headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-2 | February 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. మాలతీచందూర్ ‘కలల వెలుగు’ నవల: స్త్రీవాద దృక్పథం

డా. డి. ప్రవీణ

అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,
ఎస్.వి.ఎల్.ఎన్.ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
భీమునిపట్నం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9290441535, Email: praveenaphdtelugu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

నవలారచయిత్రిగా తెలుగు సాహిత్యలోకంలో తన స్థానాన్ని నిలుపుకున్న మాలతీచందూర్ “కలలవెలుగు” నవలలోని స్త్రీవాదదృక్పథాన్ని ఈ పరిశోధనాపత్రం చర్చిస్తుంది. ఈ నవల వివిధమనస్తత్వాలను ప్రతిబింబిస్తుంది. కుటుంబంలోనూ, జీవితాలలోనూ, ఒడుదడుకులు, మానవసంబంధాలు, స్త్రీవిద్య ఆవశ్యకతను గురించి తన పాత్రలద్వారా మాలతీచందూర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ నవల సినిమారంగంతో అనుబంధం ఉన్నవారి జీవిత విశేషాలు, స్త్రీపురుష సంబంధాలను, వారి మనోభావాలను, స్త్రీవిద్య ఆవశ్యకతను తెలుపుతుంది. సినిమారంగం వైపు మొగ్గు చూపుతున్న యువత ఈ నవల ద్వారా సినిమా రంగంలో ఉండే ఒడిదడుకులు, వారు పడే శ్రమ, వారి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయగలుగుతారు. నిర్మాణాత్మక పరిశోధనా పద్ధతి ద్వారా ఈ పరిశోధనా పత్రాన్ని రాయడం జరిగింది. మాలతీచందూర్ నవలలపై “మాలతీ చందూర్ నవలలు సామాజిక దృక్పథం” అనే సిద్ధాంత గ్రంథంద్వారా ఎం. ప్రభావతి, 2008లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1975 సం.లో పిహెచ్.డి. పట్టా పొందారు.

Keywords: కలలవెలుగు, నవలారచయిత్రి, మాలతీచందూర్, స్త్రీవాదదృక్పథం, స్త్రీ పురుష సంబంధాలు, వివాహవ్యవస్థ, స్త్రీవిద్య.

1. ఉపోద్ఘాతం:

మాలతీ చందూర్ కలల వెలుగు నవల ద్వారా వివిధ వ్యక్తుల మనస్తత్వాలను తెలియజేస్తూ, వివిధ సందర్భాలలో కుటుంబంలోని వ్యక్తులు సమాజంలోని స్నేహితులు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియజేశారు. కుటుంబంలోనూ, జీవితంలోనూ ఒడిదొడుకులు, మానవ సంబంధాలు, స్త్రీ విద్య ఆవశ్యకత, వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి దీనిలో తెలియజేశారు.

మాలతీ చందూర్ నవలల గురించి ఓల్గా మాటలలో చూద్దాం. ”మాలతి మంచి పాటకురాలు. ఆమెకు పఠనం అంటే వ్యసనం. ఆ వ్యసనాన్ని తెలుగు పాటకు అందరికీ అందించాలనే తపన ఆమెలో ఉంది. తాగాడి తాగాడి ఈ సాహిత్యామృతాన్ని, ఈ సాహిత్య అమృతం అనేక జీవితానుభవాలను పిండి పిప్పి చేసి వడగట్టింది. ఒకసారి ఆ రుచికి బానిసలు అయితే ఆ రుచిని జీవితాంతం రుచి చూడాలనుకుంటారు”.1 అని అన్నారు.

సి. నారాయణ రెడ్డి “ఋతువులను బట్టి గతులు మారే నదిలా కాక, నిరంతరం ప్రవహించే జీవనది లాంటి రచయిత్రి మాలతీ చందూర్“ 2

2. ఇతివృత్తం:

రామచంద్రం సినిమా రంగంలో పేరుపొందిన కెమెరామెన్. తన స్నేహితుడు మహేశ్వరరావు ప్రోత్సాహంతో వివాహం జరిగితే తన ఆలనా పాలన చూసుకునే తోడు వస్తుందని రమణమ్మను వివాహం చేసుకుంటాడు. కానీ రమణమ్మకు డబ్బు పిచ్చి వలన భర్తకు, పిల్లలకు, ఇంటికి వచ్చిన బంధువులకు ఎవరికైనా సరే పచ్చడి అన్నమే పెడుతుంది. భర్తను డబ్బు సంపాదించే యంత్రంలా చూస్తుంది. “ఆడదాని ఆంతర్యం” అనే సినిమా శత దినోత్సవానికి 30 ఏళ్ల యశోదా దేవి అధ్యక్షత వహిస్తుంది. ఈమె పి.హెచ్.డి. చేసి వైస్-ప్రిన్సిపల్ గా ఉంటుంది. ఆమె రామచంద్రంను పొగుడుతుంటే తను పొంగిపోయి ఆమెతో ప్రేమలో పడతాడు. తర్వాత అప్పుడప్పుడు యశోద దగ్గరికి వెళుతుంటాడు. యశోదతో తనను వివాహం చేసుకుంటాను అని చెప్పి తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్తాడు. కాని దానికి యశోద అంగీకరించదు.

తర్వాత సినిమా రంగంలోకి కొత్తగా వచ్చిన పద్మలతతో సంబంధం ఏర్పడుతుంది. వారి మధ్య సంబంధాన్ని రమణమ్మ ప్రశ్నిస్తుంది. గొడవ పడిన రమణమ్మతో రామచంద్రం తను ఇష్టం వచ్చినట్లుగా ఉంటా, అని అనడంతో రమణమ్మ పుట్టింటికి వెళ్ళిపోతుంది. రామచంద్రం ప్రతినెల రమణమ్మకు డబ్బులు పంపిస్తూ ఉంటాడు. పద్మలత సినిమాలు వదిలేసి తాళి లేని భార్యలా రామచంద్రానికి సపర్యలు చేస్తుంది. తాగి కొట్టినా తనను ప్రేమతోనే కొడుతున్నాడు అనుకుంటుంది పద్మలత. పద్మలత తల్లి చనిపోయిన తర్వాత పద్మలత తల్లి ఇంటిని, పశువులని అమ్మిన డబ్బుతో రామచంద్రం తాము ఉంటున్న ఇల్లు కొంటాడు. రామచంద్రం అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు పద్మలత తెలియజేయగా రమణమ్మ హాస్పిటల్ కి వచ్చి అక్కడనుండి పద్మలతను వెళ్ళగొడుతుంది. ఇంక చివరి వరకు పద్మలతను రామచంద్రం దగ్గరకు రానివ్వదు. రామచంద్రం మరణంతో ఇల్లు స్వాధీనం చేసుకుంటుంది. కానీ చివరకు రామచంద్రం రాసిన వీలునామాతో ఆ ఇల్లు పద్మలకు చేరుతుంది. కానీ పద్మలత కలల వెలుగు రామచంద్రం. చివరి నిమిషంలో కూడా ఒకరినొకరు చూసుకునే అవకాశం రమణమ్మ ఇవ్వక వారి కల చెదిరిపోతుంది.

3. స్త్రీవాద దృక్పథం- స్త్రీ పురుష సంబంధాలు :

కలల వెలుగు నవలలో ప్రధాన పాత్ర అయినా రామచంద్రం తన స్నేహితులతో కలిసి కొన్ని రోజులు నాటకాలు వేశాడు. తరువాత ఒక డబ్బా కెమెరాను పది రూపాయలకు కొని ఫోటోగ్రఫీ మీద తన ఆసక్తి వలన మద్రాసు వెళ్లి సినిమా రంగంలో చేరి చిన్న చిన్న వేషాలు వేస్తూ పనులు చేసుకుంటూ చివరకు కెమెరామాన్ గా స్థిరపడతాడు. తరువాత ఫిఫ్త్ ఫార్మ్ వరకు చదివిన రమణమ్మను వివాహం చేసుకుంటాడు. తనకు రుచిగా వండి పెట్టి కడుపు నింపే భార్య కావాలనుకుంటాడు కానీ దానికి రమణమ్మ విరుద్ధంగా ఉంటుంది.

ఏ భార్య అయినా భర్త తాగుడు, సిగరెట్టు అలవాటు ఉండకూడదు అనుకుంటుంది. కానీ రమణమ్మ దానికి విరుద్ధంగా ఇంట్లో సిగరెట్లు, మందు స్నేహితులతో తాగితే మంచిది అనుకుంటుంది. దీనికి కారణం మిగిలిపోయిన సిగరెట్లు, మందు సీసాలు పాన్ షాప్ వాడికి అమ్మి డబ్బులు చేసుకోవచ్చు అని తన ఆలోచన. తన భర్త నెల నెల డబ్బు తన చేతికి ఇవ్వకపోతే ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి మరి తీసుకుంటుంది. ఇక్కడ రమణమ్మ కేవలం డబ్బుకు మాత్రమే విలువనిచ్చింది. డబ్బు ఉంటే స్త్రీ సుఖంగా, సంతోషంగా తన పిల్లలతో ఉండవచ్చు అనుకున్నది.

రమణమ్మ మీద విరక్తితో ఉన్న రామచంద్రానికి చాలామంది సినిమా రంగంలో స్త్రీలతో తాత్కాలిక సంబంధం ఉంటుంది. కానీ రమణమ్మ ధ్యాస సంపాదన మీద ఉంటుంది. ఆ సమయంలోనే యశోదతో రామచంద్రానికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా చిగురుస్తుంది.

యశోద ఒకసారి మద్రాసు వచ్చినప్పుడు రామచంద్రాన్ని ఇంటికి తీసుకు వెళ్ళమని బలవంతం చేస్తుంది. రామచంద్రం ఇంటికి వెళ్ళిన యశోదకు రామచంద్రం మీద జాలి వేస్తుంది. రామచంద్రానికి ఇద్దరు ఆడపిల్లలు మళ్లీ గర్భం ధరిస్తుంది రమణమ్మ.

తరువాత యశోదను కలవడానికి వెళ్ళిన రామచంద్రానికి యశోద తనను తాను అర్పించుకుంటుంది. మరసిటి రోజు యశోదను వివాహం చేసుకొనుటకు బ్రతిమాలు కుంటాడు రామచంద్రం, కానీ యశోద దానికి అంగీకరించదు. అందుకు రామచంద్రం కోపంతో వెళ్లిపోతాడు.
యశోద ఒక ప్రిన్సిపల్ గా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఆమెకు పరువు ముఖ్యంగా ఉంటుంది. తన తండ్రి తమ్ముడు ఏమనుకుంటారో అన్న భయం. ఎంత చదువుకొని ఉన్నత స్థానంలో ఉన్న సమాజానికి భయపడే స్త్రీ యశోదలో ప్రతిబింబిస్తుంది. రామచంద్రానికి రెండో భార్యగా ఉన్నా యశోద మీద లోకం నింద వేస్తుంది. అలాగే రామచంద్రం భార్యని వదిలి యశోదను వివాహమాడిన లోకం యశోదనే తప్పుపడుతుంది. అనేక రకాలైనటువంటి భయాలతో యశోద రామచంద్రానికి దూరమైనట్లు మనం గమనించవచ్చు.

తరువాత సినిమా రంగానికి వచ్చిన పద్మలతతో సంబంధం పెట్టుకుంటాడు రామచంద్రం. కానీ రామచంద్రం అందరి స్త్రీల లాగానే పద్మలతను చూస్తాడు. కానీ పద్మలత మాత్రం రామచంద్రాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. రమణమ్మ పద్మలత విషయం తెలిసి గొడవ పడి హైదరాబాదుకు వెళ్ళిపోతుంది. హైదరాబాదులో రమణమ్మ కొన్న ఇంటిదగ్గరకి వెళ్ళిపోతుంది.
ఇక్కడ కూడా రమణమ్మ తన భర్త ఇంకొకరు సొంతమైపోతే డబ్బు పోతుందనే గాని, భర్త మీద ప్రేమ కాదు. రమణమ్మ లాంటి స్త్రీ భార్యగా దొరికిన ఏ భర్త అయినా తప్పుడు దారులు పడతాడు అనడంలో ఆశ్చర్యం లేదు. రమణమ్మ వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రం వారు అద్దెకు ఉండే ఇంటికి పద్మలతను తీసుకుని వచ్చేస్తాడు. పద్మలత తల్లికి, రామచంద్రంతో పద్మలత తాళి లేకుండా ఉంటూ భవిష్యత్తు పాడు చేసుకోవడం ఇష్టం లేదు. వారి మధ్య వాదన జరుగుతుంది. ఇక్కడ పద్మలత తాళి కట్టించుకుని భార్య స్థానం పొందాలి, లేదా మంచి సినిమా అవకాశాలు పొందాలి అంతేగాని ఎటు కాకుండా ఇలా రామచంద్రం కింద ఉండిపోకూడదు అనుకుంటుంది. ఒక తల్లిగా కూతురి యొక్క భవిష్యత్తు మీద ఆరాటం మనకు కనిపిస్తుంది. ఈ మాటలు విన్న రామచంద్రం గుడిలో పద్మలత మెడలో తాళి కట్టడానికి సిద్ధమవుతాడు. కానీ పద్మలత తాళి కట్టడానికి ఒప్పుకున్న అతని హృదయానికి పొంగిపోతుంది. అతను తాళి కట్టకపోయినా బాధ పడదు. పద్మలతది నిస్వార్ధమైన ప్రేమ తాళికట్టకపోయినా ఆ ప్రేమ దక్కితే చాలు అని చెబుతుంది.

ఉన్నత కుటుంబంలో పుట్టిన రమణమ్మకు, తండ్రి తెలియని పద్మలతకు చాలా తేడా ఉంది. పెద్ద కుటుంబంలో పుట్టిన రమణమ్మ ఏనాడు భర్తకు గాని, పిల్లలకు గాని,అతిధులకు గాని బాగా వండి పెట్టింది లేదు. కానీ పద్మలత బాగా వండి రామచంద్రానికి కొసరి కొసరి వడ్డిస్తూ, పనివాళ్లకు కూడా మంచి భోజనం పెడుతుంది. రామచంద్రం డబ్బులిచ్చినా తీసుకోని నిస్వార్థపరురాలు పద్మలత. చివరకు పద్మలత తన తల్లి చనిపోతే తన తల్లి ఇల్లు నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో కొన్న ఇల్లు కూడా రమణమ్మ స్వాధీనం చేసుకున్న ఎదిరించలేని అమాయకురాలు పద్మలత.

4. వివాహవ్యవస్థ:

కలల వెలుగు నవలలో మాలతీ చందూర్ వివాహ, వివాహేతర సంబంధాలను వివరించారు. మనదేశంలో వివాహ వ్యవస్థకు విశిష్టమైన స్థానం ఉంది. స్త్రీ పురుషుల బంధాన్ని పెళ్లి అనే రెండక్షరాలతో ముడివేసి పటిష్టం చేస్తారు. పూర్వం ఉమ్మడి కుటుంబ జీవన విధానమే ఉండేది. భార్యాభర్తల మధ్య సమస్యలను వెంటనే పెద్దవారు తీర్చేవారు. కానీ రాను రాను సమిష్టి కుటుంబాలు పోయి వ్యష్టి కుటుంబాలు మిగిలాయి.

సమాజంలో వివాహ సంబంధానికి ఉన్న విలువ వివాహేతర సంబంధానికి లేదు. దానికి నిదర్శనం పద్మలత. రామచంద్రంతో ఆరు సంవత్సరాలు కలసి జీవించినా, రామచంద్రం మంచి చెడులు భార్య కంటే ఎక్కువ ప్రేమగా చూసినా, రామచంద్రం చివరి దశలో పద్మలత హాస్పిటల్లో చేర్పించినా, రమణమ్మ హాస్పిటల్ కి వచ్చిన తరువాత పద్మలతను రామచంద్రం దగ్గరకు రానివ్వలేదు. సినిమా వాళ్లకు హాస్పిటల్ డాక్టర్లకు పద్మలతతోనే రామచంద్రం కలిసి జీవిస్తున్నాడు అని తెలిసినా, రామచంద్రం కళ్ళు పద్మల కోసం వెతుకుతున్నాయి అని తెలిసినా భార్య రమణమ్మని ఎదిరించి పద్మలతను రామచంద్రం దగ్గరకు ఎవరూ తీసుకు వెళ్ళలేదు. కారణం పద్మలతతో రామచంద్రానిది వివాహ సంబంధం కాదు.

చివరకు పద్మలత తల్లి డబ్బుతో కొన్న ఇల్లు రామచంద్రం వీలునామ రాసి లాయర్ చేతికి ఇవ్వడం వలన, ఆ ఇల్లు పద్మలతకు దక్కుతుంది. లేకపోతే ఆ ఇంటిని కూడా రమణమ్మ స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. బాగా చదువుకున్న యశోద కూడా, రమణమ్మ ఏనాడు రామచంద్రాన్ని పట్టించుకోలేదు అన్న విషయం తెలిసిన యశోద కూడా “రామచంద్రం ఇల్లు, ఆస్తి, సర్వస్వం రమణమ్మకు రావాలి. ఆ పరాయి దానికి పూచిక పుల్ల కూడా పోకూడదు. అది అరిచి చచ్చినా ఆ ఇంటి ఛాయలకు రానివ్వకూడదు” (కలల వెలుగు, పుట.164) అనుకుంటుంది. ఎంత ప్రేమగా ఉన్నా వివాహేతర సంబంధం వలన సమాజంలో విలువగాని హక్కు గాని ఉండదు. అన్న విషయం దీని ద్వారా తెలుస్తుంది.

చిన్న చిన్న పాత్రలు వేస్తూ సినిమా రంగంలో ఉండే సుజాత పద్మలతకు అండగా ఉండడం వలన పద్మలత బ్రతకగలిగింది. వీటి ద్వారా వివాహ సంబంధం యొక్క బలాన్ని వివాహేతర సంబంధం యొక్క బలహీనతను చూపించారు మాలతి చందూర్.

నేటి యువత సినిమాల్లో నటించాలన్న ఆలోచనతో ఏ విధంగా చిక్కుకుపోతున్నారు అనేది పద్మలత మరియు సుజాత పాత్రల ద్వారా చూపించారు మాలతీ చందూర్. పద్మలత, సుజాత వంటి వాళ్లకు ఎంతో మందికి ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ కృతజ్ఞతా భావంతో సుజాత పద్మలతకు న్యాయం జరగాలని సినిమా వాళ్ళను కోరుకుంటుంది. అలాగే యశోద సామాజిక గౌరవాన్ని కోరుకుంటుంది. తను మనసారా ప్రేమించిన రామచంద్రాన్ని వదులుకుంటుంది. రామచంద్రానికి యశోద అంటే ప్రేమ, గౌరవం. కానీ యశోదని వివాహం చేసుకుంటాను అని చెప్పిన యశోద సమాజానికి భయపడుతుంది. తమ బంధాన్ని సమాజం గౌరవించదు అని భావిస్తుంది.

5. కలల వెలుగు - స్త్రీ విద్య:

దీనిలో మాలతీ చందూర్ విద్య యొక్క ఆవశ్యకతను చెప్పకనే చెప్పారు. యశోదను ప్రేమించిన రామచంద్రం ఆమె పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉండటానికి కారణం ఆమె చదువు. “పి.హెచ్.డి. చేసిన ఒక విద్యావంతురాలు, వైస్ ప్రిన్సిపల్ చేస్తున్న ఒక యువతి నన్ను కరుణించింది” 3 అనడంలో రామచంద్రానికి చదువు మీద ఉండే గౌరవం కనిపిస్తుంది. యశోద డాక్టరేట్, ప్రిన్సిపాల్. ఆమె చదువుకి చాలా గౌరవిస్తాడు. పద్మలతకు చదువు లేదు. సినిమాల్లో డాన్సులు వస్తుంది. పద్మలత వృత్తిరీత్యా ఆమెను గౌరవించడు.

యశోదకు తల్లి లేదు . తండ్రి తమ్ముడు ఉన్నారు. వాళ్లు యశోద దగ్గరే ఉండేవారు. తమ్ముడు హైస్కూల్లో చదువుతున్నాడు. తండ్రి తహసీల్దారుగా చేసి రిటైర్ అయ్యాడు.”4 అని చెప్తున్నప్పుడు స్త్రీ - విద్య వలన తన కాళ్ళ మీద తన్ను నిలబడడమే కాక కుటుంబాన్ని ఆదుకోగలదు, సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలదు అని తెలుస్తుంది. రామచంద్రానికి తన భార్య పిసినారితనం వలన తన భార్యపై అసహ్యం ఉంటుంది. కానీ పద్మలత భార్య కంటే ఎక్కువ సఫర్యలు చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ విద్యావంతురాలు కాదు కనుక ఆమె కు అసలు గౌరవం ఇవ్వడు. జాలి మాత్రమే ఉంటుంది. ఎవరి మీద కోపం వచ్చినా “దున్నపోతు ఎలుగుబంటి అని ఎన్నిసార్లు తను తిట్టేవాడు ఎన్నిసార్లు కొట్టేవాడు” 5 అనే మాటల ద్వారా పద్మలత విద్య లేని అమాయకురాలు కనుక అలా చేసేవాడు అని అర్థమవుతుంది. యశోద తనను కాదనినా తన మీద గౌరవం ఏ మాత్రం తగ్గకపోవడానికి విద్య నే కారణం.

