headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

8. ‘స్మశానందున్నేరు’నవల: అంతర్గతవైరుధ్యాల జీవితచిత్రణ

c_ravindra.jpg
చిట్టి రవీంద్ర

పరిశోధకవిద్యార్థి (నెట్ - జె.ఆర్.ఎఫ్).
తెలుగు శాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయం,
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9701959137. Email: ravispecial6655@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంగ్లసాహిత్యప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. అందులో నవల ఒకటి. నవలలో ఒక జీవిత భాగాన్ని కానీ జీవిత సమస్యల్ని చిత్రీస్తారు నవల కారులు. స్మశానందున్నేరు నవలలో రాయలసీమలోని ఒకప్పటి హరిజనవాడలోని హరిజనులు (ప్రస్తుతం హరిజనులు అనే పదం వాడుకలో లేదు.) వారి దుర్భరమైన జీవితం, వారి బతుకు తీరులోని దైన్యం, ఒక కులంలో ఉన్నా అంతర్గత వైరుద్యాల్ని తమకు అనుకూలంగా చేసుకొని భూస్వాములు వారిని ఎలా వాడుకునేవారో, చివరికి దళితులలో చైతన్యం వచ్చి తిరుగుబాటు చేయడం ఈ నవలలోని ప్రత్యేకతలు. తరాలు మారిన దళితుల మీద జరిగే అరాచకాలు ఇప్పటికీ ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. దళితుల మీద జరిగే ఈ అరాచకాలు అగిపోవాలి. కులవివక్ష అనేది లేకుండా అందరూ సమానం అనే భావన కలిగి కలసిమెలసి ఉండాలి. దళితుల జీవితంలోని వివిధ కోణాలను ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: నవల, కేశవరెడ్డి, చైతన్యం, వైరుధ్యాలు, ఐక్యత, పెత్తందార్లు, తిరుగుబాటు, నిరక్ష్యరాస్యత.

1. ఉపోద్ఘాతం:

వినూత్నత, విభిన్నత, విలక్షణత వంటి భావాలను అందిపుచ్చుకున్న రచయిత కేశవరెడ్డిగారు. ఈయన వృతి పరంగా వైద్యులు అయినప్పటికి ప్రవృత్తి పరంగా సాహిత్య సృజనను కలిగిన గొప్ప రచయిత కేశవరెడ్డిగారు. ఈయన 1946 మార్చి 10న చిత్తూరు జిల్లా తలుపులపల్లిలో జన్మించారు. ఈయన రచనల్లో చాలావరకు అగ్రకులాలు, నిమ్నవర్గాల మధ్య సంఘర్షణలే కనిపిస్తాయికేశవ రెడ్డి రచనల్లో పాత్ర చిత్రణ, సన్నివేశ రూపకల్పన, సంభాషణలు కానీ ప్రతిది కూడా నిశితంగా పరిశీలించి రాసినట్లుగా ఉంటాయి. ఆయన రచనల్లో ప్రతి వాక్యం అత్యంత శక్తి వంతంగా ఉంటుంది. వీరి రచనలలో దళితులే ప్రధాన పాత్రాదారులు, అడుగడుగున వారి జీవన పోరాట వైవిద్య చిత్రీకరణలే తారసపడతాయి.

2. దళితులను చులకనగా మాట్లాడడం:

భూస్వాములు వారి దగ్గర పనిచేసే తొత్తులు కలసి దళితులను ఎంత అవమానకరంగా, హీనంగాచూసేవారో, ఎంత చులకనగా మాట్లాడేవారో చెప్తూ

‘‘ఏంపనో చెప్పు సావి ఇండ్లకు కూడా పోకుండా ఇట్టనే కడదోవన్నే వచ్చేస్తాం’’ అని అంటే వెంకటాద్రి ‘‘కడదోవన్నే వచ్చేస్తే మీకు సద్దులేవుడు పోస్తాడు. మీ యమ్మల్నేత్తుక పోయేవాడు పోస్తాడా? కొంపలకు పోయి సద్దుల్దాగేసి రండి.’’ (స్మశానం దున్నేరు. డా. కేశవ రెడ్డి. పుట. 6.) అని అంటాడు.

ఇక్కడ వారికి తినడానికి సద్ది పెట్టడం కూడా భారం, దండగా అని వారిని ఎంత హేళనగా చూస్తున్నారో చూడవచ్చు.

