headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-14 | December 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. అస్సామీలో సంస్కృతప్రతిబింబాలు: ధ్వనిమార్పులు

DOI
డా. వి. ఎం. సుబ్రమణ్య శర్మ

సహాయ ఆచార్యులు, భాషాశాస్త్రశాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం,
ఢిల్లీ, ఢిల్లీ.
సెల్: +91 9866707774, Email: vmssharma@gmail.com



సుకన్య శివం

అస్సామీస్ అనువాదకులు, అనువాదిని ఫౌండేషన్
AICTE, విద్యా మంత్రిత్వశాఖ,
ఢిల్లీ, ఢిల్లీ.
సెల్: +91 6003244389, Email: sukanyashivam123@gmail.com



డా. ఎన్. సుశీల్ కుమార్

సహాయ ఆచార్యులు, భాషాశాస్త్ర శాఖ,
ఢిల్లీ విశ్వవిద్యాలయం,
ఢిల్లీ, ఢిల్లీ.
సెల్: +91 8142111668, Email: susheel.hcu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.11.2024        ఎంపిక (D.O.A): 30.11.2024        ప్రచురణ (D.O.P): 01.12.2024


వ్యాససంగ్రహం:

సంస్కృతభాషకి ఇతర భారతీయభాషలకి మధ్య సంబంధం పాలూనీళ్ళ లాగా విడదీయలేని సంబంధం. సంస్కృతపదజాలం కేవలం ఇండో-ఆర్యన్ భాషల్లోనే కాకుండా ఇతర భాషా కుటుంబాలయిన ద్రావిడ, ఆస్ట్రో-ఏషియాటిక్, టిబెటో బర్మన్ భాషాలపైన కూడా కనపడుతుంది. అయితే, సంస్కృతానికి, ఇతర ఇండో- ఆర్యన్ భాషలకు మధ్య ఉన్న సామ్యాలు బేధాల గురించి చర్చ జరిగినప్పటికీ, సంస్కృతం, అస్సామీ భాషల పదజాలంలో ధ్వని మార్పులను ఉద్దేశించి జరిగిన అధ్యయనాలు కనిపించక పోవడం విశేషం. ప్రాచీన విశిష్టభాషలైన సంస్కృతం, అస్సామీ భాషల మధ్య ఉన్న సమాంతరపదజాలంలోని ధ్వనిమార్పులను భాషాశాస్త్రపరంగా విశ్లేషించడం ప్రస్తుతపత్రం ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని సాధించడానికి సంస్కృతపదజాలాన్ని అంతర్జాలం నుండి తీసుకోవడం జరిగింది. అస్సామీభాష పదాలను డిల్లీ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం చదివిన, 20-25 సంవత్సరాల వయస్సు గల నలుగురు విద్యార్థులను ఈ పత్ర పరిశోధనకు ఎంపిక చేసుకున్నాము. వాళ్ళనుంచి దాదాపు 400 పదజాలాన్ని సేకరించాము అందుకు గాను C.I.I.L మైసూర్ వాళ్ళ ప్రశ్నావళిని ఉపయోగించాము. వాళ్ళ ఉచ్చారణను ధ్వన్యాత్మక లిపిలో (Phonetic transcription)లో రాసుకొవడం జరిగింది. ఈ విధంగా తయారుచేసిన పదజాలంలో సంస్కృత, అస్సామీ భాషలలో సమాంతర పదజాలాన్ని అంటే సామ్యాలున్న పదాలను దాదాపు 200 పదాలలోని ధ్వని మార్పులను కాంప్బెల్ (1998) తన చారిత్రకభాషాశాస్త్రంలో వివరించిన ధ్వని మార్పులను ఆధారంగా విశ్లేషించడం జరిగింది. ఈ రకమైన అధ్యయనాలు ప్రాచీన విశిష్ట భాషలైన సంస్కృతానికి, అస్సామీ భాషల మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యత్యాసాల్ని అర్థం చేసుకోవడానికే కాకుండా ఇండో ఆర్యన్ మూలభాషా నిర్మాణానికి దోహదం చేస్తాయనే విషయాన్ని సారాంశంగా చెప్పడం జరిగింది.

