AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
4. సమాజంలో మార్పులకు దారులు వేసిన ‘గుడిసెలు కాలిపోతున్నై’
డా. ఎం. ఎం. వినోదిని
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప - 516005. ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9440456087. Email: mmvinodini@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
పద్మభూషణ్ బోయి భీమన్న దాదాపు 70 పుస్తకాలు
రాశారు. పద్యం, గేయం, నాటకం, వచనం ఇలా అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. ఆయన రచించిన అనేక రచనలు సామాజిక
మార్పుకి దొహదం చేశాయి. భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకం లాంటి అనేక రచనలు ప్రజల జీవితాన్ని ముఖ్యంగా దళితుల
జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. భీమన్న ‘గుడిసెలు కాలిపోతున్నై’ కవితా సంపుటి సమాజానికి స్ఫూర్తిని
దళితులకు చైతన్యాన్ని ఇచ్చింది. అటువంటి స్పూర్తివంతమైన కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఆ కవితల ద్వారా భీమన్న
సమాజానికి అందించిన స్పూర్తిని విశ్లేషణ చేయడం ఈ పరిశోధనా వ్యాసం పధాన ఉద్దేశ్యం. ’గుడిసెలు కాలిపోతున్నై’
కవితా సంపుటిలో సామాజిక మార్పుకి దారులేసిన కవితలు కొన్నిటిని ఎంపిక చేసి ఈ పరిశోధనా వ్యాసంలో పరిశీలించడం
జరిగింది. చివరగా ముగింపులో గుడిసెలు కాలిపోతున్నై కవితా సంపుటిలో కవి దృక్పథాన్ని, కవితా శిల్పం, భాష, కవి
ఆక్షాంక్ష గురించి విశ్లేషించడం జరిగింది.
Keywords: పద్మభూషణ్ బోయి భీమన్న, గుడిసెలు కాలిపోతున్నై,
దళిత కవిత్వం, పాలేరు నాటకం, అంబేద్కర్ సుప్రభాతం, భీమన్న గేయాలు. 1. నేపథ్యం: బోయి భీమన్న ఒక విలక్షణమైన, బహుముఖీన రచయిత. పద్య కవిత్వం, గేయ కవిత్వం,
వచన కవిత్వం, వచన గ్రంథాలు, నాటకాలు, ఇంకా ఇంగ్లీషు రచనలు చేశారు. దాదాపు డెబ్భై పుస్తకాలు రాశారు.
అంబేద్కర్ మీద విస్తృమైన సాహిత్యం రాశారు. ‘‘పాటలలో అంబేద్కర్ పేరుతో - 118
పాటలు రాశారు . ‘‘అంబేద్కర్ సుప్రభాతం’’ రాశారు. పౌరాణిక నాటకాలు,
సాంఘిక నాటకాలు రాశారు. బోయి భీమన్న దేశంలోని అన్ని ప్రముఖ
అవార్డులను అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ, కేంద్రసాహిత్యఅకాడమీ అవార్డు,
గౌరవడాక్టరేట్లువంటి ఎన్నో అవార్డులు పొందారు. భీమన్న రచనల మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. భీమన్న
రచనల్లో ’గుడిసెలు కాలిపోతున్నై’ కవితాసంపుటి అట్టడుగు సమాజానికి
చైతన్యస్ఫూర్తినిచ్చింది. పేదలకు దిశానిర్దేశం, దళితులకు మార్గనిర్దేశనం చేసింది. ఈ
కవితాసంపుటిలోని సమాజికమైన మార్పును కాంక్షించడం, సంఘటించే శక్తి, మతోన్మాదనిరసన, ధర్మప్రబోధం వంటి
సామాజికాంశాలను విశ్లేషించడం ఈ పరిశోధనావ్యాసం ప్రధానోద్దేశం. 2. ’గుడిసెలు కాలిపోతున్నై’ లో సామాజికమైన మార్పు కాంక్షించే కవితలు: ఈ కవిత పేరు వినగానే ఇది దళిత స్వరంలోంచి పెట్టిన పేరు అని అర్థం
అవుతుంది. తిరిగి రావలసిన అప్పు అనే అర్థం లో పెట్టిన ఈ శీర్శిక వినగానే మనకి జాషూవా పద్యం గుర్తు
కొస్తుంది. దళితులు ఈ భరతావనికి చేసిన సేవలకును గాను ఈ దేశం దళితులకు అప్పుబడ్డదని
జాషువా చెప్పినట్లు దళిత జాతికి రావలసిన బాకీ ఇంకా మిగిలే ఉందని చెప్తున్నారు భీమన్న . “ఓ, అహంకార
కులాగ్రేసరా!/నా హక్కులేవో నా కిలా పారేయ్!/హే, పీడిత పిరికి జనమా!
దళితులకి రావలసిన బాకీ ఏంటో చెప్తున్నారు!
దళితులు ఒక నిజాయితీతో, దోషరహితంగా, కష్టాన్ని నమ్ముకొని ఉన్నవాళ్లని చెప్తున్నారు ఈ కవిత లో.