6. ముగింపు:

  1. కలల వెలుగు నవలలో రచయిత్రి విభిన్న పాత్రల ద్వారా స్త్రీ వాద  దృక్పథాన్ని వెలువరించారు.
  2. మాలతీ చందూర్ కళలు వెలుగు నవలలో సినిమా రంగంలోని ఉండే ఒడుదొడుకులు కనిపిస్తాయి. సినిమా రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూసి వారు ఏ కష్టం లేకుండా బోలెడంత డబ్బు సంపాదిస్తున్నారు అనుకుంటాం. కానీ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి ఎంత శ్రమ పడాలో రామచంద్రం పాత్ర ద్వారా, సుజాత, పద్మలత ల పాత్రల ద్వారా మనకు తెలుస్తుంది.
  3. నేటి యువత సినిమా రంగం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ దానిలో తమ స్థానాన్ని నిలుపుకోవాలి అంటే ఎంత కష్టపడాలో ఈ ఈ నవల ద్వారా తెలుస్తుంది.
  4. పది రూపాయల పాత కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ, తన అభిరుచిని పెంపొందించుకొనుటకు సినిమారంగంలో కెమెరామెన్ గా, నటుడిగా, రచయితగా రామచంద్రం ప్రవేశించినా చివరకు కెమెరామాన్ గానే ఏవిధంగా స్థిరపడ్డాడో, దానికి ఎంత కష్టపడ్డాడో రామచంద్రం పాత్ర ద్వారా తెలుస్తుంది.
  5. అలాగే సినిమా రంగంలో ఏ విధంగా చెడు అలవాటులకు లోనవుతారో అన్న విషయం కూడా రామచంద్రం పాత్ర ద్వారానే తెలుస్తుంది.
  6. భర్తను పిల్లలని కుటుంబాన్ని సక్రమంగా చూసుకోకుండా డబ్బు వ్యామోహం లో పడిన స్త్రీ యొక్క జీవితం చివరకు ఏ విధంగా అవుతుందో రమణమ్మ పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. చివరకు డబ్బు ఉంటుంది గానీ భర్తను కోల్పోతుంది రమణమ్మ.
  7. సినిమా రంగంలో ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుందో సుజాత, పద్మలత పాత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 
  8. విద్య వలన జ్ఞానం సమాజంలో గౌరవం తో పాటు తమ కాళ్ళ మీద తాము ఎలా నిలబడాలో యశోద పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది.

7. పాదసూచికలు:

  1. ఈ దాహం తీరనిది, ఈనాడు ఆదివారం ప్రత్యేక సంచిక. పుట. 6
  2. గురజాడ పురస్కార స్వీకరణ సందర్భంగా మాలతీపై అభినందన సుమాలు, జగతి మాసపత్రిక, నాగేశ్వరరావు చందూరి, పుట 19- 20
  3. కలల వెలుగు పుట 48.
  4. కలల వెలుగు పుట 48
  5. కలల వెలుగు పుట 13

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్రసాహిత్యం,12వ సంపుటం. ప్రజాశక్తి, విజయవాడ 1991.
  2. నాగయ్య, జి. తెలుగు సాహిత్యసమీక్ష. రెండవసంపుటి, నవ్యపరిశోధకప్రచురణలు, తిరుపతి,1995 
  3. ప్రభావతి, ఎం. మాలతీ చందూర్ నవలలు సామాజికదృక్పథం. (సి.గ్రం.), మద్రాసు విశ్వవిద్యాలయం , 2008
  4. రమాపతి రావు, అక్కిరాజు. తెలుగు నవల, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. హైదరాబాద్, 1975 
  5. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్యచరిత్ర, దళిత సాహిత్యపీఠం, విశాఖపట్నం, 2012.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]