AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. భాషావిద్యార్థుల సమగ్ర అభివృద్ధి: ‘మదింపు’ పాత్ర
డా. పి. నీరజ
సహాయ ఆచార్యులు,
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్వయంప్రతిపత్తి),
సికింద్రాబాద్, రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9849258500, Email: neerajaram2012@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి అనగా విద్యార్థుల శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాలలో అభివృద్ధి పొందడానికి అభ్యసనం కొరకు మదింపు ఉపయోగపడుతుంది. అభ్యసనం కొరకు మదింపులో విద్యార్థులువారి అభ్యసనంలో చురుకుగా ఉండేటట్లు ప్రోత్సహించబడి మదింపుతో సంబంధం కలిగి ఉంటారు. తరగతి గది బయట కూడా తమ జీవితంలో అభ్యసనం కొనసాగించేందుకు కావలసిన సామర్థ్యం మరియు నమ్మకం కల స్వీయక్రమశిక్షణ కల అభ్యాసకులను తయారు చేయడమే అభ్యసనం కొరకు “మదింపు” ప్రయోజనం. ఈ విధమైన అభ్యసనం కొరకు మదింపు యొక్క ప్రక్రియను గూర్చి, ఈ వ్యాసంలో కేస్-స్టడీ పద్ధతిలో విద్యార్థులను పరిశీలించి మదింపు ప్రక్రియలో పాల్గొన్న విద్యార్థుల ప్రగతిని గుర్తించడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అభ్యసనం కొరకు మదింపు ఎంత తోడ్పడుతుందని నిరూపించడమైనది.
Keywords: భాషావిద్యార్థులు, సమగ్రత, అభివృద్ధి, అభ్యసనం, మదింపు.
1. ఉపోద్ఘాతం:
పరీక్షల పేరుతో ఎప్పుడో ఒకసారి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించడం వలన వారి అభ్యసనకు అది ఏవిధంగాను సహాయ పడదు. పరీక్షా పద్ధతి విద్యార్థులు ఏ సమాచారాన్ని ఎంతవరకు గుర్తు పెట్టుకోగలిగారో తెలియపరుస్తుంది తప్ప వారి విభిన్న సామర్ధ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడదు. మూల్యాంకనం పేరుతో అనేక రకాల పరీక్షలను నిర్వహించడం వలన విద్యార్థులు భట్టీ పట్టడానికి మాత్రమే అలవాటు పడతారు తప్ప అవి వారి మానసిక మరియు సాంఘిక వికాసాలను మదింపు చేయడానికి ఉపయోగపడవు.
విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 29 ప్రకారం విద్యార్థులు తాము పొందిన జ్ఞానాన్ని తమ దైనందిన జీవితంలో వినియోగించే సామర్థ్యాన్ని లేదా అన్వయించబడే సామర్ధ్యాన్ని కలిగి వారి సర్వతో ముఖాభివృద్ధి జరగాలని పేర్కొంది. ఈ విధమైన సర్వతో ముఖాభివృద్ధి జరగడానికి అభ్యసనంలో మదింపు పాత్రను గుర్తించాలి. మదింపు అనేది కేవలం రాత పరీక్షల ద్వారానే కాకుండా మౌఖికంగాను, ప్రదర్శనలు, కృత్యాలు చేయడం, ప్రాజెక్టు పనులు, పరిశీలనలు, తరగతిపని, రిపోర్టుల ప్రాతిపదికగా జరిగినప్పుడు ఈ ప్రక్రియలను నిర్వహించే క్రమంలోనే అభ్యసనం మరియు మదింపు రెండునూ జరుగుతాయి. అంటే అభ్యసనం చేసినదాని యొక్క మదింపు కాకుండా అభ్యసనంలో భాగంగా మదింపు జరుగుతుంది.
2. మదింపు:
అభ్యసనంలో అంతర్భాగంగా ఉంటూ నిరంతరం జరిగే ప్రక్రియగా అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపయోగ పడే సాధనాన్ని మదింపు అంటాం.
