headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

6. జానపదకళారూపం: కడ్డీ తంత్రి

డా. ఆవాల వీణ

తెలుగు అధ్యాపకురాలు,
సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల,
భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ
సెల్: +91 8074189013, Email: veena.avala@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.11.2024        ఎంపిక (D.O.A): 30.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

జానపద కళారూపాలు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో ఇటీవల కాలంలో జానపద కళారూపాలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. అటువంటి కళారూపాల్లో మిత అయ్యల్‌వార్లు వాడే కడ్డీ తంత్రి కూడా ఒకటి. అరుదైన, వైవిధ్యభరితమైన ప్రతిభ కలిగిన కళాకారులను, కళలను ప్రోత్సహించటం. కడ్డీ తంత్రి పూర్వాపరాలను దాని నిర్మాణం, వాడకం దాని ఆధారంగా జీవనోపాధి పొందుతున్నవారు, ఇప్పడు దాని పరిస్థితి మొదలైన అంశాల గురించి తెలపటం. అంశానికి సంబంధించిన విషయ సేకరణలో భాగంగా ఆ అంశానికి సంబంధించిన పుస్తకాలు, దినపత్రికలలో వచ్చిన వివరాలు, వ్యాసాలు, క్షేత్ర పర్యటన ద్వారా విషయ సేకరణ. పరిశోధనా పద్ధతులు- కళారూపాలకి సంబంధించిన పుస్తకాలను సేకరించి చదవటం., కడ్డీ తంత్రి కళాకారూలను ప్రత్యక్షంగా కలిసి వివరాలు సేకరించటం., ఈ కళాకారులకు ఇదివరకు చేసిన కళలను పరిశీలించటం. కళాకారులకు అందవలసిన ప్రోత్సాహం అందిస్తే వారు తమ కళారూపాలను, కళలను కాపాడుకుంటారనే నేపథ్యం. మన తరువాతి తరాలకు మన కళాసంపదను అందించాలనే ఆశ. అరుదైన కళారూపాలను, కళాకారులను గుర్తించాలి.

Keywords: కడ్డీ తంత్రి, మిత అయ్యల్ వార్లు, తిరునామాలు, రామానుజాచార్యులు, తంబూర, వకుళాభరణం, నిత్యవైష్ణవులు, తిరుప్పాణ్యాళ్వార్లు, జానపదులు, జానపద కళాకారులు, కళారూపాలు

1. పరిచయం :

జానపదాలు అంటే సమాజంలో సామూహక జ్ఞాన సంపదలు అని అనవచ్చును. అలాగే ప్రకృతికి మారుపేరుగా జానపదులను పేర్కొంటారు. వాళ్లు చేసే ఏ సాహిత్యరూపానికైనా ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. కళలను ఆస్వాదించడం కూడ ఒక కళ. అలా మన సమాజంలో ఎన్నో కళలు, కళారూపాలు ప్రత్యేకమైన చోటును సంపాదించుకున్నాయి. మనస్సుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే ఏ కళారూపానికైనా   ఉన్న విశిష్టత. అలాగే కళలకి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది.  కళలను గూర్చి ‘‘సౌందర్యాన్ని దర్శింపజేయడమే కళ’’ అని ఒకరంటే, ‘‘ఆత్మను  దర్శింపజేసేదే కళ’’ అని మరొకరంటారు. ‘‘ఏమైనా కళకు ఇతమిత్థమైన ఒక నిర్వచనం ఇవ్వడం కష్టమేననిపిస్తోంది. ఎంచేతనంటే కళలన్నీ పరిశీలించే వాళ్ల ధోరణి, వాళ్ళ దృక్కోణమే వేరుగా ఉంటుంది1’’ అని (1. జానపద విజ్ఞానాధ్యయనంలో డా.జి.ఎస్‌. మోహన్‌) అన్నారు. ఎవరికి నచ్చిన అంశంలో వారు ఆ కళలో నిష్ణాతులై ఉంటే ఆ కళ రంజింపజేయ గలుగుతుంది. అలా ఒక్కో కళకి ఒక్కో విశిష్టత ఉంటుంది. ‘‘కడ్డీ తంత్రి’’ వాద్య పరికరం సంగీతానికి సంబంధించిన జానపద కళారూపం అనవచ్చు.

‘‘సంగీత శాస్త్రబద్ధములు గీతములన్నియు జానపదములే’’.

