AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
3. జీవవైవిధ్యకథలు: అస్తిత్వప్రాధాన్యం
ఆచార్య వంగరి త్రివేణి
ఆచార్యులు, తెలుగు అధ్యయనశాఖ,
తెలంగాణ విశ్వవిద్యాలయం
డిచ్ పల్లి, నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9951444803. Email: telugutriveni@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
ఐక్యరాజ్యసమితి మే 22 వ తేదీని అంతర్జాతీయ జీవ
వైవిధ్య దినోత్సవంగా ప్రకటించింది. 1992 లో బ్రెజిల్ - రియో డి జనారోలో 170 దేశాలు పాల్గొని జీవ వైవిధ్య
(Bio-Diversity) పదాన్ని వాడడం, జీవ వైవిధ్య సంరక్షణ పద్ధతులను పాటించడం, వాటి ఉపయోగాలను గూర్చి చర్చించడం
జరిగింది. (Wikipedia) 2012 లో హైదరాబాద్ లో అక్టోబర్ 1 నుంచి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ
జీవ వైవిధ్య సదస్సు నిర్వహింపబడింది. (https://telugu.oneindia.com). తెలుగు సాహిత్య అధ్యయనంలో జీవ వైవిధ్య
కథలకు ప్రత్యేక స్థానం ఉంది. త్రిపురనేని గోపి చంద్, బమ్మిడి జగదీశ్వర రావు, కాట్రగడ్డ దయానంద్, కేశవరెడ్డి,
పి.చంద్, గందం నాగరాజు, ముదిగంటి సుజాతారెడ్డి, వి.ఆర్. రాసాని, బలివాడ కాంతారావు, పాపినేని శివశంకర్,
పెద్దింటి అశోక్ కుమార్ తదితర కథకులు జీవ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ కథలు రచించారు. అర్రు కడిగిన ఎద్దు,
ఆవు-పులి, కర్రావు, పల్స్ ఆఫ్ రోడ్, భూ నిర్వాసితులు, చెరువు, పయనం, కుబుసం, ముంగిస, చివరి పిచ్చుక,
మాయిముంత, ఏడిండ్ల పిల్లికూన, అనగనగా ఓ కోడిపెట్ట వంటి కథలను నా పరిశీలనకు తీసుకున్నాను. పశుపక్ష్యాదులు,
క్రిమి కీటకాదులు, చెట్లు చేమలు చెరువులు, కొండలు గుట్టలు అడవుల మొదలగు జీవ జాలమంతా కథల్లో ఏ విధంగా
ప్రదర్శింపబడిందో వివరిస్తూ అస్తిత్వ ప్రాధాన్యాన్ని తెలియజేయడం ఈ వ్యాసం ముఖ్యలక్ష్యం.
Keywords: పర్యావరణం, వైజ్ఞానిక పద్ధతులు, జీవ వైవిధ్యం,
ఆత్మావలోనం, జీవన పార్శ్వం, అస్తిత్వ ప్రాధాన్యం, భూ నిర్వాసితులు, మాతృత్వం, శక్తి సామర్థ్యాలు,
కథానిర్మాణ సూత్రం. ఉపోద్ఘాతం: జీవ వైవిధ్యం అంటే జీవావరణంలో సంక్రమించిన పరిణామాలు. ప్రకృతి, పర్యావరణం,
సహజ వనరులు వీటిల్లో సంభవించే మార్పులన్నీ జీవ వైవిధ్యంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల
జీవులలో, వాటి జీవితాలతో అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రకృతి కవచాన్ని, పర్యావరణాన్ని ఈ ప్రభావం
నుంచి కాపాడటానికి శాస్త్రీయ వైజ్ఞానిక పద్ధతులను ఎంతగా అవలంభించినా అదే స్థాయిలో మానవీయ దృక్కోణం కూడా
అవసరం. ప్రకృతిలో జరిగే ఎన్నో అనుకూల, ప్రతికూల సంఘటనలకు జీవావరణంతో వైవిధ్య పరిస్థితులు
ఏర్పడుతున్నాయి. సృష్టి ఆరంభం నుంచి జీవుల యొక్క జీవన శైలి, వారి పురోభివృద్ధి, వివిధ జంతుజాలం యొక్క
అభివృద్ధి వంటి అంశాలు జీవ వైవిధ్యంలో ప్రధాన స్థానాన్ని వహిస్తాయి. జీవ వైవిధ్యం అనేది అనేక అంశాల
సంక్లిష్టరూపం. వాతావరణం...వాతావరణం నుండి పర్యావరణం.... పర్యావరణం నుండి జీవావరణం... జీవావరణం నుండి
మానవావరణం వరకు పూర్వోత్తర ప్రధానంగా నిలుస్తూ జీవ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. వందేళ్ళ తెలుగు కథా చరిత్రలో ప్రత్యేకమైన జీవవైవిధ్యాన్ని ప్రదర్శించే కథలు
ఎక్కువగానే రచింపబడ్డాయి. ప్రకృతి స్పందనలకు, పర్యావరణంలో కలుగుతున్న మార్పులకు, మనిషి యొక్క స్వార్థపు
ఆలోచనలకు జీవవైవిధ్యం అనేది ఈ భూమి పై ఏ విధంగా చోటు చేసుకుందో చాలా స్పష్టంగా అనేక కథలు చూపాయి. అనుభవం
గడించిన రచయిత నుంచి మొదలుకొంటే నేటి వర్తమాన రచయితల వరకు చుట్టూ పరిసరాలలో సంభవిస్తున్న మార్పులను
గూర్చి తమ కథల్లో వెల్లడిస్తూనే ఉన్నారు.జీవ వైవిధ్యం అంటే జీవావరణంలో సంక్రమించిన పరిణామాలు. ప్రకృతి,
పర్యావరణం, సహజ వనరులు వీటిల్లో సంభవించే మార్పులన్నీ జీవ వైవిధ్యంపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి.
