headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797

6. తెలుగు న్యూస్ చానళ్ళు: వాడుక భాష ప్రాముఖ్యం

డా. మహమ్మద్ షమీర్

అసిస్టెంట్ ప్రొఫెసర్
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం
సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్
హైదరాబాద్, తెలంగాణ
సెల్: +91 9573678870. Email: smd.shameer@gmail.com

Download PDF


Keywords: తెలుగు, పదాలు, వాడుక భాష, న్యూస్ చానళ్లు, షమీర్

ఉపోద్ఘాతం:

దృశ్యశ్రవణమాధ్యమం విశ్వరూపాన్ని మనం చూస్తున్నాం. హిందీ చానళ్లు మినహాయిస్తే తెలుగులో ఉన్నన్ని టీవీచానళ్ళు మరే ఇతర భాషలో లేవు. దశాబ్దల కిందట డాట్ కామ్ (వెబ్ సైట్లు) వచ్చినట్లు ఇప్పుడు టీవీ చానళ్లు పుట్టుకొచ్చాయి. తెలుగు వారికి రాజకీయచైతన్యం, సమాచారదాహం ఎక్కువ. ఎన్ని చానళ్లు వచ్చినా వీక్షకుల కొరత మాత్రం ఉండదు. ప్రారంభంలో వార్తాపత్రికల భాషను న్యూస్ చానళ్ళు అనుసరించేవి. తర్వాత వాడుక భాష, ఇంగ్లీష్ పదాల వాడకం అధికమయ్యింది. ఈ వ్యాసం ప్రస్తుతం తెలుగు న్యూస్ చానళ్లలో తెలుగుభాష ఉపయోగం గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది.

ప్రధానవిషయం:

జర్నలిజం ఒక సామాజికశాస్త్రం. ఇది ప్రసారశాస్త్రం. ఈ శాస్త్రానికి అవసరమైన పదాలను, సంభాషణలను తెలుగులో ఏర్పుచుకుంటున్నాం. తెలుగు పత్రికల్లో వినియోగానికి, గ్రంథరచనకు, వ్యావహరికభాషను ప్రామాణికంగా తీసుకుంటున్నాం. 25 నుంచి 20 శాతం సంస్కృతపదాలు కూడా ఈ భాషలో భాగంగా ఉంటున్నాయి. దాదాపు 25 సంవత్సరాలుగా పత్రికాభాష నిర్దిష్టమైన పదవినియోగాన్ని అనుసరిస్తోంది. దృశ్యమాధ్యమమైన టీవీ కథనాలకుకూడా మెదట్లో పత్రికాభాషే ఆధారంగా ఉండేది. ఇప్పుడలాకాకుండా సరళమైన, సులభమైన ఇంటిభాషే ప్రధానంగా మారింది. క్షణాల వ్యవధిలోనే మనం వినియోగించిన భాష ద్వారా భావం ప్రజలకు చేరుతోంది. వ్యవహారికభాష నుంచి వాడుకభాషలోకి టీవీ మీడియా మారింది.

వ్యవహారభాష:

వ్యవహారం అంటే ఒక పద్దతిలో కొన్ని నియమాలతో కూడిన వ్యాకరణయుక్తమైన భాషానిబంధనలతో సాగే భాష వినియోగం.” (వ్యవహారిక భాషావికాసం , పుట 4.)

వాడుకభాష:

ఎటువంటి అరమరికలు లేకుండా, నియమాలతో సంబంధం లేకుండా భావాన్ని ప్రసారం చేయడానికి ఎంత సులభంగా, సంక్షిప్తంగా ప్రబలంగా చెప్పగలమో అదే వాడుక భాష, ఇంటి భాష.” (టెలివిజన్ జర్నలిజం, పుట 97.)

ఒక భావాన్ని ప్రసారం చేయటానకి సమానార్థం కలిగిన రెండు పదాలున్నప్పుడు ప్రజల వాడుకలో ఏ పదం ఎక్కువగా వినియోగంలో ఉందో దానిని ఎంచుకోవడం ప్రధానం. ఉచ్చారణ సాఫీగా ఉండాలంటే సంక్లిష్ట, సంయుక్త అక్షరాలు లేని పదాన్ని తీసుకొవడం జరుగుతుంది.

ఒక అక్షరంలోని ఒకే ఒక వర్ణం తేడాతో అర్థం మారిపోయే వాటిని కాకుండా, ప్రత్యమ్నాయ పదాలను ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు నిరశన, నిరసన - రెండు వేర్వేరు అర్థాలను ఇస్తాయి. ఒకటి నిరహారదీక్షను. మరొకటి ఆందోళనను తెలుపుతాయి. కానీ ఉచ్చారణలో ఏ మాత్రం స్పష్టత లేకపోయినా రెండు ఒకే విధంగా వినిపిస్తాయి. అందువల్ల నిరశనకు బదులుగా నిరాహారదీక్ష పదాన్నే రాయడం భావప్రసారాన్ని సులభం చేస్తుంది.

