AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
4. జానపదకళారూపాలు: ప్రార్థన గీతాలు
డా. శ్రీమంతుల దామోదర్
అసిస్టెంట్ ప్రొఫెసర్, జానపదగిరిజనవిజ్ఞానపీఠం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
వరంగల్, హన్మకొండ, తెలంగాణ
సెల్: +91 9989139136. Email: damodarsrimantula@gmail.com
Download PDF
Keywords: జానపద సాహిత్యం, కళారూపాలు, ప్రార్థనగీతాలు, దామోదర్
ఉపోద్ఘాతం:
జానపదకళారూపాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడంతోపాటు, సంస్కృతీ - సంప్రదాయాలను కాపాడటంలో దోహదపడతాయి. ఆధ్యాత్మికభావనలను కల్పించడానికి సంస్కృతి పరమైన రామాయణ, భారత, భాగవత కథలతో పాటు కులపురాణాల్లో ఉండే సన్నివేశాలను ప్రదర్శన రూపంలో ప్రేక్షకులకు, ఆయా కులాల వారికి అందించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. వాటిలో ఏ కళారూపములో ఏ ఏ ప్రార్థన గీతాలు ఉన్నాయో క్షేత్రస్థాయి పరిశోధన ద్వారా వివరించడం ఈ వ్యాసం ఉద్దేశం.
ప్రధానవిషయం:
తెలుగు సంస్కృతీసంప్రదాయాలు జానపదకళారూపాలమీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. జానపదకళారూపాలు - పురాణ, ఇతిహాసాలను నేపథ్యంగా తీసుకొని తమకు అనుగుణంగా సామాజిక పరిస్థితులను బట్టి కళారూపాలను మూలకథకు భంగం కలగకుండా మార్పు చేసుకుంటూ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి.
ప్రతి కళారూపము ఆధ్యాత్మికభావనలతోనూ, విజ్ఞానవినోదాలతోనూ ప్రేక్షకుల్లో ఆనంద అనుభూతిలోకి తీసుకువెళ్లడమే వీటి ముఖ్యఉద్దేశం. అలాంటి జానపదకళారూపాల్లో సంప్రదాయ కళారూపాలు, ఆశ్రితకళారూపాలు, వినోదపరమైన కళారూపాలు, మరియు ఇంద్రజాలకళారూపాలు వంటి వైవిద్యభరితమైన అంశాలను మన ముందు ప్రదర్శిస్తారు. ప్రతి కళారూపం ప్రదర్శనకు ముందు దైవస్తుతితో ప్రారంభమై, మంగళహారతిలో ముగింపు పలకడం వీరి భక్తిభావనకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి జానపదకళారూపాలు తెలుగు రాష్టాల్లో150 కి పైగా ఉన్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రితకళారూపాల సంఖ్య ఎక్కువ. ఇవన్నీ దాతృకులపు కులపురాణాలను మాత్రమే ప్రదర్శిస్తారు. ఆ కులాల సహాయ సహకారాలతో మనుగుడ సాధిస్తూ ఉన్నాయి. మరికొన్ని సంప్రదాయ కళారూపాలు, అన్ని కులాల వారికి రామాయణ, మహాభారత, మహాభాగవత కథలతోపాటు సామాజికంగా ఉన్న కథలను ప్రదర్శిస్తారు. తెలంగాణలో అధిక ప్రాచుర్యం పొందిన కళారూపం “ఒగ్గు కథ”.
