"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక
AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797
1. గాలిబు కవిత్వంపై 'సదాశివ' ఆలోచనలు
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ,
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్),
తెలంగాణ విశ్వవిద్యాలయం, నిజామాబాద్–503 322, తెలంగాణ.
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
సామల సదాశివ బహుభాషా కోవిదులు. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, పారసీ భాషల్లో అధ్యయన, అధ్యాపనగలవారు. వీరు హిందుస్థానీ సంగీతం గురించి, ఉర్దూ భాషను గురించి, ఉర్దూ గజళ్ళ గురించి చెప్పిన విషయాలు చాలా మందికి తెలియనే తెలియదు. వాటిలో మీర్జా గాలిబ్ సాహిత్యంపై సదాశివ చెప్పిన కొన్ని ముచ్చట్లు చెప్పటమే ఈ వ్యాసముఖ్యోద్దేశం.
Keywords: గాలిబ్, సదాశివ, అధ్యయనం, అధ్యాపనం, దృక్పథం, సాహిత్యాభివృద్ధి, సంగీతాభివృద్ధి, భాషాభివృద్ధి, ప్రముఖులు, అభిప్రాయాలు, చమత్కృతి, ప్రపంచం, భావం, కానుకలు, విశిష్టత, శబ్దాడంబరం, ఆలోచన, భాషా సౌందర్యం, క్రమశిక్షణ, గుణాలు, విద్య, సన్మార్గం, అత్యద్భుతం.
ఉపోద్ఘాతం:
మీర్ తఖ్ మీర్ తర్వాత ఉర్దూ కవుల్లో మీర్జా గాలిబ్ స్థానమే ఉన్నతమైంది. ఈయన పొందిన కీర్తి ప్రతిష్టలు మరే ఉర్దూ కవులు పొందలేదు. 1797–1869 మధ్య కాలంలో జీవించి ఉన్న గాలిబ్ గురించి తెలుగు సాహితీవేత్తల్లో ప్రముఖులైన సదాశివ బలమైన అభిప్రాయాలను చెప్పటంతో పాటు వారి కవిత్వాన్ని అనువాదం కూడా చేసారు.
పూర్వ పరిశోధనలు:
సదాశివ సాహిత్యంపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఈ
పరిశోధనల్లో తెలంగాణ నుంచి సుదీర్ఘ కాలం సాహిత్య కృషి చేసిన నిత్య సాహిత్య పిపాసిగా తేలింది. సదాశివ తన
జీవితకాలంలో అత్యంత ఎక్కువ పుస్తకాలను చదివారు. వారు చదివినన్ని పుస్తకాలు నేటి కాలంలో ఎవరూ చదువలేదనేది
వాస్తవం.
సమాచార సేకరణ:
సదాశివ రాసిన మలయ మారుతాలు, ఉర్దూ సాహిత్యం, అమ్జద్ రుబాయిలు, మిర్జా గాలిబు
పుస్తకాలను అధ్యయనం చేయటంతో పాటు వారిపై కాత్యాయనీ విద్మహే, గన్నమరాజు గిరిజా మనోహరబాబు, వెల్చాల కొండలరావు,
బి.నరసింగరావు తదితరులు రాసిన విమర్శ వ్యాసాలను అధ్యయనం చేసాను. సదాశివకు గాలిబు సాహిత్యంపై ఉన్న ఆలోచనలను
నాలుగు భాగాలుగా విభజించుకున్నాను. సదాశివ దృష్టిలో గాలిబు కవిత్వం, సదాశివ గాలిబు సాహిత్యాన్నంతా అధ్యయనం
చేసి 17వ శతాబ్దపు నాటి సాహిత్యాన్ని నేటి కాలానికీ వర్తింపజేసిన విధానం గాలిబ్ కవితా మాధుర్యం, సదాశివ
గాలిబు కవిత్వాన్ని అనుసరించిన విధానం ద్వారా వ్యాస విశ్లేషణ చేసాను.
బహుముఖీనత్వాన్ని కలిగి ఉన్న సదాశివ
భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి, సంగీతాభివృద్ధికి కృషి చేసినవారు. తెలుగు సాహిత్య చరిత్రలో సురవరం
ప్రతాపరెడ్డి, కాళోజీ నారాయణరావు, సామల సదాశివ మాత్రమే తెలంగాణలో పితామహుల్లాంటివారు. సాంఘిక దృక్పథం, భాష,
సాహిత్యం, సంగీతాన్ని ప్రజల వద్దకు తీసుకొనివెళ్ళినవారు. చాలా మందికి వాటిలో రుచి, అభిరుచి, పరిచయం, ప్రవేశం
కల్పించాలన్న, అసలైన ప్రజాస్వామ్య దృక్పథం కలవారు.
