AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. అన్నమయ్య సంకీర్తనల్లోని మాండలికాలు: ధ్వని ప్రయోగాలు - భాషాశాస్త్రం
డా. ఎం. ప్రసాద్ నాయక్
సహాయ ఆచార్యులు, ద్రవిడయన్ & కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9494697904, Email: swarnalathapn@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.10.2024 ఎంపిక (D.O.A): 28.10.2024 ప్రచురణ (D.O.P): 01.11.2024
వ్యాససంగ్రహం:
అన్నమయ్య సంకీర్తనల్లోని ధ్వనుల ప్రయోగాలను పదాదిన ఆపదాదిన సోదాహరణ పూర్వకంగా పరిశీలించి అదేవిధంగా పరిణామంలోని వివిధ రకాల భేదాలను వాటిలో అన్నమయ్య ప్రయోగాలను కూడా ఉదాహరణలతో వివరించడం జరిగింది. అన్నమయ్య దక్షిణ మాండలికం అనబడే రాయలసీమ మాండలికంలో తన సంకీర్తనలు రచించాడు. ఆనాటి వర్ణ, సామాజిక, ప్రాంతీయ మాండలికాల ప్రయోగాలనన్నింటినీ (అన్నమయ్య సంకీర్తనలు - సంపుటం-1) పరిశీలించి కొన్ని ముఖ్యమైన మాండలిక ప్రయోగాలను ఈ అధ్యాయంలో పొందుపర్చడం జరిగింది. మాండలీకాలు ఏర్పడడానికి ముఖ్యంగా భాషలో బహురూపత వైవిద్యం కారణాలు. మాండలిక భాషల నిరాదరణకీ, నిర్లక్ష్యానికి గురికాకుండా సాంస్కృతిక అస్తిత్వం కోసం పోరాడటం. మాండలిక భాషాసంపదని రక్షించుకోకపోతే శిష్ట ప్రామాణిక భాషాధిపథ్యంతో మరుగునపడి నశించి పోతుందనే భావనతో దాన్ని కాపాడటం, ఉన్న సహజ సౌందర్యాన్ని తక్కిన ప్రాంతాల వారికి అందించడం ఎంతైన అవసరంవుంది. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ వంటి ప్రక్రియలు ప్రాచుర్యం పొందాయి. ఆధునిక ప్రక్రియలన్నింటిలో మాండలిక భాషకు సముచిత స్థానమే లభించింది అని చెప్పచ్చు.
Keywords: సంకీర్తనలు, మాండలీకాలు, భాషా, ఆధునిక సాహిత్యం, ధ్వని, ప్రయెగం
1. విషయసామగ్రి సేకరణ, పరిశోధనవిధానం:
ఎ) సంకీర్తనలలో మాండలికాలు: జీవద్భాషకు మార్పూలు సహజం. మార్పూవల్ల భాషలో భాహురూపత, వైవిధ్యం ఏర్పడుతాయి. ఈ బహురుపత మూడు విధాలు. 1.చారిత్రకం: అంటే భాషలో ఒకే కాలంలో ఉన్నా రూపాలకు, కాలంతరంలో ఏర్పడ్డ తుల్య రూపాలకు మధ్య తేడా ఉండటం. ఉదాహరణ ‘వాడు’ ప్రస్తుత రూపం. దీనికి పూర్వ రూపాలు వాండు <వాణ్డు <వాన్ఱు <అవన్ఱు. బి) తెలుగులో భాషా మండలాలు : వృత్తి పద పరిశోధన ఆధారంగా తెలుగులో భాషా మండలాలు నాలుగుగ నిర్ణయించారు. సి) దక్షిణ మాండలికంలో అన్నమయ్య సంకీర్తనలు : అన్నమయ్య రాయలసీమలో వాడే నిత్యవ్యవహార భాషలోనే సంకీర్తనలను రచించడం కనిపిస్తుంది. రాయలసీమ మాండలిక పదాలను తన సంకీర్తనలో అధికంగా వాడటం జరిగింది. డి) మాండలిక పరిశీలన విధానం: మాండలిక పరిశీలన ప్రయోజన దృష్టిని బట్టి ఎన్నో రకాలుగా జరగవచ్చు. మాండలిక పరిశోధన వల్ల ప్రాచీన కవి రచించిన గ్రంథాలలో వచ్చిన మాటలకు స్పష్టార్థ నిరూపణ సాధ్యమవుతుంది. నిశితంగా పరిశీలించినప్పుడు కొందరు కవులు వాడిన మాండలిక పదాలు ఆధారంగా వారు ఏ ప్రాంతం వారు ఊహించవచ్చు. ‘గుణపం’ ‘గడ్డపార’ శబ్దాలు పింగళి సూరన కళాపూర్ణోదయంలో కనిపిస్తున్నాయి. (తె. భా.చ. భద్రిరాజు కృష్ణమూర్తి, పుట -401) ఇ) ఆధునిక సాహిత్యంలో మాండలికాలు: ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ వంటి ప్రక్రియలు ప్రాచుర్యం పొందాయి. ఆధునిక ప్రక్రియలన్నింటిలో మాండలిక భాషకు సముచితస్థానమే లభించింది. ఎఫ్) అన్నయ్య సంకీర్తనలో- ధ్వని ప్రయోగాలు: ‘భాష’ వాక్యాల సముదాయం. ‘వాక్యం’ పదాంశాల సముదాయం’ పదం’ కానీ ‘పదాంశం’ కానీ కొన్ని ధ్వనుల సముదాయం. ‘వక్త’ ను బట్టి ఉచ్చారణ ధ్వనులు ‘శ్రోత’ను బట్టి శ్రవణ ధ్వనులు పుడతాయి. (ఆ.భా.శా. సీమ్మన్న, పుట -189)
2. ఎంచుకున్న పరిశోధన అంశానికి సంబంధిన పూర్వపరిశోధనలు, వచ్చిన కొన్ని గ్రంథాల వివరాలు :
1 .గంగప్ప, S. (2009) అన్నమాచార్య సంకీర్తన సాహిత్యం వైశిస్టయం. శశీ ప్రచురణలు.