“విద్యలో వివిధ మదింపు విధానాలను, నియోజనాలను, ప్రకల్పనలను నిరంతర మదింపును లక్ష్యాత్మక ప్రశ్నలను ఉపయోగించి అభ్యసనం మరియు బోధనల ప్రమాణ పరిమాణాలను మాపనం చేయడానికి ప్రయత్నించే ప్రక్రియ మదింపు”. (1)
“వివిధ విద్యాశాఖ అంశాలలో విద్యార్థుల అభివృద్ధి స్థాయిని అంచనా వేయగల ప్రక్రియను మదింపు లేదా పరిగణనం అంటారు”. (2)
2.1 మదింపు లక్ష్యాలు:
- బోధనాభ్యసనలో భాగంగా జరుగుట
- ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేయుట
- విద్యా లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినవి అనేదానిపే దృష్టిని కేంద్రీకరించుట
- విద్యార్థుల ప్రగతిని బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడే అంచనా వేయుట
2.2 అభ్యసనం కొరకు మదింపు ప్రయోజనాలు:
- విద్యార్థుల జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక నైపుణ్యాలను పెంపొందించడం
- బట్టి పట్టడాన్ని ,సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడం అనే తరగతిగది ప్రక్రియల స్థానంలో విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ప్రోత్సహించడం
- సొంతంగా తమ ఆలోచనలను, భావాలను వ్యక్తపరిచేటట్లు చేయడం
- బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా మదింపు చేయడం
- విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను, బోధనాభ్యసన విధానాలను మెరుగుపరచడం
- విద్యార్థులను నిరంతరం పరిశీలిస్తూ సవరణలు చేయడం
- బోధనాభ్యసన ప్రక్రియలు విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడడం
“మదింపు విద్యార్థుల నిష్పాదన సమాచారాన్ని సేకరించడానికి ఉద్దేశించిన వివిధ కార్యక్రమాలు, పద్ధతుల సమహారం. దీనిలో సంప్రదాయక ‘కాగితం-కలం పరీక్ష’ లతో పాటు సమాధానాలను విస్తరించే లక్షణం గల వ్యాసరచన, ప్రయోగశాలలో నిర్వహించే ప్రయోగకృత్యాల వంటి కృత్తి నిర్వహణలు, ఉపాధ్యాయుల పరిశీలనలో, విద్యార్థుల స్వీయ నివేదనలు అంతర్భాగాలు. ఈ దృష్ట్యా ఏ స్థాయిలో ఎంత సమర్ధంగా విద్యార్థి తన ఉపలబ్దిని ప్రదర్శించాడు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే ప్రక్రియ మద్దింపు లేదా పరిగణనం”. (3)
అభ్యసనంలో భాగంగా మదింపు జరిగే కొన్ని ప్రక్రియలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
3. చర్చలు:
చర్చలో విద్యార్థులు తమలో తాము గాని లేదా విద్యార్థులు ఉపాధ్యాయులు / అధ్యాపకులతో గాని పాఠ్యాంశాన్ని గురించి సమగ్రంగా మాట్లాడు కోవడం జరుగుతుంది. చర్చలో స్నేహపూరిత వాతావరణం ఉండాలి.
ఉపాధ్యాయులు/ అధ్యాపకులు చర్చను ఆరంభించి, చివరలో సాధారణీకరణం చేయాలి. సహజంగా తరగతి బోధనలో భాగంగా నిర్వహించే చర్చ, ప్రశ్నోత్తర పద్ధతిలో సాగుతుంది. చర్చ అనేది అన్ని బోధనా లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుంది. చర్చ చేయడం వలన విద్యార్థులలో ఆలోచనా పరిధిని పెంపొందించవచ్చు. సృజనాత్మక వైఖరి అలవడుతుంది. ఇతరులతో వారి అభిప్రాయాలను పంచుకోగలుగుతారు. భాషణ నైపుణ్యం పెంపొందుతుంది. విద్యార్థుల స్థాయిని బట్టి చర్చా వేదికలను కూడా నిర్వహించవచ్చును. విద్యార్థులు ఒక ప్రత్యేకమైన అంశంపై వారి వారి అభిప్రాయాలను వెలిబుచ్చుతారు.
4. భాషా ప్రాజెక్టు పనులు:
“విద్యార్థులు సహజ వాతావరణంలో తనంతట తానుగా అవసరనుగు సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల అవగాహన పెంపొందించుకొని నిర్థారణకు రావటానికి ఉపయోగపడే కృత్యాల సమూహాన్నే ప్రాజెక్టు పనులు అంటారు”. - కిల్ పాట్రిక్.
