headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. రామాయణం: సోదరుల అనుబంధాలు

డా. హెచ్. కిషన్

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ తెలుగు,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బేగంపేట్, (అటానమస్),
హైదరాబాద్‌, తెలంగాణ.
సెల్: +91 9848170041, Email: drkishanh@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 02.09.2024        ఎంపిక (D.O.A): 28.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

శ్రీమద్రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి అందించిన వేదోపబృంవాతం. వేద ధర్మ మూర్త రూపం శ్రీరామచంద్రుడు. ఆ రాముడు జీవితగాధ రామాయణం. కుటుంబసంబంధాలను, బాధ్యతలను గుర్తెరిగి, వర్తమాన జీవన పరిస్థితులను తీర్చిదిద్దుకోవడం కోసం, సనాతన భారత ఆర్ష ధర్మ విజ్ఞాన గనిగామనకు వాల్మీకి అందించిన ఈ శ్రీ రామాయణంలో సోదరుల పాత్రలను విశ్లేషించడం ఈ వ్యాస ఉద్దేశం. రామాయంలో కుటుంబ సంబంధాంశాలపై అక్కడక్కడ వ్యాసాలు వచ్చాయి. సోదర అనుబంధాలను కూడా వివరించిన దాఖలాలున్నాయి. కొన్ని సోదర జంటలను ఎంపిక చేసుకుని విశ్లేషణాత్మకంగా ఈ విధమైన సోదర బంధాలను తెలియజేయడం, తద్వారా నేటికాలానికి నిత్యజీవనంలో ఉన్న అనుబంధాలను, దారి చెదరకుండా సవ్యమార్గంలో ప్రయాణించేలా ఉద్బోధించడం ఈ రచనాలక్ష్యం. వాల్మీకి రామాయణం, సంబంధిత గ్రంథాలు ఈ వ్యాసరచనకు ఆకరాలు.

Keywords: రామలక్ష్మణభరతశత్రుఘ్నలు, వాలిసుగ్రీవులు, రావణవిభీషణకుంభకర్ణులు, సంపాతి జటాయువు, మాల్య సుమాలి మాలి, హేతి ప్రహేతి, లవకుశలు, సుబ్రాహుడు సూరసేనుడు, అంగదుడు చంద్రకేతుడు, సుభాహుని శత్రుఘూతి.

1. ఉపోద్ఘాతం :

రామాయణంలో ప్రతి పాత్ర విశేషమైనది. ఒక సందేశంతో కూడిన ధర్మబోధ చేసే ఉద్దేశంతో మహర్షి వాల్మీకి ఈ కావ్యంలోని ప్రతి పాత్రను తీర్చిదిద్దడంతో, నైపుణ్యంతో కూడిన శిల్పి, తన అపార అనుభవంతో తీర్చిదిద్దిన రూపురేఖలతో ఈ మహాకావ్యంలోని ప్రతి పాత్ర మనకు కనుల ఎదుట ప్రత్యక్షమై ధర్మబోధ చేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామాయణ మహాకావ్యంలోని సోదరుల పాత్రలను ప్రత్యేక దృష్టితో అనుశీలనం చేసి ఆధునిక సమాజానికి, యువతకు మార్గదర్శనం చేయడం ఈ వ్యాసం యొక్క ప్రయోజనం. ఈ వ్యాసం రాయడం కోసం స్వీకరించిన ప్రధానగ్రంథం వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం. శ్రీరామయణంలోని సోదరుల అనుబంధాలను తెలుసుకుందాం.

2.1 రామ లక్ష్మణ భరత శత్రఘ్నులు :

