headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797

3. బంజారా భక్తిసాహిత్యం: స్త్రీల ప్రాధాన్యం

డా. రాగ్యానాయక్ అడావతు

పరిశోధకుడు, తెలుగుశాఖ
పొట్టి శ్రీరాముులు తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
సెల్: +91 9133220230. Email: ragyanaik133@gmail.com

Download PDF


Keywords: బంజారా, సంస్కృతి, సాహిత్యం, భక్తి, స్త్రీల ప్రాధాన్యం, గేయాలు, రాగ్యానాయక్

ఉపోద్ఘాతం:

బంజారాలకు తమ దేవతలపై ఉన్న భక్తి అపారం. అయినంత మాత్రాన ముస్లిం, క్రైస్తవ, సిక్కు మరియు పౌరాణిక దేవతలపై కూడా భక్తి అధికమే. ఇతర మతదేవతలను కూడా ఏనాడు ధిక్కరించి ఎరుగరు. ఇతర మతాల దేవతలను కూడా ఆరాధించడం వీరి సహృదయతకు నిదర్శనం. అలాంటి బంజారాల భక్తిసాహిత్యంలోని స్త్రీ ప్రాధాన్యం గురించి ఈ వ్యాసం తెలుపుతుంది.

ప్రధానవిషయం:

బంజారా సంస్కృతిలో భక్తిసాహిత్యానికి అధిక ప్రాధాన్యత ఉన్నది. బంజార సాహిత్యంలో స్త్రీల పాటలే అధికం.  స్త్రీ శక్తి దేవతల్లో దాదాపుగా అన్ని  భక్తి పాటల్ని  స్త్రీలే అలపించడం జరుగుతుంది. కొన్న సందర్భాల్లో మాత్రమే పురుషులు ఆలపిస్తారు. అదే విధంగా పితృదేవతలు పాటలు కూడా స్త్రీలే ఆలపించడం జరుగుతుంది. ముఖ్యంగా పౌరాణిక  దేవతలను సందర్శించేటప్పుడు, సందర్శించి వచ్చేటప్పుడు కూడా స్త్రీలే ఆలపించడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే బంజారా సంస్కృతిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది. బంజారా భక్తి సాహిత్యంలో పురుష సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో “బావోజి” బంజారా భక్తి సాహిత్యాన్న వాయిద్యాలలో ఆలపించడం అనవాయితీ. అతన్ని అనుసరించి మిగిలన వాళ్లు ఆలపిస్తారు. వీరు ఆలపించేటప్పుడు కొన్ని ప్రత్యేక వాయిద్యాలు వాయిస్తారు. అవి “నగారా, కంచుపళ్ళెం, తప్పెట్లు” అనే మూడు రకాల వాయిద్యాల్ని వాయిస్తూ ఆలపిస్తారు. బంజారాలు బావోజిని అధ్యాత్మక గురువుగా భావిస్తారు. అలాంటి బావోజి బంజారాలు ఆరాధించే స్త్రీ శక్తి మూర్తుల సాహిత్యం, పితృదదేవతల సాహిత్యం, పౌరణిక దేవతల సాహిత్యాల్ని ఆలపిస్తారు. ఉదా. సేవాలాల్ మహరాజ్ ని గూర్చి ఆలపిస్తే అతని చరిత్ర మొదలుకోని తను చేసిన దైవ కార్యక్రమాలనుగూర్చి, జీవిత విశేషాలను గూర్చి కొన్ని గంటలు అలానే ఆలపిస్తాడు. అలా ఆలపిస్తున్నప్పుడు తండాలో ఉన్న ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి ఆ సాహిత్యాన్ని వింటుంటారు.

బంజారా భక్తిసాహిత్యం అనాదిగా ఈ విధంగానే వస్తున్నది. ముందుగా బంజారాలు అరాధించే దేవతలకు సాహిత్యలని చూద్దాం. తెలుగు వారు గ్రామదేవతలను ఆరాధించినట్లే, బంజారాలు కూడా స్త్రీశక్తి దేవతలను ఆరాధిస్తారు. ఈ దేవతల్లో ముందుగా, - తుల్జా భవానీ, మేరామ భవానీ, సీతళా భవానీ, మత్రాల్ భవానీ, దోళాంగర్ భవానీ, హింగళా భవానీ, కంకాళీ భవానీల. ఈ స్త్రీ శక్తి దేవతలను తండా స్ర్తీశక్తి దేవతలుగా కూడా చెప్పవచ్చు. వీరిని గూర్చిన భక్తి సాహిత్యం ఎక్కువగా దసరా పండుగ సందర్భంగా ఆలపిస్తారు.