గుంటూరు.
2. గంగప్ప, S. (2002) అన్నమాచార్య సంకీర్తన సౌరభం, శశీ ప్రచురణలు. గుంటూరు.
3. గంగప్ప, S. (1995) అన్నమాచార్య సంకీర్తన సుధ' శశీ ప్రచురణలు, గుంటూరు.
4. తాళంబేడు సాయి శంకర్ రెడ్డి. (2019) అన్నమయ్య భాషలో ప్రయోగాలు, తెలుగు భాషా
పరిరక్షణ సమితి ప్రచురణలు.
5 . రాజేశ్వరి, శివుని.(2012) ఆధునిక తెలుగు భాషా నిర్మాణం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
6. సుబ్రహ్మణ్యం పి.ఎస్ (1993) ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు, తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాద్.
3. ఉపోద్ఘాతం:
తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్ళపాక గ్రామంలో నారాయణమూర్తి, లక్కమాంబ దంపతులకు 9-5-1408న జన్మించాడు. ఎనిమిదో ఏట అడవికి వెళ్ళీ యాత్రికుల గుంపులో కలసి తిరుమలకు చేరాడు. అన్నమయ్య తన 16వ ఏట తిరుమల చేరి స్వామి సాక్షాత్కారం పొందాడు. వారి ఆదేశంతో క్రీ.శ.1424 క్రోధి, వైశాఖ మాసం, విశాక నక్షత్రం నాడు తన సంకీర్తనాయ జ్ఞాన్ని ప్రారంబించాడు.
వేంకటేశ్వర స్వామి పై సంకీర్తనలను రచించిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు. సాహిత్యం పై ఎందరో పరిశోధకులు అనేక విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి. అన్నమయ్యకు లభించిన 13,712 సంకీర్తనలను అన్నింటినీ 29 సంపుటాలలో తి.తి.దే వారు నిక్షీప్తం చేయించారు. అన్నమయ్య రచించిన వేలాది సంకీర్తనల్లో ఈ మొదటి సంపుటంలో 506 సంకీర్తనలు నిక్షీప్తం కాబడ్డాయి. అంటే అన్నమయ్య రచించిన మొదటి మరియు చివరి సంకీర్తనలు కూడ ఇందులోనే ఉన్నాయి. అన్నమయ్య సంకీర్తనలోని మాండలికాలు వాటి ప్రధాన లక్షణాలు వర్గమాండలికలతో పాటు భాషా మండలాలు, దక్షిణ మాండలికాలలోని అన్నమయ్య సంకీర్తనలు, ధ్వనీ ప్రయోగాలు, పరిణామం, భేదాలు, ఆధునిక సాహిత్యంలోని విషయాలను గురించి క్షుణ్ణంగా ఉదాహరణలతో వివరించడం జరిగింది.
