headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

17. తెలంగాణ ‘లంబాడి జానపద గేయాలు’: మానవతావిలువలు

మురహరి రాథోడ్

కొల్హారి గ్రామం పోస్టు,
గుడిహత్నూర్ మండలం,
ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 7702062870, Email: muraharirathod123@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

లంబాడిలు పండుగలను సాముహికంగా జరుపుకోవడం ఆచారం. వారు జరుపుకొనే పండుగల్లో వారి పూజావిధానం ఒక విలక్షణమైన రీతిలో ఉంటుంది. వారి పూజలు తమ క్షేమాన్ని, తండా క్షేమాన్ని, పాడిపంటల క్షేమాన్ని కోరి చేసేవే. వీరు పూజించే దేవతలు హిందూ దేవతలైనప్పటికి, పూజించే విధానం ఆటవిక సంప్రదాయాన్ని కలిగినట్టిది. ఆయా అచారవ్యవహారాలను క్షేత్రపర్యటన ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించడం,వారి జానపదగేయసంస్కృతిని ముఖాముఖీల ద్వారా సేకరించి, విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం.

Keywords: జానపదం, గేయం, లంబాడీ, ఆచారాలు, పండుగలు.

1. ఆచారవ్యవహారాలు-పూజావిధానం:

లంబాడీలు సాధారణంగా శ్రావణమాసంలో తండా నాయకుని అనుమతితో ఏదో ఒక మంగళవారం ఈ పండుగను జరుపుకొంటారు. ఉదాహరణకు తెలంగాణ ప్రజలు బోనాల పండుగను శ్రావణ మాసంలో జరుపుకుంటారు. వారు కూడా అనుకూలతను బట్టి ఏదో ఒక ఆదివారం జరుపుకోవడం సర్వ సాధారణం. పండుగ ముందు రోజు అనగా సోమవారం రాత్రి తండా నాయకుని ఆదేశం మేరకు ఒకరు తండాలోని ఇంటింటికి డప్పు కొట్టుకుంటూ, తిరుగుతూ, 'వాంషీడో' అని కేకలు వేస్తూ పండుగ ప్రత్యేకతగా అందరూ గుగ్గిళ్లు వండుకోవాలని తెలియ జేస్తాడు. మంగళవారం రోజు ఉదయమే పిల్లలు. పెద్దలు అందరూ స్నానమాడి సీత్లాదేవి కోసం లాప్సి బియ్యం, బెల్లం, పాలతో వండిన పాయసం వండుకుంటారు. సీత్లా భవానీని ప్రతిష్టించిన ప్రదేశానికి అందరూ ఉరేగింపుగా వెళ్లి పూజాకార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంలో దేవిని ఈ కింది విధంగా ప్రార్థిస్తారు.

ఏ సీత్లా, సాతీ భవానీ యాడీ,
వర్షే మా ఏక్ దాడ తార్ పాండ్గ కర్రేచా యాడి,
గావ్డీ, గోదా, దూర్, ఘీసే  వేణూ యాడీ,
కుడీ వెలేర్ నై వదారేస్ యాడీ.
కోత్లీ మా పీసా ర కాడేస్ యాడి
వాళ్ ఉంగ్ళో హజార్ కోస్ దూర్ ర కాడేస్ యాడీ
సాయివేన్ సవారో కరస్ యాడీ” (రాథోడ్ సకారాం, కొల్లారి తండా,  40 సం.లు)

దేవి! మా పూజను స్వీకరించు, సంవత్సరానికి ఒక రోజు నీకు పూజను జరుపుతున్నాం. మాకు గోసంపద, ధాన్య సంపద సమృద్ధిగా ఇవ్వు. మా ఇళ్లలో పాలు, నెయ్యి సమృద్ధిగా కలిగేట్టు చూడు. మాకు ధనాన్ని ఇవ్వు. వినాశనాన్ని మా నుంచి వంద కోసుల దూరంలో ఉంచు. మమ్మల్ని కాపాడి మమ్మేలుకో జననీ! అని సీత్లా దేవిని ప్రార్థిస్తారు.