దీనివల్ల జీవులలో, వాటి జీవితాలతో అనేక సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రకృతి కవచాన్ని, పర్యావరణాన్ని ఈ
ప్రభావం నుంచి కాపాడటానికి శాస్త్రీయ వైజ్ఞానిక పద్ధతులను ఎంతగా అవలంభించినా అదే స్థాయిలో మానవీయ
దృక్కోణం కూడా అవసరం. ప్రకృతిలో జరిగే ఎన్నో అనుకూల, ప్రతికూల సంఘటనలకు జీవావరణంతో వైవిధ్య పరిస్థితులు
ఏర్పడుతున్నాయి. సృష్టి ఆరంభం నుంచి జీవుల యొక్క జీవన శైలి, వారి పురోభివృద్ధి, వివిధ జంతుజాలం యొక్క
అభివృద్ధి వంటి అంశాలు జీవ వైవిధ్యంలో ప్రధాన స్థానాన్ని వహిస్తాయి. జీవ వైవిధ్యం అనేది అనేక అంశాల
సంక్లిష్టరూపం. వాతావరణం...వాతావరణం నుండి పర్యావరణం.... పర్యావరణం నుండి జీవావరణం... జీవావరణం నుండి
మానవావరణం వరకు పూర్వోత్తర ప్రధానంగా నిలుస్తూ జీవ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. వందేళ్ళ తెలుగు కథా
చరిత్రలో ప్రత్యేకమైన జీవవైవిధ్యాన్ని ప్రదర్శించే కథలు ఎక్కువగానే రచింపబడ్డాయి. ప్రకృతి స్పందనలకు,
పర్యావరణంలో కలుగుతున్న మార్పులకు, మనిషి యొక్క స్వార్థపు ఆలోచనలకు జీవవైవిధ్యం అనేది ఈ భూమి పై ఏ
విధంగా చోటు చేసుకుందో చాలా స్పష్టంగా అనేక కథలు చూపాయి. అనుభవం గడించిన రచయిత నుంచి మొదలుకొంటే నేటి
వర్తమాన రచయితల వరకు చుట్టూ పరిసరాలలో సంభవిస్తున్న మార్పులను గూర్చి తమ కథల్లో వెల్లడిస్తూనే ఉన్నారు.
1. జంతుజాతి కథలు: 1.1. త్రిపురనేని గోపిచంద్ రచించిన "అర్రు కడిగిన ఎద్దు" అనే కథ
అత్యంతకరుణరసాత్మకమైంది. తమ భుజబలంతో పొలానంతా దున్ని దేశానికి ధాన్యాన్ని అందిస్తున్న ఎద్దుల యొక్క
సామర్థ్యం, అవి చేస్తున్న సేవలు, యజమాని పట్ల అవి చూపుతున్న నమ్మకత్వం వంటివి ఈ కథలో ఎంతో సౌహార్ధంగా
చూపబడ్డాయి. మంచి రచనా నైపుణ్యం గల రచయిత గోపి చంద్ ఈ కథలో ఒక ఎద్దు స్వగతాన్ని, మనోగతాన్ని వర్ణించారు.
ఎద్దును కొన్నప్పుడు ఆ యజమాని దగ్గర కేవలం పది ఎకరాలు మాత్రమే పొలం ఉండేది.
ఆ తర్వాతే ఇరువై ఎకరాల ఆసామి అయ్యాడు. ఇదంతా తన ఎద్దు అదృష్టం వల్ల వచ్చిందని చెప్పుకొనేవాడు. ఈ ఎద్దుతో
పాటుగా పొలం దున్నడానికి జతగా, మరొక ఎద్దును కొన్నాడు. మొదట్లో చాలా చక్కగా చూసుకొన్నాడు. ఎద్దు తన
మాటల్లోనే గుర్తు చేసుకుంటున్న విషయం ఈ కథలో కనిపిస్తుంది. "మా ముఖాలకు కుంకుమ పెట్టి, మా
కొమ్ములు అలంకరించి ఊరంతా ఊరేగించాడు. ఊళ్ళోవాళ్ళందరికి భోజనాలు పెట్టాడు. ఊరందరికీ ఆ రోజు పండుగే.
ఇంటికి వెళ్ళగానే మా యజమాని భార్య మాకు దిష్టి తీసి దొడ్లో కి తీసుకొని వెళ్లింది. మాకు జరిగిన
వైభవం మేమే నమ్మలేనంత విపరీతంగా జరిగింది.”(1) ఇంతటి ప్రేమను, ఆప్యాయతను చూపిన యజమాని ఎద్దు ముసలిది అయిపోయిన తర్వాత దాని
బాగోగులు గాని ఆరోగ్యస్థితిని గాని పట్టించుకోవడం మానివేశాడు. ఇంకా ఎప్పటికప్పుడు దానిని ఎలా
వదిలించుకొందామా అనే ఆలోచనే తప్పా దాని పట్ల సానుభూతిగాని, కనికరంగాని చూపడం లేదు. వయస్సులో ఉన్నప్పుడు
ఎద్దు జవసత్వాలను, పనితనాన్ని వినియోగించుకొన్న యజమాని దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఉడిగిపోయిన తర్వాత
అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు. సాధు జంతువులుగా ఇంట్లో వారితో మమేకమై సహజీవనం చేసే వాటికి ఆ పరిస్థితుల
నుంచి బయటపడటం అంతగా ఇష్టం ఉండదు. ఒకసారి ఎద్దుల బలాబలాలను, శక్తి సామర్థ్యాలను పరీక్షించదలచి ఊళ్ళో
వాళ్ళందరూ పుట్టెడు వడ్లను బండికి కట్టి చెరువులో అటూ ఇటూ తిప్పమంటారు. దానికి ఎద్దుల యజమాని కూడా
ఒప్పుకుంటాడు. కానీ అదే సందర్భంలో యజమాని తండ్రి ఎద్దులపై మమకారాన్ని చూపుతాడు. తన కొడుకుతో
"ఎందుకు వాటిని కష్టపెట్టడం, పుట్టెడు వడ్లు ఆ ఊబిలో ఎంతమంచి గొడ్లయితే మాత్రం ఎట్లా
లాగుతై" (2) అని అంటాడు. అయినా గాని ఆ జోడు ఎద్దులు అత్యుత్సాహంతో ఆ పనిని పూర్తి
చేస్తాయి. తమ శక్తి సంపన్నతను నిరూపించుకొంటాయి. 1.2 "ఆవు - పులి" కథను రచించినవారు బమ్మిడి జగదీశ్వరరావు. చరిత్రలో
చెప్పబడిన సత్యం నేటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఎటువంటి మార్పులకు, అన్వయ క్లిష్టతలకు గురవుతుందో ఈ
కథలో ప్రత్యక్షంగా వర్ణింపబడింది. నీతి అనేది ఆయా కాలాలకు సంబంధించి మారుతూ వస్తుంది. ధర్మశాస్త్రాలలో
ఉపదేశింపబడిన "ఆవు - పులి" కథలోని నీతి ఈ తరానికి కూడా అనుసరణీయమైందే, గాని అనేక తరాలనుంచి నీతి మార్గం
తప్పి దాని స్థానంలో అంతటా అవినీతే చోటు చేసుకుంటుంది. ఆవు అడవిలో మార్గం తప్పిపోయి పులి కంటబడటం, ఆవు
తన దూడకు బుద్దులు చెప్పి కడుపార పాలిచ్చి వస్తాననటం, పులి దానికి అనుమతి ఇవ్వడం, ఆవు తన మాట
నిలబెట్టుకోవటం, పులి కరుణించి వదిలిపెట్టడం వంటి నీతిదాయకమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. కాని కాలం మారుతూ
ఉంది దానితో పాటుగా జీవుల మధ్య బేషజాలు కూడా పెరుగుతూ వచ్చాయి. బమ్మిడి జగదీశ్వర రావు రచించిన ఈ కథలో
వైవిధ్యం కనిపిస్తుంది. జీవన వైవిధ్యం అనేది కాలంతో పాటు సంక్రమిస్తుందని తెలిపే కథ. ఈ కథలో ఆవు తనకు
ఎదురైన పరిస్థితిని ప్రాచీన నీతి కథకు అన్వయించుకుంటుంది. ఈ కథలో ఆవు కూడా అడవిలో దారి తప్పడం, పులి
కంటపడటం, పులి అనుమతి తీసుకోవడం, ఇంటికి వచ్చి తన దూడతో చెప్పడం అంతా నీతికథకు అన్వయంగానే ఉంటుంది.
