headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   


"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక

AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797

4. మలయమారుతాలలో సదాశివ సంగీతఝరులు

DrKLavanya
చక్రహరి రమణ

తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి), సిద్దిపేట
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9247226292. Email: ramana.chakrahari@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సామల సదాశివ రచించిన మలయమారుతంలోని విద్వాంసుల, సంగీతజ్ఞుల పరిచయాల, సంగీత స్వరాల గురించిన అంశాలు, పత్రికలలో, రేడియోలలో, టీవీలలో హిందుస్తానీ సంగీత ముచ్చట్లు, వాయిద్యాల గురించిన ప్రస్తావన.

Keywords: పరిచయం, సంగీత విద్వాంసుల అనుభవాలు, రాగాలు, హిందుస్తానీ రాగం

ఉపోద్ఘాతం:

"ఎక్కడిది హనుమాజీపేట
ఎక్కడయా ఈ ఎర్రకోట
భావ సూత్రం తోడ రెంటికి
బంధమేసితినే" (యాది, పుట -111)
అంటూ ముత్యాలసరంలో కవి కోసం చలిని, ఈదరగాడుపులను లెక్కచేయలేదు భావజాలం. పల్లె పట్నం అనే తేడాలు లేకుండా ప్రాంతమేదైనా ఆలోచనలలోకి యాదికి రావలసిందే అని తెలుస్తుంది.   

వేద వాఙ్మయం లో వేదాంగాలలో ముఖ్యమైనది శిక్ష. భాషకు, ఉచ్చారణకు సంబంధించి సరైన  మార్గాన్ని నిర్దేశించేది శిక్షా శాస్త్రం(సంస్కృత సాహిత్య చరిత్ర,పుట-60). అందులో నారదీయశిక్ష గాంధర్వ గానానికి ఇటు లౌకిక గానానికి మధ్యస్థంగా ఉంటుంది(కర్ణాటక సంగీత చరిత్ర,పుట-5).వీటిని బట్టి చూస్తే, ఆనాటి నుండి ఈనాటి వరకు సంగీతం చిన్న నుండి పెద్ద వరకు, పల్లె నుండి పట్నం వరకు విస్తరించి ఉందని చెప్పవచ్చు.    భారతీయ అలంకార శాస్త్రాలలోనూ  మొదటిది భరతుని యొక్క నాట్య శాస్త్రమని, ఇది ప్రాచీన కాలంలోని నాట్య మరియు సంగీత స్వరూపాన్ని, నాటక ప్రదర్శన క్రమాలకు సంబంధించి అన్ని లక్షణాలను తెలుపుతుందని, అలంకార శాస్త్రాల వల్ల తెలుస్తుంది. సంగీత విషయాలతో పాటు వాద్య విషయాలను మరియు తన కాలంలో ఉన్నటువంటి గాంధర్వ గానం గురించి వివరించిన గ్రంథమే భరతుని నాట్య శాస్త్రం.

సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం ఈ మూడింటిని పర్యాయపదాలుగా వాడుతారు (తెలుగు సాహిత్య చరిత్ర-పుట 1). ఇందులో వాఙ్మయం అనేది  విస్తృతమైనది. మరియు వాక్కుతో కూడుకున్నది.  సాహిత్య సారస్వతాల కలయికనే వాఙ్మయం అలాంటి వాఙ్మయం  సంగీతమయమైనదిగా ఉంటే  శ్రవణానందాన్ని కలిగిస్తుంది. శ్రవణానందభరితమైన సంగీతం హృదయోల్లాసాన్ని కలిగిస్తుంది. ఉత్సాహ పూరితమైన హృదయం ఉంటే ఆరోగ్యకరమైన మనుగడ కొనసాగించవచ్చు.