ఆత్మస్థైర్యంతో దళిత సమాజపు గుండెల్లో పేరుకొని ఉన్న ఎన్నో ఏళ్ల వేదనని ప్రకటించారు. దళితుల గురించి
‘నేను దోషరహితుడ్ని కాదు’ అంటున్నారు. దళిత సమాజం ఎప్పుడూ తనకు తాను ఒక గిరిగీసుకొని
ఉంటుంది. నీతి, న్యాయం, ధర్మం వూపిరిగా బతకాలనుకుంటుందనే పరిస్థితిని ప్రకటించారు. అలాంటి ఒక
స్వభావం ఉండడం వల్లే వీళ్ళు ఇంకా పేదలుగా, అంటరానివారుగా, అణగిన వర్గాలుగా ఉన్నారు. వాళ్లొక్కసారి
కళ్లు తెరిచినపుడు ప్రశ్నించినపుడు - తమకు రావలసిన బాకీలన్ని తమకు వచ్చేస్తాయని చెప్తున్నారు. తమ
స్థితిని గుర్తించి, ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఒకసారి గొంత్తితే, నినదిస్తే,
ధిక్కారం కలగలిసి ప్రశ్నిస్తే నీకు రావాల్సింది నీకు ఇస్తారు. ఆ కుర్చీలో వాళ్లు కూర్చొని ఉన్నారు
నువ్వు ప్రశ్నిస్తే లేచి నీది నీకిచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతారు అంటున్నారు. ఇక్కడ కవి
ముక్కుసూటిగా చెప్పిన సరళ వాక్యం కవిత్వం అయింది. ఒక మానసిక సంఘర్షణ్ను దాటి దళిత సమాజం కేంద్రంగా
కవి చేసిన హక్కుల ప్రకటన ఈ కవిత. 2.2. సంఘటిత శక్తి - చీమల పుట్టలు: చీమ అనేది చిన్న ప్రాణి. బలహీనమైంది. ఈ
చీమల్ని బలహీనులకి, శ్రామికులకి, దళితులకి, పేదలకు ప్రతీకగా తీసుకొని రాసిన కవిత ఇది. ఇది
ప్రతీకాత్మాక కవిత. ఈ కవిత పేరు చూడగానే మనకు సుమతి శతకం లో చీమలను ప్రతీకలుగా తీసుకొని బద్దెన
చెప్పిన రెండు పద్యాలు గుర్తుకు వస్తాయి. చీమలు పెట్టిన పుట్టలు ‘‘బలవంతుడ నాకేమని బద్దెన చెప్పిన ఈ రెండు పద్యాలు పేదలకు,
బలహీనులకు సంబంధించినవి. ధనవంతులు, శక్తివంతులు పేదల పట్ల ఎంత అమానుషంగా ఉంటారో ఒక పద్యం చెపుతుంటే,
రెండో పద్యం పేదలు సంఘటిత శక్తితో నిలబడితే ఎంత బలవంతుడైనా పతనం అవుతాడని చెబుతుంది. భీమన్న కూడా
చీమల బలహీనతని, బలాన్ని చెప్పారు. చీమల సంఘటిత శక్తిని చెప్పారు. “నల్ల చీమలు, తెల్ల
చీమలు/ఎర్ర చీమలు, పచ్చ చీమలు/చలి చీమలు, పులి చీమలు/ కవిత చదవగానే కవి ఏం చెప్పదలుచుకున్నారో
సులభంగా అర్థమవుతుంది పాఠకులకి. బలహీనమైన ప్రాణులు వాటిలో-అవి చిన్న చిన్నవాటి కోసం కొట్టుకుంటా
ఉంటాయి. అవన్నీ చీమలే అయినా కానీ వాటి మధ్య ఒక సయోధ్య ఉండదని చెప్తున్నారు. చీమ కొంచెం సైజు మారితే, అదొక జాతి,
కొంచెం రంగు మారితే, అది మరొక జాతి! దేశ కాలాలను బట్టి పాత్రల గుణవర్తనలు మారుతూ ఉంటై అని ఎరగని
చీమలు! తక్కిన అన్ని జాతుల మీదా తన జాతే గొప్ప దనుకొనే మనస్తత్వాలు! అవి చీమలే అయినప్పటికీ
రకరకాలుగా ఉన్నట్లు ‘ మనుష్యులు కూడా అంతే! రంగు, ఎత్తు, రూపం - వీటిని బట్టి వాళ్లల్లో
వాళ్లు మేం గొప్ప అంటే మేం గొప్ప అని, మాది గొప్ప జాతి అంటే - మాది గొప్ప జాతి అని కొట్టుకుంటూ
ఉంటారు. ఒకే జాతి అయినా సరే అనేక జాతులుగా విడిపోయి ఉంటారు అని చెప్తున్నారు. అందరూ మనుష్య జాతే
అన్న సత్యం గుర్తించరు. అలా విడిపోయి ఉండటం వల్ల ఏం ప్రయొజనం లేదని ఆర్థం చేసుకోలేక పోతారు.
