headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

"కమనీయం తెలుగు రామాయణం"

జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక

(ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి. కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)

AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. సంపాదకీయం


“రామ రామయన్న రారాదు పాపమ్ము
రామరామయన్న రాదు భయము
రామరామయన్న రాబోదు మృత్యువు
రామనామమమృత రాశి యగును”

తెలంగాణరాష్ట్రము ఉమ్మడి మెదక్ జిల్లాలో 1956లో ఏర్పడ్డ ప్రభుత్వ డిగ్రీకళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, తెలుగువిభాగానికి ఘనమైన చరిత్ర ఉంది. శ్రీ పరాశరం గోపాలకృష్ణమూర్తి గారి నుండి డా. నందిని సిధారెడ్డి వరకు ఎందఱో మహనీయులు తెలుగు విభాగానికి అధ్యక్షులుగా ఉండి విద్యార్థుల్లో మంచి లక్షణాలు పెంపొందించడానికి  వివిధ అంశాలపైన సదస్సులు, కార్యశాలలు నిర్వహించడం జరిగింది. తెలుగు విభాగానికి అనుబంధంగా విలువైన గ్రంథాలతో “శ్రీ KV  రాఘావాచార్య స్మారక సాహిత్యపీఠo- పరిశోధన కేంద్రం” ఉంది. తెలుగువిభాగం ఆధ్వర్యంలో “శాంతా-వసంతా ట్రస్ట్” హైదరాబాద్ వారి ఆర్ధికసహకారంతో 2023, నవంబర్ 20 & 21 తేదీలలో “కమనీయం తెలుగు రామాయణం” రెండురోజుల జాతీయసదస్సు నిర్వహింపబడింది.

రామాయణం రసవత్కావ్యం. ఆదర్శజీవనవిధానానికి, సక్రమధర్మాచరణకు నిలువెత్తు నిదర్శనం. అన్నదమ్ముల ఆత్మీయత, ఆదర్శదాంపత్యజీవనం, ఇచ్చిన మాటకు కట్టుబడడం, శరణు కోరిన వారిని రక్షించడం, దుష్టశిక్షణ-శిష్టరక్షణ, కరుణరసభావన... ఇలా సకలగుణసంపన్న, సల్లక్షణవారాశి రామాయణం. వాల్మీకివిరచిత సంస్కృతరామాయణానికి ప్రపంచవ్యాప్తంగా అనేకభాషల్లో అనువాదాలున్నాయి. తెలుగునాట 12వ శతాబ్దిలో గోనబుద్ధారెడ్డి ‘రంగనాథరామాయణం’ మొదలుకొని నేటి వరకు వందలాది తెలుగు రామాయణాలు వచ్చాయి. కథలో మార్పు లేకున్నా కథనంతో నిత్యనూతనమై అందరినీ అలరిస్తుంది రామాయణం. తెలుగు సాహిత్యంలో పద్యము నుండి మినీకవిత వరకు అన్ని ప్రక్రియల్లో రామాయణం వెలువడింది. జానపద- గేయాల్లో, కోలాటం పాటల్లో, స్త్రీల పాటల్లో రామాయణ సంబంధిత కథాంశాలు విరివిగా కనిపిస్తాయి.

ఉదాత్తమైన ఆదర్శజీవనానికి మార్గంవేసిన వాల్మీకి రామాయణ ఇతిహాసాన్ని కవులు ఎవరికి తోచినట్టు వారు ఎవరికి నచ్చిన ప్రక్రియలో వారు అనువాదం చేశారు. తెలుగులో రాసిన కవులు యథాతథంగా కాకుండా, భక్తితోనో, కవితానురక్తితోనో రామాయణానికి వినూత్నకల్పనలను జోడించి రాశారు. సమాజాన్ని మిక్కిలి ప్రభావితం చేసే చలనచిత్ర రంగంలో కూడా  మూకీ చిత్రాల కాలం నుండి నేటి అధునాతన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన చిత్రాల వరకు రామాయణ సంబంధ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆధునికకాలపు చలనచిత్ర కల్పనలు ప్రేక్షకాదరణకోసం అవాల్మీకాలను మరింత ప్రచారం చేశాయి. రామాయణ కావ్యానికి వన్నెతెచ్చేందుకు చేసిన ఈ నవ్యకల్పనలు వాస్తవాలన్నంతగా ప్రజల్లో ప్రచారం అయ్యాయి.  

వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేసే సందర్భంలో చేర్చబడ్డ కల్పనలు, ప్రక్షిప్తాల వలన రామాయణ అంతరార్థం పక్కదారి పట్టి కల్పవృక్షంగా ఆదరించబడిన రామాయణం కొందరికి విషవృక్షం అయింది. తెలుగురామాయణాలలో అవాల్మీకాలు, ప్రక్షిప్తాలు, వాటి వెనుక ఉన్న కారణాలు, వాస్తవంగా రామాయణంలో అందించబడిన విలువలు ఇత్యాది అంశాల గురించి చర్చ జరిపి సమాజంలో మానవీయవిలువలు సన్నగిల్లుతున్న వర్తమానసందర్భంలో నేటి తరానికి రామాయణం నేర్పించిన ధర్మాచరణ మార్గాన్ని, మానవీయవిలువలను అందజేసే ఉద్దేశ్యంతో “కమనీయం తెలుగు రామాయణం” సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. సదస్సు నిమిత్తం పరిశోధకులు, అధ్యాపకుల నుండి వచ్చిన వ్యాసాలన్నీ పరిశీలించి, ప్రచురణయోగ్యమైన వ్యాసాలను “ఔచిత్యమ్”- అంతర్జాల తెలుగు పరిశోధనమాసపత్రిక” యాజమాన్యం అంతర్జాలప్రత్యేకసంచికగా వెలువరిస్తు- న్నందుకు వారికి శతనమస్సులు.

ఈ వ్యాసాలన్నీ రామాయణసంబంధాలే అయినా విభిన్నాలు. భారత, భాగవతాది ఇతిహాస, పురాణాల నుండి కావ్యాల్లో, కీర్తనలలో అంతర్భాగంగా వచ్చిన రామాయణ విశేషాలు తెలుపబడ్డాయి. జానపదము, కావ్యము, ప్రబంధము, వచనము, యక్షగానము, వ్యాకరణము, రవ్వలు ఇలా అన్ని ప్రక్రియల్లో వెలువడ్డ రామాయణవిశేషాలు ఉన్నాయి.  తెలుగు రామాయణలలోని  అలంకార, వర్ణనావైచిత్రితో పాటు ఇతివృత్త సంబంధ అలంకరణల గురించి కొత్త విషయాలు తెలిపారు. రామసక్కదనం, సీతమ్మచెర వంటి పలుకుబళ్ళు, సామెతలతో జనతాత్వికతలో రామాయణ సంబంధ విశేషాలు తెలుపబడ్డాయి.

కావ్య అవతరికల్లో, శ్రీకారపద్యాల్లో, సినిమాపాటల్లో వచ్చిన రామాయణవిశేషాల గురించి,  రామాయణంలో  పాత్రలు, మనస్తత్వాలు నేటి తరానికి అవి అందించే  ఆదర్శాల చర్చలు ఉన్నాయి. తెలుగురామాయణాల్లో చేర్చబడ్డ అవాల్మీకాంశాలు, వాటి వెనుక ఉన్న కారణాలను విశ్లేషించడం జరిగింది. తెలుగువారికి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందించిన విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో జీవుని వేదన నుండి రమ్యరమణీయ దృశ్యవర్ణనల గురించి విపులమైన విశేషాలు ఉన్నాయి. వాల్మీకి రచనాకాలం నుండి నేటి వరకు రామాయణము సమకాలీనత, సార్వకాలీనత గురించిన సమగ్రసమాచారం ఈ వ్యాసాల్లో కనిపిస్తంది.

ఈ సంచిక కోసం పరిశోధనపత్రాలు పంపినవారిలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, బోధనేతరరంగాలకు చెందిన వారు ఉన్నారు. వారందరికీ నమస్సులు.  తీపివంటకాలు ఎన్నున్నా మూలపదార్థమైన పంచదార ఒకటే అయినట్టు రామాయణ ఇతివృత్తము ప్రధానాంశముగా వెలువడ్డ ఈ వ్యాసాలన్నీ నేటి తరానికి ఆచరణీయమైన ఆదర్శజీవనవిలువలను అందిస్తాయని ఆశిస్తున్నాము.

శ్రీరామ శరణం మమ.

ప్రత్యేకసంచిక సంపాదకులు

డా. ఆర్. మహేందర్ రెడ్డి. & శ్రీ. బి. సంపత్ కుమార్

తెలుగు విభాగము, ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ) సిద్దిపేట.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal