headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

10. శ్రీకాళహస్తీశ్వరశతకం: సామాజికభూమిక

dr_k_ravibabu
డా. కొల్లేటి రవిబాబు

సీనియర్ ఫెలో
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, భారతీయభాషాసంస్థ,
నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9494398884. Email: kolletiravi@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఇతర భాషలలో లేని విధంగా శతకాలలో పద్యాలకు మకుటం ఉండటం, సంఖ్యా నియమంతో పాటుగా పద్యాలన్నీ ఒకే ఛందస్సుకు చెంది ఉండే నియమం ఉండటం అనేవి ఈ ప్రక్రియ బాహ్యలక్షణాలు. శతకాలలో వైవిధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ మానవ సమాజాన్ని మానవ మనస్తత్వాన్ని వస్తువుగా తీసుకోడం, భక్తి, నీతి, వైరాగ్యం, శృంగారం ఈ ప్రక్రియ ఆంతర లక్షణం. వీటిలో ప్రధానంగా భక్తి, నీతి శతకాలే సర్వజనాభిమానం పొందాయి. అంతటి విశిష్టత కలిగిన శతకాలలో ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం ఒకటి. ఈ శతకంలో భక్తి, సమాజం, మానవ మనస్తత్వం అనే గుణాల సామాజిక దృక్పథాన్ని పరిచయం చేయడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.

Keywords: శైవభక్తి, ఆత్మాశ్రయం, రాజనింద, వైరాగ్యం, సామాజికం, రాజరికం, ఆర్థికాంశాలు

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్యంలో శతకానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శతకం మల్లికార్జున పండితుని శివతత్వసారంతో స్థిరరూపం పొంది ఒక ప్రక్రియగా అభివృద్ధి చెందింది. ఈ ప్రక్రియ “సంస్కృత ప్రాకృత భాషలలోని శతకమే తెలుగులో కొన్ని విశిష్ట లక్షణములతో అవతరించింది. కానీ కొందరు విమర్శకులు ఊహించినట్లు శతకము దేశీకవితా శాఖకు పూచిన పూవు కాదు” అని డా. కె గోపాలకృష్ణారావు శతక సాహిత్య పుట్టుక గురించి ‘శతక సాహిత్య వికాసము’లో వివరించారు.

2. శ్రీకాళహస్తీశ్వర శతకం

భక్తి శతకాలలో విశిష్టమైనది శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతకాన్ని ధూర్జటి రచించారు. శ్రీకృష్ణదేవరాయుల ఆస్థాన కవులలో దూర్జటి ముఖ్యులు. రాయల వారి కాలం ప్రబంధ సాహిత్యానికి స్వర్ణ యుగంగా పిలువబడుతుంది. ఆ ప్రబంధాలకి తీసిపోని విధంగా శతకానికి గౌరవం కలిగేటట్లు  శ్రీకాళ హస్తీశ్వరశతకం రాసి  ప్రజలకు దగ్గరైన  గొప్పకవి ధూర్జటి.

సాహిత్య స్పృహతో పాటు సమకాలీన సామాజిక స్పృహ వీరి రచనలలో ఉండటం వలన ధూర్జటి తెలుగు కవులలో ఒక విశిష్ట వ్యక్తిత్వం ఉన్న కవిగా ప్రాచుర్యం పొందాడు. వీరు రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో మొత్తం 116 పద్యాలున్నాయి. దీనిలో  శైవ భక్తి,  ఆత్మాశ్రయ భావన, రాజనిందతో పాటు వైరాగ్య భావాలకు సంబంధించిన ఎన్నో పద్యాలను రాశాడు.  ధూర్జటి తనను తాను ఆత్మ పరిశీలనం చేసుకున్న విధానం, తాను అనుభవించిన బాధలను, భయాలను, కోరికలను, తన ఇష్ట దైవం అయిన పరమేశ్వరుడికి నివేదించుకున్నాడు. అంతే కాకుండా  నిర్భయంగా రాజులని నిరసించిన తీరు, సాంసారిక జీవితం పట్ల విముఖతని ప్రకటించడం వంటివి ఈ శతకంలో ఉన్న ముఖ్య  విశేషాలు.