‘తెలివి తక్కువ చీమలు/గింజల కోసం గింజుకు చస్తుంటై/అవి
పెట్టిన పుట్టలు/పాముల కెరవవు తుంటై!’ చీమలు చిన్న విషయాలను పట్టుకొని కొట్టుకు
చస్తా ఉంటే, చీమలు కష్టపడి సంపాదించిందంతా పాములు ఆక్రమిస్తాయి. ఈ సమాజ నిర్మాణంలో భాగమైన వాళ్లు
తన్నుకుంటూ ఉంటే పాము లాంటి ఆధిపత్య వర్గాలు - వాటిని అనుభవిస్తూ ఉంటాయి అని చెబుతున్నారు. ఇదంతా
ప్రతీకాత్మకం. చీమల్లాగే మనుషులు కూడా స్పృహలో లేకుండా పోయారంటున్నారు. సుమతీ శతక ప్రస్తావన
తెచ్చారు. చీమల కున్న జ్ఞానాన్ని మనుషులు అందుకోలేక పోయారని కవి ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఐకమత్యాన్ని సాధించుకోలేక పోయారన్న విషయాన్ని ఒక ప్రతీక గా చేప్పారు. కవిత మొత్తం అన్యాపదేశంగా
సాగుతుంది. పైకి ఒక అర్థాన్ని చూపిస్తూ - లోపల మరొక అర్థాన్ని కలిగి ఉంటాయి కొన్ని కవితలు! - ఈ కవిత
అలాంటి అన్యాసదేశ కవిత. ఆంగ్ల సాహిత్యంలొ ఈ టెక్నిక్ ను ‘‘అలిగొరి’’
(allegory) అంటారు. భీమన్న మతం ఒక పిచ్చి అన్నారు. ఏ మతమైనా
సరే అది మనుషుల్ని మాయ చేస్తుందని, నియంత్రిస్తుందని ఆర్థం చేసుకొని మత పిచ్చిని ఒదులు కోవాలని
చెబుతూ రాసిన కవిత ‘మతం ఒక పిచ్చి’. ఇది వ్యంగ్య స్వరంతొ మొదలవుతుంది. “శివాయ నమః/నారాయణాయ
నమః/శక్యైనమః/ సమాజంలో మతం అనే మత్తు అందరిలోనూ బలంగా
వ్యాపించి ఉంది. ముఖ్యంగా కొందరు ఏ విషయాన్నైనా ఒక దైవ క్రియ లాగా లేదా ఒక మత ప్రక్రియ లాగా
చూస్తారని చెప్తున్నారు భీమన్న. కొందరు ప్రతి దానికి ఒక తంతుని ఆపాదిస్తారు. దైవత్వాన్ని
ఆపాదిస్తారు. ఒక దైవ కార్యక్రమంగా మార్చేస్తారు అని చెప్తున్నారు. చివరికి అలా మార్చిన వాళ్లు తమని
తాము విశ్వమత సమన్వయ వాదులం అని చెబుతారని అంటున్నారు. మనుషులు ఎవర్నైనా ఎక్కువ ఇష్టపడితే ఆ
మనుషుల్ని తెచ్చి దేవుళ్ల లిస్టులోకి చేరుస్తారు. అందుకే ‘బుద్దాయ నమ:/ అల్లాయ నమ:/యోహావాయ
నమహ:’ అని దేవుళ్ల సరసన చేరుస్తారనీ - అందుకే గాంధీ, అంబేద్కర్, మార్స్‌ని కూడా ఆ
జాబితాలో చేర్చారని కవి బాధ పడుతున్నారు. సామాజిక మార్పు కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే వారి శ్రమనీ,
సిద్ధాంతాన్ని గుర్తించరు, కానీ ఆ వ్యక్తిని గుర్తించి భగవంతుడుగా మార్చేస్తారు - అంటే వాళ్ళు
చెప్పిన సిద్ధాంతం పక్కకు నెట్టేసి, ఆ వ్యక్తులను మాత్రం పూజచేసి, జ్ఞానాన్ని సమాధి చేస్తారని
చెప్పారు . అలా ప్రతి దాన్నీ మతంలో నుంచి చూసే విధానాన్ని ఎద్దేవా చేస్తున్నారు భీమన్న. ‘ఓరీ, మూర్ఖుడా, మతం విషంరా, విషం!/నల్లమం దన్నా డెవడో, అది
అబద్ధం! / అలాంటి మతం గురించి కవి ఏమంటారంటే మతం
మత్తు మందో, నల్ల మందో కాదు, మతం విషం అని చెప్తున్నారు! మతం అనే దాని నుండి బయటికొచ్చి, మానవ
భావనని అందుకున్నప్పుడే విశ్వ మానన శ్రేయస్సు జరుగుతుందని చెప్పారు. దేశంలో ఉన్న ఎక్కడి మనిషైనా ఒక
శాంతి, సమానత్వంతో బతకడం అనేది, మతం ఈ సమాజం నుండి తొలగిపోయి నపుడే జరుగుతుంది అని చెప్పారు. అది ఏ
మతమైనా కావచ్చు! మతం ఒక పిచ్చి అన్నారు! సమాజం ఆ పిచ్చి నుండి బయట పడటం అవసరమని చెప్పిన
కవిత. బోయి భీమన్న భావజాలానికి, అంతరంగానికి
ప్రతీక ఈ కవిత. ఆ ప్రతీక గురించి ఈ పుస్తకం ముందు మాటలో వివరణ ఇచ్చారు. కవి బోయి భీమన్న.
‘‘గుడిసెలు కాలిపోతున్నై అంటే ‘అవి కాలిపోతే మాకేం’ అనుకుంటే దెబ్బ
తిన్నట్టే! ఇప్పుడు కాలిపోతున్నట్టివి వట్టి గుడిసెలేకాదు! ఆ గుడిసెల్లోని గొర్రెల అజ్ఞానము,
అబలత్వమూ, చీకటి, మురికి కూడా కాలిపోతున్నై’’ అంటారు!. గుడిసెలు కులవ్యవస్థకు కూడా ప్రతీకలు! కుల
అణచివేతలో మగ్గుతున్న దళితుల చుట్టూ అజ్ఞానం పేరుకొని ఉందని ఆ అజ్ఞానం తగలబడి పోవాలని కవి భీమన్న
ఆక్షాంక్ష! ఈ గుడిసెలు, ఈ గుడిసెల్లో నివసించేవారు, ఈ
అజ్ఞానంలో మగ్గుతున్న వారు మాలమాదిగలే అని స్పష్టంగా చెబుతున్నారు. - ఏమంటారంటే- ‘ఒకసారి కాలిపోయిన గుడిసెలు/మరి మళ్ళీ కాలిపోవడానికి,/ఎక్కడి
నుంచి వస్తుంటై?’ (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం
– సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట 33 ) ఒకసారి అజ్ఞానం తగలబడి పోయింది అనుకుంటే,
కొంత స్పృహ లోకి వచ్చేశారు అనుకుంటే, మళ్లీ అజ్ఞానం వచ్చి వాళ్లల్లో చేరుతుంది అని అర్థం. ఒక్కసారి
కొంత తెలివి స్పృహ అర్థం తెచ్చుకొని ఉన్నప్పుడు మళ్లీ అజ్ఞానం వాళ్లని కమ్మేస్తుందని చెప్తున్నారు.
