AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
13. తెలుగు సాహిత్యచరిత్రలు: నిర్మాణపద్ధతులు
గొంగులూరి కృష్ణవేణి
పరిశోధక విద్యార్థిని, తెలుగుశాఖ,
హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం,
హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 9951675863. Email: gkvenihcu@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
భారతీయభాషాసాహిత్యాలలో తెలుగు సాహిత్య చరిత్రలకు
ఒక ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు వారి సాహిత్యాన్ని, కవులను, జీవనవిధానాన్ని, వారి సాంస్కృతిక అంశాలను, వివిధ
సాహిత్య ప్రభావాలను కాలానుక్రమంలో వర్ణించే వాటిని సాహిత్య చరిత్రలు అంటారు. తెలుగు భాషలో కవులచరిత్రలు,
సాహిత్య చరిత్రలు, సాహిత్య వికాస - చరిత్రలు పేరుతో తెలుగు కవులను, వారు రాసిన సాహిత్యాన్ని ఆ క్రమ
పరిణామాలను ఇవి వివరిస్తున్నాయి. తెలుగులో వచ్చిన వివిధ సాహిత్య- చరిత్రల్లో భాగంగా "తెలుగు సాహిత్యచరిత్ర
రచనకు తొలి ప్రయత్నంగా వచ్చిన కావలి రామస్వామి (1829) రాసిన (Biographical sketches of the Deccan poets)
దక్కను కవుల చరిత్రముతో ప్రారంభమైంది.” (డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ (2009),
ప్రచురించిన 'సాహిత్యచరిత్ర' అనే గ్రంథం. పుట. 14) వివిధ రచయితలు కవి జీవితములు, కవిత్వ చరిత్రము,
వాఙ్మయచరిత్రలు, వాఙ్మయ-చరిత్ర సంగ్రహము, సాహిత్య చరిత్రలు వంటి పేర్లతో, సమాజంలో వస్తున్న మార్పులకు
అనుగుణంగా వచ్చిన సాహిత్యంలో భాగంగా ఏర్పడిన వివిధ ధోరణులు, అస్తిత్వ, ప్రాంతీయ ఉద్యమాల వరకు ఎన్నో
సాహిత్యచరిత్రలను రాస్తూ వచ్చారు. సాహిత్య చరిత్రలపై "తెలుగులో సాహిత్యచరిత్రలు" అనే శీర్షికతో 1989 లో
ఎస్.వి. సూర్యకుమారి 25 సాహిత్య చరిత్రలను తీసుకుని ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో (ఎం.ఫిల్)
సిద్ధాంతవ్యాసాన్ని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఈ అంశంపై ఇంకా లోతైన విషయాలను
చర్చించాలని నా పరిశోధనలో భాగంగా 39 చరిత్రలను తీసుకొని అధ్యయనం చేశాను. ఈ వ్యాసంలో అన్ని సాహిత్యచరిత్రల
నిర్మాణ పద్ధతులను వివరించడం కుదరదు కనుక కొన్ని అంశాలను మాత్రమే పుటల పరిమితికి లోబడి చర్చిస్తున్నాను.