సంగీతం తెలిసిన వారికి సాహిత్యం తెలియకపోవచ్చు. సాహిత్యం తెలిసిన వారికి సంగీతం తెలియకపోవచ్చు(కర్ణాటక సంగీత చరిత్ర-పుట 19). ఈ రెండు తెలిసిన  వారు తక్కువగానే ఉంటారు. సంగీత విద్వాంసులు కొందరు తాము నేర్చుకున్న రాగాల పేర్లు స్వరాల పేర్లు మాత్రమే చెప్పి వూరుకుంటున్నారు. వాటి పుట్టుకను, పూర్వ వైభవాన్ని తెలపడం లేదు. వాటి పుట్టు పూర్వోత్తరాలను ఎంతో కొంత చెప్పినట్లయితే సంగీతం నేర్చుకునే వారికి కొత్త ఉత్సాహం కలుగించినట్లవుతుంది.

సంగీతం నేర్చుకునే  ప్రతి ఒక్కరు సంగీత విద్వాంసులకు సరిసమానంగా నిలవాలనే ఆశ ఉంటుంది.  అలాంటివారు సంగీతంలో ప్రశస్తినొందిన వారి గురించి, వారి అనుభవాల గురించి తెలుసుకున్నట్లయితే సంగీతభ్యసన ఎన్నోరెట్లు అభివృద్దవుతుందనే ఆలోచనతోనే, సంగీత విద్వాంసుల  అనుభవాలు,  వారి అభ్యసనా విధానాన్ని, సంగీతంలో ఉండే మెళకువలను తెలుపుతూ, సంగీత స్వరాలను కురిపించి, వినిపించి, మైమరిపించి సంగీతములో ఉయ్యాలలూగించి తన మలయ మారుతాల ద్వారా  చల్లగాలులు వీయించిన వారు సామల సదాశివ. హిందుస్థానీ సంగీత విద్వాంసుల పరిచయాలను వ్యాసరూపంలో రాస్తూ ఆంధ్రప్రభ వార పత్రికలో మలయ మారుతాలు అనే ధారావాహికగా ప్రచురించారు(సామల సదాశివ-పుట 18). తాను హిందుస్తానీ సంగీతాన్ని, అందులోని తన్మయత్వ రాగాలను, ఆ రాగాలకు అనుబంధంగా ఉన్న ఎంతోమంది సంగీత విద్వాంసులను, వారితో సంబంధం ఉన్న వ్యక్తుల  గురించి పరిచయం చేసి ఎందరో సంగీత కళాకారుల హృదయాలకు దగ్గరైన వారు సామలసదాశివ.

సామల సదాశివ తన మలయ మారుతాలలో సంగీతం మహాసముద్రమని, దానిని దాటడం అంత తేలికైనది కాదని సంగీతంలో సాహిత్యం, సాహిత్యం లో సంగీతం ఉన్నదని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత అని అన్నారు(మలయ మారుతాలు - పుట 86). అంతేకాకుండా "నా బయోడేటా లో ముచ్చటించుకోదగిన ముఖ్యాంశాలు ఏమున్నాయి. 1950లో సురవరం ప్రతాపరెడ్డి పద్యాలు వద్దు వచనం రాయండి. అంటే వచనం రాస్తున్నాననే ప్రయత్నం చేస్తున్నా" నని (మలయ మారుతాలు – పుట 10) అంటూ సంగీతమయమైన రాగాల మలయ మారుతాన్ని రచించారు. అందులో మనకు పరిచయం చేసిన వారిలో ఒకరిద్దరి గురించి చర్చించుకుంటే,ముందుగా

గోహర్ జాన్:

హైదరీజాన్ ఠుమ్రీ దాద్రాలు పాడే వారిలో మేటి. తన తర్వాత ఠుమ్రీ దాద్రాలు పాడే వాళ్లలో అంత గొప్ప వాళ్ళు ఇక ఉండరు అనుకునే సమయంలో మలికా జాన్ తన కూతురు గోహర్ జాన్ తల్లి కూతుర్లు ఇద్దరు హైదరీజాన్ ను మరిపించే విధంగా ముందుకొచ్చారు. విక్టోరియా అనే తాను ముసల్మానును వివాహమాడి ఇస్లాం మతంతో మలికాజాన్ అయింది.  తన కూతురు కూడా ఠుమ్రీ గానంలో, అందంలోను, అటు కంఠమాధుర్యంలోను, సంగీతంలోను కళావంతులందరినీ మించిపోయింది. తాను సాయంత్రం బగ్గిలో కూర్చుని షికార్లు చేస్తూ ఉంటే ఓ ఇంగ్లీష్ ఆఫీసర్ సెల్యూట్ చేసి తాను పెద్దాఫీసర్ భార్య కాదని తెలిసి ఆమె గాయని అని  వెయ్యి రూపాయల జరిమానా వేశారు.