ధాళి భజన్:

          “సమీ సాంజేరో

          కరియా దొప్పేరో

          ఢళితే దాడేరో

         యాడి తారో పాల్ మాండేరో        = 2

          అన్జిమాయి

          ఢళితే దాడేరో

          యాడి తారి చ్వాకో పూరేరో         = 2

          సమీ సాంజేరో

          కరియా దొప్పేరో

          యాడిరో వాజ వాజేరో              =  2

(శ్రీ శ్రీ జయరాం గురుస్వామిజీ, లక్ష్మినగర్ తండా, రంగారెడ్డి జిల్లా)

భావం:  తుళ్జా అమ్మా ! నిన్ను మిట్ట మధ్యాహ్నం వాయిద్యాల చప్పుళ్ళ మధ్య ఇంటిముందు పెట్టాము. నీకు ఎండ తగలకుండా డేరా (గూణ్) కట్టాము. నీ వెనుక భాగంలో ధాన్యపు బస్తాను ఉంచాము. నీ ముందు ముగ్గు (చ్వాకో) వేశాము. మధ్యలో త్రిశూలాన్ని నిలబెట్టాము. ఇంటికి ఒక యాటను జలదరింపజేసి (ధడ్ ధడి) కోశాము. తల్లి మమ్ము ఎల్లప్పుడు చల్లగా చూడమని కోరుకుంటున్నాము.

ఈ విధంగా ఆలపించడం జరుగుతుంది. అటు పిమ్మట అమ్మకు నైవేద్యం సమర్పించేటప్పుడు బావోజి “అర్ధాస్”  (భక్తి విన్నపం) చేస్తాడు. బహుశా ఇలాంటి విన్నపం మరే గిరిజన సంప్రదాయాల్లో లేకపోవచ్చేమో! ఇతర కులాల్లో కూడా లేకపోవచ్చేమో అని చెప్పవచ్చును. ఎందుకుంటే వీరి విన్నపాల్లో సాహిత్యం ఉండటం, సాహిత్య పరిభాషలో ఆలపించడం లేదా విన్నవించడం ప్రత్యేకంగా అనిపిస్తుంది.

          మారి యాడి తూల్జా యాడి

          తారో చ్వాకేమా బ్యాటెచయాడి

          తోన్ ధోకరేచా యాడి

          గోర్ గరిభ్ తార్ చ్వాకేమ బ్యాటేచ యాడి

          వాంజు అయ, యాడి గోథో భర్దస్

         యాడి తోళ్జా యాడి

         యాడి హింగళా యాడి

         తార్ చ్వాకేమా కాణో అయా

         ఆంకి సదార్ యాడి

              ”   ”

              ”   ”

(జటావత్ జోడ్యి బావోజీ, జటావత్ తండా, దేవరకొండ)

భావం : అమ్మా ! తుళ్జా భవానీ నీ సన్నిధిలో కూర్చున్నాము. నిన్ను మ్రొక్కుతున్నాం తల్లి. పిల్లలు లని వారు నీ సన్నిధికి వచ్చారు తల్లి. వారికి పిల్లలను ప్రసాధించు, గ్రుడ్డి వాళ్ళు వస్తారు. చూపును ప్రసాదించు తల్లి అని వేడుకున్న తీరు కనిపిస్తుంది.