ఈ నలుగురు సోదరులు దశరథుని కుమారులు. రాముడు ఇలా అంటాడు. మా నాన్న పిన్నమ్మ కైకకు మాట ఇచ్చాడు. మా తండ్రి మాటను నెరవేర్చవలసిన బాధ్యత కొడుకుగా నాకు ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను 14 సంవత్సరాలు కైక కోరిక మేరకు భరతుడు ఇక్కడ రాజ్యం పాలిస్తాడు. సత్య ధర్మాలకు కట్టుబడి మా తండ్రి దీనికి అంగీకరించాడు. ఈ వంశంలో ఆడిన మాట తప్పడం అంటూ ఇంతవరకు జరగలేదు. జరగకూడదు. రాముడు గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. ఈ రోజే దండవనానికి ప్రయాణం కట్టాలని సీతతో అంటాడు. నీ వెంట నేను కూడా వస్తాను అంటుంది సీత. భర్తతోపాటు కష్టసుఖాలు అనుభవించడం భార్య విధి. నన్ను కూడా మీ వెంట తీసుకుని వెళ్ళండి, అంటూ సీత కళ్ళ వెంబడి కన్నీటి ధార కారుతుంది. వెంటనే భార్య సీతను చేరదీసి బుజ్జగించి అలాగే త్వరగా ప్రయాణం కా అంటాడు. ఇక ఆలస్యం చేయకుండా వనవాసానికి సిద్ధమవ్వమని రాముడు అంటాడు. ఆ మాటకు సీత ఆనందంతో పొంగిపోతుంది. సీతారామ కళ్యాణంలో జనకుడు సీత చేతులను రాముడి చేతిలో పెడుతూ ‘‘సహధర్మచరీతవ’’ అంటాడు. ఇక్కడ రాముడు ఆ మాటలను గుర్తుకు తెచ్చుకొని సహధర్మ అని సీతతో అంటాడు. ధర్మకర్మ నిర్వహణలో సీతారాముల సాహచర్యం సాటిలేని ఆదర్శాన్ని నిదర్శన పూర్వకంగా కనిపిస్తుంది.

సీతారాముల సంభాషణ లక్ష్మణుడు అక్కడే బయట నిలబడి వింటూ ఉంటాడు. వెంటనే అన్నను వదిలిపెట్టి అర నిమిషం కూడా నేను ఉండలేనని రామునితో పాటు లక్ష్మణుడు అరణ్యవాసం బయలుదేరాడు. భరతుడు ఇలా అంటాడు, నా అన్నయ్య ధన్యుడు, ఇక నాకు కంటికి కనిపించడు, తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు అన్న రామన్నయ్య! అని సంబోధిస్తాడు. శత్రుఘ్నుడు మందర కనిపించడంతోనే బాగా తిట్టుతాడు. నీవల్లనే మా అన్నయ్య అడవి పాలయ్యాడు. మా తండ్రి మరణించాడు. నిన్ను ఏమి చేసినా పాపం లేదని కోపంతో రగిలిపోతాడు. భరతుడు శత్రుఘ్నున్ని శాంత పరుస్తాడు. ఇప్పుడు ఏం చేస్తే అడవికి వెళ్ళిన మా అన్నయ్య తిరిగి వస్తాడని చెప్పుకుంటూ బాధపడతాడు. సోదరుల అనుబంధం ఒకరిని వదిలిపెట్టి మరొకరు ఉండరు అన్నట్లు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉంటారు. (అనుదిన రామాయణం. పుటలు.123, 126)

2.2. వాలి-సుగ్రీవుడు:

గరుడుని సోదరుడైన అరుణుడు స్త్రీ రూపం దాల్చి అరుణుడిగా మారాడు. ఇంద్రుడు అరుణితో సంఘమించగా వాలి జన్మించాడు. సూర్యుడు సంగమించగా సుగ్రీవుడు జన్మించాడు. వీరిద్దరు సోదరులు గౌతముని ఆశ్రమంలో పెరిగారు. వీరిద్దరికీ కిష్కింధ రాజైన రుక్షకుడు పెంచి పెద్ద చేశాడు. రుక్షకుడు చనిపోయిన తర్వాత వాలి కిష్కిందకు రాజైనాడు. వాలి సుగ్రీవుడు సోదరులు అన్యోన్యంగా ఉండేవారు. ఒకసారి దుందుభి అనే రాక్షసుడు వాలిని ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. వాలి అతన్ని ఓడించి రూష్యమూక పర్వతంపై విసరగా ఆ పర్వతం పైకి వాలి వస్తే అతడి తల ముక్కలవుతుందని శపించాడు. వాలి దుందుభిల యుద్ధం చాలా రోజులు జరగగా దుందుభి మాయాజాలం వల్ల వాలి చనిపోయాడని, సుగ్రీవుడు కిష్కింద పాలన చేస్తుండగా వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుని తరమగా అతడు రుష్యమూక పర్వతంపై తల దాచుకున్నాడు. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడి ద్వారా రాముడు, సుగ్రీవుడు స్నేహితులై రాముడు వాలిని చంపి కిష్కిందకు సుగ్రీవుడిని రాజును చేస్తాడు. రాజ్యం పరిపాలించడానికి సొంత సోదరుడైన వాలిని చంపించి సుగ్రీవుడు కిష్కింధకు రాజు అయినాడు. ఇది సోదరుల అనుబంధం. నేడు ఒకే కుటుంబంలో పుట్టి పెరిగిన సోదరులు వివిధ రాజకీయ పార్టీలలో చేరి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా కోపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీనికి ఉదాహరణ : వాలి రాజ్య కాంక్షలు లేకుండా ఇద్దరు కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలా రాకుండా ఉందాం. (పూర్వగాథాలహరి, పుట.563)

