headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   


"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక

AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797

3. తెలుగువారి అంజద్ సామల సదాశివ

DrKLavanya
డా. యస్. మహేందర్

తెలుగు సహాయచార్యులు, తెలుగు విభాగాధిపతి,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ) సిద్ధిపేట,
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9642865013. Email: sheelammahender96@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఉర్దూ సాహిత్య ప్రభావంతో తెలుగులోకి చేరిన కవిత రూపాలు రూబాయిలు, గజల్స్. తెలుగుసాహిత్యంలో రూబాయలకు గజల్స్ కు అంత ప్రాచుర్యం రావడానికి దాశరథి , సినారెల కృషి అనిర్వచనీయం. ఉర్ద కవులైన ఉమర్ ఖయ్యూం ,గాలిబ్, అంజద్ రూబాయలను, గజల్లను తెలుగులోకి అనువాదం చేసిన వారు వరుసగా దువ్వూరి రామిరెడ్డి, దాశరథి , సామల సదాశివలు. సామల సదాశివ అంజద్ రూబాయిలను తెలుగులోకి "అంజద్ రూబాయిలు" అని పేరుతో అనువాదం చేసినారు. సామల సదాశివ గారు సాహిత్యంలోనూ వ్యక్తిత్వంలోనూ అంజద్ గారికి దగ్గర పోలికలు ఉండడం వలన తెలుగువారి అంజద్ గా సామల సదాశివను చెప్పవచ్చును.

Keywords: అంజద్ ,అనువాదం, రూబాయి, ఉర్దూ, సామల సదాశివ

ఉపోద్ఘాతం:

ఉర్దూ సాహిత్యప్రభావంతో తెలుగులోకి చేరిన కవిత రూపాలు రూబాయిలు, గజల్స్. తెలుగు సాహిత్యంలో రూబాయలకు గజల్స్ కు అంతప్రాచుర్యం రావడానికి దాశరథి, సినారెల కృషి అనిర్వచనీయం. ఉర్దూ కవులైన ఉమర్ ఖయ్యూం, గాలిబ్,అంజద్ రూబాయలను, గజల్లను తెలుగులోకి అనువాదం చేసిన వారు వరుసగా దువ్వూరి రామిరెడ్డి, దాశరథి, సామల సదాశివలు. సామల సదాశివ అంజద్ రూబాయిలను తెలుగులోకి "అంజద్ రూబాయిలు" అని పేరుతో అనువాదం చేసినారు. సామల సదాశివ సాహిత్యంలోనూ వ్యక్తిత్వంలోనూ అంజద్ కి దగ్గర పోలికలు ఉండడం వలన తెలుగువారి అంజద్ గా సామల సదాశివను చెప్పవచ్చును.

ప్రధానవిషయం:

ఆకుపచ్చ అందమైన అడవులు కలిగి, తెలంగాణలో సహజ ప్రాకృతిక సౌందర్యంతో శోభాయమానంగా అలరారుతున్నజిల్లా అదిలాబాద్. గలగల పారుతున్న గోదావరినది ఒడ్డునవెలసిన జ్ఞానసరస్వతి కొలువైనజిల్లా. సరస్వత్యా స్తనద్వయంగా చెప్పబడ్డ సంగీత, సాహిత్యాలపై ఎనలేని ఆసక్తి కలిగి, చివరిదాకా వాటిపైన విశేష కృషిచేసిన స్మరణీయులు సామలసదాశివ. ఇటు సంగీత సాహిత్యాలు, అటు తెలుగు,ఉర్దూభాషలపై సమగ్రమైన లోతుపాతులు తెలిసిన సవ్యసాచి సామల సదాశివ.

సాహిత్యంలో రూబాయిలు, గజల్లు మౌలికంగా తెలుగు సాహిత్య ప్రక్రియలు కానప్పటికీ తెలుగుసాహిత్య ప్రక్రియలే అన్నంతగా కలిసిపోయి విశేష ప్రాచుర్యం పొందాయి. అందుకోసం కృషిచేసిన మహనీయులు దాశరధికృష్ణమాచార్యులు, సింగిరెడ్డి నారాయణరెడ్డిగార్లను ఈ సందర్భంగా తప్పకుండా తలుచుకోవాలి.

పూర్వ పరిశోధన:

తెలుగు గజళ్ళు–రూబాయిలు అనే పేరుతో పెన్నా శివరామకృష్ణ పుస్తకంగా తీసుకువచ్చినారు. ఇందులో తెలుగులోకి వచ్చిన ఉర్దూ కవితా రూపాలను, ఉర్దుకవూలను పరిచయం చేసినారు. అంతే కాకుండా తెలుగు వారు రాసిన గజల్లను రూబాయిలను గూర్చి చెప్పడం జరిగింది.