యేటి గడ్డున ఉన్న సుడుగాడు పోరంబోకు భూమి కదా అని వీరభద్రుడు అన్నప్పుడు వెంకటాద్రి వీరభద్రున్ని తిడుతూ

ఓ! నువ్వా రంపాలొడా. నువ్వేనా అడిగింది? నీ బుద్దిపోనీయెవుగదరా. తక్కువ జాతినాకోడకా! ఎంగిలాకు లెత్తమంటే బోంచేసినోళ్ల పేర్గడగతావు గదరా, సుడుగాడు పరుంబోకు బూవి అయిందీ కానిదీ నువ్వుజుసి నావట్రా, ” ‘‘సుడుగాడు ఏందిరా. ఆగుట్ట కిందుండే సవిట నేలలు తప్ప ఈ ఊరిచుట్టూ ఉండే బూవులన్నీ పెద్దరెడ్డివే గదరా’’. (అదే. పుట. 7.)

అని అనడం చూస్తే సుడుగాడు(స్మశానం) పోరంబోకుది అని వీరభద్రుడు ఉన్నా మాట చెప్పినందుకు పెద్దరెడ్డి తొత్తు అయిన వెంకాటాద్రి పెద్దరెడ్డి గొప్పలు చెప్తూ వీరభద్రున్ని ఎంత చిన్న చూపుగా మాట్లాడడో అర్థమవుతుంది.

కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టుగా ఎంత సంపాదించిన జానేడు పొట్ట నిండడం కోసమే ఆ తినే తిండి లో కూడా భూస్వాములకు, హరిజనులకు ఎంత తేడా ఉందో ఇలా అంటున్నారు

“అదంతా దేవుడిచ్చినవరం. కోడిపిల్లల్ను సంపి తినమని గెద్దెలకు వరం. ఆమేద్యం తిని బతకమని కాకులకు వరం. ” “పచ్చిజాతి మాదిరిగానే మనిషి జాతి గూడ. నెయ్యి కూడు తినమని సావకార్ల నెత్తిన రాసుంది. ఉత్త పిండిసంగటి తినమని మాలోల్ల నెత్తిన రాసుంది.” (అదే. పుట. 13.)

ఎంతో కష్టపడి పనిచేసిన కనీసం వారు కడుపు నిండా కూడా తినలేక పోతున్నారు అని చెప్తున్నా రచయిత కేశవరెడ్డి గారు.
తమ శరీరాన్ని రెక్కలు ముక్కలు చేసుకొని కస్టపడి చేసే పనికి కూలి(ఫలితం) ఎంత అని అడిగితే అదేదో పెద్ద నేరం చేసినట్టుగా పెద్దరెడ్డి తొత్తు వెంకటాద్రి వీరభద్రున్ని తిట్టడం చూస్తే “మా కూలి ఎంత అని అడిగేదాకా వచ్చినావు. పెద్దరెడ్డిగారి బూవుల్లోపంచేసే దాని కొచ్చి కూలి ఎంత అని అడిగినావు. నీ దయిర్యానికి మెచ్చుకోవాలి” అని తల ఆడించి మిగిలిన హరిజనుల వైపు తిరిగి

ఏందిరా నీ యమ్మల-సముద్రం కాలిపోతా ఉన్నట్లు సూస్తా ఉండారు. ఇప్పుడు కూలి ఎంత అని చెప్పేదాకా మీరుపన్లోకి దిగబోయేది లేదంటారు. కూలి ఎంత, ఇనాం ఎంత, అన్నీ యిలావరిగా చెప్పేదాకాఅడుగు ఎత్తి పెట్టనంటారు అంతేనా” (స్మశానందున్నేరు. డా. కేశవరెడ్డి, పుట. 16.)

అలాగే కళ్ళు పోసే ఈడిగోడు హరిజనులతో ఇలా అంటాడు

‘‘వారందినాలు మూసారు పట్టుకొని నేలంతా రొళ్ళురొళ్లయి పోయుంటే గెడ్డపారదిగలేదంటావు గదరా. జల్లిచెప్పి బతకమని దేవుడు మాలోని నొష్టిని రాసినాడు. మాలోడు పది దినాల్లో చేసేపని కాపోడు ఒక దినంలోచేసుకొస్తాడు". (అదే. పుట. 31, 32) అని అంటాడు.