ఆ విధంగా ప్రతిరోజు వెయ్యి రూపాయల జరిమానా కడుతూ బగ్గీలో తిరిగేదని సామల సదాశివ మలయమారుతంలో అంటారు. అంతే కాకుండా గాంధీజీకి స్వాతంత్ర పోరాట సమయంలో చాలా డబ్బు అవసరం అయ్యి, గోహర్ జాన్ దగ్గర లక్షల కొద్ది  డబ్బుందని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిందని విని ద్రవ్య సహాయం కోసం పంపిస్తే గాంధీజీనే స్వయంగా రమ్మని తన ఇంటిని పవిత్రం చేయమంటుంది (మలయ మారుతాలు - పుట 18). తర్వాత మౌలానా షౌకత్ అలీని పంపిస్తే అతని మీద గౌరవంతో పాతికవేలిచ్చి సత్యం తప్పని మహాత్ముడు తన ఇంటికి రాలేదని బాధను వ్యక్తం చేసింది. వారవధూ వివేచన్ అనే గ్రంథాన్ని రచించిన పండిత్ గోస్వామి ఆ తల్లీకూతుళ్లను రెండు సార్లు దర్శించుకొని, సంగీత శాస్త్ర రహస్యాలను, ఠుమ్రీ చరిత్రను తెలుసుకున్నట్లు తన గ్రంథంలో రాసుకున్నాడు (మలయ మారుతాలు– పుట20) .

ఒక గాయని లక్షల కొలది ధనాన్ని సంపాదించి, సంస్థానాధీశుల భార్యలకు, రాణులకు, రాజ బంధువులకు మాత్రమే బగ్గీలల్లో తిరిగే అధికారం ఉన్న సమయంలో వారందరికీ సమానంగా బగ్గీలో తిరుగుతూ, అవసరమైతే వెయ్యి రూపాయల జరిమానా కడుతూ, మహత్ముడికి కూడా సహకారం అందించి ఆదర్శంగా నిలిచిన విద్వాంసురాలని సామల సదాశివ మలయ మారుతాల వల్ల తెలుస్తుంది.

విద్యాధరీ దేవి:

నీలం నగర్ మహారాజు వద్ద అంతరంగిక కార్యదర్శి కిషన్ సింగ్ చావ్ డా తన స్నేహితుడు కెప్టెన్ జంగ్ బహదూర్ సింగ్ తో కలిసి రైలులో లక్నో నుండి కలకత్తా బయలుదేరాడు. ఒక స్టేషన్లో సుమేర్ ఘడ్ మహారాజు తన అంతరంగికుడైన కర్నల్ గిరిరాజ్ సింగ్ తో కలిసి కిషన్ సింగ్ చావ్ డా ఎక్కిన కంపార్ట్మెంట్లోకి వస్తాడు. ఒకరికొకరు అభివాదాలు పూర్తయ్యాక టేబుల్ మీద నాలుగు గ్లాసులు, విదేశీ విస్కీ, సీసాలు పెట్టి ఐస్ నింపిన ధర్మాస్ తీసి సిద్ధం చేశాడు.  మహారాజు దానిని  తిరస్కరిస్తాడు. అలా వద్దనే వాళ్ళు ముఖ్యంగా మహారాజులలో ఎవరు ఉండరు.  కారణం ఏంటని అడిగితే మహారాజు బనారస్ లో ఉండే గొప్ప గాయకురాలైన విద్యాధరీ దేవి నోట గీతగోవిందం వినడానికి వెళ్తున్నానని చెప్తాడు (మలయ మారుతాలు - పుట 24).