4. సంకీర్తనలలో మాండలికాలు:
జీవద్భాషకు మార్పూలు సహజం. మార్పూవల్ల భాషలో భాహురూపత, వైవిధ్యం ఏర్పడుతాయి. ఈ బహురుపత మూడు విధాలు. 1. చారిత్రకం: అంటే భాషలో ఒకే కాలంలో ఉన్నా రూపాలకు, కాలంతరంలో ఏర్పడ్డ తుల్య రూపాలకు మధ్య తేడా ఉండటం. ఉదాహరణ: ‘వాడు’ ప్రస్తుత రూపం. దీనికి పూర్వ రూపాలు వాండు <వాణ్డు <వాన్ఱు <అవన్ఱు. 2. ప్రాంతీయం ఒకే కాలంలో ఒక ప్రాంతంలో ఉన్న వాడుకకు మరొక ప్రాంతంలో ఉన్న వాడుకకు మధ్య సమాన శబ్దాల్లోనూ వ్యాకరణ భాగాల్లోనూ తేడాలు ఉండవచ్చు ఉదాహరణకు: వచ్చినాడు వచ్చిండు ఇలాంటి ప్రాంతీయ భేదాలు. 3. సాంఘిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఆర్థిక సంస్కృతిక వ్యవహార్తాలు ఏర్పడి ఉంటాయి. ఉదాహరణ: చాప/సాప, వెండి/యెండి, లేదు/నేదు, అట్ట/గట్ట మొదలైనవి. (తె.భా.చ. భద్రిరాజు కృష్ణమూర్తి, పూట-397)
మాండలికాలు అనగా! ఒక ప్రదేశానికి లేక ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వ్యవహరించే భాష విశేషాన్ని గాని లేక భాషకు చెందిన ప్రజానికంలో వృత్తిని బట్టి గాని కులాన్ని బట్టి గాని ఏర్పడ్డ ఒక వర్గం ప్రజలు వ్యవహరించే ఒక భాష భేదాన్ని గాని మాండలికం అని వ్యవహరించవచ్చు. మాండలిక భాష పదజాలంలో గాని ఉచ్చారణలో గాని కొంత వైలక్షణ్యం గల ఒక మాండలికానికి చెందిన భాషనుగాని ఒక వృత్తి కో వ్యాపారానికో చెందిన పరిమిత భాషను గాని మాండలిక భాష అనవచ్చు. పరస్పర అవగాహన కలిగి ఒకానొక ప్రధాన భాషాంతర్గతంగా ప్రత్యేక సారసత్వాదులు లేకుండా ఉండే భాష భేదాల మాండాలికానికి దీనికి భిన్నంగా పరస్పరవగాహన లేకుండా ప్రత్యేక సారసవ్యా తాదులు గల భాషలని పేర్కొనవచ్చు. (అ.భా.ప్ర. తాళంబేడు సాయి శంకరరెడ్డి, పుట-175)
5. మాండలికాల ప్రధానలక్షణాలు:
భాషలో అనేక కారణాలవల్ల ఏర్పడిన మండలికాల ప్రధాన లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం అవి 1. నిర్ణీతప్రదేశంలో మాత్రమే వ్యవహరింపబడటం 2. వివిధ భాష వ్యవహర్తల మధ్య పరస్పర అవగాహన క్రమత్వంకోల్పోకుండ ఉండటం 3. ప్రధాన భాషలో అంతర్భాగంగాఉండటం. 4. ముద్రించిన ప్రామాణిక సాహిత్యం లేకపోవడం. 5. అప్రమాణంగా కొనసాగడం. 6. భాష అంశాల్లో వైలక్షణ్యము పాలు ఎక్కువగా ఉండటం. 7. సహజ ఉచ్చరణను కలిగి ఉండటం. 8. సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచి ఉండటం. (ఆ.తె.భా. సం. రామాంజనేయలు, పుట- 262)
6. తెలుగులో భాషామండలాలు:
వృత్తిపదపరిశోధన ఆధారంగా తెలుగులో భాషామండలాలు నాలుగుగా నిర్ణయించారు. 1. పూర్వమండలం-శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు 2. దక్షిణమండలం- రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు 3. ఉత్తరమండలం- తెలంగాణ జిల్లాలు 4. మధ్యమండలం- ఉభయ గోదావరిలో గుంటూరు, కృష్ణాజిల్లాలు. ఉదాహరణలు ఈ క్రింది విధంగ చూడవచ్చు.
పూర్వ మండలం | దక్షిణ మండలం | ఉత్తర మండలం | మధ్య మండలం |
నాగలి | నాగేలి/మడక | నాగలి | నాగలి |
అనపకాయ | సొరకాయ | అనిగెంకాయ | సొరకాయ |
గోంగూర | గోగాకు | పుంటికూర/పుండికూర | గోంగూర |
చోడి | రాగి | తమిదె | తమిదె |
6.1 వర్గ మాండలికాలు:
అన్నమయ్యసంకీర్తనలో ప్రాంతీయ మాండలికాలలతోపాటు వర్గమాండలికాలు కూడా కనిపిస్తున్నాయి.
ఉదా: సేసిన అనేది పామరుల భాష అయితే చేసిన అనేది నాగరికుల భాష.
