AUCHITHYAM | Volume-5 | Issue-7 | June 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. పురాణేతిహాస జానపదగేయకధలు: పాత్రల విశ్లేషణ

డా. కె. ధనశ్రీ
తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, నంద్యాల,
నంద్యాల, ఆంధ్రపదేశ్.
సెల్: +91 7386893278, Email: parameswarg@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
జానపద గేయ గాధలు పాత్రల విశ్లేషణ ఈ వ్యాసానికి ప్రధాన భూమిక. ఈ వ్యాసంలో రెండు గేయ కధలను తీసుకున్నాను. మొదటిది ఇతిహాసం అయిన రామాయణంకు సంబంధించినది. ఈ గేయ కధలో ఒక స్త్రీకి వివాహం చేసేటప్పుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొవాలి అనేది సూచిస్తూంది. ఇక రెండవ పురాణగేయ కధ ఎలాంటివి అంటే గురువు-విద్యార్ధులకు సంబంధించినదిగా గుర్తించవచ్చు. ఈ గేయ కధలో గురువు-విద్యార్ధి మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని వివరిస్తుంది. ఈ వ్యాసం రాయడానికి ప్రముఖమైన పరిశొధన గ్రంధాలను ఆధారంగా చేసుకునీ, అందులోని కొన్ని అంశాలను తీసుకునే వాటిని నేటి సమాజానికి అన్వయిస్తూ మంచి, చెడు చెప్పడం, అంతే కాకుండా విశ్లేషణాత్మక పద్దతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: జానపదులు, గేయ కధలు, సీత పూర్వజన్మ రహస్యం, వివాహం, గురువు, విద్యార్ధి, లక్ష్యాన్ని చేరుకొవడం.
1. ఉపోద్ఘాతం:
కథను గేయంలో మలిస్తే అది గేయ కథ అవుతుంది. వీటినే కథా గేయాలు, పాట కథలు, చిత్ర కథా గేయాలని అంటారు. ఈ పేర్లలో బాగా ప్రాచుర్యాన్ని పొందిన పేరు ‘‘గేయ కథలు’ మాత్రమే. జానపద విజ్ఞానం సముద్రం వంటిది. దీని నుండి చీలి సహజంగా ప్రవహించే ఒక పాయ గేయ కథ.
2. గేయ కథ నిర్వచనం:
తరతరాల సంప్రదాయాన్ని నిల్పుకుంటూ, ప్రాధమికిమైన సరళ కథా నిర్మాణాన్ని కల్గిన మౌఖిక ప్రసారంలో ఉన్న గేయాత్మక కథనం ఉన్న గేయగాధే గేయకథ(1) అని నిర్వచించారు.
‘‘జానపదులు’’ ఎటువంటి అంశాన్ని అయినా తీసుకొనీ, దాన్ని ‘‘గేయ కథలో’’ పాడి చెప్పితే దాన్ని గేయ కథగా మనం గుర్తించవచ్చు. జానపదులు అంటే ఏదైనా ఒక విషయంలోనైనా భావసామ్యం కలిగిన జలసముదాయం అని అర్ధం. వారు ఆటవికులు కావచ్చు, పల్లియలు కావచ్చు, చివరకు నగర వాసులైన కావచ్చు. వారు వీరనక అందరిలో జానపదులు వున్నారని సారాంశం. (2)
పురాణ, ఇతిహాస సంబంధమైన ఘట్టాల్ని పాటలుగా కట్టి గానం చేసుకునేవారు జానపదులు. కాబట్టి పురాణ, ఇతిహాస ఘట్టాలు ఒక్కో గేయ కథలో చూడవచ్చు. ఈ వ్యాసంలో నేను రెండు గేయ కథలను తీసుకున్నాను. వాటిని పాడినవారు మౌలాన - ఇతను చిత్తూరు ప్రాంతానికి చెందినవాళ్ళు. ఈ గేయ కథ అంశం ఇతిహాసం అయిన రామాయణమునకు సంబంధించిన సీత బంతి ఆట గేయ కథ. ఇక రెండవది పురాణాలకు సంబంధించిన గేయ కథ. ఈ గేయ కథ కచుడు సంజీవని విద్య నేర్చుకోవడం, ఈ గేయ కథలో ప్రధాన అంశం. ఈ గేయ కథ పాడినవారు శ్రీరాములు రెడ్డి - కడప ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు.
