headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-5 | April 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. ‘నమ్ముకున్న నేల’ కథ: ప్రధానపాత్రల చిత్రణ

డా. డి. ప్రవీణ

తెలుగు అధ్యాపకులు
ఎస్. వి. ఎల్. ఎన్. ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల
భీమునిపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9290441535, Email: praveenaphdtelugu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆధునిక కథా రచయితలలో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ప్రముఖులు.”కడప ఊళ్ల పేర్లు” అనే అంశంపై పరిశోధన చేశారు. ఇతను “జప్తు“, ”కేతు విశ్వనాథరెడ్డి కథలు” అనే సంపుటాలలో 40 కథలను సంకలనం చేసారు. “కేతు విశ్వనాథరెడ్డి కథల”లోని “నమ్ముకున్న నేల“ అనే కథను ఈ పరిశోధనా పత్రంలో పరిశీలించ ప్రయత్నం జరిగింది. దీనిలో రచయిత స్వయంగా కథను చెప్పినట్లుగా ఉంటుంది. నమ్ముకున్న నేల కథలో రచయిత పిత్రార్జితంగా మిగిలిన రెండు ఎకరాల తోటను నాలుగేళ్ల క్రితం తన దాయాదివీరన్నకు పదివేలకు అమ్ముతాడు. ఒక్క చెడ్డ అలవాటు లేనటువంటి వీరన్న 15 సంవత్సరాల క్రితం 20 ఎకరాల రైతు. కానీ ఇప్పుడు తన భూమిని అంతా కోల్పోయి రచయిత యొక్క భూమిని కౌలుకు చేస్తాడు. వీరన్న 2000 ఇచ్చి మిగిలిన 8000 తర్వాత తీరుస్తానని పత్రం రాయించుకుంటాడు. వీరన్న డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని అంగడి సుబ్బారాయుడు ఉత్తరం రాయగా వచ్చిన రచయిత వీరన్న పరిస్థితికి జాలిపడి డబ్బు అడగలేదు. కానీ కూతురు ప్రసూనకు వివాహం నిశ్చయం కావడంతో డబ్బు కోసం తన ఊరు వస్తాడు. నాలుగేళ్లు క్రితం 10,000 ఉన్న తన భూమి అంగడి సుబ్బారాయుడుకు 6000 రూపాయలకే ఇస్తాడు రచయిత. నేలను నమ్ముకున్న వీరన్న జీవితం ఎలా ఉందో ఈ కథలో తెలుస్తుంది. నిర్మాణాత్మక పద్ధతిలో ఈ పరిశోధనా పత్రాన్ని రాయడం జరిగినది.

Keywords: నమ్ముకున్ననేల, కథ, శైలి, ఇతివృత్తం, పాత్రలు, కథకుడు, వీరన్న, అంగడి సుబ్బారాయుడు.

1. ఉపోద్ఘాతం:

సమాజాన్ని చైతన్యపరచడంలో సాహిత్యాన్నిది ప్రథమ స్థానం అనడంలో సందేహం లేదు. రాయలసీమ తన వైభవంతో ప్రాచీనకాలంలో రతనాల సీమగా పేరు పొందింది. సాహిత్యంలోను సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పొందిన రాయలసీమలో రైతు జీవనం గురించి రచయిత హృదయ విదారకంగా తెలియజేశారు. దీనిలో రచయిత స్వయంగా కథను చెప్పినట్లుగా ఉంటుంది. 

పోరంకి దక్షిణామూర్తి గారు కథానిక లక్షణాలను గురించి ”1. సంక్షిప్తత2. ఏకాంశం 3. నిర్భరత 4. స్వయం సమగ్రత 5. సంవాద చాతుర్యం 6. ప్రతిపాద ప్రవణత 7. ప్రభావాన్విత1 అనేది ఉంటాయి అన్నారు. 

2. రచయిత పరిచయం:

వివ్వనాథ రెడ్డిగారు  రంగసాయిపురంలో 1937లో సామాన్యరైతు కటుంబంలో జన్మించారు. పుట్టింది రైతు కుటుంబంలో కావున గ్రామీణ వాతావరణం రైతుల జీవన విధానంను ఆధారంగా చేసుకొని అనేక రచనలు చేశారు.

వీరు యం.ఎ చదివి పిహెచ్డ్ చేశారు. కొంతకాలం ప్రభుత్వ కళాశాలలో ఉపన్యాసకునిగా అటుతర్వాత వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోను, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోను ఆచార్యునిగా పరిచేశారు.