ఇక్కడ వారిని ఎంత చులకనగా చూస్తున్నారో, అలాగే తాము చేసే శ్రమకు కూలి ఎంత అని కూడా అడగలేని వారి నిస్సహాయ స్థితి ఎలా ఉందో చెప్తున్నారు రచయిత.

3. ఒకే కులంలోనే వైరుద్యాలు:

దాదాపుగా ఒక కులం వారు వేరొక కులం వారిని ఎక్కువ, తక్కువగా చూడడం చూస్తుంటాం. కాని ఇక్కడ ఒకే కులంలోనే వారిలోనే వారు ఎక్కువ తెగ, తక్కువ తెగ అని భేదాలు ఉన్నాయి. నవల ప్రారంభంలోనే ఈ వత్యాసం మనకు కనబడుతుంది.

ముప్పై ఒక్క కుటుంబాలు కలిగిన హరిజనవాడ, దాని నానుకొని ఉన్న తారురోడ్డు, రోడ్డుకవతల ఉన్న ఆగ్రహారం వెన్నెలలో తడుస్తూ నిద్రలో తేలుతున్నయీ. హరిజన వాడలోని ముప్పై కుటుంబాలు‘పోకనాటి’తెగవి. వీరభద్రుని కుటుంబం ఒక్కటిమాత్రం ‘రంపాల' తెగకు చెందింది”. (అదే, పుట. 1)

అలాగే సుడుగాడులో దొరికిన కాసులు పంచే క్రమంలో “వీరభద్రుడు వరుసగా నిలుచుని ఉన్న హరిజనులను చూపి వీళ్ళంతా ఎక్కువ భాగం తీసుకుంటే నేనుమాత్రం తక్కువ బాగం ఎందుకు తీసుకోవాల?” కుట్టిగాడు ఎండిన గోగుపూళ్ళను వరచినంత తేలికగా,

ఎందుకేంది?వాళ్ళంతా పోకనాటోళ్లు, నువ్వు రంపాలోడివి, తక్కువ బాగం తక్కువ జాతోడు గాకపోతే ఇంకెవడు తీసుకుంటాడు.?

(అదే. పుట. 46, 47.) తమలోనే తాము తక్కువగా చూసుకోవడం, దాన్ని అవకాశంగా చేసుకొని కొందరు వారి ఉపయోగాలకు వీరిని ఉపయోగించుకోవడం చూడవచ్చు. వారిలో ఉన్నటువంటి అంతర్ఘాత వైరుద్యాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో చెప్తున్నారు రచయిత కేశవరెడ్డి గారు.

మామూలుగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, ఊరికట్టుబాట్లు, కులం కట్టుబాట్లు ఉండడం చూస్తుంటాం. ఆ కట్టుబాట్లను ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకించిన వారిని ఊరి నుంచి కాని, కులం నుంచి కాని వెలివేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా వీరభద్రుడు వెంకాటాద్రి పై ఎదురు తిరిగాడని వెంకటాద్రి మిగతా దళితులతో వీరభద్రున్ని కులం నుంచి వెలివేయమని ఇలా అంటాడు. ఒరె కుట్టినాకొడకా నేన్జేప్పింది యినవడాటం లేదంట్రా. నీ మాల పెగ్గే నీదికాని నేన్జప్పేది యినిపించుకోవుగదా. నీకిదే చెప్పాటం, నువ్వుమాత్రం వానిజోలికి పోవద్దు. వాన్ని ఏవి జెయ్యాల్నో యట్ట అనవరించాల్నో నాకు తెల్సు. మీరుమాత్రం వాణ్ణి ఈ పొద్దుట్నుంచి కులం ఎలెయ్యండి. "అని అంటూ

"కుట్టిగా రంపాలోన్ని కులంనుంచి ఎలికట్టేదికాదు, వాన్ని ఊల్లో నుంచే ఎల్లగొట్టాల. పొద్దుపొయ్యే లోగా వాడు ఊరిడిసి పోవాల. వాన్ని ఏవన్నా చేయండి. మీ మతికొచ్చింది చెయ్యండి. వాడు మాత్రం పొద్దు గుంకినాక ఊళ్లో ఉండగూడదు. పొండి అందరూ పోయి ముందు అపన్జూడండి". (అదే. పుట. 84)

తమకు ఎదురు తిరిగిన వారిని తమ వాళ్ళ చేతనే కొట్టించి, వారిలో విభేదాలు ఇంకా పెంచి వారిని ఏవిధంగా నాశనం చేసేవారో చెప్తున్నాడు రచయిత.