‘‘ఇచ్చట జానపదములన జానపద సంగీతమునకు సంబంధించిన రచనలని అర్థము. ఈ జానపదము లన్నియు ఒక స్థాయియందే రచింపబడి యుండును. కారణము గ్రామవాసులు కంఠమును ఇతర స్థాయిలకు పోనిచ్చుటకు తెలయని వారగుటచే సులభరీతిలో పాడుకొనుటకు అనువుగానుండును. జానపద సంగీతమునందలి సాహిత్యము వ్యాకరణబద్దముకాని సామాన్యభాషలో నుండును. సాహిాత్య భావము కూడా సాధారణముగా నుండును. ఈ గీతములో ఆలపింపబడిన ‘మెట్టు’ సామాన్యముగను, వినుటకు ఆహ్లాదముగను, జనాకర్షణను కలిగియుండును. సంగతులుగాని, గమకములుగాని ఉండవు. సామాన్య తాళములలోను, సంకీర్ణ రాగములలోను ఇవి రచింపబడి యుండును. (గాన కళాబోధిని, పుట-122).

ఇక్కడ సంగీతం గురించి తెలియకపోయినా, గమకములు నిర్దిష్టమైన సంగీతములో రాకపోయినా జానపదులు ఎంతో చక్కగా పాటలు కట్టి పాడడంలో సిద్ధహస్తులు. అలాంటి కోవకు చెందినవే మిత అయ్యల్‌వార్లు పాడే తిరునామాలు. ‘కడ్డీ తంత్రి’ని ఉపయోగించి ఈ తిరునామాలను ఆలపిస్తారు.

జానపదం అనగానే మనకు పల్లె వాతావరణం, పల్లె సంస్కృతి, సాహిత్యాలు కనిపిస్తాయి. జనాల నుండి జానపదం ఉద్భవించింది. కాబట్టి జానపద సాహిత్యానికి అంత ప్రాముఖ్యత. దానిలో భాగంగానే జానపద కళారూపాలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. అందుకే జానపద కళారూపాల గురించి మిక్కిలినేవి రాధాకృష్ణమూర్తి గారు 1992 లోనే అంతరించుకుపోతున్న, అంతరించిపోయే దశలో ఉన్న కళారూపాల గురించి చెప్పారు. అందులో ఒకటి మిత అయ్యల్‌వార్లు వాడే ‘కడ్డీ తంత్రి’ వాద్యం.

(చిటికెన పుల్ల Photo)

 

(గజ్జెల పుల్ల Photo)

 

(కడ్డీ తంత్రి వాద్యం Photo)

 

(కడ్డీ తంత్రి వాద్య వ్యాసకర్త డా.ఆవాల వీణ Photo)

కడ్డీ తంత్రి వాద్యం గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈ వాద్యాన్ని వాడే మిత అయ్యల్‌వార్ల  గురించి తెలుసుకోవాలి.

మిత అయ్యల్‌వార్లు పరిచయం : ఈ మిత అయ్యల్‌వార్లని మాల ఆశ్రితులు అని అంటారు. వీరిని మాలవారికి పురోహతులుగా పేర్కొంటారు. వీరికి కర్మకాండలు చేయడం ప్రధానవృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. మాలవారు వీరిని తమ గురువులుగా భావిస్తారు. ‘‘అయితే ఆశ్రిత కళారూపాలు ఎక్కువగా శైవమతాన్ని ఆచరించే తత్త్వాన్ని కలిగి ఉంటాయి. అందుకు భిన్నంగా వైష్ణవమతాన్ని ఆచరిస్తూ, వైష్ణవానికి చెందిన కథలనే చెప్పటం మిత్తిలి కళారూపం ప్రత్యేకత.

ఇక్కడ వీరు వైష్ణవాన్ని అవలంబించడానికి కారణం వీరు తమిళనాడుకు చెందిన పన్నెండు ఆళ్వారుల్లో ఒకరుగా చెప్పే తిరుప్పాణ్యాళ్వార్ల సంతతి అని కూడా వారు చెప్పారు. కైశిక ద్వాదశి రోజున వ్రత కథలో భాగంగా వీరు తిరుప్పాణ్యాళ్వార్ల చరిత్రను చెప్పుకుంటారు. ఆ తరువాత శైవం, వైష్ణవ మత యుద్ధాల అనంతరం వీరు ఇక్కడికి తరలి వచ్చారని కూడా చెప్పుకుంటారు. వీరి తిరునామాలను గమనిస్తే మాత్రం రామానుజాచార్యులను స్తుతిస్తూ పాడుతూ ఉండడం వల్ల శ్రీ రామానుజాచార్యులు ఏర్పరచిన విశిష్టాద్వైతన్ని ప్రచారం చేసి, శూద్రులకు, దళితులకు మత దీక్ష ఇచ్చారు. తరువాతి కాలంలో తెంగల్‌, వడగల్‌ శాఖలుగా విడిపోయి ఆంధ్రదేశంలో వైష్ణవ మతం క్రీ.శ.11వ శతాబ్దం నుండి వైష్ణవ మతం ఉన్నట్లు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇది శ్రీ రామానుజాచార్యుల ప్రచారంతో మరింత బలపడింది.