ఆధునిక కథారచయితల్లో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిగారికి విశిష్టమైన స్థానం ఉంది. వీరి కథల్లో సామాజిక ప్రయోజనం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. వీరి కథలు అనేకం హింది, కన్నడం, మలయాళం, బెంగాలి, మరాఠి మొదలగు భారతీయ భాషల్లోనే కాకుండా, ఇంగ్లీష్ రష్యన్ మొదలగు విదేశీ భాషల్లోకి అనువదింపబడ్డాయంటే ఈయన కథల్లో సామాజిక ప్రయోజనం ఎంత ఉందో చెప్పనక్కరలేదు.

పాలగుమ్మి పద్మరాజు  “నూతన కథానికకు శిల్పం ప్రధాన లక్షణం గా చెప్పడం జరిగింది. శిల్పమంటే పదాలతో గారెలు చేయడం కాదు. ఒక మానవ సంఘటనను ఒక కొత్త దృక్కోణం నుంచి చూడడం. ఆ దృశ్యాన్ని పరిపూర్ణంగా క్లుప్తంగా వ్యక్తీకరించడానికి భాష సాధనంగా వాడుకోవడం2 అని అన్నారు .

బుచ్చిబాబు  కేతు విశ్వనాథ రెడ్డి గురించి “జీవితంలో ఎదుర్కొన్న యదార్థాన్ని సాహిత్యంలో ఎదుర్కొంటే హర్షించడు పాఠకుడు. ఇతనికి కావలసినది కళానుగుణం అయిన సత్యం.”3  రచయిత భయంకరమైన కడప జిల్లా వాస్తవాన్ని  కళానుగుణమైన సత్యాలుగా ఎలా తీర్చిదిద్దారో గమనించవచ్చు.

రైతులయొక్క ఆవేదనను తెలియజేయటం వారి సమస్యలకు పరిష్కారమార్గం చూపడం ఈయన ముఖ్య ఉద్దేశంఅడుగడుగున కర్షకుడు ఎంత నలిగిపోతున్నాడో నేల తల్లిని నమ్ముకుని ఎంత మోసపోతున్నాడో ఈ కథలో రచయిత తెలియజేస్తూ బాథపడుతున్నాడు. గ్రామాల్లో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. సకాలంలో వర్షం పడక, ఒకవేళ పడినా పంటలు సరిగ్గా పండకపోనీ ఏదో పండాయిలే అని సంతోషించేలోపు పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించక రైతు అప్పులపాలు అవుతున్నాడు. అందరి ఆకలి తీర్చేటి రైతు చివరికి ఆకలితో పడుకుంటున్నాడు. ఆ ఆకలి తీర్చుకోడానికి పురుగులమందును పరమాన్నంలా స్వీకరిస్తున్నాడు. ఇది నేటి సమాజంలో కూడా తారసపడుతున్నటువంటి రుగ్మతలేచివరికి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేక వ్యవసాయం ఎందుకులే అని చిన్నో పెద్దో ఉద్యోగం ఉంటే జీవితం హాయిగా సాగుతుందని రైతులు తమ పొలాల్ని సైతం అమ్మి.

“కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని
తల్లిమాటలు చెవినపెట్టక
బయలుదేరిన బాటసారికి”4

అని శ్రీశ్రీ విలపించినట్టు గ్రామాలనుంచి పట్టణాలకు తరలివచ్చి ఏదో పని చేసుకుంటూ గ్రామాలను అనాథలు గా  విడిచిపెడుతున్నారు.

3. నమ్ముకున్న నేల కథ- ముఖ్యపాత్రలు:

3.1 కథకుడు/ రచయిత :

ప్రస్తుతం గ్రామాలలో ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు గ్రామాలలో ఎక్కడ చూచినా పచ్చని పొలాలు కనిపించేవి. కానీ ఇప్పుడు బీడుబారిన పొలాలు ఆ పొలాలు కూడా గట్లుగట్లుగా మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడక్కడా మిడతలు కొట్టిన పొలాల్లాగ కనిపిస్తున్నాయి  దీనికి కారణం ప్రకృతి వైపరీత్యాలు ఒక్కటైతే,  కర్షకులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మరొకటని మనం చెప్పవచ్చు.

ఈ కథలో రచయిత ఒక ముఖ్యపాత్ర. తన కూతురు వివాహం కోసం రచయిత తనదగ్గర ఉన్న పొలంను అమ్మాలనుకున్నాడు. అలా వచ్చిన డబ్బుతో తన కుమార్తె వివాహం చేయాలనుకున్నాడు. కాని ఏదో సామెత చెప్పినట్టు అనుకున్నది ఒకటి అయినది మరొకటి అన్నట్లు మొదట తన పొలం అమ్మాలనుకున్నది ఒక రేటు, చివరిగా తనపొలం అమ్మగా వచ్చేది మరోరేటు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వైకుంఠపాలి ఆటలో రెండుగళ్ళ నిచ్చెన ఎక్కినవాడిని పదడుగులపాము మించేసినట్టునాలుగేళ్ళకిందట పొలానికి వచ్చిన రేటు పదివేలు కాగా తర్వాత రోజుల్లో ఆ పొలం ఆరువేలరూపాయలకే అమ్మవలసిన పరిస్థితి. చెప్పినవిధంను బట్టి కర్షకుని యొక్క స్థిరాస్థులు విలువ పెరిగిందో లేదా తగ్గిందో అన్న విషయం రచయిత పాఠకులకు విడిచిపెట్టాడు.“ఔను నిజం, ఔను నిజం … వృధా, వృధా!5 అని శ్రీశ్రీ చెప్పినవిధంగా వాస్తవిక జీవితంలో ఎంతోమంది కర్షకులు అనేక బాధలను బరిస్తూ దోపిడీకి గురి అవుతున్నారు.

3.2 వీరన్న:

నమ్ముకున్న నేలలో ముఖ్యపాత్ర వీరన్న. బ్రతకుతెరువు తెలియనివాడు, అమాయకుడు. వ్యవసాయం  చేసి తన కుటుంబాన్ని పోషించుకుందామనుకున్న వీరన్నకి ఎదురైన పరిస్థితులను చూస్తే మనసున్న మనిషి ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. వీరన్నది కడప జిల్లాలో చిలమకూరు గ్రామం. పదిహేన సంవత్సరాలు క్రిందట ఇతడు ఇరవై ఎకరాల భూసామి. ఒక్క చెడ్డ అలవాటు కూడా లేదు. వీరన్న భార్య రామలక్ష్మమ్మ. వర్షాలు పడక పంటలు పండక అప్పులపాలై తాను నమ్ముకున్న నేలను అమ్ముకున్నాడు. అంతకు ముందే వ్యవసాయంతో కుదేలు అయిపోయి తనపొలం అమ్మి అప్పులు తీర్చిన వీరన్న మళ్ళీ అదే వ్యవసాయం చేయడానికి రచయిత దగ్గర పొలం కొనడానికి సిద్ధపడ్డాడంటే వీరన్న ఎంత అమాయకుడో ఎవరికైనా అర్థమవుతుంది. పోనీ అలా కొనాలనుకన్న పొలం కూడా చివరికి కొనలేకపోయాడు. ఉన్నదంతా వ్యవసాయంలో పోగొట్టుకొని చేయరాని పనులు చేయడానికి సిద్ధపడ్డాడు. భోగం కంపెనీ ప్రారంభించి అందరిముందు చులకనయ్యాడు.

ప్రసూన పెళ్లికి నేనేదో తంటాలు పడతా. లేదా జరిగేది జరుగుతుంది భూమి నువ్వే చేసుకో నీకు వీలున్నప్పుడే డబ్బు యిస్తువుఅని రచయిత అన్నప్పుడు రచయితకు వీరన్న మీద ఉన్న జాలి కనిపిస్తుంది. 

కానీ వీరన్న ”వీలేంది? యెట్లా వుంటుంది వీలు? బావిలో వంతు లేదంటే యేం జెయ్యాలా? బాడుగకు ఇంజనీపొద్దు ఆడించను, పొమ్మంటే యేం జెయ్యాలా? యెద్దుల్లేవు. యారముట్లు లేవు. దేన్ని చూసుకుని బూమి తీసుకోమంటావు? భూమిని నా కమాషి వచ్చినాకే ఇరవైయేండ్లు నమ్ముకున్నా మిగిలింది ఏముంది? ఇంకా సుబ్బారాయుడికి ఇవ్వాల్సిన పదైదు నూర్లు ,ఇంకా గవర్నమెంట్ లోన్లు. ఇంకానా  భూమి తీసుకుంటే సుబ్బురాయుడికి బాకీ  పడతా, ఆఖరికి గవర్నమెంటుకు సిస్తు బాకీ పడతాఎప్పుడో సుబ్బరాయుడు నా పొలం సొంతం చేసుకుంటాడు. నీదగ్గర తీసుకున్న రెండు ఎకరాలు పోతుంది. నీకీయాల్సిన పదివేలు ఇరవైవేలు అవుతుంది”7

అన్న విధానం బట్టి ప్రస్తుత సమాజంలో రైతులు అందరి పరిస్థితి ఈ విధంగానే ఉన్నది అని రచయిత వీరన్న పాత్రద్వారా తెలియ జేశారు.