ఆ అజ్ఞానం మతం, విశ్వాసాలు, దేవుడు, ఆచార సంప్రదాయాలు, పేదరికం, బానిసత్వం, భయం, ఆకలి నుంచి
వస్తుంది. వాటిని ఏమంటున్నారంటే - ఇవన్నీ ఎప్పుడైనా వదిలించుకోవాలన్నా మళ్లీ వచ్చేస్తున్నాయి
అంటున్నారు. “అదే మన ధర్మంలోని రహస్యం/ధర్మ సంస్థాప
నార్థం/ ఒకరు మేడలో ఉండటం ధర్మం! ఒకరు గుడిసెలో
ఉండటం ధర్మం. ‘‘ధర్మం’’ అనే దాంట్లో ఉన్న రహస్యం అదే అని చెప్తున్నారు.
ధర్మం పేరుతో ప్రజలను నమ్మించి ఆ విషవలయంలో ఉంచుతారని, దానిని నమ్మేటట్లు చేస్తారని చెబుతున్నారు.
ధర్మాన్ని పేదలు, దళితులు నమ్మితే వారు గుడిశలో ఉండటమె ధర్మసమ్మతమని నమ్మక తప్పదు. ఈ రహస్యం గుడిసె
ప్రజలు అందరూ తెల్సుకుంటే తప్ప విముక్తి లేదు. ఆ రహస్యం తెలిస్తేనే ఆ విషవలయం నుండి బయటికొస్తారు
అని చెప్పాడు. మనస్సులో ఉన్న ఈ అజ్ఞానం తగలబడి పోతేనే రహస్యం అర్తం అవుతుంది. పేదల, బహుజనుల దృక్పథం
నించి రాసిన బలమైన సైద్ధాంతిక కవిత ఇది. ఒక మానసిక, సామాజిక విముక్తి కోసం అట్టడుగు వర్గాలకు భీమన్న
చేసిన ‘ధర్మబోధ’ ఈ కవిత. చాలా సరళమైన భాషలో సాధారణ పదాలతో కనిపించే
ఈ కవిత ఒక బలమైన ప్రత్యామ్నాయ భావజాలాన్ని ప్రతిపాదిస్తుంది. ‘‘ధర్మం’’
పేరుతో కొనసాగుతున్న మాయని ఛేదించింది ఈ కవిత! తెలుగు కవిత్వం లొ భాష, శబ్ధం కవిత్వంలో ఆధిపత్యం
చెలాయిస్తున్న కాలంలో చాలా వాడుక మాటలతో లోతైన సామాజిక రాజకీయ ప్రతిపాదనలు చేశారు భీమన్న .
2.5. ఆధునికతకు కనువిప్పు - మేం ఆధునికులం: ఆధునికత అనే మాట కాలాన్ని బట్టి,
సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. భీమన్న ఈ కవిత రాసిన కాలానికి ఉన్న ఆధునికత
గురించిన కవిత ఇది. నిజానికి ఇది 50 ఏళ్ల క్రితం రాసినా, ఇప్పటికీ అర్థవంతంగా అనిపిస్తుంది. మనం
ఇప్పుడు కూడా ఈ సమాజానికి అన్వయించుకోవచ్చు. భావజాలపరంగా, నిర్మాణ పరంగా కూడా ఆధునిక కవిత ఇది. ఏ
వివరణ అవసరం లేని వ్యంగ్య కవిత. మేం ఆధునికులం, మేం చాలా మారిపోయాం, మాకు చాలా తెల్సు అని చెప్పే
సమాజం గురించి రాసిన కవిత. “ముందుకు పదం డంటూ వెనక నుంచి తరుముతాం/ముందుకు పోయేవాళ్ళను ద్రోహు లంటూ చంపుతాం/ఇందిరతో కలిసి
సోషలిజం ప్రకటిస్తాం/హిరణ్యాక్షుడు ఒడిలో దూరి దాక్కుంటాం!/మేం ఆధునికులం! ఎక్కడికయ్యా ఆ పరుగంటే,
ఏమో ఎరగం!/వేగాన్ని సృష్టించాం, వెంటబడి ఒగురుస్తున్నాం!/యంత్రాన్ని నిర్మించాం, అందులో పడి
నలుగుతున్నాం/అణువును పగలగొట్టాం, దానితో చస్తున్నాం?/ మేం ఆధునికులం!/ ఈశావాస్య మిదం
జగత్తంటాం/చీకటి గుడుల్లో అతణ్ణి బంధించేస్తాం/మానవ సేవే మాధవ సేవంటాం/అందుకని మమ్మే
సేవించండంటాం!/మేం ఆధునికులం!/ రోజుకు రెండాటలు సినిమా చూస్తాం,/దేవుడి పటాలు చించి, ఆ ప్రేములు
తారలకు పెడతాం/రేడియో ఉంటే వింటాం, పేపరు దొరికితే చదువుతాం/రెడిగా ఉంటాం, ఎక్కడికో చెప్పలేం/మేం
ఆధునికులం! బిచ్చగాడి క్కాని ఇవ్వం, కుబేరుడికి విందులు గుడుపుతాం/సంసారాలకు నిప్పెడతాం, చుట్టూ
చేరి చలికాగుతాం/ స్వచ్చమైన శీలం పై సిరిబుడ్లు దిమ్మరిస్తాం/ఒంటరిగా ఆడది పోతుంటే కోతులమై
పోతాం/మేం ఆధునికులం!/ తిండి లేదని అఘేరిస్తాం, కాళ్ళకు మొక్కుతాం/తిన్న ఇంటి వాసాలే
లెక్కెడతాం/తెలియదని దెల్లా వాగుతాం/ తెలిసిన వాళ్ళ నోరు మూయిస్తాం/బాజా భజంత్రీలతో ఊరేగుతాం/మేం
ఆధునికులం!/ అన్నం సున్నం ఒకటే పరబ్రహ్మ అంటాం/అన్నం మేం తిని, సున్నం ఇతర్లకు వొదిలి పెడతాం/పని