Keywords: సంస్కృతం, అస్సామీ , ప్రాచీనవిశిష్టభాషలు, సమాంతరపదజాలం, భాషాశాస్త్రవిశ్లేషణ

1. ఉపోద్ఘాతం:

సంస్కృత, అస్సామీ భాషలు రెండూ కూడా ప్రాచీన విశిష్ట భాషలు. అంతే కాకుండా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినవి. ఈ రెండూ కూడా జన్యజనక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. మన భారతీయ వాఙ్మయం చాలావరకు సంస్కృత భాషలోనే కేంద్రీకరింపబడి ఉంది. సంస్కృత భాషను ఒక ప్రత్యేకమైన రాష్ట్రంలో కాకుండా అన్నీ ప్రాంతాల్లో దాదాపు అన్ని భారతీయ భాషలతో సంబంధాన్ని కలిగిఉండటమే కాక ఆయా భాషల పదాలను, వ్యాకరణాన్ని కూడా ప్రభావితం చేసింది అని చెప్పటం అతిశయోక్తి కాదు.
అస్సామీ భాషను ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో మాట్లాడుతారు. (2011) జనాభా లెక్కల ప్రకారం సంస్కృత మాతృభాషీయులు 104 మంది అస్సాంలో ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 15 మిలియన్ల మంది ప్రజలు అస్సామీ భాషను మాతృభాషగా మాట్లాడుతున్నారు (2011 సెన్సెస్ రిపోర్ట్ పేర్కొంది). వీరి అక్షరాస్యతా శాతం 72.19%. అస్సాంకు ఉత్తరాన భూటాన్, అరుణాచల్ ప్రదేశ్. తూర్పున నాగాలాండ్ , అరుణాచలప్రదేశ్ , మణిపూర్. దక్షిణాన మేఘాలయ, త్రిపుర, బంగ్లాదేశ్. పశ్చిమాన పశ్చిమబెంగాల్ ఎల్లలుగా ఉన్నాయి (assam.gov.in లో పేర్కొన్నారు). కాబట్టి సంస్కృతంతోనే కాకుండా, పర్షియన్, బెంగాలీ వంటి వివిధ భాషల ప్రభావం కూడా అస్సామీ భాషపైన శతాబ్దాలుగా ఉందని తమూలి (1972) పేర్కొన్నారు .
ప్రస్తుతం, సంస్కృత, అస్సామీ భాషల సమాంతర పదాలలో ధ్వని మార్పులు అంటే హల్లులు, అచ్చులల్లో జరిగే వివిధ ధ్వని మార్పుల విశేషాలను సాధారణ భాషాశాస్త్ర దృక్పథంతో పరిశీలించడమే ముఖ్య ఉద్దేశం.

2. పూర్వ పరిశోధన:

సంస్కృత భాషల ధ్వనులను గూర్చి, అస్సామీ భాషల ధ్వనులను గూర్చి వేరువేరుగా పరిశోధనలు జరిగాయి. కానీ, సంస్కృత, అస్సామీ భాషల సమాంతర పదజాలంలోని ధ్వని మార్పులను గూర్చి అధ్యయనం జరగలేదనే చెప్పాలి. w.s ఆలెన్, ఫ్రిట్స్ స్టాల్, కిపారస్కి, జార్జి కారడోనా లాంటి ప్రముఖులు సంస్కృతం గురించి విపులంగా భాషాశాస్త్ర దృక్పథంలో పనిచేసిన పాశ్చాత్య భాషా శాస్త్రజ్ఞులు.

హెచ్.ఎస్. అనంతనారాయణ, కుంజున్ని రాజ, పి.ఎస్.సుబ్రహ్మణ్యం, కోరాడ సుబ్రహ్మణ్యం లాంటి భారతీయ భాషాశాస్త్రజ్ఞులు సంస్కృతం మీద విపులంగా పరిశోధన చేశారు. అస్సామీ ధ్వనులు, వర్ణాలపై పరిశోధన జరిపిన వారిలో గోస్వామి, చటర్జీ, దేఖ, తములి, శర్మ, బరువ లాంటివారు ఉన్నారు.

దేవానంద(1959) తన పుస్తకంలో అసం,అస్సాం,అహోమ్ మొదలగు పదాల వ్యుత్పత్తిని చర్చించి, అస్సామీ భాషకు హిందీ,పర్షియన్,బెంగాలీ భాషల సంబంధాన్ని వివరించారు.

కాకతి (1941), అస్సామీలో అనార్య భాషా పదాలను, అస్సామీ పై ఆస్ట్రో ఆసియాటిక్ , టిబెటో బర్మన్ ప్రభావాన్ని, అనార్య స్థలనామాలను గురించి చర్చించారు. దేక (1990) భాషా కలయికల గురించి, వర్ణాల మార్పును గురించి చర్చ చేశారు. మౌస్మిత శర్మ, కందర్ప శర్మ (2014 ) అస్సామీ ధ్వనులను గూర్చి సంగణక భాషా శాస్త్రాన్ని దృక్పథంతో చర్చించారు. వీరి అభిప్రాయం ప్రకారం అస్సామీలో 8 అచ్చులు, 15 స్వరాచ్చులు, 24 హల్లులు ఉన్నాయి.   సంస్కృత భాష ధ్వనులపై W.S. అలెన్ (1953) ప్రాచీన సంస్కృత ధ్వనిశాస్త్రం పైన వ్రాసిన ప్రామాణిక గ్రంథం. శ్రీమన్నారాయణ మూర్తి (1984) ప్రకారం సంస్కృతంలో 13 అచ్చులు, 25 స్పర్శాలు, 7 ఊష్మాలు, 4 అంతస్థలు, 1 సహజ అనునాసికము (Pure nasal) అన్ని కలిపి 50 వర్ణాలుగా పేర్కొన్నారు.

