AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. ఉత్తరాంధ్ర టీవీ జర్నలిస్టులు: స్థితిగతులు
వేదుల వి.ఎస్.వి. నరసింహం
పరిశోధకులు, జర్నలిజం విభాగం, ఆంధ్రవిశ్వకళాపరిషత్,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9493888373, Email: narasimhamjmc@gmail.com
ఆచార్య డి.వి.ఆర్. మూర్తి
ఆచార్యులు, జర్నలిజం విభాగం, ఆంధ్రవిశ్వకళాపరిషత్,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9985051793, Email: dwa100@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
భారతీయజర్నలిజంలో ఆంధ్రప్రాంతానికి సంబంధించిన మీడియాకు, టీవీ జర్నలిజానికి ప్రముఖ స్థానం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలలో టీవీ జర్నలిస్టుల స్థితిగతులను సర్వే పద్ధతిలో సేకరించిన సమాచారం ద్వారా సమీక్షించి మదించడం, కుటుంబజీవనం- వృత్తిగతమైన సాధకబాధకాలను బేరీజు వెయ్యడం, విద్య, వేతనవ్యత్యాసాలు, హోదా, గుర్తింపు మొదలైన ఉత్తరాంధ్ర టీవీ జర్నలిస్టుల వృత్తి- ఎదుగుదల-సంస్థాగతమైన ప్రోత్సాహ-ప్రతిబంధకాలను వివరణాత్మకంగా చర్చించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం
Keywords: ఉత్తరాంధ్ర, టీవీ జర్నలిస్టులు, విద్య, ఆదాయవనరులు, వేతనాలు, వృత్తిగతసంతృప్తి.
1. ఉపోద్ఘాతం :
ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించడంతోపాటు వారికి అవసరమైన వార్తా విశేషాలను ప్రసారం చేయడంలో టెలివిజన్ జర్నలిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు ఒక ప్రముఖమైన సాంస్కృతిక రాజకీయ సామాజిక అంశాలను మిళితం చేస్తూ ఉత్తరాంధ్రలోని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తున్నారు నిరంతరం పౌరులకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో వీరు నిమగ్నమై ఉంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తెలియజేయడం జర్నలిస్టులు ప్రత్యేకమైన సవాళ్లను అవకాశాలను ఎదుర్కొంటున్నారు వీరు రాజకీయాలు సామాజిక సమస్యలు సంస్కృతి హార్దిక పరమైన అంశాలను మిళితం చేస్తూ తమ వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నారు శక్తివంతమైన రాజకీయ వాణిజ్య రంగాలకు ప్రాముఖ్యతను కల్పించిన ఉత్తరాంధ్రలో పాత్రికేయులు నిస్పాక్షికమైన విధానంలో వార్తా కథనాలను ప్రసారం చేయడానికి నిబద్దతతో పనిచేస్తున్నారు. వీరికి ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ వీరు సత్యాన్ని వెలికి తీయడానికి స్వరంలేని ప్రజలకు స్వరంగా మారడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు పారదర్శకతకు ప్రాధాన్యత కలిగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ముందుకు నడిపించే దిశగా కీలకపాత్రను పోషిస్తున్నారు పౌరులు చురుకుగా తమ జీవనంలో పాల్గొనడానికి వారిని మరింత శక్తివంతం చేయడానికి స్థానిక పరిపాలన తోపాటు అట్టటకు వర్గాలకు ఉపయుక్తంగా నిలిచే విభిన్న వైవిధ్యమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు.
కొత్తగా గత అర్ధశతాబ్దకాలంగా సాంకేతికంగా జరిగిన పురోగతి టెలివిజన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చాయి జర్నలిస్టులు డిజిటల్ మాధ్యమాలను సామాజిక మాధ్యమాలను సాధనంగా మార్చుకొని విస్తృతంగా ప్రేక్షకులకు మధ్యకు వెళ్లడం సాధ్యపడింది ఒక విధంగా ఎక్కువ మందికి చేరువ కావడానికి ఈ విధానాలు ఎంతగానో ఉపయోగంగా నిలుస్తున్నాయి ఈ ప్రాంతం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రజాస్వామ్య పురోగతికి టెలివిజన్ మాధ్యమం జర్నలిస్టులు ఎంతగానో సహకరిస్తున్నారు.
