"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక
AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797
6. సామల సదాశివ సాహిత్యం పై ప్రభావాన్ని చూపిన ప్రతిభామూర్తులు
పిన్నోజి నరేష్
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేట (స్వయం ప్రతిపత్తి),
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 8074137379. Email: pinnojinaresh@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
కవిగా, రచయితగా, అనువాదకుడిగా, చిత్రలేఖకుడిగా, హిందుస్తానీ సంగీత విధ్వంసునిగా బహుముఖీన ప్రజ్ఞను ప్రదర్శించిన సామల సదాశివ పైన బాల్యము నుండి ఆయా రంగాలలో రాణించడానికి ప్రేరణగా నిలిచిన ప్రతిభామూర్తులను గురించి తెలుపుతూ, సామల సదాశివ బహుముఖీన ప్రజ్ఞను ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. ఇందులో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి, దీన్ దయాల్ నాయుడు, అబ్దుల్ రహమాన్, ఫణి కుమార్, వాకాటి పాండురంగారావు మొదలైన ప్రముఖులు భిన్నమైనటువంటి రంగాలలో సామల పైన ప్రభావం చూపిన విధానాన్ని వివరించడం జరిగింది.
Keywords: పరిచయం, కుటుంబనేపథ్యం, రచనలు, సంగీత విద్య, పాశ్చాత్య ప్రభావం.
ఉపోద్ఘాతం:
సంస్కృతము, తెలుగు, ఇంగ్లీషు, పార్శి, ఉర్దూ, మరాఠీ భాషలలో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్తగా, తెలుగు, ఉర్దూ భాషలలో రచయితగా, హిందుస్తానీ సంగీత విద్వాంసునిగా బహుముఖప్రజ్ఞతో వెలుగొందినవారు సామల సదాశివ (1928-2012). ఇంతటి విలక్షణమైన ప్రజ్ఞ,పాటవాలతో సామల సదాశివగా రూపొందడానికి ఆయన పైన ప్రభావాన్ని చూపిన వ్యక్తులను గూర్చి పరిచయం చేయడం నా వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
కుటుంబం –సాహిత్యం:
సాధారణంగా మానవుని పైన అనువంశికత, పరిసరాలు అనే అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. చాలామంది మనోవైజ్ఞాన శాస్త్రవేత్తలు మానవుని పైన పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని అంటారు. అందుకు తగినట్లుగానే సదాశివ జీవితం కూడా కనిపిస్తుంది. వీరి తండ్రి, తాతలు, మేనమామలు విద్యావంతులు అవ్వడం చేత తమ ఇంట్లో భారతం, బసవ పురాణము, కళాపూర్ణోదయము వంటి సాహిత్య గ్రంథాలు ఉండేవని, వారాల ఆనంద్ తన డాక్యుమెంటరీ చిత్రంలో ప్రస్తావించారు. అలాంటి గ్రంథాలను చిన్ననాడే చదివే ప్రయత్నం చేసేవాడు సామల సదాశివ1. ఈ అంశాన్ని పరిశీలిస్తే బాల్యంలో సామల సదాశివ మీద వారి కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉందని అర్థమవుతుంది.
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విద్యావంతులవ్వడం, చుట్టూ
సాహిత్య గ్రంథాలు కనిపించడం వల్ల సామల సదాశివకు బాల్యం నుండే విద్య పట్ల ఆసక్తి, సాహిత్యం పట్ల అభిరుచి
వృద్ధి చెంది ఉండవచ్చు. కాలం గడుస్తున్నా! సామల సదాశివ బసవ పురాణం,మనుచరిత్ర,వసుచరిత్ర, కళాపూర్ణోదయం వంటి
కావ్యాలల్లోని పద్యాలను చదివి అందులో ఉన్న పద్యాల మాదిరిగా రాయాలనుకునేవారు. అందులో భాగంగానే చిన్ననాటి
నుంచి పద్య రచనలు చేస్తూ, తన ఇరవై ఒకటవ ఏటలోనే, 1949లో ప్రభాతము అనే లఘు కావ్య సంపుటిని ప్రచురించారు.