చెయ్యం, చేసేవాళ్ళపై స్వారీ చేస్తాం/మొదడును డిస్మిస్ చేసి, నోరెట్టుకు బ్రతుకుతాం/మేం
ఆధునికులం! ఇంట్లో కంపు కొడతాం, బైట గుభాళిస్తాం/హృదయాన్ని ఎండగడతాం, శరీరాన్ని
మేపుతాం/బుద్ధిని బహిష్కరిస్తాం! దురాశకు డిన్నర్లిస్తాం/స్వార్థాలకు పతాకలు కట్టి ఎగరేస్తాం/మేం
ఆధునికులం! పనికొచ్చే క్రొత్తవాడితో స్నేహం చేస్తాం/పనితీరిన పాత స్నేహితుణ్ణి
తరిమి కొడతాం/ఎక్కడైనా మంచి జరిగితే అది మాదే నంటాం/అతణ్ణి ప్రెసిడెంటు చేసింది మావోటే నంటాం,/మేం
ఆధునికులం! వేదిక లెక్కుతాం, వాగ్దానాలు వర్షిస్తాం/కులతత్వాన్ని ఖండిస్తాం,
సమత్వాన్ని ప్రకటిస్తాం/మీరు మేమూ అంతా ఒకటే నంటాం/మా గదిలో దూరి మేం మడిగట్టుకొంటాం!/మేం
ఆధునికులం! కాకుల్ని కొడుతుంటాం, గెద్దలకి వేస్తుంటాం/మా కోడిపిల్లలు తన్నుకు
పోబడుతుంటే ఏడుస్తుంటాం/గతం నుంచి నేర్చుకోం, భవిష్యత్తు ఆలోచించం/కళ్ళు మూసుక దూకుతాం, కంచెల్లో
పడతాం/మేం ఆధునికులం! ప్రచార సాధనాల్ని గుప్పిట్లో పెట్టుకొంటాం/మా డబ్బా మేమే కొట్టుకొంటాం/వీణలు
గీణలు వేట్నీ వినిపించనివ్వం/ మేమే దేవతలం, మీరే మా కవ్వం/మేం ఆధునికులం!” (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట
178 ) ఆధునికత పేరుతో జీవిస్తున్న అబద్ధపు జీవన
విధానాన్ని వ్యంగ్యంతో, చురకల లాంటి వాక్యాలతో ఎద్దేవా చేశారు కవి. సమాజం పట్ల బాధ్యత లేకపోవడం,
విలువలు లేకపోవడం, పరులకు నీతులు చప్పడం, అపసవ్య జీవితాన్ని ప్రేమించటం, అబద్ధపు నిజాయితీని నిజం
అని భ్రమ చెందడం వంటి అనేక ఆధునిక పోకడలను వ్యంగ్యంతో చెప్పారు. ఎంతో సరళమైన వ్యంగ్యాస్త్రాలతో, నిత్య
జీవితం లో మానవ ప్రవర్తనతో ముడి పడిన అనేక విషయాలను – దేవుడు, దయ్యం, శీలం, దానం, వేగం,
అన్నం, ప్రేమ, హృదయం, స్నేహం, కులం, మతం, గతం, భవిష్యత్తు – ఇలా చాలా విషయాల పట్ల మానవ
స్వభావాన్ని అందులొనీ ద్వైదీ భావాన్ని ఎంతో వ్యంగ్యగా విమర్శ చేశారు. ఇది ప్రతి ఒక్కరి ఆత్మ
పరిశీలనకు పనికి వచ్చే స్వరం నించి రాశారు. ఎక్కడా తూలనడకుండా, తప్పును ఎత్తి చూపినట్టుగా కాకుండా
ఎంతో కవితాత్మకంగా సాగుతుంది కవిత. “ప్రభూ మా
పేర్లను/వోటర్ల జాబితా నుంచి తొలగించి/బానిసల జాబితాలో చేర్పించండి!/చచ్చి, మీ కడపున పుడతాం! బానిసల
జాబితా అనేది ఇప్పుడు లేదంటారా?/పూర్వం రాజుల పాలనలో ఉండేదే!/ఇప్పుడిది ప్రజల పాలన అంటారా?/బానిసల
జాబితా స్థానంలో/వోటర్ల జాబితా వచ్చిందంటారా? అదేమిటయ్యా, అలా ఏడుస్తారు?/వోటంటే ఏమి
టనుకొంటున్నారు!” (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం
– సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట 48 ) ఇది ఒక సంభాషణాత్మక శైలిలో రాసిన కవిత
ఇది. ఓటుహక్కు ఉన్నా, దానిని వినియోగించుకోలేని వాతావరణంలో మన సమాజం ఉండటాన్ని, ఆధిపత్య వర్గాలు
వోటర్లని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితిని చెప్తున్నారు కవి. “ఒక ప్రక్క రకరకాల జెండాల వాళ్ళు/మరో ప్రక్క మా వూరి ఖామందుల
వాళ్ళు/ ఓటుంది పేరుకే గానీ, ఆ ఓటుని అడ్డంపెట్టి
హింసని కొనసాగిస్తుంటారు. పేదవాళ్ళకి ఓటు హక్కు అధికారాన్ని ఇచ్చిందో లేదో తెలియదు గాని, వారి
జీవితంలో శాంతి లేకుండా చేసింది అంటున్నారు. అందుకే దీన్ని ‘ ఓటర్ల జాబితా కాదు, బానిసల
జాబితా’ అంటున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఎవరికి ఓటువేయాలో ఊరి పెద్దో,