1960లో భారతదేశంలో టెలివిజన్ ప్రధాన ఆగమనం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వీటి ప్రభావం ప్రారంభమైందని మనం చెప్పవచ్చు స్థానిక ప్రజలకు వార్తలు ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనను తెలియజేయడానికి టెలివిజన్ జర్నలిస్టులు కీలకంగా మారుతున్నారు సత్యం పారదర్శకత అనే సూత్రాలకు లోబడి వీరు అంకితభావంతో తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
2. చారిత్రక నేపథ్యం:
తెలుగువారి అత్యంత ప్రజాదరణ పొందిన తొలి దినపత్రిక ఆంధ్ర పత్రిక. ఇది 1908 సంవత్సరంలో కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు ముంబై నుంచి ప్రారంభించారు ఈ పత్రిక నేటికీ ప్రచురితమవుతోంది వ్యాపారవేత్తగా ఉన్న నాగేశ్వరరావు పంతులు ప్రయాణం దేశభక్తి కారణంగా అతనిని జర్నలిజం వైపు నడిపించింది.
తరువాత కాలంలో 1938లో ప్రారంభమైన ఆంధ్రప్రభ 1960లో ప్రారంభమైన ఆంధ్రజ్యోతి 1950లో ప్రారంభమైన నాలుగు దినపత్రికలు ఆంధ్ర జనతా, ఆంధ్రభూమి, రాజమండ్రి సమాచారం, విశాలాంధ్ర జర్నలిజంలో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చాయి 1974 ఆగస్టు 10 న వేదికగా చేసుకొని విశాఖపట్నం నుంచి వెలువడిన ఈనాడు దినపత్రిక తెలుగు మాధ్యమంలో జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయని చెప్పవచ్చు.
3. వార్తాపత్రికల నుంచి సోషల్ మీడియా వరకు:
భారతీయ సమాచార రంగం ఒకనాటి ముద్రణ పత్రికల నుంచి నేటితరం సెల్ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందవేసే సామాజిక మాధ్యమాల దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రక్రియలో పాతతరం పత్రికలకు నవతరం సామాజిక మాధ్యమాలకు మధ్యలో తన ఉనికిని నిలుపుకుంటూ చాటుకుంటూ సగర్వంగా తన ప్రస్థానాన్ని సాగిస్తోంది టెలివిజన్ జర్నలిజం ఎన్ని పత్రికలు వచ్చినా ఎన్ని సామాజిక మాధ్యమాలు ఆవిర్భవిస్తున్న తన ఉనికిని చాటుకుంటూ తన గమనాన్ని నిర్దేశించుకుంటూ సగర్వంగా ముందుకు సాగుతోంది దీని వెనుక పాత్రికేయుల అకుంఠిత శ్రమ దాగి ఉంది వీక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తోపాటు ప్రత్యేకమైన ఆసక్తిదాయకమైన కథనాలను అందించడానికి నిరంతరం వీరు పడే శ్రమ చేసే కృషి అనిర్వచనీయం తమ వృత్తిని నిత్యం కొత్తదనాన్ని జోడిస్తూ వీరు పని చేస్తేనే మనుగడ సాధ్యపడుతుంది చుట్టూ ఉన్న టెలివిజన్ చానళ్ల నుంచి వస్తున్న పోటీ ఒకవైపు సామాజిక మాధ్యమాల నుంచి ఎదురవుతున్న పోటీ మరొకవైపు వీటన్నిటిని తట్టుకుంటూ తన ఛానల్ ని తన ఉనికిని నిలుపుకుంటూ సాగుతున్న పాత్రికేయుని ప్రస్థానం ఒక ప్రత్యేక పాఠం. విపత్తులు సంభవించినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ వార్తలను తెలుసుకోవడానికి మనం ఎంతో ఆసక్తి చూపిస్తాం అటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం విపత్తులు జరిగిన ప్రదేశానికి ధైర్యంగా వెళ్లి అక్కడ వార్తలను విశేషాలను ప్రభుత్వానికి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే తెలియజేర్నలిస్టుల ధైర్యం, తెగువ, చొరవ అభినందనీయం. అటువంటి పాత్రికేయులు వృత్తిపరంగా ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ వారి ఆలోచనలను ఆవిష్కరించే ఒక ప్రయత్నం చేశాం. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో నివసిస్తున్న పనిచేస్తున్న 200 మంది జర్నలిస్టులపై ఒక సర్వేను నిర్వహించి వారి ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేశాము.
4. ఉత్తరాంధ్ర టీవీ జర్నలిస్టులు- స్థితిగతులు – సర్వే నివేదిక:
ఈ సర్వేలో భాగంగా వారిచ్చిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న 200 మంది టెలివిజన్ జర్నలిస్టుల నుంచి సమాచారాన్ని సేకరించడం జరిగింది. వీరిలో 165 మంది పురుషులు కాగా 35 మంది మహిళలు ఉన్నారు. వీరు ఈ వృత్తిలోకి వచ్చే సమయంలో 65% మందికి సంస్థలు అవసరమైన ప్రాథమిక శిక్షణ అందించగా 34% మంది ఎటువంటి శిక్షణ లేకుండానే నేరుగా ఈ వృత్తిలోకి వచ్చినట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న టెలివిజన్ జర్నలిస్టుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే 82% మంది నిర్ణీత సమయం కన్నా అధికంగా పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. కేవలం 18 % మంది మాత్రమే అధిక సమయం పనిచేయడం లేదని వెల్లడించారు. అధిక సమయానికి గాను కేవలం 25% మంది మాత్రమే దానికి అనుగుణమైన అదనపు వేతనాన్ని పొందుతుండగా 75% మందికి ఎటువంటి అదనపు వేతనం లభించడం లేదు.
ఉత్తరాంధ్రలో టెలివిజన్ రంగంలో పనిచేస్తున్న 200 మందిని అధ్యయనం చేయగా వీరు 36% మందికి ప్రభుత్వాన్నించే అక్రిడేషన్ కలిగి ఉన్నామని, 15% మంది జర్నలిస్ట్ సంఘాలలో సభ్యత్వం కలిగి ఉన్నామని, 16.5 % మంది హెల్త్ ఇన్సూరెన్స్ ను తమ కలిగి ఉన్నామని 31 % మంది ఎటువంటి సదుపాయాలు తాము కలిగి లేమని తెలియజేశారు.
తాము చేసే పనికి తగిన గుర్తింపు వస్తుందని 72.5% మంది చెప్పగా 17% మంది తాము ఎటువంటి సమాధానం చెప్పలేమనగా 10.5% మంది తగిన గుర్తింపురావడంలేదని తెలియజేశారు.
ఉత్తరాంధ్ర టెలివిజన్ జర్నలిస్టులో ఒక ప్రధాన సమస్యగా వృత్తిపరమైన భద్రత కనిపిస్తోంది. అత్యధిక శాతం మంది ఈ రంగంలో వృత్తిపరమైన భద్రత లోపించిందని వెల్లడించారు తరువాత స్థానంలో తాము సోషల్ లైఫ్ దూరమవుతున్నామని మూడవ సమస్యగా తమకు తగినంత వేతనాలు రావడం లేదని తెలియజేశారు అదే విధంగా ఆ తర్వాతి స్థానాల్లో తగిన పదోన్నతులు లేకపోవడం పని వేళలకు మించి పని చేయడం వంటివి ఉన్నాయని వారు తెలియజేశారు.
ఉత్తరాంధ్రలో టెలివిజన్ జర్నలిస్టులుగా పనిచేసిన వారిలో 56% మంది గతంలో ఒక సంస్థలో పనిచేస్తూ ప్రస్తుతం మరొక సంస్థకు మారామని కేవలం 44% మంది మాత్రం తాము ఒకే సంస్థలో కొనసాగుతున్నామని తెలియజేశారు. తమ గతంలో పనిచేసిన సంస్థ నుంచి మరొక సంస్థకు మారడానికి ప్రధానమైన కారణంగా పదోన్నతిని ఆశించామని వీరు పేర్కొన్నారు తరువాత స్థానంలో మెరుగైన వేతనం ఉద్యోగ భద్రత ఉన్నాయని సర్వేలో పేర్కొన్నారు.