దృశ్యానికి రచన - పోటీ కాదు. రెండూ కలిసి ఒకే భావాన్ని చెబుతూపోవాలి. దృశ్యాల్లో కనిపించని వాటిని వ్యాఖ్యానిస్తూ పోతే అర్థరహితం. శాస్త్రసాంకేతికపదాలను వినయోగించకుండా రోజువారీ వాడుక పదాలనే స్క్రిప్టులో వినియోస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి వరకూ స్పష్టత, ఆసక్తి ముఖ్యం. ఎంత సమాచారం ఇస్తున్నామన్న దాని కంటే, ఎలా ఇస్తున్నామన్నది ముఖ్యం.

డు, ము, వు, లు, ని, ను, ల మొదలైన విభక్తిప్రత్యయాల వాడుక:

సాధారణంగా రెండుమూడు పేర్లను ప్రస్తావించి రాసే సందర్భాల్లో వార్తసహజంగా ఉండాలంటే ప్రతి పేరు చివర వాడుక తరహాలో దీర్ఘాక్షరం పెట్టడం ఉత్తమం.

సుబ్బారావు, అప్పరావు, శీనులు ఈ కేసులో నిందితులు

సుబ్బారావు, అప్పారావు,శీను ఈ కేసులో నిందితులు

సుబ్బారావు పైన కేసు నమోదైంది.

సుబ్బారావు మీద కేసు నమోదైంది. ఈ రెండో రూపమే సరైనది.

“వలన” అనేది గ్రాంథిక భాష, “వల్ల” అన్నది ఇప్పటి వాడుక.

“కేబినెట్ సమావేశం ఉండటం వలన తాను ప్రారంభోత్సవానికి రాలేకపోయానని మంత్రి కెటిఆర్ చెప్పారు.” (టెన్ టీవీ) ఉన్నందువల్ల... ఇది వాడుక.

“నుండి” అనేది కూడా గ్రాంథికవాసనతో కూడిన ప్రత్యయమే. ‘నుంచి’ దానికి ఆధునికరూపం. సికింద్రబాద్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరడానికి ఒక గంట సమయం పడుతుంది. (టెలివిజన్ వార్తారచన) ఇక్కడ “సికింద్రబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరడానికి గంటపడుతుంది” అన్నది వాడుక.

‘ను’కు వినియోగంలో కూడా ఒకదానికి బదులు మరొకటి రాసేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉదా: “ప్రావిడెంట్ ఫండ్ సంస్కరణలకు సీపీఎం వ్యతిరేకించడం వల్లే ఇంతకాలం ఆగాయి..."(చూస్తూనే ఉండండి) ఇక్కడ ‘కు’ బదులు ‘ను’ ఉంచాలి.

‘మ’ సందిగ్థం - “ఈ నెలలో నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయమని మంత్రి కెటీఆర్ చెప్పారు”. (చూస్తూనే ఉండండి) దీంట్లో విడుదల చేస్తామనే.. అర్థం సందిగ్థం. అందుకనే ’నీటిని విడుదల చేస్తామని లేదా చేయబోమని’...  అని స్పష్టంగా రాయాలి.

సామాన్యమైన వాడుకభాషలో చెప్పేటట్టుగా యాక్టివ్ వాయిస్ ఉపయోగిస్తున్నారు. పలువురు, ప్రభృతులు, తదితరులు... అలాంటి పదాలకు బదులుగా... "అనేకమంది", "మెదలైనవారు" వంటి వాడుకపదాలు ఉపయోగిస్తున్నారు.

అనవసరపదాల వినియోగం:

వార్తాపఠనంలోను, విషయవివరణ మొదలైన ఇతర సందర్భాలలోను అవసరంలేని అదనపు పదాలను ముందు వెనుకల చేర్చి వ్యవహరించడం దృశ్యమాధ్యమాలలో కనిపిస్తోంది. ప్రధానంగా వార్తాచానళ్ళలో మనం నిత్యం గమనించే కొన్ని అదనపు పదాలకు సరైన వాడుకను ఈ క్రింద్రి విధంగా సూచించవచ్చు.

          అదనపు పదాలు                    సరైన వాడుక

          తిరిగి మరోకసారి చేప్పారు           మరొకసారి చేప్పారు

          ప్రారంభోత్సవం చేశారు              ప్రారంభించారు

          సీపీఎం పార్టీ                           సీపీఎం

          చేయడం జరుగుతుంది               చేస్తారు

          మళ్లీ పునః ప్రారంభం                 మళ్లీ ప్రారంభం

          గడిచిన పాత కాలంలో               గడిచిన కాలంలో

          వివాహిత మహిళ                     వివాహిత

          మైనర్ బాలిక                          బాలిక

          అవివాహిత స్త్రీ                         అవివాహిత

తెలుగింట్లో ఇంగ్లీషు హవా:

తెలుగు న్యూస్ చానళ్లలో ఆంగ్లపదాలను ఎక్కువగా ఉపయోగించడం ఒక ఆనవాయతీగా, అలవాటుగా మారిపోయింది. టీవీలలో ఎక్కువగా వినియోగిస్తున్న ఆంగ్లపదాలు, వాటి వాడకం ఎలా జరుగుతోందో ఒకసారి పరిశీలిద్దాం.