భాషాభ్యసనం ప్రాజెక్టు పనులలో భాగంగా కథలు, కథానికలు, నిఘంటువులు, శతక పద్యాలు, పుస్తక సమీక్షలు, నివేదికల తయారి, వర్ణనలు, గేయాలు, వ్యాసాలు, కవితలు, సామెతలు వంటి విషయాల్లో సమగ్ర సమాచారాన్ని సేకరించమని చెప్పవచ్చును .
5. వక్తృత్వం:
వక్తృత్వం కూడా ఒక విధమైన రచనయే. దీనిని వాగ్రూప రచన అని మరియు ఉక్తరచన అని అంటారు. ఏదైనా ఒక అంశంపై తడబాటు లేకుండా నాలుగు ఐదు నిమిషాలు మాట్లాడడాన్ని వక్తృత్వం అంటారు. ఇది ఒక రకంగా సద్యోభాషణం వాచక చర్యలో విస్తృత అభ్యాసం కలిగి ఉన్న విద్యార్థులు చక్కని “ఉక్తరచన” చేయగలుగుతారు.
వక్తృత్వం శ్రోతులను ఆకట్టుకునేదిగా ఉండాలి. మధ్యలో భావాలకోసం, భాషకోసం తడుముకోవడం, కొంతసేపు నిలిచిపోవడం వంటివి చేయకూడదు. వాచికాభినయనానికి ప్రాధాన్యతనిస్తూ, ఉదాహరణలను, సందర్భాలను ప్రస్తావిస్తూ, తమ వాదనకు ఆధారాలు వివరిస్తూ శ్రోతలకు విసుగు కలగకుండా నాలుగైదు నిమిషాలు అందర్నీ ఆకట్టుకునేలా మాట్లాడాలి. ఈ విధమైన వకృత్వం ద్వారా విద్యార్థులలో భాషా భాషా శక్తితో పాటు ఆలోచన దృక్పథాన్ని కూడా పెంపొందించి తద్వారా హేతువాద దృక్పథాన్ని అలవాటు చేయవచ్చు.
6. వ్యాసరచన:
లిఖిత రచనలో ఒక భాగమే వ్యాసరచన. విద్యార్థుల స్థాయిని బట్టి వ్యాసరచనకు ఇచ్చే అంశాన్ని గుర్తించాలి. ఒక అంశంపై పూర్తి సమాచారాన్ని సేకరించి ఉదాహరణలతో, ఆధారాలతో నిరూపిస్తూ ఒక పద్ధతిలో అంశాన్ని విశ్లేషిస్తూ చేసే రచనే వ్యాసరచన.
వ్యాసరచన ద్వారా విద్యార్థులలో లేఖన నైపుణ్యమేకాకుండా సాహిత్య పఠనాభిలాషను పెంపొందించవచ్చు. విస్తృతమైన పఠనం చేసే వారికి ఒక అంశంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తద్వారా వారు సామాజిక విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు.
7. పత్రికా నిర్వహణ:
విద్యార్థులను ప్రోత్సహించి వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి రచనలు చేయించి ఆ విధమైన రచనలు అన్నిటినీ ఒక దగ్గర కూర్చి పాఠశాల / కళాశాల పత్రికను నిర్వహించాలి. విద్యార్థుల రచనలను ముద్రించి పత్రికగా తయారు చేయాలి. దీనిలో విద్యార్థుల కవితలు, విలువలతో కూడిన చిన్న కథలు, పద్యాలు, పాటలు, వచన రచనలు ఏవైనా ఉండవచ్చు.
ఈ విధంగా పత్రికా నిర్వహణ చేయడం ద్వారా విద్యార్థుల సృజనాత్మక శక్తులను తెలుసుకోవడమే కాకుండా వారిలో భాషా జ్ఞానాన్ని కూడా పెంపొందించవచ్చును. తద్వారా వారి అభ్యసనాన్ని సులభతరం కావించవచ్చు. ఒక్కొక్క విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పత్రిక నిర్వహణ ఎంతో ఉపయోగపడుతుంది.
8. ప్రదర్శనలు:
పాఠశాలలో/ కళాశాలలో నిర్వహించే రకరకాల ప్రదర్శనలు విద్యార్థులలో కొత్త స్ఫూర్తిని నింపి భాషావగాహనను, వినియోగాన్ని పెంపొందిస్తాయి. వీటిలో సాంస్కృతికప్రదర్శనలు, పద్యపఠనములు, పాటల పోటీలు, అంత్యాక్షరి కార్యక్రమాలు, నృత్యాలు అభినయ గేయాలు, విజ్ఞాన ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనేటట్లు చేయడం ద్వారా వారి భాష కౌశలాలను మెరుగుపరచవచ్చు.
ప్రదర్శనలు పదిమందిని ఆకర్షించేందుకు, సమాచారాన్ని పంచేందుకు ఉపయోగపడతాయి. విద్యార్థుల స్థాయిని బట్టి వారి ప్రదర్శన అంశాలను ఎంపిక చేసుకోవాలి. చార్టులు, చిత్రాలు, నమూనాలు వంటి వాటి నుండి పిపిటిలు వీడియోలు ,గోడపత్రికలు, కార్యగోష్టి వంటి వన్నింటినీ ప్రదర్శించవచ్చు. ఈ రకమైన ప్రదర్శనల ద్వారా విద్యార్థులలో పరిశోధనా స్పృహను, సృజనాత్మకతను, ఆత్మ స్థైర్యమును పెంపొందించవచ్చును.
9. పరిశీలన:
“తరగతి గదిలో, పరిశోధనలో, సంఘటన, సందర్భం మొదలైన సందర్భాలలో ఉపయోగించే ముఖ్యమైన నియమబద్ధమైన ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగే ఆలోచనత్మక, పరిణామాత్మక, ప్రమాణాత్మక దత్తాంశాలను ఒకసారి గాని, ఒకే అంశాన్ని పలుమార్లు గాని, పలు వ్యక్తులు గాని జరిపే ప్రక్రియే పరిశీలన.”( 4)
ఒకే అంశాన్ని ఒకే వ్యక్తి పలుమార్లు పరిశీలించడం ద్వారా ఆ దత్తాంశం యొక్క విశ్వసనీయత పెరుగుతుంది. తరగతిలో ఉపాధ్యాయులు / అధ్యాపకులు చేసే నిత్య ప్రక్రియ పరిశీలన. విద్యార్థులచే వారి సహ బృందాలను పరిశీలించేలా చేయడం ద్వారా తమలోని లోపాలను కూడా అర్థం చేసుకొని సవరించుకునే అవకాశం ఉంటుంది.
10. భాషామేళాలు:
భాషా మేళాలను పాఠశాల/ కళాశాలలో మూడు నుంచి ఐదు రోజులపాటు విద్యాసంస్థల్లో ఒకటి రెండు సార్లు నిర్వహించవచ్చు. దీనిలో భాగంగా పఠన పోటీలు, కథన పోటీలు, వాచక పోటీలు, లేఖన పోటీలను నిర్వహించవచ్చు. ఇవే కాకుండా క్విజ్, అంత్యాక్షరి, గేయ రచనలు, కవితలు వంటివి నిర్వహించవచ్చు. విద్యార్థి రచయిత/కవుల సమావేశాలను కూడా నిర్వహించవచ్చు.
విద్యార్థులలో భాషా సామర్ధ్యాలను అభివృద్ధి చేయడానికి, పోటీ తత్వాన్ని పెంపొందించడానికి, భాషాభిరుచిని, సాహిత్యాభిరుచిని ,ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ భాషా మేళాలు ఎంతగానో తోడ్పడతాయి.