3. సామాజిక అంశాలు

శతకాలకు  సమాజం వస్తువు కావడం చేత శతక సాహిత్యంలో లెక్కకు మించి సాంఘిక విషయాలు వెల్లడి అవుతుంది. శతకాలలో కవులు వ్యక్తిగతంగా తాము అనుభవించిన కష్టనష్టాలను, వ్యక్తుల గుణశీలాదులను, సామాన్యీకరించి వర్ణించడం కనిపిస్తోంది. సమాజంలోను ఉన్న లోపాలను అధిక్షేపాత్మకంగానూ ఉపమానాలతో వర్ణించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ విధంగా సామాజికాంశాలు ఇతివృత్తంగా వచ్చిన శతకాలలో ప్రముఖంగా పేర్కొనదగినది ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతక రచనకు భూమికగా ఉన్న సామాజిక కాంశాలను సాంఘికం, రాచరికం, భక్తితత్వం అనే మూడు ప్రత్యేక విశేషాలుగా వింగడించి చూపవచ్చు.

సమాజంలో కొందరు, కొడుకులు పుట్టలేదని దుఃఖిస్తారు. కానిధృతరాష్ట్రునికి వందమంది కొడుకులు పుట్టినప్పటికీ ఏవిధమైన లాభం కలిగింది? వారి వల్ల తల్లిదండ్రులకు సద్గతులు కలుగలేదు. కొడుకులు లేకపోయినా శుకయోగీంద్రునకు దుర్గతులు కలుగలేదుకదా! కొడుకులులేక పోయినాజ్ఞాని అయితే ముక్తి పొందుతాడు. అని 'కొడుకుల్ పుట్టరటంచు..' (28) అనే పద్యంలో ధూర్జటి వివరించాడు. మానవుడు కోరికలతో ఎప్పుడూ లౌకిక జీవితాన్నే గడుపుతాడని (32) మనుష్యులు చనిపోతున్నప్పుడు కూడా బ్రతకడానికే ప్రయత్నిస్తారని (34) సమాజ స్వభావాన్ని ధూర్జటి చిత్రించాడు. సమాజంలో వ్యక్తుల మధ్య ఎక్కువ తక్కువలకు కులంతోపాటు ధనం కూడా కారణం అని ఈ శతకంలో పేర్కొన్నాడు.

ధూర్జటి అనేక స్త్రీ భోగాలు అనుభవించడం, పడతుల కొన గొల్ల వలన శరీరం కాయలు కాచిందని, శృంగార విలాసాల వలన యుక్త వయస్సు అయిపోయిందని, తల బట్ట కట్టిందని సంసార జీవితంపై రోత కలిగిందని ఈ బందాలనుండి ముక్తి ప్రసాదించమని అప్పటి సాంస్కృతిక సమాజ స్వరూపాన్ని ... ... ...

శా. కాయల్గాచె వధూ నఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్
రాయన్ ఱాపడె ఱోమ్ము,  మన్మథవిహారక్లేశ విబ్రాంతిచే,
బ్రాయంబాయెను,  బట్టగట్టె దల, చెప్పన్ రోత సంసారమే
జేయాంజాల విరక్తు జేయ గదవే శ్రీకాళహస్తీశ్వరా! (శ్రీ. కా. శ.14) అనే పద్యంలో తెలియజేస్తూ శివుడ్ని వేడుకన్నాడు


3.1 పండితులపైవిరక్తి:

“విద్య లేనివాడు వింత పశువు” అనేది లోకంలో రూఢి. కానీ ధూర్జటి దీనికి వ్యతిరేకంగా విద్య లేకపోయిన మోక్షాన్ని పొందవచ్చు అనే విషయాన్ని ఇలా చెప్తున్నాడు. సాలెపురుగు ఏ వేదాలు "చదివింది? పాము ఏ శాస్త్రాలను వల్లె వేసింది? ఏనుగు ఏ విద్యను అభ్యసించింది? ఎరుకలవాడైన తిన్నడు ఏ మంత్రాన్ని జపించాడు? వీరెవరు ఏ చదువులు నేర్వలేదు కానీ మోక్షాన్ని పొందారు. కాబట్టి శివునిలో ఐక్యం కావాలంటే చదువులు కన్నా భక్తి ముఖ్యం. అని ధూర్జటి కింది పద్యంలో తెల్పాడు.

శా. ఏ వేదంబుఁబరించెలూత భుజగంబే శాస్త్రముల్ చూచెఁదా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి, చెంచే మంత్రమూహించె, బో
శ్రీవిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ పాదసం.
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా! (శ్రీ కా. శ. 13)

దీనిని బట్టి చదువు లేకపోతేనే ముక్తి వస్తుందని కాదు అర్థం. ధూర్జటి చదువుకున్నవారైన. చదువులేని వారైనా, ఆ పరమేశునిపై భక్తి ఉన్న వారందరికీ ముక్తి లభిస్తుందని చెప్పాడు.