Keywords: సాహిత్యచరిత్రలు, సాహిత్యచరిత్ర
నిర్మాణపద్ధతులు, సాహిత్యవికాసచరిత్ర నిర్మాణం, రెనెవెలెక్ వాదాలు, విభిన్న దృక్పథాలు, శైలి. 1. ఉపోద్ఘాతం: సమగ్ర సాహిత్య చరిత్ర కాలక్రమ పద్ధతిలో
కవుల చరిత్రలనూ, రచనల సమీక్షలనూ కలిపి రూపొందించినంత మాత్రాన ఏర్పడదు. సాహిత్య వ్యక్తిత్వ
వికాసాన్ని సూచించే ప్రక్రియల పుట్టు పూర్వోత్తరాలనూ, పరిణామాలనూ, ప్రభావాలనూ ప్రయోగ విశేషాలనూ
పరిశీలించిన పరిశోధనలు వెలువడుతునప్పుడు సాహిత్య చరిత్ర స్థితిగతిని గాక పరిణామ గతిని కార్యకారణ
బద్ధంగా నిరూపించగలుగుతుంది. చరిత్రలో సవిమర్శక చారిత్రక అధ్యయనం ప్రతిబించాలనీ, చరిత్ర తత్త్వం
వ్యక్తీకరింపబడాలనీ, ఆ రెండింటినీ సాధించడానికి ప్రక్రియా పరమైన పరిశోధన ఉపయోగపడుతుందనీ ఆధునికులు
భావిస్తున్నారు. 2. ప్రధానవిషయం: సాహిత్యచరిత్ర రచనా ప్రక్రియలో తెలుగువారు
సాధించిన పరిణామాన్నీ, ప్రగతినీ, వికాసాన్ని గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి ఎంతో అవకాశం
ఉంది. వంగూరి సుబ్బారావు "ఆంధ్ర వాఙ్మయ చరిత్ర"
సాహిత్యచరిత్ర ప్రక్రియను పరిచయ స్థాయి నుండి అధ్యయన స్థాయికి పెంచింది. కవిత్వవేది (కల్లూరి వేంకట
నారాయణరావు) వాఙ్మయ చరిత్ర సంగ్రహం ఇంగ్లీషులో లాంగ్, శైంట్స్ బరి రచించిన సాహిత్య
చరిత్రలాగాకళాస్వభావాన్ని సంతరించుకొన్న తులనాత్మక పరిశీలనా గౌరవాన్ని సాహిత్య చరిత్రలు అనే
ప్రక్రియకు సంతరించిపెట్టింది. కవిత్వవేది రచించిన సాహిత్య చరిత్ర ఒక
కళాఖండంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఎందరో సాహిత్య చరిత్రలు రాశారు. కాశీనాథుని, ఖండవల్లి, దివాకర్ల,
మొదలైన వారు సాహిత్య చరిత్రలకు ఉత్సవ విగ్రహాలను ప్రసాదించారు. నిడదవోలు, కురుగంటి, చాగంటి వంటి
వారు చారిత్రక విశేషాల చర్చాగోష్టులతో చరిత్ర కోలాహలాన్ని సృష్టించారు. శిష్ట్లా, వేదం, టేకుమళ్ళ,
నేలటూరి మొ.న వారు చరిత్రకు సాహిత్యవివేచనను జోడించి ప్రక్రియాగౌరవాన్ని పెంచారు. పింగళి వారి
సాహిత్య చరిత్ర సాహితీవేత్తయైన న్యాయవేత్త రచించిన కళామయమైన తీర్పులా రూపొందింది. ఆరుద్ర
"సమగ్రాంధ్ర సాహిత్యం", ఇంద్రగంటి "ఆరుయుగాల ఆంధ్రకవిత" అసమగ్రాలైన సాహిత్య చరిత్ర ప్రక్రియకు
ఇచ్చిన కళారూపాలు. ఈ వరుసలో రచయితలను అందరినీ పేర్కొనడం సాధ్యం కాదు. కానీ 19 వ శతాబ్దం మొదటి నుండి
20వ శతాబ్ధం చివరిపాదం దాకా వెలువడిన సాహిత్య చరిత్రలలో నాలుగైదు తప్ప మిగిలినవన్నీ ఒకదాని కంటే
మరొకటి తమ ప్రత్యేకతను నిలుపుకొన్నవే. 3. సాహిత్య చరిత్ర నిర్మాణం - విభిన్నదృక్పథాలు :- సాహిత్య చరిత్ర ఎలా రాయాలి? అన్న సమస్య
పాశ్చాత్య, భారతీయవిమర్శాలోకంలో విభిన్న దృక్పథాలను వెలికి తీసింది. వీటిలో ముఖ్యంగా
పేర్కొనదగినవి. 4. సాహిత్య చరిత్ర నిర్మాణం - రెనెవెలెక్ వాదం : "సాహిత్యచరిత్ర నిర్మాణాన్ని గురించిన
ఆధునిక విమర్శకుల అభిప్రాయాలను క్రోడీకరించి, వాటిని మూడు రకాల వాదాలుగా రెనెవెలెక్ విశ్లేషించారు.