11. పోర్ట్‌ఫోలియో:
“విద్యార్థి చేసిన వివిధ పనులకు సంబంధించిన నమూనాలను సేకరించే స్వీయమదింపు పోర్ట్‌ఫోలియో”. (5)
అద్భుతమైన విద్యా పరికరం పోర్ట్‌ఫోలియో. అనేక విద్యా సంబంధిత అంశాలలో పోర్ట్‌ఫోలియోలను ఉపయోగిస్తున్నారు. పోర్ట్‌ఫోలియోలో విద్యార్థి వర్తమానంలో తరగతిలో చేస్తున్న పని ఉంటుంది. ఇందులో మేదో తుఫానులు, చిత్తుముసాయిదాలు, కొంత భాగం పూర్తయిన ముసాయిదాలు, అంతిమ ప్రతులు మరియు ప్రచురించిన పని ఉంటాయి. అంతిమ పోర్ట్‌ఫోలియోలో అవసరమైన విషయాల వరుస, విద్యార్థి ఎంపిక చేసుకున్న విషయాలు లేదా విద్యార్థి శ్రేష్టమైన పని అనుకున్నది కలిగి ఉంటుంది.
పోర్ట్‌ఫోలియో విద్యార్థి యొక్క ఆత్మవిశ్వాసం పై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. విద్యార్థి ఒక అభ్యాసకుడిగా లోతైన జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు. వారిలోని బలహీన భాగాలను బలపరచుకొని ప్రావీణ్యతను పొందగలుగుతాడు. దీని ద్వారా విద్యార్థి తన పనిని పునఃసమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా విద్యార్థులు భాష అభ్యసనాన్ని విజయవంతం చేసుకోగలుగుతారు.
12. కేస్-స్టడీ:
సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 2023 - 25 బ్యాచ్ లో చేరిన తెలుగు పెడగాజీ ఛాత్రోపాధ్యాయులలోని భాషా పరమైన నైపుణ్యాలను ముందుగా పరిశీలించి అంచనా వేయడం జరిగింది. తరువాత వారిని నెల రోజులపాటు చర్చలో, వ్యాసరచనలో, బృంద పరిశీలనలో, వక్తృత్వంలో, పద్య పఠనంలో, ప్రాజెక్టు పనులలో పాల్గొనేటట్లు చేసి ఆ తర్వాత వారిలోని భాషా నైపుణ్యాలు ఎంతవరకు మెరుగైనయో అంచనా వేయడం జరిగింది.
మదింపు ప్రక్రియలలో పాల్గోనకముందర విద్యార్ధుల సగటు అభివృద్ధి పట్టిక
క్రమ సంఖ్య | నైపుణ్యం | సగటు కంటే తక్కువ స్థాయి | సగటు స్థాయి | సంతృప్తికరమైన స్థాయి | అంచనాలను అందుకొన్నస్థాయి | పరిపూర్ణ స్థాయి |
1. | భావ స్పష్టత |
|
| |
|
|
2. | వ్యక్తీకరణం |
|
| |
|
|
3. | భావయుక్త పఠనం |
|
| |
|
|
4. | చర్చా నైపుణ్యం |
| |
|
|
|
5. | విశ్లేషణ నైపుణ్యం |
| |
|
|
|
6. | వివరణ నైపుణ్యం |
|
| |
|
|
7. | ఉదాహరించుట |
| |
|
|
|
8. | సభా కంపం లేకుండుట |
|
| |
|
|
9. | సృజనాత్మకత |
|
| |
|
|
10. | హేతుబద్ధత |
| |
|
|
|
మదింపు ప్రక్రియలలో పాల్గొన్న తరవాత విద్యార్ధుల సగటు అభివృద్ధి పట్టిక
క్రమ సంఖ్య | నైపుణ్యం | సగటు కంటే తక్కువ స్థాయి
| సగటు స్థాయి | సంతృప్తికరమైన స్థాయి | అంచనాలను అందుకొన్న స్థాయి | పరిపూర్ణ
స్థాయి |
1. | భావ స్పష్టత |
|
|
| |
|
2. | వ్యక్తీకరణం |
|
|
| |
|
3. | భావయుక్త పఠనం |
|
|
| |
|
4. | చర్చా నైపుణ్యం |
|
| |
|
|
5. | విశ్లేషణ నైపుణ్యం |
|
| |
|
|
6. | వివరణ నైపుణ్యం |
|
|
| |
|
7. | ఉదాహరించుట |
|
| |
|
|
8. | సభా కంపం లేకుండుట |
|
|
| |
|
9. | సృజనాత్మకత |
|
|
| |
|
10. | హేతుబద్ధత |
|
| |
|
|
పై పట్టికలోని ఫలితాలని విశ్లేషించినట్లయితే విద్యార్థులందరిలో ఈ విధమైన ప్రక్రియల ద్వారా భాషా నైపుణ్యాలలో, సభాకంపం లేకుండుటలో, ఉదహరించుటలో, విశ్లేషించుటలో ఎంతో మెరుగైన అభివృద్ధిని కనబరిచారు.