సమాచార సేకరణ: 

అంతర్జాలములో దొరుకుతున్న సమాచారముతో పాటు సామల సమాల సదాశివ ముద్రితమైన పుస్తకాల ద్వారా సమాచారం సేకరించడం జరిగింది.


తెలుగులోకి అనువాదం చేసిన ఉర్దూ రచనలు:

తెలుగుసాహిత్యలోకానికి బాగా పరిచయమైన ఉర్దూకవులలో ఉమర్ ఖయ్యూం గాలిబ్ మరియు అంజద్. ఉమర్ ఖయ్యూం రూబాయిలను “పానశాల” పేరుతో దువ్వూరి రామిరెడ్డి తెలుగులోకి అనువాదం చేసినారు. కానీ ఆ రచన అనువాదమని అన్నట్లు కాకుండా స్వతంత్ర కావ్యమా అనే విధంగా అనువాదం చేసారు. ఆ తర్వాతగాలిబ్ రాసిన గజళ్ళను దాశరధి“గాలిబ్ గీతాలు” పేరుతో అనువాదం చేసి, తెలుగువారికి ఉర్దూ కవిత్వమాధుర్యాన్ని అందజేసినారు. అనంతరం అంజద్ రాసిన రూబాయిలను భావదోషం లేకుండా కవితాత్మకంగా “అంజద్ రుబాయిలు” అనే పేరుతో అనువాదం చేసినవారు సామలసదాశివ. అలా తెలుగుసాహిత్యంలో దువ్వూరి, దాశరథి, సామలసదాశివ ప్రత్యేకకవులుగా చెప్పుకోవచ్చు. సినారె, తిరుమలశ్రీనివాసాచార్యులు, ఏనుగునరసింహారెడ్డి, రెంటాల, దాశరాథులబాలయ్య లాంటివాళ్ళు ఈమధ్యకాలంలో గజల్లను రూబాయిలను స్వతంత్రంగా రాస్తున్నారు.
తెలుగువారికి ఉర్దూ కవితామాధుర్యాన్ని అందించిన ఉమర్ ఖయ్యూం పర్షియన్ దేశస్థుడు. గాలిబ్ ఉత్తర భారతదేశానికి చెందినవారు. అంజద్ హైదరాబాదుకు చెందిన ఉర్దూకవి. ఉర్దూసాహిత్యంలో జాతీయకవిగా పేరేన్నిక కలిగిన గొప్పకవి. ఉమర్ ఖయ్యూం రుబాయిలను దువ్వూరి వారు అనువాదంచేసి అతని పేరు రాకుండానే పానశాల అని పేరుపెట్టినారు. గాలిబ్ గజల్లను దాశరథికృష్ణమాచార్య అనువాదం చేస్తూ గజళ్ళను గీతాలుగా భావించి ‘గాలిబ్ గీతాలు’ పేరుతో వెలువరించడం జరిగింది. కానీ సామలసదాశివ అంజాద్ రుబాయిలను తెలుగులో అనువాదం చేసి సూటిగా భావగ్రహణ కలిగే విధంగా “అంజాద్ రుబాయిలు” అని పేరు పెట్టడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు చెందిన ఉర్దూకవి రూబాయిలను తెలంగాణకు చెందిన సామలసదాశివ అనువదించడం ద్వారా మూలకవి స్థానీయ భావపరంపరను ఏమాత్రం తగ్గించకుండా రసాత్మకంగా అందించడానికి అవకాశం కలిగింది.

అంజద్ హైదరాబాదులో పుట్టి పెరిగినవారు. మూసివరదలలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి సూపితత్వం అలవర్చుకొని రూబాయిల ద్వారా తన భావాలను కవితాత్మకంగా అభివ్యక్తికరించినారు. హైదరాబాదుకు చెందిన కొంతమంది ఉర్దూకవులతో ముషాయిరా నిర్వహించి ఆలిండియా రేడియో ద్వారా సంగీత, సాహిత్య అభిమానుల మనసు దోచుకోవడమే కాకుండా తెలుగువారిని ఆకట్టుకునే విధంగా కచేరీలు నిర్వహించి, వారిని అనువాదకులుగా ప్రేరేపనకు పరోక్షకంగా కారకుడైనారు అంజాద్. అట్ల ముషాయిరాలాకు హాజరైన వారిలో దాశరథి, సినారె, సామలసదాశివ గార్లు ఉన్నారు.