ఇందులో ధర్మవ్యాధుడు, సర్వస్వధానము, పశ్చాత్తాపము, క్రైస్తవ నీతి, అంతిమ ప్రయాణము, కాల మహిమ, అంజద్
రుబాయీలను తెలుగులో 18 పద్యాలలో కూర్చాడు.
రచనలు:
1950వ సంవత్సరం శ్రీకర కరుణా ప్రపూర్ణ శ్రీ
సాంబశివ అనే మకుటంతో సాంబశివ శతకాన్ని రచించాడు సామల. ఈ గ్రంథానికి ముందుమాట రాస్తూ కప్పగంతుల లక్ష్మణ
శాస్త్రి, ఈ శతకము నేనామూలాగ్రము, ప్రత్యక్షరము పరిశీలించి, పరిశోధించి చూసితిని. కవిత్వము ధారాళముగా,
సరసముగా, భక్తి భరితముగా నడిచినది, ఇతని కవితలో భాషా శబ్ద సౌష్టవము ఛందో వ్యాకరణజ్ఞతకు లోటు
లేదని2 అన్నారు. సరిగ్గా 100 పద్యాలు ఉన్న ఈ
శతకంలో హృదయ వేదన, ఆత్మార్పణ పూర్వకమైన భావోద్వేగము కనిపిస్తాయి. ఈ శతకంలో సదాశివ వ్యక్తిత్వముద్ర స్పష్టంగా
కనిపిస్తుంది3. అని డాక్టర్ బన్న ఐలయ్య అన్నారు. ఆ
తరువాత నిరీక్షణము, మంచి మాటలు అనే పద్య సంకలనాలు ప్రచురించారు. అదేవిధంగా సాఖీనామా పేరుతో ఉర్దూ సాహిత్య
పత్రికలను పరిచయం చేస్తూ రమ్యమైన పద్యాలు రాస్తూ భారతి, జ్యోతి, సుజాత మొదలైన పత్రికల్లో ప్రచురించారు.
1978లో తన మిత్రుడైన హనుమంతరావుతో కలిసి వృషభగిరి వాస వెంకటేశా అనే మకుటంతో ఒక శతకం రాశారు. ఇందులో 70
పద్యాలు సామల సదాశివవే. ఈ గ్రంథం ఆర్తి అన్న పేరుతో ప్రచురితమైంది. ఇవి సామల సదాశివ పైన తెలుగు సాహిత్యం
యొక్క ప్రభావం, కుటుంబ నేపథ్య ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి ప్రభల సాక్ష్యంగా నిలుస్తుంది.
ఉర్దూ & పారసీ పండితుల ప్రభావం:
అయితే ఆనాటి తెలంగాణలో చదువులన్నీ ఉర్దూ మాధ్యమంలోనే సాగడం వల్ల వీరు ఉర్దూ
మాధ్యమంలోనే చదివారు. ఇలా ఉర్దూలో విద్యాభ్యాసం చేయడం వల్ల వీరికి ఉర్దూ భాష పైన కూడా మక్కువ కలిగిందని
తెలుస్తుంది. సామల సదాశివ విద్యాభ్యాసం చేస్తున్న కాలంలోనే తామ్సి పాఠశాలలో రియాజుల్ రెహమాన్ అనే పారసీ
పండితుడు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కాలంలో, సదాశివ ఆయన వద్ద పారసీని నేర్చుకున్నాడు. అయితే ఆయనకు సంతానం
లేకపోవడం వల్ల సదాశివను పుత్రవాత్సల్యంతో ఆదరించి సొంత కొడుకు కంటే అధికంగా ప్రేమించాడు. ఇలా బాల్యంలో
సదాశివ పారసీని కూడా నేర్చుకున్నట్టు తెలుస్తుంది.