2. కడ్డీ తంత్రి పూర్వ పరిశోధన వివరాలు:

కడ్డీ తంత్రి గురించి కొందరు రచయతలు కూడా పేర్కొన్నారు.

  1. బిరుదురాజు రామరాజుగారు- ‘‘తెలుగు జానపద గేయ సాహిత్యం’’లో ఈ వాద్య పరికరాన్ని ‘కటి వాద్య’ మన్నారు.
  2. మిక్కిలినేని రాధాకృష్ణగారు ‘‘జానపద కళారుపాలు’’ లో ‘కడ్డీ’ వాద్యమన్నారు.
  3. కర్నాటిగారు ‘‘కళాదర్శనమ్‌’’లో ఈ వాద్యాన్ని ఒక రకమైన ‘తంబూర’ అని అన్నారు.
  4. బాసాని సురేష్‌గారు ‘‘తెలంగాణ జానపద కళాసౌరభాలు’’ లో కళారూపాలను ‘7’ రకాలుగా పర్గీకరించారు. అందులో భాగంలో ఈ వాద్యాన్ని సంగీత వాద్య ఆధారిత జానపద కళారూపాలు అనే దానిలో మిత్తిలి కళారూపంగా కడ్డీ తంత్రి వాద్యాన్ని పేర్కొన్నారు.

3. కడ్డీ తంత్రి వాద్యం:

మిత అయ్యల్‌వార్ల మూలపురుషుడైన తిరుప్పాణ్యాళ్వార్ల చేతిలో ‘ఏకతార’ ఉండేది. అలా కూడా వీరికి ఈ కడ్డీ తంత్రి వాద్యం వారసత్వంగా వచ్చింది అని చెప్పారు. వీరు ఈ వాద్యాన్ని వారే స్వయంగా చేసుకుంటామని చెప్పారు. ఈ కడ్డీ తంత్రి వాద్యాన్ని మిత అయ్యల్‌వార్లు ‘‘వకుళాభరణం’’ అని కూడా పిలుచుకుంటారు. కాని, తరువాతి కాలంలో ఈ వాద్యాన్ని ఉపయోగించి కొందరు ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ఈ వాద్యానికి ఆకాశవాణి వారు ‘‘కడ్డీ తంత్రి’’ వాద్యమని నామకరణం చేశారని నా క్షేత్ర పర్యటనలో తెలుసుకున్నాను.

ఈ వాద్యాన్ని ‘తాంబుర, కడ్డీ వాద్యం, సితార, హంస బుర్ర’ అని కూడా పిలుచుకుంటారు. దీనిని తయారు చేయడానికి వీరు ముఖ్యంగా గుమ్మడి టేకు కర్రను ఉపయోగిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని క్రింద కూర్చోబెట్టి వాయించడం. ఇది చూడడానికి అచ్చు ‘వీణ’ మాదిరిగానే ఉంటుంది. దీనికి కూడా నాలుకు తంత్రులుంటాయి. ముందు ఉండే రెండు తంత్రులు కొంత లావుగా ఉంటాయి. వీటికి ‘మందరం’ అని పేరు. మూడవ, నాలుగవ తంత్రులు రెండు కొంచెం సన్నగా ఉంటాయి. మూడవ దాని పేరు ‘మూట’, నాలుగవ దాని పేరు ‘పాట’. ‘ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. క్రింద పీఠం ‘హంస’ మాదిరిగా ఉంటుంది. ఇది వాద్యానికి ఆధారంగా ఉంటుంది. ఇది ఎక్కువగా నెమలి పింఛం ఆకారంలో ఉంటుంది. దీనిని వాయించడానికి రెండు ప్రత్యేకమైన వెదురు పుల్లలను వాడతారు. ఈ వెదురు పుల్లలను కడ్డీ తంత్రి వాద్య కళాకారులే స్వయంగా తయారు చేసుకోవడం విశేషం. కుడిచేతితో పట్టుకొనె వెదురు పుల్లను ‘‘చిటికెల పుల్ల’’ అంటారు. కుంభం మీద శంఖుచక్ర నామాలు కూడా ఉంటాయి. ఈ వాద్యాన్ని వాయిస్తున్నప్పుడు నాట్యం చేసినట్లు భ్రమ కలిగించే విధంగా ఉంటుంది.