2.1 సీత బంతి ఆట గేయ కథ:
‘‘బాల ప్రాయపు సీత బాల సఖియాలతో చిన్నమ్మీ
ఆటలన్నీ ఆడు, పాలన్నీ పాడు చిన్నమ్మీ
అంత యొకనాడు తన అంత:పురములోన చిన్నమ్మీ
బంతాట ఆడగా ఆ బంతి చిన్నమ్మీ
దొరలుకుంటూ పోయి శివధనువు క్రింద జేరే చిన్నమ్మీ
అన్యులెవరూగాని ఆ బరువు ధనువును చిన్నమ్మీ
పిసిరంతయును కూడ కదలింపగాలేరు చిన్నమ్మీ
సాక్షాత్ లక్ష్మియేకద ఆ బాలసీత చిన్నమ్మీ
ఆందుకే ఆ బిడ్డ శివధనువు రధమును చిన్నమ్మీ
అవలీలగా నెట్టి ఆ బంతి చేపట్టె చిన్నమ్మీ
అంతట ఆ లీల కళ్ళార జూసిరి చిన్నమ్మీ
. . . . . . . . . . . .
జనక మహీపతి జానకిని దరిచేర్చి చిన్నమ్మీ
తన ముద్దుల పట్టి ఆదిలక్ష్మిjెూ అని చిన్నమ్మీ
మరి యెంతగానో ముద్దాడెనంత చిన్నమ్మీ
అందుకే ఆ విల్లు నెక్కు పెట్టినవారే చిన్నమ్మీ
ఆమెకు పతియౌను భావికాలములోన చిన్నమ్మీ
అనెను తండ్రి జనక మహారాజు చిన్నమ్మీ (3)
2.2 గేయ భావము:
సీత తన బాల్యంతో బంతి ఆట ఆడుకుంటూ ఉండగా ఆ బంతి శివధనస్సు క్రిందకు వెళ్ళుతుంది. ఆ బంతి ఆమె శివధనస్సు ఎత్తి తన చిట్టి చేతులతో తీసుకుంటుంది. ఆ దృశ్యం చూసిన తండ్రికి, తన మనస్సులో ఒక ఆలోచన పుడుతుంది. ఈ శివధనస్సు ఎవ్వరూ ఎత్తలేరు, అలాంటిదాన్ని ఈ అమ్మాయి ధనస్సునే ఎత్తినది అంటే ఈ అమ్మాయి సామాన్యురాలు కాదు. ఈమె వివాహ విషయంలో ఈ శివధనస్సు ఎవ్వరు అయితే విరుస్తారో వారికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలని తండ్రి జనకుడు నిర్ణయించుకుంటాడు. అని ఈ గేయ కథ అర్ధం.
2.3 సీత పూర్వ జన్మ రహస్యం:
ఈ గేయ కథలో ఉన్న సీతకు, పూర్వ జన్మ కథ ఒకటి ఉంది. ఈమె పూర్వ జన్మంలో వేదవతి. ఈమె మహావిష్ణువును వివాహం చేసుకొవాలని కఠోరమైన తపస్సు అడవిలో చేస్తూ ఉంటుంది. అపుడు రావణుడు ఆ మార్గంలో పోతూ ఆమెను చూస్తాడు. వెంటనే వేదవతిని పలకరించీ, నిన్ను నేను ఇష్టపడ్డాను. కాబట్టి నన్ను వివాహం చేసుకొమని అడుగుతాడు. అపుడు ఆమె ఇలా అంటుంది. నేను మహావిష్ణువును మాత్రమే చేసుకంటాను. ఇంక ఎవ్వరిన్నీ పెళ్ళి చేసుకొను అని రావణుడితో చెపుతుంది. రావణుడు ఆమె చెప్పిన మాటలు వినకుండా, ఆమె శరీరాన్ని తాకుతాడు. వెంటనే ఆమె యోగా శక్తితో అగ్నిని పుట్టించి దానిలో కాలిపొతుంది. బూడిద అయిపోతుంది. అయితే రావణునికి ఒక శాపం పెడుతుంది. తరువాతి జన్మలో నీ ఇంట చేరి నీ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాను అంటుంది. కానీ ఆ శాపాన్ని పట్టించుకోడు. ఆ బూడిదను ఒక పెట్టెలో పెట్టుకొని లంకకు వెళ్ళతాడు. అక్కడకు పోగానే ఆమె ఒక పెట్టెలో పాపగా మారిపోతుంది. ఆ పాపను చూసి లంకాధిపతి మిగితా అందరు ఆశ్చర్యమునకు లోనుఅవుతారు. లంకలో ఉన్న పెద్దలతో మాట్లాడి ఆ పాపను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలి పెడతారు. ఎందుకంటే లంకలో పెద్దలు అందరు ఆమె (పాప) ఇక్కడ ఉండటం వల్ల సామ్రాజ్యం నాశనం అవుతుంది. కాబట్టి ఈ పాపను దూరంగా వదిలి వేయండి అనీ పెద్దల సలహాతో రావణుడు ఆ పాపను సముద్రంలో వదలతాదు. ఆ పెట్టె సముద్రం నుండి కొట్టుకొనీపోయి భూమిలో దాక్కుంటుంది.