మ. చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్ వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్ దప్పి వర్తింపగా మదన క్రోధకిరాతులందుఁగని భీమద్రాడి వేధాఁకినం జెదరన్ జిత్తము చిత్తగింపఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! (శ్రీ కా. శ. 70)

ఈ పద్యంలో చదువుకున్నవారు అందరని కాకుండా కొందరని మాత్రమే పండతాధములు  అన్నాడు. వీళ్ళు సభలలో చెప్పే మాటలకు నిజమేదో అబద్దమేదో తెలుసుకోలేక తికమకలో ఉన్నాను. కాబట్టి ఈ దయనీయస్థితిని తొలగింపుమని వేడుకొన్నాడు

3.2 రాచరిక అంశాలు:

ఈ శతకంలో ధూర్జటి  ప్రత్యేక్షంగా ఎదుర్కొన్న రాచరిక వ్యవస్థ స్వరూపాన్ని , లోపాలను,  రాజులు వారి గుణాన్ని నిర్మొహమాటంగా ఇందులో తెలియజేశాడు. రాజులు నీతి మంతులు  కాకుండా ధనాశా పరులైతే సమాజం ఏవిధంగా  నశిస్తుంది. ప్రజా ధర్మాలు, వృత్తులు, ఉత్తములు మొదలైన వారు  నష్టపోతారో పేర్కొన్నాడు. రాజు అనే శబ్దం వినడానికే రోత కలిగిస్తుందని  వచ్చే జన్మలోనైనా ఆ శబ్దం వినపడకుండా చేయమని .. గ్రా జీవంబున  గాంచె  దుఖము, కురు రాజులను ప్రసత్తిస్తు పద్యాలు రాసి జీవితం గడిపే పండితులు, కొన్ని సందర్భాలలో రాజులు కొందరు కవులచేత తమపై పద్యాలు చెప్పించుకొని డబ్బ  ఈయ్యాకపోగా వారి సేవలు నరకం తో సమానమని ధూర్జటి పేర్కొన్నాడు. రాచరిక వ్యవస్థస్వరూపాన్ని వర్ణిస్తూదానిలోని లోపాలను ధూర్జటి తన శతకంలో.... ....

“రాజుల్ మత్తులు, వారిసేవ నరక ప్రాయంబు వారిచ్చు
నం భోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదులాత్మవ్యధా
బీజంబుల్ తదపే చాలుఁ బరితృప్తి బొందితిన్ జ్ఞానంల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా! ఎత్తిచూపాడు.(21,25,31,38, 39)

రాజులు గర్వాంధులు, వారిసేవ నరకయాతనతో సమానం. ఆ రాజు లిచ్చే స్త్రీలు, పల్లకీలు, గుఱ్ఱాలు, అలంకారాలు మొదలైనవి ఆత్మకు బాధ కలిగించేవి మాత్రమే. వాటిని ఇదివరకే అనుభవించాను. ఇంక అవేమీ నాకు వద్దు. కేవలం జ్ఞాన సంపదఫలమైన మోక్షాన్ని మాత్రమే ప్రసాదించు అని. రాజు ప్రభావం ఎక్కువగా సమాజంపై  ఉండాటాన్ని ఈ శతకం ద్వారా ధూర్జటి గుర్తించాడు. సాధారణంగా రాజు ధనాశ పరుడైతే సమాజంలో ధర్మం నశిస్తుందని, వర్ణాశ్రమ ధర్మాలు, వృత్తులు నశించడం, ఆశాంతి పెరగడం తో పాటుగా సమకాలీన సమాజానికి రాజు ఏవిధంగా బాధ్యత కలిగి ఉండాలో... ...

శా. రాజ రాజర్థా తురు డైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా
  నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
  పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
  రేజంబుల్ భజియింతురే తెఱగునన్? శ్రీకాళహస్తీశ్వరా! 22 అనే పద్యంలో వివరించాడు.

4. భక్తితత్వ అంశాలు:

శా. శ్రీ విద్యుత్కలితా జవంజవ మహాజీమూత పాపంబుధా
రా వేగంబువ మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణా శరత్సమయమింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! (శ్రీ. కా. శ. 1)

ఈ పద్యం లో ఈ సంసారం మహామేఘం. అందులో సంపదలుమెరుపుతీగలు. పాపమనే జడివాన
మబ్బుల నుండి కురుస్తున్నది. ఆ వర్షంలో నా హృదయం  తడచి వివేకాన్ని కోల్పోయింది. 

