన్నో కళలలో స్వయంగా నైపుణ్యాన్ని
సాధించి, సాదాసీదాగా జీవనమును కొనసాగించి 2012 ఆగస్టు ఏడవ తేదీన స్వర్గస్తులైనారు. భౌతికంగా వారు లేకపోయినా
వారి స్ఫూర్తి మరియు వారి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రజల మదిలో తాజాగానే యాదిలో ఉంటాయి.
ముగింపు:
సామల జ్ఞాపకాల దొంతరలు పాఠకుల హృదయాలలో తాజాగా ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఎందుకంటే సాహిత్యాన్ని వినూత్న రీతిలో సామాన్య ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి పలు భాషా నైపుణ్యాలను ముచ్చట్ల రూపంలో అందించి మారుమూల గ్రామం నుండి మహోన్నత శిఖరాలను అధిరోహించిన సామల ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమే. తెలంగాణ ముద్దుబిడ్డ అయినా సదా మన మదిలో మెదులుతూనే ఉంటారు.
పాదసూచికలు:
- సామల సదాశివ మోనోగ్రామ్ తెలుగు అకాడమీ 39
- సామల సదాశివ మోనోగ్రామ్ తెలుగు అకాడమీ31
- సామల సదాశివ మోనోగ్రామ్ తెలుగు అకాడమీ70
ఉపయుక్తగ్రంథసూచి:
- ఉర్దూ భాష కవితా సౌందర్యం తెలుగు యూనివర్సిటీ ప్రచురణ: 2004.
- సదాశివ, సామల. యాది, విశాలాంధ్ర బుక్ హౌస్. హైదరాబాద్: 2005.
- సదాశివ కావ్యసుధ. తెలుగు సాహిత్య సదస్సు, కాగజ్ నగర్: 2008.
- రాజవర్ధన్, సామల. సామల సదాశివ మోనోగ్రాఫ్. హైదరాబాద్: 2017.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.