ఈ అధ్యయనాలను పరిశీలించినపుడు ప్రాచీన విశిష్ట భాషాలుగా గుర్తింప బడిన సంస్కృత, అస్సామీ భాషల సమాంతర పదజాలంలో ధ్వని మార్పులను వివరించిన అధ్యయనాలు ప్రత్యేకంగా కనిపించకపోవడం ఈ అధ్యయనానికి నాంది పడింది.

ఈ సందర్భంగా, సంస్కృత, అస్సామీ భాషల మధ్య ఉన్న ధ్వని మార్పులను పరిశీలించడానికి డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్1 విధానాన్ని  అనుసరించడం జరిగింది.

3. విషయసేకరణ విధానం:

ప్రస్తుత పత్రం కొరకు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రం చదివిన నలుగురు అస్సామీ మాతృభాషా వ్యవహర్తలు (సుకన్య శివం, గార్గి, ప్రేరణ, ప్రస్తుతి ) 20 నుండి 25 సంవత్సరాల వయస్సు కలవారినుండి సమాచార సేకరణ చేశాము. సమాచార సేకరణకు సి . ఐ . ఐ . ల్ (C.I.I.L)2 వారు రూపొందించిన పదావళిని ఉపయోగించి దాదాపు 400 పదాలను సేకరించడం జరిగింది. సంస్కృత పదాలను, అర్థాలను అంతర్జాలం నుండి (Link) తీసుకున్నాము. వాటి నుండి సంస్కృత, అస్సామీ భాషల మధ్య ఉన్న సమాంతర పదజాలాన్ని దాదాపు 200 పదాలను వేరుచేసి వాటిని IPA3 లో వ్రాసుకోవడం అనే ప్రక్రియ భాషాశాస్త్ర ప్రాథమిక నియమం కాబట్టి ఈ పత్రంలోని పదాలన్నీ IPAలోనే వ్రాసాము. ఆ విధంగా వ్రాసిన పదజాలం లోని హల్లుల్లో, అచ్చుల్లో ఉన్న సామ్యాలనీ, బేధాల్ని గుర్తించాము. తర్వాత క్యాంప్ బెల్(1998) సూచించిన ధ్వని మార్పుల పద్ధతుల్ని అనుసరించి సంస్కృత, అస్సామీ భాషల మధ్య గల ధ్వని బేధాల్ని వివరించాము.

4. ధ్వని మార్పుల విశ్లేషణ :

సాధారణంగా ఒకే మూల భాషనుంచి వచ్చిన భాషలలోని పదాల స్వరూపాలలో వచ్చిన మార్పులని Lexical change అనీ వాటి అర్థాలలో వచ్చిన మార్పుని semantic changeఅనీ పిలవటం జరుగుతుంది. ఈ పత్రంలో Lexical changeలో భాగమైన ధ్వని మార్పులను మాత్రమే విశ్లేషించడం జరిగింది. ధ్వని మార్పుల్లో హల్లు ధ్వని మార్పులు, అచ్చు ధ్వని మార్పులు అని రెండు రకాలుగా విశ్లేషణని విభజించుకొని మొదట సంస్కృతం నుండి అస్సామీస్ కి జరిగిన హల్లు ధ్వని మార్పులు, తరువాత సంస్కృతం నుండి అస్సామీస్ కి జరిగిన అచ్చు ధ్వని మార్పులని క్రింద ఇవ్వడం జరిగింది. క్రింది పదాలలో చాలావరకు ఒకటి కంటే ఎక్కువ ధ్వని మార్పులు జరిగినప్పటికీ, పదాల పట్టిక పైన ఇచ్చిన సూత్రాన్ని ప్రధాన ధ్వని మార్పుగా చూడవలసి ఉంటుంది.

1. సంస్కృతం నుండి అస్సామీకి జరిగిన హల్లు ధ్వని మార్పులు :

క్రింద ఇచ్చిన పద గణాలలో దాదాపు 16 రకాల ధ్వని మార్పులు కనబడుతున్నవి. వాటిని సోదాహరణలతో క్రింద ఇవ్వడం జరిగింది.

1.1. సంస్కృత పదాంత అనునాసిక ధ్వని /n/, అస్సామీ పదాంతంలో లుప్తమౌతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

1

/dʰanvan/

/dʰɔnwɔ/

ఎడారి

2

/janman/

/zɔnmɔ/

పుట్టుక

3

/carman/

/sɔɹmɔ/

చర్మం

4

/bʰasman/

/bʰɔsmɔ/

బూడిద

5

/mālin/

/mali/

తోటమాలి

6

/patʰin/

/pɔtʰ/

పంథా

7

/mamtrin/

/mɔntɹi/

మంత్రి

8

/balin/

/bɔli/

బలమైన

9

/upakarin/

/upɔkaɹ/

ఉపయోగకరమైన

10

/ekadas′an/

/ekadɔx/

పదకొండు

1.2 సంస్కృత పదాంత అనునాసిక ధ్వని /m/, అస్సామీ పదాంతంలో లుప్తమౌతుంది. 

