AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
8. తెలుగుకథ: బహుజనవికాసాలు
బి. సత్యనారాయణ
పరిశోధకులు, తెలుగుశాఖ
ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాదు, తెలంగాణ
సెల్: +91 9492010811. Email: bsatya.1982@gmail.com
Download PDF
Keywords: బహుజన సాహిత్యం, తెలుగుకథ, వికాసం, సత్యనారాయణ
ఉపోద్ఘాతం:
సాహిత్యానికీ, సమాజానికీ ఎప్పుడూ విడదీయరాని సంబంధమే ఉంది. సమాజం లేకుండా సాహిత్యం లేదు. ఏ కాలంలోని సమాజం గూర్చి తెలుసుకోవాలన్న ఆ కాలంలో వెలువడిన సాహిత్యమే ఎక్కువ ఉ పయోగపడుతుంది. అందుకే సమాజదర్పణం సాహిత్యం అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత మాక్సిమ్ గోర్కీ “సమాజహృదయమే సాహిత్యం. ప్రకృతి అందాలకు ఆవేశపడే మానవుడు దాని నిగూఢశక్తులకు బెదిరిపోతాడు. అప్పుడు అతనిలో పెల్లుబికే దుఃఖాలు, కలలు, కోర్కెలు, కోపతాపాలు ఇవే సాహిత్యానికి పట్టుగొమ్మలు.. ఈ సమాజహృదయం అజరామరంగా స్పందిస్తూనే వుంది. అందులోని సమస్తవిశ్వం సకలప్రకృతి శక్తులు వాటి సారాన్ని, పరమార్థాన్ని నిక్షేపిస్తాయి. ఎందుకంటే మానవుడు ప్రకృతిశక్తులను విప్పగలిగేది, దాని కారణాలను గొప్పగా చెప్పగలిగేది సాహిత్యం ద్వారానే..." అంటాడు గోర్కీ.
సమాజానికి దర్పణంలాంటిది, ప్రకృతి శక్తుల సారాన్ని విప్పగలిగేది, కారణాలను చెప్పగలిగేది అయిన సాహిత్యం సామాజిక మార్పులకు దోహదం చేస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలనట్టు కేవలం సాహిత్యం వల్లే సామాజిక మార్పు సాధ్యం కాకున్నా సామాజిక మార్పుకోసం అన్ని శక్తులూ కేంద్రీకరించుకోవడానికి, నైతికంగా మరింత ఐక్యంగా నిలబడటానికి సాహిత్యం పని చేస్తుంది.
బహుజన వికాసం:
భారతదేశసాహిత్యసాంప్రదాయానికి తలమాణిక్యాలనదగిన రామాయణ, మహాభారతాలు ఒక విశిష్టధర్మాన్ని ప్రచారం చెయ్యడానికి ఉపయోగపడ్డాయన్న విషయం నగ్నసత్యమే. కేవలం ఆనందం కోసమే అని చెప్పబడే ప్రబంధాలు కూడా చాతుర్వర్ణ వ్యవస్థని, వేదప్రామాణ్యాన్నీ తిరస్కరించలేదు. మన పూర్వలాక్షణికుల్లో చాలామంది వారు కోరేది ఎవరి శ్రేయస్సైనా విశ్వశ్రేయం, మొదట్నుంచీ కూడా సాహిత్యప్రయోజనం నిర్దుష్టంగానే పేర్కొనబడి కళ కోసం కావ్యం అన్నారు.
"ఆధునికసాహిత్యానికి యుగకర్త లాంటి వాడైన శ్రీశ్రీ ప్రచార నిమిత్తం కాకపోతే రచయిత తన రాతలనెందుకు బయట పెట్టాలో నాకు తెలియదు. ఏదో ఒక ప్రచారం చెయ్యకుండా శూన్యంలో వెలువడ్డ కావ్యాన్ని నేనింకా చూడవలసి ఉంది...” (బహుజన రాజ్యం కాలువ మల్లయ్య, పుట. 45)
అంటే - సమాజంలో ఓ భాగమైన మనిషి (రచయిత) తన చుట్టూ ఉన్న మనుషుల స్వేచ్ఛనాకాంక్షించి రచనలు చేసినప్పుడే సమాజాన్ని పట్టించుకొని తన రచనల్లో ప్రతిబింబింప జేసినప్పుడే ఆ రచన మంచి రచన అవుతుంది. ఏ కాలంలోనైనా సాహిత్యం తన ప్రయోజనాన్ని నిర్వహిస్తూనే ఉందని పై విషయాల వల్ల స్పష్టమవుతుంది. ఉబుసుపోక కోసం రాయబడే సాహిత్యం సంగతి వదిలిపెడితే ఏ కాలంలోనైనా సాహిత్యం తనవంతు పాత్రను సమాజంలో నిర్వహిస్తూనే ఉంది.