4. నిరక్షరాస్యత:

నిరక్షరాస్యత ఎంతలా ప్రభలి ఉందో ఇలా చెప్తున్నాడు రచయిత "సత్తిగాడు తన కాసులను తిప్పించి, మళ్లించి, చాలాసేపు పరిశీలించి కుంటివానితో "నా కాసులన్నిటికి ఒక పక్కన అచ్చిరాలు, ఇంకొక పక్కన బొమ్మలు ఉండాయి. నీవిగూడ అట్టనేనా?"అని అంటే కుంటివాడు "నావిగూడ అట్టనే. ఒక పక్కనబొమ్మ, ఇంగొక పక్కన అచ్చిరాలు - ఈ అచ్చిరాల్తో ఏవి రాసున్నట్టు?"సత్తిగాడు

"ఎవరికి తెల్సు. ఏవిరాసుందో ఎవరికి తెల్సు. మన కంటికి ఆడ్సుమడిలో కొంగలు తొక్కినట్టుండాదంతే" (అదే. పుట. 54).

కుంటివాడు "అడ్సుమడిలో కొంగలు తొక్కినట్టుండేదేందిరా. ఎంత సోగ్గా ఉండాయోచూడు. ఆచ్చిరాలు, సున్నాలు, సుక్కలు, గీతలు సూస్తాఉంటే ఇంగా కొంచెం సేపు సుద్దావ నుండాది"(అదే. పూట. 55) అలానే దొరికిన కాసులతో నువ్వు ఏం చేస్తావో చెప్పు అంటే "మా పిల్లగోణి చదివిస్తా" అంటాడు. కుంటివాడు ఆలోచించి. . . .

"సదివించి"
"ఉద్దేగం జేయిస్తా"
"ఏవి ఉద్దేగవో?"
"ఏవి ఉద్దేగవో యట్ట చెప్పేదిప్పుడే. పోలీసుపని లేకపోతే మిల్ట్రీపని. ఏదైతే బాగుటుందంటావు "దానికి సత్తిగాడు ఇలా చెప్తూ "మన పిలకాయలను ఇస్కూలుకు కంపించే దానికన్నా వాళ్ళనెత్తిన గుండేసి సంపేది మేలు. యట్టంటావా? మనకు సదువులు అచ్చిరావు. మన పిలకాయలను సదివిస్తే కడాన వాళ్ళు అట్ట ఉద్దేగాలకూ తరంగాకుండా, యిట్ట కూలీపనికి తరంగాకుండాపోతారు.

"గవర్మెంటోడు చేసే పనంతా పారే నీళ్లకి కాలడ్డం పట్టేపనే. మన పిలకాయలంతా పోయి కుర్చిలమీద కూర్చునే పనైతే ఇంగరెడ్ల పిలకాయలతో, బాపనోల్ల పిలకాయలతో ఏం పని? మనవంతా పట్నాలకు పోతే ఈడ కూలిపన్జేసే దేవరు? అని "ఎవుని పని వాడు చేసుకోవాల. పలానోనికి పలానపని బెమ్మదేవుడు ఏర్పరచేసుంటాడు. దాన్ని కాదనే దానికి గవర్మెంటోని వల్లనూ కాదు, వానిజేజి నాయన పిల్లలనూ గాదు". (అదే. పుట. 62)

అని అంటాడు. తర తరాలుగా ఈ దళితులలో కొంత మంది చెప్పుడు మాటలు విని వారి పిల్లలను కూడా చదివించకుండా వారి లాగే పనికి పంపి తమ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేస్తున్నారు. ఇక్కడ అజ్ఞానమూర్ఖత్వంతో నిండిన వారిలో నిరక్షరాస్యత ఎంతలా అలుముకొని ఉందో చూడవచ్చు.