కురుమ కులస్తులు:
వీరు కాటమరాజుకథలతో పాటు 30 కథలను ప్రదర్శిస్తారు. వీటిలో మల్లన్నకథ, వీరన్నకథ, పెద్దిరాజుకథ, ఐదు మల్లెలకథ, మాంధాతకథ, సువర్ణసుందరికథ, హరిశ్చంద్రకథ, సారంగధరకథ, కాంభోజరాజుకథ, అల్లిరాణికత, నలమహారాజుకథ వంటి కథలు ఎక్కువగా ప్రదర్శిస్తారు. వీరు ఒగ్గుడోలు, నాపేరా, తాళాలు, కాళ్ల గజ్జలు, మడ్డెల, హార్మోనియం వంటి వాద్యాలను ఉపయోగిస్తారు. వేషధారణలో మగవారు స్ర్తీ పాత్రలు పోషిస్తారు. ఈ కథకులు కథ ప్రారంభంలో -
“............ శరణు శరణు మాయంభారాణి శాంభావిరాణి శాంభవి రాణి,
కరుణ చూడు కన్నా తల్లి గంగాభవాని గంగాభవాని,
ముందు మా యాదులకు మూలదేవత మూలదేవత ,
మందాలోన నెలకొన్న మంద చౌడమ్మ దేవి మంద చౌడమ్మ, శరణు...
గంగ వచ్చే చూడారమ్మ గాలి మేఘనా గాలి మేఘనా
తను వంతు ముత్యాల పేరు ఒళ్లంతా మెరువా ఒళ్లంతా మెరువా.... శరణు...
అంబా గంగ నిన్ను గోలిచేటి గనులెవ్వరమ్మా గనులెవ్వరమ్మ,
ఘనమైన మట్టేవాడ గనుడు చిలికాడు కాటమరాజు.... శరణు...”
అంటూ గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగ అందర్నీ కరునీస్తేనే లోకం సుభిక్షంగా ఉంటుందని నేపథ్యమే ఈ ప్రార్థనాగీతం. వీరు కులకథలతో పాటు ఇతర కథలు కూడా చెప్తారు.
మందెచ్చుల, దుబ్బుల వారు:
గొల్లవారికి ఆశ్రితులుగా ఉంటూ కాటమరాజు కథలతో పాటు 30 కిపైగా కథలను ప్రదర్శించే మందెచ్చుల వారు. మందెచ్చుల వారిని “పొడపొత్రపు” వారనీ కూడా పిలుస్తారు. వీరు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, నల్లగొండ, మహమహబూబ్-నగర్ జిల్లాలో ఉన్నారు. ఈ మందేచ్చుల కళాకారులు డోలు, నాపేరా, చేతికర్ర, మద్దెల, హార్మోనియం, కాళ్ల గజ్జలు వాద్యాలు వంటివి వీరికి ప్రధానమైనవి. మెడలో వెండిదండలు, చేతికి పొంచి ధరించి ఉంటారు. మందేచ్చులు చెప్పే కథలును నకాశి వారి చేత తయారు చేయించిన బొమ్మలను చూపిస్తూ కథల ప్రదర్శిస్తారు. కథ ప్రారంభంలో - గంగాభవాన్ని స్తుతిస్తారు.
“శరణు శరణు మా కన్నా తల్లి శాంభవి రాణి శాంభవిరాణి,
శరణు చూడు మా కన్నా తల్లి గంగాభవాని దేవీ భవాని”
అంటూ కథను ప్రారంభం చేస్తారు. పెద్దేవరను కొలిచే పూజారులుగా వ్యవహరించే దుబ్బుల వాళ్ళు అన్ని కులాలకు పెద్దేవర (కనకదుర్గాదేవి) ని పూజిస్తారు. వీరు కొలుపును పూజించే వారి ఇళ్లల్లో చేస్తారు. కొలుపు ప్రారంభంలో....
“ధనం ధాన్యం తల్లి బహు పుత్ర లాభం
ముట్టింది ముత్యమై తల్లి ఏములాడ రాజన్న
కొండగట్టు అంజన్న తిరుపతి వెంకన్న
యాదగిరి నరసింహస్వామి కనకదుర్గమ్మ” అంటూ “దుబ్బు” శబ్దం వాయిస్తూ ఉంటాడు.