కథాసాహిత్యం- బహుజనవాదం:
వివిధ సాహిత్యప్రక్రియల్లో కథ ఒకటి. కథ చెప్పడం ఒక కళ. ఆదిమ కాలం నుంచీ ఉంది. మనిషి మాట్లాడటం నేర్చుకొన్నప్పటి నుంచీ అంటే భాష పుట్టినప్పటి నుంచీ కథ చెప్పడం, వినడం వుంది. మానవసంస్కృతి చరిత్రలో పిరమిడ్లు అత్యంత ప్రాచీనకాలానికి చెందినవి. కాని కథలు పిరమిడ్లకంటే కూడా ఎన్నో వేల ఏళ్ళు ప్రాచీనమైనవి.
నిరక్షరాస్యులంతా అజ్ఞానులు కారు నిరక్షరాస్యుల్లోనూ కళా సృజనం వుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కళాసృజనం అనేది మానవ సహజం. అనుభవం వల్ల పదార్థాల కలరూపులు తెలుసుకొని సుఖపడటం మానవజీవితవికాసరహస్యం. నాగరికుల్లోనూ, అనాగరికుల్లోనూ, జ్ఞానపదుల్లోనూ, జానపదుల్లోనూ ఈ లక్షణాలు స్వతస్సిద్ధంగానే ఉంటాయి.
ఆది మానవుడు తన ఊహకందని విషయాల గూర్చి కథలు కథలుగా చెప్పుకోవడం, వాటిని అద్భుత శక్తులుగా చిత్రించడం వుంది. మానవుని ఊహ రెక్క విప్పుకొన్నప్పుడే కథ పుట్టింది. చెట్టుకొక కథ, పుట్టకొక కథ, గుట్టకొక కథగా ప్రతిదానిపై కథ చెప్పడం అతి ప్రాచీనకాలం నుంచే ఉంది. మాట నేర్పు వున్న మనిషి తన చుట్టూ నలుగురిని కూచోబెట్టుకొని ఏదో కథ చెప్పడం కథా వాఙ్మయానికి ప్రథమదశగా పేర్కొనవచ్చు. చెప్పడంలో నేర్పరితనముంటే ఆతని చుట్టూ జనం మూగుతారు. మనస్సుకు హత్తుకుపోయేట్టు కథ చెప్పేవాని చుట్టూ పళ్ళగంప చుట్టూ చేరినట్టు జనం చేరుతారు. ఇలా మొదలైన కథ జాతిజీవనంలో అంతర్భాగమై మానవనాగరికతలో లీనమై నాగరికత పెరిగిన కొద్దీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. క్రమక్రమంగా కథకూ సమాజానికీ విడదీయరాని సంబంధం, అనుబంధం ఏర్పడింది. కథలంటే చెవులు కోసుకోని వారుండటం అరుదనే పరిస్థితి వచ్చింది.
సృష్టి కథను సావధానంగా వింటున్నాను. కొంత స్వప్నంగా ఉంది. కొంత యథార్ధంగా ఉంది. కొంత కథన కౌశలముంది అంటారు ప్రసిద్ధ ఉర్దూ కవి అస్గర్ గౌండ్వి. అతని మాటల్లో సృష్టే ఒక కథ. మనిషి జీవితమే ఒక కథ. ఇక కథ కానిదేది?