13. ముగింపు:
అభ్యసనం కొరకు మదింపు విధానాన్ని తరగతి గదిలో పాటింపబడిన విద్యార్థులు వారి అభ్యసనంలో చరుకుగా ఉండేటట్లు ప్రోత్సహించబడి, మదింపుతో సంబంధం కలిగి ఉంటారు. పాఠశాల / కళాశాలను వదిలిన తరువాత కూడా వారి జీవితంలో అభ్యసనం కొనసాగించుటకు కావలసిన సామర్థ్యం మరియు నమ్మకం కల స్వీయ క్రమశిక్షణకల అభ్యాసకులుగా తయారుచేయబడతారు. కేవలం ముందుగా అభ్యసించిన అంశాలపై పరీక్షలే కాకుంగా ఈ విధమైన రోజువారి అంశాలలో వారు అభ్యసించినదానిని మదింపు చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతారని కేస్ స్టడీ ఫలితాల ద్వారా నిరూపితమైనది.
ఈ విధంగా విదార్థులు పాల్గోనే ప్రతి అంశం ద్వారా వారు అభ్యసన చేయగలుగుతారు. ఈ విధమైన అభ్యసనాన్ని మదింపు చేయడం ద్వారా వారి యొక్క ప్రతి చిన్న అభివృద్ధిని పరిగణన చేయవచ్చు. విద్యార్దులు స్వేచ్ఛగా, ఆనందంగా అభ్యసించటానికి, తమంత తాముగా స్వయం అభ్యసనం చేయడానికీ, వివిధ విషయాలను స్వయంగా సమగ్రంగా, సమన్వయంగా గ్రహించడానికి, విలువలని, వైఖరులను పెంపొందించడానికి, భోదనలో నూతనత్వ విధానాలను అనుసరించడానికీ, అభ్యసనం కొరకు మదింపు ఉపయోగపడుతుంది.
14. పాదసూచికలు:
- అభ్యసనం – మదింపు, పుట.15
- ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు భాషావగాహన; పుట.161
- ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు భాషావగాహన; పుట.161
- అభ్యసనం – మదింపు; పుట.130
- అభ్యసనం – మదింపు; పుట.161
15. ఉపయుక్తగ్రంథసూచి:
- రఘు, ఎన్., దేవ నారాయణ, ఆర్., లలితాదేవి, వేదాంతం., మొండయ్య, శ్రీరామ్., కృష్ణయ్య, జె., ప్రాథమిక స్థాయిలో భాష - భాషాభివృద్ధి - అవగాహన. తెలుగు అకాడమీ, 2016, హైదరాబాద్.
- రామకృష్ణ ఎ., మృణాళిని టి, శంకర్ పి, శ్రీనివాస్ వి, సునీత డి., అభ్యసనం – మదింపు. తెలుగు అకాడమీ, 2017, హైదరాబాద్.
- సరస్వతి, ఎం., అన్నపూర్ణ, జి.ఎల్., నాగేశ్వరరావు, ఎం., నీరజ, పి., అభ్యసనం – మదింపు. నీల్కమల్ పబ్లికేషన్స్, 2016, హైదరాబాద్.
- సరోజ, ఎన్., కొమరయ్య, ఎ., మహాదేవరెడ్డి, కె., తెలుగు బోధనాధ్యయనం. నీల్కమల్ పబ్లికేషన్స్, 2016, హైదరాబాద్.
- సాంబమూర్తి, డి., ఆనంద్ కుమార్, పైడిముక్కల., ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు భాషావగాహన. నీల్కమల్ పబ్లికేషన్స్, 2016, హైదరాబాద్.
- సాంబమూర్తి, డి. తెలుగు బోధన పద్ధతులు. నీల్కమల్ పబ్లికేషన్స్, 2009, హైదరాబాద్.
- సాంబమూర్తి, డి. మాతృభాష విద్యాధ్యయనం. నీల్కమల్ పబ్లికేషన్స్, 2017, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.