సీత్ళా భవానీ థాళీ భజన్ :

          రామి రామి సీత్ళా యాడి

         సారి తాండో దేకియాయి, పాల పండో కాయ          = 2

         యాడి తారి గళేమా

         రప్పియారి హారచ                            = 2

         గోర గరిబ యాడి, తోన పూజా కర           = 2

         బాల్ బచ్చామా యాడి, తూయి సాయి వేజో = 2

         సారి తాండో భళన యాడి, తారో పూజకరరేచా = 2

         వర్సే వర్సేరో యాడి, తోన సేవరేఛా           = 2

         పాటేరో వేస్ యాడి, తోనచడారేఛా            = 2

         భోకడ లారేచ యాడి, రాజీ వేగీ కాయి         = 2

         గోరగరిభ యాడి, సీత్ళా పూజరేఛా            = 2

         టాండేరో నాయక్ యాడి, అర్ధాస్ కరరోఛ     = 2

         టాండేరో కార్భారీయాడి, పగలా పడరోఛ      = 2

         జురళో నాచరీచ యాడి, సాయి వేగి కాయి ?   = 2

        (శ్రీ శ్రీ జయరాం గురుస్వామిజీ, లక్ష్మినగర్ తండా, రంగారెడ్డి జిల్లా)

భావం : అమ్మా సీత్ళాభవానీ ! మా తండానంతా కలియ తిరుగు, ప్రతి ఇంటికి వెళ్ళు. వారి బాధలు తీర్చు. మెడలో రూపాయి బిళ్ళల హారం పెట్టుకున్నావు. నీ రూపాన్ని చూస్తే మాకు ఎంతో సంతోషం. మా గోవుల్ని రక్షించు. పిల్లా పాపల్ని చల్లగా చూడు. తండా మొత్తం నీ పండుగ చేస్తున్నాము. “పాటేరో వేస్” (బంజారా స్త్రీలు వేసుకునే లంగాలో ఒక భాగం) ను నీకు సమర్పించాము. నీకు యాటలను కోశాము సంతోషిస్తున్నావా ! అని అడుగుతున్నారు. మా తండా నాయకుడు నిన్ను అర్ధిస్తున్నాడు, కార్ భారీ (కార్యదర్శి) నీ ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. వారి మొర అలకించు అని అర్ధం.

పితృదేవతా సంబంధిత భక్తి సాహిత్యం:

బంజారా తెగల్లో దైవ భక్తులైన పూర్వీకుల్ని పితృదేవతలుగా వ్యవహారిస్తారు. వీరిలో కొందరు బాలాజీలుగా, సాధువులుగా పిలువబడుతున్నారు. ఈ పితృదేవతలలో 18వ శతాబ్ధానికి చెందినవాడు. మరణాంతరం వీరు భగవంతునిగా పూజలందుకుంటున్నాడు. శ్రీశ్రీశ్రీ హాతిరాం బాలాజీని కూడా కులదైవంగా పూజిస్తారు. తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్ళే ప్రతి బంజారాలు హాతిరాం బాలాజీని దర్శించుకోవడం అనవాయితీ, స్వామిగారి నాగారాను వాయిస్తూ గానం చేసి వస్తారు. బంజారాలు స్త్రీశక్తి దేవతలకు జంతువులని బలిచ్చినా, పితృదేవతలను మాత్రం శాఖాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అదే విధంగా “భూడియా బాపు” (రంగాం గుండు తండా, హాలియా, నల్లగొండ జిల్లా),  “ఫకీరా సాథ్” “మోటో బావా” (గౌరెల్లి, మాల్, రంగారెడ్డి జిల్లా) “మత్రియా సాథ్” (ఎర్రకుంటపాలెం, మాచర్ల, గుంటూరు జిల్లా) “లోకా సాథ్” (భూత్పూర్, మహాబూబ్ నగర్ జిల్లా) సాయినాథ్, సోమానాథ్ లను ఆరాధిస్తారు.

థాళీ భజన్:

          దేవేమా దేవ కుణసో దేవ రే గడ వాసి = 2

         దేవేమా దేవ సేవాలాల్ రే గడవాసి     = 2

         సాదేమా సాద్ కుణసో సాద్ రే గడ వాసి = 2

         సాదేమా సాద్ సేవాసాద్ రే గడవాసి = 2

         దేవళేమా దేవళ్ కుణసో దేవళ్ రే గడవాసి = 2

         దేవళేమా దేవళ్ సేవాలాలేరి దేవళ్ రే గడవాసి = 2

          (రామవత్ జాను బావోజీ, ఎర్రకుంట తండా, మల్లేపల్లి)

భావం: దేవుళ్ళలో ఏ దేవుడు బంజారా వాసి, దేవుళ్ళలో సేవలాల్ దేవుడు బంజారావాసి, సాధువులలో సాధువు సేవాలాల్, గుళ్ళలో గుడి సేవాలాల్ గుడి, యజ్ఞంలో యజ్ఞం సేవాలాల్ యజ్ఞం గొప్పది అని అర్ధం.