కామందో నిర్ణయించే పరిస్థితి పట్ల ప్రశ్నలు లేవనెత్తారు. భయపెట్టో, బెదిరించో, డబ్బులిచ్చో ఓటుని
లాగేసుకుంటారు పెద్దలు. అటువంటి పరిస్థితిలో ప్రజలు, ప్రభుత్వ వ్యవస్థలు ఓటు హక్కుని కాపాడుకోలేక
విఫలం అవుతుండటాన్నిచూసి బాధ వ్యక్తం చేస్తున్నారు కవి. నిజానికి ‘‘ఓటు
ప్రజాస్వామ్యంలో గొప్ప ఆయుధం అని చెప్తారు గానీ, పేదలు, వెనుకబడిన వారు, బలహీన వర్గాల వాళ్లకి అదొక
శని అయిపోయింది అని చెప్తున్నారు కవి. అందుకని ఈ కవితని ఎలా ముగిస్తారంటే - “ ఈ దేశంలో పేదలకు
వోటుండడం/పక్కలో పాముండటమే!/ కవి వ్యక్తీకరించిన ఈ బాధలో ప్రజలు తమ ఓటు
తాము వినయోగించుకోలేక పోతున్నారనే ఒక స్పృహ, ఆవేదన కనిపిస్తుంది. ఈ కవిత ప్రస్తుత రాజకీయ వ్యవస్థ
మీద ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం. బోయి భీమన్న చేసిన సాహిత్య ప్రయోగాల్లో
టుమ్రీలు కూడా ఉన్నాయి. ‘గుడిసెలు కాలిపోతున్నై’ కవితా సంపుటిలో ‘టుమ్రీలు’
పేరుతో 69 కవితలున్నాయి. టుమ్రీలు అంటే చిన్న కవితలు. నాలుగు వాక్యాల్లో తక్కువ మాటల్లో పేల్చిన
వ్యంగ్యాస్త్రాలు ఈ టుమ్రీలు. కవి బోయి భీమన్న ఈ కవిత్వంలో చాలాచోట్ల పులి, నక్క, గొర్రెలు వంటి
ప్రతీకలు (సింబల్స్) వాడారు. బలం కలవాడు, తెలివి కలవాడు ఒక పక్క, ఈ ఇరు
వర్గాలకు ఆహారంగా, బ్రతుకుతున్న బలహీనులు, పేదలు మరొక పక్క. పులి, నక్క అనేవి ఆధిపత్య వర్గాలు.
గొర్రెలు సామాన్య ప్రజలు. పులి, నక్కల అధికారానికి, జిత్తులమారి తనానికి బలహీనులు, సామాన్యులు
బలవుతారని చెప్పారు భీమన్న. “నాలుగు వర్ణా లన్నది హిందూయిజం
వర్ణ సిద్ధాంతాలు, కమ్యూనిస్టు
సిద్ధాంతాలు చెప్పింది పులులు నక్కలే! ఒక సిద్ధాంతం మనుషులను నాలుగు విభాగాలు చేస్తే మరొక సిద్ధాంతం
రెండు భాగాలుగా విభజన చేసిందని చెబుతున్నారు. మొత్తానికి సమాజం మీద ఆధిపత్యం కోసం పాకులాడే పులి
నక్క సిద్ధాంతం వల్లే ఇలాంటి విభజనలు అని చెబుతున్నారు. “కర్మ సూత్రం పై విశ్వాసం గొర్రెలెప్పుడూ కూడా ఈ కర్మ సిద్ధాంతం
పట్ల విశ్వాసం ప్రకటించాలి. చచ్చిన అవతారాల పట్ల భక్తి ప్రదర్శించాలి. ఇవన్నీ చేయడంతో పాటు పాలక
వర్గాలకు నిరంతరం సేవ చేయాలి. వాళ్ల చుట్టు ఉన్నవాళ్లకి దాసోహం అనాల. అప్పడు మాత్రమే సామాన్యులకు
మోక్షం అంటున్నారు కవి. “మనిషి గుణం మారడం లేదు కవి బోయి భీమన్న నాస్తికులు కాదు. హిందూ
మత విశ్వాసి. కానీ ప్రతి విషయాన్ని హేతు బద్ధంగా చూశారు. అందుకే మతం, భక్తి రెండు ప్రగతిని
అడ్డుకుంటాయంటున్నారు కవి. . మతం - అది ఏ మతమైనా సరే- పేదల పట్ల జాలి లేనిది. వారిని విముక్తి
చేయలేనిది అని కవి భావన. అందుకే మతాలు వారిని విముక్తి వైపు కాకుండా ‘భక్తి’ వైపు
నడిపిస్తున్నాయి. అందువల్ల మతం, భక్తి సామాన్యులకు మేలు చెయ్యవంటున్నారు కవి. “లోకంలో నేడున్న దుస్థితి కంతకూ/గొర్రెల బుద్ధి హీనతే
కారణం!/ మతం, కులం, భక్తి, భజనలు, దేవుళ్ళు,
దేవతలు, సిద్ధాంతాలు వంటి అన్నిటి వెనక దాగి ఉన్న డొల్ల తనాన్ని బయట పెట్టారు భీమన్న. లోకం లో ఉన్న
దుస్థితికి ప్రజలు గొర్రెల మంద లా బతకడమే కారణం అంటున్నారు. ప్రజలు కళ్ళు తెరవాలని, బుద్ధి హీనత
నుంచి బయట పాడాలని హెచ్చరిస్తున్నారు. ఒక వివేచనతో, విచక్షణ తో, మానసిక బలంతో మనుషులుగా ఉండాలని
చెబుతున్నారు. 3. ముగింపు: ‘గుడిసెలు కాలిపోతున్నై - కవితల