పరిసరవర్తుల బెంబడిcబని సేసిన యట్లు 1.362.6
అణిగే: (నాగరిక భాష) నే దేవు దేహమున నణcగెమరి 1.75.14
అనిచే: (పామరుల భాష ) నారాయణుని భక్తిననిచేనా ధనమేల్లc 1.364.7
7. దక్షిణ మాండలికంలో అన్నమయ్య సంకీర్తనలు :
అన్నమయ్య రాయలసీమలో వాడే నిత్యవ్యవహారభాషలోనే సంకీర్తనలను రచించడం కనిపిస్తుంది. రాయలసీమ మాండలికపదాలను తన సంకీర్తనలో అధికంగా వాడటం జరిగింది.
ఉదా:
a) అంగడి: నిత్యవసర వస్తువు అమ్ముచోటు (రాయలసీమ) అదే విధంగా తెలంగాణలో అయితే వారానికి ఒకసారి ‘సంత’ జరగడానికి ‘అంగడి’ అంటారు. సభ, దివాణము, కార్ఖాను అని కూడా అంగడికి అర్థాలు ఉన్నాయి.
అంగడినెవ్వరు నంటుకురోయి 1.241.1
అపదలంగడి నమ్మిcగొనరో 1.42.3
అంగడికెత్తిన దివ్వెలంగన ముఖంబుజాములు 1.1.3
b) అంజలి:
చింతలేనియంబులొక్క చారేడుచాలు 1.456.1
బియ్యపు నూకలను ఎక్కువ నీళ్లు పోసి గంజి వలె జారుడుగా ఉడకబెట్టి చల్లార్చి ఉదయాన్నే రాయలసీమ తూర్పు ప్రాంతాల్లో ఉల్లిపాయలను నంజుకొని త్రాగుతారు. దీన్నే అంబలి త్రాగడం అంటారు. తెలంగాణ, కళింగ మాండలికలో ఇది జావా, జారుడు గంజిగా పిలువబడుతుంది.
C) అక్కర: అభిలాష, అవసరం
అక్కరతోcబొట్టుగు తేభాగ్యంబహంకారము వీడువరు గాన 1.391.14
అక్కర కొదగనట్టి యర్థంబు 1. 456.1
d) అప్పాలు, వడలు:
అక్కల పాశాలు నప్పాలు వడలు 1.22.3
తమిళనాడులో బియ్యపు పిండితో కొంచెం లోతైన పెనం మీద వెడల్పుగా దోసెలాంటి అట్టు వేస్తారు. దీన్ని పచ్చి కొబ్బరిని రుబ్బగ వచ్చిన పాలలో ముంచి తింటారు. దీన్నే ‘ఆపం’ అంటారు. ఈ ఆపం అనే పదం నుండి ‘అప్పం’ అప్పచ్చి, అప్పాచ్చులు అనే పదాలు ఉద్భవించాయి. రాయలసీమలో దక్షిణ మాండలికం మీద తమిళ ఆదానాలెక్కువగా కనిపిస్తున్నాయి.
e) అగచాటునcబడక: సాధారణంగా రాయలసీమలో కష్టాలు లేదా ఎక్కువ బరువు బాధ్యతలు మోసే భావనయే అగచాట్లు పడటం అంటారు.
చాటుcదృష్ణలగ చాటునcబడక సౌఖ్యంబు 1.451.9
f) ఆగడాయ: ఆగడాయcగనకము అన్నిటితో తగులు 1.471.6
దక్షిణ మాండలికంలో సింద, దూఱు అని అర్థాలమీద వ్యవహారింపబడుతున్న పదమిది.
g) ఆగవడుదాcక: కన్పించే వరకు
పరమార్గం బగపడదాcక, తన 1.212.5
h) అర్థము: ధనం అవసరం, పనిమీద, అర్థము
అక్కర కొదగనియట్టి యర్థము 1.456.1
i) అప్పడు: తండ్రి (పెద్దాయన)
ఎల్లలోకములకు తీరునప్పcడగు వేంకటేశాద్రిశుగంటి 1.38.12
j) అమాస: అమావాస్య
పున్నమ మాసాలు పుడమిలో బతుకులు 1.188.9
k) నాంబారి-నాంచారు: ఒక దేవత
గతిc యేలమేల్ మంగ నాంచారికిc 1.7.11
l) అడియాస: కలుగుననేcడి ఆశ
అడియాసలcదిరిగి ఆలయుచుండు దుcగాని 1.473.5
అన్నయ్య దక్షిణమాండలికం అనబడే రాయలసీమ మాండలికంలో తన సంకీర్తనలు రచించాడు. ఆనాటి వర్ణ, సామాజిక, ప్రాంతీయ మాండలీకాల ప్రయోగాలన్నింటినీ పరిశీలించి కొన్ని ముఖ్యమైన మాండలిక ప్రయోగం చేయడం జరిగిందని చెప్పవచ్చు. (అ.భా.ప్ర. తాళంబేడు సాయి శంకరరెడ్డి, పుట-176-191)
8. మాండలిక పరిశీలన విధానం:
మాండలిక పరిశీలన ప్రయోజన దృష్టిని బట్టి ఎన్నో రకాలుగా జరగవచ్చు. ఏదో ఒక అర్థం తీసుకుని ఆ అర్థంలో ప్రతి చోట ఏ మాట వాడుతారో ఊరూరు తిరిగి సేకరించవచ్చు. ప్రాంతీయ భేదాలనే గుర్తించాలనుకున్నప్పుడు ఏదో ఒక వర్గానికి చెందిన వారి వాడుకనుంచే ఉద్దేశించిన వివరాలు సేకరించాలి.