రైతు అయిన వీరన్న తనకున్న ఇరవైఎకరాల పొలంలో వ్యవసాయం చేసిన్పటికీ నమ్ముకున్న నేలతోపాటుభూస్వాములు మొదలగువారు మోసం చేయడంవల్ల, తనపొలం మొత్తం పోయింది. అయినప్పటికీ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రచయిత వద్ద రెండెకరాల పొలం గుత్తకు తీసుకొని వ్యవసాయం చేశాడు. అయినప్పటికీ కాలం కలిసిరాక, దేవుడు కరుణించక తనవృత్తిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎదురయ్యిందిఇటువంటివి నేటి సమాజంలో కూడా తారసపడుతున్నవే.

3.3 అంగడి సుబ్బారాయుడు :

అంగడి యజమాని, అతని ఇల్లు అంగడి రెండూ ఒక్కటే. ఆ సుబ్బరాయుడు మళ్ళకు అవసరమును బట్టి డబ్బులు అప్పుగా ఇచ్చితర్వాత వాళ్ళు చెల్లించలేని పరిస్థితిని చూసి బాకీదారునుండి ఏవిధంగానైనా ఉన్నదంతా లాక్కునే స్వభావి. అవసరానికి ఆదుకుంటున్నాను అనుకునేలా చేసి చివరకి వాళ్ళను దోచుకునే అవకాశవాధి. ఈ కథలో సుబ్బరాయుడు వీరన్నకి డబ్బులు అప్పుగా ఇచ్చి పొలాన్ని లాక్కుంటాడుఅవసరాన్ని బట్టి ఇవ్వాల్సిన ఖరీదుకన్నా తక్కువ ఖరీదుకు దోచుకునే దురాసపరుడు. రచయితకు డబ్బులు అవసరం అని తెలిసి తక్కువ సొమ్ముకే రచయిత పొలం సొంతం చేసుకున్నాడు. అందులో వీరన్న దగ్గర నుంచి రావలసిన పొలం పొంతం చేసుకున్నాడు. అందులోనే వీరన్న దగ్గరనుంచి రావలసిన బాకీ వసూలు చేసుకున్నా యుక్తిగల వ్యక్తి.

అన్నం తిని నోరు చెడిపోయి ఉంటుంది సంగటే బాగుంటుందని అన్నం చేయించలా”8  అని సుబ్బారాయుడు రచయిత తోటి అనడంలో సుబ్బారాయుని యొక్క లౌక్యం తెలుస్తుంది.

దుష్ఠ తెలివితేటలకు నిదర్శనం. నేటి సమాజంలో ఇలాంటి స్వార్థపులు, దోపిడీదారులు ఎంతోమంది ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఆనాడు రాసిన విశ్వనాథరెడ్డిగారి రచన నేటిపరిస్థితులకు కూడా అన్వయింపబడుతుంది. ఇప్పటికి కూడా ఎంతోమంది ఆర్థికవేత్తలు రాజకీయవేత్తలు రైతులను ఏదో రూపాన దోచుకుంటున్నారు. రైతులయొక్క జీవనప్రమాణ శైలి రోజురోజుకీ దిగజారుతుందే గాని మెరుగుపడట్లేదు

3.4 వాస్తవికత:

గ్రామీణ జీవితం ప్రశాంతతకు నిలయాలు గ్రామాలు అన్న మాట ఒక నాడు నిజమేమో కానీ నేడు అక్కడ కూడా అరాచకాలు ఆధిపత్యాలు అధికమయ్యాయి.  నమ్ముకున్న నేల రాయలసీమను పీడిస్తున్న సమస్య వర్షాభావము. పల్లె ప్రజల యొక్క జీవనాధారమైన వ్యవసాయం వర్షాభావ కారణంగా ఏ విధంగా క్షీణించిపోయిందో రచయిత చాలా వాస్తవికంగా చిత్రీకరించారు. వీరన్న జీవితం ఆధారంగా చేసుకుని వర్షాభావం వలన భూమి ఎన్నుకోవడం అనేది గ్రామీణ జీవితంలో రైతు బ్రతుకు ఎండిపోవడంతో సమానం అన్న సత్యాన్ని నిరూపించారు.