5. సమాజంలోని కలుపు మొక్కలు:

అగ్గికీ ఆజ్యం తోడైనట్లు, పుండు మీద కారం చల్లినట్లుగా సమాజంలో వివిధ వృత్తులలో ఉన్నటువంటి కొందరు అధికారులు వారి పనిని సక్రమంగా చేయకుండా డబ్బు ఉన్నా వారికి దాసోహం చేస్తూ, వారు చెప్పినట్లు చేయడం వలన కొందరు అమాయకులకు ఎంత అన్యాయం జగుతుందో, వారు ఎలా బలి అవుతున్నారో చెప్తున్నారు. ఇలా పెత్తందార్ల కొమ్ముకాసే అధికారులను కలుపు మొక్కలతో పోలుస్తూ వ్యాసదేవ పాత్ర ద్వారా ఇలా అంటాడు "కలుపు మొక్కలు సూసినావా?" "సూడకేవి వరికర్రల పక్కన పెరగతాయి కలుపుమొక్కలు. నేలలో ఉండే సత్తవనూ, నీళ్ళనూ పీల్చేసి వరికర్రలకన్న ముందు పెవళమై పోతాయి. "వ్యాసదేవ చెప్తూ "ఔ రైతు వరికర్రల కోసరం ఏసుండే సత్తవనూ పీల్చేసి, నీళ్ళను తాగేసి కలుపుమొక్క పేవళమై పోతుంది. అట్ట పెవలమైపోయిన కలుపుమొక్క వరికర్రను జూసి ఒరే వరి కర్రోడా దూరంగా ఉండ్రా. నీ ఆకుల్ను నాకు తగిలించి నాకు సొన పెట్టిస్తా ఉండావు. దూరంగా ఉండ్రా అని కసురుకుంటుందంట. అప్పుడు వరికర్రకళ్ళల్లో నీళ్లు పెట్టుకొని

"ఒరే కలుపు నా కొడకా. మా రైతు నా కోసరం ఏసుండే సత్తువను నువ్వు పీల్చెసి, నీళ్లను నువ్వు తాగేసి పైగా నన్నే దబాయిస్తావా? రేపో మాపో మా రైతు వచ్చి నిన్ను కొకటెళ్ళతోసహా పెరికి పారేస్తాడు జూడు' అంటుందంట. ఇంటా ఉండావాకత వరిమడిలో ఉండే కలుపుమొక్కల్ను పెరికేసే పని రైతు చేస్తాడు. ఈ జనం మద్యనుండే కలుపు మొక్కల్ను పీకి పారేసేపని ఎవురు చేయ్యాల? గవర్మెంటోడు చెయ్యాల. వాడా పని చేస్తా ఉండాడా? లేదు. వాడాపని చేస్తా ఉంటే ఈ రాజ్జిం ఇట్టుండునా? నాకు జైలుకు పోయుండే గాచ్చారం పట్టుండునా?" (అదే. పుట. 95) అని

"మన బతుకుల్ను ఒక్క అడుగుముందుకు పోనీకుండా అడ్డం కూచోనుండే సావకార్లను, యా గవర్మెంటోడు ఏవి చెయ్యటం లేదు. న్యాయవేది, దర్మవేది అని అడిగినోళ్ళను మాత్రం తరిమి తరిమీ చంపిస్తా ఉండారు."(అదే. పుట. 100).

అని ఈ పెత్తందార్ల పోరే భరించలేకుంటే మళ్ళీ వీరికి ఈ అధికారులు తోడై వారికి ఎంత అన్యాయం చేస్తున్నారో చెప్తూ ధనవంతులకు కొమ్ముకాసే అధికారులను నిరసిస్తున్నాడు రచయిత కేశవరెడ్డి గారు.

పాముకు పాలు పోసి పెంచిన, పూజలు చేసినా తనకు ఆపద కలిగితే కాటు వేయడం దాని లక్షణం. ఆ విధంగానే ఈ పెత్తందార్లు కూడా తమ స్వప్రయోజనాలకోసం నమ్మిన బంటుని సైతం ఎలా బలి చేస్తారో చెప్తూ, పెద్దరెడ్డి తన తొత్తు అయిన వెంకటాద్రి మీద నేరం మోపుతూ ఇలా అంటాడు.