నానమ్మల, అమ్మానాన్నల, మామయ్యల వెంటబడే పిల్లలు మనకు తెలుసు. శ్రమను చేస్తూ ఏ ఇంటి లోగిలికెళ్ళినా కథ వినబడుతుంది. కథలు చెప్పమంటూ తాతల, అమ్మను కష్టాన్ని మరిచి పోవడానికి పాటల రూపంలో కథలు చెప్పుకోవడం వుంది. ఏ చేను గట్టుమీది కెళ్ళినా పనులు చేస్తూ, పరాచికాలాడుకుంటూ కథలు చెప్పుకునే జానపదులు మనకు కనబడతారు. బావా ఓ శాత్రం చెప్పవోయ్ అని కథలు చెప్పించుకునే వారున్నారు. రాళ్ళుగొడుతూ, ఇండ్లు గడుతూ, మోట గొడుతూ, నాగలి దున్నతూ, ఏతం బోస్తూ, గొడుతూ, బండి గొడుతూ పాటల రూపంలో కథలు చెప్పుకునే శ్రమ జీవులున్నారు. మనిషి జీవితంలో కథ అతి ముఖ్యమై పోయింది. జీవితంలో కొన్ని సార్లయినా కథలు చెప్పనివారు, కనీసం వినని వారు లేరన్న మాట సత్యదూరం కాదు.
మనదేశంలో వేదాలు మొదలుకొని ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, మనోరంజక నీతి బోధ కథలూ మొదలైనవన్నీ కథ నాశ్రయించుకొని జీవించినవే. ఈ కథల్లో కూడా కల్పిత కథలతో పాటు జానపద కథలూ, బహుజన కథాబీజాలూ అనేకం చోటు చేసుకున్నాయి. కథ అనే పదాన్ని విషయపరంగానూ కల్పితం అనే అర్థం వచ్చేటట్టుగానూ, సారాంశం చెప్పేదిగానూ, అసందర్భంగా మాట్లాడుతుంటేనూ ఇంకా అనేక సందర్భాల్లో పర్యాయపదంగా వాడుతున్నాం. కథ కంచికి మనమింటికి అనీ ఈ పదాన్ని వాడుకోవడమూ ఉంది. (పొడుపు కథలు, సామెతలు - కసిరెడ్డి వెంకటరెడ్డి, పుట. 63)
“కథకూ మానవ నాగరికతకూ విడదీయరాని సంబంధం ఉంది. మానవ నాగరికతతో పాటు కథలూ ఎదిగాయి. మానవ నాగరికతా వికాసంలో కథల పాత్ర ఉంది. కథలు లేని జీవితాన్నెవరూ ఊహించలేరేమో... ఇలా కథ మానవ జీవితంలో పెనవేసుకుపోయింది. పద్య, గద్య, మౌఖిక సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కథ వుంది. రామాయణ, మహాభారతాలన్నీ కథలే. కథ లేకుండా కావ్యం" అనే మాట ప్రబంధయుగంలో ఆరంభమైందంటాడు వెల్చేరు నారాయణరావు.
అయితే ఇవన్నీ పద్యరూపంలోనూ, మౌఖికంగా జీవిస్తున్న ఆశుసాహిత్య సాంప్రదాయ రూపంలోనూ, జానపదగేయ సాహిత్య రూపంలోనూ లభిస్తున్నవి. ప్రస్తుత కాలంలో లిఖిత సాంప్రదాయ రూపంలో జీవించి కథానికగా పేర్కొన బడుతున్న నేటి కథలకు వీటికే మాత్రం పోలికలేదు. అయినా కథానిక అనే పదం, ఆధునిక కథకు కొంత పూర్వ రంగం మనకు భారతీయ సాహిత్యంలో కనబడుతుంది. భారతీయ సాహిత్యానికి ప్రతిరూపమని చెప్పదగిన సంస్కృత సాహిత్యంలో ఒకప్పుడు కథానిక ఉచ్ఛస్థితిలోనే వుండేదని విమర్శకుల అభిప్రాయం.