ఐలోని మల్లన్న ఊరిపోచమ్మ సమ్మక్క సారలమ్మ అంటూ దుబ్బు శబ్దం చేస్తూ దేవతలందరినీ స్తుతిస్తూ ఇంటి వారిని చల్లగా చూడు మని వేడుకుంటారు. ఈ కళారూపం దుబ్బు వాయిద్యం. వీరు కాళ్ళ గజ్జలతో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ కొలుపూ చేస్తారు. దుబ్బువాద్యం డమరుకం లాగా పెద్ద ఆకారంలో ఉంటుంది. దీనికి గజ్జలు కట్టి కుడికాలు పాదం మీద పెట్టుకొని దుబ్బు వాయిస్తారు.
గౌడ జెట్టీలు:
వీరు గౌండ్ల వారికి ఆశ్రితులు. గౌడ పురాణాన్ని పటం ఆధారంగా కథ చెప్తారు. కథ ప్రారంభంలో -
“రక్షించు జనని మహంకాళి
నీకు సేవ చేసేదా గుణశాలి
.......... .....రక్షించు ....
జగదాంబ మమ్మేలు రావా
తల్లి జగములు సవరించలేవా జగదాంబ రక్షించు జనని నీ సత్కాల
భగవతి నీ పాటీ బాలచంద్రుడు లేడు
.....జగదాంబ....”
అంటూ జగదాంబను వేడుకుంటారు. వీరితోపాటు ఏనోటి వారు కూడా గౌడ వారికి పటం ద్వారా కులపురాణాన్ని ప్రదర్శిస్తారు. వీరు కథ ప్రారంభంలో గణపతి దేవుని స్తుతిస్తారు.
“శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిజ్ఞోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతంభక్తానాం ఏకదంతం ముపాస్మహే
ఏకదంతం ముపాస్మహే....”
అని విఘ్నాలు తొలగే వినాయకుని ముందుగా తలచి కథను మొదలుపెడతారు. ఈ కళాకారులు నాటక రూపంలో కూడా కథలు చెప్తారు. దీనితో ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుందని కళాకారులు సంతోషం వెలిబుచ్చుతున్నారు.
బేడ బుడగ జంగం కులస్తులు:
వీరు చెప్పే శారదకథలో ప్రధాన కథకుడు “శారద” అనే వాద్యాన్ని వాయిస్తూ కథ చెప్తుంటే ఇరువైపులా ఒక్కొక్కరు బుర్ర వాయిస్తూ వంత పాడుతారు. వీరు చారిత్రక కథలు బొబ్బిలి పులి, బలుగురు కొండయ్యకథ, సర్వాయి పాపన్న కథలతో పాటు దేవతల కథలను చెపుతారు. వీరు కథ ప్రారంభంలో సరస్వతీ దేవిని స్తుతిస్తూ......
“అంబా పరాకు దేవీ పరాకు
మమ్మేలు శారదా పరాకు ..........
అంబా మమ్ము బ్రోలు చక్కని శారదాంబ పరాకు
హరిరామరామయ్య రామరామయ్య ...రామ రామ .....”
అంటూ కథలు చెప్తారు. కర్మకాండలు, దినకార్యాలతో పాటు వివిధ సందర్భాల్లో కథలు చెప్తారు. వీరికి బహు భార్యత్వం ఇద్దరు భార్యలు భర్త కలిపి ఒక బృందంగా ఉంటారు. పూర్వం ఈత ఆకులతో చాపలు అల్లుకుంటూ ఊరురు, ఇల్లిల్లు తిరుగుతూ పాటలు పాడుతుండేవారు .