మాండలిక పరిశోధన వల్ల ప్రాచీన కవి రచించిన గ్రంథాలలో వచ్చిన మాటలకు స్పష్టార్థ నిరూపణ సాధ్యమవుతుంది. నిశితంగా పరిశీలించినప్పుడు కొందరు కవులు వాడిన మాండలిక పదాలు ఆధారంగా వారు ఏ ప్రాంతం వారు ఊహించవచ్చు. ‘గుణపం’ ‘గడ్డపార’ శబ్దాలు పింగళి సూరన కళాపూర్ణోదయంలో కనిపిస్తున్నాయి. (తె. భా.చ. భద్రిరాజు కృష్ణమూర్తి, పుట -401)
9. ఆధునిక సాహిత్యంలో మాండలికాలు:
ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ వంటి ప్రక్రియలు ప్రాచుర్యం పొందాయి. ఆధునిక ప్రక్రియలన్నింటిలో మాండలిక భాషకు సముచితస్థానమే లభించింది. 1892లో వెలువడిన ‘కన్యాశుల్కం’ ఆధునిక సాహిత్యంలో వాడుక భాషలో వెలువడిన మొదటి గ్రంథం 19వ శతాబ్దం నాటికే మెకంజీ ‘కైఫీయత్తులో’ను బ్రౌన్ ‘లేఖాసంపుటాల్లో’ను తెలుగువాడకంలోనూ మాండలిక పదాలు కనిపిస్తాయి. (మా.భా.ప. పి. రాజేశ్వరి, పుట -25)
10. అన్నయ్య సంకీర్తనలో- ధ్వని ప్రయోగాలు:
‘‘భాష’ వాక్యాల సముదాయం. ‘వాక్యం’ పదాంశాల సముదాయం’ పదం’ కానీ ‘పదాంశం’ కానీ కొన్ని ధ్వనుల సముదాయం. ‘వక్త’ ను బట్టి ఉచ్చారణ ధ్వనులు ‘శ్రోత’ను బట్టి శ్రవణ ధ్వనులు పుడతాయి. (ఆ.భా.శా. సీమ్మన్న,వి. పుట -189) ధ్వనులు మానవుని వాగవాయవాల నుండి ఉత్పత్తి అవుతాయి. అందులో కొన్ని మాత్రమే భాషాధ్వనులుగా నిరుపితాలు కాబడ్డాయి. అన్నమయ్య భాషలో ధ్వని విజ్ఞానం వల్ల దాదాపు 575 సంవత్సరాల కు పూర్వం మన భాషలో ధ్వనులు ఎలా ఉండేవో అవి నేడు ఎలా ఉచ్చరింపబడుతున్నాయో తెలుసుకోవచ్చు. ఉదా: వెంకటరమణ అని రాస్తున్న వెంకట్రమణ అని ఉచ్చరించడం గమనించవచ్చు. అలాగే మామ అని రాస్తున్న మావ అని ఉచ్చరిస్తాం. (అ.భా.ప్ర. తాళంబేడు సాయి శంకరరెడ్డి, పుట-30)
ధ్వనులు ఉత్పత్తి విధానం:
మన శరీరంలో నీ వాగేంద్రియాల తోడ్పాటు వల్ల భాష ధ్వనులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటినే ‘ధ్వని’ లేక ‘వాక్’ లేక ‘ఉచ్చారణ’ ఉత్పత్తి అవయవాలు అంటారు. (ఊపిరితిత్తుల నుండి పెదవుల వరకు) సహాయంతో మానవుడు అనంతమైన ధ్వనుల్ని ఉచ్చరిస్తాడు. అందులో ముక్కు, గొంతు, ముఖ్యమైనవి. వాగేంద్రియాల తోడ్పాటు వల్ల మానవుని శరీరం నుంచి భాషాధ్వనులు పుడతాయి. వీటినే భాషా శాస్త్రవేత్తలు ‘ధ్వని’ లేక ‘ఉచ్ఛారణోత్పత్తి’ అని వ్యవహరించారు. (ఆ. భా.శా. సీమ్మన్న, పుట -190)
ధ్వని, వర్ణం, అక్షరం:
ఈ మూడు ఒకటి కాదు. a) ధ్వని మానవుని వాగవయవాల నుంచి ఉత్పన్నమై భాషా విజ్ఞానాన్నికి ఉపయోగపడే ప్రతి శబ్దాన్ని ‘ధ్వని’ అంటారు. ఉదా: చ, ఛ మొదలగునవి. b) వర్ణం అర్థబేధక శక్తి కలిగిన ధ్వనిని మాత్రమే వర్ణంగా గుర్తిస్తారు. ఊదా: చందమామ, ఛందమామ చ, చాలలో అర్థభేదక శక్తి లేదు. కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే వర్ణం (చ). పాట బాట- ప,బ లు అర్థభేధక శక్తి కలిగినవి కాబట్టి ఇవి రెండు వర్ణాలే. c) అక్షరం: ఒక అచ్చు కచ్చితంగా కలిగి ఉండేది అక్షరం. పదంలో ఎన్ని అచ్చులు ఉంటే అన్ని అక్షరాలు ఉన్నట్లు లెక్క. ఒక్కొక్క ధ్వని కాకుండ, ఒక అక్షరానికి సరిపడే అంతా చిన్న పరిమాణంలో గాలి వెలుపలికి వస్తుంది. ఊదా: బల్ల అనే మాటలో ధ్వనులు ఐదు, అక్షరాలు రెండు, భాషాధ్వనులలో *హల్లులు *అచ్చులు అని రెండు రకాలు.