బహుజనుల కథల్లో జీవనవిధానం:
ఆట్టడుగు జీవితాల్లోని బహుజనుల సంఘర్షణను, జీవన పోరాటాన్ని, డబ్బు విశ్వరూపాన్ని బహిర్గతం చేసాడు. ఏ ఆడంబరాలు లేని విధంగా అతిసాధారణం అనిపించేట్టు గానే గడుసుగా కథనం కొనసాగిస్తాడు కొ.కు. వ్యంగ్య వైభవంతో, చమత్కారమైన వర్ణనలతో, ఎంత సీరియస్ విషయం తీసుకున్నా అతి తేలికగ కథ చెబుతాడు కథనంలోనూ ధ్వని ప్రతిధ్వనిస్తుంటుంది. ఎవరూ సూటిగా కథ చెప్పరు.. పాఠకుడి ఆలోచనకు పదును పెడతారు. ప్రజా స్వామికమైన విశాల దృక్పథమే. కథను సామాజిక మార్పుకోసమే ఎక్కుపెట్టారు. తెలుగు కథ ప్రపంచ సాహిత్యంలో స్థానం సంపాదించుకోదగ్గ స్థితికి కథను తీసుకెళ్ళారు. భారతీయ భాషల్లోనూ, ప్రపంచ భాషల్లోనూ ఏ కథకూ తీసిపోని కథలు రాసారు.
కుటుంబ జీవనం గూర్చి, ప్రేమలు, ప్రేమ వివాహాల గూర్చి, గ్రామాల్స్ కక్షలు కార్పణ్యాల గూర్చి, పట్టణ జీవితాల్లోని విషాదం గూర్చి కూడా అనేక కథలొచ్చాయి. సోషలిజం యొక్క ప్రధానోద్దేశ్యం సమసమాజ స్థాపన.. సమ సమాజాన్ని కాంక్షిస్తూ, అందుకు ప్రజాస్వామిక ఈ విషయంపై మరింత పరిశోధన చెయ్యాల్సి ఉంది.
ఆధునిక ప్రక్రియ అయిన కథానికపై పురాణ, ప్రబంధ సాహిత్యాల ప్రభావం తెలిసో, తెలియకో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొంతైనా ఉందన్నది సత్యం చిన్నయసూరికి ముందు వ్యవహారిక భాషలో రాసిన వచన రచనలున్నా చిన్నయసూరి ప్రభావం వల్ల తెలుగు సాహిత్యం వ్యావహారికానికి దూరమైంది. వ్యావహారిక భాష వాడుక కోసం ఉద్యమమే లేవదీయాల్సి వచ్చింది. ఎంత ప్రతిఘటన ఎదురైనా వ్యావహారిక భాషోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళారు గిడుగు రామమూర్తి గారు. ఆతనికి బాసటగా గురజాడ నిలిచారు.. వ్యావహారిక భాషోద్యమం ప్రజాస్వామిక ఉద్యమం.
కథలపై వ్యావహారిక భాషాప్రభావం:
తెలుగు కథపై ఈ వ్యావహారిక భాషోద్యమ ప్రభావం ప్రగాఢంగానే ఉంది. అసలు తెలుగు కథ పుట్టిందే వ్యావహారిక భాషోద్యమం కొనసాగుతున్న కాలంలో మొట్టమొదటి తెలుగుకథే శిష్టవ్యావహారికంలో రాయబడి కథ ప్రజాస్వామిక ప్రక్రియ అని ఋజువు చేయడం జరిగింది. కథానిక నేటి అవసరాలకుపయోగపడే సాహిత్య రూపం కాబట్టి కథకులందరూ వ్యావహారిక భాషలోనే రాసారు. కవి కొండల వెంకటరావు, వేలూరి శివరామశాస్త్రి లాంటి వారి కథల్లోని భాషలో కొంత గ్రాంథిక వాసనలున్నా కథకులందరూ కొద్ది మినహాయింపులతో మొదట శిష్ట వ్యావహారికానికి అటు తర్వాత వ్యావహారికానికి పట్టం గట్టారు. విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి గొప్ప పండితుడు, సాంప్రదాయిక వాది కూడా తన కథల్లో వ్యావహారికం వైపు మొగ్గు చూపాడంటే ఆ భాషోద్యమ ప్రభావం తెలుగు కథా రచయితలపై ఎంత ప్రగాఢంగా వుందో అర్థమవుతుంది.