గాలిబ్ను బాగా చదివిన సదాశివ అతనికి ఉర్దూ
కవిత్వానికి వచ్చినంత పేరు ఫారసీ కవితకు గాని, ఫారసీ వచన రచనకు గాని రాలేదంటారు. ప్రొఫెసర్ రసీద్ అహమద్
సిద్దిఖీ ఇలా అంటారు– ‘‘మొగలులు మన దేశానికి అమూల్యమైన మూడు
కానుకలిచ్చారు. 1) తాజ్మహల్, 2) ఉర్దూ, 3) గాలిబు’’
(జయంతి – పుట: 67).
సదాశివ దృష్టిలో గాలిబ్ కవిత్వం:
గాలిబ్ కవిత్వాన్ని గురించి, అతని స్వభావం గురించి రెండు వ్యతిరేక భావాలేర్పడ్డాయని అంటారు సదాశివ. 1) కొందరి దృష్టిలో గాలిబు కవితలో అన్వయ కాఠిన్యం, శబ్దాడంబరం, శబ్ద చమత్కృతి తప్ప ఏమీ లేదు. 2) కొందరి దృష్టిలో అతని కవిత అత్యద్భుతం. ‘‘ప్రపంచంలో మంచి కవులు, చాలా మంచి కవులు ఎందరో ఉన్నారు. కాని గాలిబు శైలి విశిష్టమైందని” (జయంతి – పుట: 69) గాలిబే చెప్పుకున్నాడు.
గాలిబు పన్నెండు సంవత్సరాల వయసులోనే కవితా రచన ప్రారంభించాడు. అప్పటి కాలంలో అతని గజలును ఆగ్రాలోనే ఉండే వృద్ధ మహాకవి మీర్కు ఎవరో వినిపిస్తే ఈ కుర్రవాడు మహామేధావి. మంచి గురువు దొరికితే అద్భుతమైన కవిత చెప్పి మహాకవి కాగలడు. లేకపోతే ఎవరికీ అర్థం కాని కవిత చెప్తాడు అని అన్నాడట. గాలిబు తన గురించి తనే చలోక్తులు వేసుకునేవాడు. ‘‘ఉర్దూ కవితకు నువ్వొక్కనివే ఉస్తాద్వు కావు గాలిబు! వెనుకటికి మీర్ అనే మహాకవి కూడా ఉండేవారంటారు’’ – అని గాలిబే చెప్పుకున్నాడు. తన గురించి తాను గొప్పవాడివి కాదని చెప్పుకునే వ్యక్తిత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అందుకే నేను గాలిబును చదివాను అంటాడు సదాశివ.
గాలిబు సమకాలీనులు మోమిన్ కవిత గొప్పదని, జోఖ్ కవిత గొప్పదని, గాలిబు కవిత అర్థం కాదని అనేవారని సదాశివ అంటారు. కాని, గాలిబు తన కవిత్వంలో– నాకు ప్రశంసలతో పనిలేదు. ప్రతిఫలాపేక్ష లేదు. నా షేర్లలో అర్థం లేకపోతే లేకపోనీ అంటాడు. సదాశివ గాలిబు కవిత్వాన్ని ఉద్దేశించి ఇలా అంటారు. అతనికి స్వాభిమానం మెండు – సాహిత్యాహంకారమూ మెండే. అవి అతనికి శోభించేవే కాని వాటివలన చాలా అభిమానాలు పొందినాడు. తన పెన్షన్ కేసు గురించి కలకత్తా వెళ్తూ మార్గమధ్యంలో మూడేళ్ళు మజిలీలు చేస్తూ గడిపినాడు. మజిలీ చేసిన చోటల్లా సాహిత్య రసికులు, కవులు, విద్వాంసులు అతన్ని నెలల తరబడి కదలనిచ్చేవారు కాదు.
సదాశివ చెప్పిన గాలిబ్ కవితా మాధుర్యం:
‘‘యారబ్! జమాన ముఝ్కొ మిటాతాహై కిస్లియే
లూహే – జహాఁపె హుర్ఫె – మకర్రర్ నహీహుఁమై’’
(జయంతి – పుట: 73)
భగవంతుడా! కాలమెందుకిలా నన్ను తుడిచివేస్తున్నది? ప్రపంచపటం మీద రెండుసార్లు రాయబడిన అక్షరాన్ని కానుగదా నేను. ఒకే అక్షరం రాయవలసిన చోట పొరపాటున ఆ అక్షరాన్నే రెండుసార్లు రాస్తే రెండవ అక్షరాన్ని తుడిచివేస్తారు కదా! తుడిచివేయబడే రెండవ అక్షరం అవసరం లేదు. ఏదైనా మొదటి ప్రయత్నమే బలంగా ఉండాలనే తాత్త్వికత మనకు బోధపడుతుంది.
‘‘బస్కెదుష్వార్ హైహర్ కాం కా ఆసాఁ
హోనా
ఆద్మీ కోభీ మయస్సర్ నహీఁ ఇన్సాఁ హోనా’’
(జయంతి – పుట: 191)
ఇది గాలిబ్ మాట. ఈ లోకంలో ప్రతి విషయం అంత సులభంగా అర్థం కాదు. ముఖ్యంగా మనిషి మానవత్వం గల మనిషిగా జీవించటం ఎంతో కష్టసాధ్యం. ఇట్లాంటివి ఎన్నో విశేషాలు కలిగిన కవితలు డా. సదాశివ కవితల్లో చోటుచేసుకున్నాయి.
జీవితం ఎంత తొందరగా గడచిపోతుందో కాలం చేతిలో జీవితం ఓడిపోతుందని జీవితం మన చేతిలో లేదంటాడు గాలిబు.
“రౌమే హై ఉమ్ర్ కహాఁ దేఖియే
థమే
నై హాథ్ బాగ్ పర్హై న పాహై రికాబ్
మే”
జీవితమనే గుర్రం వడిగా
పరుగెత్తుతున్నది. మనం నిస్సహాయులం. చేతిలో కళ్లెం లేదు. రికాబ్లో కాలులేదు. గాజు కుప్పెలో మైనపువత్తిని
ఉంచి వెలిగించేవాళ్లు. అది తెల్లవారే వరకు వెలిగేది. జీవితం కూడా అంతే. ఎపుడు అంతమవుతుందో ఎవరికీ
తెలియదంటారు సదాశివ.
సదాశివ కవిత్వం – గాలిబ్ కవిత్వ అనుసరణ:
మనిషి మనిషిగా రాణించటానికి అవసరమైన గుణగణాలు తనకు తానే పెంపొందించుకోవాలి. సమాజాలను, విద్యనిచ్చి విజ్ఞుణ్ణి చేసిన గురువును గౌరవించాలి. అదే భావాన్ని సదాశివ ఇలా చెప్పారు.
‘‘తల్లిదండ్రులఁ బరదైవతముల
రీతి
నెంచి, సేవించు బాలురే యిద్ధ
మతులు
గురువులన్ గౌరవించి –
సోదరులభాతిఁ
దోడి వారినిఁ బ్రేమతోఁ జూడవలయు’’ (జయంతి – పుట: 191)
ప్రతి మనిషి తన జీవితాన్ని ఒక క్రమశిక్షణతో
నడిపించుకొని తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మేధస్సుకు పదను పెట్టుకోవాలన్నారు సదాశివ.
పరిశోధనా ఫలితాలు:
నేడు తెలంగాణలో గజల్ సాహిత్యం రావటానికి మూలం ఆనాటి వలీ, గుల్షన్, గాలిబు, ఖాజీ
మహమూదు, సిరాజ్ తదితర కవులు రాసిన కవిత్వమే. హిందూ – ముస్లిం సమైక్యతకు పునాదిగా గాలిబు కవిత్వం
నిలిచిందని చెప్పవచ్చు.
ముగింపు:
డా. సామల సదాశివ ఉర్దూ కవిత్వాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారు కనుక ఉర్దూ రస గుళికల్ని ఎన్నింటినో తెలుగు పద్యాల రూపంలో మన ముందు ఉంచి ఆ భాషా సౌందర్యాన్ని కళ్ళకు కట్టించారు. ‘‘జనే న జగ్మే అలావో తో షేర్ కిస్ మక్సద్” కవిత్వం కనీసం చలిమంటంతటి వేడినైనా కలిగించాలి. లేకుంటే దాంతో ఏం ప్రయోజనం? అని ప్రశ్నించాడు. సదాశివ కవిత్వం పాఠకున్ని గొప్ప చైతన్యం వైపు మరల్చుతుంది. ఆలోచింపజేస్తుంది. అపారమైన అనుభవంతో, అధ్యయనంతో సమాజాన్ని సన్మార్గంలో నడిపించటానికి ఉర్దూ, ఫారసీ, తెలుగు కవిత్వాలను పేటికలో పేర్చి వాడుకొన్నవారు డా. సామల సదాశివ.
ఉపయుక్తగ్రంథసూచి:
1. జయంతి
త్రైమాస పత్రిక, ఏప్రిల్–సెప్టెంబర్. జయంతి ప్రచురణలు. హైద్రాబాద్: 2012.
2. సదాశివ, సామల.అమ్జాద్ రుబాయీలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. హైద్రాబాద్:
1963
3. సదాశివ, సామల. యాది. మాస్టర్ మల్టీ మీడియా. హైద్రాబాద్: 2005
4. సదాశివ, సామల. ఉర్దూ సాహిత్యం, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్.
హైద్రాబాద్: 2007.
5. సదాశివ, సామల. మిర్జా గాలిబ్ (జీవితము
– రచనలు) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ. హైద్రాబాద్: 1969.
6. సదాశివ సామల. మలయ మారుతాలు. తెలుగు విశ్వవిద్యాలయం. హైద్రాబాద్: 2001.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.