బైండ్ల కళారూపం గ్రామదేవతల ఉత్సవాల్లో, గ్రామదేవతల ప్రతిష్టలో వీరి ప్రదర్శన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అదేవిధంగా మీరు మాదిగ కుల పురాణాలను, కోలుపులను కూడా చేస్తారు. వీటితోపాటు ఎల్లమ్మ కథ, తరిదేవి కథ, మైసమ్మ కథ, పోచమ్మ కథ, మాంధాతకథ వంటి కథలను చెబుతారు. వీరు వాయించే ప్రధానవాద్యం “జెమడికా”. కథ ప్రారంభంలో అమ్మవారిని స్తుతిస్తూ
“........... తల్లి నిన్ను కొలచి దండములు పెట్టి కరమెత్తి మొక్కెదా
నాకన్నా తల్లి అవని లోపల జనుల అంబవే తల్లి
భవనీల పాలిట ఓ కల్పవల్లి
గవ్వ దర్శనాలు ఘనంగా ధరించి
ముప్పొద్ద పూజలు చేసేము తల్లి
గుగ్గిలం మైసాక్షి కుప్పగా పొగలేసి
తలచితి మీ మదిలోన తల్లి మాయమ్మ
సుతులు జమిడికలు సుందరముగా వ్రాయించి
కాళ్ల గజ్జలు కట్టి ఘల్లునామొగించి
ఆడితి నీ ముందు అంబవో తల్లి
ఇల్లిల్లు నీ పూజ ఇష్టముగా చేసి
జగన్మాత నిన్ను జగమేల కొలిచేరు
కోపగించకు తల్లి ఓపజాలమ్మ
బగ్గు బగ్గు న మండి / బొబ్బలు లేపి
కష్టపెట్టకు మమ్ము ఓ కన్నతల్లి
కొత్త కుండల కల్లు సాకలు నీకు
గడపగడపకు నీకు కలివేపరేల్లలు
ఆపదలు బాపేటి అమ్మలకు అమ్మ
శాంతింపు మాతల్లి జగమేలే తల్లి
కోపగించేడి వేళ కోడిపుంజులు
బలిబలి గొర్రెపోతుల బలి బలి
శాంతింపు శాంతింపు ఓ జగన్మాత
భవనీల ఇలవేల్పు భార్గవి అంబా
దండాలు దండాలు చండికా…”
అంటూ ఎంతో ఆవేశంతో, భక్తి భావంతో దేవతకు మొక్కుబడులు, దేవతను శాంతింపజేసే చర్యలు ఈ ప్రాంతంలో కనబడుతుంది. ప్రధానకథకుడు జమిడిక వాయిద్యం వాయిస్తూ కథ చెప్తుంటే వంతలు ఇద్దరూ వంత పాడుతారు.
పద్మనాయకృతాంతము:
తోటి గిరిజనులు, గిరిజన ప్రాంతమైన ఆదిలాబాద్ నుండి - వరంగల్, కరీంనగర్ వంటి మైదాన ప్రాంతాలకు వలస వచ్చిన వీరు నాయకపొడు గిరిజనులకు "పద్మనాయకృతాంతము" కథను ప్రదర్శిస్తారు. కథ ప్రారంభంలో...
“గణేశా నిన్ను వేడితిమి గనింపకు మాది దోషములు
పార్వతి తనయుడా వనుచూ ప్రార్థ
నలు బాగుగా చేసితిమీ...గణేశ ..
గుండ్రాళ్లను పోలినటువంటి ఉండ్రాళ్ళను చేసి పెడితేమీ
...గణేశా...
మూషిక వాహనుడవయ్యా ముందుగా ఇటుక రావయ్యా
ఏనుగు తొండము నెత్తి వేగమే దీవెనలు లోసగుమా
...గణేశా …”
అంటూ వినాయకుని స్తుతిస్తూ కథ ప్రారంభిస్తారు. వీరు పటం ఆధారంగా కథ చెప్తారు. వీటితోపాటు రామాయణ, మహాభారత కథలను కీకిరి (బుర్ర) వాద్యాలతో కథలు చెప్పడంలో వీరు నేర్పరులు. వీరికి సంబంధించిన వారు అదిలాబాద్ జిల్లాలో గోండ్ తెగకు ఉపతెగగా ఉంటూ వారికి సంబంధించిన కథలను గోండు భాషలో చెప్తారు.
