AUCHITHYAM | Volume-4 | Issue-11 | October 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
7. 'అనిశెట్టి' కవిత్వం: సామ్యవాదధోరణి
ఎం.ఎన్.వి. సూర్యకుమారి
పరిశోధకురాలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం &
తెలుగు అధ్యాపకురాలు, ప్రకాశం డిగ్రీ కళాశాల,
కొయ్యల గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా.
సెల్: +91 8500711209, Email: majjinvsuryakumari@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
సామాజిక అవగాహన లేని సాహిత్యం వాసన లేని పువ్వు వంటిది. అనిశెట్టి ఉద్యమకారుడు, కవి. సామాజిక శ్రేయస్సు తన ధ్యేయంగా తన సాహిత్యంతో ఉద్యమకార్యకర్తగా, అగ్ర శ్రేణి నాయకుడిగా తనదైన ముద్ర మిగిల్చిన వ్యక్తి అనిశెట్టి. కవిగా అన్ని రసాలు పోషించిన అనిశెట్టి కవిత్వంలో కరుణరసానికి పెద్దపీట వేశారు. బిచ్చగాడి పదాలు, అగ్నివీణ, శాంతి నాటకం ఇందుకు నిదర్శనాలు. ప్రముఖ అభ్యుదయకవి అనిశెట్టి సుబ్బారావు విభిన్న ప్రక్రియలు చేపట్టి ఆధునికసాహిత్యాన్ని సంపన్నం చేసినా ఆయన అజ్ఞాత రచయితగా మిగిలిపోవడం శోచనీయమైన విషయం. అనిశెట్టి సాహిత్యాన్ని స్పృశించిన విమర్శకులు తక్కువ. డా. పి.వి. సుబ్బారావు శెట్టి సాహిత్యానుశీలనం అనే అంశం మీద శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ చేశారు. అనిశెట్టి కవిత్వంలో సామ్యవాద ధోరణిని పరిశోధించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. అనిశెట్టి రచనల్లో ప్రభోధం, చారిత్రకదృక్పథం గురించి, దేశభక్తితత్పరత, ఆకలిచిత్రం మొదలైన సామాజికాంశాలను ఈ వ్యాసం చర్చిస్తుంది.
Keywords: కవిత్వం, కరుణరసం, సామాజికత, ఉద్యమం, సామ్యవాదం, అనిశెట్టి.
1. ఉపోద్ఘాతం:
వచనాన్ని కవిత్వీకరించడం, సాధారణ భావానికి కవిత్వ పరిమళ మద్దడం ఓ రసవిద్య. సమస్త మానవాళి ఆకాంక్షలకు అక్షర రూపం ఇవ్వడం తన లక్ష్యంగా భావిస్తూ ఆ భావనను తన కవిత్వం ద్వారా కొంతమంది మాత్రమేప్రస్ఫుటింప చేయగలరు. అటువంటి వారిలో అనిశెట్టి సుబ్బారావు ఒకరు నయాగరా కవులకు, తొలితరం అభ్యుదయ కవులకు వెన్నుదన్నుగా నిలబడ్డారు అనిశెట్టి. కరుణ రసాన్ని ప్రోది చేసి గేయాలు అల్లి కంటతడి పెట్టించారు సుబ్బారావు . అభ్యుదయ సాహిత్యాన్ని ముందు వరుసలో నిలబెట్టి నడిపిన కవి అనిశెట్టి. కవిత్వం, నాటకం, గేయం, కథ ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలు తనదైన బాణీలో రచించి సమకాలీనుల మెప్పు పొందిన కవి అనిశెట్టి
2. అనిశెట్టి కవిత్వము- సామ్యవాద ధోరణి
అభ్యుదయ కవుల ఆశయం సమసమాజ స్థాపన. ఈ కవులంతా తమ రచనల్లో సామ్యవాద ధోరణి ప్రదర్శించారు. అనిశెట్టి అగ్ని వీణలో సామ్యవాద ధోరణి పుష్కలంగా ఉంది. ఇతర కవితా ఖండికలలో కూడా సామ్యవాద ధోరణి ప్రదర్శించారు. వర్గ పోరాటానికి శ్రామిక, కార్మికులను ప్రేరేపించడం వల్ల, సమ సమాజ స్వరూపాన్ని వివరించడం వల్ల అనిశెట్టి సామ్యవాద ధోరణి అభి వ్యక్తం అవుతుంది. కవితలలో "నర బలిలో చిరపేడనలో/ గుడిలో యంత్రపు దోపిడీలో/హతులే పతితుల ప్రాణ జ్వాలలో/ లోకపు చీకటి! కన్ను తెరుస్తూ/ నూత్న మానవుని! కూ పిరి పోస్తూ/ అసత్య హింసల ద్వేషిస్తూ/ సమాధర్మం స్థాపిస్తూ! "1అనడం లో నరబలిలో హతులైన వాళ్ళు చిరకాల పీడనలో గుడిలో యంత్రపు దోపిడీ పతితులైన వాళ్ళ ప్రాణ జ్వాలలతో లోకపు చీకటిని పారద్రోలతా నంటాడు.
కవితా విశ్లేషణ: సమధర్మం స్థాపిస్తానంటాడు. ఇచట సమధర్మం సమ సమాజమే.సమాజపు అట్టడుగున పడి నలుగుతున్న అదో జగత్సహోదరులకు,వారికి అండగా నిలచిన అజ్ఞాతవీరులకు అభినందన సందేశమే అగ్ని వీణ. తనదైన శైలిలో స్పందిస్తూ దీనుల హీనుల పట్ల తన కున్న భా థా తప్త హృదయాన్ని మనం గమనించవచ్చు.
"వచ్చాను వచ్చాను"ఖండికలో కూడా సమసమాజ స్థాపనకు ప్రళయరుద్రునిలా విజృంభిస్తూ-"పగిలించి రణభేరి పద్మవ్యూహము త్రెంచి/ శివమెత్తి విస్ఫులింగములు చిమ్ముతూ లేచి/ ఈ జగతిలో నూత్న జగతిని పె కిలిస్తాను" 2 అనడం లో కవి హృదయం అవగతం అవుతుంది.
కవితా విశ్లేషణ: సమ సమాజ స్థాపనకు అడ్డుకునే ఫ్యూడల్ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి యుద్ధభేరిని మోగించి పద్మవ్యూహాన్ని చేధించి విస్ఫులింగాలు చిమ్ముతానంటాడు. ఈ జగతిలో నూత్న జగతి సమ సమాజం. నూతన జగతిలో సమాధి స్వరూపాన్ని వివరిస్తూ తన కలం పదును లోతును అద్భుతం గా ఆవిష్కరించారు అనిశెట్టి. యజమాని సేవకుడు ధనికుడు పేదవాడు అనే వ్యత్యాసాలు ఒకరికి మరీ ఒకరు తలవంచి బానిస సలాం చేయవలసిన అవసరం ఉండదు. అనిశెట్టి ఆకాంక్షించే నూతన జగతి ఇదే సమ సమాజం ఇదే.
"మీతోనే ఉంటాను"కవిత ఖండికలో స్వాతంత్ర్య దీక్షాకాంక్షతో ప్రజలను ప్రేరేపిస్తూ"ముందు సమాధర్మ సంఘ సంస్థాపనోత్సవము రా!" 3 అంటాడు.
కవితా విశ్లేషణ: బానిసత్వంలో ఉన్న నాటి సమాజానికి ముందు స్వాతంత్య్రం సిద్దిస్తే నే పిదప సమ సమాజం సిద్ధిస్తుందని అనిశెట్టి ఆకాంక్ష. స్వాతంత్ర్యం సిద్ధించినా మన వ్యవస్థలో సమ సమాజ స్థాపన సాధ్యం కాలేదు. వర్గ పోరాటం ద్వారా సమ సమాజం సిద్ధిస్తుందని అభ్యుదయ కవుల విశ్వాసం. దీనులైన సోదరులను అనిశెట్టి వర్గ పోరాటానికి పురికొల్పు తూ…… "లేవరా లేవరా కూడు లేని సోదరా! / లోకపు సిరిసంపదలకు మనకూ హక్కు ఉందిరా!/ లోకపు సౌందర్యానికి మనకు హక్కు ఉంది రా! అనడం లో కవికీ లోకాన ఉన్న సిరి సంపదలో అందరికీ సమ భాగం ఉందని అది సంపాదించడానికి వెనకడుగు వెయ్య కూడదు అని తన కవిత ద్వారా ఉపదేశించారు.లోకంలో ప్రజలంతా సమానమే సమాజంలో గాలి నీరు, భూమి అందరివీ సమాజంలో కొందరు స్వార్ధపరులైన ధనిక స్వాములు లోకంలోని సిరిసంపదలను అన్యాయంగా, అక్రమంగా గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్నారు.తినడానికి తిండి లేని సోదరులతో కవి మమేకం చెంది లోకపు సిరిసంపదలపై లోకపు సౌందర్యం పై మనకు హక్కు ఉందని వారిని తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తాడు.
"రండు రండు లేచి రెండు"ఖండికలో తలదాచుకోవడానికి తావులేని దీనులను వద్ద పోరాటానికి ప్రేరేపిస్తూ - "రంప నెత్తి రాళ్లు కొట్టి/ ఊరు కట్టి దారి వేసి/ కొమ్మ లేని చెట్టు క్రింద/ కుమిలి పోకు లెమ్ము సభా! లేచి రమ్ము4అంటాడు.
కవితా విశ్లేషణ: శ్రామికుడు తన శ్రమతో అందరికీ ఇల్లు కట్టించిన తాను మాత్రం తలదాచుకునే రావు లేక కొమ్మ లేని చెట్టు క్రింద కుమిలిపోతున్నాడు. అ దీన అవస్థలో అలమటిస్తున్నాడు. అందుకే అనిశెట్టి అతన్ని వర్గ పోరాటానికి సిద్ధం కమ్మని ప్రేరేపించ డం జరిగింది. "నమ్మి బ్రతికినా నమిలి చీల్చి వెళ్లే మొ సళ్ళు ఉన్నవాళ్లు"5అంటాడు.
కవితా విశ్లేషణ: నమ్మించి మో స గించే ప్రజలు ఈ లోకం లో ఉన్నారని అమాయకంగా వారిని నమ్మ వద్దని కవి తన కలం ద్వారా తెలియ పరిచాడు. సమ ధర్మపు ఔన్నత్యాన్ని చాటి చెబుతూ - "సమధర్మపు నిమునోన్నతములను కౌగిలిస్తోంది/ సంగీతం గా కాలం ప్రగతికి ప్రవహిస్తోంది" 6 అని చెప్ప డం వల్ల కవిత ద్వారా మంచి సందేశం అందించారు.
కవిత విశ్లేషణ: ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రజలను చేరదీయుట, సమ ధర్మపు ఔన్నత్యం, ఆహ్లాదంగా సంగీతంగా ప్రగతి పదం వైపు నడుస్తోంది అని చెప్పడం జరిగింది.కాలం ప్రగతి పదం వైపు నడిస్తేనే సమ సమాజం సాధ్యమవుతుంది. అనిశెట్టి మానవ సమస్యలపై పోరాడే వర్గ సంఘర్షణ దృక్పథం ఉన్న మానవుని అన్వేషిస్తూ అలజడి ఆకలి,ఇష్టం ,ఈర్ష్య ఇలా ఆకారాదిగా సందర్శించే మానవుని చూస్తాను గ్రహిస్తాను." 7 అని తెలియ జేశాడు.
అనిశెట్టి ఊహల్లో సమసమాజపు చిత్రాన్ని తీసుకున్నాడు. రూపాన్ని వివరిస్తూ…. "కోన ఊపిరితో బ్రతికే కోటి కోట్ల జీవులారా/ అప్పులు, హత్యలు లేని ఆకలి చావులు లేని లోకం/ ఆ లోకానికి పోదాం రండి నేడే ప్రయాణం కండి అని ఆహ్వానిస్తాడు"8... అని తన కవిత ద్వారా చెప్పడం జరిగింది.ఆకలి చావులతో అప్పులతో ఆత్మహత్యలతో సతమతమవుతూ చావలేక బ్రతుకుతున్న దీనులను, కొన ఊపిరితో బ్రతుకుతున్న కోట్ల కొలది దౌర్భాగ్యపు జీవులను, చల్లని లోకమైన సమ సమాజానికి ప్రయాణం కమ్మని ప్రేరేపిస్తాడు శ్రీ శ్రీ. "సమైక్యజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని"9 శ్రమ విలువను గుర్తించి కీర్తిస్తే, అనిశెట్టి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచిస్తూ సమ సమాజాన్ని కాంక్షిస్తూ… "లోకపు సౌభాగ్యానికి/ లోకపు సౌందర్యానికి/ నరులుఅంతా వారసులే"10 అని చాటి చెబుతాడు. జీవితాన్ని చైతన్యం తెలిపే సత్యంగా సుందరం నృత్యం గా వర్ణిస్తాడు. రక్తాన్ని సమ సమాజపు రక్తాన్ని చిందిస్తానంటూ……"నా రక్తం ధారవోసి/ నవలోకం స్థాపిస్తా"11 అని ప్రతిజ్ఞ చేశాడు. అనిశెట్టి దృష్టిలో నవలోకం సమసమాజం. అనిశెట్టి భవిష్యత్తుపై ఆశ ఉంది అందుకే…. "మన త్యాగాలు వృధా కావని/ ముందు తరాల రుణ వదన/మృదు హాసం చేస్తున్నవి"12 అని చెప్పడం జరిగింది.
కవితా విశ్లేషణ: సమాజం కోసం మనం చేసే వర్గ పోరాటం వృధా కాదని ,రానున్న తరాల్లో అది సిద్ధిస్తుందని ఆయన కాంక్ష.సమ సమాజంలో ప్రజలు చిరునవ్వులు.చిందిస్తూ హాయిగా జీవిస్తారని ఆయన ఆశ.
3. అనిశెట్టి కవిత్వం-కార్మిక కర్షక ప్రబోధం:
అనిశెట్టి "తీయని కల"13 ఖండికలో తాను దర్శించిన చక్కని లోకానికి కార్మిక కర్షకులను ఆహ్వానిస్తాడు. కార్మికులను ఉద్దేశించి "సౌభాగ్యానికి కారకులు రైతులు కనుక ఆ సౌభాగ్యానికి వారసులు కూడా రైతులేనన్న విషయాన్ని తెలియజేస్తాడు. తిరుగుబాటు చేయమన్న ప్రేరణ చేస్తాడు. అనిశెట్టి చల్లని కలలో దర్శించిన చక్కని లోకం తమ సమాజం ఆ చల్లని లోకంలో కార్మిక కర్షకులతో పాటు బిచ్చగాండ్రులను కూడా ఆహ్వానిస్తూ……” అందరూ సుఖ జీవనాన్ని సాగిస్తారు.
4. అనిశెట్టి కవిత్వం- గత నిరసన (చారిత్రక దృక్పథం):
అభ్యుదయ కవి గతాన్ని గుడ్డిగా విశ్వసించడు ఆలోచనాత్మకంగా అవలోకిస్తాడు. విమర్శనాత్మకంగా విశ్లేషిస్తాడు. చరిత్ర గతిలో హఠాత్పరిణామాన్ని అంగీకరించడు. సమాజానికి ఆ చరిత్ర ఉందని ఆ గతికి ఒక క్రమము ఉంటుందని, అభ్యుదయకవి అవగాహన. సామాజిక ప్రయోజనం లేని గత చరిత్రల గమనాన్ని అభ్యుదయ కవులు నిరసించారు.అవి కేవలం శుద్ధ చరిత్రలు మనకు ఉన్న చరిత్ర అంతా దాదాపు ఈ కోవకు చెందినది.
ఈ విషయాన్ని నిర్ధారిస్తూ "Random house dictionary” లో “A continuous systematic narrative of past events as relating to a particular people country period etc, usually written in chronological order"14 ప్రత్యేకించి ఒక వర్గానికి, దేశానికి, ఒక కాలానికి సంబంధించిన గత సంఘటనలను వంశపారంపర్య క్రమంలో మార్పు చేయడమే చరిత్రకు ఉన్న పద్ధతిని సామ్యవాద దృక్పథం గల అభ్యుదయకవులు నిరసించారు. ఈ దృక్పథంతో చరిత్రను మార్క్సిజన్ కూడా అంగీకరించదు. "ఇంతవరకు నడిచిన సమసమాజకు చరిత్ర అంతా వర్గ పోరాటం చరిత్ర అని మార్క్స్,ఏంగెల్సులు అభిప్రాయబడినారు"15
పై అభిప్రాయాలు అభ్యుదయకవులకు శిరోధార్యం అయ్యాయి. ఈ దృక్పథంతో చరిత్ర రచన సాగాలని వారు కాంక్షించారు గత చరిత్ర గమనాన్ని తీవ్రంగా గర్హించా రు. మహాకవి శ్రీ శ్రీ దేశ చరిత్రలో ఖండికలో "ఏ దేశ చరిత్ర చూసినా/ ఏమున్నది గర్వకారణం/ నరజాతి చరిత్ర సమస్తం/పరపీడన పరాయణత్వం/గతమంతా తడిసే రక్తమును/ కాకుంటే కాకుంటే కన్నీళ్ళతో"16 అని చెబుతూ యుద్ధం లో రక్త ప్రవాహాన్ని కన్నీటమయి గాధలను శ్రీ శ్రీ నిరసించారు. దండయాత్రలను గర్హిం చారు. గత చరిత్ర గమనాన్ని నిరసిస్తూ… "నరజాతి చరిత్ర క్రిక్కిరిసిన/ ప్రళయ సమర సంఘర్షణ/ జారిన వీరుల రక్తం/ ఆరని వనితల దుఃఖం"17అని చెబుతూ ఈ విధం గా అంటాడు.
కవిత విశ్లేషణ: గత చరిత్రలో యుద్ధాలు సంఘర్షణలు రాజ్య విస్తరణ కాంక్షతో అవినీతితో ఆధిపత్యం చెలాయించాలన్న లక్ష్యంతో రాజులు చేసిన యుద్ధాలే చరిత్రలో సాక్షాత్కరిస్తున్నాయి.ఆ యుద్ధంలో జారి ప్రవహిస్తున్న వీరుల రక్తం వీరుల మరణంతో ఆరని దుఃఖాగ్నితో అలమటిస్తున్న వనితలు మానవతా దృష్టితో ఆలోచిస్తే మనసులు ద్రవించిపోతాయి.మానవ చరిత్ర సారాంశాన్ని అంతటినీ అందుకే అనిశెట్టి తీవ్రంగా నిరసించాడు.
దాశరధి కూడా చరిత్ర రచనలు నిరసిస్తూ- "పెద్దల విద్యావంతుల/ తరతరాల బూజు ల/ వట్టి పాత గాజుల / విలువలు కల్పించి చెప్పే అబద్ధాల/ రాజాధిరాజు రాజుల/మార్తాండ తేజుల/ పురుషత్వపు పరిషత్వపు/అల్లిబిల్లి అల్లిక బిగి కథలు"18గురించి వివరిస్తూ- అభ్యుదయ కవి మనిషి శ్రమ విలువను గుర్తించి కీర్తిస్తాడు. నూత్న మానవుని కోసం సరికొత్త సమాజం కోసం అని చెప్పడం జరిగింది. "మీ ముందున్నది ప్రజ/ నీ వెనుకున్నది రుజ"19 అంటాడు.
శ్రీ శ్రీ మహాప్రస్థానం గీతంలో చెప్పిన- “ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన/ సోదరులారా చావండి/ నెత్తురు మండే శక్తులు నిండే/ సైనికులారా రారండి"20 అనే భావానికి అనిశెట్టి పంక్తులు భాష్యం లాగా ఉన్నాయి. అనిశెట్టి అగ్నివీణ ఖండికలోని ఐదు ఖండికలు ప్రత్యేకించి ఆయనకున్న చారిత్రక అవగాహన నిరూపిస్తున్నాయి. "మా తల్లి పురా జగత్తు/ నా పేరు భవిష్యత్"21అంటాడు. "తల్లి గతానికి తాను భవిష్యత్తుకు సంకేతాలు. తల్లి సంప్రదాయ జగత్తుకి తాను అభ్యుదయ దృక్పథానికి ప్రతీకలు అన్న విషయాన్ని సూచించాడు.
5. దేశభక్తి తత్పరత:
అనిశెట్టికి మాతృదేశాభిమానం మెండు.అగ్నివీణలో మాతృసంగీతం ఖండికలు అన్నీ ఇందుకు తార్కాణాలు. భరతమాతను ప్రశంసిస్తూ "పాల పొదుగు నా తల్లీ/ ప్రాణదాత నా తల్లీ"22 అని చెప్పడం జరిగింది. జాతీయ ఉద్యమం తొలినాళ్లల్లో 1907 సంవత్సరం ఏప్రియల్ నెలలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేసినప్పుడు ఆయన ఉపన్యాసాలను చిలకమర్తి అనువదించాడు. ఉపన్యాసాలు చివరి రోజున అప్పటి భారత దేశ స్థితిని కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ "భరతఖండంబు చక్కని పాడియావు "అనే పద్యాన్ని పశువుగా చెప్పాడు ఆ పద్యం అప్పట్లో తెలుగు ప్రజల నాలుకలపై నాట్యం చేసింది. పద్య ప్రభావంతోనే అనిశెట్టి భరతమాతను పాలపొదుగుగా వర్ణించాడనడం వాస్తవం.
పాలపొదుగు సంపదకు సంకేతం. మన దేశం సంపన్న మైనదే. మన సంపదను పరాయి పాలకులు దోచుకున్నందువల్లే మనకు ఈ దుస్థితి సంభవించింది భరతమాతను ప్రాణదాతగా వర్ణించడం వల్ల అనిసెట్టి దేశభక్తి విదితం అవుతుంది. భారతదేశం పరాయిపాలకుల వశం కావడం వల్ల వారు దోపిడీ గురైంది భరతమాత దైన్య స్థితి వర్ణిస్తూ- "తాడిత వడనా తల్లీ/ పీడిత హృదయా! తల్లీ" 23అంటూ నరులను వర్గాలుగా చీల్చే కులమత సంకుచిత తత్వాలను కూడా ఆయన ఈసడించారు.
6. పారతంత్ర్య అధిక్షేపన:
పారంతం త్రయం లో కూరుకు పోయిన భారతీయ సోదరులను అధిక్షేపిస్తూ - "పరుల ఇంటి అరుగు పైన పవళించిన పాంద సఖా!/ ధర విదల్చి చిర బంధన జరామరణ చింత యేలరా" 24 అని చెబుతూ తన ఆవేదనను వ్యక్త పరిచారు.
కవితా విశ్లేషణ: పరాయి పాలకుల చేతుల్లో బంధించబడ్డ భరతమాత దుస్థితిని ఆలోచించక బాటసా రుల్లా పరుల పంచలో పడి ఉన్న భారతీయులను అదిక్షేపించాడు. భరతమాత బంధాలను ఛేదించమని ప్రబోధించాడు. పరాయి పాలనలో కుమిలిపోతున్న దేశ దుస్థితిని వివరిస్తాడు. కదిలి రండోయి ఖండికలో- “జన్మహక్కును/స్వతంత్రాన్ని/ గెలుచుకోండోయ్/నిలుపుకొండోయ్" 25 అని ప్రజల్ని ప్రే రిపించాడు.
అనిశెట్టి స్వాతంత్రోద్యమంలో ప్రజలతో మమేకం తో పంచుకుంటానని చెబుతూ- “మీతోనే ఉంటాను/మీతోనే వస్తాను/ అడుగడుగునా మీకు అండగా నిలుస్తాను"26 అని ప్రతిజ్ఞ చేశాడు. స్వాతంత్రోద్యమం కోసం పోరాడే ప్రజానీకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నానా బాధలకు గురి చేసింది.
కవిత విశ్లేషణ: పోరాడే వారితో కలిసి జయభేరి మోగిస్తానంటాడు. అడుగడుగునా ఆకాశం దగ్గరేటట్లు స్వాతంత్ర కాంక్షతో నివదిస్తానంటాడు. కవి నేను అనే పదాన్ని మమేకంతో స్వాతంత్ర ఉద్యమానికి సంకేతంగా ప్రయోగించాడు. ఆ విషయాన్ని వివరిస్తూ- "నేనెవరా! స్వాతంత్రోద్యమాన్ని/ ముందుకు నడిపే జెండా!/ మా నిర్భయ జీవితాన్ని/ మ్రోగే స్వేచ్ఛా గీతం" అంటాడు. అమరహృదయం నేను అని స్వాతంత్ర్య సమరాభిలాషను వ్యక్తపరిచాడు. పై పంక్తుల వల్ల అలిశెట్టిలో బలీయంగా ఉన్న స్వాతంత్రోద్యమకాంక్ష అవగతం అవుతుంది.
7. వీరావేశం-విప్లవ ప్రబోధం:
అనిశెట్టి పరాయి పాలన చేధనకు, స్వాతంత్ర్య సాధనకు వీరావేశంతో విప్లవ ప్రబోధయం చేశాడు శత్రువులైన బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు పురాదాస్యాన్ని పోగొట్టేందుకు- "పుడమి నిండ నీ నెత్తురు/ పుష్కలముగా చిమ్మర!/ పురాదాస్య పరాభవము/ పూర్తిగా కడిగేయరా!” అంటాడు. భరతమాత దాస్య విముక్తికి రక్తాన్ని చిందించమన్నాడు. పురాదాస్య పరాభవాన్ని రక్తంతో కడిగేయమని వీరావేశంతో ప్రబోధం చేశాడు. ప్రజల హక్కులను హరించి బందీలుగా చేస్తున్న బందిఖానాలనుబద్దలు కొట్టమని వీరావేశంతో - "ఉక్కు బంధిఖానాలను/ ముక్కలు చేయాలి రా!/ గడియ సేపు కాలమాపి/ గత కాలం మార్చరా" అంటాడు.
ప్రజలు దీక్షతో ఉద్యమాన్ని నిర్వహిస్తే కలగమనాన్ని సైతం నిలువ గలరు పరాయి పాలన బాధలతో కూడిన గతకాలపు గమనాన్ని మార్చగలదు. బ్రిటిష్ వారి దోపిడీ విధానం వల్ల భరతమాత ఎంత హృదయ విదారక వేదనకు గురైందో వ్యక్తం అవుతుంది భరతమాత పరాయి పాలకుల చేతుల్లో బాధలను అనుభవించే దుస్థితికి కారణం ఎవరని నిలదీసి ప్రశ్నిస్తూ… "అమ్మా అమ్మా నీ యెద/ కుమ్మినది ఎవరే తల్లి/ అమ్మా అమ్మా నీ తను / నమ్మిన దె వరే తల్లీ"అంటారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన ద్రోహులు ఆనాటి భారత దేశపు రాజులు వారిలో వారుకున్న అంత కలహాలు మూలంగానే భారతదేశం బ్రిటిష్ వారు హస్తగతమయింది,అవమానాలు గురైంది భరతమాత శక్తిని వివరిస్తూ… "ప్రళయశక్తి నా తల్లీ/ విలయ కాళి నా తల్లీ"అంటాడు. ప్రళయం విలయం సర్వ. వి నాశనానికి సంకేతాలు. భరతమాత ప్రళయ శక్తిగా,విలయ కాళిగా పరాయి పాలకులను సర్వనాశనం చేస్తుందని హెచ్చరిక చేశాడు. భరతమాతను ఊరడి స్తూ… "తల్లడిల్లకు తల్లి! నీ/ తనయులు పగ పూనారు"అంటాడు. భరతమాత బిడ్డలైన భారతీయులంతా పరాయి పాలకుల పట్ల పగ పూనారు. వారిని ఉరిచిచ్చులుగా ముట్టడిస్తామని భరతమాతను ఓదారుస్తాడు.ఆమెను ఆశీర్వదించమని వేడుకొన్నాడు. దేశాభిమానంతో అప్పటి భారతదేశ జనాభా 40 కోట్లు. అనిశెట్టి విశాలదృక్పథంతో భారతీయులందరి విప్లవ కంఠం నా గీతం అనడం అనిశెట్టి మాతృదేశాభిమానానికి నిదర్శనం.
8. బానిసత్వ నిరసన:
బానిసత్వం నిర్మూలన కవుల ఆశయం. భారతదేశంలోనే కాదు ఎక్కడ బానిసలు ఉన్న సుతారము అంగీకరించమని అభ్యుదయ కవులు చాటారు. అనిశెట్టి పారతంత్రం వల్ల సిద్ధించిన స్వాతంత్ర్యాన్ని నిరసిస్తూ… "నిర్మూలన కోసం వీరావేశంతో ప్రజానీకాన్ని ప్రబోధించాడు. ఈ వాక్యాలపై ఉరిపండా అప్పలస్వామి మనోగతం మనకు అవగతం అవుతుంది. తరతరాల దాస్యాన్ని చావు బ్రతుకుల మధ్య చెరసాలుగా అభివర్ణించాడు. బానిసత్వాన్ని నిరసించాడు. అనిశెట్టిలో జాతీయ ఉద్యమ స్ఫూర్తి స్వాతంత్ర కాంక్ష ఉన్నాయి. దేశాభిమానంతో, దేశా భిమాన తత్ప రత తో పారతంత్రియాన్ని దహించమని ప్రజల్లో జాతీయ ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడు. పార తంత్రాన్ని పటాపంచలు చేయాలన్న ధ్యేయం తో ఉద్యమ సారధు లతో మమేకం చెంది….ప్రతిఘటించారు. అనిశెట్టి శాంతికాముకుడు శత్రుసేనలను చీల్చి చెండాడేందుకు నేను కూడా నడుస్తానంటాడు. స్వాతంత్ర సేననివహంతో తాదాత్మ్యం చెంది భుజం భుజం రాసుకుంటూ చేయి చేయి కలుపుకుంటూ ముక్త కంటనాదంతో నడుస్తానంటాడు. బానిసత్వ నిర్మూలన కోసం పోరాడే వారికి అండగా నిలుస్తాను అంటాడు కవి. తన ప్రజాపక్షపాతాన్ని చాటాడు తరతరాలుగా సాగుతున్న దాస్యం దగ్ధమవుతుందని శాంతి సహనాలతో కూడిన మన ఆదర్శం అగ్నిగా దహిస్తుందని అనిశెట్టి ఆకాంక్ష.
9. దోపిడీ నిరసన:
బ్రిటిష్ వారి కుటిల తంత్రాన్ని విభజించి పాలించే విధానాన్ని దోపిడీ తత్వాన్ని నిరసిస్తూ.. విభజించి పాలించే తత్వాన్ని నిరసించాడు. స్వాతంత్ర్య దీక్షాకాంక్షతో ప్రజలందరినీ చైతన్య పరిచాడు. పారతంతర్యపు బాధలను చూచి హృదయం ఆక్రోశభరితమైంది. స్వాతంత్ర్య దీక్షాబద్ధుడై దేశీయల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించాలన్న కాంక్షతో తన గీతం మృతవీరుల సమాధుల్లో మ్రో గుతుందని హృదయాలను చీల్చుకుందని చెప్పాడు అనిశెట్టి.స్వాతంత్రోద్యమంతో మమేకం చెందిన వ్యక్తి ఆయన కవిత్వంలో ఉత్తమ పురుష ఏకవచనం ప్రయోగం బహువచనానికి సంకేటం. అస్వతంత్రమైన బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు అన్న విశ్వనాథ భావన ఆధారం చేసుకుని అనిశెట్టి మన స్వాతంత్ర్యాన్నిహరించిన శత్రువులను బడబాగ్ని దహిస్తే బాగుండు నన్న వర్ణన చేశాడు.పామరులను హింసించే పాలకులను సంహరించాలన్న కక్షతో…. విప్లవ ప్రభోదం చేశాడు. తొలుత శత్రువుల కోటలను బడబాగ్ను లు దహిస్తే బాగుండును అన్నాడు. పిదప వీరత్వాన్నిరెచ్చగొడుతూ. పౌరుషాన్ని ప్రజ్వలింప చేసి వీరులను ముందడుగు వేసేలా చేసి పునాది రాయిగా నిలబడ్డాడు.మరో అడుగు ముందుకు వేశాడు. ధైర్యంతో గుండె నొ డ్డి శత్రు సింహాసనాన్ని బెదిరించమన్నాడు. తుపాకీ గుండ్లతో దేహం తూట్లు పడినా ధూళి అ యిన కోటపై జెండా పెకలించి తెమ్మని వీరావేశంతో విప్లవ ప్ప్రబోధం చేశాడు. శత్రు జెండా కోట పై నుంచి తీసేసి నపుడు,సింహాసనాన్ని పెకలించి నపుడు ,శత్రువులు పీడ విరగడవుతుంది. స్స్వాతంత్య్రం లభిస్తుంది.స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు చేసే త్యాగాలు వృధా కావని స్వాతంత్ర ఫలం సిద్ధిస్తుందని క్రాంత దర్శనత్వంతో అనిశెట్టి ఆకాంక్ష అక్షర సత్యం అయింది.ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా అనిశెట్టి వంటి స్వాతంత్ర్య కాముకత గల ఆధునిక కవులు అందించిన స్ఫూర్తి వల్ల మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది.
10. అనిశెట్టి కవిత్వం- ఆకలి చిత్రం:
మానవతా దృక్పథాన్ని పరిపూర్ణంగా జీర్ణించుకున్న సుకుమార హృదయుడు అనిశెట్టి మనదేశంలో సంభవించిన కరువు కాటకాలకు ఆయన హృదయం స్పందించింది.ఆకలితో అలమటించే ప్రజల గోడు ఆయన మనసును కలచివేసింది. 1943లో బెంగాలులో సంభవించిన దారుణమైన కరువు ప్రభావానికి దాదాపు 13వేల మంది మరణించారు ఆ సంఘటన విని అనిశెట్టి మనసు వికలమైంది ఆగ్రహృదయుడై "అయ్యో మన బెంగాల్ ప్రజా" అనే కవితా ఖండికను రాశాడు. బెంగాలు కరువుకు ఆహుతి అయిపోతున్న ప్రజలను రక్షించేందుకు మానవత్వం, కరుణ, జాలి ఉన్న ప్రజానీకాన్ని వేడుకుంటూ కన్నులున్న కరుణ ఉన్న అన్నలారా మేలుకోండి అంటాడు.సమాజంలో పరిసరాలను పట్టించుకోని స్వార్ధపరులు ఎందరో ఉన్నారు వాళ్లంతా మదాందులు. అటువంటి వాళ్లకు చెప్పిన ప్రయోజనం లేదని కరుణ జాలి ఉండి కూడా స్తబ్దంగా నిద్ర ఉన్న సోదరులను మాత్రమే అనిశెట్టి మేలుకొలుపుతారు.వాళ్ళు మేలుకుంటే ప్రయోజనం ఉంటుందని ఆయన ఆశ.ఉజ్వల జ్ఞాన జ్యోతిగ! ఉదయించే గదా తూర్పు అని చెప్పాడు. మానవ వృక్షం పండిన! మధుర ఫలం కదా జాతీయస్థాయిలో పేరెన్నికగన్నది బెంగాల్ రాష్ట్రం. అది ప్రపంచ మేధావులకు నిలయం. అనిశెట్టి ఆ విషయాన్ని ప్రశంసించాదు.బంకించంద్ర చటర్జీ ,రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందరో ప్రముఖులు జన్మించిన రాష్ట్రం బెంగాల్. వారు తమ జ్ఞాన జ్యోతి చేత ప్రజలకు వెలుగును ప్రసాదించిన మహనీయులు. పాశ్చాత్య దేశాల్లో ఆ జ్ఞాన జ్యోతులు ప్రకాశించాయి.అట్టి మహోన్నతమైన బెంగాల్ రాష్ట్రం ఆకలితో అలసిపోయిందని అనిశెట్టి ఆవేదన వ్యక్తపరిచాడు.ఆ తీవ్రమైన బెంగాల్ కరువు సంభవించడానికి కారణం రెండవది యుద్ధం. యుద్ధం వలన కరువు ,కరువు వలెనే విపత్కర స్థితి సంభవించిందని ఆయన వివరించాడు. కరువు సందర్భంగా మసూచి వ్యాధి మహమ్మద్ల వ్యాపించింది అది మనుషుల ప్రాణాలను బలి కొన్నదని వర్ణిస్తూ… ఆ వ్యాధి సోకిన వారు బ్రతికి బయటపడడం దుర్లభమని అనిశెట్టి పై వర్ణన ద్వారా సూచించాడు.ఆ కరువు వల్ల నవనవలాడే పంట పొలాలే ఎడారులుగా మారిపోయాయి. మానవ కంకాలాలు గుట్టలు, గుట్టలుగా పడి ములుగుతున్నాయి అవి ఎలుగెత్తి అరుస్తున్నాయి అని ఆక్రిసించాడు.
వ్యధతో ఆవేదనతో మరణించే మానవ కంకణాలు ఎర్రనిత నేత్రంతో కలయజూ స్తున్నాయి అనడం వల్ల వాటి మరణానికి కారణమైన కరువు కాటకాల వ్యవస్థను దహిస్తాయిన విషయం విదితమవుతుంది.ఏ దేశ చరిత్రలో కూడా అప్పటివరకు అంతటి ఘోరమైన కరువు సంభవించలేదనిఅనిశెట్టి అభిప్రాయం. భవిష్యత్తును గూర్చి బంగారు కలలుకనే పసికందులు ఎందరో ఆకలి తీవ్రతతో మరణించారు. వారి కలలన్నీ కల్లలు అయ్యాయి.వారంతా గాలిలో రోదిస్తూ ఈ జగత్తును శపిస్తున్నారని అని చెప్పి అనిశెట్టి ఆవేదనతో చెప్పాడు. ఆకలితో అలమటిస్తున్న ప్రజాక్షోభతో ప్రకృతి కంపిస్తుంది అని చెబుతూ ప్రజాక్షోభతో పర్వతాలు నదులు తుళ్ళిపడ్డాయి అనడం వల్ల ఆక్షోభ ఎంత తీవ్రమైనదో అవగతం అవుతుంది. మూడు లక్షల మంది ప్రాణాలను బలుగొన్న క్షామ దేవత దౌస్యం వల్ల పర్వతాలు నదులు కూడా చెల్లించాయి అనడంలో అతిశయోక్తి లేదు అన్నాడు. కరువు రక్తసి మారుమూల గ్రామాలకు వ్యాపించి ఆకలి చిచ్చుతో దహించింది. ప్రజలంతా ఈగలుగా ఈగలుగా నశించారు.చివరగా కరువు రక్తసి తీవ్రతను వివ రిస్తూ కరువు రాక్షసి కాఠిన్యం తో తాండవిస్తుండడం వల్ల ఎంత వినాశనం జరిగిందో వి శ దమవుతుంది.అందుకే అనిశెట్టి కన్నులు ఉన్న కరుణ ఉన్న అన్నలను మేలుకోమని కరువు రక్క్కసిని పార్రద్రోలి ప్రజలను రక్షించమని పదేపదే వేడుకొన్నాడు. బెంగాల్ కరువు ఆకలి తీవ్రతను చిత్రిస్తూ అనిశెట్టి రాసిన మరో ఖండిగా "ఎందుకు తల్లిలో కూడా"ఇంత వివక్ష అని భాధ పడ్డాడు. ఆకలిని పులితో ఉప మించి దాని తీవ్రతను వ్యక్తపరిచాడు. ఆకలితో అలమటించే బిడ్డలు మెడ చుట్టూ శపిస్తున్న పాశములు అనడం ఆనాటి కఠోర దుస్థితి ద్యోతకమవుతుంది.ఆకలి తీవ్రతను వివరిస్తూ "పగులు పగిలిన గాజు పేటిక" అనే కంటిలో కూడా ఆకలి తీవ్రతను వివరిస్తూ.. బెంగాల్ కరువు ప్రభావంతో కనీవినీ ఎరుగని ఆకలి తీవ్రతను అనిశెట్టి కళ్ళ కట్టినట్లు వర్ణించాడు.కలియుగంలోనే ఎంతటి ఘోరమైన ఆకలి తీవ్రత సంభవించిందని భావించాడు. 1952 లో అనావృష్టి వల్ల రాయలసీమలో ఘోరమైన కరువు సంభవించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అనిశెట్టి ఆకలి పాటను రాశాడు. అందులో మానవత్వం ఉన్న తోటి మానవులకు సాటి సోదరులకు విన్నవిస్తూ వ్రాశాడు. కవి వాక్కు కొంత ప్రభావం ఉంటుంది. కవి తన ప్రబోధం చేత స్పందించే ప్రజలు ఉంటారు.కవి సామాజిక సమస్యలను తీవ్రతను సామాన్యులు కంటే ముందుగా దృష్టి సారించి అవగతం చేసుకొని తన కవిత్వం ద్వారా చాటి చెబుతాడు.మానవతా దృక్పథం సామాజిక స్పృహ గల పాఠకులు వెంటనే స్పందిస్తారు. అదే కవిత ప్రయోజనం అందుకే ఆ మానవతా దృక్పథం ఉన్న సోదరులకు మనవి చేశాడు.ఆ సామాజిక స్పృహ గల మానవులనే కరువు దుర్గతి నీ కనమని వేడుకున్నాడు.