ఎందుకంటే తన పూర్వీకుల నీతి ఆవుకు తెలుసు. ఇక పులి దగ్గరికి వెళ్లడానికి నిశ్చయించుకొన్న ఆవును దాని దూడ
ఆపి తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి తమ చిన్న చిన్న వచ్చీరానీ కొమ్ములతో గుల్లపొడిచాయి. తమ
అస్తిత్వా న్ని కాపాడుకొనే ధోరణిలో ఈ కథ నడుస్తుంది. అంతగా బలయుతం కానటువంటి దూడలైనా ఈ విధమైన పరిణామానికి వచ్చాయంటే వాటి దృఢ
నిశ్చయం గొప్పది. వాటి మాటలో గల ధైర్యం వింటే - "ఏ నాయనమ్మ ఏ పూర్వకథలో బతికిందోగాని యిపుడు
నాయినమ్మా, అమ్మమ్మా, అమ్మాఅందరూ అలాగే బతికిపోలేదు. బతుకు పోరు అయిందిప్పుడు" (3) అంటూ తమ
జాతి రక్షణకోసం అవి చూపిన సాహసం అద్భుతమైంది. జీవవైవిధ్యాన్ని కొత్తగా చూపిన కథ ఇది. 1.3. "పల్స్ ఆఫ్ రోడ్" అనే కథను కేశవరెడ్డి రచించాడు. ఈ కథ పందుల జీవన
వైవిధ్యానికి సంబంధించింది. పందుల సంరక్షణ, ఇతర జంతువుల నుంచి తనకు తాను ఏవిధంగా రక్షించుకుంటుందో
తెలిపే కథ "పల్స్ ఆఫ్ రోడ్" ఈ కథలో గల ఒక పంది అడవిలో ఈనుతుంది. ఈ సందర్భంలోనే ఇతర అడవి జంతువుల నుంచి
పోరాడి తన పిల్లలను కాపాడుకోవడం కనిపిస్తుంది. ఆ ఈనిన పందిని, దానిని అడవి నుంచి ఊరికి తీసుకొని వచ్చే
సమయంలో ఎదురైన పరిస్థితులు, సమస్యలు రచయిత వివరిస్తాడు. ఈనిన సమయంలో దానికి వచ్చే కోపం, దగ్గరికి వచ్చిన
వారందరిని పొడవడం గూర్చి స్పష్టంగా వర్ణించారు. ఇన్ని కష్టాలను అధిగమించి ఒక వ్యక్తి పందిని ఊరికి
తేవడంలో విజయం సాధిస్తాడు. ఈ క్రమంలోనే రచయిత పందుల స్థితిగతులను, వాటి జీవనస్థితిని, వాటి మానసిక,
శారీరక పరివర్తనలను చక్కగా పేర్కొన్నారు. ఈ కథా నేపథ్యమే కేశవరెడ్డి "అతడు అడవిని యించాడు" అనే నవలకు
నాంది అయ్యింది. 1.4. వి.ఆర్. రాసాని రచించిన "పయనం, కుబుసం" అనే కథలు కూడా జంతుజాల సమూహ
స్థితిని తెలుపుతాయి. సృష్టిలో ప్రాణులన్నింటికి అస్తిత్వం ఉంటుంది. వాటి పరిధుల్లో చైతన్యం ఉంటుంది.
చలన శీలత ఉంటుంది. సృష్టి ధర్మంగా ఒక జంతువును వేటాడి మరో జంతువు జీవిస్తుంది. అలా నక్కలను వేటాడి బతికే
సంచార జీవితాలను చెప్పిన కథ పయనం. నక్కలను వేటాడటంలో మెళుకువలను వాటి జీవన పార్శ్వాలను కొండ కోనలను
ఆనుకొని జీవితాన్ని గడిపే సంచార జాతుల జీవన వైవిధ్యాన్ని తట్టి చూపిన కథ పయనం. రాసాని రాసిన మరో కథ "కుబుసం". ఈ కథలో పాములను, పాముకు కలిగే ఆపదలు గూర్చి
రచయిత పేర్కొన్నారు. పాము తిరిగే పరిసరాలలో ఎదురైయ్యే పరిస్థితులు, అటువంటి సందర్భంలో ఆప్రాణి కనబరిచే
చురుకుతనం, చైతన్యం ఈ కథలో స్పష్టంగా గోచరమవుతుంది. 1.5 "ముంగిస" అనే కథను బలివాడ కాంతారావు రచించారు. ఒక పిల్లినో, ఒక కుక్కనో
ఇలా సాధు జంతువులను పెంచుకోవడం మానవుడు అనాదిగా చేస్తున్న వ్యాపకం. కాని ఈ జంతువులకు పూర్తి భిన్నమైన
"ముంగిస"ను పెంచుకోవడం ఈ కథలో కనిపిస్తుంది. అందులో భాగంగానే పిల్లలులేని దంపతులు బయ్యన్న అనే ముంగిసను
పెంచుకొని, కన్న బిడ్డలాగా చూసుకుంటారు. 1.6 శ్రీమతి కె. వరలక్ష్మి రచించిన కథ "మట్టి బంగారం". ఇందులో మేకల
పెంపకానికి సంబంధించిన వారి జీవన విధానం కన్పిస్తుంది. మేకల పెంపకం, మేకల పాకలు, మేక పాలు, మేక మాంసం
వంటి విషయాలను చాలా వివరణాత్మకంగా తెలిపారు. తప్పెట గుళ్ళోళ్ల కళా ప్రదర్శన, కళాకారుల వేషధారణ,
సిమ్మాద్రి అప్పన్న పాటలు, గ్రామ దేవతలు (రాయిలమ్మ) - ఆచార వ్యవహారాలు, పూజలు, కొండరాజుల పండుగలు మొదలైన
సన్నివేశాలెన్నో ఈ కథలో అడుగడుగునా దర్శన మిస్తాయి. అయితే ఈ కథలో అంతర్లీనంగా పెంకుల మిల్లులు,
సిరామిక్సు మిల్లులు, సగ్గు బియ్యం మిల్లుల గూర్చిన ప్రస్తావన ఉంది. అంటే గ్రామాల్లో కులవృత్తులు
వదిలేసి వ్యాపార ప్రభావంలో పడిపోయిన ప్రజలు ఈ కథలో కన్పిస్తారు. ఈ కథలో రచయిత్రి చేసిన వర్ణన మేకలు, వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని
ప్రతిబింబిస్తుంది. "ఎవడైనా పేణం ఉన్న జీవాలమ్ముకుని పేణం లేని మిల్లు
కొనుక్కుంటాడంట్రా"? (4) అన్న కథా నాయకుడి నాన్నమ్మ మాటల్లో ఎంతో జీవితసత్యం ఉంది.