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

11

/aranyam/

/ɔɹɔinyɔ/

అడవి

12

/svarnam/

/swɔɹnɔ/

బంగారం

13

/visvam/

/biswɔ/

ప్రపంచం

14

/raṣtṛam/

/ɹastɹɔ/

రాజ్యం

15

/srimgam/

/sɹiŋgɔ/

కొమ్ము

16

/raktam/

/ɹɔktɔ/

రక్తం

17

/nētram/

/nɛtɹɔ/

కన్ను

18

/taila/

/toilɔ/

నూనె

19

/vastram/

/bɔstɹɔ/

దుస్తులు

20

/ratnam/

/ɹɔtnɔ/

రత్నం


1.3 సంస్కృత పదాంత కంఠమూలీయ ఊష్మమము /h/ అస్సామీ భాషలో లుప్తమౌతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

21

/gʰanah/

/gʰɔnɔ/

మేఘం

22

/maruh/

/moɹu/

ఎడారి

23

/agnih/

/ɔgni/

అగ్ని

24

/usmah/

/usmɔ/

వేడి

25

/girih/

/giɹi/

కొండ

26

/dʰatuh/

/dʰatu/

లోహం

27

/camdrah/

/sɔndɹɔ/

చంద్రుడు

28

/varsah/

/bɔɹxa/

వర్షం

29

/bʰa:nuh/

/bʰanu/

సూర్యుడు

30

/taraṃgaḥ/

/tɔɹɔŋgɔ/

అల


1.4 సంస్కృత దంత్యోష్ఠ ఊష్మమము /v/ అస్సామీలో /b/ గా అంటే ఓష్ఠ స్పర్శంగా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

31

/gahvaram/

/gɔhbɔɹ/

గుహ

32

/prthivi/

/pɹitʰibi/

భూమి

33

/parvatah/

/pɔɹbɔt/

పర్వతం

34

/vṛṣti/

/bɹisti/

వర్షం

35

/vidyut/

/bidyut/

విద్యుత్

36

/utsavah/

/utxɔb/

పండుగ

37

/śaiśavam/

/xoixɔb/

బాల్యం

38

/ma:navah/

/manɔb/

మనిషి

39

/dēvah/

/dɛb/

దేవుడు

40

/visvam/

/biswɔ/

ప్రపంచం


1.5 సంస్కృత అనునాసిక ధ్వని /m/ అస్సామీ భాషలో పద మధ్య స్థానంలో /n/, /ŋ/ గా మారుతుంది. దీన్నే అనునాసిక సమీకరణం (nasal assimilation) అని అంటారు

1.5.1 సంస్కృత ఓష్ఠ అనునాసికం /m/ అనే ధ్వని /d/, /t/, /tʰ/,/dʰ/ ధ్వనులముందు అస్సమీలో వచ్చినప్పుడు /n/ గా మారుతుంది

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

41

/camdrah/

/sɔndɹɔ/

‘చంద్రుడు’

42

/aṃdʰa/

/ɔndʰɔ/

‘గుడ్డి’

43

/jamtuḥ/

/zontu/

‘జంతువు’

44

/damtah/

/dɔntɔ/

‘దంతాలు’

45

/manibamdʰah/

/mɔnibɔndʰ/

‘మణికట్టు’

1.5.2 సంస్కృత /m/ ధ్వని, /g/, /sʹ/, /kʰ/,/h/ ధ్వనుల ముందు అస్సామీలో /ŋ/ గా మారుతుంది .

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

46

/vamśah/

/bɔŋxɔ/

‘కుటుంబం’

47

/srimgam/

/sɹiŋgɔ/

‘కొమ్ము’

48

/samkʰah/

/xɔŋkʰɔ/

‘శంఖం’

49

/simhah/

/xiŋhɔ/

‘సింహం’

50

/vikalāmga/

/bikɔlaŋgɔ/

‘వికలాంగుడు’


1.6 సంస్కృత పదాలలో ఉన్న ద్విత్త్వ(gemination) అక్షరాలు అస్సామీలో ద్విత్త్వ గుణాన్ని కోల్పోతుంది . ఈ ధ్వని మార్పులను అద్విత్వీకరణ (Degemination) అంటారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

51

/pittalam/

/pitɔl/

‘ఇత్తడి’

52

/mrittika/

/mɹitika/

‘మట్టి’

53

/pʰulla/

/pʰula/

‘వికసించడం’

54

/kukkurah/

/kukuɹ/

‘కుక్క’