దిస్ ఈజ్ రమ్య. పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్... రీసెంట్ డెవలప్ మెంట్స్ పై జస్ట్ టు మినిట్స్ లో స్పెషలో పొగ్రాం.....” (ఎన్ టీవీ 2009  ఎలక్షన్  కవరేజి రిఫెరెన్స్)

ఆర్టికల్ (అధికరణం), బ్యాలెట్ పేపర్ (ఓటుపత్రం), రోల్ (పాత్ర), ఎంటర్ (ప్రవేశం), రిపోర్టు (నివేదిక), బారికేడ్లు (అవరోధాలు), ప్లీనరీ (సర్వసభ్యసమావేశం), మోస్ట్ వాంటెడ్ (పేరు మోసిన), ఐడియాలిజీ (సిద్ధాంతం), వైట్-పేపర్ (శ్వేతపత్రం) ట్రాజెడీ (విషాదం), బిగ్ బ్రదర్(పెత్తందారు), కరిష్మా (సమ్మోహకశక్తి), సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ), క్లైమాక్స్ (ముగింపు), కామన్ గోల్ (ఉమ్మడి లక్ష్యం), ఫేక్ కరెన్సీ (నకిలీ నోట్లు, దొంగనోట్లు), పోర్ట్ ఫోలియో (మంత్రిత్వశాఖ), హైకమాండ్ (అధిష్ఠానం), స్ర్టాటజీ (వ్యూహం)... ఇలా ఎన్నో పదాలను విరివిగా ఉపయోగిస్తున్నారు.

ఇక హవా, కబడ్దార్, జీ హుజూర్, ఖతర్ నాక్, షురూ, వంటి ఎన్నెన్నో హిందీ, ఉర్దూపదాలు కూడా టీవీ మీడియాలో రంగప్రవేశం చేసేశాయి.

తెలుగుకు ప్రాచీనభాషా ప్రతిపత్తి ఏర్పడింది. సంతోషిస్తున్నాం. అయితే వర్తమానకాలంలో ప్రసారమాధ్యమాల్లో మనదైన భాష కనుమరుగవుతోంది. అనివార్యమైతే ఫర్వాలేదు. అనవసరపదాలు రాకుండా జాగ్రత తీసుకోవాలి. తెలుగు సంపన్నమైన భాష, ఏ సాంకేతిక, వైజ్ఞానిక అంశాలనైనా సమర్ధంగా విశ్లేషించి, వివరించి చెప్పగల పదసంపద మన భాషలో ఉంది. దీనిని ఆచార్య హాల్డేన్ వంటి వాళ్లు ఏనాడో గుర్తించారు”. (చూస్తూనే ఉండండి, సినారె,  పుట. 189)

ముగింపు:

టెలివిజన్లో పదాల అల్లిక సరళంగా, సుజావుగా ఆకట్టుకొనేలా జలప్రవాహంలా సాగే విధంగా ఉంటున్నాయి. అవసరమైన చోట ఛలోక్తులను ఉపయోగిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాడు లాంటి సంస్థ తనకంటూ ప్రత్యేక పత్రికాపదకోశంతో ప్రజలకు వార్తలను అందిస్తుంది. ఇప్పడు ఈటీవీలాంటి సంస్థలో సహితం వాడుకభాష ప్రాముఖ్యాన్ని గుర్తించి వాడుకభాషను ఉపయోగించడం జరుగుతుంది. ఇంతకు ముందు అంతర్జాలంలాంటి పదాలకు బదులు ఇంటర్నెట్ ని వాడుతోంది. ఈ విధంగా దృశ్యమాధ్యమాల్లో వాడుకభాష ఉపయోగం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణ సాయిరాం. (2009), చూస్తునే ఉండండి, విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్ హౌస్, ధరణి ప్రింటర్స్, హైదరాబాద్.
  2. భావనారాయణ, తోట. (2008), టెలివిజన్ జర్నలిజం, విశాలాంధ్ర పబ్లిషర్స్, హైదరాబాద్.
  3. చైతన్య, టి.వి.. (1999), ఈనాడు వ్యవహారకోశం,ఉషోదయ పబ్లికేషన్స్ హైదరాబాద్.
  4. రాధాకృష్ణ, బూదరాజు. (2005), తెలుగు భాషాస్వరూపం, ప్రచురణవిభాగం, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ https://archive.org/details/BudarajuRadhakrisha/
  5. రాధాకృష్ణ, బూదరాజు. (2008), వ్యవహారిక భాషా వికాసం, ఈమాట డాట్ కామ్‌ https://eemaata.com/em/issues/200806/1271.html#:~:text
  1. భావనారాయణ, తోట (2011), టెలివిజన్ వార్తారచన, ప్రచురణ విభాగం, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
  2. చెన్నయ్య. జే (2016) తెలుగు పత్రికలు ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం,తెలంగాణ సారస్వత పరిషత్తు. హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]