అన్నమయ్య సంకీర్తనల్లో ప:శ్వాసం, అల్పప్రాణం ఉభయోష్ట్యస్పర్శం ఇలా కనిపిస్తుంది. స్పర్శాలు- కంట బిలం నుంచి పెదవుల వరకు ఉండే భాగంలోని ఏదో ఒక స్థానంలో వాయు ప్రవాహాన్ని క్షణకాలం పూర్తిగా నిరోధించి వెలువరించడం వల్ల ఏర్పడే ధ్వనులను స్పర్శాలు అనవచ్చు. నిర్దిష్ట కాలంలో స్వాభావిక కోచ్చారణతో ఉచ్చరించే హల్లు అల్పప్రాణం-(క) నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చారణకు మించిన గాలిని వెలువరిస్తూ ఉచ్చరించే హల్లు మహాప్రాణం-(ఖ).
10.1 పదాది ప్రయోగం - అపదాది ప్రయోగం:
ప:శ్వాసం, అల్పప్రాణం
పదకమలమే 1.1556 పాపపుణ్యాలు 1.372.11
పరవశము 1.494.5 పరమపదంబు 1.258.11
ఫ: శ్వాసం, మహా ప్రాణం ఉభయెష్ఠ్య స్పర్శం
ఫలము 1.297. 17 రవిఫల 1.366.7
బ: నాదం, అల్ప ప్రాణం: ఉభయెష్ఠ్య స్పర్శం
బాహు లీల 1.243.8 కర్మ సంగ్రహనంబగు బుద్ధ 1.187.7
భ: నాదం, అల్ప ప్రాణం: ఉభయెష్ఠ్య స్పర్శం
భవసాగరము 1.128.3 కడుచున్నభవనము 1.49.2
భజయించు 1.288.2 ఔ భళము 1.13.4
ఇలా చెప్పుకుంటూ పోతే త,ద,డ,క,గ వరకు అల్పప్రాణం దంతస్పర్శం మరియు కంఠస్పర్శం గలదు, మరియు ధ,ట,ఠ,ఢ,ఖ,ఘ వరకు దంతస్పర్శంతో పాటు మూర్థ్వస్పర్శం, కంఠస్పర్శం మనకు కనిపిస్తాయి.
అయితే ఈ క్రింద విధంగా మనము గమనించినట్లయితే నట్లయితే కాఫీ లోని ‘ఫ' దంతోష్ఠ్య పదాది ప్రయోగంలో ఇ విధంగ వుంది.
ఫళగిన 1.366.7 అపదాది ప్రయోగం లేదు (అ.భా.ప్ర. సాయి శంకరరెడ్డి. పుట-33)
అన్నమయ్య కాలానికి తెలుగు భాష పరిపుష్టిమై ఉన్నందువల్లనే దాదాపు 600 సంవత్సరాలయిన మనము ప్రస్తుతం అదే భాషను వినియోగిస్తున్నాము.
అలాగే అన్నమయ్య సంకీర్తనల్లోని భాషలో ఊష్మాలు ప్రయోగించిన తీరు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఉదా: శ: శ్వాసం తాలవ్యం ఊష్మం
పదాది ప్రయోగం అపదాదిప్రయోగం
శరీరము 1.31.13 వేంకటాచలాధీశ 1.273.13
శరణు 1.443.13 వేంకటేశ
స: శ్వాసం- దంతమూలియ ఊష్మం
సకల వ్యాపకుడు 1.353.1 పురసతులు 1.356.11
సనకాదులును 1.110.7 కేసరికిc 1.117.13
అన్నమయ్య భాష ప్రయోగాలలో స్పర్శోష్మాలను పరిశీలించినట్లయితే ఈ క్రింది విధంగా మనం గమనించవచ్చు.