1.7 సంస్కృత పదాలలోని పదాంత ‘హ’కారం అస్సామీలో కొన్ని సందర్భాలలో అనునాసిక /n/ , కంఠ స్పర్శంగా /k/ గా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

55

/sva:sah/

/swaxɔn/

‘శ్వాస’

56

/bālaḥ/

/balɔk/

‘బాలుడు’


1.8 సంస్కృత దంతోష్ట్యఊష్మం, అస్సామీలో -wɔ- గా పద మధ్యలో, అదే విధంగా రెండు అచ్చులా మధ్యలో అంతస్థలుగా మారుతాయి ఈ పద్దతినే Gliding of fricatives అని అంటారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

57

/dʰanvan/

/dʰanwɔ/

‘ఎడారి’

58

/dʰvanih/

/dʰwɔni/

‘ధ్వని’

59

/svarnam/

/swɔɹnɔ/

‘బంగారం’

60

/srōtasvini/

/sɹutɔswini/

‘నది’

61

/yuvarazah/

/zuwɔɹaz/

‘యువరాజు’

62

/aśvah/

/ɔswɔ/

‘గుర్రం’

63

/śva:sah/

/swaxɔn/

‘శ్వాస’

64

/lavaṇaṃ/

/lɔwɔn/

‘ఉప్పు’

65

/vēśya/

/beisya/

‘వేశ్య’

66

/dēvālayah/

/dɛwaloy/

‘గుడి’

67

/dʰvajah/

/dʰwɔza/

‘ధ్వజం’

68

/śva:sah/

/swaxɔn/

‘శ్వాస’


1.9 సంస్కృత /ś/, /ṣ/,/s/ ధ్వనులు అస్సామీలో /x/గా పదాది, పదమధ్యలో కన్పిస్తుంది. ‘r’ కార ఉచ్చరణలో తేడాను కూడా గమనించవచ్చు .

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

69

/vasudʰa/

/bɔxudʰa/

‘భూమి’

70

/suvarnam/

/xuwɔɹnɔ/

‘బంగారం’

71

/tusāra/

/tuxaɹ/

‘మంచు’

72

/sarōvarah/

/xoɹubɔɹ/

‘సరస్సు’

73

/niśa/

/nixa/

‘రాత్రి’

74

/jalaśayah/

/zɔlaxoy/

‘చెరువు’

75

/varṣah/

/bɔɹxa/

‘వర్షం’

76

/sila/

/xi:la/

‘రాయి’

77

/sa:garah/

/xagɔɹ/

‘సాగరం’

78

/śiśuḥ/

/xi:xu/

‘శిశువు’

79

/vaṃśah/

/bɔŋxɔ/

‘కుటుంబం’

80

/puruṣaḥ/

/puɹux/

‘పురుష’

1.10 సంస్కృత /s/, /ṣ/, /ś/ హల్లులు ముందు వచ్చినప్పుడు /x/ గా మారకుండా కూడా ఉంటుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

81

/srōtasvini/

/sɹutɔswini/

‘నది’

82

/prastaraḥ/

/pɹɔstɔɹ/

‘రాయి’

83

/śramaḥ/

/sɹɔmi/

‘శ్రామికుడు’

84

/stri/

/stɹi:/

‘స్త్రీ’

85

/sva:sah/

/swaxɔn/

‘శ్వాస’

1.11 సంస్కృత పదాలలో/s/, /ṣ/ ఉన్న పదాంత ధ్వనులు అస్సామీలో లుప్తమవుతాయి.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

86

/camdramas/

/sɔndɹɔ/

‘చంద్రుడు’

87

/vakṣas/

/bɔkʰjɔ/

‘రొమ్ము’

88

/śras/

/xi:ɹ/

‘శిరస్సు’

89

/muṣṭi/

/mutʰi/

‘పిడికిలి’

90

/o:ṣṭʰah/

/u:tʰ/

‘పెదవి’

91

/kōṣṭʰah/

/kutʰa/

‘గది’

1.12 సంస్కృతం/ɟ/ కారం అస్సామీలో పదాది, పదమధ్య, పదాంత పరిసరాల్లో /z/ గా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

92

/jalam/

/z:ɔl/

‘జలం’

93

/janani/

/zɔnɔni/

‘జనని’

94

/jamtuḥ/

/zɔntu/

‘జంతువు’

95

/janman/

/zɔnmɔ/

‘జన్మం’

96

/jivanam/

/ziwɔn/

‘జీవితం’

97

/jakrt/

/zɔkɹit/

‘కాలేయం’

98

/bi:jam/

/bi:z/

‘బీజం’

99

/dʰvajah/

/dʰwɔza/

‘ద్వజం’

100

/vijayah/

/bizɔi/

‘విజయం’

1.13 సంస్కృత పదాల్లోని మూర్ధన్య ధ్వని అస్సామీలో లోపిస్తుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

