headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. శాసనాలు: శ్రీశైలక్షేత్ర చారిత్రక ప్రస్తావనలు

డా. జి . తిరుమల వాసుదేవరావు

ఉపన్యాసకుడు మరియు చరిత్ర శాఖ అధ్యక్షుడు,
ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల,
నగరి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

చరిత్రరచనలో ఆధారాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ఆధారాలు లభించని చరిత్ర కథగా మిగిలిపోతుంది. ఈ చారిత్రక ఆధారాలను పరిరక్షించడంలో భారతీయులు చూపిన నిర్లక్ష్యం అపారమైన దేశ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేసింది. ప్రాచీనదేవాలయాలు చరిత్ర, సంస్కృతి పరిశోధకులకు తరగని గనులు లాంటివి. వీటిపై జరిపే పరిశోధనల ద్వారా అప్పటి కాల పరిస్థితులపై సమగ్రమైన విశ్లేషణ చేయవచ్చును. చరిత్ర రచనలో శాసనాధారాలు అతి కీలకమైనవి. ఈ వ్యాస రచన విషయ సేకరణ కొరకు ప్రాథమిక ఆధారాలుగా ఎపిగ్రాఫియా ఇండికా, సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్ వాల్యూములు, ద్వితీయ ఆధారాలుగా వివిధ ప్రామాణిక చరిత్ర గ్రంథాలు, మరియు పరిశోధన పత్రాలు ఉపయోగించడమైనది. చరిత్ర రచనలో శాసనాధారాలు అతి కీలకమైనవి. ఈ వ్యాసంలో శ్రీశైలదేవాలయం గురించి ప్రస్తావించిన కొన్ని శాసనాలలోని సమాచారాన్ని క్రోడీకరిస్తూ, వివరించడం జరిగింది. వివిధ శతాబ్దంలలో విస్తరించి ఉన్న ఈ శాసనాలు ఈ దేవాలయం ప్రాముఖ్యతను పునరుద్గాటిస్తాయి.

Keywords: ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్ర, శివ-శక్తి పీఠాలు, మల్లికార్జున స్వామి, శాసనాలు, అనవేమ రెడ్డి, కృష్ణదేవరాయలు.

1. ఉపోద్ఘాతం:

దక్షిణ భారతదేశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లో తూర్పు కనుమల వద్ద శ్రీశైల ప్రాంతంలో దట్టమైన నల్లమల కొండలలో వెలసిన ప్రముఖ శైవక్షేత్ర శ్రీశైలం. ఈ పుణ్యక్షేత్రం శ్రీ పర్వతం, శ్రీగిరి మొదలైన పేర్లతో పిలువబడుతూ, దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రంలో పార్వతీదేవి భ్రమరాంబ గాను, ఈశ్వరుడు మల్లికార్జునుడు గాను భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు.

శ్రీ శైల క్షేత్రాన్ని శివునికి చెందిన జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావిస్తారు అదే విధంగా ఇక్కడ వెలసిన భ్రమరాంబ దేవత స్థానాన్ని శక్తిపీఠంగా భావిస్తారు. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ శక్తి పీఠం గాను విలసిల్లుతున్నది. భారతదేశంలో ఈ విధమైన శివ-శక్తి పీఠాలు మూడు ఉన్నాయి. అవి వారణాసి, ఉజ్జయిని మరియు శ్రీశైలం.

2. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

ఈ పవిత్ర క్షేత్ర ప్రాంతం ఉత్తర 16⁰ -12 అక్షాంశాలు, 78°s తూర్పు రేఖాంశాల మధ్య నెలకొని 384 కి.మీ పొడవు, 384 కి.మీ వెడల్పుల తో నాలుగు ప్రధాన ద్వారాలు గా శైవ దేవాలయాలను కలిగి విస్తృత వైశాల్యంతో విస్తరించి ఉంది. శ్రీశైల పీఠభూమి భారోమెట్రిక్ ఎత్తు 472.8 మీ[1]. ఈ ప్రాంతాన్ని భూమికి నాభి ప్రాంతంగా పరిగణిస్తూ దేవతారాధన, పూజల సందర్భంగా భౌగోళిక గుర్తింపుకు ఈ ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. [జంబూ ద్వీపే, భరతవర్షే-, భరతఖండే, మేరో దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య నైరుతి ప్రాంతం, కృష్ణగోదావర్యోర్మధ్యప్రదేశే, స్వగృహే……]