ఎన్నాళ్ళనుండో కష్టపడితే ఇప్పుడు అవకాశం లభించిందని, మద్యం సేవించిన వాళ్ల ముందు తాను గీత గోవిందం పాడదని అన్నాడు. ఇలాంటి అవకాశం తమకి కూడా కలిగించమని ప్రాధేయపడి మహారాజ్ తో కలిసి విద్యాధరీ దేవి వద్దకు వెళ్తారు. గీత గోవిందం వింటూ తన్మయత్వం పొందాలనే కోరికతో అలవాటుగా మారిన కోరికలను సైతం దూరం చేసుకొని సంగీత విలువలను తెలియచేశారు సామల సదాశివ.

సిద్దేశ్వరీ దేవి:

నీలం నగర్ మహారాజు కుమారుని వివాహం నేపాల్ రాజు కుమార్తెతో జరుగుతుంది. ప్రయాణ సమయంలో గాయనీ గాయకుల గానాన్ని, నర్తకీ నర్తకుల నాట్యాన్ని ఏర్పాటు చేశారు. వివాహనంతరం సంస్థానాధీశుల సంతోషం కోసం సిద్దేశ్వరి దేవి పాటకచేరిని ఏర్పాటు చేశారు. గంభీరమైన గాత్రముతో జయజయవంతి  రాగములో, పహాడీ రాగంలో ఆలపిస్తుంది. కానీ ఆమె రాగం ఎంతకు ముందుకు సాగడం లేదు. ఎందుకంటే రాజభవనానికి కొంత దూరాన ఉద్యానవనములో బ్యాండ్ ట్రూప్ ను చేతిలోని చిన్న కర్రను ఆడిస్తూ తిలక్ కామోదు గత్ వాయిస్తున్నాడు. తిలక్ కామోదు శక్తివంతమైన రాగం. గత్ కు డైరెక్షన్ ఇస్తున్న వాడు ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్. తిలక్ కామోదు స్వరాలు గాలిలో తేలి పహాడీ స్వరాలను అడ్డుకుంటున్నాయి. సిద్దేశ్వరి దేవి పాట ఆపేసి ఉద్యానవనం లోకి వెళ్లి చూస్తుంది. ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ ఈ లోకాన్ని మర్చిపోయి ధ్యానములో తిలక్ కామోదు వాయుంప చేస్తున్నాడు. గత్ పూర్తి కాగానే చేతి కర్రను దించి చూస్తే అశ్రునయనాలతో నిల్చున్న ఆనాటి మేటి గాయని సిద్దేశ్వరి దేవి కనిపిస్తుంది (మలయ మారుతాలు - పుట 27).

వెంటనే అతని పాదాల మీద తలవాల్చింది. ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్  కొంత ఆశ్చర్యపడి, మందహాసం చేస్తాడు.తిలక్ కామోదు స్వరాల్లో నా పహాడీ తోవతప్పింది నేను పాడలేను అని చెప్తుంది. సంగీతమయమైన రాగాలు మనుష్యుల మనసులను తేలియాడజేస్తాయని చెప్పడానికి సామల సదాశివ మలయ మారుతంలోని ఈ సంఘటనను నిదర్శనంగా చెప్పవచ్చు.  ఈర్ష, అసూయ,అహంలను సంగీతం దూరం చేసి మానసికోల్లాసాన్ని కలుగజేసి, చక్కటి ఆత్మీయతను సంగీతం ద్వారా పెంపొందించుకోవచ్చని తెలుస్తుంది.

ఠుమ్రీ:

ఠుమ్రీ అనేది నృత్యానికి సంబంధించిన ప్రక్రియ.ఠుమ్రీ 19వ శతాబ్దంలో పూర్తి లక్షణాలతో  రూపురిద్దుకున్నది. ఠుమ్రీ గానం భావ ప్రదర్శనకు ప్రముఖ స్థానం. ఠుమ్రీల అభినయంలో రాగ తాళాల కంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యం. ఠుమ్రీలు రాధాకృష్ణుల ప్రేమను శృంగారాన్ని వస్తువుగా తీసుకుంటారు. రాధాకృష్ణుల పేర్లు లేకుండా నాయికా నాయకుల శృంగారాన్ని మాత్రమే  స్వీకరిస్తారు.  శృంగార రస ప్రధానమైన ఈ ఠుమ్రీ జావళులతో పోల్చకూడదు. ఠుమ్రీలో 14 మాత్రలు, దీప్ చాందీ తాళంలో తబ్లా పక్కవాద్యంతో గానం చేస్తారు. దీన్ని ‘హారో ఠుమ్రీ’ అని అంటారు(మలయ మారుతాలు – పుట79).