నైవేద్యంగా పెట్టిన లాప్సిని, ఉడకబెట్టిన మాంసాన్ని అందరికీ పంచుతారు. ఆ తర్వాత సాతియాడీలపై పాటలు పాడుకుంటూ నృత్యం చేసుకుంటూ ఇళ్లకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పాడే పాట.

గర్జే గర్జే వజళ క్యామేల హేలమా
భజేన ధరతి చూంజేడి
మారే శీతళాపర వరస మేల హెల మా
భీజేన ధరతి చూంజెడి
మారే హంసలేపర వరసమేల హెలమా
భజేన ధరతి చూంజేడి” (జాధవ్ లచ్చిబాయి తోషం వ. 38 సం.).

మబ్బులు గర్జించగా ఈ భూమాత తడిసింది. మా సీత్లా మాత కరుణ మాపై ఎల్లప్పుడు ఉంటుందని అర్థం. ఈ పాటలో సీత్లా మాత మహిమను స్మరిస్తూ, నాట్యం చేస్తూ ఇళ్లకు ప్రమాణమవుతున్న వైనం మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఆ రోజు వర్షం కురుస్తుంది.

2. సీత్లా – దాటుడు పండుగ:

లంబాడీల పండుగల్లో తొలి పండుగ దాటుడు పండగ. పశువులను పేగుపై నుండి దాటించడం వల్ల దాటుడు పండుగ అనీ, ఈ పండుగలో సీత్లాను  మొక్కడం వల్ల సీత్లా  పండుగ అని పేరు వచ్చింది.

3. సామూహికంగా పూజ:

సాత్ భవానీలోని ఏడు శిలల్లో ఎత్తైన శిల ఒకటి ఉంటుంది. ఆమె మేరమా. ఈ సాత్ భవానీల ముందు రెండు విస్తార్లు వేసి పూజారి ఉంటాడు. ఆడవారక్కడికి చేరుకొని ఒక్కొక్కరు తమ పళ్లాన్ని పూజారికి అందిస్తారు. పూజారి గుడాలను ఒక విస్తారిలో పాయసం, ఉల్లిగడ్డలు, మిరపకాయలు పెట్టి డబ్బులను మరో విస్తారిలో పెడుతాడు. ఈ విధంగా ఆడవారు. తాము తెచ్చిన పళ్లాలు అందించి లూంకడ్ వద్దకు చేరుకుంటారు. నిండు చెంబు నీళ్ళు చేయి వార పెట్టి లూంకడ్ పైన నీళ్ళు పోస్తారు. మెకాళ్ళ పైన కూర్చొని చెంబు ముందు పెట్టుకొని భూమికి మొక్కుతారు. సంప్రదాయ దుస్తులో భాగంగా నెత్తిపైన కొంగు ఉంటుంది. లూంకడ్ వద్ద మొక్కే సమయంలో నెత్తి పైన కొంగు ఉండాలనేది నియమం. మొక్కలు చెల్లించడాన్ని చడాయర్ అని అంటారు.

4. తీజ్ పండుగ:

లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగ గత దశాబ్దకాలంగా బహుళప్రచారం పొందుతూ వస్తుంది. తండా వాసులకే పరిమితమై బ్రతుకమ్మగా చెప్పుకుంటూ వచ్చే పండుగ తీజ్ బతుకమ్మగా పిలువబడింది. గిరిజనులపైన జరుగుతున్న పరిశోధనల, పలు అభివృద్ధి కార్యక్రమాలు వారిజీవన విధానాన్ని, సంస్కృతీ వైవిధ్యాన్ని గిరిజనేతర ప్రాంతాలకు పరిచయం చేయడానికి వీలు కలిగింది.