సామలసదాశివ ఉపాధ్యాయునిగా వృత్తి నిర్వహిస్తూనే, కాల్పనికవాదంతో నిరీక్షణ, ఆమ్రపాలి, మీరాబాయిలాంటి ఖండకావ్యాలు రచించినారు. శ్రీసాంబశివశతకం రాసి తన భక్తి ఆధ్యాత్మికతత్వాన్ని చాటినారు, వివిధపత్రికలలో ముచ్చట్ల రూపంలో రాసిన వ్యాససంకలనాన్ని “యాది” పేరుతో పుస్తకంగా తీసుకువచ్చినారు. టుమ్రీలు రాసిన ఉర్దూకవుల గురించి తెలియజేసే వ్యాసాలను “మలయమారుతాలు” పేరుతో రచించారు. హిందుస్తానీరాగాలను, ఘరానాలను ఉత్తరభారతదేశపు సంగీతబాణీలను తెలుగువారికి అందజేసినప్రయత్నమే వారి “స్వరలయలు”. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. అనువాదకుడిగా సామల సదాశివ అంజద్ రూబాయిలను ఉర్డులోకి అనువదించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అనువాదకుడిగా పురస్కారం అందుకున్నారు.

ఆకాశవాణి ద్వారా అంజద్ రూబాయిలను విని వాటిని తెలుగువారికి అందించాలని తపనతో, ఆదిలాబాదు లోని ప్రముఖ ఉర్దూ ఉపాధ్యాయునితో అంజాద్ అనుమతి తీసుకొని తెలుగులోకి అనువాదం చేసినారు. అంజద్ ఎన్నో రూబాయిలను రాసినప్పటికీ ఆణిముత్యాలు లాంటి వంద రూబాయిలను ఉర్డులోకి అనుసృజన చేసినారు.

సాహిత్యంలో పోలికలు :

తిర్యాఖ్ హై యజహెర్ హై మాలుమ్ నహీ
యే సాంప్ హై యాలహెర్ హై మాలుమ్ నహీ
ఆజాద్ కియా అజల్ నే ఖైదే-గమ్ సే
ఏ మెహెర్ హై యా, ఖహేర్ హై మాలుం నహీ” అనే రూబాయిని సామల ఈ విధంగా అనువాదం చేసినారు.

ఇది యమృతమో కాక విషంబో యెరుగలేను
ఇది యురగమో తరంగమో ఎరుగలేను
మృత్యువీ బాధయను బంధమేల జేసె
ఇది దయయో కాక కోపమో ఎరుగలేను

ఏభావము ప్రస్పుటించాలని అంజాద్ రూబాయి ఉర్దూలో రాసినారో అంతే భావం ప్రస్పుటించాలని తెలుగు లోకి అనువాదం చేసిన విధానం ప్రశంశనీయం. ఇలాంటి అనువాద నైపుణ్యాలు భాషలో లోతుపాతులు, నుడికారాలు తెలిసినవారికే సాధ్యమవుతాయి.

తంత్రులెటు మ్రోగు నంగుళి తాకు లేక?
వెన్నెలలు కాయునెట్లు రే వెలుగు లేక?
నీవు లేకున్న నెట్లుందు నేను అయిన?
బుద్బుదంబెట్లు పొడమునంబువులులేక?

(పెన్నా శివరామకృష్ణ తెలుగు గజళ్ళు- రూబాయిలు పుట. 41) 

మూడు వివిధ సంబంధాలు లేని అంశాలను 1,2,4, పాదలల్లో ప్రయోగించి 'నీవు లేకున్న నెట్లుందు నేను అయిన?' 3వ పాదముతోనె వెల్లడవముతోనే రూబాయికి భావాన్ని స్ఫురింపజేస్తుంది. మిగిలిన మూడు పాదాలతోపాటు, ఆ మూడు పాదాలను అనుసంధించే మూడవ పాదమూ ప్రశ్నార్థకమే కావడం ఈ రుబాయీని కవితాత్మకం చేసిన మరో 'సమత' తాను 'తంత్రి' అయితే 'అంగుళి', తాను 'వెన్నెల' అయితే 'చంద్రుడు', తాను 'బుద్బుద' మయితే 'నీరు' ఆ పరమాత్మయేననే భావాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించిన రుబాయీ ఇది. రుబాయీలో 1, 2, 4 పాదాలలో ఉండే రదీఫ్. కాఫీయాలుపై తేటగీతిలోనూఉన్నాయి. 1, 2, 4 పాదాలలోని చివరి పదమైన 'లేక' రదీఫ్, దీనికంటే ముందున్న'నాకు', 'వెలుగు' 'అంబువులు' అనే పదాల చివరి 'ఉ' కారాంత హల్లులు కాఫీయాలు. తేటగీతి పద్యంలో రుబాయీని ఆవిష్కరించటం సదాశివ విలక్షణత.( పుట సంఖ్య 41, పెన్నా శివ రామ కృష్ణ తెలుగు గజళ్ళు-రూబాయిలు )

వ్యక్తిత్వంలో పోలికలు:

1950లో ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఆల్ ఇండియా ఉర్దూ ముషాయిరా సమావేశానికి అంజద్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా వచ్చిన హైదరాబాద్ నిజాం నవాబు సభలో ఉన్నారు. అంజద్ మాట్లాడుతున్న సందర్భంలో నిజాం నవాబు సభా మర్యాదలు పాటించకుండా మధ్యలో మాట్లాడుతుండడం చూసి ఇబ్బంది పడిన అంజద్ నవాబు అని కూడా చూడకుండా “ఇలాంటి రాచకార్యములు కలిగిన వారు సభకు రానవసరం లేదని” ముక్కుసూటిగా ముఖం మీదనే చెప్పేస్తాడు. అలా నిక్కచ్చిగా చెప్పే వ్యక్తిత్వం సామల సదాశివలో గూడా కనిపిస్తుంది. (సదాశివ సామల యాది, పుట. 63)

కరీంనగర్లో ఒక సాహిత్య సమావేశానికి సామల సదాశివ ముఖ్యఅతిథిగా వెళ్ళినపుడు ప్రారంభ సమావేశంలో ప్రముఖ రాజకీయనాయకుడు మాట్లాడి సభను వదిలేసి వెళ్లబోతాడు. అప్పుడు సామలసదాశివ కల్పించుకొని “మీరు మాట్లాడినంత సేపు మేము ఓపిగ్గా విన్నాము. మేము ఉపన్యిస్తున్నప్పుడు మీరు కూడా వినాలి కదా” అని సూటిగా చెప్పాడు. అది విన్న ఆ రాజకీయ నాయకుడు చివరిదాకా విని సామల సదాశివ యొక్క గొప్పతనాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుసుకొని నివ్వెర పోయాడు. ఈ విధంగా అంజదు, సామల సదాశివ కవిత్వమే కాదు, వ్యక్తిత్వంలో కూడా నిక్కచ్చిగా ముక్కుసూటిగా చెప్పే లక్షణాలు పోలికలుగా కనిపిస్తాయి.

పరిశోధన ఫలితాలు: 

ఇలా అనువాదం చేయడం వలన ఒక భాష మాధుర్యంతో పాటు సంస్కృతి, ఆచార వ్యవహారాలు వేరే భాషలోకి వచ్చి చేరుతాయి. అనువాదాల వలన జాతీయ సమగ్రతను ప్రోత్సహించినట్లవుతుంది.తులనాత్మక అధ్యయానానికి ఉపకరిస్తుంది.

ముగింపు:

ఈ విధంగా ఒకరి ఆలోచన విధానం ప్రవర్తన ఇంకో వ్యక్తితో కలిసినప్పుడు మాత్రమే వారు మానసికంగా దగ్గరవుతారు. అట్లా దగ్గర అయిన వాళ్లు. అంజద్ మరియు సదాశివలు. సామల సదాశివ అంజద్ రూబాయలను కేవలం అనువాదంగా కాకుండా భావాత్మకంగా ముమ్మూర్తులా అంజద్ కవితాభావనలను తెలుగులో అంజద్ రుబాయీలు గా అనువాదం చేసి “తెలుగువారి అంజద్ గా సామల సదాశివ” గుర్తుండిపోయారు.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. సదాశివ సామల, యాది హైదరాబాద్. విశాలాంధ్ర పబ్లికేషన్స్ 2005, హైదరాబాద్.
  2. సదాశివ సామల – రాజవర్ధన్ సామల తెలుగు అకాడమి-2017, హైదరాబాద్
  3. సదాశివ సామల వికీపిడియా
  4. శివరామకృష్ణ పెన్నా తెలుగు గజళ్ళు – రూబాయిలు-ప్రపంచ తెలుగు మహా సభలు-2012 తిరుపతి తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]