"తప్పుడు లంజకొడకా! ఎంత ధైర్యంరా నీకు? ఆ మాలోళ్ళూ, నువ్వూ కల్సి కాసుల్ని దిగమింగి నింద నామీద వాల్చాలని చూస్తావా! నా కూడు దిని, నా గుడ్డకట్టి బతికినోడివి నాకే గుంత తవ్వుతావా!" (అదే. పుట. 138) అంటాడు.

వెంకటాద్రి పెద్దరెడ్డి పాదాలు పట్టుకొని "నన్ను కాపాడన్నా, పుట్టి బుద్ధి తెల్సినప్పట్నుంచి నీపంచన పడుండా. నువ్వు కాల్తో చెప్పిన పని చేత్తో చేసినా. కలలో గూడ నీకు కీడు తలపెట్టినోణ్ణి కాను, నన్ను జయిల్లో పెడ్తా ఉంటే సూస్తా ఉండావుగదన్నా. మూడోవాని కంటిక్కనిపించకుండా కాసుల మూట నీ చేతిలో పెట్తి గదన్నా. ఒక్కొక్కటి లెక్కబెట్టి తొంభై రెండు కాసులు నీ పాదాల దగ్గిర పెడ్తిగదన్నా. చిన్నప్పట్నుంచి నువ్వే దేవుడనుకుంటి. నిజం చెప్పి నన్ను కాపాడన్నా. నేను జెయిల్లో దిక్కులేని సావుసచ్చేట్టు చెయ్యొద్దు నా బిడ్డల్ను బిచ్చగొల్లగా చెయ్యొద్దు". అని అంటే పెద్దరెడ్డి ఇలా అంటాడు.

"బిత్తిరి నా కొడకా. నీ బిడ్డలు బిచ్చగోళ్ళు ఎందుకావుతార్రా? తొంభై రెండు వేలు ఒక లక్ష రూపాయలు యనకేసినావు గదరా. యనకేసినాడివి ఊరికే ఉండక నా మీదకే ఏలు చూపిస్తావా? ద్రోహకారి నా కొడకా. ఈడ నలుగురూ ఉండబట్టి నిన్ను ప్రాణాల్తో వదల్తా ఉండా. లేకపోతే నిన్ను నరికి కాకులకు, గెద్దలకు ఏసుందును లే లేనాముందర్నుంచి." (అదే. పుట. 140)

అంటూ కాల్తొ తన్నుతాడు. తమదగ్గరా ఎంత నమ్మకంగా ఉన్నా, వారి కోసం ఎంత వట్టిచాకిరి చేసినా, తమ జీవితాన్నే ధారపోసిన ఈ పెత్తందార్లకు ఏమైనా ఆపదలు, సమస్యలు వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నమ్మిన వారిని సైతం ఎటువంటి జాలి లేకుండా ఎలా నట్టేట ముంచుతున్నరో చెపుతున్నాడు నవల కారుడు కేశవరెడ్డి గారు.

6. దళితుల తిరుగుబాటు:

ఎంతో ప్రశాంతంగా ఉన్నా అగ్నిపర్వతం లోపల వేడికి లావా మరిగి ఒక్క సారిగా బద్దలై బయట పడినట్లు తరతరాలుగా ఈ పెత్తందార్ల కింద మగ్గుతూ, ఆ చాకిరిలో కాలిపోతున్నా ఈ దళితులలో కూడా చైతన్యం వచ్చి ఈ అగ్నిపర్వతంలా బద్దలై ఏవిధంగా తిరుగుబాటు చేశారో ఇలా చెప్తూన్నారు. . "గర్భగుడి వెనుక నుండి వ్యాసదేవ పది సంవత్సరాలక్రితం ఈ ఊరినీళ్ళు మూడు దినాలపాటు తాగిన పరదేశి ఇవతలకి వచ్చాడు. అతని పక్కన వెంకటాద్రి పెద్దరెడ్డి నన్నూరెకరాల భూమిని ఇరవై సంవ్సరాలపాటు కంటికి రెప్పలా కాపాడిన నమ్మినబంటు ఉన్నాడు. వారిద్దరి వెనుక ముప్ఫై మంది హరిజనులు-రెక్కలమీద కండపెట్టిన నాటి నుండి తమ రక్తాన్ని చమటగా మార్చి పెద్దారెడ్డిగారి భూములలో కార్చినబానిసలు ఉన్నారు వారందరి కళ్ళలో ఎర్రజీరలున్నవి. వారి చేతులలో శూలాలున్నవి. "ప్రతీకార వాంఛయే జీవనాడిగా బ్రతికిన నాగుబాముల కోరలవలే క్రూరంగా, పదునుగా ఉన్న శూలాలు ప్రచండ వేగంతో, అవిరామంగా దూస్కు వస్తున్నాయి. అవి గర్భగుడి ముందు బందీలై యున్న వాళ్ళ రొమ్ములను చీల్చి గుండెలను ధ్వంసం చేస్తున్నాయి వాళ్ళ కడుపులను చీల్చి ప్రేవులను తుత్తునియలు చేస్తున్నాయి".