వరంగల్లు జిల్లాలో కురవి, పాలకుర్తి, నర్సంపేట, ములుగు పరిసర ప్రాంతాల్లో ఈ పండుగను సంప్రదాయంగా జరుపుకుంటూ వస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా పాలకుర్తి మండలంలో లంబాడీలు జరుపుకునే తీజ్ పండుగలో గతం తాలూకు మూలాలు నేటికి సహజంగా చూడవచ్చు. ఈ ఉద్దేశ్యంతోనే ఈ ప్రాంతంలో సేకరణకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి మిగతా ప్రాంతాల్లో కూడా దినికి సంబంధించిన మరింత సమాచార సేకరణకు పూనుకోవడం జరిగింది"1 (బంజారాల తీజ్ పండుగ అచిర భట్టు రమేష్)

తీజ్ పండుగను ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్ లోను, బీహార్, ఉత్తర ప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకొంటారు... నేపాల్ లో కూడా తీజ్ పండుగను శ్రావణెమాసంలో జరుపుకొంటారు. వర్ష కాలంలో మొదట్లో కనిపించే ఎర్రని చిన్న ఆరుద్ర పురుగును Red Insect తీజ్ అంటారు.

సీత్లా భవాని "పూజ ముగిసిన రోజు సాయంత్రం పెళ్లికాని ఆడపిల్లలు అందరూ కలిసి పాటలు పాడుతూ ఇంటింటికీ తిరిగి వారి పెద్దవాళ్లను కలుస్తారు. చిన్నాన్న,  తాతలను తీజ్ పండుగ జరిపించాలని కోరుతారు. పెద్దలందరు కలిసి తీజ్ వేడుకను జరపడానికి తండా నాయకుని అనుమతి తీసుకుంటారు." (“బంజారా సాహిత్యం - జీవన చిత్రణ”: డా. సూర్య ధనంజయ్)

ఏ పండుగగానీ పబ్బం గానీ పెద్దల అనుమతి లేనిది తండాలో ఎవరూ జరుపుకోవడానికి వీలు లేదు. ఇది తండా కట్టుబాటు. ఈ సందర్భంగా పాడే పాట.

మారో బాపూ జబరజ్ హూంసియో కనాయియో
ఓరి బేటివూన తీజ్ బోరాదూ కేరోయే,
కు వారీర్ ఆసిస్ లీదోరే కనాయియో
ఝరలేజు ఫాలియారే కనాయియో” (లతాబాయి వ.60. కొల్హారి తండా)

మమ్మల్ని కన్న మా తల్లిదండ్రులు చాలా మంచివారు. మాకు తీజ్ పండుగను జరుపుకోనిస్తామని అంటున్నారు. వారు కన్యలమైన మా ఆశీస్సులు కోరుకుంటున్నారని  తెలియజేయడం ఈ పాటలోని విశేషం.

ఈ పాట పూర్తిగా గోధుమలను సంబోధిస్తూనే కొనసాగడం విశేషం. గోధుమలు నానబెట్టి "పిలోణీర్ వేళ్ళి" (దుసెరు తీగ) తో ఆడ పిల్లలు స్వయంగా చిన్నచిన్న బుట్టలను అల్లుతారు. చక్కగా స్నానాలాడి పుట్టమట్టిని చేస్తారు. ఆ మట్టిలో మేక ఎరువును కలుపుతారు.

గోధుమలను బట్టలో చల్లేటప్పుడు కన్యలు పాడే పాటను “తీజ్ బోరామేరో” గీద్(గోధుమలను చల్లె సందర్భంలో పాడే పాట) అంటారు. గోధుమలు చల్లుతూ కన్యలు పాడే పాట. ఈ విధంగా ఉంటుంది.

శీత్లా యాడి బోరాయి తీజ్, బాయి తారో పాలేణ,
సోనీరో డాక్ళో ఘలాన, బాయీ తారో పాలేణ,
రూపేరో పీట ఘలాన, బాయి తారో పాలేణ,
సోనేరో దాండియా ఘడాన, బాయి తారో పాలేణ,
నవదాడోరీ నవసె తెవాళ్, బాయి తారో పాలేణ.” (భూక్య సుపాలీ బాయి. బెల్లాల్ తండా "వ.70సం॥)