సంపుటిలో విడి కవితలు - 57 ఉన్నాయి. టుమ్రీలు పేరుతో - 69 చిన్ని కవితలున్నాయి. . ఇవి విడి విడి కవితలు అయినా ఈ కవితలన్నింటి అంత స్సూత్రం ఒక్కటే. కవి ఒకే
దృక్పథం నుంచి, ఒకే దృష్టి కోణం నుంచి రాసినట్లు అర్థం అవుతుంది. ఈ కవిత్వంలో సమాజంలోని పీడితులు,
పేదల పట్ల సహానుభూతి, కుల అసమానతల పట్ల, వివక్ష పట్ల తీవ్ర నిరసన కన్పిస్తుంది. సమాజంలో ఉన్న ఈ
అసమానతల పట్ల కవి నిత్యం స్పృహతో ఉన్నారని అర్థమవుతుంది. మొత్తం మీద బోయి భీమన్న సామాజిక మార్పు
కోసం, సమాజ చైతన్యం కోసం సాహిత్య సృజన చేసిన కవి. ఆధునిక దళిత కవిత్వానికి దారులు వేసిన గొప్ప
కావ్యాలలో ‘గుడిసెలు కాలిపోతున్నై’ కావ్యం ఒకటి. స్పష్టంగా కులవివక్షను, కులవివక్ష తో
ఉన్న రాజకీయ సామాజిక వ్యవస్ధను నిలదీసి ప్రశ్నించిన కవిత్వం. పీడిత సమాజానికి పోరాట శక్తిని, కొత్త
దృక్పథాన్ని ఇచ్చిన కవిత్వం ఇది. 4. ఉపయుక్తగ్రంథసూచి: పరిశోధనగ్రంథాలు:
బోయి బీమన్న దళితజాతికి దిశానిర్దేశం చేసిన మహా రచయిత. ఎందరో దళితుల
జీవితాలను తన రచనల ద్వారా ప్రభావితం చేశారు. ఆయన రాసిన ‘‘పాలేరు’’ అనే
నాటకం గొప్ప సామాజిక మార్పుకి దారి తీసింది. ఆ నాటకం చూసి ఎందరో దళిత విద్యార్థులు ఉన్నత చదువులు
చదువుకొని, ఉన్నత పదవులు పొందారు. జీవితాలను మార్చుకున్నారు. ఆయన రచనల గొప్పదనం అది.
2.1
హక్కుల ప్రకటన : నాకు రావలసిన బాకీ!
’’ముప్పు
ఘటించి వీని కులమున్ గలిమిన్ గబళించి దేహమున్
పిప్పియొనర్చు నీ భరత వీరుని పాదము కందకుండగా
చెప్పులు
కుట్టి జీవనము సేయును గాని నిరాకరింప లే
దెప్పుడు
నప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్!’’ (గుర్రం జాషువా, గబ్బిలం కావ్యం. జాషువా సర్వలభ్యరచనల సంకలనం: పుట. 849
)
ఇవిగో మీ హక్కులు/అధికారంతో అనుభవించండిక!“ (బోయి భీమన్న సమగ్రసాహిత్యం సంపుటి 3- వచన కవితలు, భాగం -2 :
పుట. 91 )
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్
హేమంబు
గూడబెట్టిన
భూమీశులపాల జేరు భువిలో సుమతీ! (సుమతి శతకం - బద్దెన - పుట: 15, పద్యం 45)
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన
సర్పము
చలిచీమల చేతచిక్కి చావదె
సుమతీ!‘‘ (సుమతి శతకం - బద్దెన - పుట:27,
పద్యం 88)
కండ
చీమలు, రెక్కల చీమలు/ అబ్బో, ఎన్నెన్ని రకాల చీమలు!/
ఎన్నెన్ని రంగుల చీమలు!/నల్ల చీమలు నోట్లోని బియ్యపు గింజను/
అది తింటున్న లవమే ఇదీ కావాలంటున్నది!/ ఒక్కో రంగు చీమలకు ఒకో పుట్ట
/
ఏ రకం చీమలకైనా ఉండే దొకే పొట్ట/ఏ పొట్ట
నిండడానికైనా/కావలసింది ఇన్ని గింజలు”
(బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట
91 )
2.3. మతం ఒక పిచ్చి:
బుద్ధాయ నమః/అల్లాయ నమః/యొహోవాయ
నమః/
కారల్ మార్క్సవే నమః/మహాత్మా గాంధినే
నమః/డాక్టర్ అంబేడ్కరాయ నమః/
లైట్ కోసం
నమః/ఎవరు స్వామీ తమరు?/నేనా, నేను/నేను విశ్వమత సమన్వయ వాదిని!” (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట
43 )
మతం విషం, ఆత్మనే చంపుతున్న విషం!/నానా విషాలు
కలిపిన కషాయం/
అమృతం అవుతుందా, బాబూ?/నీ నానా మత సమన్వయ
ప్రయత్నమూ అంతే!/
అది విషం, దాన్ని సాంతం నిర్మూలించి
పారెయ్!/మానవ భావన నుంచి/
మతాన్ని తొలగించ గలిగితే
చాలు/విశ్వమానవ శ్రేయస్సు/సర్వమానవ సమతోషస్సు/
సద్య
స్సముద్భూత మవుతుంది,/ప్రతి ప్రాణీ సంప త్సమృద్ధ మవుతుంది!