2.3. రావణ కుంభకర్ణ విభీషణులు:

పులస్త్యుని కుమారుడైన విశ్రవసుడు సుమాలి కూతురు కైకసిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కుమారులు, శూర్పణఖ ఒక కూతురు జన్మించారు. కుబేరుడు విశ్రవసుని మరో భార్యకు జన్మించిన కుమారుడు. ఇతడు బ్రహ్మను ప్రార్థించి లంకా నగరాధిపతి అయ్యాడు. రావణుడు పూర్వ జన్మలో మహావిష్ణువు ద్వారా పాలకులైన జయ విజయలో ఒకడు, ఋషుల శాపం వల్ల మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిఫులుగా తర్వాతి జన్మలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు.

కైకసి తన సవతి కుమారుడు కుబేరుడి ఔన్నత్యం చూసి, తన కుమారులు, అతడి కంటే గొప్ప వాళ్ళు కావాలని ప్రేరేపించగా, రావణుడు తన సోదరులైన కుంభకర్ణ విభీషణాధులతో పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై కుంభకర్ణుని వరం కోరుకొమ్మనగా నిర్దేశత్వాన్ని కోరుకోబోయి నిద్రాత్వం కోరాడు. విభీషణుడు విష్ణు భక్తున్ని కావాలని వరం కోరాడు. రావణుడు పంచాగ్నుల మధ్య నిలబడి ఘోర తపస్సు చేసి, వేయి సంవత్సరాలకు ఒకసారి తన పది తలలలో ఒకటి ఖండించుకుంటూ వచ్చాడు. పది సంవత్సరాల నాటికి ఉన్న ఒక తలను ఖండించుకోబోగా బ్రహ్మ ప్రత్యక్షమై వరమడగగా ఒక మానవులతో తప్ప వేరే ఎవరితోను ప్రాణభయం లేకుండా వరం కోరగా బ్రహ్మ ప్రసాదించాడు. వరప్రసాదియై తిరిగి వచ్చి రావణుడు లంక నుండి కుబేరుడిని తరిమి లంకాధీశుడయ్యాడు. అతడి పుష్పక విమానాన్ని సొంతం చేసుకున్నాడు.

మాయాసురుని పెంపుడు కూతురు మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు పుట్టారు. మేఘనాథుడు, అతికాయుడు, అక్షకుమారుడు, మీరు రాక్షసుల సహకారంతో ప్రపంచాన్ని జయించి దేవలోకం వెళ్లి ఓడి పట్టుబడగా మేఘనాథుడు మాయాజాలంతో ఇంద్రుడిని బంధించి తండ్రిని విడిపించాడు. అందువల్ల మేఘనాథుడిని ఇంద్రజిత్తు అని కూడా పిలిచారు.

విభీషణుడు అంటాడు. ‘లంకేశ్వరా! నా మాట తిరస్కరించకు. జానకిని సగౌరవంగా రాముడికి అప్పగించి జరిగిన పొరపాటుకు క్షమించమని ప్రార్థించు. ఇంతకు మించి వేరే మార్గం లేదు. లేకపోతే అందరం నశించిపోతా’మని అన్నాడు. రావణుడికోపంతో రెచ్చిపోయి ‘తమ్ముడవు కదా ఇంతవరకు నీవు ఏమి మాట్లాడుతున్నా ఊరుకున్న, లేకపోతే ఈ పాటికి నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవ’ని అన్నాడు. అనడంతోనే అవమానం సహించలేక విభీషణుడు ఇక లంకలో తావు లేదని నిర్ణయించుకున్నాడు. అన్నిటిని వదిలివేసి, అక్కడినుంచి అప్పుడే ఆకాశానికి ఎగిరి రామలక్ష్మణులున్న తావుకు వచ్చాడు. (రాజాజీ రామాయణం, పుట.345)

2.4. సంపాతి – జఠాయువు:

ఓ పక్షి  జఠయువు అన్న కశ్యప ప్రజాపతికి వినతవల్ల అరుణుడు, గరుడుడు జన్మించారు. అరుణిడికి ఇద్దరు సంతానం వారు సంపాతి, జఠాయువు (పూర్వగాథాలహరి, పుట.563). వీరు ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం అమితమైన ప్రేమానురాగాలతో ఉండేవారు. ఒకసారి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉందనే ప్రశ్న తలెత్తింది. అది సరదాగా మొదలై గొడవకు దారి తీసింది. నేను ఎక్కువ బలం గలవాణ్ణి అంటే, నేను ఎక్కువ బలం గలవాణ్ణి అని ఇద్దరు గొడవకు దిగి పోటీపడ్డారు. ఇద్దరూ ఒకరికి మించి మరొకరు ఆకాశం పైకి ఎగిరారు. సంపాతికి భగభగ మండే సూర్యుడి వేడి తాకింది. అయినా లెక్క చేయకుండా మరి కాస్త పైకి ఎగిరింది. జటాయువు రెక్కలను సూర్యుని వేడి తాకి కాలిపోతున్నాయి. కాలిపోకుండా సంపాతి రక్షణగా నిలుస్తుంది. ప్రాణాలు దక్కిన రెక్కలు పూర్తిగా కాలిపోయినాయి. చాలా బాధపడుతూ ఒకే తల్లి కడుపున పుట్టిన సోదరులు వైరానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. గొప్పలకు వెళితే ఎలాంటి నష్టం జరుగుతుందో శ్రీ రామాయణం వల్ల తెలుస్తుంది. గొప్పలకు వెళ్లకుండా తగ్గడం నేర్చుకుంటే ప్రాణనష్టం జరగదు. ముఖ్యంగా సోదరులు. (రామాయణం, భారత, భాగవతాలు వ్యక్తిత్వ వికాసాలు, పుట.392)

2.5 మాల్యవంతుడు, సుమాలి, మాలి:

సుకేశుడు దేవవతి గర్భంలో మాల్యవంతుడు, సుమాలీ, మాలి ముగ్గురు కుమారులు పుట్టారు. వీరు మూడు కళ్ళకు శివుడి లాగా ముగ్గురూ ముగ్గురే. మూడు లోకాలు చలించని త్రేతాగ్నుల్లాగా, ఘోరమైన మూడు మంత్రాల్లాగా, భయంకరమైన మూడు లోకాలు లాగా పెరిగారు. వీళ్లు మండుతున్న అగ్నిహోత్రాల్లాగా ప్రకాశించారు. ఉపేక్షిస్తే పెరిగిపోయే సంకటల్లాగా వృద్ధి పొందారు. తపో బలం వల్ల, వరాల వల్ల తమ తండ్రికి ఐశ్వర్యం కలిగిందని తెలుసుకున్నారు. తాము తపస్సు చేసి ఐశ్వర్యం పొందాలనుకున్నారు. మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు. ముగ్గురు దారుణమైన నియమాలు పెట్టుకున్నారు. సర్వప్రాణులు భయపడేటట్లు ఉగ్రమైన తపస్సు చేశారు. వీళ్ళ తపస్సుకు మెచ్చి నాలుగు మొహాల బ్రహ్మ, దేవేంద్రుడు మొదలైన దేవతలతో విమానం మీద వచ్చి ప్రత్యక్షమయ్యాడు.

‘‘మీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను’’ అన్నాడు. దేవతలతో వచ్చిన బ్రహ్మను చూశారు సుకేశుని కుమారులు. చేతులు జోడించి అడిగారు, దేవా! మా తపస్సు మెచ్చి వరాలు దయచేయాలనే నీకు ఉంటే మాతో ఎవ్వరూ గెలవకూడదు. మేము ఎలాంటి పగవాణ్ణయినా, ఇట్టే చంపగలిగేటట్టు మేము అన్ని లోకాలు ఏలగలిగేటట్టు, చిరంజీవిలయ్యేటట్లు వరాలు దయచేయి అన్నారు.

తపస్సు అంటే వల్లమాలిన వాత్సల్యం బ్రహ్మకి. అందుచేత వారు కోరిన వరాలిచ్చి బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. వీళ్ళు వరాలు పొంది అనేక దేవతలను, అసురుల్ని హింసించడం మొదలెట్టారు. ఆ వరాలను అడ్డుపెట్టుకొని అన్ని అనుభవించారు ఈ ముగ్గురు సోదరులు.

మాల్యవంతుడూ, సుమాలీ, మాలీ ముగ్గురు సోదరులు రాక్షసులు పెళ్ళి చేసుకొని అప్సరసలతో, దేవతల్లాగా భార్యలతో సుఖంగా కాలం గడుపుతూ వచ్చారు.