ఓ చెల్లిలా! నీకోసం బంగారు పందిరి వేసి, వెండి పీటను వేసి బంగారు బుట్టలో సిత్లి మాత పండించింది. తీజును (గోరుకు మొలకను) పాటలు పాడుతారు. సహకరించిన సోదరులను, అనుమతిచ్చిన తండా పెద్దలను గుర్తుకు చేసుకుంటూ మధ్యరాత్రి వరకు ఆనందంగా గడుపుతారు. అనంతరం బుట్టలను తీసి మంచెపైన క్రమంగా పెర్చుతారు.
పరిశుభ్రతకు మారు పేరైన పండగ ఆసాంతం దాన్ని ప్రతిఫలస్తున్న కార్యక్రమాలు కానవస్తాయి. నీటిని తెచ్చే పాత్రలను శుభ్రంగా కడుగుతారు. ఇత్తడి పాత్రలు పూర్వం అధికంగా ఉండేవి. ఇవి నేటికి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. చెవులున్న బిందెలతో చెలిమి లేదా బావి లేదా బోరు వద్దకు చేరుకుంటారు. చింతపండు, మెత్తని ఇసుకతో పాత్రను శుభ్రంగా, తెల్లగా తోమి నీళ్ళు నింపుతారు. ఈ సమయంలో కూడా పాట పాడుతారు.

“లంబి లాంబియే లంబాడీ వేగోరియా
లంబి లాంబియే లంబాడీ వేగోరియా
ఫాంకా ఫాడియే లంబాడీ వేగోరియా
ఘంట మారియే లంబాడీ వేగోరియా
దల్ రియే లంబాడీ వేగోరియా
లంబి లాంబియే లంబాడీ వేగోరియా!” ( మారోణి బాయి. వ. 78. సం॥ బాబీరా తండా)

పొడవు పొడవైనది పచ్చనైన మరియమాదేవి.  పొడవు పొడవైనది పచ్చనైన మరియమాదేవి.  కొమ్మ విరుగుతున్న మొక్కల నుంచి మరియమాదేవి. దృడమువుతున్నది తీజ్ మరియమాదేవి. పెద్దగా అయ్యేను పచ్చనైన మరియమాదేవి పొడవు. పొడవు పొడవైనది పచ్చనైన మరియమాదేవి.  దృడమయ్యేను తీజ్ మరియమాదేవి! 

అమ్మాయిలు ఆ విధంగా నీళ్లు చల్లడం వల్ల క్రమంగా గోధుమలు, శనగలు మొలకెత్తి ఆ మొలకలు గునుగుపూలు వలె పొడుగ్గా పెరిగి వంగాలని ఆకాంక్షిస్తారు. ఆ తర్వాత ఇంకా పాటను కొనసాగిస్తూ నృత్యం చేస్తారు.

దండియాడి బారాయీ తీజ్, బాయీ తారో పాలేణ
దండియాడితి రాజీ యోగి తీజ్, బాయీ తారో పాలేణ
మారీ హుంసణ గౌరీ తీజ్, బాయీ తారో పాలేణ
మారి సంగరితి రాజీ యోగి బాయీ తారో పాలేణ
సోనీరి దాకళా ఘలాన్ బాయీ తారో పాలేణ” (రుక్కబాయి ధారావత్ నేరేడిగొండతండ వ॥ 60సం.)

తీజ్ పండుగను ‘దండియాడీ' (మేరామా భవాని) జరిపిస్తుందని. ఆ దేవత ఈ పండుగతో రాజీ పడిందని, బంగారు మంచె మీద తీజ్ బుట్టలను పెట్టించి దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని ఈ పాట సారాంశం.

5. తీజ్ తోడేరో (తీజ్ నారును తెంపడం):

తీజ్ నిమజ్జనానికి ముందు తండావాసులందరూ తలపాగలు కట్టుకొని వలయాకారంలో కూర్చుంటారు. కన్యలు తీజ్ నారును అత్యంత భక్తితో తెంపి మొదట తండా నాయకుని తలపాగకు కడతారు. తరువాత మిగతావారి తలపాగల్లో అమరుస్తారు. ఈ సందర్భంలో పాడె పాట.