చిరుతల రామాయణం:
ఇది తెలంగాణ గ్రామ గ్రామాన వెలసిన భజన సంప్రదాయానికి చెందిన కళారూపం. ఇందులో 15 మందికి తక్కువ కాకుండా కళాకారులు ప్రదర్శన ఇస్తారు. వీరు దోతి, అంగి, నడుముకు తువ్వాల, నెత్తికి రుమాలు చుట్టుకొని చిరుతలు పట్టుకొని కాళ్లకు గజ్జలతో ఒక రకమైన లయలతో అడుగులు వేస్తూ గుండ్రంగా నిలబడి రామాయణాన్ని అలపిస్తారు. రామాయణంలో ఉన్న పాత్రలన్నిటిని ఒక్కొక్కరు ప్రదర్శిస్తారు. ఆ పాత్రకు అనుగుణంగా ఆ పాత్రధారి వేషంలో తన సన్నివేశం వచ్చినప్పుడు మధ్యలో నిలబడి తన పాత్రను పోషించడం కన్నులకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ ప్రాంతంలో చిరుతల రామాయణంలో ఆయా పాత్రులు ధరించేవారన, కొన్ని సంవత్సరాల పాటుగా ప్రదర్శనలు ఇచ్చినవారిని రామాయణంల వారు ప్రదర్శించిన పాత్రల పేరు మీద పిలవడం ఇక్కడ గమనార్హం. అంటే వారు ఆ పాత్రలో ఎలా జీవించారో అనేది మనకు అర్థమవుతుంది. ఈ కళారూపం ప్రారంభంలో చిరుతలు వాయిస్తూ -
“ఇగ్న రాజ నీకు శరను ఇప్పుడే చేతుబ్రోమయ్య
వేగ వేగ బ్రోవుమయ్య ఏకదంతా
మేలుమయ్యా ఏకదంతా మేలుమయ్య
నాగవాసులైన నీకు నమ్మి మొక్కు విడువలెను
రాజమహ రాజా నిర్మల రాజ వెంకటరమణయనుచు
భాద్రపద శుద్ధ చవితి భక్తితో నిన్ను కొలిచెదము
బలరాముని దయతోడ పాలనంబుచేయు వాడా
... ఇగ్నా రాజా నీకు చరను ఇప్పుడే చేతులు బ్రోవుమయ్యా…
రాజా రామచంద్రమరాజు కి జై …”
అంటూ భజన, నాటక రూపంలో ప్రదర్శించడం చిరుతల రామాయణ ప్రత్యేకత. ఇలా జానపద కళారూపాలు వారు ప్రదర్శించే కథల్లో ప్రార్ధనాగీతాలు పాడడం. ముగింపులో మంగళం పాడి ప్రేక్షకులు ఇచ్చే కట్నాలు తీసుకొని సంతోషపడే కళాకారుల ప్రదర్శననైపుణ్యము, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి.
ముగింపు:
జానపదకళారూపాలన్నీ ప్రదర్శించేముందు ప్రార్థనగీతాలు పాడి కథను మొదలుపెట్టడం ఆనవాయితీ. అయితే ఆ కళారూపం ప్రార్థనగీతమే వారి ప్రధానదేవతగా ఉంటుంది. ఈ కళారూపాలన్నీ తాము ఏర్పరుచుకున్న సమాజంతో సమాజానుగతంగా మార్పు చేసుకుంటూ, భక్తిభావంతో దైవస్తుతినీ చేసే ప్రేక్షకుల్లో ఆధ్యాత్మిక పెంపొందించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ ప్రార్థనగీతాలు నేటి సమాజానికి ఆధ్యాత్మికభావాలను కల్పిస్తాయనండంలో సందేహం లేదు.
ఉపయుక్తగ్రంథసూచి:
క్షేత్ర పరిశోధన ద్వారా, కళాకారులతో ఇంటర్వ్యూ ద్వారా ఈ వ్యాసం వ్రాశాను. విషయదాతలు-
- సుక్క సత్తయ్య, మాణిక్యపురం, వరంగల్ జిల్లా, తెలంగాణా
- కడెం పర్వతాలు, వెంకటాపురం, వరంగల్ జిల్లా, తెలంగాణా
- ఏ నోటి ఏకాంబరం, రాయపర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణా
- జ్ఞానం కనకయ్య, చింతల్, వరంగల్ జిల్లా, తెలంగాణా
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.