అవి: 4.1 సాహిత్య చరిత్రను పరిహరించాలి - మొదటి వాదం :- దీనిలో ముఖ్యంగా మూడంశాలు గమనించదగినవి.
మొదటిది - సాహిత్యానికి గతం, వర్తమానం అనే కాల భేదాన్ని గణించడం నిరర్థకమని భావించేతీరు. రెండవది -
గతం, వర్తమానం అనే విభాగంలో సాహిత్య పరమైన లక్షణం లేదనీ, ఏ రచనకు రచనయే కాలాతీత స్వభావం కలిగి
ఉంటుందని భావించే తీరు. మూడవది - ప్రాచీన సాహిత్యాన్ని నేటి సామాజికుడు స్వీయ దృక్పథంతో
అనుశీలిస్తుప్పుడు గతం వర్తమానంగా ప్రవహిస్తుంది. ఈ మూడు తీరులు సాహిత్యంలోని రచనలకున్న
విశిష్ట వ్యక్తిత్వాన్ని వివేచించే మార్గాన్ని ఎన్నుకుని కాలక్రమ పద్ధతిలో సమీక్షా సంపుటిగా వెలువడే
సాహిత్య చరిత్రలను పరిగణనంలోకి తీసుకోబడవు. 4.2 సాహిత్య చరిత్రకు స్వతంత్ర ప్రతిపత్తి అవసరం లేదు -
రెండవవాదం: సాహిత్య చరిత్ర దేశ చరత్రలోనో లేదా-
సాంఘిక చరిత్రలోనో అంతర్భాగంగా ఉండదగిందే కాని, దాని స్వతంత్ర ప్రతిపత్తి అవసరం లేదు. ఇది చాలా వరకు
మార్క్సిస్టు దృక్పథానికి దగ్గరగా వస్తుంది. జేకొస్లోవికియా సైన్స్ కాడమీ వారు ప్రచురించిన ఆదేశ
సాహిత్య చరిత్రను ఇందుకు ఉదాహరణంగా గ్రహించవచ్చు. దానిలో సాహిత్యంలోని కళాత్మకతకు స్థానం మృగ్యం, మత
సంప్రదాయాల ప్రభావ పరిశీలనం అత్యంత పరిమితం. అయితే ఆదేశంలో జరిగిన సాంఘిక, రాజకీయ ఉద్యమాల చరిత్రకు
సాహిత్యం ఒక వ్యాఖ్యానం గా మాత్రమే చిత్రించబడింది. 4.3 సాహిత్య చరిత్ర ప్రత్యేక పద్ధతిలో వినిర్మింపబడాలి - మూడవ
వాదం: సాహిత్య చరిత్రను నవ్యమైన పద్ధతిలో ఎలా
నిర్మించాలి? అనే ప్రశ్న నేటికీ వివాదాస్పదంగానే ఉంది. సామర్య చరిత్ర ప్రత్యేకంగా ఉండటమే కాకుండా,
సాహిత్యవ్యక్తిత్వాన్ని, దాని వికాసాన్ని వ్యాఖ్యానించే విధంగా ప్రత్యేకపద్ధతిలో వినిర్మింపబడాలి
అనేది ఈ వాదం. అయితే ఇప్పుడు సామాన్యంగా మనం పాటించే యుగవిభజన పద్ధతులను ఆశ్రయించిన చరిత్ర రచనం
కంటే ప్రక్రియాపరమైన సాహిత్య వికాస వివేకాన్ని వేలార్చే సాహిత్య చరిత్ర రచన ఉత్తమమని ఒక్కొక్క
సాహిత్యంలో ఒక్కొక్క ప్రక్రీయలో ఆయా కవులు, రచయితలు దేశీయతతో నిండుకొన్న ప్రతిభనూ, దర్శన
పాండిత్యాన్ని కళా వైభవాన్ని, వెలార్చిన విధానానికి ప్రాధాన్యమిచ్చే సాహిత్య రచన ఉపాదేయమనీ, ఈ
మార్గంలో భావించడం జరుగుతుంది. ఈ బాటలో ప్రయోగాలు సాగుతున్నాయి. కానీ ప్రామాణిక పద్ధతుల కొరకై ఇంకా
అన్వేషణ సాగుతూనే ఉంది. ఆధునిక పరిశోధన రంగాన్ని కూడా ఈ మార్గం బలంగా ఆకర్షిస్తుంది." (GV.