కాచిగ పాకియే బోరడియే
కాయీ నెవలా బాందోయో పాంకేడియే
కసేరో రాళోయే ఛుంగేలా
కాయీ పాటేరో రాళోయే రాళోయే ఛుంగేలా
కాయీ కాచీగ పాకియే బోరడియే
కుణసీ బాయిరియే బోరడియే
కాయి సంజీయ బాందోయే పాంకేడియే
కాయి కసేరో రోళోయే ఛుంగేలా
కాయి పాటేరో రాళోయే ఛుంగేలా”  (బాదవత్ నీలాబాయి వ.60, బోథ్ బాబీరా తండా)

ఇక్కడ 'బోరడీ’ అంటే తీజ్ తీజ్ నారును అమ్మాయిల దేవతల పేర్లతో, తమ పేర్లతో తెంపడం జరిగింది. వీటిని సేవాభాయా, దండి మాడీలతో పాటు ఇంట్లో వారి పైర్లపైన పండించినట్లుగా చెప్తూ అందరి తలపాగాలతో తురాయిలుగా గుచ్చుతున్న నేపథ్యాన్ని తెలుపుతున్నది పాట.

6. ముగింపు:

ఈ విధంగా అనేక రకాలైన పాటలు, అనేక సందర్భానుసారంగా పాడిన పాటలు మనకు కోకొల్లలుగా పెద్దవారి ఆలోచనల్లోను, జానపదసాహిత్య పాటల సంకలనాల్లోను, అంతేకాక తెలంగాణలో ఏ అవ్వను అడిగిన అలవోకగా లంబాడి గేయాలను కొన్నైనా తప్పకుండా తన హృదయం నుంచి జాలువారుస్తుంది. 

ఈ విధంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అనేక సందర్భాల్లో పిల్లలను సంరక్షిస్తున్న తల్లులు తల్లుల్ని అనుకరిస్తూ పిల్లలు జానపద గేయాలను పాడుకుంటూ సంతోషంగా గడిపిన రోజులు ఒక నాటివి. ఈనాడు ఆ పరిస్థితి కనుమరుగైపోతుంది. పిల్లల్లో మానసిక ఒత్తిడి, వ్యాకులత పొంచి ఉన్నాయి. ఎందుకంటే తన ప్రపంచమంతా ఒకే గదిలో ఉండి పోవడమే. ఎదుట వ్యక్తి భావ జాలానికి, తన ఎదురున్న అంతర్జాలానికి మధ్య ఒక తెర మాధ్యమంగా ఏర్పడటమే. కావున పిల్లలను పెద్దల దగ్గర తీరిక సమయాలలోనైనా ఉంచుతూ వారు చెప్పిన జానపద లంబాడి గేయాలను వినిపిస్తూ తద్వారా విజ్ఞానంతోపాటు మానసిక ఆహ్లాదాన్ని ఉత్తేజాన్నిస్తూ ఈ దేశానికి ఒక గొప్ప యువతని అందించిన వారిలో పూజ్యనీయులు మన తెలంగాణ జనపదులే.

7. విషయదాతలు:

  1. ధరావత్: బాలునాయక్ 
  2. భుక్త్యా:   ఆలూ నాయక్ 
  3. భూక్య సుపాలీ బాయి. బెల్లాల్ తండా "వ.70సం॥
  4. రాథోడ్ సకారాం, కొల్లారి తండా,  40 సం.లు
  5. బాదవత్ నీలాబాయి వ.60, బోథ్ బాబీరా తండా
  6. ధరావత్:  శీలాబాయి
  7. రాథోడ్: లతాబాయి వ.60. కొల్హారి తండా
  8. రుక్కబాయి ధారావత్ నేరేడిగొండతండ వ॥ 60సం.
  9. మారోణి బాయి. వ. 78. సం॥ బాబీరా తండా
  10. జాధవ్ లచ్చిబాయి తోషం వ. 38 సం.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. రమేష్, భట్టు. బంజారాలు తీజ్ పండగ -ప్రపంచ తెలుగు మహాసభలు. 2017. 
  2. రాజ్ మహ్మద్, ఎం.డి. గిరిజనుల పండుగలు ఆచారాలు. వరంగల్ వాణి దిన పత్రిక. 1994 నవంబర్ 26.
  3. రాథోడ్, మురహరి. ఆదిలాబాద్ జిల్లా లంబాడి సాహిత్యం- పరిశీలన. 2019.
  4. సూర్య ధనుంజయ్. నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం - జీవన చిత్రణ. 2011

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]