"ఆ ధర్మయుద్దానికి సాక్షుల వలే ఒకదానిమీదొకటి పడిన దివిటీలు భగభగ మండుతున్నాయి ప్రహరీ గోడల మీదను, పందిరి స్తంభాల మీదను చిమ్మిన రక్తం దివిటీల కాంతులలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రటి నెత్తురు ముల్లు దోవతులను, పట్టుచీరలను తడుపుతూ, పిండి ముగ్గుల మీదగా ప్రవహించి శూలాలు నాటబడి ఉండిన గోతులోకి ఇంకుతున్నాయి." (అదే. పుట. 158.)

ఇక్కడ వారిలో అలుముకున్నటు వంటి అజ్ఞాన అంధకార చీకటి తొలగి పోయి వారంతా ఏకం అయ్యి ఏలా చేతన్యం పొందారు చెప్తున్నారు రచయిత కేశవరెడ్డి గారు.

7. ముగింపు:

పెత్తందారీతనం ఎంత భయానకమైనదో, అమానవీయమైనదో ఈ నవలలో చూడవచ్చు. రాయలసీమలోని దళితుల జీవితంలో ఉన్న అంతర్గత వైరుధ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ నవల చదివితే అర్థం అవుతుంది. ఈ నవలలో ఉన్న హరిజనుల గురించి 'గుడిపాటి' గారు ఇలా అంటారు.

"ఈ రెండు తెగలు మాల కులానికి చెందినవవి. తెగలు వేరయినా వారు పడే కష్టాలు ఒకటే. వారి మీద జరిగే అణచివేత ఒకటే. బీభత్సాపూరితమైన పీడన కింద రెండు తెగలవారు అణగారిపోతూనేఉంటారు". (అదే. పుట. VI. ) " అన్న మాటలు అక్షర సత్యాలు. దళితుల చైతన్యానికి, అభివృద్ధికి, ఐక్యతకి ఈ స్మశానం దున్నేరు నవల నిలువుటద్దం. 

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆనందరామం, సి. నవలా విమర్శ. పద్మావతి ఆర్ట్ ప్రింటర్స్,  హైదరబాద్: 1994. 
  2. కేశవరెడ్డి. స్మశానందున్నేరు. మొదటిముద్రణ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరబాద్: 1979.
  3. చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం, కె. లక్ష్మినారాయణ(సం. పా.) 1980 తర్వాత తెలుగు దళితనవల (వ్యాస సంకలనం), రమా పబ్లికేషన్స్, అనంతపురం, 2003. 
  4. చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. మన నవలలు - మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ: ఏప్రిల్ 2015. 
  5. తెలుగు నవల నూరు సంత్సరాలు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. 1973.
  6. నాగభూషణశర్మ, మొదలి. తెలుగు నవలావికాసము. ఆంధ్రప్రదేశ్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్, సికింద్రాబాద్: 1971.
  7. రమాపతిరావు, అక్కిరాజు. తెలుగు నవల. (ప్రపంచ తెలుగు మహాసభప్రచురణ 1975-03-15) ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, సైఫాబాద్, హైదరాబాద్: 1975.
  8. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవలాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజ్ఞాన భవన్ హైదరబాద్, 1989. 
  9. శిఖామణి. దళిత సాహిత్యోద్యమం. ప్రపంచ తెలుగు మహాసభలు 27-29- డిశంబర్,తిరుపతి:  2013.
  10. సంజీవమ్మ. సి. తెలుగు నవలలో సామాజికచైతన్యం. అభ్యుదయ రచయితల సంఘం, కడప: 1983.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]