మొదటితరం కథా రచయితల్లోని కొందరి రచనల్లో క్రియాప్రయోగాలు, భాషలో మాత్రమే రాసేది అనేంతగా వుంది. పాత్రల భాష వ్యావహారికంలోంచి క్రమక్రమంగా భాషా వాసనలున్నా ఈ భాషోద్యమ ప్రభావం తెలుగు కథంటే పాత్రోచిత భాషయైన మాండలికంలోకి మారడం, రచయిత కథనం వ్యావహారికంలో రచయితలు మొదట్నుంచీ చేస్తున్న పనే.. రచయిత కథనాన్ని కూడా మాండలిక రాసి మొత్తం కథను మాండలికంలో రాసిన మొదటి కథా రచయిత మా గోఖలే.. మూడు ప్రాంతాల మాండలికాలు తెలుగు కథల్లో ప్రతిభావంతంగా వాడి భాషలోని తియ్యదనాన్ని, సౌందర్యాన్ని పాఠకులకు చవి చూపించారు కథా రచయిత్రు ఇలా శిష్ట వ్యావహారికంతో మొదలై, వ్యావహారికంలోంచి ప్రజల భాషణ మాండలికంలో రాయడంగా తెలుగు కథ అభివృద్ధి చెందింది.
భారతదేశంలో మరెక్కడా కనిపించదు. అని రాసుకున్నారు గురజాడ. కాని శ్రీశ్రీ గురజాడ సాహిత్య రంగంలో ఇప్పుడు నేను కావిస్తున్న కృషికి సమతుల్యమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళేంత వరకు ఆతని మార్గానికి కొనసాగింపే లేదు. మధ్య భావ కవిత్వోద్యమం ఉప్పెనలా దూసుకొచ్చింది.
“భారతదేశ నాగరికత అభివృద్ధి సరళరేఖలా సాగలేందటారు” ప్రముఖ చరిత్రకారుడు డి.డి. కోశాంబి. అలాగే తెలుగు సాహిత్య పరిణామం కూడా సరళరేఖలా సూటిగా సాగలేద పదహారవ శతాబ్దంలోనే వేమన మేడిపండులాంటి సంఘం గుట్టువిప్పి సామా ప్రజానీకానికుపయోపడే ప్రజా కవిత్వం రాసాడు. కాని అతనికి కొనసాగింపుగా ప్రజా కవిత, రాలేదు. ఆ కాలంలోనూ, అటు తర్వాత జీవిత సంఘర్షణతో సంబంధంలేని, వర్ణణ భాహుళ్యంతో కూడిన ఆనంద ప్రయోజనం గల శృంగార రసం ప్రధానంగా వున్న ఉన్న వర్గాలకుపయోగపడే ప్రబంధ కవిత్వమొచ్చింది. గురజాడ స్త్రీని కేంద్ర బిందువుగా తీసుకొని అప్పటికెంతో ముందు చూపుతో సామాజిక ప్రయోజనం ధ్యేయంగా రచనలు చేసాడు. కానీ ఆతని తర్వాత వచ్చిన భావకవులు ఆనందం ప్రయోజనంగా గల అనుభూతి కవిత్వం రాసాడు. మరియే సాహిత్య ప్రక్రియకూ వీలు కానట్టి విషయాలను కథానిక ద్వారా చెప్పే వెసులుబాటు తిలక్, విశ్వనాథ, కవి కొండల వెంకటరావు, కొనగళ్ళ వెంకటరత్నం, వరలక్ష్మమ్మ మొదలగు వారి కథలపై భావ కవిత్వోద్యమ ప్రభావం కొంత కొంత ఉంది.
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రధానమైన సాహిత్యోద్యమం అభ్యుదయ సాహిత్యోద్యమం. ఇది తెలుగు సాహిత్యంపై విశేష ప్రభావాన్ని చూపి తెలుగు సాహిత్యమార్గాన్నే మార్చింది. ఈ అభ్యుదయ సాహిత్యోద్యమానికి సారథి శ్రీశ్రీయే అని చెప్పవచ్చు. 1943లో ఏర్పడిన అభ్యుదయ రచయితల సంఘం ఈ సాహిత్యానికి ఊపునిచ్చింది. ఈ సాహిత్యోద్యమం వచ్చింతర్వాత అంతకు ముందున్న సాహిత్య ధోరణులకు చాలావరకు తెరపడింది. అనుభూతి, ఆనందానికి బదులు సాహిత్యానికి ప్రయోజనం ఉండాలన్నది ముందుకొచ్చింది. వ్యక్తి అన్న భావానికి బదులు సమాజం ముందుకొచ్చింది. వ్యక్తి స్వేచ్ఛస్థానంలో సమజశ్రేయస్సు వచ్చింది. అభ్యుదయం అనే పదానికి సాంప్రదాయకార్ధంలో మంగళం, శుభం అనే అర్థాలున్నాయి. ఈ అర్థంలోనే ఈ పదం అంతవరకు ఉపయోగింపబడేది.