తర్వాతి కాలంలో మౌల్వీ సాహెబ్ నేర్పించిన పారసీ ఆ తరువాతి కాలంలో మౌలానా రూమీ అనువాదాన్ని ప్రామాణికంగా చేసే అధికారాన్ని సామలకు కట్టబెట్టింది. ఈ సంఘటనలను గమనిస్తుంటే సామల సదాశివ విద్యా గ్రహణములో చాలా ముందుండేవాడని అర్థమవుతుంది. సాధారణంగా పాఠశాల స్థాయిలో, ఆ తర్వాతి స్థాయిలలో విద్యార్థులు భిన్నమైన భాషలను నేర్చుకుంటారు. కానీ అందులో ఏదో ఒకటి లేదా రెండు భాషలలోనే నిష్ణాతులుగా రూపొందుతారు. ఇక్కడ సదాశివ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు. ఈయన పారసీ భాషలో కూడా రాణించి పారసీ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, మౌలానా రూమీ సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేశాడంటే వీరికి భాష పట్ల ఉన్న మమకారం, భాషను నేర్చుకోవాలని పట్టుదల, పరభాషా సాహిత్యాన్ని కూడా సహృదయత దృష్టితో అర్థం చేసుకుని, తన మాతృభాష అయిన తెలుగులోకి అనువాదం చేయడం సామల సదాశివ యొక్క సహృదయతకు నిదర్శనం.
ఈ విధంగా సామల సదాశివ పారసీ, ఉర్దూ సాహిత్యానులను తెలుగు వారికి పరిచయం చేయవలసిందిగా దిశా నిర్దేశనం చేసింది సురవరం ప్రతాపరెడ్డి4 తెలియజేశాడు. దీనిని బట్టి సదాశివ పైన సురవరం ప్రతాపరెడ్డి ప్రభావము కూడా ఉన్నదని తెలుస్తుంది.
సదాశివ సంగీత శాస్త్ర పరిజ్ఞానాన్ని ఫణి కుమార్
వద్ద గ్రహించారు. అందులో భాగంగానే హిందుస్తానీ సంగీతంలోని మాధుర్యాల గురించి వారిరువురి మధ్య గంటల కొలది
చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ క్రమంలోనే సదాశివ హిందూస్థానీ సంగీతాన్ని ప్రామాణికంగా తెలుగు వారికి పరిచయం
చేయాలనే దృక్పథంతో హిందుస్తానీ సంగీత ముచ్చట్ల పైన వ్యాసాలు రాయాలనుకున్నారు. ఆ తరువాత ఆదిలాబాద్ ఆకాశవాణి
కేంద్రంలో పనిచేసే కేబి గోపాలం, ఆంధ్రప్రభ సంపాదకులు వాకాటి పాండురంగారావుల ప్రోత్సాహంతో, హిందుస్థానీ సంగీత
విద్వాంసుల పరిచయాలను వ్యాసరూపంలో రాస్తూ ఆంధ్రప్రభ వార పత్రికలో మలయ మారుతాలు అనే ధారావాహికగా
ప్రచురించారు. ఈ ధారావాహిక బహుళ జనాదరణ పొందింది. దీనిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు
2001లో ప్రచురించారు. దీనిని బట్టి సదాశివకు హిందుస్థానీ సంగీతము పైన మక్కువను చిన్నతనము నుండి ఉన్న దానిని
జాగృతం చేసింది ఫణి కుమార్ అని, వాటిని బయటపెట్టేలా చేసింది కేబీ గోపాలము, పాండురంగారావు అని
తెలుస్తుంది.