సామల సదాశివ హిందుస్తానీ సంగీతంలో ఠుమ్రీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నదని ప్రస్తావించిన అంశాన్ని పరిశీలిస్తే, ఠుమ్రీ కచేరీలు చేసేవాళ్లలో ముఖ్యులుగా  పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందిన సిద్దేశ్వరి దేవి, బేగం అఖ్తర్, రసూల్ భాయ్, బడే మోతీబాయ్, గిరిజాదేవి మొదలైన వారు. రాజస్థానాలలో ప్రదర్శనలు ఇచ్చినవారు బిందాదీన్ మహారాజ్, కాల్కా మహారాజ్, అచ్చన్ మహారాజ్, శంభూ మహారాజ్ సోదరుల గురించు తెలుస్తుంది. ఠుమ్రీ  వైష్ణవ భక్తి తత్వం, వైష్ణవ భక్తి సంప్రదాయం.

గీత గోవిందం:

జయదేవుడు సంస్కృతంలో రచించిన కావ్యం గీత గోవిందం.ఇందులో 12 భాగాలు, 83 గీతలున్నాయి. దీనినే అష్టపదులు అని కూడా అంటారు. ఎనిమిది శ్లోకాలు కలిగి ఉన్నవి అష్టపదులు.  ఇది రాధాకృష్ణుల మధ్య ప్రేమను, విరహాన్ని వర్ణిస్తుంది (మలయ మారుతాలు – పుట25). ఈ అష్టపదులు ఎక్కువగా ప్రబంధాలల్లో కనిపిస్తాయి.జయదేవుడే కాకుండా పింగళి,పాండురంగారావ్, కపిలుడు,వాత్సాయనుడు మొదలైన వారు కూడా గీత గోవిందాలను రచించారు.

జయజయవంతి  రాగం:

సిద్దేశ్వరి దేవి ఆలపించిన జయజయవంతి రాగం యొక్క ప్రస్తావన  ప్రాచీన భారతీయ శాస్త్రీయ గ్రంథాలలో లేదు. జయజయవంతి రాగాన్ని  సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో పాడుతారు.కర్ణాటక సంప్రదాయంలో దీనిని రాగ ద్విజయంతి అని అంటారు (కర్ణాటక సంగీత చరిత్ర-పుట 32). ఈ రాగాన్ని జయజయంతి అని కూడా అంటారు.  జయజయంతి రాగం మధురంగా ఉంటుంది. పాడటం చాలా కష్టం.

పహాడీ రాగం:

జానపద సంగీతం ఆధారంగా ప్రసిద్ధి చెందిన రాగం పహాడీ రాగం. ఈ పహాడీ రాగం హిమాలయాల పర్వత ప్రాంతం నుండి పుట్టింది. హిందీ సంగీతంలో బాగా ప్రాచుర్యం పొందిన రాగం పహాడీ రాగం.ఇది కొన్నిసార్లు బహుళ ప్రతిధ్వనులను అనుకరిస్తుంది. దిగువ మరియు మధ్య అష్టపదాలలో పాడబడుతుంది.  జానపద సంగీతం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని వెదజల్లే రెండు రాగాలను పోలి ఉంటుంది. అవి రాజస్థాన్ ప్రాంతం నుండి ‘మాండ్’, హిందీ హార్ట్‌ల్యాండ్ నుండి ‘పిలు’ అనునవి.  ఇది తేలికపాటి రాగం

హిందుస్తానీ వాద్యాలు:

హిందుస్తానీ సంగీతంలో   ఉపయోగించే వాద్యాలు, వాటిలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులను గుర్తుకు తెచ్చుకుంటే, ముఖ్యంగా ఇందులో తత వాద్యాలు, సుషిర వాద్యాలు అని రెండు రకాలు. తతవాద్యాలంటే తంత్రీ వాద్యాలు.  సుషిర వాద్యాలు అంటే గాలి ఊదే వాద్యాలు (సిరిమువ్వలు- పుట 48, సంగీత శాస్త్ర వాచకములు-పుట 63). కొన్ని కారణాల వల్ల హిందుస్తానీ సంగీతం ముసల్మానుల స్వాదీనమలో ఉండిపోయింది. వాళ్ళు ఆ సంగీత శాస్త్రాన్ని వేదాలవలె మస్తిష్కాలల్లో భద్రపరుచుకొన్నారు.  అలాంటి హిందుస్తానీ సంగీత వాద్యాల గురించి, వాయించే వారిలో ముఖ్యమైన వారి గురించి చూస్తే, మొదట ‘వయోలిన్’ ఇందులో  పండిత్ గజానన్ రావు జోషి, ప్రొఫెసర్ వి.  జి.  జోగ్ వి ముఖ్యులు. ‘సితార్’ అనగానే  పండిత్ రవిశంకర్ గుర్తుకు వస్తారు. ‘సరోద్’- ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, ‘సుర్ బహార్’ – అన్నపూర్ణాదేవి, ‘ఫ్లూట్’ - పన్నాలాల్ ఘోష్, పండిత్ హరిప్రసాద్ చౌరస్యా, ‘షహనాయి’- ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్,  ‘సంతూర్’ - పండిత్ శివకుమార్ శర్మ, ‘సారంగి’ - రామ్ నారాయణ, ‘గిటార్’- బ్రిజ్ భూషణ్ కాబ్రా’ (మలయ మారుతాలు - పుట 161)

ముగింపు:

పర్వతాల నుండి వీచే సాయంకాలపు చల్లగాలులు, పిల్లగాలులు, ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని కలిగిస్తాయి.  అంత చక్కని మలయ మారుతం అనే పేరుతో సాయంకాలపు చల్ల గాలుల వలె సంగీత స్వరాల ఝరీ ఒయ్యారాలను ఒలికించి, పరిచయమేలేని ఎందరో సంగీత విద్వాంసులను మన ముందు సాక్షాత్కరింపజేసి, రేడియో సంగీతాన్ని, టీవీలలోని రాగాలను, పత్రికలలో స్వరాల లహరులతో పాటు అత్యంత ప్రాచీన శాస్త్రాలైన వేదాలలోని సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న అతి పురాతనమైన హిందుస్థానీ సంగీతాన్ని, పారసీ సాహిత్యాన్ని, ఉర్దూ గజాలను, ఖయాల్ గాయనాన్ని, పేష్వాల కాలం నాటి పాటల లొసుగులను, ఎందరో వాద్య కళాకారులను పరిచయం చేస్తూ రచించిన మలయ మారుతాలు ప్రతి సంగీత కళాకారునికి, అంతేకాకుండా తెలుగు భాషను అభిమానిస్తున్న వారందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

ఉపయుక్త గ్రంథ సూచి :

  1. సదాశివ సామల -మలయ మారుతాలు 2001-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్    
  2. సదాశివ సామల- యాది 2005 –ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్
  3. రాజవర్దన్ సామల. సామల సదాశివ. 2017 –తెలుగు ప్రపంచ మహా సభలు, హైదరాబాద్
  4. విజయ లక్ష్మి చల్లా -కర్ణాటక సంగీత చరిత్ర. 2011-కర్షక్ ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాద్.
  5. నాగేశ్వర శాస్త్రి ద్వాదశి- తెలుగు సాహిత్య చరిత్ర 1998-వాగ్దేవి ప్రెస్, హైదరాబాద్
  6. సుజాతరెడ్డి, ముదిగంటి., గోపాలరెడ్డి, ముదిగంటి. సంస్కృత సాహిత్య చరిత్ర 2004. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్
  7. దుర్గా ప్రసాద్ నప్పా- సిరిమువ్వలు.1986
  8. సుబ్రహ్మణ్య శాస్త్రి వేంకట- సంగీత శాస్త్ర వాచకములు. 1955

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]