ఉదా: చ- శ్వాసం అల్పప్రాణం-దంత్యం స్పర్శోష్మం
చలపాది 1.132.1 అపదాది ప్రయోగం లేదు.
అన్నమయ్య సంకీర్తన (సంపుట-1)లో ‘ఛ’ కారంతో పదాదిన కాని అపదాదిన కాని ప్రయోగాలు లేవు.
అచ్చులు: అన్నమయ్య సంకీర్తనల్లో (సంపుట-1) అచ్చుల ప్రయోగాలు గమనిద్దాం.
పూర్వాచులు- జిహ్వగ్రం కఠిన తాలువు వైపు చూస్తే పుట్టే అచ్చులు పూర్వాచ్చులు.
మధ్యాచులు- జిహ్వమధ్యం మూర్ధం వైపు లేస్తే పుట్టే అచ్చులు మధ్యచ్చులు.
పశ్చిమాచ్చులు- (కంఠ్యాచ్చులు) జిహ్వమూలం మృదుతాలువు వైపు లేస్తే పుట్టే అచ్చులు పశ్చిమాచ్చులు. (అచ్చుల వర్గీకరణ)
తెలుగుభాషలో అన్నమయ్య అచ్చుల్ని పదాదినే ప్రయోగించాడు.
ఉదా: అ, ఆ - పశ్చిమాచ్చులు వివృతం, కంఠ్యం
అట్టివాcడు 1.411.3 అంద్రీశుcడు 1.22.7.5
ఆడనాడ 1.234.2
ఇ-ఈ- పూర్వఅచ్చు, సమృతం, అవర్తులితం- (తాలవ్యం)
ఇక్కడ నక్కడ 1.93.9
ఈక 1.389.12
ఉ,ఊ: పశ్చిమాచ్చు, సవృత, వర్తులితం-(ఓష్ఠ్యం)
ఉరుములోపల 1.211.8
ఊదర 1.72.2
ఋ, ఌ ప్రయోగం ఎక్కడా లేదు:
ఌ ప్రయోగం పదాదిన లేదు. అన్నమయ్య సంకీర్తనలో(సంపుట-1)లోని భాషలోని ధ్వనివిజ్ఞానం ప్రకారం హల్లును, అచ్చులను పరిశీలించడం జరిగింది.
10.2 అన్నమయ్య భాషలో ధ్వని పరిణామం- ప్రయోగం:
ఒక భాషలో ఒక కాలంలో ఉన్న ధ్వని తర్వాత కాలంలో మార్పు చెందడాన్ని ధ్వని పరిణామం అంటారు. ధ్వనుల మార్పులను మొట్ట మొట్టమొదటిసారిగా ఇటలీ దేశస్తుడైన టాలేమి వివరంగా తెలిపాడు. 19వ శతాబ్దంలో రాస్క్, గ్రీమ్, వెర్నర్, బ్రూగ్మాన్ మొదలగు భాషా శాస్త్రజ్ఞులు ధ్వని పరిణామాపై కృషి చేశారు.
10.2.1 ధ్వనిపరిణామం - భేదాలు - అన్నమయ్య ప్రయోగాలు:
అంతర్ బాహ్య కారణాల వల్ల ఏర్పడిన విభిన్న ధ్వని పరిణామ భేదాల్ని భాషా శాస్త్రజ్ఞులు కొన్ని రకాలుగా వర్గీకరించారు. అన్నమయ్య భాషకు అన్వయించి చూస్తే పద ప్రయోగ సూచికలో కొన్ని రకాల ధ్వని పరిణామ భేదాల్ని గుర్తించడం జరిగింది. అవి ఈ క్రింది విధంగా చూడవచ్చు.
1. వర్గీ సమీకరణ: రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడం వర్ణ సమీకరణం. ఇవి మళ్ళీ ద్వివిధాలు-
a. పూర్వ వర్ణ సమీకరణం: ఒక వర్ణం దాని తర్వాత వర్ణానికి అనుగుణంగా మారడం పూర్వ వర్ణ సమీకరణమవుతుంది.
ఉదా: తల్లి+లు = తల్లులు 1.391.5
b. పరవర్ణ సమీకరణం: ఒక వర్ణం దాని ముందున్న వర్ణానికి అనుగుణంగా మారడం పరవర్ణ సమీకరణమవుతుంది.
ఉదా: అలజడి+కు =అలజడికి 1.179.14
2. వర్ణ విభేదం: ఇది సమీకరణానికి వ్యతిరేకమైంది. ఒకే ధ్వని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు తొందర్లో గాని తడబాటు వల్ల గాని ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడం వర్ణ విభేదం.