ఈ వాద్యంతో డోలక్‌, గిటార్‌, టుమ్రీ, సితార, వీణ, మృదంగ శబ్దాలను సైతం వాయించే వాద్య కళాకారులకు లేకపోలేదు. గజ్జెల పుల్ల పల్లం నాట్యం చేస్తున్నట్లు భ్రమను కూడా కలిగిస్తుంది. ఈ వాద్యానికి తోడు తిరునామాలు ఆలపించే సమయంలో సహాయంగా డోలక్‌, తాళాలు శృతి కలుపుతారు. ఈ వాద్యాన్ని ఉపయోగించే మిత అయ్యల్‌వార్లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కరింనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌ ఇంకా ఇతర జిల్లాలలో ఈ కడ్డీ తంత్రిని వాయించే కళాకారులు ప్రధానంగా కనిపిస్తారు (సేకరణ – శ్రీ తిరుపతి శేషయ్య, గట్టెపల్లి గ్రామం, కరింనగర్ జిల్లా, శ్రీ ఆవాల గోపాలకిష్టయ్య, వంగపల్లి గ్రామం, వరంగల్ జిల్లా, శ్రీ పిట్టల లక్ష్మీనరసయ్య, గటెపల్లి గ్రామ, వరంగల్ జిల్లా).

మిత అయ్యల్‌వార్లు కడ్డీ తంత్రిని ఉపయోగించి రామాయణ, మహాభారత గాథలను, భాగవత, పురాణాలను ప్రధానంగా వైష్ణవ తత్త్వాన్ని తమ కథాగాన ప్రక్రియల ద్వారా ప్రచారం చేస్తుంటారు. ఒకవైపు తిరునాన సంకీర్తనలు పాడుతూ, మరోవైపు కుల గాథలు కొనసాగిస్తున్నారు. వీరు తిరునామాల కాలక్షేపణలో ముందంజలో ఉన్నారని చెప్పవచ్చును. ‘‘తిరు’’ అనగా ‘శ్రీపదం’ అని నిఘంటువు అర్థం. తిరునామాలు శ్రీ వైష్ణవ మత ప్రచారానికి ఏర్పడ్డ సంకీర్తనలుగా పేర్కొనవచ్చును. తెలుగులో భక్తరస ధారలను ప్రవహింప చేసినా శ్రీ వైష్ణవ మత సంప్రదాయ నిధులుగా శ్రీ రామానుజాచార్యులు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వైష్ణవ తత్త్వాన్ని వ్యాప్తి చేసిన వారు. అందుకే వీరి తిరునామాలలో ఎక్కువగా రామానుజ స్వామివారిని స్తుతిస్తూ పాడిన సంకీర్తనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు బహుళ జనాదరణ పొందిన తిరునామాలు ఇప్పుడు కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తన్నాయి. ఇప్పుడు ఈ గానయోగ్యత ఉన్న కళాకారులు కూడా వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అంతగా వీటి ఆదరణ తగ్గిపోయిందని చెప్పవచ్చు.

నేను మిత అయ్యల్‌వార్ల మీద మొట్టమొదట పరిశోధన చేసిన కారణంగా ఈ తిరునామాలను నేను రెండు రకాలుగా వర్గీకరించాను. ఒకటి... ఆధ్యాత్మిక తిరునామాలు, రెండు.. నిర్యాణ తిరునామాలుగా విభజించి చెప్పడం జరిగింది. ముందుగా చెప్పుకున్నట్లు ఈ తిరునామాలు దాదాపుగా భక్తిరసమైనవి. దేవుని స్తుతిస్తూ పాడేవిగా ఉంటాయి. ఇవే ఆధ్యాత్మిక తిరునామాలు.