అత్యధికంగా 64.5% మంది ప్రస్తుతం తాము చేస్తున్న వృత్తినే కొనసాగించాలని భావిస్తున్నారు. కేవలం 35.5% మంది మాత్రం తమ ఈ వృత్తి నుంచి మరొక వృత్తులకు మారాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పాత్రికేయవృత్తిలో ఉన్న వారిలో కేవలం 14% మంది మాత్రమే తమ పిల్లలను ఈ వృత్తిలో కొనసాగే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పగా, 35% మంది తాము పిల్లల భవిష్యత్తు నిర్ణయించలేమని చెప్పగా, 51% మంది తమ పిల్లలను ఈ వృత్తిలోకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమని స్పష్టం చేశారు.
5. ముగింపు:
- సర్వే ప్రకారం ఉత్తరాంధ్ర టెలివిజన్ జర్నలిస్టుల్లో పురుషుల ఆధిక్యం ఉండగా, తక్కువ సంఖ్యలో మహిళలున్నారు. స్పందించిన వారిలో అధికశాతం అవసరమైన ప్రాథమిక శిక్షణను సంస్థల ద్వారా పొందినవారే. తక్కువమంది శిక్షణ లేకుండానే ఈ వృత్తిలో చేరారు.
- స్పందించినవారిలో ఎక్కువశాతం నిర్ణీత సమయం కన్నా అధికంగా పనిచేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. తక్కువమందిమాత్రమే అధిక సమయం పనిచేయడం లేదని వెల్లడించారు.
- అధికసమయానికి గాను కేవలం స్పందించిన వారిలో నాలుగోవంతు మాత్రమే అదనపు వేతనాన్ని పొందుతుండగా మూడొంతులు వారికి ఎలాంటి అదనపు వేతనం లేదు. ప్రభుత్వం అక్రిడేషన్, జర్నలిస్ట్ సంఘాలలో సభ్యత్వం, హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్నవారి సంఖ్య అంతంతమాత్రమే. 30 శాతం మంది ఎటువంటి సదుపాయాలు కలిగి లేరు.
- తగిన గుర్తింపు లభిస్తూ వృత్తిలో కొనసాగుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది, సంస్థలు మారుతున్న, మారాలనుకుంటున్న వారి సంఖ్య ఇంచుమించుగా ఒకే విధంగా నమోదైంది. కేవలం 5% మంది మాత్రం తమ ఈ వృత్తి నుంచి వేరే వృత్తులకు మారాలని అనుకుంటున్నట్లు తేలింది. స్పందించినవారిలో దాదాపు సగం మంది తమ వృత్తిలో తమ వారసులుగా తమ సంతానాన్ని ఊహించుకోలేమని స్పష్టంచేసినట్టు వెల్లడైంది.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ప్రెస్ అక్రిడిటేషన్స్, శ్రీకాకుళం జిల్లా సమాచారం, 2014-2019, ఐపీఆర్, ఏపీ
- ప్రెస్ అక్రిడిటేషన్స్, విజయనగరం జిల్లా సమాచారం, 2014-2019 ఐపీఆర్, ఏపీ
- ప్రెస్ అక్రిడిటేషన్స్, విశాఖపట్నం జిల్లా సమాచారం, 2014-2019 ఐపీఆర్, ఏపీ
- నటరాజన్, ఎస్. ఏ హిస్టరీ ఆఫ్ ది ప్రెస్ ఇన్ ఇండియా. ఏషియా పబ్లిషింగ్ హౌస్, బోంబే. 1962
- రాధాకృష్ణ, బూదరాజు. జర్నలిజం పరిచయం. విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2013
- వేణుగోపాల్, నాగసూరి. చానళ్ళ సందడి టెక్నాలజి హడావుడి. ఎన్.కె. పబ్లికేషన్స్, విజయనగరం, 2007
- సర్వే: ప్రశ్నావళికి వివిధ ఉత్తరాంధ్ర టీవీ జర్నలిస్టుల స్పందనలు
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.