  1. మాల్యవంతుడి భార్య పేరు సుందరి. ఈ దంపతులకు వజ్ర ముష్టీ, విరూపాక్షుడూ, దుర్ముఖుడూ, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడూ, మత్తుడూ, ఉన్మత్తుడూ కొడుకులు. అనల ఒక కూతురు జన్మించింది.
  2. సుమాలి భార్య పేరు కేతువతి. కేతువతి అంటే సుమాలికి మహాప్రాణం. వీరికి ప్రవాస్తుడూ, అకంపనుడూ, వికటుడూ, కాలకర్ముడూ, ధూమ్రాక్షుడూ, దండుడూ, మహాబలుడూ, సుపార్శ్వుడూ, సంహ్రాది, ప్రఘసుడూ, భాసకర్ణుడుగా కొడుకులూ, పుష్కోత్కటా, కైకసీ, నవ్వుమొహం, కుంభీనసి కూతుళ్ళూ జన్మించారు.
  3. మాలి భార్య పేరు వసుడు. ఈమె తామర రేకుల్లాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉంటుంది. యక్షకన్య పక్షిలా చక్కని చుక్క. ఈ దంపతులకు అనలుడూ, అనిలుడూ, హరుడూ, సంపాతి నలుగురు కుమారులు జన్మించారు. వీరు నలుగురే విభీషణుడి మంత్రులుగా కొనసాగారు.

ఇలా సుకేశుడి కుమారులు బలంతోనూ పొగరెక్కి తామర తంపరగా పెరిగిన రాక్షసులతోనూ, లంకలో రాజ్యం చేస్తూ వచ్చారు. ఋషుల్ని, నాగుల్ని, దానవుల్ని బాధపెడుతూ గాలిలా అడ్డూ ఆపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవారు. వరాల బలంతో యజ్ఞాలు అన్నీ పాడుచేసేవాళ్ళు. శత్రువులన్నవాళ్ళు ఎవరు వాళ్ళని గెలవలేక పోయేవాళ్ళు. ఇలా వీరు వరాలు పొంది ఎవ్వర్ని లెక్కచేయకుండా ప్రవర్తించారు. ఇలా వరాలు పొందిన వాళ్ళు ప్రజలకు సహాయం చేయాలి. ఆదర్శంగా ఉండాలి.  (శ్రీమద్రామాయణం, ఉత్తరకాండ, ఐదవ సర్గ, పుటలు. 409-411)

2.6 హేతీ - ప్రహేతి:

రాక్షసుల్లో రాజులు హేతి ప్రహేతి ఇద్దరు సోదరులు. మధుకైటభుల్లాటి వాళ్ళు. వీరు శత్రువుల పాలిట యములు. ఈ ఇద్దరిలోనూ ప్రహేతి ధార్మికుడు. తపస్సు కోసం తపోవనం వెళ్ళాడు. వివాహం చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నాడు. కన్య కోసం ప్రయత్నించాడు. తనే స్వయంగా వెతికి కౌలుడి చెల్లె భయ్యా అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు విద్యుత్కేషుడని కొడుకు పుట్టాడు. చాలా అందంగా సూర్యుడిలా ప్రకాశించేవాడు విద్యుత్కేషుడు నీటిలో తామర పువ్వులాగా రోజు రోజుకి పెరుగుతూ వచ్చాడు. ప్రయోజకుడయ్యాడు. సంధ్యాదేవికి సాలకటంకటా ఒక కూతురు ఉండేది. ఆమెతో విద్యుత్కేషుడి పెళ్లి చేశాడు. హేతి పెళ్లి చేసుకుని ఒక కొడుకుకు జన్మనిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేసి పెళ్లి చేశాడు. ప్రహేతి ధార్మికుడైనాడు. హేతీ ప్రహేతీ సోదరుల అనుబంధం పై విధంగా కొనసాగింది.

2.7 కుశలవులు:

శ్రీ రాముడు సీత కుమారులు కుశలవులు. శత్రుఘ్నుడు పర్ణశాలకు వచ్చిన రాత్రే సీతాదేవికి ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఆ శుభవార్త వాల్మీకికి తెలిసింది. బాలచంద్రుడిలాగా, మహాతేజస్సుతో, దేవపుత్రుల లాగా ఉన్న శిశువులను చూశాడు. వాల్మీకి రాక్షసులు నశించినట్లు కుశలు (దర్బల మీది భాగం), లవలు (దర్బల కింది భాగం) పుచ్చుకొని రక్షకటాడు మంత్రపూరితమైన కుశలవలను వృద్ధ స్త్రీల చేత పెట్టాడు. మొదట పుట్టిన బాలుణ్ణి కుశలతో తుడవండి, చిన్నవాణ్ణి లవతో తుడవండి అన్నాడు. పెద్దవాణ్ణి కుశుడనీ, చిన్నవాణ్ణి లవుడనీ నామకరణం చేశాడు. వారు ఈ పేర్లతోనే ప్రసిద్ధులవుతారు అన్నాడు. (శ్రీమద్రామాయణం, ఉత్తరకాండ, డెబ్బయి తొమ్మిదవ సర్గ, పు.597)