థాళీ భజన్:

          సోనేరి గుడి మా సుతో / సేవాల్ బాపు = 2

         సత్తేతి భరోరే  మారో / సేవాల్ బాపు = 2

         థరమిరో బేటారే మారో / సేవాల్ బాపు = 2

         భీమారో బేటరే ఉతో/ సేవాల్ బాపు = 2

          (రమావత్ జాను బావోజీ, ఎర్రకుంట తండా, మల్లేపల్లి)

భావం: బంగారపు గుడిలో సేవాలాల్ నిద్రిస్తున్నాడు. వాడు ఎంతో శక్తిమంతుడు. వారి తల్లి దర్మిబాయి, వారి తండ్రి భీమానాయక్. సేవాలాల్ తలకు ఎర్రని తలపాగ కట్టుకున్నాడు. అతడు మేరామా భక్తుడు. ఏడుగురు శక్తి దేవతలు కలిసి అతడికి సేవాలాల్ అని పేరు పెట్టారు. వారి శక్తిని సేవాలాల్ కు ఇవ్వడం వల్ల బంజారాలకు చల్లగా చూస్తున్నాడు.

థాళీ భజన్ :

          బాపు కత్తే పడోరే, సాత్ పడేవాళో            = 2

         సోనేరి గాదిపర బ్యాటోరే, సాత్ పడేవాళో    = 2

          సాపేరి పగిల్యామ సూతోరే, సాత్ పడేవాళో   = 2

         సాత్ పడ తోన ఖోల్లరే, సోనెరరో బాలాజీ     =2

         బాపురో వేశం లిదేరే, హతిరాం బాలాజీ      = 2

         ఘళేమ మాళా వాళేరే, సాత్ పడేవాళో        =2

         హూబో బొట్టువాళోరే, హతిరాం బాలాజీ     = 2

          (రామవత్ హర్వ బావోజీ, ఇస్లోవత్ తండా, దేవర కొండ)

భావం: నిలుపు బొట్టు కలవాడా, మెళ్ళో మాల కలవాడా, భుజాన సంచి కలవాడా, నిలుపు చకలవాడా అని హతిరాం బావోజీ రూపేణ వెంకటేశ్వర స్వామిని కీర్తించడం గమనించవచ్చు.

ఈ విధంగానే బంజారాల బావోజీ వారి మూలపురుషులను గూర్చి భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. బావోజీ ఈ విధంగా అలపించేటప్పుడు స్త్రీలు గూర్చి భక్తి శ్రద్ధలతో చేస్తూ భక్తి గేయాల్ని ఆలపించే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విధంగానే భూడియా బాపు సాత్ మత్రియ సాథ్ లోకాసాథ్ నానుసాథ్, సోమానాథ్ లను గూర్చి భక్తి సాహిత్యాన్ని కొలుస్తారు.

పౌరాణిక దేవతాసంబంధిత భక్తి సాహిత్యం:

బంజారాలు పురాణాలు, ఇతిహాసాలు చదవకపోయిననూ, ఇరుగు పోరుగు భాషల్లో కథలను విని, కథాప్రదర్శనలను చూసి, తమ భాషల్లో కూడా వాటిని పాడటం చేస్తుంటారు. బంజారాలకు వెంకటేశ్వర స్వామిపై భక్తి అపారం. బంజారాల కుల గురువైన హతిరాం బావోజీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడినట్లు కథలు కూడా చెప్పుకుంటారు. బంజారాలు పౌరాణిక దేవతలైన వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, శ్రీ కృష్ణుడు, సీతారాములు, దత్తాత్రేయస్వామి, కురివి వీరభద్రస్వామి, వేములవాడ రాజన్న, శివుడు, గురుదేవ్ (గురునానక్) లను దర్శించేందుకు వెళ్ళేటప్పుడు త్రోవలో నృత్యం చేస్తూ స్త్రీలు భక్తిగేయాల్ని ఆలపించడం జరుగుతుంది.