రచయిత్రి శైలిని, కథలో తాను లీనమైన స్థితిని తెలియజేసే వర్ణన "తూరుపున మేకపాలు ఒలక
బోసినట్టుంది". (5) ఉదయాన్నే సూర్యుని రాక కంటే ముందే వచ్చే కాంతి నేలంతా పరిచినప్పుడు
వెలువడిన వెలుగు మేకపాల వెలుగుతో పోల్చటం వరలక్ష్మి గారి ప్రతిభకు అద్దం పడుతుంది. మేక పాలతో బెల్లం
వేసి కాఫీ కాయటం, మేకపాలతో పరమాన్నం చేయడం వంటిది ఎంతో బలవర్ధకమైన ఆహారంగా, రుచికరమైనవిగా చెప్పిన తీరు
పాఠకులకు ఆరోగ్య సూత్రాలను వల్లె వేసినట్లుగా ఉంది. ఇంకా ఈ కథలో అడుగడుగునా అనేక సామెతలు, నీతి సూత్రాలు
కన్పిస్తాయి. కుల బలం అనేది ఒక వ్యక్తి పతనావస్థలో ఎంత సహాయకారిగా ఉంటుందో తెలియజేస్తుంది. 1.7 "మాయిముంత" కథను రచించినది పెద్దింటి అశోక్ కుమార్. ఇది ఒక గొంగి
బర్రెకు సంబంధించిన కథ. పొద్దులు నిండిన బర్రె ఇంటికి వస్తే "ఇది మనది. కాదు" అని తరిమికొడుతున్న భర్తను
వారించి "ఆగు... రొండ్లు గుంజినయి. మక్కులు జారినయి. తినుకుతుంది. పుట్టు నొప్పుల కుట్లు నీకేం
తెలుసు" (6) అని రాత్రంతా జాగారం చేసి గొంగి బర్రెకు పురుడు పోసి పంపిన స్త్రీ మూర్తి
సాయమ్మ కథ అంతరంగా దర్శనమిస్తుంది. మరో కథ మాతృత్వాన్ని మరింత ప్రతీకాత్మకరగా వర్ణించిన ఏండ్ల పిల్లికూన ఇది
ఒక పిల్లి కథ కాళ్ల చుట్టు వేళ్ల చుట్టు తిరిగి కడుపు నింపుకొని ఏ అటక మీదనో రహస్యంగా పురుడు పోసుకొని
పిల్లలను నోటిలో కరుచుకొని అర్ద రాత్రి పూట ఇల్లిల్లూ తిరిగే ఓ పిల్లి కథ ఓ తల్లి కథ. ఎవరూ చూడని చూసినా
గుర్తించని గుర్తించినా కథలుగా మలుచని అరుదైన అంశాలను కథులుగా తీసుకోవడం పెద్దింటి అశోక్ కుమార్
ప్రత్యేకత. ఇందులో పేరుకు కథంతా సారల పిల్లిదే అయినా సమాంతరంగా ఒక స్త్రీ కథ నడుస్తుంది. ప్రధానంగా ఒక
కథ చెప్పినా అంతరంగా మరో కథను నడిపించడం రచయిత నేర్చును తెలుపుతుంది. సంక్లిష్టమైన కథాంశాన్ని
సరికొత్తశిల్పంతో రచయిత అత్యంత నైపుణ్యంగా, సరళ సులభంగా వ్యక్తీకరించారు. పిల్లి తాను పురుడు పోసుకున్న తర్వాత పడే అవస్థను రచయిత తెలిపారు.
"ఓ వైపు ఆకలిగా ఉంది. అంతకుమించి అలసటగా ఉంది. లేవలేక అలాగే పడుకుంది. మత్తుగా నిద్ర పట్టింది.
మెలకువ వచ్చే సరికి పొద్దు నడినెత్తి మీదికి వచ్చింది. పిల్లలు నిద్రపోతున్నారు. ఆకలికి తాళలేక
పిల్లలు కదిలించ కుండా లేచింది. చుట్టూ చూసింది. తినడానికి ఏమీ లేదు." (8) పురుడు తర్వాత
మురికనక, దుర్గంధమనక, నొప్పులనక, ఆకలనక పిల్లి తన పిల్లలకు చేసే సపర్యలు చేస్తుంది. తనకు కడుపు చేసిన మగ
పిల్లులే శత్రువులై పిల్లల మీద దాడి చేసి చంపి తినాలని చూస్తుంటే అదే జాతికి చెందిన తల్లి పిల్లి
ప్రాణాలకు ఒట్టి అజ్ఞాతంగా ఏడిండ్లు తిరిగడం, పిల్లలను దాచిపెట్టడం, తావులు, మార్చడం, కాపలా కాయడం..
కడుపు మార్చుకోవడం, తల్లడిల్లడం వంటి గోసను అనుభవిస్తుంది. ఇవన్నింటినీ చూసి, పసిగట్టి, పిల్లి
వెంట తిరిగి, మనని తిప్పి, కథ వెనుక నడుస్తున్నట్టుగానే రచయిత చూపుతారు. అమ్మదనమంటే కమ్మదనమే కాదు
చెమ్మతనము. అందులోనూ దిమ్మ తిరిగే తనముందని మాతృ మూర్తులే గుర్తించని మాతృత్వపు హింసను విభిన్న
దృక్కోణాల నుంచీ రచయిత వివరించారు. ఇక మూడో కథకు పెద్దింటి అశోక్ కుమార్ కోడి పెట్టను ఎంపిక చేసుకొన్నారు.