రాముడు అశ్వమేధయాగం చేయడానికి నిర్ణయించాడు. ఆ అశ్వాన్ని తన కుమారులైన లవకుశ సోదరులు బంధించారు. రాముడు ఆ ఇద్దరితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అంతలోనే సీత కనిపించగా చూసి ఆశ్చర్యపడ్డాడు. కుశలవులు రాముడు తమ తండ్రని తెలుసుకొని వారికి పాదాభివందనం చేశారు. తరువాత సీతను కుమారులతో పాటు అయోధ్యకు తీసుకొని వచ్చాడు. అశ్వమేధయాగం పూర్తి చేశాడు. (పూర్వగాథాలహరి, పుట.425)

బ్రహ్మచే ఆదేశింపబడి వాల్మీకి రామాయణాన్ని రచించాడు. దీనిని తన అంతేవాసులైన కుశలవులకు గాన రూపంలో అభ్యసింపచేశాడు. శ్రీరామాయణ గానాన్ని కుశలవులు మధురాతి మధురంగా పాడి రాముడి హృదయాన్ని మైమరపించారు. ప్రేక్షకులంతా విని ముగ్దులైనారు. (ఓ రామ నా నామ మెంతో రుచిరా, పుట.27) కోసలదేశం కుశుడికి ఇచ్చి, వింధ్య ప్రక్క అతడి రాజధాని నగరం నిర్మించాడు రాముడు. దానికి కుశావతి పేరు పెట్టాడు. ఉత్తర కోసలలో లవుడికి ఇచ్చి నగరానికి శ్రావస్తి పేరు పెట్టాడు. తండ్రిగారి ఆజ్ఞ ప్రకారం ఇద్దరు సోదరులు రాజ్యాలను పరిపాలించసాగారు. (శ్రీమద్రామాయణం, ఉత్తరకాండ, నూట ఇరవై ఒకటవ సర్గ, పుటలు. 653)

2.8 సుబ్రాహుడు, శూరసేనుడు:

భరతుని భార్య మాండవి. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. రాముడు రాజ్యపాలన చేస్తుండగా, కైకేయి రాజ్యంలో గంధర్వులు వినాశనం సృష్టిస్తున్నారని తెలిసి రాముడు భరతుడిని అక్కడకు పంపగా, భరతుడు వారిని అణచివేసి, సింధూ నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలను రెండు రాజ్యాలుగా చేసి తన కుమారులను రాజులుగా చేసి అయోధ్యకు తిరిగివచ్చి రామునితోపాటు సరయు నదిలో మునిగి దేహం విడిచిపెట్టాడు.

2.9 అంగదుడు, చంద్రకేతువు:

లక్ష్మణుని భార్య ఊర్మిళ. వీరికి ఇద్దరు కుమారులు, అంగదుడు, చంద్రకేతువు. ఇద్దరూ ధర్మం తెలిసిన వాళ్ళు. రాముడు లక్ష్మణుని చూసి; తమ్ముడా! నీ కుమారులకు కూడా రాజ్యాలు ఏర్పరుస్తాను. వీళ్లకు సంతోషంగా ఉండే ప్రదేశం, మునుల ఆశ్రమాలకు భంగం కలగని, ఇంకా వేరే వాళ్ళకు బాధ కలగని ప్రదేశం చూడు. కాఠపథం దేశం అన్ని విధాలా సరిపోతుందని అంటాడు. ఆరోగ్యానికి, అందానికి సాటి అయిన అలాంటి దేశం మరొకటి లేదు. ఆ దేశంలో అంగదుడికి చంద్రకేతుడికి పట్టణాలు నిర్మిస్తే బాగుంటుంది అన్నాడు.