సుబ్రహ్మణ్యం, సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు పుట.2) తొలినాళ్ళలో సాహిత్య చరిత్ర రచనలో
వైవిధ్యం ఉండటానికి కారణాలు గమనిస్తే ఆసక్తికరమైన అంశాలెన్నో తెలియవస్తాయి. ప్రతి రచన వెనక రచయిత
ఉన్నాడు. అతని రచనా ప్రణాళిక ఉంది. శైలి ఉంది. రచయిత అవగాహన, అభిరుచి, ప్రక్రియా స్వరూప దర్శ, దాని
వలన అతడు సాధించదలచుకున్న ప్రయోజనం, అతడు ఎన్నుకొనే పాఠకలోకం, తీసుకొనిరాదలచుకున్న కొత్తదనం అనే
అంశాలు ఉన్నాయి. అవి అతని రచనా ప్రణాళికను రూపందింపజేస్తాయి. ప్రణాళికను ప్రయోగంగా దిద్ది తీర్చేది
అతని శైలి. 5. సాహిత్య చరిత్ర నిర్మాణం- శైలి: ఒక రచనకు పూనుకునేముందు ఆలోచించాల్సింది
శైలి ఎంపిక. అది వ్యావహారికమా? గ్రాంథకమా? ప్రామాణికమా ? అనేది చాలా ముఖ్యం. సాహిత్య చరిత్ర
రచయితలకు సామాగ్రిని సేకరించడం, వాటిని పరిశీలించడం, కాలక్రమంలో అమర్చి పరిశోధనాంశాలను పొందుపరచటం
అనే కార్యక్రమమే సరిపోయేది. అదే వారి రచనా ప్రణాళికలో ఎక్కువ చోటుచేసుకునేది. ఆ తర్వాత క్రమంగా
సాంఘిక, రాజకీయ, సాహిత్య, వాతావరణాల్లో కవులనూ, కావ్యాలనూ విలువ కట్టే సమన్వయ దృక్పథం పెంపొందింది.
ఆపైన మరికొంత మార్పు వచ్చింది. ఈ అంశాలెన్ని ఉన్నా కవిత్వం బహిర స్వరూపంలో, అంతర స్వభావంలో పరిణామం
చెందుతున్నదో వివేచిస్తూ, "కవులనూ, కావ్యాలను కొన్ని సాహిత్య ప్రమాణాలతో అనుశీలించి ప్రవృత్తిని
విశేషంగా ప్రదర్శించే విధానం సాహిత్య చరిత్రలలో పెంపొందింది, అంటే ప్రణాళిక ప్రక్రియా గౌరవాన్ని
పెంచుతూ వచ్చింది. ఆధునికంగా ఎవరు సాహిత్య చరిత్ర రచించినా ఎంత విషయం చెబుతున్నారు? ఏ పద్ధతిలో
చెబుతున్నారు? ఏ ప్రయోజనం కోసం చెబుతున్నారు? అనే మూడు అంశాలతో పాటు ఎటువంటి శైలిలో చెబుతున్నారన్న
అంశాన్ని కూడా గమనించేటట్లు ప్రక్రియను పెంచారు. ఆరుద్ర శైలి స్పష్టతకు అందాన్ని తొడిగింది.