2.4 సీత - నామకరణం :
జనకుడు ఒక రోజు భూమి (పొలం) దున్నుతుండగా నాగలికి ఆ పెట్టె తగులుకొని పైకి వస్తుంది ఆ పెట్టె తెరిచి చూడగా పాప కనిపిస్తుంది. ఆ పాప నాగలి దున్నగా భూమిలో నుంచి పుట్టిందీ, కాబట్టి ఆ పాపకు జనక మహారాజు ‘‘సీత’’ అని ఆ పాపకు నామకరణం చేస్తాడు. అలా రామాయణంలో సీత కథను గమనిస్తే ఆమె అనుకున్న ప్రకారం రావణుడి ఇంట చేరి లంకా నగరాన్ని సర్వనాశనం చేసింది. ఆ కథను మనం రామాయణ కథలో గమనించవచ్చు. ఈ కథ జానపదులు మౌఖిక రూపంలో ఆ నొట, ఆ నోట మనకు వినపడుతూనే ఉంటుంది. సీతమ్మ అంటే జానపదులకు ఎంత ఇష్టవెూ వాళ్ళ గేయ కథలను బట్టి మనకు అర్ధమవుతుంది.
2.5 శివధనస్సు - పరిక్ష :
ఈ గేయకథలో జనకమహారాజు చాలా బుద్ధిమంతుడుగాను, తెలివివంతుడుగాను, కనిపిస్తాడు. అంతే కాకుండా దూరదృష్టి ఉన్నవాడుగా మనకు కనిపిస్తాడు. ఒక ఆడపిల్ల తండ్రి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో జనకుని పాత్ర ద్వారా మనకు ఆర్ధం అవుతుంది. సీత బాలు (బంతి ఆట) ఆట ఆడటం, ఆబాలు శివ ధనస్సు ఇందకు పోవడం, దాన్ని ఆమె ఒక చేతితో ఎత్తి, ఇంకొక్క చేతితో ఆ బాలు తీయడం ఆశ్చర్యానికి లోనుఅయ్యాడు. అంతే కాకుండా ఆమె ఆడిన బంతి ఆట ఆమె వివాహ జీవితాన్ని నిర్ణయించడానికి ఆధారం అయిందని చెప్పవచ్చు. జానకుడును ఆమె ఆట దీర్ఘాలోచనలో పడేసింది. ఈమె సామాన్య స్త్రీ కాదు. ఈమె ఒక శక్తి స్వరూపిణి, ఒక దేవత, మానవ శరీరం కప్పుకున్న భూమాత అని తనలో తానే ఆలోచించుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈమెకు వివాహం చేయాలంటే పెళ్ళికుమారులకు ఒక పరీక్ష పెట్టాలి. ఆ పరీక్ష ఏమిటంటే ‘‘శివధనస్సు’’ ఎవరు అయితే ఎత్తి బాణం వేస్తారో వారికే సీతను ఇచ్చి వివాహం చేయాలన్నీ నిర్ణయం తీసుకుంటాడు.
2.6 జనకుడు :
ఈ గేయ కథలో జనక మహారాజును గమనిస్తే ఒకటి మనకు అర్ధం అవుతుంది. ఒక స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో అంతా ఇచ్చారని చెప్పవచ్చు. నేటి తండ్రులల్లో కొంతమంది, తమ కుమార్తెలకు వివాహం చేయాలంటే, వాళ్ళ మానసిక, శక్తి సామర్ధ్యాలను పరిగణలలోకి తీసుకోవాలి. వాటిని ఆధారంగా చేసుకొనీ, ఈ గేయ కథలోని జనకునిలాగా తమ కుమార్తెలకు వివాహం చేయాలి. అపుడు వారి జీవితం ఏ ఒడుదుడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా బతుకుబండి సమాజంలో సాగిపోతుంది. కానీ నేటి సమాజంలో తండ్రులు తమ కూతురుకు వివాహం చేయాలంటే ఒకటి ఆలోచిస్తారు. పెళ్ళి కుమారుడుకు డబ్బు, ఆస్తి ఎంత ఉంది. మా అమ్మాయికి ఏమి నగలు పెడతారు అని అడుగుతుంటారు. కాని నిజానికి ఇవి కాదు చూడాల్సింది. పెళ్ళికొడుకు మన కూతురుకు మానసికంగా సరిపోతుందా లేదా అని ఆలోచించాలి. అలా ఆలోచించినపుడే ఇద్దరి జీవితం హాయిగా గడిచిపోతుంది. ఈ డబ్బు, ఆస్తి కొంతవరకు మాత్రమే మనుషులకు ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యం అమ్యాయిని అబ్బాయి అర్ధం చేసుకునే గొప్ప మనస్సు ఉండాలి. అది ఉందా లేదా అని తండ్రులు పరిశీలించాలి. అలా పరిశీలించినపుడు తమ కుమార్తెల జీవితం బంగారు బాట వేసినట్లు అవుతుంది. లేకపోతే అడవికాచిన వెన్నెల అవుతుంది.
ఈ కథలో సీత చాలా అదృష్టవంతురాలు అని చెప్పవచ్చు. తన మనస్సును తన శక్తి సామర్ధ్యాలను అర్ధం చేసుకునే తండ్రిని (జనకుని) పొందిందని చెప్పవచ్చు. తను పూర్వ జన్మలో (వేదవతి) మహా విష్ణువును వివాహం చేసుకొవాలని తపస్సు చేనింది. ఆ తపస్సు ఫలించినదని చెప్పవచ్చు. సీత అవతారంలో మహా విష్ణువు అవతారం అయిన శ్రీరాముడును వివాహం చేసుకుంది. తన తపస్సుకు తగిన ఫలితం పొందినదని ఈ కథలో సీత వివాహం ద్వారా మనకు అర్ధమవుతుంది. వివాహం ద్వారా మనకు అర్ధమవుతుంది. వివాహం అనేది ఎవ్వరితో ఎవ్వరికి బంధం అంటే ఏడడుగుల బంధం ఏర్పాటు చేయాలో ఆ దేవునికి బాగా తెలుసు. ఆ ప్రకారంగానే వివాహాలు జరుగుతాయనీ చాలామంది నేటి సమాజంలో నమ్ముతుంటారు. ఇది అక్షరాల నిజం అని నేను నమ్ముతున్నాను. తలరాతను ఎవ్వరూ మార్చలేరు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది.
ఆవిధంగానే ఈ గేయ కథలో సీతకు జరిగినదని గమనించవచ్చు. రావణుడు చాలా శక్తివంతుడు, బలవంతుడు, మాయాజాలం కలిగినవాడు, శివభక్తుడు. అయినా తను అనుకున్నది జరగలేదు. కర్మ ఫలితాలను బట్టి వివాహ జీవితాలు నిర్ణయించబడతాయని మనం కర్మ సిద్ధాంతాన్ని బట్టి అర్ధం చేసుకొవాలి. అదే గేయ కథలో సీతమ్మకు జరిగిందని మనం గుర్తించాలి.
నేటి సమాజంలో కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లలకు పెళ్ళి చేసేటప్పుడు మానసిక పరిపక్వత చూడకుండా మొక్కుబడి వివాహాలు చేస్తుంటారు. అలాంటి వివాహాలు వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతుంటాయి. విడాకులు తీసుకుని అమ్మగారి ఇంటికి రావడం, అక్కడ ‘‘సూటిపోటి మాటలు’’ అనిపించుకోవడం మానసిక వ్యధ, చివరికి ప్రాణత్యాగం చేయడంలాంటివి చేస్తూంటారు. ఇవన్నీ కూడా మన చుట్టుప్రక్కల సమాజంలో చూస్తూనే ఉంటాము. ఇప్పటికి అయినా మించిపోయినది లేదు. పరిస్ధితులకు అనుగుణంగా తండ్రులు మారి పిల్లలను అర్ధం చేసుకుని వారికి ‘‘చేదోడువాదొడుగా’’ ఉంటే పిల్లలకు మంచి తండ్రులం అయ్యాము అని తృప్తిని పొందుతాము. అలా కాకుండా ఒక మొరటివానిలాగా తండ్రులు తమ కుమార్తెల పెళ్ళిల విషయంలో ప్రవర్తిస్తే అటు కూతురు జీవితం, ఇటు మీ జీవితం నాశనం అవుతుంది. మొత్తం మీద సమాజంలోని తండ్రులు ఎలా ఉండాలంటే ఈ గేయ కథలోని ‘‘జనక మహారాజు’’లాగా ఉండాలన్న నా విన్నపం.
విద్య యొక్క ప్రాధాన్యం తెలిపే గేయ కథలు కూడా ఉన్నాయి. మచ్చుకు కచుడి గేయాన్ని పరిశీలిద్దాం.