భరతుడి సూచనను అంగీకరించాడు రాముడు. కాఠపథం దేశం వశపరచుకున్నాడు. రెండు పట్టణాలు నిర్మించాడు. అంగదుడికి ఇచ్చిన పట్నానికి అంగదీయమని పేరు పెట్టాడు. అది పడమటి వేపు ఉన్నదది. చంద్రఖేతువుకు ఇచ్చిన పట్నానికి చంద్రకాంతపురం పేరు పెట్టాడు. అంగద చంద్రకేతులు ఇద్దరికీ భరతుడు, లక్ష్మణుడు సాయం వెళ్లారు. అంగదుడి దగ్గర వారు ఒక సంవత్సరం ఉన్నారు. లక్ష్మణుడు రాజ్యపాలనకు తృప్తిపడి అయోధ్యకు వచ్చేశాడు. అలాగే భరతుడు చంద్రకేతువు దగ్గర సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ కాలం ఉండి అయోధ్య వచ్చేశాడు. తమ్ముళ్ళు ఇద్దరు రాముడి పాదాలను అనుసరిస్తూ, అన్నగారి మీద భక్తితో నడచుకునేవాళ్లు. అయోధ్య ధర్మపరమైనది, సిరిసంపదలతో తులతూగుతున్నది, మహాయజ్ఞంలో త్రేతాగ్నుల వలె అయోధ్యలో అన్నదమ్ములు ముగ్గురు ప్రకాశించారు. (శ్రీమద్రామాయణం, ఉత్తరకాండ, నూట పదిహేనవ సర్గ, పుటలు. 645,646)

2.10 సుబాహుని, శత్రుఘూతి:

శత్రుఘ్నుని భార్య శ్రుతకీర్తి ఈ దంపతులకు ఇద్దరు కుమారులు – సుబాహుని, శ్రతుఘూతి జన్మించారు. శత్రుఘ్నుడు రాజ్యం, సేనలు, ధనం తన ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు. పెద్ద కుమారుడైన సుబాహుని మధురకు రాజును చేశాడు. చిన్న కుమారుడు శత్రుఘూతిని వైదిశపురానికి రాజును చేశాడు. ఇద్దరు సోదరులు తండ్రి మరియు రాముడి ఆశీస్సులతో రాజ్యాలను పరిపాలించుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. (శ్రీమద్రామాయణం, ఉత్తరకాండ, నూట ఇరవై ఒకటవ సర్గ, పుట. 654)

3. ఉపసంహారం:

  • సోదరులు రాజ్యాన్ని పరిపాలించాలి, విడిపోకూడదు. ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. కష్టాలు వస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఆ కష్టాలలో, పాలుపంచుకోవాలి. ధైర్యం ఇవ్వాలి. వాలిసుగ్రీవులు ఇద్దరు సోదరులు కలిసి పరిపాలించుకోలేకపోయారు. గొడవలు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా గొడవలు పడకుండా ఉందాం. అనే సందేశాన్ని ఈ సన్నివేశాలు ఇస్తాయి.  
  • సోదరులు ఒకరిమాట ఇంకొకరు వినాలి. తమ్ముడు ఎప్పుడైన మన మంచి కోసమే ఆలోచించి చెబుతాడు. ఆ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. కోపానికి రాకూడదు. మూర్ఖత్వంగా ప్రవర్తించకూడదు. ఉదాహరణకు : రావణుడు విభీషణుడిని అవమానించాడు. కుంభకర్ణుణ్ణి లంక నుండి తరిమాడు. తన మాటకు ఎదురు చెప్పినందుకే కదా. అన్న తండ్రితో సమానం. రావణుడి లాగా ప్రవర్తించకూడదు. కలిసి జీవిద్దాం పోయేదేమి లేదని గ్రహిద్దాం.
  • రామలక్ష్మణభరతశత్రుఘ్నులు వీరు అందరికి ఆదర్శవంతులు. సోదరులు అంటే ఇలా ఉండాలి. రాముడంటే లక్ష్మణుడికి, భరత శత్రుఘ్నులకు అపారమైన అభిమానం గౌరవం భక్తి కూడాను. ప్రతి ఒక్కరు సోదరులు వీళ్ళలాగా ఉండాలని కోరుకుందాం. మనం కూడా ఆదర్శవంతులైన సోదరులుగా పేరు తెచ్చుకుందాం. పోయేదేమి లేదు. కలిసి ఉండడం వల్ల అన్నీ లాభాలే.
  • జగమంతా రామమయం. ఆనాడు, ఈనాడు పిల్లలు, యువకులు, వృద్ధులందరు ‘జై శ్రీరామ్’ అనే నినాదంలో మంచి శుభాన్ని పొందుతున్నారు. దీన్ని శాశ్వతంగా కొనసాగిద్దాం.
  • పురాతనమైన ఇతిహాసం ఈ రామాయణం. దీన్ని పూజించినా, చదివినా, శ్రద్ధతో విన్నా, చేసిన పాపాలన్నీ తొలగిపోయి దీర్ఘాయువు కలుగుతుంది. సోదరులుగా కలిసిమెలిసి ఉందాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి బ్రతకడమే నిజమైన జీవితం. అదే శాశ్వతం. విడిపోకుండా ఉందాం.
  • శ్రీ రామాయణంలో లేనిది ప్రపంచంలో ఏది లేదని చెప్పవచ్చు. మనం వదినను తల్లితో సమానంగా భావిస్తాం. శ్రీరాముడు సీత నగలను తెచ్చి చూపించాడు. సోదరుడు లక్ష్మణుడు దాన్ని చూసి ఇవి ఎవరివో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే వదిన పూజ్యురాలు. లక్ష్మణుడు (మరది) ఆమె భుజాలవైపుగాని, కంఠం వైపుగాని కన్నెత్తి చూడలేదు. ఇదీ మన సంస్కృతి, సంప్రదాయం, ఆచారం కూడాను. ఇలా మనమందరం శ్రీరాముడు లక్ష్మణుల వలె సోదర బంధంతో ఉండాలని కోరుకుందాం. ప్రతి ఒక్కరం తప్పని సరిగా పాటిద్దాం.
  • తండ్రి మాట కోసం వనవాసానికి వెళ్ళాడు శ్రీరాముడు. ఎవ్వరిని బాధపెట్టలేదు. చాలా కష్టపడ్డాడు. నేడు కొడుకులు తండ్రి మాట వినడం లేదు. పాడై పోతున్నారు. జీవితాలను మధ్యలోనే ముగించుకుంటున్నారు. ఇలా ప్రవర్తించడం తప్పు. తండ్రి మాట విన్నవాడు బాగుపడతాడు. అందువల్ల నేడు ప్రతి ఒక్కరు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటలు విందాం, ముందుకు వెళ్దాం.