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి శైలి అందానికి స్పష్టతను అలంకరించింది" విషయాన్ని వాచ్యంగా చెప్పే
చరిత్రలకు పరీక్ష చదువుల విద్యార్థులే శరణార్థులుగా మిగిలారు ఈనాడు. 6. సాహిత్య చరిత్రలపై ఆసక్తి: విద్యార్థి జీవితంలో పరీక్షల కంటే
'పరిశోధన' బాధ్యతను పెంచుతుంది. ఇందువల్ల పరిశోధన విద్యార్థులు సాహిత్య చరిత్రను సీరియస్
గాచదువుతారు. పరిశోధన కోసం కాకపోయినా పరిజ్ఞానం కోసం చదివే విద్యార్థులూ ఉంటారు. వారూ ఈ కోవలోకే
వస్తారు. వారికి పట్టాలు కాదు ముఖ్యం; గట్టి పునాదులు. ఇటువంటి వారికిశైలిపై అంత ఆసక్తి ఉండదు.
విషయం, విశ్లేషణ, సమన్వయం, సిద్ధాంతం, దృక్పథం, కావ్యానుశీలనం మొదలైన అంశాలు వారిని ఆకర్షిస్తాయి.
కొందరు సాహితీ రసికులుంటారు. వారు ఏయే వృత్తుల్లో ఉన్నా సాహిత్యం వారి జీవితాల్లో ఒక భాగం. అటువంటి
వారు సాహిత్య చరిత్రలోని ఆసక్తికరంగా చదివించే గుణాన్ని కోరతారు. ఆ తీపి కోటింగ్ తో ఎంత చేదునైనా
మింగేస్తారు. ఇక మిగిలినవారు మరో రెండు రకాల వారు.
ఒకరకం - విలువలను నిగ్గుతేల్చే విమర్శకులు. మరొకరకం - సృజనాత్మక ప్రతిభ కల రచయితలు. వీరిద్దరూ ఒకే
నాణానికి రెండు వైపుల్లాంటి వారైనా వారి ప్రవృత్తులు సహజంగా భేదిస్తాయి. సాహిత్య చరిత్ర రచయిత
ప్రక్రియానుశీలనంలో ప్రయోగించే ప్రమాణాలను ప్రత్యేకించి ఆసక్తితో గ్రహిస్తారు విమర్శకులు. పూర్వ
ప్రక్రియలలో పరిణామాన్ని తేవటానికి ఎటువంటి ప్రతిభావంతుడైన ప్రయోగాలను ఎవరెవరు ఎలా చేశారో, వాటి
వల్ల ఎటువంటి ఫలితాలను సాధించారో అవి సాహిత్య వికాసానికి ఎలా తోడ్పడ్డాయో వివరించిన విశేషాలను
వివేచేస్తారు రచయితల కోవకు చెందినవారు. సాహిత్య చరిత్ర విమర్శకులకు విలువలను ప్రసాదించేదిగా,
రచయతులకు నవ్యతను వెలిగించి రవ్వలు కురిపించేదిగా ఉండాలి. ఈ రెండూ సాధిస్తే సాహిత్య చరిత్ర
సృజనాత్మక శక్తి గల ప్రక్రియగా పరిణతి చెందుతుంది. 7. సాహిత్య చరిత్రలు ఎవరి కోసం రచిస్తున్నారు?: సాహిత్యచరిత్రలు ఎవరికోసం రచిస్తున్నారు?