11. ముగింపు:
తిలక్, కుందుర్తి, రావిశాస్త్రి, రారా, ఆరుద్ర వంటి రచయితలు రెండు మూడేళ్లు అటు ఇటుగా పుట్టి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. సివి సుబ్బారావు అనిశెట్టిసుబ్బారావు జీవిత సత్యాన్ని పరిశోధించి సిద్ధాంత గ్రంథం రాశారు. 2007లో మొదటిసారి ఈ గ్రంథం అచ్చయింది. సి నారాయణ రెడ్డి ఆవంత్స సోమసుందర్, కడియాల రామ్మోహన్ రావు ఈ గ్రంథానికి అప్పుడే ముందుమాట రాశారు. ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు మరి కొంత సమాచారంతో అనిశెట్టి డబ్బింగ్ సినిమా పాటల విశ్లేషణలను అదనంగా చేర్చి ఆయన శతజయంతి సందర్భంగా పునర్ ముద్రణ చేయడం అర్థంఅంతమైన జేజేలు పలకడమే అవుతుంది. అభ్యుదయకవి ఎంత విశాలమైన ప్రపంచాన్ని ఎంత విస్తృతమైన జీవితాన్ని వస్తువుగా చేసుకుంటారో సుబ్బారావు అనిశెట్టి మీద పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ కవి రచనలు భావితరాలకు ఆదర్శం. "ఈ ప్రపంచపు కాపురానికి/ ఆప దొస్తే నీవు, నేను ప్రాణమిచ్చి పాటుపడ్డామోయి” అన్నారు అనిశెట్టి. జాతీయఉద్యమంలో నీ ప్రతీఘట్టం తెలుగు జాతీయోద్యమ కవిత్వంతో ప్రతిబింబించింది. మహామహుల ప్రసంగాలు మహా నాయకుల చైతన్య పూరిత పర్యటనలు స్వాతంత్ర సమరానికి ఎంత మోసం ఇచ్చాయో అంత స్ఫూర్తిని కలిగించింది జాతీయ ఉద్యమ కవిత్వం.
12. పాద సూచికలు
- సుబ్బారావు, అనిశెట్టి అగ్నివీణ ఆరంభగీతం
- అగ్నివీణ పుట 10
- అగ్నివీణ పుట 89
- అగ్నివీణ పుట 24
- అగ్నివీణ పుట36
- అగ్నివీణ పుట 36
- అగ్నివీణ పుట 72
- తీయని కల ఖండిక 1952 మే ఉదయని పక్ష పత్రిక.
- మహాప్రస్థానం ప్రతిజ్ఞ ఖండిక
- తీయని కల 1952 మీ ఉదయని పక్షపత్రిక
- అగ్ని వీణ పుట 88
- అగ్ని వీణ పుట92
- తీయని కల 1952 మే ఉద యని పక్ష పత్రి క
- The random House dictionary (1976) page 628.
- కమ్యూనిస్టు పార్టీ పుట 3మూలం మార్క్స్ ఏంజిల్స్(అను) రామచంద్ర రెడ్డి, రాచ మల్లు
- శ్రీ శ్రీ మహాప్రస్థానం
- అగ్నివీణ పుట 58.
- అగ్ని వీణ పుట72
- అగ్ని వీణ పుట 76
- శ్రీ శ్రీ మహాప్రస్థానం పుట 18
- అగ్ని వీణ పుట 43
- అగ్ని వీణ పుట 80
- కవితా కదంబం సంకలనం అభ్యుదయ భారతి 1980 నరసారావు పేట
- అగ్ని వీణ పుట 80
- అగ్ని వీణ పుట 80
- అగ్ని వీణ పుట 80
13. ఉపయుక్తగ్రంథసూచి
- కృష్ణమాచార్యులు, దాశరథి. రుద్రవీణ. (రుధిరదీపిక ఖండిక). శ్రీరామా అండ్ కో, తెనాలి. 1950.
- జనార్దనరావు, కొంపెల్ల (సంపా.). ఉదయని, పక్షపత్రిక. మద్రాసు. (మే, 1952).
- రామచంద్ర రెడ్డి, రాచమల్లు (అను.). మార్క్స్ ఏంజిల్స్ (మూ.). కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. నవచేతన పబ్లిషింగ్ హౌస్. 2004.
- లక్ష్మీకాంతం, పింగళి. ఆంధ్రసాహిత్యచరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్. 1974.
- శ్రీశ్రీ. మహాప్రస్థానం, విశాలాంధ్ర ప్రబ్లిషింగ్ హౌస్, విజయవాడ. 2012.
- సుబ్బారావు, అనిశెట్టి, అగ్నివీణ. చేతనసాహితి, అభ్యుదయప్రచురణ. నరసరావుపేట. 1949.
- సుబ్బారావు, పి.వి. “అనిశెట్టి సాహిత్యానుశీలనం” (సిద్ధాంతగ్రంథం.), శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శతజయంతి ప్రచురణ, అనంతపురం. 2022.
- Berg Flexner, Stuart. The Random House Dictionary, Random House, New York. 1976.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.