తండాల్లో ఆంజనేయస్వామి గుడులు, శ్రీకృష్ణుని గుడులు, వెంకటేశ్వర స్వామి గుడులు ఉంటాయి. ఆ గుడులలో దూపతాప నైవేద్యాలు చేసేటందుకు “బావా” బావోజీలు ఉంటారు. వీరు స్వామివారిని కీర్తిస్తూ గానం చేస్తాడు. వీరికి తోడుగా కొంతమంది సహగానం చేస్తారు. ఈ విధంగా బంజారాల భక్తిసాహిత్యం కోకొల్లులుగా వెలువడింది. కానీ గ్రంథస్థరూపంలో లేదు. అంతా మౌఖికంగానే ఉన్నది.

బంజారాలు వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడిని, ఆంజనేయస్వామి దర్శించేందుకు వెళుతున్నపుడు ఆ తండాస్త్రీలు వారిని సాగనంపుటకు పాటలు పాడుతారు. బంజారా భక్తి సాహిత్యంలో స్త్రీల భక్తిసాహిత్యం కూడా ఎక్కువే. ముందుగా వెంకటేశ్వరస్వామి గూర్చి బంజారాస్త్రీలు పాడే భక్తి గేయాలని చూద్దాం.

 “చూటి ధోతి వాళో, బాలాజీ హతే మోతిరో పూల్ / ధోతితోన ఖోల్లరే బాలాజీ, హతే మోతిరో పూల్

చూటి ఘేరి వాళో బాలాజీ, హతే మోతిరో పూల్ / ఘేరి తోన ఖోల్లరే బాలాజీ, హతే మోతిరో పూల్

గళేమ మాళావాళో బాలాజీ, హతే మోతిరో పూల్ / మాళాతోన ఖోల్లరే బాలాజీ, హతే మోతిరో పూల్”

(నల్లగొండ జిల్లా, బంజారా సాహిత్యం – జీవన చిత్రణ పుట. 149)

భావం: వెంకటేశ్వర స్వానీ నీ పాదాలదాకా వ్రేలాడే దోవతికుచ్చుళ్ళతో, మెడలో ముత్యాలదండతో, పూలమాలతో స్వామి వారిని ఆలంకరించారు. బాలాజీ కురులకు చందనపు దువ్వెన దువ్వి నిలువుగా కుందనపు బొట్టును పెట్టినారు. ఈ గేయంలో బాలాజీకి బంజారా పురుషులు ధరించే ధోవతిని కట్టించడం, పొడవైన కోటును తొడిగించడం, తలకు తలపాగ కట్టించడం చేత స్వామివారి సౌందర్యాన్ని రెట్టింపు చేశారు.

ముగింపు:

ఈ విధంగా మిగిలిన పౌరాణికదేవతలపై ఎన్నో భక్తిగేయాల్ని బంజారా స్త్రీలు ఆలపించడం జరుగుతుంది. కానీ! నేడు ఈభక్తిసాహిత్యం తన ఉనికిని కోల్పోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగు భక్తిగేయాలు, పాటల, సాహిత్యాల ప్రభావంచేత అనాదిగా వస్తున్న బంజారాల భక్తిసాహిత్యం తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టి, వీటిని కాపాడాల్సిన ఆవశ్యకత నేటి బంజారా సమాజంపై ఎంతో ఉంది.

ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆచార్య యం. గోనానాయక్: భారత దేశంలో బంజారాలు, తెలుగు అకాడమీహైదరాబాద్, 2005
  2. బి. చీనియా నాయక్: బంజారా చరిత్ర – సంస్కతి – ప్రగతి శ్రీ హథేరాం బావోజీ పబ్లికేషన్స్, 1998
  3. ఆచార్య సూర్య ధనుంజయ్: బంజారా సాహిత్యం – జీవన చిత్రణ  నల్గగొండ జిల్లా  2009
  4. ఆచార్య పిల్లలమర్రి రాములు : తెలుగు భక్తిసాహిత్యం సామాజిక విశ్లేషణ ప్రజా శక్తి బుక్ హౌస్ 2012
  5. జనపాల శంకరయ్య: తెలుగు లంబాడీల గేయ సాహిత్యం స్వీయ ప్రచురణ హైదరాబాద్ 2001

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]