101

/vṛṣti/

/bɹisti/

‘వర్షం’

102

/gʰaṭah/

/gʰɔti/

‘కుండ’

103

/kōṣṭʰah/

/kutʰa/

‘గది’

104

/amḍam/

/ɔndɔ/

‘గుడ్డు’

105

/raṇam/

/ɹɔ:n/

‘యుద్ధం’


1.14 సంస్కృత పదాల్లో ఉన్న మహాప్రాణ ధ్వనులు అస్సామీలో మహాప్రాణత్వాన్ని కోల్పోతాయి , అందుకు భిన్నమైన ఉచ్చారణ కూడా 105 లో కనిపిస్తుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

106

/muṣṭi/

/mutʰi/

‘పిడికిలి’

107

/amguṣṭʰah/

/ɔŋgustɔ/

‘బొటనవేలు’

108

/bʰaṣpaḥ/

/baspɔ/

‘ఆవిరి’


1.15 సంస్కృతం నుండి అస్సామీకి పదాలు మారినప్పుడు సంయుక్తీకరణం ,అసంయుక్తీకరణాలు కూడా కనిపిస్తుంటాయి.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

109

/tṛiṣ/

/tɹisna/

‘దాహం’

110

/kṣudʰa/

/kʰudʰa/

‘ఆకలి’

1.16 సంస్కృత కంపితం అస్సామీలో అంతస్థగా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

111

/ratṇam/

/ɹatnɔ/

‘రత్నం’

112

/ratɹi/

/ɹati/

‘రాత్రి’

113

/timir/

/timiɹ/

‘చీకటి’

114

/pritʰivi/

/pɹitʰibi/

‘భూమి’

2. సంస్కృతం నుండి అస్సామీస్ కి మధ్య జరిగిన అచ్చు ధ్వని మార్పులు:

సంస్కృతం నుండి అస్సామీకి అచ్చు ధ్వనుల్లో దాదాపు 11 రకాల మార్పులను ఈ క్రింది పద గణాలలో గమనించవచ్చు.

2.1 పదాది పదమధ్య పదాత స్ధానాల్లో ఉన్న /a/ అస్సామీలో /ɔ/ గా మారుతుంది. నిమ్నఅచ్చు మధ్య అచ్చుగా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

1

/vasudʰa/

/bɔxudʰa/

‘భూమి’

2

/prastaraḥ/

/pɹɔstɔɹ/

‘రాయి’

3

/pittalam/

/pitɔl/

‘ఇత్తడి’

4

/gahvaram/

/gɔhbɔɹ/

‘గుహ’

5

/gʰanah/

/gʰɔnɔ/

‘మేఘం’

6

/vakṣas/

/bɔkʰjɔ/

‘రొమ్ము’

7

/amḍam/

/ɔndɔ/

‘గుడ్డు’

8

/puspam/

/puspɔ/

‘పువ్వు’

9

/tṛṇam/

/tɹinɔ/

‘మూలిక’

10

/patram/

/pɔtɹɔ/

‘ఆకు’

11

/ambu/

/ɔmbu/

‘నీరు’

12

/patʰin/

/pɔtʰ/

‘రోడు’

2.2 సంస్కృత /ah/ అనే పదాంత అక్షరం, అస్సామీలో లోపిస్తుంది . దీనిని 'అక్షరసంకోచం' అని పిలుస్తారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

13

/aṃdʰakarah/

/ɔndʰɔkaɹ/

‘చీకటి’

14

/nihàraḥ/

/niha:ɹ/

‘మంచు’

15

/parvatah/

/pɔɹbɔt/

‘కొండ’

16

/hradah/

/hɹɔd/

‘సరస్సు’

17

/sarōvarah/

/xoɹubɔɹ/

‘సరస్సు’

18

/sumbakah/

/sumbɔk/

‘అయస్కాంతం’

19

/sa:garah/

/xagɔɹ/

‘సముద్రం’

20

/ākāsʹah/

/akax/

‘ఆకాశం’

21

/divākarah/

/dibakɔɹ/

‘సూర్యుడు’

22

/kumarah/

/kumaɹ/

‘యువరాజు’

2.3 సంస్కృతంలో /am / తో అంతమయ్యే పదాలు అస్సామీలో పదాంత స్ధానాల్లో /am / లోపిస్తుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

23

/pittalam/

/pitɔl/

‘ఇత్తడి’

24

/gahvaram/

/gɔhbɔɹ/

‘గుహ’

25

/timiram/

/timiɹ/

‘చీకటి’

26

/gaganam/

/gɔgɔn/

‘ఆకాశం’

27

/tuhinam/

/tuhin/

‘మంచు’

28

/jalam/

/zɔl/

‘నీరు’

29

/bʰuvanam/

/bʰuwɔn/

‘భువనం’

30

/śaiśavam/

/xoixɔb/

‘శైశవం’

31

/kutumbam/

/kutumb/

‘కుటుంబం’

32

/śōṇitam/

/xunit/

‘రక్తం’

2.4 /a/తో అంతమయ్యే సంస్కృత పదాలు అస్సామీలో పదాంతం లోపిస్తాయి.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

33

/tusāra/

/tuxaɹ/

‘మంచు’

34

/marana/

/mɔɹɔn/

‘మరణం’

35

/badʰira/

/bodʰiɹ/

‘చెవిటి’

36

/vikala/

/bikɔl/

‘వికలాంగుడు’

37

/kʰe:la/

/kʰel/

‘ఆట’

38

/samgita/

/xɔŋgit/

‘సంగీతం’

39

/dūra/

/duɹ/

‘దూరం’

2.5.   సంస్కృత పదాల్లో కనిపించే /e / అనే అచ్చు అస్సామీలో /ɛ/ గా మారుతుంది. దీన్ని అచ్చుసమీకరణం అంటారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

40

/megʰah/

/mɛgʰ/

‘మేఘం’

41

/nētram/

/nɛtɹɔ/

‘కన్ను’

2.6.   సంస్కృత పదాల్లోన్ని /a / అచ్చు అస్సామీలో పదమధ్య స్ధానంలో /o / గా మారుతాయి.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

42

/maruh/

/moɹu/

‘ఎడారి’

43

/vasudʰa/

/boxudʰa/

‘భూమి’

44

/sarōvarah/

/xoɹubɔɹ/

‘సరస్సు’

45

/nadi/

/nodi/

‘నది’

46

/sakʰi/

/xokʰi/

‘స్నేహితురాలు’

47

/patih/

/poti/

‘భర్త’

48

/mahisi/

/mohixi/

‘రాణి’

49

/paksʹin/

/pokʰi/

‘పక్షి’

50

/kapih/

/kopi/

‘కోతి’

51

/madʰu/

/modʰu/

‘తేనె’

2.7.  సంస్కృతంలో ...... /r /వర్ణం  పదాది, పదమధ్య, పదాంతం లో ఉన్నట్లయితే అస్సామీలో దీని తరువాత /i / అచ్చు వస్తుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

52

/prtʰivi/

/pɹitʰibi/

‘భూమి’

53

/vṛṣti/

/bɹisti/

‘వర్షం’

54

/varasah/

/bɔɹɔxa/

‘వర్షం’

55

/krpanah/

/kɹipɔn/

‘లోభి’

56

/vṛsʹcikah/

/bɹisik/

‘వృశ్చికం’

57

/pṛṣtʰam/

/pɹistʰɔ/

‘వీపు’

58

/hṛdayam/

/hɹidɔy/

‘హృదయం’

59

/jakrt/

/zɔkɹit/

‘కాలేయం’

60

/matṛ/

/matɹi/

‘అమ్మ’

61

/citr/

/sitɹɔ/

‘చిత్రం’

2.8. సంస్కృతం /o/  అస్సామీస్ లో /u/ గా మారుతుంది. అంటే మధ్యాచ్చు, ఉన్నతాచ్చుగా మారుతుంది .   ఈ రకమైన మార్పుని Vowel raising గా పిలుస్తారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

62

/srotas/

/sɹutɔs/

‘వరద’

63

/sarōvarah/

/xoɹubɔɹ/

‘సరస్సు’

64

/srōtasvini/

/sɹutɔswini/

‘నది’

65

/kapōlah/

/kɔpul/

‘చెంప’

66

/rōgah/

/ru:g/

‘రోగం’

67

/klōmam/

/klu:m/

‘ఊపిరితిత్తు’

68

/rasōnah/

/ɹɔsun/

‘వెల్లుల్లి’

69

/hima/

/hi:m/

‘మంచు’

70

/silā/

/xi:la/

‘శిల’

71

/sillah/

/si:la/

‘పతంగి’

72

/gānam/

/ga:n/

‘గానం’

73

/rāgah/

/ɹa:g/

‘రాగం’

2.9 సంస్కృతం నుండి అస్సామీస్ కు పదాది, పద మధ్య స్థానాల్లో ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వాచ్చుగా మారుతుంది.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

74

/sa:garah/

/xagɔɹ/

‘సముద్రం’

75

/ta:raka/

/taɹɔka/

‘నక్షత్రం’

76

/na:ri/

/naɹi/

‘నారీ’

77

/pa:nih/

/pani/

‘చేయి’

78

/ma:la:/

/mala/

‘పూలమాల’

2.10 సంస్కృతం /a/ అనే  అచ్చు అస్సామీస్ లో  /ɔi/, /ai/ గా మారుతుంది . అలాగే /e/ అనే అచ్చు /ei/ గా పద మధ్య స్థానంలో మారుతుంది . ఈ రకమైన ధ్వని మార్పుని diphthongisation గా పిలుస్తారు.

#

సంస్కృతం

అస్సామీ

అర్థం

79

/kanya/

/kɔinya/

‘కూతురు’

80

/rāzyam/

/ɹaizyɔ/

‘రాజ్యం’

3. ముగింపు:

  •  రెండు ప్రాచీన విశిష్ట భాషలైన సంస్కృతం, అస్సామీ భాషల సంబంధాన్ని, సామ్యాలని హల్లుల, అచ్చుల ధ్వని మార్పుల ద్వారా అర్థం చేసుకునే చిరు ప్రయత్నమే ఈ పత్రం.  
  • హల్లులలొ మూడు రకాల ధ్వని మార్పులు స్థూలంగా కనిపిస్తున్నాయి అవి  ధ్వని లోపించడం, ధ్వని ఆగమం, ధ్వని ఇంకో ధ్వనిగా పాక్షికంగా లేదా సంపూర్ణంగా మార్పు చెందడం. వాటిలో కనిపిస్తున్న కొన్ని ముఖ్యమైన ధ్వని మార్పులు - అనునాసికాలు మరో  అనునాసికంగా లేదా అననునసికంగా మార్పు చందడం. 
  • ద్విత్త్వ లోపం , ఒక ధ్వని రెండు వేరు వేరు ధ్వనులుగా మారడం. 
  • మూర్థన్యత్వం లోపించడం. మహాప్రాణ లోపం, ఊష్మీకరణం లాంటివి సంస్కృతం నుండి అస్సామీ భాషలో కనిపిస్తున్నాయి. 
  • అదే విధంగా అచ్చుల్లో కూడా ఆగమము, లోపం, మార్పు అనే మూడు ప్రాథమికమైన ధ్వని మార్పులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా నిమ్న అచ్చులు, మధ్య లేదా అగ్ర అచ్చులుగా లేదా అగ్ర అచ్చు అనగ్ర అచ్చుగా  మారడం లేదా వ్యతిరేక పద్దతిలో  మారడం. 
  • అచ్చు+హల్లు పదాంతంలో ఉంటే అవి లోపించడం, హ్రస్వ అచ్చు దీర్ఘ అచ్చుగా లేదా దానికి విరుద్ధంగా మారడం లాంటి ముఖ్యమైన అచ్చు మార్పులను విపులంగా చర్చించడం జరిగింది.     
    జన్య జనక సంబంధం ఉన్న భాషల ధ్వని మార్పుల ద్వారా మూల భాషాపునర్నిర్మాణం సాధ్యమౌతుంది. ఈ ధ్వని మార్పుల అధ్యయన మూలనిర్మాణమే కాక వాటితో సంపర్కంలో ఉన్న భాషల ధ్వని ప్రవర్తన, పరివర్తన కూడా అర్హమౌతుంది. ఉదాహరణకు బ కారం వ కారం గా మారడం బంగ్లా, అస్సామీ, భోజ్ పురిలో కనబడుతుంది.  కానీ దక్షిణాది భాషాల్లో వ, బ లు ప్రత్యేక ధ్వనులుగా ఉంటాయి. 
  • కావున ధ్వని మార్పులు ప్రయాణించిన దిశ, దశలను నిర్ధారించడానికి ఈ రకమైన అధ్యయనాలు ఉపయోగపడతాయి.

4. సూచికలు:

  1. నిర్ణీత కాలంలో ఒక భాషా నిర్మాణం ఎట్లా ఉందో అని వర్ణించే శాస్త్రం
  2. అంతర్జాతీయ ధ్వని శాస్త్రజ్ఞుల సంఘం, ప్రపంచ భాషాల్లో ఉన్న ధ్వనులను గుర్తించి నిర్దుష్టంగా సూచించగల ప్రామాణిక లిపిని తయారు చేసింది దానినే IPA chart అంటారు
  3. Central Institute of Indian Languages వారు 2016 లో అంతరించి పోతున్న భాషలను documentation చేయడం కోసం తయారు చేసిన కరపుస్తకం

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. Allen, W. S. 1953. Phonetics in Ancient India. Oxford University Press. London.
  2. Campbell, L. 1998. Historical linguistics: An introduction. The MIT Press.
  3. Deka, P. K. 1990. Language Contact and Phonological Change in Assamese. Indian Linguistics, 51(1-4), 1-15.
  4. Devananda, B. 1959. A study of Phonology and Vocabulary of The Assamese language. Jorhat. Assam.
  5. Kakati, B. (1941).Assamese Its Formation and Development. G.S.Press, Madras. 
  6. Language documentation handbook. (2016). Scheme for protection and preservation of Endangered languages. CIIL. Mysore.
  7. Murti, Srimannarayana.M. 1984. An introduction to Sanskrit Linguistics. D.K.Publications. Delhi.
  8. Sarma, M. & Sarma, K. 2014. Sounds of Assamese Language. Phoneme _Based speech segmentation using Hybrid soft Framework. Springer.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]