గురువుల వద్ద చిత్రలేఖనం మెలకువలు:
సదాశివ చిన్ననాటి నుండే చిత్రాలు వేయడం ప్రారంభించాడు. తనలో ఉన్న చిత్రకళాభిరుచికి ఆజ్యం పోసింది. తాంసి గ్రామంలోని హవేలీ పైనున్న నకాసి చిత్రాలను చూసి తాను కూడా ఆ విధంగా చిత్రాలు రూపొందించి ఆ కళలో ఎదగాలని భావించాడు. 1947-48 సంవత్సరాలలో ఖైరతాబాద్ కళాశాలలోని టీచర్స్ ట్రైనింగ్ చేస్తున్న కాలంలో సరోజినీ నాయుడు గారి మేనల్లుడు దీన్ దయాల్ నాయుడు క్రాఫ్ట్ టీచర్ గా ఉండేవాడు. వీరిది చిత్రకళలో అందవేసిన చేయి. అనతి కాలంలోనే దీన్ దయాల్ నాయుడి వద్ద సదాశివ ప్రియ శిష్యునిగా ఎదిగి చిత్రకళలో రాటుదేలాడు. వీరి చిత్రాలు అబ్దుల్ రహమాన్ చుగతాయి చిత్రాల వలె ఉంటాయి. ఇది ఒక పురాతనమైన ప్రక్రియ. ఇందులో చిత్రాలు వేయడానికి చాలా సమయం పడుతుంది. దీనినే వాష్ పెయింటింగ్ అని పిలుస్తారు. సదాశివ అలాంటి అరుదైన చిత్రకళలో ప్రావీణ్యాన్ని సాధించారు. ఇలా వీరి జీవనంలో చిత్రకళ అనే పార్శ్వాన్ని దృఢతరం చేసింది దీన్ దయాల్ నాయుడు అని తెలుస్తుంది. ఇక ప్రఖ్యాత చిత్రకారుడు కాపు రాజయ్య వీరి వద్దనే చిత్రకళలో మెలకువలు నేర్చుకోవడం గమనించదగ్గ విషయం.అట్లే వీరు అనువాద రచయితగా కూడా రాణించారు.
దాశివ కేశవసుత్ అని మరాఠీ కవి జీవితాన్ని
తెలుగులోకి అనువదించగా ఆ గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారు ప్రచురించారు. ఒక భాషలోని
గ్రంథాన్ని మరొక భాషలోకి అనువాదం చేయాలంటే, ఆ రెండు భాషలలో సమానమైన పాండిత్యం అనువాదకునికి ఉండి తీరాలి.
సామల తాను అభ్యసించిన అన్ని భాషలలో కూడా ఉద్దండ పాండిత్యాన్ని గడించినట్లు వారి సాహిత్య కృషిని చూస్తే
అర్థమవుతుంది.అట్లే వీరు నవలలు, కథలు, లేఖా సాహిత్యంలో కూడా తనదైన ముద్రను వేశారు.
ముగింపు:
ఇలా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామల రూపాంతరం
చెందడానికి ఆయనకు సాహిత్యము మీద, చిత్రకళ మీద, సంగీతము మీద గల మమకారమే ప్రధానము. దానికి తోడు ఆయా రంగాలలో
సామలను ఉద్దండునిగా నిలబెట్టడానికి ఎందరో ప్రతిభామూర్తులు కృషి చేశారు. ఇలా సామల బహుముఖీన ప్రజ్ఞ
స్వయంకృషితో, అట్టి ప్రతిభామూర్తుల సహాయ సహకారాలతో వెలుగులోకి వచ్చింది.
పాదసూచికలు:
- యాది - పుట 2
- యాది - పుట 17
- జయంతి సాహిత్య త్రైమాసిక పత్రిక - ఏప్రిల్, సెప్టెంబర్ 2012 సంచిక - పుట 203
- యాది - పుట 13
ఉపయుక్తగ్రంథసూచి:
- జయంతి సాహిత్య త్రైమాసిక పత్రిక - ఏప్రిల్, సెప్టెంబర్ 2012 సంచిక
- రాజవర్దన్, సామల. డా. సామల సదాశివ 2017 –తెలుగు ప్రపంచ మహా సభలు, హైదరాబాద్.
- సదాశివ, సామల -ఉర్దూ కవితా సామాగ్రి 1900 ఆంధ్ర సార్వత పరిషత్,హైదరాబాద్.
- సదాశివ, సామల. పార్శీ కవుల ప్రాశస్తి 1975 ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్.
- సదాశివ, సామల. సాంబశివ శతకం 1950, హైదరాబాద్.
- సదాశివ, సామల. యాది 2005 విశాలాంధ్ర పబ్లికేషన్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.