బౌద్ధ మతం తో ఈ ప్రాంతానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ క్రీ.శ మొదటి శతాబ్ది నాటికి బౌద్ధ మతం వ్యాపించినట్లు భావిస్తున్నారు. చైనా బౌద్ధ యాత్రికులు పాహియాన్, హుయాన్ సాంగ్ నాగార్జున కొండ లోయలో గల శ్రీ పర్వతాన్ని ప్రస్తావించారు. ప్రఖ్యాత బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునడు ఈ ప్రాంతం వారిని భావిస్తున్నారు.

శ్రీ శైల క్షేత్రం జంగముల ప్రధాన స్థావరం గా విలసిల్లినది.. మరియు వీర శైవుల ఐదు ప్రధాన మఠాలలో ఒకటి [2][3]. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం ఈ తూర్పు కనుమల కొండల వరుసలను మహాసర్పంతో పోలుస్తారు. పాము తోక భాగంలో శ్రీశైలం, వీపుపై అహోబిలం, పడగ పై తిరుమల మరియు నోటి వద్ద శ్రీకాళహస్తి దేవాలయాలు నెలకొని ఉన్నాయని భావిస్తారు[4]. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే శ్రీశైలం దర్శనం మాత్రం చేత మానవులు జనన-మరణ వృత్తం నుండి బయటపడి, అమరత్వం సాధిస్తారని భక్తుల నమ్మకం.

శివలింగాలను పంచభూతాత్మకంగా పృథ్వి లింగాలు, జల లింగాలు, తేజో లింగాలు, వాయు లింగాలు మరియు ఆకాశలింగాలుగా వర్గీకరిస్తారు. శ్రీశైలంలోని శివలింగం తేజో లింగాల తరగతికి చెందింది. ఈ పంచభూత లింగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగు ప్రాంతాలలో కృష్ణా జిల్లా దివి తాలూకాలోని నడకుదూరులోని పృథ్వీ లింగం - అక్కడికి సమీపంలోని ఘంటసాల లో గల జలదూపేశ్వర లింగం - శ్రీశైలంలో తేజోలింగం - శ్రీకాళహస్తిలో వాయు లింగం - పాలకొల్లు (పశ్చిమగోదావరి)లో ఆకాశలింగంను గుర్తిస్తారు.

కొందరు దేశ భాష వ్యాకరణ పండితులు శ్రీశైలం, నల్లమల మొదలగు పదాల గురించి వివరిస్తూ నల్ల = పవిత్రమైనది (శ్రీ) మలై = కొండ , పర్వతం అని తెలుపుతారు. ప్రారంభంలో" మలైక్క రసర్" గా పిలవబడిన దేవుడు క్రమంగా మల్లికార్జునడిగా మారినట్లు భావిస్తున్నారు. ఈ దివ్య క్షేత్రం నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలతో (శైవ కేంద్రాలు) పర్యవేక్షించబడి ఉంది. అవి తూర్పున త్రిపురాంతకం, ఉత్తరాన ఉమామహేశ్వరం, పశ్చిమాన అలంపూర్ మరియు దక్షిణాన సిద్ధవట్టం [5] [6]. అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా శతాబ్దాల కాలం పాటు ఈ పవిత్ర ప్రాంతం నిలిచింది.

3. ఆచారాలను సంప్రదాయాలను తెలిపేశాసనాలు:

దక్షిణ భారతదేశ సామాజిక, మత పరిస్థితులపై శ్రీశైల క్షేత్రం తనదైన ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగి ఉంది. వివిధ కాలాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాలకులు, వారి సామంతులు మరియు ఉన్నత ఉద్యోగులు ఆలయంలోని కార్యక్రమాలు సజావుగా కొనసాగుటకు దేవాలయానికి మాన్యంగా గ్రామాలను సమర్పిస్తూ దాని శాసనాలు వేయించారు. శ్రీశైల ఆలయము మరియు పరిసర ప్రాంతాలలో లభించే శాసనాలు ఈ దేవాలయంలోని ఆచారాలు, పూజా పద్ధతులు మరియు పండగల గురించిన విలువైన సమాచారాన్ని మనకు అందిస్తాయి.ఈ శాసనాలలో కొన్నింటిలో ఈ గ్రామాల నుండి లభించే ఆదాయం ఏ విధంగా వేటిపై ఖర్చు చేయాలో కూడా నిర్దేశించారు.

కాకతీయ ప్రతాపరుద్రుడి ముఖ్యమంత్రి వేపాటి కామయ్య క్రీ.శ 1312 లో మల్లికార్జున స్వామికి ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో నైవేద్యం కొరకు భూమి దానంగా ఇచ్చాడు, ఈ శాసనంలో నైవేద్యంలో ఉపయోగించవలసిన వివిధ పదార్థాలైన ధాన్యాలు, నూనెలు, పెరుగు మొదలగు పదార్థాల పరిమాణాలను కూడా పేర్కొన్నారు[7].

అదేవిధంగా దైవారాధన సందర్భంగా ధూప దీప నైవేద్యం కొరకు సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, సాంబ్రాణి మొదలగు పదార్థాల కొరకు కొన్ని గ్రామాల ఆదాయాన్ని కేటాయించేవారు. క్రీ.శ 1506 లో ఇమ్మడి నరసన నాయనంగారు కృష్ణ పురస్కారాల సందర్భంగా మూడవ రోజున శ్రీశైల ఆలయాన్ని దర్శించి ధూప దీప నైవేద్యం కొరకు అటుకూరు గ్రామాన్ని దేవాలయానికి బహూకరించారు [8].

సాంప్రదాయం ప్రకారం చంద్రావతి యువరాణి రోజు శివలింగాన్ని మల్లెపూల మాలతో పూజించేది. ఈ ఆచారం నేటికి కొనసాగుతున్నది. రోజు దేవునికి పూలను సమర్పించుటకు ఏర్పాట్లు చేశారు. కాకతీయ రాజు రుద్రుడు క్రీ.శ 1290 లో రెండు పూల తోటలను ఈ కార్యక్రమం కొరకు దేవాలయానికి బహుకరించాడు. ఈ ఆలయంలో ఉన్న మరో ఆచారం పవిత్ర పాతాళ గంగలో పుణ్యస్నానం అనంతరం ఆవులను, బంగారాన్ని దానం చేయడం చేస్తుంటారు. ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు కందుకూరి పాలకుడు క్రీ.శ 1262లో బ్రాహ్మణులకు భూమిని బహుకరించాడు [9].

అదేవిధంగా మరొక ఆచారం ప్రకారం మరణించిన పూర్వీకులు లేదా పాలకుల పుణ్యగతుల కొరకు దేవతలకు బంగారం, వెండి జరీ తో చేసిన వస్త్రాలు సమర్పించడం. బంగారు, వెండి కళ్ళను దేవుళ్లకు సమర్పించడం చేస్తుంటారు. విజయనగర రాజు అచ్యుత రాయల పుణ్యఫలం కొరకు మల్లప్ప గౌడ అనే రాజ్యాధికారి క్రీ.శ 1530 లో భ్రమరాంబ దేవి కి బంగారు అంచు గల చీర, బంగారు కళ్ళు సమర్పించాడు[10]. అదేవిధంగా క్రీ.శ 1292లో యాదవ రాజు రామచంద్రుడు మల్లికార్జున స్వామికి 960 వస్త్రాలు సమర్పించాడు[11].

సంతానము కొరకు ప్రార్థిస్తూ భక్తులు శ్రీశైలదేవాలయానికి యాత్రలు చేస్తుంటారు. "విక్రమాభ్యూదయం" అన్న కావ్యంలో హవనమల్లు తన రాణి తో శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించి కొడుకు కొరకు శివున్ని పూజించాడు అని పేర్కొన్నారు[12]. అదేవిధంగా శ్రీ నాథుడు తన పలనాటి వీర చరిత్రలో కూడా ఈ ఆచారాన్ని ధ్రువపరిచాడు. బ్రహ్మనాయుడు తన భార్య ఈతమ్మ తో కలిసి శ్రీశైలం మల్లికార్జుననికి భ్రమరాంబ దేవికి బంగారు, వెండి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించారని తెలుస్తుంది[13].

4. ప్రాంతీయ రాజకీయ చరిత్ర గమనాన్ని తెలిపే శాసనాలు:

శ్రీశైల ఆలయం, త్రిపురాంతకం (మార్కాపూర్) దేవాలయాలలో విరివిగా చాళుక్యుల కాలం నాటివి మరియు స్వల్ప సంఖ్యలో కొన్ని చోళుల కాలం నాటి శాసనాలు లభిస్తాయి. కాకతీయులు, విజయనగరం పాలకుల కు చెందిన అనేక శాసనాలు విరివిగా ఈ ప్రాంతంలో లభించాయి. అయితే ఇవి వాతావరణ మార్పుల కారణంగా స్పష్టత కోల్పోయినా వీటి కాపీలు 1810 ప్రాంతంలో కర్నల్ మెకంజి ఉద్యోగుల ద్వారా తీయించబడి మద్రాసులోని ఓరియంటల్ లైబ్రరీలో భద్రపరచబడి ఉన్నాయి[14]. కల్నల్ మెకంజీ గారి వద్ద శిక్షణ పొందిన భారతీయ నిపుణుడు దరియాప్తి నారాయణరావు 1810వ సంవత్సరంలో నమోదు చేసిన శ్రీశైలం కైఫియత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లంలో పూర్తి వివరణాత్మక సారాంశంతో ప్రచురించబడింది. శ్రీశైలం చరిత్ర అధ్యయనానికి ఈ కైఫియత్ విలువైన ఆధారం [15].

శాసనాలను ధ్వంసం చేయడం ద్వారా చారిత్రక ఆధారాలను ఏ విధంగా దెబ్బతీయవచ్చునో శ్రీశైల దేవాలయ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. 14వ శతాబ్దంలో ఈ దేవాలయ ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించి, ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న వీరశైవశాఖ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పాత శాసనాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు[16].

శ్రీశైల దేవాలయ ప్రాంత ప్రస్తావనలు కదంబుల శాసనాలలో కనిపిస్తుంది. మయూవర్మ కు సంబంధించిన తల గుండు శాసనంలో శ్రీ పర్వతం పేరు ప్రస్తావించాడు. కదంబులు ఈ శ్రీశైల అటవీ ప్రాంతంలో పల్లవులతో చేసిన యుద్ధాలలో బృహత్ భాణ అనే మిత్రుడు సహాయపడినట్లు చెప్పబడింది[17]. ఎల్లోరా గుహ శాసనం ప్రకారం రాష్ట్రకూట రాజు దంతిదుర్గుడు కంచి, కళింగ, కోసల మరియు శ్రీశైల ప్రాంతాలను జయించి జయించిన వ్యక్తిగా కీర్తింపబడింది[18]. హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో లభించిన కాకతీయ రుద్రదేవుని శాసనం క్రీ.శ 1165 అతని రాజ్య సరిహద్దులను వర్ణించింది. దీనిలో శ్రీశైల ప్రాంతం తన రాజ్య దక్షిణ సరిహద్దుగా చెప్పబడింది[19].

శ్రీశైల దేవాలయ అర్చకుల వద్ద గల శాసనాల ప్రకారం ఆలయానికి సంబంధించిన భవనాల నిర్మాణ కాలాలు క్రింది విధంగా ఉన్నాయి. (a). ఆలయానికి ఎదురుగా ఉన్న మంటపాన్ని విరోధికృతు క్రీ.శ. 1371 నాడు అనవేమ రెడ్డి నిర్మించి ప్రతిష్ఠించారు. (బి). అదే అనవేమ రెడ్డి క్రీ.శ.1377లో పెద్ద మంటపాన్ని నిర్మించాడు.

(సి). శ్రీశైలం నుండి పాతాళగంగ మెట్లు క్రీ.శ.1393, హరిహర దేవ మహారాజు లేదా అతని భార్య విఠలాంబ ద్వారా నిర్మించబడ్డాయి.(డి). దక్షిణ మంటపాన్ని విజయనగరానికి చెందిన హరిహర దేవ మహారాజు క్రీ.శ.1404 లో సోమవారం నాడు నిర్మించి అంకితం చేశారు. ఇ. శ్రీ మల్లికార్జున దేవాలయం యొక్క దక్షిణ ద్వారం నుండి శిఖరేశ్వరం వరకు ఉన్న మెట్లను కుమార వేమారెడ్డి కుమారుడు కాటమ రెడ్డి వేమారెడ్డి క్రీ.శ. 1405 నిర్మించి అంకితం చేశారు.ఎఫ్. దక్షిణ ఆలయం నుండి దుర్గాదేవుని వరకు ఉన్న మెట్ల క్రీ.శ.1422 నాడు ఉదయగిరికి చెందిన అప్పనయ్యర్, దేవనయ్యర్ కుమారుడు ద్వారా నిర్మించి అంకితం చేయబడింది[20].

మల్లికార్జున స్వామి ఆలయంలోని నంది మండపం కు ఉన్న కుడి –ఎడమ స్తంభాలపై ఉన్న శాసనాలు అనవేమారెడ్డి వీరశిరో మండపాన్ని నిర్మించినట్లు తెలుపుతుంది. ఇందులో అనవేముని వరకు రెడ్డి రాజుల వంశ చరిత్ర ని మరియు అనవేముని బిరుదులను పేర్కొన్నారు. ఇందులోనే రెడ్లు వెల్లచేరి గోత్రానికి చెందిన వారిని తెలిపారు.మార్కాపూర్ లో గల త్రిపురాంతకేశ్వర ఆలయంలో రామదేవ మందిరం ముందు ఉన్న చిన్న మండపం పై గల రాతి పలకపై కాకతీయ రుద్రదేవుడు-1 రేవూరు గ్రామాన్ని శ్రీశైల దేవాలయానికి కానుకగా ఇచ్చాడని పేర్కొన్నారు. [21].

చాళుక్య త్రైలోక మల్లదేవా శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారం వద్ద ఉన్న ఆది భైరవ దేవాలయ నిర్వహణ కొరకు శివపురం గ్రామాన్ని క్రీ.శ 1058లో బహుకరించాడు[22]. ప్రతాపరుద్రుని కాలంలో సబ్బి నాడు లోని చల్లగరగ మరియు గుడ్ల కోట గ్రామాలను శ్రీశైల దేవాలయానికి ఇవ్వబడ్డాయి. కందూరునాడు లోని చిలుగుంబిడి గ్రామం శ్రీశైల మల్లికార్జున దేవునికి సమర్పించడమైనది [23].

శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్న శాసనం[24] ప్రకారం శివపురం, కురుకుంట, ఇద్రేశ్వరం, నందికుంట, దండ్యాల, వెదురుపాడు, తుమ్మలూరు, తాటిపాడు, గణపతి పురం, ఎడమ మఠము, సిద్ధమ్మవరం, పాలమూరు, బీరప్రోలు, చోల్లపురం, కొర్రప్రోలు, గదేవేమో మొదలైన గ్రామాలను దానంగా గ్రహించినట్లు పేర్కొంటుంది. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో క్రీ.శ 1313 నరవాడిలోని రాచవీడు గ్రామం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కేటాయించబడింది(25). శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం దక్షిణ మండపంలోని ముఖద్వారం పై రెండు స్తంభాలపై హరిహర II క్రీ.శ 1405శాసనాలు ఉన్నాయి. ఇందులో ముఖ మండపానికి ఇచ్చిన విరాళ వివరాల ఉన్నాయి[26].

మార్కాపూర్ లోని త్రిపురాంతక దేవాలయంలో విజయబుక్క శాసనం క్రీ.శ 1423 ఉంది. విజయనగరాన్ని విజయబుక్క పాలిస్తున్నప్పుడు అతని మంత్రి నాగయ్య అమాత్యుడు శ్రీశైలంలోని త్రిపురాంతక దేవాలయాన్ని ఆరాధించి 300 నిక్కుల (పాతకాలం కొలత) విలువైన ధాన్యం పండు భూములను కుమార బిక్షవృత్తి వారికి బహుకరించినట్లు వివరించారు[27]. వీర నరసింహారాయులు శ్రీశైలం మొదలగు దక్షణ భారత దేశ పవిత్ర క్షేత్రాలలో నానా విధ మహా దానాలు చేసినట్లు తెలుస్తున్నది[28].

కృష్ణదేవరాయలు క్రీ.శ 1515 శ్రీశైలం ఆలయం లో రాతి మండపం తూర్పు వైపున వేయించిన శాసనం ప్రకారం ఇక్కడి దేవుడికి వివిధ కానుకలు ఇవ్వడంతో పాటు ఆటుకూరు, పరవమంచల గ్రామాలను సమర్పిస్తూ, కొన్ని సుంకాల మినహాయింపు కూడా ఇచ్చాడు[29]. ఈ శాసనంలో విజయ యాత్రమార్గాన్ని, జయించిన ప్రాంతాలను వివరంగా తెలిపాడు. కృష్ణదేవరాయలు క్రీ.శ 1529లో మరో శాసనం వేయించాడు. ఇందులో సిద్దాపురం సీమలోని గట్టి రాజు పెంట గ్రామాన్ని మల్లికార్జున దేవునికి నైవేద్యంగా సమర్పించాడు[30]. క్రీ.శ 1530 లోని మరొక శాసనం ముఖ మండపంలోని ఉత్తర వాకిలి దగ్గర ఉంది. తన యజమాని కృష్ణదేవరాయల తరపున చంద్రశేఖరయ్య శయనమందిరం ముందు మండపాన్ని నిర్మించానని తెలిపాడు[31].

క్రీ.శ 1530 లోని మరో శాసనం అచ్యుత దేవరాయలు వేయించాడు. ఇది మల్లికార్జున ఆలయ ముఖ మండపంలోని ఒక స్తంభం పై వేయించాడు[32]. చిత్రచేడు(గుత్తి ప్రాంతం)లో మసీదు కాంపౌండ్ దగ్గర లబించిన శాసనం సదాశివరాయలు( క్రీ.శ 1550) ప్రాంతంలో వేయించాడు. ఇందులో మరధిపతి శాంత బిక్షపతి అయ్యవారి కొరకు కానుకలు సమర్పించినట్లు తెలుపబడింది [33]. శ్రీశైల క్షేత్ర తీర్థయాత్ర సందర్భంగా తెలుగు రాయుడు అనే కళింగ గజపతి సామంతుడు మార్కాపురంలో చెరువును తొవ్వించినట్టు. ఇక్కడి శాసనం తెలుపుతుంది [34].

తిరుమల దేవరాయలు (క్రీ. శ 1574) లో మల్లికార్జున స్వామి ఆలయంలో పశ్చిమ నీటి తోటి వద్ద శాసనం వేయించాడు. ఆలయ ప్రాకారం వద్ద ఉన్న భోగవతి చెరువు ఆనకట్ట మరమ్మతులు చేసి, భోగవతి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ కొరకు పూలతోటను ఏర్పరిచాడు[35]. విజయనగర రాజధాని హంపిలోని వీరభద్ర దేవాలయం ముందు నెలకొల్పిన స్తంభంపై సుదీర్ఘమైన శాసనం కృష్ణదేవరాయల దక్షిణ భారతదేశ దేవాలయ దానాలను తెలుపును.

విజయనగర రాజ్యం పతనం అనంతరం శాంతి భద్రతలు లోపించడం,పాలకుల నిర్లక్ష్యంతో శ్రీశైల క్షేత్ర ఉజ్వల చరిత్ర కొంతకాలం మసకబారింది. మరాఠా శివాజీ కాలంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి కొంత ప్రయత్నం జరిగినా, నిజాం నవాబు పరిపాలన కాలంలో అభివృద్ధి దెబ్బతిన్నది. సైన్య సహకార వడంబడిక ద్వారా హైదరాబాదు నిజము ఈ ప్రాంతాలను ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఇచ్చివేయడంతో తిరిగి ఈ ప్రాంతంలో భక్తుల రాకపోకలు పెరిగాయి. కంపెనీ ప్రభుత్వం దేవాలయ నిర్వహణ బాధ్యతలను పుష్పగిరి మఠం (కడప) కు అప్పగించింది. కొంతకాలం తర్వాత ఆలయ బాధ్యతలను కర్నూలు జిల్లా కోర్టుకు వారికి అప్పగించడం జరిగింది. 1929 నుండి ఈ ఆలయ నిర్వహణకు బ్రిటిష్ వారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వాతంత్రం అనంతరం భారత ప్రభుత్వం 1949లో దేవాలయ శాఖ పాలన క్రిందకు తెచ్చింది.

5. ముగింపు:

  1. శ్రీశైలదేవాలయం దక్షిణభారతదేశసమాజంపై సుదీర్ఘకాలంగా విశేష ప్రభావాన్ని చూపుతూ ఈ ప్రాంత సంస్కృతిలో ఒక భాగంగా మారింది. ఈ దేవాలయ విశేషాలను వివరించే శాసనాలు చాలా వరకు కాలక్రమంలో సహజంగా శిథిలమైనాయి.
  2. మరికొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడ్డాయి. మిగిలిన శాసనాలలోని కొన్నిటి సమాచారాన్ని కొంతవరకు విశ్లేషిస్తూ వివిధకాలాలలో ఈ ప్రాంతచరిత్రను ఈ వ్యాసంలో రేఖా మాత్రంగా సృజించటం జరిగింది.
  3. ఈ దానశాసనాల పరిశీలన ద్వారా వివిధ రాజ్యవంశాల పరిపాలనా కాలాలు, ప్రభావిత వర్గాలు, ప్రభావిత భూభాగాలు, ప్రాధాన్యతలను విశ్లేషించుకోవచ్చు.
  4. నల్లమల అటవీప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న వివిధ శైవ దేవాలయాలు, మఠాలు పై మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉంది.

6. పాదసూచికలు & ఉపయుక్తగ్రంథసూచి:

  1. వోయ్సీ, ఆసియాటిక్ రీసెర్సెస్, XV, కలకత్తా, 1925. పేజి.
  2. ఎన్. రమేసన్, టెంపుల్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ ఆంధ్ర, భారతీయ విద్యాభవన్, బొంబాయి, 1988, పేజి.
  3. ఫిషర్, ఎలైన్ ఎం. "వీరశైవిజం యొక్క చిక్కుబడ్డ మూలాలు: శ్రీశైలం యొక్క వీరమాహేశ్వర పాఠ్య సంస్కృతిపై." మతాల చరిత్ర 1 (2019): 1-37.
  4. ఎం. రామారావు, తిరుమల, తిరుపతి మరియు తిరుచానూరు ఆలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 2013, పే.
  5. కుమార్, ఎస్.వి., & సూర్యనారాయణ, ఎం. (1988). శ్రీశైలం యొక్క పవిత్ర భూగోళశాస్త్రం. జర్నల్ ఆఫ్ సోషల్ రీసెర్చ్, 31.
  6. 6 షా, రిచర్డ్. "శ్రీశైలం: సిద్ధుల కేంద్రం." సౌత్ ఏషియన్ స్టడీస్ 1 (1997): 161-178.
  7. దక్షిణ భారత శాసనాలు, X, నం. ఏ. ఆర్ .నెంబర్. 27 ఆఫ్ 1915.
  8. ఎపిగ్రాఫియా ఇండికా., XXI, No.10, పేజీలు. 267-277.
  9. బి.ఎన్. శాస్త్రి, శాసన సంపుటి, (తెలుగు), హైదరాబాదు, 1976, పే.
  10. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, XVI, No.94, పేజీలు.
  11. B .దేశాయ్, సెలెక్ట్ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, నం. 15, హైదరాబాద్, 1962. పేజీలు.46-49.
  12. సోమేశ్వర దేవ, విక్రమాంకాభ్యుద్యం, (Ed) M. మురారిలాల్ నాయక్, బరోడా, 1966, పేజీ.
  13. యశోదాదేవి, ఆంధ్ర దేశ చరిత్ర, AD 1000-1400, JAHRS XXVI, పేజీ.92.
  14. ఎ మాన్యువల్ ఆఫ్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్, ది గవర్నమెంట్ ప్రెస్, మద్రాస్, 1886, పే.
  15. సీతాపతి, పి. (1970). శ్రీశైలం ఆలయం కైఫియత్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, హైదరాబాదు.
  16. సింథియా టాల్బోట్, "దేవాలయాలు, దాతలు మరియు బహుమతులు: పదమూడవ-శతాబ్దపు సౌత్ ఇండియాలో పాట్రనేజ్ యొక్క నమూనాలు", ది జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అసోసియేషన్ ఫర్ ఏషియన్ స్టడీస్, వాల్యూం. 50, యు ఎస్ ఏ, మే, 1991, పేజీలు 314-316.
  17. ఎన్. రమేసన్, కాపర్ ప్లేట్ ఇన్‌స్క్రిప్షన్స్ ఆఫ్ హైదరాబాద్ మ్యూజియం, హైదరాబాద్, 1972, పేజీలు 45-47.
  18. ఎపిగ్రాఫికా ఇండికా., XXIV, పే.
  19. ఆంధ్ర ప్రదేశ్ వరంగల్ జిల్లా శాసనాలు, నం. 36, పే.
  20. ఎ మాన్యువల్ ఆఫ్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్, ది గవర్నమెంట్ ప్రెస్, మద్రాస్, 1886, పేజీలు. 239-242.
  21. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్ .X, కాకతీయ రాజవంశం నం. 241, పేజీ.
  22. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్.IX -I, పేజీలు .102-103.
  23. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. IX-I, పేజీలు .
  24. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. IX-I, పేజీలు .
  25. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. IX-I, పేజీ.
  26. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. XVI, పేజీలు .10-14.
  27. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. XVI, నం. 26. పేజీలు.27-28.
  28. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. 1, పేజీ.
  29. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. నం. 52, ఏ. ఆర్ .నెంబర్ 18, 1915, పేజీలు.62-63.
  30. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. నం.. 86, ఏ. ఆర్ .నెంబర్. 15, 1915, పేజీలు.102-103.
  31. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. నం.. 87, ఏ. ఆర్ .నెంబర్ . 14, 1915, పేజీలు.103-104.
  32. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. నం. . 94, ఏ. ఆర్ .నెంబర్ . 23, 1915, పేజీలు.10-110.
  33. ఎపిగ్రాఫియా ఇండికా, వాల్యూమ్. నం. 175, ఏ. ఆర్ .నెంబర్ . 369, 1920, పేజీలు.181-182.
  34. ఎ మాన్యువల్ ఆఫ్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్, ది గవర్నమెంట్ ప్రెస్, మద్రాస్, 1886, పేజీ.
  35. సౌత్ ఇండియన్ ఇన్‌స్క్రిప్షన్స్, వాల్యూమ్. XVI, No. 280, A. R. నం. 43 ఆఫ్ 1915, పేజీలు.283- 284.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]