/
మబ్బు విడిచిన సూర్యుడిలా/మానవాత్మ జాజ్వలమాన
మవుతుంది! (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం –
సంపుటి 3- వచన కవితలు భాగం-2 : పుట 44 )
2.4. ధర్మ బోధ - గుడిసెలు కాలిపోతున్నై:
ఎండాకాలంలో ఊర్లల్లో పూరి
గుడిసెలు కాలిపోతుంటాయ్ అయితే ఇదొక ప్రతీకగా చెప్పానన్నారు కవి. గుడిసెలు పేదల జీవినానికి
ప్రతీకలు. ఆ గుడిసెల్లో ఉండేటటువంటి పేదల జీవితంలో ఉన్న అనేక అంశాలు వాళ్ల జీవితాన్ని
నిర్ణయిస్తాయి. వాళ్ల స్థితిని నిర్ణయిస్తాయి. అవిప్పుడు కాలిపోతున్నాయి అని చెబుతున్నారు కవి
భీమన్న.
ఈ గుడిసెలు/మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటై! “
(బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు
భాగం -2 : పుట 34 )
2.6. రాజకీయ వ్యంగ్యాస్త్రం - బానిసల
జాబితా:
ప్రజాస్వామ్య దేశంలో
ప్రజలందరికీ ఓటుహక్కు ఉన్నప్పటికీ కూడా వాళ్లు వేసే ఓటుని శాసించే ఒక ఆధిపత్య వ్యవస్థ పట్ల నిరసన ఈ
కవిత! తిరస్కారం, వ్యంగ్యం కలగలిపిన స్వరంలో ఆధునిక ఎన్నికల వ్యవస్థలో కరడు గట్టుకొని ఉన్న ఫ్యూడల్
పెత్తనాన్ని ఆధిపత్యాన్ని నిరసించే కవిత ఇది.
ఈ వోటు అమ్మోరు కోసం/మా ప్రాణాలు
తోడేస్తున్నారు/
బానిసల కుండే సుఖ శాంతులు సైతం/మా పేద
వోటర్లకు లేవు, మహాప్రభో!” (బోయి భీమన్న సమగ్ర
సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట 49 )
ఈ వోట్ల చెలగాట్లతో మమ్ముల్ని
చంపకండి!/దయచేసి, జాబితా మార్చెయ్యండి!” (బోయి
భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట 49)
2.7. వ్యంగ్యాస్త్రాలు - టుమ్రీలు:
రెండు వర్గా లన్నది
కమ్యూనిజం
ఈ వర్ణ విభజనా, వర్గ విభజనా చేసింది
పులీ నక్కా యిజం! ” (బోయి భీమన్న సమగ్రసాహిత్యం, సంపుటి 3- వచన కవితలు, భాగం -2 : పుట 206
)
చచ్చిన అవతారాల పట్ల భక్తి,
పులికి పాదసేవ, నక్కకు
దాసోహం
గొర్రెల కివే మోక్ష మార్గాలు!”
(బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు
భాగం -2 : పుట 206 )
కారణం మతం! మనిషి మెదడు పెరగడం లేదు
కారణం
భక్తి!
మతం, భక్తి అనేవి మనిషిని ఎదగనివ్వడం
లేదు.
ప్రార్థనలు, భజనలు
అన్నీ
వట్టి శవ జాగరాలు!
మతమూ,న భక్తీ నశించకుండా
ప్రగతి లేదు మనిషికి!”
(బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు
భాగం -2 : పుట 207)
అందుకే, హెచ్చరిస్తున్నాను, వినండి!/ఓ, గొర్రె
సొదరుల్లారా! కళ్ళు తెరవండి!
వద్దు మతం, వద్దు
మతబోధనలు/వద్దు భక్తి, వద్దు భజనలు!/
ఏది, ఏది
కనిపెట్టండి?/మనశ్శక్తిని పెంచుకొని మనుషులుగా బ్రతకండి!” (బోయి భీమన్న సమగ్ర సాహిత్యం – సంపుటి 3- వచన కవితలు భాగం -2 : పుట
208)
టుమ్రీలు చిరు కవితలు. ఈ కవితలు సామాన్యులకు సులువుగా, సునాయాసంగా అర్థం
అయ్యేలా ఉంటాయి. సామాన్య ప్రజల సామాజిక, వికాసానికి, కొత్త జ్ఞానానికి ఈ కవితలు ఉపకరిస్తాయి. వేమన
పద్యాలలాగా చిన్న చిన్న వాక్యాల్లో అనల్పార్థాన్ని చెప్పే కవితలు ఇవి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.