3.0 కచుడు గేయకథ:
పూర్వకాలంబున తుమ్మెదా
దేవాసుర యుద్ధములు తుమ్మెదా
రాక్షసుల గురువు తుమ్మెదా
శుక్కరాచార్యులు తుమ్మెదా
సమరంలో చనిపోయిన తుమ్మెదా
రాక్షస వీరులను తుమ్మెదా
తన సంజీవని విద్యతో తుమ్మెదా
బ్రతికించెను తుమ్మెదా
అందువల్ల దానవులు తుమ్మెదా
అమిత బలము పొందెను తుమ్మెదా
నొప్పించిచుందిరి తుమ్మెదా
దానవుల దాడికి తుమ్మెదా
దేవతలు నిలువలేక తుమ్మెదా
ఆలోచనజేసిరి తుమ్మెదా
సత్యలోకమేగిరి తుమ్మెదా
బ్రహ్మను దర్శించి తుమ్మెదా
అసలు విషయమెరిగి తుమ్మెదా
ఆ బ్రహ్మ జెప్పెనే తుమ్మెదా
దానవుల గురువు తుమ్మెదా
శుక్రాచార్యుడు తుమ్మెదా
మిలోననొక్కరు తుమ్మెదా
గురువు సేవ జేసియు తుమ్మెదా
. . . . . . . . . . .
. . . . . . . . . . .
కుచుడు సంతోషించి తుమ్మెదా
ఆచార్యుని వద్ద తుమ్మెదా
సెలవు తీసుకొని తుమ్మెదా
పయనంబులయాడు తుమ్మెదా
దేవలోకమునబోవ తుమ్మెదా (4)
3.1 గేయ భావం:
దేవతలు లోక కళ్యాణం కోసం బృహస్పతి పుత్రుడు కచుడిని శుక్రాచార్యుల వద్ద సంజీవని విద్య నేర్చుకుని రమ్మని పంపుతాడు. చాలా తెలివిగా కచుడు గురువు శుక్రాచార్యుల వద్ద శిష్యునిగా చేరి, వారి మనస్సును మెప్పించి, వినయ విధేయలతో విద్యను అభ్యసిస్తాడు. ఒక రోజు రాక్షసులు కచుని మీద కోపంతో అతన్ని కాల్చి బూడిద చేసి, మత్తు పానీయంలో కలిపి శుక్రాచార్యులకు ఇస్తారు. ఆ విషయం తెలియని గురువు త్రాగేస్తాడు. ఆ తరువాత గురువు శిష్యునితో ‘‘శిష్యా నీవు నా గర్భంలోనే సంజీవని విద్య నేర్చుకో, ఆ తరువాత నా పోట్ట చీల్చుకుని బయటకురా, ఆ తరువాత నన్ను బ్రతికించు’’ అంటాడు. గురువు ఆదేశాను ప్రకారం ‘‘కచుడు’’ ఆ పనిని చేస్తాడు. ఆ తరువాత గురువు దగ్గర సెలవు తీసుకుని స్వర్గానికి పోయి ఆ సంజీవని విద్య తమ శిష్యులకు బోధించాడు. ఆ శిష్యులు ద్వారా దేవతలు తమ కార్యమును నెరవేర్చుకుంటారు. ఈ గేయకథ గురుశిష్యుల మధ్య ప్రేమ, అభిమానం, గౌరవం ఎలా ఉండాలో తెలియజేస్తుంది. అసూయ, ద్వేషం కలిగిన శిష్యుల మనస్తత్వం ఎలా ఉంటుందో, ఎలాంటి పనులు చేస్తారో ఈ గేయ కథ వివరిస్తుంది.
అ గేయ కథలు జానపదులు పాడుకోవడమే కాకుండా, మన పురాణలలో కూడా గమనంచబచ్చు. ఈ కథ శివ పురాణంలో (5) స్కంధ పురాణంలో గమనించవచ్చు. (6)
3.2 గురువు ఔన్నత్యం:
గురువు అంటే ఎలా ఉండాలో ఈ కథలోని శుక్రాచార్యుని పాత్ర ద్వారా మనం నేర్చుకోవచ్చు. గురువు అంటే శుక్రాచార్యులే అని మనం ఉదాహరణగా, ఆదర్శంగాను తీసుకొవచ్చు. శుక్రాచార్యుల వారి గొప్పతనం ఎంత పొగిడినా గాని తక్కువే అవుతుంది. ఎందుకంటే రాక్షస జాతికి గురువుగా ఉండీ, దేవతలకు సంబంధించిన వ్యక్తికి విద్య నేర్పడం అందరు మెచ్చదగినది అని చెప్వచ్చు. ఎందుకంటే రాక్షసులకు, దేవతలకు ఎపుడూ ఏదో ఒక విషయంలో వైరం జరుగుతూనే ఉంటుంది. రెండు జాతులవారికి అస్సలు పడదు. ‘‘పచ్చ గడ్డి వేస్తే బగ్గుమంటుంది’’. అనే సామెత ప్రకారం రెండు జాతుల వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా శుక్రాచార్యులవారు ఎంతో ధైర్యంగా, నేర్పరితనంతో కచుడిని తన శిష్యునిగా స్వీకరించి విద్య నేర్పించడం అందరు హర్షించదగిన విషయంగా మనం గమనించవచ్చు. గురువు తనలోని ఉన్న విద్యను నేర్పించడానికీ, శిష్యుల గుణగణాలు, బుద్ధి, ఆసక్తి, విద్య పట్ల ఆతురత, ఓపిక, ఏకాగ్రత, తెలివితేటలు మొదలైనవి ఉన్నాయా లేదా పరీక్షించాలి. ఆ తరువాత వారిని శిష్యునిగా స్వీకరించాలి. ఈ కథలో శుక్రాచార్యులవారు అక్షరాల పైన చెప్పిన అంశాలను కచునిలో ఉన్నాయనీ, తెలుసుకునీ, తన శిష్యవర్గంలో కలుపుకున్నాడు. గురువు అనే వాడు విద్యను నేర్పించేటప్పుడు కుల, మత, ధనం వర్గ భేదాలును చూడకూడదు. శిష్యులల్లో ఉన్న ఆసక్తిని గమనించీ వాళ్ళని అపుడే తమ విద్యార్ధిగా స్వీకరించాలి. ఈ గేయ కథలో శుక్రాచార్యులవారు కచుని పట్ల జాతి భేదం చూపలేదు. తనలో ఉన్న విద్య పట్ల ఆసక్తిని గమనించీ, తన శిష్యునిగా స్వీకరించాడు.
గురువు అంటే విదార్ధులల్లో అజ్ఞానాన్ని పారద్రోలాలి. జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు అని ఆర్ధం. ఈ విషయం మనకు చదువు చెప్పిన గురువుల నుండి ప్రతిరోజు వింటూ ఉంటాము. గురువు అనే పదానికి అర్ధం శుక్రాచార్యులువారు అని మనం బల్ల గుద్ధి చెప్పవచ్చు. నేటి సమాజంలో అక్కడక్కడ టక్కరి గురువులు ఎదురు అవుతూ ఉంటారు. అలాంటి వారి నుండి మనం చాలా తెలివిగా తప్పించుకొనీ, బయటపడాల్సి వస్తుంది. అలాంటి గురువులను మనం నేడు టి.వి.లలోను వార్తా పత్రికలలోను గమనించవచ్చు. గురువుకు ఉండవలసిన లక్షణాలు కొంతమంది గురువులకు లేవు. అలాంటి గురువులును చూడటం ద్వారా గురువులకు ఉన్న గౌరవం పూర్తిగా పోతుంది. గురువు వ్యిద్యార్ధికి మార్గదర్శిగా ఉండాలి. ఇది మంచి ఇది చెడు అనే విషయాలను తెలియ చెప్పే విధంగా ఉండాలి. ఈ గేయ కథలో శుక్రాచార్యులవారు కచుడుకు అలా మార్గదర్శిగా ఉన్నాడని చెప్పవచ్చు. నేడు కొంతమంది గురువులు విద్యార్ధులకు చెడు మార్గం వైపు పయనించేటట్లు చేస్తుంటారు. అలాంటివి టి.వి.లల్లో, పత్రికల్లో చూడవచ్చు. ఉదా: అమ్మాయిలను చెరపట్టడం లాంటివి. ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి గురువులను సమాజం, ప్రభుత్వం కఠినంగానే శిక్షించాలి. అపుడే సమాజంలోని బంగారంలాంటి విద్యార్ధుల జీవితాలు బాగుపడతాయి. గురువులు దైవంతో సమానంగా విద్యార్ధులు భావిస్తారు. అలాంటి విద్యార్ధులకు న్యాయం చేయాలి. గురువును ప్రతిరోజు విద్యార్ధులు ఈ విధంగా ప్రార్ధన చేస్తుంటారు.
“గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమ:” అంటే గురువును బ్రహ్మ, విష్ణు, శివునితో సమానం అని అందరు భావిస్తూంటారు. ఇంతటి గొప్ప స్ధానం కలిగిన గురువు విద్యార్ధుల పట్ల చాలా, గొప్ప ఉన్నతమైన స్వభావం కలిగి ఉండాలి. అపుడే గురువు అనే పదానికి అర్ధం ఉంటుంది. నేటి సమాజంలో అక్కడక్కడ వున్న కలుపుమొక్కలాంటి గురువులను ఏరిపారేయాలి. అపుడే మంచి మనస్సు ఉన్న గురువులకు మనం ఉన్నతమైన స్ధానం ఇచ్చినవారు అవుతాము. అపుడే పిల్లలకు గురువుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. ఈ గేయ కథలలో శుక్రాచార్యులవారు కచుని పట్ల చాలా ఉన్నతమైన గోప్ప మనస్సు చూపించాడు. ఎలా అంటే నిస్వార్ధంగా కచునికి సంజీవని విద్యను నేర్పించాడు. నేటి సమాజం గురువు అంటే ఎలా ఉండాలో ఈ గేయ కథలోని శుక్రాచార్యులవారిని ఆదర్శంగా తీసుకొవాలి.
3.3 విధ్యార్ధి కార్యదీక్ష :
ఈ గేయ కథలో కచుడును గూర్చి చెప్పుకొవాలి. అసలు విద్యార్ధి అంటే ఎలా ఉండాలో ఇతన్ని చూసి అందరు నేర్చుకోవాలి. దేవతలు తలపెట్టిన ఒక గొప్ప కార్యం సాధించడానికి తను ముందడుగు వేశాడు. తన ద్వారా దైవ జాతికి మంచి జరగడానికి ధైర్యం చేసి రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల వద్దకు సంజీవని విద్య నేర్చుకొవడానికి నడుంబిగించాడని చెప్పవచ్చు. దేవతలు ఆశించినట్లు కచుడు తను అనుకున్న లక్ష్యంలో విజయం సాధించాడు. తద్వారా అందరికి మేలు జరిగింది.
అసలు ‘‘విద్యార్ధి’’ అంటే ఒక బిక్షగాడులాగా ఉండాలి. అంటే విత్ అనగా జ్ఞానము, యా అనగా ఇచ్చునది, అర్ధి అనగా కోరువాడు అని అర్ధం. విద్యార్ధి అనగా జ్ఞానం కోరి పాఠశాలకు వచ్చు వాడు అని అర్ధం. ఈ గేయ కథలో కచుడు శుక్రాచార్యుని వద్ద ఒక మంచి విద్యార్ధిలాగా ఉన్నాడని అతను చేసే పనులన్ని బట్టి అర్ధమవుతూ ఉంది.
విద్యార్ధులు రెండు రకాలుగా ఉంటారు. మంచి స్వభావం కలిగిన విద్యార్ధులు, చెడు స్వభావం కలిగిన విద్యార్ధులు. ఈ గేయ కథలో శుక్రాచార్యుని వద్ద విద్యను అభ్యసిస్తున్నటి వంటి రాక్షస విద్యార్ధులు కచుడును చంపి బూడిద చేయడం చెడు స్వభావం కలిగిన విద్యార్ధులుగా గుర్తించవచ్చు. అలా చేసినప్పటికి కచుడు ఎంతో ధైర్యంగా ఆ సమస్య నుండి బయటపడినాడు. కచుడు తెలివితేటలు, సేవాగుణం, ఓర్పును చూసి రాక్షస విద్యార్ధులు కచుడును నానా రకాలుగా హింసకు గురిచేశారు. నేటి సమాజంలో అక్కడక్కడ చెడు స్వభావం కలిగిన విద్యార్ధులు ఉంటారు.
ఇలాంటివారిని ఈ గేయ కథలోని కచుడిలాగా చాలా సమయస్పూర్తితో ఎదుర్కోని తమ సమస్య నుండి బయటపడి లోకానికి ఆదర్శంగా నిలబడాలి. అపుడే విద్యార్ధి జీవితంలో విజయం సాధించినవారు అవుతారు. అలా కాకుండా చెడ్డవాళ్ళు చేసే మానసిక వ్యధకు గురి అయి బాధపడుతూ ఆత్మహత్యలు చేసుకొవడం సమస్యకు పరిష్కారం కాదు. ఏ సమస్య అయిన ధైర్యంగా ఎదుర్కోవాలి. తమ సమస్య ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో పంచుకోవాలి. అపుడు ఈజీగా సమస్య నుండి బయటపడినవారు అవుతారు.
నేటి విద్యార్ధులకు అప్పుడప్పుడు పురాణాలలోని గురువుల-విద్యార్ధులకు సంబంధించిన కథలు చెపుతూ ఉండాలి. అలాంటి కథలు విద్యార్ధులు వినడం ద్వారా మనసిక ధైర్యం పొందుతారు. సమస్యలు ఎలా ఉంటాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాలు తెలుసుకంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అప్పుడప్పుడు కథలను చదవమని చెప్పాలి. అంతేకాకుండా విద్యార్ధులకు గురువులు కూడా తరగతి గదిలో పురాణ, ఇతిహాస కథలు అప్పుడప్పుడు చెపుతూ ఉండాలి. ఇలాంటి కథలు చెప్పడం ద్వారా ముందస్తుగానే సమస్యలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదర్కోవాలి, అనే విషయ పరిజ్ఞానం పొందుతారు. తద్వారా కొంత వరకు విద్యార్ధులు తమ జీవితమునకు బంగారుబాట వేసుకుంటారు.
4. ముగింపు:
మొత్తం మీద ఈ గేయ కథలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇలాంటి గేయ కథలు పిల్లలకు పాఠాల రూపంలో, విద్యార్ధులకు వారి పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టాలి. తద్వారా పిల్లలకు, పెద్దలకు ఇతిహాస ఘట్టాలును, పురాణఘట్టాలను జానపదులు ఎంత చక్కగా గేయ కథలో అల్లి మనకు అందించారో అని ఆశ్చర్యానికి లోను అయి, తాము కూడా అలాంటి గేయ కథలను జానపదులు నుంచి సేకరించి పుస్తకాలు ప్రచురించాలన్నీ తమలో ఆసక్తిని పెంచుకుంటారు. సమాజం ఇలాంటి గేయాలు వినడం ద్వారా చాలా సులభంగా ఆ గేయాల సారాంశాన్ని అర్ధం చేసుకుంటారు. ఆ గేయ కథలలోని పాత్రలను తమ జీవితమునకు ఆదర్శంగా తీసుకుంటారు. తాము ఏదైనా లక్ష్యసాధనలో ఆటంకాలు ఏర్పడినపుడు ఈ ఘట్టాలలోని పాత్రలను గుర్తుకు తెచ్చుకుని ముందుకు సాగుతారు. సమాజాన్ని మంచి మార్గంవైపు పయనించడానికి, కథలు, నవలలు, నాటికలు, శతకాలు బాగా ఉపయోగపడతాయి. అయితే ఆ ప్రక్రియలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ గేయ కథలు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రచయితలు ఏదైన నీతిని సమాజానికి బోధించడానికి ఈ ‘‘గేయ కథ’’ ప్రక్రియలను ఎంచుకోవాలి. ఎందుకంటే గేయాలుతో కూడిన కథలు అందరు బాగా ఇష్టపడతారు. ఇలాంటి గేయ కథలు జానపదుల నోల్లల్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కాని నేటి యువత ఇలాంటి గేయ కథలను సేకరించీ, పుస్తక రూపంలో తేవాలి. అందుకు ప్రభుత్వం, సమాజం యువతకు ప్రోత్సాహం కల్పించాలి.
5. పాదసూచికలు:
- జానపద గేయ గాధలు-నిర్మాణం-సమాజం సంస్కృతి, సం 1991, పు-118.
- జన పదం - జానపద విజ్ఞానం, జానపదం త్రైమాస పత్రిక, మార్చి, 1980, పు-2.
- పాడినవారు - పైడాల మౌలాన - చిత్తూరు.
- పాడినవారు - శ్రీరాములు రెడ్డి, కడప జిల్లా.
- శివ పురాణం - రుద్ర సంహిత - యుద్దకాండలో 45 నుంచి 50వ అధ్యాయం.
- స్కంధ పురాణం - కాశీ ఖండం 16వ అధ్యాయం.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణకుమారి, నాయని. తెలుగు జానపద గేయగాధలు, తెలుగు అకాడమి, హైదరాబాదు, 1990.
- ధనశ్రీ. కె. రాయలసీమ బాల సాహిత్యం, శ్రీ వేంకటేశ్వర పబ్లికేషన్స్, నంద్యాల, 2023.
- వెంకట్రామయ్య, రాసాని. జానపద గేయాలలో పురాణాలు, జనహిత పబ్లికేషన్స్, తిరుపతి.
- సభా, కె. రామచిలుక గేయ కథల సంపుటి, వెంకట్రామ అండ్ కో, విజయవాడ, 1971.
- సుందరం, ఆర్వీయస్. ఆంధ్రుల జానపదవిజ్ఞానం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్, 1983.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.