1930 ప్రాంతంలో ఆర్థికమాంద్యం కుదుపువల్ల ఉహాప్రపంచం కాక వాస్తవప్రపంచ మొకటుంటుందన్న స్పృహ కలిగింది. అప్పుడు భావ కవిత్వం వెనకడుగువేసి అభ్యుదయ కవిత్వం ముందుకొచ్చింది. అభ్యుదయ సాహిత్యానికి సమాజ శ్రేయస్సు ముఖ్యం.. వ్యక్తి స్వేచ్ఛతో పాటు ప్రాపంచిక దృక్పథమూ అవసరం. వాస్తవికత ప్రాణం. కాల్పనిక సాహిత్యానికిది దూరం. సామాజిక సమస్యలను ఆర్థిక దృక్కోణంలోంచి, వర్గదృక్పథం నుంచి చూడటం అభ్యుదయసాహిత్యలక్షణం. హేతువాదం అభ్యుదయ దృక్పథంలో ఓ భాగం. అందువల్ల హేతువాదోద్యమాన్నీ తనలో కలుపుకుంది ఈ ఉద్యమం.
భౌతికవాదం ఈ ఉద్యమానికి ప్రాతిపదిక. సమాజ వ్యత్యాసాలు ఆర్థిక వ్యత్యాసాల వల్లే ఏర్పడ్డాయని నమ్మకం. కుల, మత వ్యత్యాసాలనీ ఉద్యమం నిరసిస్తుంది. సమాజం ఎగుడుదిగుడులను విమర్శిస్తుంది. ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం సమ సమాజం కుల మత వర్గాలు లేని సమాజ స్థాపన.. వీరి ధ్యేయం కార్మిక, కర్షక, శ్రామిక వర్గ ప్రజల శ్రేయస్సు.
సాహిత్యోద్యమం తెలుగు సాహిత్యంలో విశేష ప్రభావాన్ని కల్గించి నిబద్ధతను వెలికితీసింది. విశ్వనాథలాంటి సాంప్రదాయిక- వాదులు, యథాతథ వాదులు (కన్సర్వేటి ఆకర్షితులయ్యారంటే అది చూపిన ప్రభావమెంతో అర్థమవుతుంది. తెలుగు కథపై ఈ ఉద్యమ ప్రభావం గణనీయంగా ఉంది.
మొదటి కథ సంస్కరణ నేపథ్యంలో స్త్రీని అక్కున చేర్చుకుంది. గురజాడ దేవుళ్ళాం మీపేరేమిటి కథ మతంలోని డొల్లుతనాన్ని బయటకు లాగి హేతువాద దృక్పథాన్ని చూపింది. అభ్యుదయ కవిత్వోద్యమం, అభ్యుదయ రచయితల సంఘం కథా రచయితలకు వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేసాయి. వచనంలో అభ్యుదరు సాహిత్యోద్యమానికి కొడవటిగంటి కుటుంబరావును నాయకుడని చెప్పవచ్చు. నేను ప్రస్తుతం నా రచనలను బహుజనులకు చెందిన వారి వ్యష్టి మనస్తత్వాలను మాత్రమే గురిచేసి రాస్తున్నాను. నేను చేసేది ప్రజా రచనలని నేను చెప్పను కాని అభ్యుదయ రచనలే అని నా నమ్మకం. బహుజనుల దృక్పథంలోనూ, విశ్వాసాల్లోను వీరిలోనూ వున్న కుళ్ళును బయట పెట్టడం, బహుజన జీవితపు నిజాన్ని బయటపెట్టడం ఈనాటి సాహిత్యం చేయవలసిన పని. అని తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. అతని కథలన్నీ బహుజన ప్రజల వాస్తవ జీవితాలకు, ఆర్థిక స్థితిగతులకు అద్దం పట్టే అభ్యుదయ రచనలే.