పుంజు కోడికి ఉండే యవ్వనం, జులాయి తనం ఎంత అపారమో కోడిపెట్టకు ఉండే చైతన్యం శీలత్వం అంత అమోఘం అటు గొంగి
బర్రెకు ఇటు సారల పిల్లికి ఆ మాట కొస్తే మనుషులకు కూడా లేని బాధ్యత, చైతన్య శీలత కోడికి ఉంటుంది. కోడికి
పురిటి నొప్పుల బాధ లేక పోవచ్చు. ప్రసవ వేదన తెలియక పోవచ్చు. కాని మాతృ వేదన, మాతృత్వం అందరి కంటే
ఎక్కువ తెలుసుని ఈ కథ చదివిన తర్వాత గుర్తిస్తారు. బర్రె దుడ్డెను కనే ముందు.. పిల్లి
పిల్లలను కనే ముందు వేదనను అనుభవిస్తాయి. కన్న తర్వాత వెంట తిప్పుకుంటాయి కాని కోడి గుడ్లను పొదగడం
నుంచి పిల్లలను ఎడబాసే వరకు నిష్టతో, విబద్ధతతో చేస్తున్న చతుర్విద ప్రక్రియలు కథలో చదువుతుంటే అదే మన
ఇంటి ముందు ఉండే కోడి ఇంత గొప్పదా అనిపిస్తుంది. ముందే చెప్పినట్టు చెప్పేది కోడి అయినా అశోక్ కుమార్
అంతర్లీనంగా మనిషి కథనే నడిపించారు. నేటి సమాజాన్నే ప్రశ్నించే విధంగా పిల్లల పెంపకం మీద తల్లిదండ్రులు,
గురువులు అనుసరించ వలసిన బాధ్యతను గుర్తు చేశారు. నిర్మాణాత్మక వ్యవస్థను సూచించారు. కోడిపెట్ట జీవన
వైవిధ్యాన్ని అద్భుతంగా తెలియజేశారు. అతి సహజంగా పిల్లలను వెంట బెట్టుకొని ఇరవై ఒక రోజు తర్వాత బయటకు వచ్చిన
తల్లి కోడి.. పిల్లలను విడిచి ఎక్కడికి పారిపోదు. మనుషులైతే వ్యవస్థ అని, సమాజం అని, కట్టుబాట్లు అని
చెప్పుకొంటారు. ఇవేవి ఎదుర్కోని కోడి తన పిల్లలను కూడా తన దగ్గరనే అంటి పెట్టుకొని సాము చేస్తుంది.
లోకంలో ఎలా జీవించాలో తన బిడ్డలకు నేర్పిస్తూ "అదంతే బిడ్డా... లోకం తీరు. చిన్న జాతిని పెద్ద
జాతి, బలహీనుల్ని బలవంతుడు మింగుతాడు. మనకింకా చాలా మంది పగదారున్నరు చూపిస్త. జాకొండ్రి అనంగనే
మీరు జాక్కోవాలె. రెప్పల కింద నుండి బయటకు రావద్దు." (9) అని బొట్ల కోడి పెట్ట జాగ్రత్తలు
చెబుతుంది. ముందుగా ఇంట్లో.. తర్వాత బయట పిల్లలకు తవ్వి చూపించి తప్పడం, బుక్కి చూపించి బుక్కడం. ఎగిరి
చూపించి ఎగరడం.. పిల్లి వస్తే దాక్కోవడం, గద్ద కనిపిస్తే ఒరిగి పోవడం. పాము కనిపిస్తే అరిపడం, కుక్కతో
ఎదురొడ్డి పోరాడటం వంటి సన్నివేశాలను అత్యంత సున్నితంగా చిత్రించిన అశోక్ కుమార్ కోడి వెంట మనలను...
ఇండ్లు, వాకిండ్లు, పేరడ్లు తిప్పుతారు. అత్యంత ఒద్దికగా తల్లిలోని గురువును చూపుతారు. 2. పక్షిజాతి కథలు: 2.1. "చివరి పిచ్చుక" అనే కథను పాపినేని శివశంకర్ రచించారు. ఈ కథ
పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులను వర్ణిస్తుంది. కలుషిత రసాయనిక మందుల వల్ల కొన్ని రకాలైన పక్షులు
ఏవిధంగా అంతరించి పోతున్నాయో తెలుపుతుంది. పూర్తిగా పర్యావరణ కోణంలోంచి వచ్చిన జీవవైవిధ్యాన్ని తెలిపే
కథ చివరి పిచ్చుక. సాగుబడి తక్కువవుతున్న తరుణంలో పంట నేల మీద ఆధారపడి గింజలను తినే పక్షులు కూడా
ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నాయి. అటువంటి సమయలలో కొన్ని పక్షులు దూర ప్రాంతాలకు వలసలు పోగా,
మరికొన్ని పక్షులకు గింజలు దొరుకక తనువులను చాలిస్తున్నాయి. వ్యవసాయంలో వస్తున్న మార్పులు, విప్లవాలు,
చట్టాలు, ఎరువులు, క్రిమికీటక సంహారకాలు పర్యావరణాన్ని అత్యంత దయనీయంగా దెబ్బతీశాయి. కృత్రిమ వనరుల పట్ల
ప్రకృతికి ఆకంటం కలుగుతుంది. ఈ విధంగా వ్యవసాయ భూమిలో విషాహారాన్ని తిన్న ఒక పిచ్చుక జీవన నేపథ్యాన్ని
కళ్ళకు కట్టినట్టు చెప్పిన కథ చివరి పిచ్చుక అతి చిన్న ప్రాణం గల పిచ్చుక ఇంతటి పెద్ద విషపు ప్రపంచంలో
బతుకలేని తనువును చాలించిన వైనం చాలా స్పష్టంగా తెలియజేశారు. 3. పర్యావరణ కథలు: 3.1 నేడు భూమంతా రియల్ ఎస్టేట్ గా మారిపోతుంది. పల్లెలను, పట్టణాలనకా
చివరికి వ్యవసాయ భూమి అనక రియల్ ఎస్టేట్ క్రిందికి చేరిపోతుంది. దీనిద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు
కనక వర్గంలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పల్లెల్లో ఉండే చెరువులు కూడా ప్లాట్లుగా మారి
వ్యాపార భూమిగా చెలామణిలోకి వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యాన్ని తెలిపే కథ గంధం నాగరాజు రచించిన "చెరువు."
ఈ భూమి మీద ఒక్కో ఊరిని కాపాడటానికి ఒక్కో "చెరువు" వెలిసింది. "ఒక చెరువు
వెనుక ఎన్ని పంటచేలు, సాగుబడిలోకి వస్తున్నాయి. ఆ చెరువు మీద ఆధారపడి ఎన్ని జీవులు జీవిస్తున్నాయి. అసలు
ఎంత సంస్కృతి చెరువు వెనుక ఉంది" అనే అంశాలను కళ్ళకు కట్టినట్టు చెప్పిన కథ "చెరువు" చెరువులోని నీళ్ళను ఏడాదంతా కాపాడి, వాటిని గ్రామాలన్నింటికి సమంగా సంచి
పంటలను పుష్కలంగా పండించుకొనే విధంగా సహకరించే నీరటికి చెరువు మాయమవడంతో గుండె చెరువవడం ఈ కథలో హృద్యంగా
చూపబడింది. ఒక చెరువుపోతే దాని వెంట ఎంతటి సంస్కృతి మాయమవుతుందో, ఎంతటి అసమతుల్యత తలెత్తుతుందో
తెలియజెప్పిన కథ ఇది. 3.2. పెద్దింటి అశోక్ కుమార్ రచించిన కథ "పేగుముడి" ఇది కూడా పర్యావరణంలో
జరుగుతున్న దోపిడీ వాతావరణ పరిణామాలకు ఏ విధంగా కారణమవుతుందో తెలిపే కథ. ఈ కథ కూడా నీటికథ. ఊరి జనానికి
కన్నీటిని అందిస్తున్న నేటి పరిస్థితులను దిశమరిచి చెప్పిన కథ దొంగవ్యాపారుల వల్ల వాగులో ఇసుక మాయమయితే
దానివెంట ఎంత పర్యావరణం విధ్వంసం అవుతుందో, వాగు ఒరుసులకు ఆనుకొని ఉన్న జీవులలో సమస్యలు ఎలా
ఉత్పన్నమవుతున్నాయో తెలియజెప్పే కథ "చెరువు". 3.3 "భూనిర్వాసితులు" రచించింది పిచంద్. పర్యావరణంలో ఏర్పడుతున్న
సమస్యల్లోంచి పుట్టిన కథ ఇది. కార్మిక, గిరిజన రైతాంగ కథలు రాసిన పి.చంద్ "భూనిర్వాసితులు" లాంటి
సింగిల్ కాన్సెప్ట్ తో కథా సంకలనం వెలువరించారు. ఈ కథల్లో సింగరేణి బొగ్గు గనుల వల్ల, సిమెంటు
ఫ్యాక్టరీల వల్ల సమాజంలో గ్రామీణ, జీవితాల్లో, ప్రకృతిలో పర్యావరణంలో వస్తున్న మార్పులను, అదే స్థాయిలో
సంభవించిన పరిణామాలను చేసిన అంశాలు కనిపిస్తాయి. గోదావరిఖని ఓపెన్ కాస్ట్: బొగ్గుగని ప్రాంతంలోని
పరిణామాలను ప్రత్యేకంగా చిత్రించిన కథలు ఇవి. ఇందులో "జగితి" బొగ్గు కోసం బ్లాస్టు చేసే కృత్రిమ భూకంపాల
మధ్య ఆ ప్రాంత ప్రజలు ఏవిధంగా బలి అవుతున్నారో తెలియజేయబడింది. బొగ్గు బావులు తవ్వినాక పర్యావరణంలో ఏర్పడిన కాలుష్యం, రోగాలు, వాతావరణ
మార్పులు "భూనిర్వా సితులు" కథలు తెలియజేశాయి. రైతులు తమ భూములు కోల్పోయి కూలీ దొరకక పడుతున్న బాధలు
ఇందులో కనిపిస్తాయి. భూమంతా ప్రభుత్వపరమై బొగ్గు బావులను కొనుగోలు చేయడం వల్ల వ్యవసాయ భూములన్నీ
నిస్సారమైపోయాయి. జీవలక్షణాలను కోల్పోతున్నాయి. ఈ విధంగా పారిశ్రామిక ప్రాంతం కోసం భూములను కొనుగోలు
చేయడం వల్ల ఉపాధిని కోల్పోయిన పల్లె ప్రజలు అత్యంత దారిద్య్ర స్థితిలో తమ జీవితాలను గడుపుతున్నారు. 3.4 ముదిగంటి రచించిన "మింగుతున్న పట్నం, వ్యాపార మృగం" కథలు పర్యావరణానికి
సంబంధించినవి. నిజంగా కళ్ళముందు జరిగే జీవితాలను చూసి స్పందించి రాసిన కథలు "మింగుతున్న పట్నం"లో
ఉన్నాయి. సామాజిక రాజకీయ పరిణామాలు తత్ఫలితంగా జనుల జీవితాల్లో వచ్చే ప్రకంపనాలు మానవునిలో మానవత్వం
నశించడానికి దారి తీస్తున్నాయి. పారి శ్రామీకరణం వల్ల ఫ్యాక్టరీళ్ళలో తయారైన వస్తుజాలంతో బహుళ జాతి
సంస్థల మార్కెటు రంగ ప్రవేశం జరిగింది. దీనితో దేశీయమైన విజ్ఞానం కళా నైపుణ్యాలు నశిస్తున్నాయి. కళా
సౌందర్యాన్ని ప్రదర్శించే కులవృత్తుల వస్తువులకు మనుగడ లేకుండా పోయింది. ఈ కథల సంపుటిలో ఎక్కువగా
ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు భూసేకరణలు, భూమి ఆక్రమణలు చేసే కథలున్నాయి. కాబట్టి 'మింగుతున్న పట్నం' పేరు
సార్థకంగా ఉంది. రాతి విగ్రహాలకు పాలు తాగించే పట్టణవాసులు, పక్కనే శిశువుకు కాసిన్ని పాలు కూడా
పోయకపోవడం, తద్వారా మనుషుల నిర్ధాక్షిణ్యాన్ని ఎండగట్టడం, నగరీకరణ ప్రక్రియలల్లో 'భూమాఫియా'దే పైచేయి
కావడం, భూకబ్జాలకు పాల్పడే నాయకులు పేదల భూములను స్వాధీనం చేసుకొని ఆ ప్రదేశాల్లో సినిమా స్టూడియోలు,