మిత అయ్యల్‌వార్లు మాల వారికి కర్మకాండలు చేస్తారు అని చెప్పాము కాబట్టి ఎవరైనా చనిపోయినపుడు కొన్ని తిరునామాలను దిన వారాలకు, చనిపోయిన రాత్రి కూడా ఆలపిస్తారు. ఈ తిరునామాలను నిర్యాణ తిరునామాలు అని కూడా అంటారు. ఇందులో చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలని ఉద్దేశ్యంతో ఉన్నవే ఉంటాయి.

అలాగే ప్రస్తుత తరంలోని వారు కొందరు కొన్ని దేవాలయాలలో అర్చకులుగా కూడా బాధ్యతలు నిర్వహించఉం విశేషం. సాధారణంగా పౌరోహిత్యం, అర్చకత్వం, పూజలు చేయడం ఇవన్నీ ఉన్నత వర్గానికి సంబంధించిన బ్రాహ్మణులు కుల పూజారుల ద్వారానే జరుగుతాయి.

కాని, మిత అయ్యెల్‌వార్లలోని నిబద్ధత, ఆధ్యాత్మిక స్ఫూర్తి, భాషాపటిమ మీద, నైపుణ్యాల ప్రకారం  తెలంగాణలోని కొన్ని దేవాలయాలలో వీరు అర్చకత్వం కూడా చేస్తున్నారు. ఇలా వీరు కడ్డీ తంత్రిని ఉపపయోగించి పలురకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చును.

4. ముగింపు

  • తెలంగాణలో ఎక్కువగా కనిపించే ఈ మిత అయ్యల్ వార్లు ఈ కడ్డీ తంత్రి వాద్యమును ఉపయోగించి యక్షగానాలు చేస్తుంటారు.
  • ఏదైనా దిన వారాలకు వెళ్ళినప్పుడు కూడా కళాకారులు కచ్చితంగా ఈ వాద్యాన్ని తమ వెంట తీసుకెళ్ళి అక్కడ కోన్ని నిర్వాణపరమైన తిరునామాలు, తత్త్వగీతాలు కచ్చితంగా ఆలపించి వస్తారు.
  • 16 జులై, 2000 నాడు వార్త ఆదివారం దినపత్రిక సంచికలో కూడా మనకు తెలియని మహా వాద్యం కడ్డీ తంత్రి అనే వ్యాసం వచ్చింది. అందులో ఆ కడ్డీతంత్రి గురించి సమగ్రమైన సమాచారం అందించారు తుమ్మల రామస్వామిగారు.
  • కడ్డీతంత్రి కళాకారుల్లో వెళితే లెక్కపెట్టి వారు మాత్రమే ఉండవచ్చని చెప్పవచ్చును.
  • ఈ కడ్డీ తంత్రి వాద్యాన్ని కనుక మనం కాపాడుకున్నట్లయితే మహా వాద్యాన్ని కాపాడినవారము అవుతామని చెప్పవచ్చును.
  • ఈ వ్యాసంలో భాగంగా కడ్డీ తంత్రిని ఉపయోగించి వీరు చేసే యక్షగానాలను, తిరునామాలను గురించి వివరించాను.
  • అలాగే మిత అయ్యల్ వార్లు అర్చకత్వం గురించి కోన్ని దేవాలయాలలో వీరు అర్చకత్వం చేస్తున్న అంశాన్నికూడా పేర్కోనటం జరిగింది.

5. ఉపయుక్త గ్రంథ సూచి

  1. మోహన్‌ జి.ఎస్‌. - జానపద విజ్ఞాన అధ్యయనం, ద్రవిడ విశ్వవిద్యాలయం, 2010.
  2. మోహన్‌ జి.ఎస్‌. - జానపద ఆచారాలు, 1994.
  3. రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని - తెలుగువారి జానపద కళారూపాలు, శ్రీ పొట్ట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌.
  4. రామరాజు బిరుదురాజు - తెలుగు జానపద గేయ సాహిత్యం, తెలుగు అకాడమి.
  5. వీణ ఆవాల `మిత అయ్యల్‌వార్లు` భాష, సాహిత్యం, సామాజిక-సంస్కృతి, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 2023.
  6. శ్రీనివాస్ తిరునగరి, ఆళ్వారాచార్య సూక్తి ముక్తావళి (ఆళ్వారుల-ఆచార్యుల చరిత్రము).
  7. సుబ్బాచారి పులికోండ, జానపద విజ్ఞానం-ఆశ్రిత సాహిత్యం – పరిశోధన గ్రంథం.
  8. సురేష్‌ బాసాని, తెలంగాణ జానపద కళా సౌరభాలు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, 2023.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]