4. ఉపయుక్త గ్రంథసూచి:

  1. అప్పలస్వామి, పురిపండా. శ్రీరామకథా సుధ వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాయణం, మూడో సంపుటము, యుద్ధకాండ, ఉత్తరకాండ, గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్, రాజమండ్రి, 2005.
  2. అప్పలస్వామి, పురిపండా. శ్రీరామకథా సుధ వ్యావహారికాంధ్ర వాల్మీకి రామాయణం, రెండో సంపుటము, యుద్ధకాండ, ఉత్తరకాండ, గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సెల్లర్స్, రాజమండ్రి, 2005.
  3. పద్మనాభస్వామి, యామిజాల.  బాలల బొమ్మల రామాయణము – పూర్తి రామాయణము ఉత్తర కాండతో సహ.
  4. పాండురంగారావు, ఇలపావులూరి, అనుదిన రామాయణం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2003.
  5. బెంగుళూరు – తెలుగుతేజం, సామాజిక సాంస్కృతిక సాహిత్య రాజకీయ మాసపత్రిక, సంపుటి -7, సంచిక -3 (ప్రత్యేక సంచిక), సెప్టెంబర్ 2022. (రెండు రోజుల జాతీయ సదస్సు, నిర్వహణ : సాహిత్య భారతి – అనంతపురము, పతికి రాజ్యలక్ష్మి ఫౌండేషన్, అనంతపురము).
  6. మోహన్ సింగ్ టి., ఓరామ నీ నామమెంతో రుచిరా... (వ్యాససంకలనం), భక్తి సాహిత్యపరిశోధనాకేంద్రము. తులసీభవన్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2006.
  7. వేంకట రంగాచార్యులు, ఉత్పల. వాల్మీకి రామాయణము. (సరళాంధ్ర వచనము).
  8. శ్రీనివాసరావు, వేమూరి. పూర్వగాథాలహరి,  పురాణేతిహాస చారిత్రక వ్యక్తుల కథాకథన విశేషమాలిక, ఎస్వీఎన్ విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ, 2009.
  9. శ్రీనివాసాచారి కె., రాజాజీ రామాయణం (చక్రవర్తి తిరుమగన్ – తమిళ గ్రంథానువాదం, సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథము, తమిళ మూలం : శ్రీమాన్ చక్రవర్తి రాజగోపాలాచారి), వ్యాస భారతి ప్రచురణాలయం, హైదరాబాదు, 1993.
  10. సూర్యనారాయణ మూర్తి, కాకునూరి. ప్రాచీనాంధ్ర సాహిత్యం – ఉపాఖ్యానరూపంలో రామకథ. సిద్ధాంతగ్రంథం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]