రిసార్ట్స్ లు, విమానాశ్రయాలు కట్టడం, సినిమాల్లో విప్లవవాదాన్ని, అశ్లీలత దృశ్యాల ద్వారా నశిస్తున్న
మానవవిలువలను చిత్రించడం, నిరుద్యోగ యువకులు దారి తప్పి తల్లి దండ్రులకు పుత్రశోకాన్ని మిగల్చడం, రైతులు
ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడటం, నాటుసారా, నక్సల్ పోలీసుల చెలగాటాలు, స్నేహితుల
మధ్య మోసాలు ఇలా ఎన్నో సామాజికాంశాలు ఈ కథల్లో చిత్రీకరించబడ్డాయి. 4. ప్రకృతి కథలు: 4.1 ఓగేటి ఇందిరాదేవి రచించిన కథ "మామిడి చెట్టు ". ఇందులో దుర్గ మామిడి
చెట్టు మీద పెంచుకున్న మమకారాన్ని రచయిత్రి తెలియజేశారు. మానవ జీవనంలో సహభాగామై ఆహారంలో, ఆచారంలో సమ ప్రాధాన్యతను కలిగిన మామిడి
చెట్టును కొట్టివేయడం, తద్వారా వాతావరణంలో ఏర్పడ్డ అసమతుల్యతను రచయిత్రి వర్ణించారు. 4.2 సుంకోజు దేవేంద్రచారి రచించిన "కొమ్మి పూలు" కూడా ప్రకృతి సౌందర్యాన్ని
తెలిపే కథ. కొమ్మిపూల సువాసన ప్రకృతినంతా పలుకరిస్తుంది. ప్రకృతి శోభతో ఒక చక్కని జ్ఞాపకాన్ని
ఊహాలోకంలోకి తీసుకొనిపోయే ఒక చక్కని సన్నివేశం ఈ కథలో కన్పిస్తుంది. 5. కొండజాతి కథలు : 5.1. సాహు రచించిన కథ "రక్తపింజెర". నాగరికత పెరుగుతుంటే పల్లెలు
పట్టణాలుగా విస్తరిస్తుంటే కొండలను, గుట్టలను ఆనుకొని జీవించే స్వచ్చమైన మనుష్యులు నాగరికతలో ఇమడలేక తమ
తమ తావులను వెతుక్కుంటూ మరింతగా అడవుల్లోకి వెళ్ళిపోయారు. సాహు (శనిగరం వెంకటేశ్వర్లు) కూడా ప్రసిద్ధి
పొందిన విప్లవకారుడు. సాహు గోండు భాషను నేర్చుకొని, గోండులతో జీవించి, వారి జీవన విధానాన్ని,
ఆచారవ్యవహారాలను అక్షరబద్దం చేశాడు. "రక్తపింజెర" లో స్వచ్ఛమైన గిరిజన జీవితాల్లో నాగరికులు ప్రవేశించి
అక్కడి వనరులను పంటలను దోచుకునే వైనం కనిపి స్తుంది. గోండులు దుర్భరమైన దారిద్ర్యంతో చేసే పోరాటం,
కాలంతో, ప్రకృతితో, ఆకలి దప్పులతో చేసే సమరం ఈ కథలో కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శింప బడింది. అదే కోణంలో
గోండుల మీద సూపర్ వైజర్లు, కాంట్రాక్టర్ల దౌర్జన్నాన్ని స్పష్టంగా వర్ణించారు. "రక్తపింజెర" కథలో
"శిడాంశితృ, ముల్కుబాయి" అనే గోండు దంపతుల జీవనశైలి తెలుపుతూనే, చుట్టూ గోండు జాతి జీవన పరిస్థితులు
కూడా వివరించారు. బొంగుల పనికి పోయి, అక్కడి బొంగుల సూపర్ వైజర్ అనేక అవస్థలు పడుతారు. బొంగుల పనిచేసి
తన భార్య ముల్కుబాయికి చీర కొనిపెట్టాలని చూస్తారు శిడాంశితృ. నాగరిక వస్తువులు అపుడపుడే అడవుల్లోకి,
కొండల్లోకి వచ్చి అన్నెం పుణ్యం తెలియని అమాయక ప్రజల మీద ఆకర్షణను చూపుతుంటాయి. దీనిని ఆసరాగా చేసుకొని
సూపర్ వైజర్లు, కాంట్రాక్టర్లు చేస్తున్న మోసం, శ్రమ దోపిడి ఈ కథలో చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే బొంగుల
పని చేస్తున్న వారిలో ముల్కుబాయిని "రక్తపింజెర" కాటువేస్తుంది. గోండులు తమకు తెలిసిన మందులు వేశారు.
గానీ ముల్కుబాయి ప్రాణాలు నిలువలేదు. నాసిరకం మందుల వల్ల పాముకాటుకు సరియైన చికిత్స జరుగలేదని తర్వాత
తెలుస్తుంది. సూపర్ వైజర్లు, కాంట్రాక్టర్లు పని చేయించుకొని వారి వారి జీతాలలో కోతలు
పెట్టేవారు. ఎదురించిన గోండువారిమీద అన్యాయంగా పోలీసు స్టేషనుకు పంపించేవారు. అనేకరకాలుగా కష్టాలను
ఎదుర్కోవడం, వారిపై నాగరికులు దౌర్జన్యం చేయడం అనేది గోండుజాతి వారిపై, వారి జీవితాల్లో గల విషమ
పరిస్థితిని ఈ కథ తెలుపుతుంది. 5.2. "కొండ ఫలం" అనే కథను వాడ్రేవు వీరలక్ష్మి దేవి రచించారు. ఈ కథలో
గిరిజన జీవితాలను ప్రభావితం చేసే కొండ ప్రాంతాలను, అక్కడి వాతావరణ పరిస్థితులను తెలియజేశారు. ప్రకృతిలో
వస్తున్న మార్పులు, వాటిని ఆసరాగా చేసుకొని ధౌర్జన్యం సృష్టించే స్వార్థపరులను గూర్చి ఈ కథ తెలుపుతుంది.
కొండ ప్రాంతాలు తమ జీవన స్థితిని ఏ విధంగా కోల్పోతున్నాయో, వాటిని ఆధారంగా చేసుకొని జీవనం సాగించే
జంతుజాలం, వృక్షజాలం, గిరిజన ప్రాంత జనులు ఏ విధంగా జీవితాలను కోల్పోతున్నారో "కొండఫలం" కథలో
దర్శనమవుతుంది. ముగింపు: తెలుగు కథల్లో జీవవైవిధ్యం ప్రతిఫలిస్తుంది. జంతుజాతికి, పక్షిజాతికి,
వృక్షజాతికి, పర్యావరణానికి, ప్రకృతికి, కొండజాతికి సంబంధించిన కథలను, వాటిలో జీవవైవిధ్య పరిస్థితులను
విశ్లేషించవచ్చు. జీవవైవిధ్యాన్ని సంరక్షించే ధోరణి తెలుగు కథ ద్వారా కూడా పరోక్షంగా ఉపదేశింపబడటం అనేది
నేటి కాల పరిస్థితులకు తప్పక అస్తిత్వ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఇంతవరకూ తెలుగుకథ మనిషి
చుట్టూ, మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే అనేది అంశాల చుట్టూ తిరిగింది. మనిషి, మనిషి చట్టూ ఆవహించి
ఉన్న జీవావరణం మీద తెలుగుకథ పూర్తి ప్రభావాన్ని కలిగి ఉంది. పర్యావరణంలో కలిగే అనేక పరిణామాలను
విశ్లేషించింది. అనేక నూతనాం శాలను ఆవిష్కరించింది. తెలుగు కథలో ప్రదర్శింపబడే మానవ జీవన శైలిలో జీవ
వైవిధ్యం భాగం అధికమే అని చెప్పవచ్చు. కాని ఇప్పటి వరకు తెలుగు కథ మీద జరిగిన పరిశోధనలన్నీ మానవ
విలువలకు, మానవ సంబంధాలకు సంబంధించినది. కథా నిర్మాణ సూత్రం ఆధారం గా వస్తువు, శిల్పం, పాత్రలు,
సంఘటనలు, శైలి, స్వరూప స్వభావాలను వర్ణించాయి. జీవావరణం ప్రయోజనం కోసం తెలుగు కథల్లో గల జీవ
వైవిధ్యాన్ని అనుశీలించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఈ వ్యాసం అందుకు కొంతైనా ఉపకరిస్తుందని
భావిస్తున్నాను. ఉపయుక్తగ్రంథసూచి:
ఒక నోరు లేని ప్రాణితో పెనవేసుకొన్న బంధాన్ని గుండె తడితో
చెప్పిన కథ "ముంగిస". కథలో "ముంగిస" యొక్క అలవాట్లు, మనుషులతో ఇది కలిసిపోయిన వైనం, దాని జీవన శైలి
గూర్చి చక్కగా చిత్రించబడింది. బయ్యన్న మరణం, మరణానికి కారణమైన వ్యక్తులు, బయ్యన్న మీద మోపబడిన నేరం
కథలో చక్కగా ఇమిడి పోయింది. ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది. ప్రాణి కోటి ఒకదానితో మరొకటి చదువులో ఎలా
ప్రవర్తిస్తాయో నోరు లేని ప్రాణులకు కూడా నీతి, నియమం, స్పందన, ప్రేమ, ఆరాదన ఎలా ఉంటాయో చూపిన కథ ఇది.
కానుపు కష్టమై బర్రె ఆయాస పడుతుంటే సాయమ్మ హృదయం మరింత
కరిగిపోయింది. గొంగి బర్రెతో పాటు సాయమ్మ కూడా బాధను అనుభవించింది. సపర్యలు చేసింది. బర్రె ఈనిన తర్వాత
దూడను నాకడం, అంత నొప్పులతోనూ చనిరొమ్ము అందించడం, కదలలేని దూడకు అనుకూలంగా తనే కదలడం. ముక్కు మీది
కండ్ల మీది ముర్రును నాలుకతో నాకి శుభ్రం చేయడం చూసిన సాయమ్మ - "చూసిననా తల్లి తండ్లాట. ఎన్ని
జేస్తే పిల్లలు పెరుగుతరు. ఈ పనులన్నీ దీనికి ఎవలు జెప్పిండ్రు. నేను నా పిల్లలను ఇట్లనే పెంచిన
కదా! ఇప్పుడు నాకు వాళ్లే శత్రువులైరి" (7) అని బాధ పడుతుంది. పురిటి నొప్పుల సహజ శీలతను
గొంగి బర్రెలో వర్ణించడం సహజ పరిశీలన వల్ల సాధ్యమవుతుందేమో గానీ సాయమ్మలో వర్ణించడం ఒక పురుషుడికి
కష్టసాధ్యమైన విషయం. కాని అమ్మతనాన్ని ఆత్మావలోకనం చేసుకొన్న పెద్దింటి అశోక్ కుమార్ అణుమాత్రం కూడా
తేడా. లేకుండా కథకు అత్యంత సహజ శీలతను చేకూర్చారు.
భూమిని గుల్లగ చేసే వానపాములు రైతు నేస్తాలు. వానపాములను ఏరుకొని తినే
పిట్టలు రైతు నేస్తాలు. పొలాల్లో శ్రమికీటకాలను ఏరుకొని తినే పీతలు, కప్పలు రైతు నేస్తాలే ఈ సమస్త
జీవులు వ్యవసాయంలో విషం చిమ్మనంత వరకు క్షేమంగా ఉన్నాయి. సారవంతమైన సహజ ఎరువులను పక్కన పెట్టి రైతు
ఎప్పుడైతే ప్రాణాంతక క్రిమి సంహారకాలను వాడటం మొదలు పెట్టాడో అప్పుడు వానపాములు, వానపాములను తిన్నే
పిచ్చుకలు కనుమరుగైపోయాయి.
"పండుగొచ్చిందంటే తోరణాలకి మామిడి
ఆకులు కావాలని చాలా మంది వచ్చేవారు. దొడ్లో పెద్ద చెట్లు, వాకిట్లో పూలమొక్కలూ వుండేవి. వాటిని
ప్రాణంగా - సొంత పిల్లల్లా చూసుకునేది దుర్గ. జామపళ్ళు అమృతఫలాల్లా వుండేవి. అతి తియ్యగా, ఎంతమందికి
పంచినా మిగిలిపోతుండేవి. మామిడికాయలు. పచ్చడికి పళ్ళకీ కూడా బావుండేవి - చుట్టూ పక్కల వాళ్ళకీ
చుట్టాలకీ పంపించేది దుర్గ. తొక్కుడు పచ్చడి, ముక్కలపచ్చడి. అవకా మాగాయ, మెంతికాయ వరుగులు అంటూ
రకరకాల పచ్చళ్ళు పెట్టేది. కొన్నికాయలు పండేసేది. పిల్లలు నలుగురూ ఎండాకాలంలో వచ్చి నెల రోజులుండి
పచ్చళ్ళు. పట్టుకుపోయేవాళ్ళు. మామిడి చెట్టుకింద మంచం వేసుకొని పడుకునేవాళ్ళం అంతా - మామిడిచెట్టు
కొట్టేస్తున్నారు అన్న ఆ రోజు మాకు సయించలేదు. విరగకాచి మహలక్ష్మిలా అన్న కళకళలాడే ఆ చెట్టువుండదు
ఇంక -మామిడిచెట్టు కొట్టేశాక ఇదివరకు మా ఆవు చచ్చిపోతే ఏడ్చినట్లు ఏడ్చింది దుర్గ".(10)
పాదసూచికలు:
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.