రాయలసీమ గ్రామాల్లోని పేదరికాన్ని, తరతరాల పీడనకు గురువుతున్న ప్రజల సమస్యలను తీసుకొని ఆ ప్రజల భాషలో కథలు రాసి మెప్పించిన కరుణకుమార మంచి అభ్యుదయ రచయితే... గోపీచంద్ అభ్యుదయ సాహిత్యోద్యమంతో ప్రభావితుడై రైతు హృదయాన్నెరిగి ఆర్థికంగా, సామాజికంగా అన్యాయాలకు గురైన ప్రజల పక్షాన నిలిచి రచనలు చేసారు. గోపీచంద్, పద్మరాజు గార్లు అభ్యుదయ సాహిత్యోద్యమంలో భాగమైన హేతువాదోద్యమ ప్రభావంతో చక్కని కథలు రాసారు. గోపీచంద్ రాసిన ధర్మవడ్డీ, కార్యశూరుడు, బీదవాళ్ళంతా ఒకటి, పద్మరాజు గాలివాన హేతువాద ప్రభావంతో రాసిన కథలు. తిలక్, శ్రీశ్రీ రాసిన కథలు కూడా అభ్యుదయ రచనలే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, మా గోఖలే, పెద్దిబొట్ట సుబ్బరామయ్య రాసిన కథల్లో అభ్యుదయ ఛాయలు కనబడతాయి. అభ్యుదయ సాహిత్యోద్యమంతో ప్రభావితుడై సామాజిక స్పృహతో మనిషికీ డబ్బుకూ వున్న సంబంధాలను గూర్చి మంచి కథలు రాసారు చాగంటి సోమయాజులు. రావూరి భరద్వాజ, బలివాడ కాంతారావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, రాచకొండ విశ్వనాథశాస్త్రి, కాళీపట్నం రామారావు దీనహీన మానవుల గూర్చి ఆర్థిక దృక్కోణంలోంచి చూసి కథలు రాసారు. ఇంకా అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రభావంతో కథలు రాసి కథాసాహిత్యానికి సేవ చేసిన వాళ్ళెంతోమందున్నారు. సామాన్య మానవుడు కథా వస్తువుగా, ప్రజల భాష సాహిత్య భాషగా అభ్యుదయ సాహిద్యోద్యమ కాలంలో విశేష ప్రాచుర్యం పొందాయి.
ఈ కాలంలో తెలంగాణలో ఫ్యూడల్ ప్రభువు నిజాం పాలన వుంది. కోస్తా ప్రాంతంలో ఆంగ్లేయ విద్యవల్ల ప్రవేశించిన ఆధునికత కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు. అయితే తెలంగాణలో నిజాం రాజు పరిపాలనను వ్యతిరేకిస్తూ మాత్రమే కాక భూమికోసం, భుక్తికోసం పేద ప్రజల విముక్తికోసం సాయుధ పోరాటం జరిగింది. భారతదేశంలో జరిగిన సాయుధ పోరాటాల్లో దీనికి ప్రత్యేక స్థానముంది.
ఫ్యూడల్ ప్రభువు నిజాం పాలనను వ్యతిరేకిస్తే, తెలంగాణ బహుజనుల స్థితిగతులను చిత్రిస్తూ, ఇక్కడి పరిస్థితులకు భాష్యం చెబుతూ, తెలంగాణ పోరాటంలోని వివిధ దశలను వివరిస్తూ సురవరం ప్రతాపరెడ్డి, సురమౌళి, యశోదారెడ్డి, పొట్లపల్లి రామారావు, కాంచనపల్లి చిన వెంకట రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి వారు కథలు రాసారు. ఇవన్నీ ప్రజా పోరాటాలకు ప్రతి స్పందనలుగా, ప్రజల స్థితిగతులను వివరించేవిగా పేర్కొనవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి నిరీక్షణ కథ, నిజాం పాలకులను ఎద్దేవా చేస్తూ రాసిన మొగలాయి కథలు ప్రసిద్ధమైనవి.