అదే విధంగా ఏ వయసులో శివుణ్ణి ఆరాధించాలి అనే విషయాన్ని గురించి కింది పద్యం ద్వారా తెలియజేశాడు. యౌవనం లో ఉన్నప్పుడే శివుణ్ణి ఆరాధించాలి అని పేర్కొన్నాడు.

శా. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే
వింతల్మేనఁ జరించునప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే
చింతింపన్వలె నీ పదాంబుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా! (శ్రీ. కా. శ. 116)

జలకంబుల్ రసముల్, ప్రసూనములు వాచాబంధము వాద్యముల్
గలశబ్దధ్వను. లంచితాంబర మలంకారంబు, దీపుల్ మెఱుం
గులు, నై వేద్యము మాధురీమహిమగా, గొల్తున్ నినుం భక్తిరం
జిల, దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్శ్రీ కాళహస్తీశ్వరా!

ఈ పద్యంలో వివరిస్తున్నాడు ధూర్జటి. అంతేకాదు, ఉత్తమ కవిత్వానికి సంబంధించిన అంశాలను కూడా ఇందులో వివరించాడు. జలకములు నవరసాలు, పువ్వులు, వాక్యరచనలు, వాద్యములు మృదుపదాలవలన పుట్టిన అర్థాలు, వస్త్రాలు అలంకారాలు (ఉపమాద్యలంకారాలు), దీపాలు, కాంతి మొదలైన గుణాలు, ఇంక నైవేద్యము నా కవితలోని మాధురీమహిమ. ఈ విధంగా నానేర్చిన పద్ధతిలో నీకు దివ్యార్చన సమకూరుస్తాను అన్నాడు ధూర్జటి. అంతేకాదు, ఇటువంటి కవిత్వం “నాదుజిహ్వకు నైసర్గిక కృత్య”మని కూడా విన్నవించుకొన్నాడు. పైగా “నీకే గాని కవిత్వమెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్, జేకొంటిం బిరుదంబు, కంకణము ముంజేఁగట్టితిం, బట్టితిన్ లోకుల్ మెచ్చ వతంబు” అని నిష్కర్షగా, అసందిగ్ధంగా బాసచేసినాడు. తన సర్వస్వం శివార్పణం చేసినాడు.

శా. సంతోషించితి జాలు జాలు రతిరాజ ద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందితి జాలు జాలు బహురాజ ద్వార సౌఖ్యంబులన్
శాంతిం బొందెద జూపు బ్రహ్మపద రాజ ద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా! (కా. శ.ప. 62)

ఈ పద్యంలో శివుని పైన ఉన్న భక్తితో పాటు  కుటుంబ జీవితం పట్ల తన వైరాగ్యన్ని కూడా తెలియజేశాడు.

5. ముగింపు:

సమాజ భూమికను అనేక కోణాలలో నిరూపించవచ్చు. శతకాలకు సమాజం వస్తువు కావడం చేతనే శతకపద్యాలు ఎక్కువగా ప్రజల నోళ్లలోనానుతూ ఉంటాయి. వేమన, కవిచౌడప్ప మొదలైనవారి పద్యాలకు అజ్ఞాత కవులు రచించిన సమానమైన పద్యాలు కొన్ని ప్రచారంలోకి వచ్చి ఏది మూలకర్త పద్యమో గుర్తుపట్టలేని విధంగా స్థిరపడిపోయాయి. పైన విశ్లేషించి చూపినవి శతక రచనకు భూమిక అయిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరిచయం మాత్రమే. ఒక్కొక్క శతకాన్ని కూలంకషంగా పరిశీలించినట్లయితే అసంఖ్యాకంగా ఉన్న సాంఘిక అంశాల స్వరూపం మరింతగా వెల్లడి అవుతుంది.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గోపాలకృష్ణారావు, కె. (1976). ఆంధ్ర శతక సాహిత్య వికాసము.
  2. నాగయ్య, జి. (2009). తెలుగు సాహిత్య సమీక్ష. తిరుపతి: నవ్య పరిశోధన ప్రచురణ.
  3. వీర వెంకటయ్య , కొండపల్లి. (1931) శ్రీకాళహస్తీశ్వర శతకము. రాజమండ్రి: శ్రీ సత్యనారాయణ బుక్ డిపో.
  4. వేంకటావధాని, దివాకర్ల. (1965). ఆంధ్రవాఙ్మయ చరిత్రము. ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు.
  5. శ్రీరామరాజు,  నడుపల్లి. (1997). అక్షర విశ్వనాథ. హైదరాబాదు: వాగ్దేవి ప్రచురణలు.
  6. సుబ్బారావు, వంగూరి. (1957). శతక కవుల చరిత్రము. నరసాపురం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]