అని ఆయా రచయితలను పరిశీలిస్తే వారెన్నుకొన్న పఠితలను గురించిన పరిజ్ఞానం స్పష్టంగా ఉన్నట్లు
తెలుస్తుంది. కొంతమంది విద్యార్థుల కోసమే రాస్తున్నారు. విద్యార్థుల్లో కొందరు సాహిత్యచరిత్రను
పరీక్ష కోసం చదువుతారు. వారికి తగ్గట్టుగానే సాహిత్య చరిత్రలు తయారవుతున్నాయి. కొన్ని పాఠ్య
గ్రంథాలుగా మరికొన్ని ప్రశ్నోత్తర సంపుటాలుగా రూపొందుతున్నాయి. ఈ రెండు రకాలనూ సాహితీ పరులు సీరియస్
గా తీసుకోరు. వాటికి సమాచార పత్ర గౌరవమే కాని, సాహితీ ప్రక్రియా గౌరవం ఉండదు. విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు తెలుగు
సాహిత్య చరిత్రకు బదులుగా తెలుగు సాహిత్య వికాస చరిత్రను పాఠ్య ప్రణాళికలో చేర్చాయి. ప్రపంచంలోని
సాహిత్య చరిత్ర నిర్మాణ పద్ధతులను గురించి పలువురు సాగిస్తున్న ఆలోచన ధారలు ఆంధ్ర పండితులు దృష్టిని
ఆకట్టుకుంటున్నాయి. ప్రక్రియా వికాస పరంగా సాహిత్య చరిత్రను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సాహిత్య
అకాడమీ ఒకప్పుడు సంకల్పించింది. సాహిత్య చరిత్ర పునర్నిర్మానానికి త్వరపడకపోతే ఆధునికంగా మనం
వెనకబడిన వాళ్ళమౌతాం. దీనికి సంకల్పం ఒక్కటే చాలదు. సామర్థ్యంతో కూడిన సాధన ఎంతో అవసరం. 8. సాహిత్య వికాస చరిత్ర నిర్మాణం: మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో
చాలావరకు పట్టభద్రస్థాయిలో సాహిత్య చరిత్రను స్పెషల్ తెలుగు ఎన్నుకున్న విద్యార్థులకు మాత్రమే
భోధిస్తున్నారు. నిర్భందంగా చదివే తెలుగు కోర్సులలో సాహిత్య చరిత్ర పఠనీయంగా ఉండదు. కాని నిర్భంధంగా
తెలుగు చదివే విద్యార్థులు దాదాపు అందులో అరవై మార్కులు తెచ్చుకుంటే ఎం.ఏ. లో చేరినవారికి ఆ అధ్యయనం
కష్టతరమౌతుంది. అందువల్ల కొన్ని విశ్వవిద్యాలయాల్లో సాహిత్య వికాస చరిత్ర (Evolution of Telugu
Literatiung]ను బోధిస్తున్నట్లు చెబుతున్నా పాఠ్య ప్రణాళిక మాత్రం సాహిత్య చరిత్ర (History of
Telugu literature ) ప్రవృత్తినే ప్రకటిస్తుంది. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో తెలుగు వికాస చరిత్ర
తగినంత గాఢంగా బోధింపబడలేదు. అందుచేత సాహిత్య ప్రక్రియలను ప్రయోగాలను గురించి ఏర్పడాల్సినంత అవగాహన
విద్యార్థులకు ఏర్పడడం లేదు. విశ్వవిద్యాలయాల్లో సాహిత్యచరిత్రాధ్యయనం
పట్టభద్రస్థాయిలోనూ, ఎం.ఏ. స్థాయిలో ఒకే రకంగా ఉండరాదనీ, పట్టభద్రస్థాయిలో కాలక్రమపద్ధతిలో రాయబడిన
సాహిత్యచరిత్రను బోధించాలనీ, ఎం.ఏ. స్థాయిలో ప్రక్రియల పుట్టుపూర్వోత్తరాలనూ, పరిణామాలనూ,
ప్రభావాలనూ, ప్రయోగ విశేషాలను తెలియజేసే సాహిత్య వికాస చరిత్రను విద్యార్థులకు అందించాలనీ పలువురు
పండితులు భావించారు. కానీ, కాలక్రమ పద్ధతిలో రాయబడ్డ సాహిత్య చరిత్రలు మనకున్నాయి. కానీ, ప్రక్రియా
వికాస పరమైనవి లేవు. అయితే పురాణం, ప్రబంధం, యక్షగానం, నాటకం, నవల, వచనం మొదలైన ప్రక్రియల
వికాసాన్ని గురించి ప్రత్యేకంగా వెలువడినా పరిశోధనా గ్రంథాలున్నాయి. అవి ప్రక్రియా వికాసపరమైన
చరిత్రను నిర్మించడానికి తోడ్పడుతాయి. "ఇంతవరకు ప్రక్రియాపరంగా
సాగిన పరిశోధనలు మనకందించే విశేషాలను సంపుటీకరించడమే కాక మరెన్నో అంశాలను గురించి మౌలికంగానో, నవ్య
దృక్పథంతోనో వ్యాఖ్యానించాల్సినఅవసరం ఎంతైనా ఉంది. అంతేగాదు ప్రక్రియాపరమైన సాహిత్య చరిత్రను
రచించడానికి ప్రామాణికమైన ప్రణాళికను రూపొందించాల్సి ఉంది కూడా, దాన్ని సాహిత్య వికాస
చరిత్ర" అని GV. సుబ్రహ్మణ్యం తన "సాహిత్య చరిత్రలో
చర్చనీయాంశాలు"లో పేర్కొన్నారు (పుట.5). 9. ముగింపు: తెలుగు సాహిత్యంలో ఆంధ్రీకరణలు,
స్వతంత్రకావ్యాలు అంతర్భాగం. కావ్యాల ఆంధ్రీకరణ విధానం, సాహిత్యచరిత్ర సోదాహరణంగా నిరూపణం
చేస్తుంది. స్వతంత్ర కావ్యాల స్వతంత్రతని సహేతుక సమన్వయం చేస్తుంది. అంతేకాదు సమానధర్మం గల
కవులుంటారు. సమాన ఇతివృత్తం గల కావ్యాలుంటాయి. సదృశకవులు, సమాన ఇతివృత్త కావ్యాల తారతమ్య పరిశీలన
సాహిత్య చరిత్ర చేస్తుంది. ప్రక్రియా వైవిధ్యాన్ని సాహిత్య చరిత్ర ప్రసరిస్తుంది.
ఆత్మీయతాప్రతిఫలాన్ని సాహిత్య చరిత్ర ఆవిష్కరిస్తుంది.తెలుగు సాహిత్య చరిత్రలపై విస్తృతమైన పరిశోధన
జరగాల్సిన అవసరం ఉంది. ప్రక్రియలు, ప్రాంతీయ చరిత్రలను ఆధారంగా చేసుకుని సాహిత్య వికాస చరిత్రలను
వినిర్మించాల్సిన అవసరం ఎంతైన ఉంది. 10. ఉపయుక్తగ్రంథసూచి:
పైన పేర్కొన్న 6 దృక్పథాలు ప్రపంచ దేశాల్లోని ఆయా సాహిత్యచరిత్ర
రచనాపద్ధతుల మీద బలమైన ప్రభావం వేసి ఉన్నది. వీటిని ఆంధ్రసాహిత్యచరిత్రరచనలో మనం ఎంతవరకు
పాటించామన్నది పరిశీలింపదగిన అంశం.
అభ్యుదయ శక్తులకూ,
ప్రతిశక్తులకూ నడుమ జరిగిన సంఘర్షణను చిత్రించే చరిత్రయే సాహిత్య చరిత్రగా, అది సాంఘిక చరిత్రలో
అంతర్భాగంగా భావించబడింది. సామజిక విశ్లేషణ సాహిత్య కళా వికాసాన్ని వ్యక్తీకరించలేదు. కాబట్టి ఈ
మార్గం సాహిత్య చరిత్ర నిర్మాణానికి పాక్షికంగా పనికి వచ్చే పద్ధతిగానే పరిగణించబడుతుంది.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.