జనసాహితీ సాంస్కృతికసమాఖ్య, హైదరాబాద్ వారు 1982లో తెలంగాణ పోరాట కథలు పేరిట తెలంగాణ పోరాటం గూర్చి వచ్చిన డెబ్భై కథల్లోంచి వివిధ దశలను తెలిపే ఇరవై మూడు కథలను సంకలనంగా వేసారు. నైజాం పాలనలో తెలంగాణలో ప్రజల బానిస బ్రతుకుల గూర్చి, దేశముఖ్ జాగీర్దార్ల దౌర్జన్యాల గూర్చి, ప్రభుత్వోద్యోగుల నిరంకుశత్వాల గూర్చి, ప్రజల వెట్టి బతుకుల గూర్చి, తెలంగాణలోని ఫ్యూడల్ సంస్కృతి గూర్చి ప్రజల తిరుగుబాటు గూర్చి వచ్చిన కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.
భూమి కోసం భుక్తి కోసం సాగే రైతుల పోరాటం
అనంత జీవిత సంగ్రామం...
ఆ సంగ్రామానికి తొలిమెట్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దాస్యశృంఖలాలతో మ్రగ్గిపోతున్న పుడమితల్లి చెర విడిపించేందుకు అనేకమంది జీవితార్పణలతో జరిగిన పోరాటం అది. భారత విప్లవానికే వేగు చుక్క ఆ పోరాటం.
నాటి సాహితీ సాంస్కృతికోద్యమం కూడా ఆ పోరాటాలకు, త్యాగాలకు ప్రతిబింబం నాటి సాహిత్యం. నైజాం క్రూర నిర్బంధం మొదలు జాగీర్దారుల, దేశముఖ్ దౌర్జన్యాలు, యూనియన్ సైన్యాల ఘాతుకాల వరకు సాహిత్యం తడమని అంశం లేదు. ప్రతి సంఘటనా కావ్య వస్తువే. ఏ విధంగా పోరాటానికి భూమి ఇరుసుగా ఉందో అలాగే సాహిత్యానికి కూడా ఇరుసు భూమి. ఆ భూమి చుట్టూ, ఆ భూమి కోసం జరిగే పోరాటాల చుట్టూ తిరుగుతూ వుంటుంది సాహిత్యం మొత్తం. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు పోరాట వస్తువుతో అరుణకాంతులు విరజిమ్మాయి. కథ, నవల, పాట, కవిత.... అన్నీ ప్రజల దగ్గరకు చేరాయి.
ముగింపు:
ఇలా అభ్యుదయ సాహిత్యోద్యమకాలంలో ఆంధ్రదేశంలోని మూడు ప్రాంతాల నుంచీ చక్కని కథా సాహిత్యం వెలువడింది. రచయితకు నిబద్ధత అవసరమని, రచయిత పీడిత ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల భాషను స్వంతం చేసుకోవాల్సిన కర్తవ్యం ఉందని ఈ సాహిత్యోద్యమం రుజువు చేసింది.
దొరల దౌష్ట్యాలను, అధికారుల దౌర్జన్యాలను, పోరాటంలో స్త్రీ పురుషులన్న లేకుండా చూపిన తెగువను, బహుజనుల పోరాట దశలను, ప్రజల త్యాగనిరతిని ఎంతో అవగాహన చిత్రించిన కథలు కథాసాహిత్యంలో ఆణిముత్యాలే. ఇందులో ఆంధ్రప్రాంతము రచయితలు తుమ్మల వెంకట్రామయ్య, ఉప్పల లక్ష్మణరావు, రాంషా, తెన్నేటి సూరి. మొదలగువారు తెలంగాణ పోరాటం గూర్చి, తెలంగాణ ప్రాంత స్థితిగతుల గురించి కాలువ మల్లయ్య, బి.ఎస్.రాములు మొదలైనవారు బహుజన సాహిత్యంపై చాలా కృషి చేశారు.
ఉపయుక్తగ్రంథసూచి:
- మల్లయ్య, కాలువ., బహుజన - రాజ్యం, భూమి బుక్ ట్రస్టు, హైదరాబాదు, 2019
- అయిలయ్య, బన్న., తెలంగాణ బహుజన కథా జీవనం, వరంగల్, 2009
- దేవేంద్ర, ఎం., తెలంగాణ కథ - వర్తమాన జీవన చిత్రణ, శ్రీ చందన మారోజు ప్రచురణలు, హైదరాబాదు, 2021
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.