ఉదా: వలపు+ ఇంచు= వలపించు 1.74. 11
3. వర్ణభంగం: ఒకే వర్ణం అనేక వర్ణాలుగా మార్పు చెందడం వర్ణభంగం లేదా వర్ణ విచ్ఛేదం.
మూలద్రావిడ భాషలోని ‘క’ కారం తెలుగులో క,గ,చ లుగా మార్పు ఔచెందిన రూపాలు అన్నమయ్య భాషలో కనిపిస్తున్నాయి.
క కోల్ –కోల 1.57.8
క గ ఏcకు–ఏcగు1.435.6
చ కివి – చెవి 1.326.3
11. ముగింపు:
- అన్నమయ్య సంకీర్తనల్లోని ధ్వనుల ప్రయోగాలను పదాదిన ఆపదాదిన పరిశీలించి అదేవిధంగా పరిణామంలోని వివిధ రకాల భేదాలను వాటిలో అన్నమయ్య ప్రయోగాలను కూడా ఉదాహరణలతో వివరించడం జరిగింది.
- అన్నమయ్య దక్షిణ మాండలికం అనబడే రాయలసీమమాండలికంలో తన సంకీర్తనలు రచించాడు. ఆనాటి వర్ణ, సామాజిక, ప్రాంతీయ మాండలికాల ప్రయోగాలనన్నింటినీ (అన్నమయ్య సంకీర్తనలు - సంపుటం-1) పరిశీలించి కొన్ని ముఖ్యమైన మాండలిక ప్రయోగాలను పొందుపర్చడం జరిగింది.
- ఈ ప్రయోగాలను ఆనాడు ఆంధ్రదేశంలో వివిధ మండలాలలో నివసించి రచనలు కొనసాగించిన కవుల మాండలిక పదాలతో పోల్చి చూసిన భిన్నమైన, వైవిధ్యం కలిగిన ప్రయోగాలు వెలుగులోకి వచ్చింది అని చెప్పవచ్చు.
12. పాదసూచికలు:
- తె.భా.చ. భద్రిరాజు కృష్ణమూర్తి, పూట-397
- అ.భా.ప్ర. తాళంబేడు సాయి శంకరరెడ్డి, పుట-175
- ఆ.తె.భా. సం. రామాంజనేయలు, పుట- 262
- తె. భా.చ. భద్రిరాజు కృష్ణమూర్తి, పుట -401
- మా.భా.ప. పి. రాజేశ్వరి, పుట -25
- ఆ.భా.శా. సీమ్మన్న,వి. పుట -189
13. ఉపయుక్తగ్రంథసూచి:
- గంగప్ప, S. (2009) అన్నమాచార్య సంకీర్తన సాహిత్యం వైశిస్టయం. శశీ ప్రచురణలు. గుంటూరు.
- గంగప్ప, S. (2002) అన్నమాచార్య సంకీర్తన సౌరభం, శశీ ప్రచురణలు. గుంటూరు.
- గంగప్ప, S. (1995) అన్నమాచార్య సంకీర్తన సుధ' శశీ ప్రచురణలు, గుంటూరు.
- తాళంబేడు సాయి శంకర్ రెడ్డి. (2019) అన్నమయ్య భాషలో ప్రయోగాలు, తెలుగు భాషా పరిరక్షణ సమితి ప్రచురణలు.
- పోచం రెడ్డి రాజేశ్వరి. (2019) మాండలిక భాషా పరిశీలన, కిరణ్ ప్రింటర్స్ అనంతపురం.
- భద్రిరాజు కృష్ణమూర్తి,(2000) తెలుగు భాషా చరిత్ర. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవివిధ్యాలయం, హైదరాబాద్.
- భద్రిరాజు కృష్ణమూర్తి. (1989) తెలుగు భాషా చరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- భద్రిరాజు కృష్ణమూర్తి. (1971) మాండలిక వృత్తి పదకోశం ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, సైఫాబాద్, హైదరాబాద్.
- శ్రీహరి. రవ్వా. (2006) అన్నమయ్య భాషా వైభవం. వరరుచి పుబ్లికేషన్, హైదరాబాదు.
- రాజేశ్వరి, శివుని.(2012) ఆధునిక తెలుగు భాషా నిర్మాణం. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.
- రాధాకృష్ణ భూదరాజు. (1971) తెలుగు మాండలికాలు కరీంనగర్ జిల్లా, తెలుగు అకాడమీ. హైదరాబాద్.
- రామాంజనేయులు.కె.(2015) ఆధునిక తెలుగు భాషా శాస్త్ర సంగ్రహం. కృష్ణ చైతన్య పబ్లికేషన్స్, హైదరాబాదు.
- సిమ్మన్న, వెలమల. (2004). తెలుగు భాషాచరిత్ర దళిత సాహిత్యపీఠం విశాఖపట్నం.
- సుబ్రహ్మణ్యం పి.ఎస్ (1993) ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.