4. ముగింపు:

  • భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక అంటారు. వ్యవసాయం అంటే రైతు. రైతు అంటే వ్యవసాయం. అలాంటి రైతు రాజుగా ఉండాలికానీ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరివల్లే కాకుండా పెత్తందార్లు భూస్వాములస్వార్థం మూలంగా రైతు సామాన్య జీవనం గడపడానికి కూడా నోచుకోవట్లేదు. అని రచయిత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మాటలతో కోటలు కట్టే ఈ దోపిడీదారుల సమాజంలో అందరూ రైతును నిలువుదోపిడీ చేస్తున్నారు. కావున ఇకనైనా ఎవరో వస్తారనో ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా ఎవరికి వారే అన్యాయాన్ని ఎదురించి అభ్యుదయపదంలో నడవాలి.
  • నమ్ముకున్న నేల కథ సామాజిక స్ఫూర్తితో నడిచినది. రచయితలు కాలక్షేపానికి డబ్బు సంపాదించుకోవడం కోసం కాక కడుపు కాలే  సమస్యలతో వేగే వాళ్లను చైతన్యవంతులను చేయడం కోసమే నన్న సిద్ధాంతంలో రచనలు చేసిన కథకుడు విశ్వనాధ రెడ్డి.
  • ఈ కథ ద్వారా రాయలసీమ ప్రాదేశిక పరిస్థితులను వాస్తవిక చిత్రణతో కళ్ళకు కట్టినట్టుగా శిల్పసంపన్నంగా కనబరిచారు.
  • అందువలనే ఈయన రాయలసీమ ప్రాతినిధ్య కథ రచయితగా ప్రముఖులు మన్ననలు పొందారు. 
  • నమ్ముకున్న నేల వీరన్న జీవితాన్ని ఎలా నాశనం చేసిందో రైతుల మనుగడ వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగం వైపు ఎలా బదిలీ అవుతుందో విశదీకరిస్తుంది.

5. పాదసూచికలు:

  1. పోరంకి దక్షిణామూర్తి. కథానిక స్వరూప స్వభావాలు. పుట 9-10
  2. పాలగుమ్మి పద్మరాజు”,  కథావేదిక” . 4-1-4-35,
  3. బుచ్చిబాబు,  “కథలు వ్రాయడం ఎలా”,” కథలు ఎలా రాస్తారు?” పుటలు 18 -19,
  4. శ్రీ “మహాప్రస్థానం”,నవచేతన పబ్లిషింగ్ హౌస్ బాటసారి పుట 47
  5. శ్రీ శ్రీ మహాప్రస్థానం  నవచేతన పబ్లిషింగ్ హౌస్ చేదు పాట పుట – 95
  6. కేతు విశ్వనాథ రెడ్డి : “కేతు విశ్వనాథరెడ్డి కథలు”“నమ్ముకున్నానేల” కధ పుట –47 
  7. కేతు విశ్వనాథ రెడ్డి : “కేతు విశ్వనాథరెడ్డి కథలు”  “నమ్ముకున్నానేల” కధ పుట -48
  8. కేతు విశ్వనాథ రెడ్డి : “కేతు విశ్వనాథరెడ్డి కథలు” “నమ్ముకున్నానేల” కధ పుట -46 


6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. దక్షిణామూర్తి, పోరంకి  కథానిక స్వరూప స్వభావాలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1992.
  2. నాగయ్య. జి  తెలుగు సాహిత్య సమీక్ష రెండవ సం భాగ్యం పాలిటీ ప్రింటర్స్ మద్రాసు, 2003.
  3. పద్మరాజు పాలగుమ్మి కథావేదిక ప్రధమ వార్షిక ప్రత్యేక సంచిక విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1991
  4. వెంకటసుబ్బయ్య వల్లంపాటి “ కథ శిల్పం” విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1998.
  5. శ్రీ శ్రీ మహాప్రస్థానంనవచేతన పబ్లిషింగ్ హౌస్,  సంవత్సరం, 2020 .

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]