headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. ‘ఎమ్. హరికిషన్’ జానపదకథలు: పాత్రల విశ్లేషణ

డా. కె. ధనశ్రీ

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, నంద్యాల,
నంద్యాల, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7386893278, Email: dr.prof.reddy@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

“డా. ఎమ్‌. హరికిషన్‌ కథాసాహిత్యంలో జానపద కథలు విశ్లేషణ” అనేది ఈ వ్యాసానికి ప్రధానభూమిక. ఈ జానపద కథల్లో కల్పనే ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ కల్పనలో అవాస్తవికత ఎక్కువగా చోటు చేసుకుంటుంది. అవాస్తవికతతో పాటు సందేశమూ, నీతి ఉంటాయి. మొత్తం మీద జానపదులు అందరి మనస్సును ఆహ్లాదపరుస్తూ, తమకు తెలిసినజ్ఞానాన్ని పంచుతూ, బాలల్లో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను కల్పించే కథే బాలల జానపద కథగా చెప్పవచ్చు. నేను ఈ పరిశోధనకుగాను క్షేత్ర పర్యాటనద్వారా కొంత సమాచారాన్ని సేకరించడంతోపాటు, ప్రామాణిక ద్వితీయ గ్రంథాలనలోని విషయాల్ని కొంత ఉపయోగించాను. అంతే కాకుండా నా పరిశోధనా గ్రంథంలోని కొంత సమాచారాన్ని సేకరించి, వాటికి కొన్ని మార్పులు చేసి, విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసాన్ని తీర్చిదిద్దాను.

Keywords: నీతి, కల్పన, ఆహ్లాదం, ఆకర్షణ, జిజ్ఞాస, సందేశము, జ్ఞానం.

1. ఉపోద్ఘాతం:

డా. యం. హరికిషన్‌ 19-05-1972 వ సంవత్సరంలో జన్మించారు. ఈయనిది కర్నూలు జిల్లా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరు ‘‘కేతువిశ్వనాథరెడ్డి కథలు- సామాజిక దర్శనం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టాను పొందారు. ఈయన పిల్లలు మాట్లాడుకొనే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదువుకునేలా కథలు రాయడంలో నేర్పరి. రింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లద్దప్పా, ఒకటి తిందునా రెండు తిందునా, నక్కబావ- పిల్లిబావ, నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండమొనగాడు మొదలగు శీర్షికతో జానపదకథా సంపుటాలను ప్రచురించారు. కర్నూలు జిల్లాలో వున్న కథలు ‘‘కర్నూలు కథ’’ అన్న పేరుతో వీరి సంపదాకత్వంలో వెలువడింది. 1

2. జానపదకథ అర్థం:

‘‘కథ అంటే వృత్తాంతం. కొన్ని సత్య అంశాలతో కూడుకున్న కల్పిత కథనం. గేయరూపకంగా గాక కథనరూపకంగా ఉన్న వచనం. జానపదత్వంతో కూడుకొని సత్యాంశాలతో మేళవించి కథన. రూపకంగా ఉన్న కల్పితకథ జానపదకథ”.2 అని డాక్టర్‌ జి.యస్‌. మోహన్‌ అన్నారు. ఆలోచనలతో కూడి అనుభవాల నుంచి పుట్టిన మాటలు జాఱపడి కథలైనాయన వచ్చునని కె.వి.యస్‌.ఎల్‌. నరసమాంబ చెప్పారు.3 ఈ నిర్వచనాల్ని పరిశీలించాక ‘జానపదుల జీవితంలో జరిగిన సంఘటనలను, మౌఖికంగా ఒక తరం నుండి మరొకతరానికి అందించే కథలను ‘జానపద కథ’’ అని గుర్తించవచ్చు. ఈ కథలల్లో ఎక్కువగా కన్పించేది సాహసప్రవృత్తి. జానపదకథ కల్పనకు అవసరమైన మూలాంశాలు ఈ కథల్లో అధికంగా కన్పిస్తుంటాయి. కథలల్లో అక్కడక్కడ హాస్యం చమత్కారం, సమయస్ఫూర్తి కన్పించినా కథ మొత్తం మీద గంభీరంగా ఉంటుంది. నాయకులు ఎక్కువుగా సాహస కార్యాలవైపు మొగ్గు చూపుతుంటారు.

ఈ అంశాలతో కూడిన కథలను డా. ఎమ్‌. హరికిషన్‌ సేకరించిన కథలల్లో గమనించవచ్చు. మచ్చుకకు కొన్ని కథలను ఈ వ్యాసంలో పరిశీలిద్దాం.

2.1 నల్లకుక్కకథ:

ఒక ఊరిలో ఒక ఆమె వుండేది. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాడికి పది సంవత్సరాలు వచ్చినా మరలా ఆమెకు సంతానం కలగలేదు. సుంకాలమ్మ వరానఒక కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి కూడా కొద్దిరోజులకు చనిపోతాడు. అన్న తమ్ముడ్ని బాగా చూసుకునేవాడు. వదిన కూడా బాగా చూసేది. ఒకరోజు పక్కింటి ముసలమ్మ వచ్చి లేనిపోని సాడీలు చెప్పి ఒక మంత్రంతో ‘‘శీల’’ ఇచ్చి చిన్నవాని తలలో దాన్ని గుచ్చమని చెపుతుంది. వదిన అలాగే చేసింది ఆ అబ్బాయి నల్లకుక్కుగా మారిపోతాడు. ఇంటి నుండి అది రాజుల భవనంలోకి చేరుకుంటుంది.

రాజు కూతురుకు కుక్కతో పెళ్లిచేయమని సుంకాలమ్మ కలలో కనిపించి చెప్తుంది. రాజు అలాగే చేస్తాడు. ఒక రోజు భార్య తలలో వున్న ముల్లు తీయగానే అందగాడుగా మారిపోతాడు. కొన్ని రోజుల తరువాత అన్నావదినెలు కట్టెలు అమ్ముకుంటూ వీధుల్లోకి వస్తారు. తమ్ముడు వారిని పిలిపించి తన వద్ద వుండమని చెబుతాడు. తమ్ముడి తలలో వదినశీల గుచ్చి నా దానిని సహృదయంతో తప్పుగా భావించక, పేదవారిగా మారి కట్టెలు అమ్ముకుంటూ బతుకులను వెళ్ళదీస్తున్న అన్నా వదినలను చేరదీయడం తమ్ముడి దయా హృదయాన్ని తెలియజేస్తుంది.4

మొత్తానికి మనకు ఎవరైనా అపకారం చేసినా వారికి తిరిగి మనం ఉపకారం చేయడం మంచి వాళ్ళ యొక్క గుణం అని ఈ కథలోని తమ్ముడి పాత్ర ద్వారా రచయిత మనకు సందేశం ఇచ్చాడు. ఈ కథలో వదిన పాత్రకు ఒక సామెత వర్తిస్తుంది. ‘‘చెడపకురా చెడేవు’’ అంటే ఈ కథలో వదిన తన మరిదిని నాశనం చేయాలని చూసింది. కాని తనే అడుక్కుతినే పరిస్థితికి దిగజారింది. దేవుడు ఎప్పుడూ మంచివాళ్ళ వైపు ఉంటాడని ఈ కథలో తమ్ముడి పాత్ర ద్వారా మనం గుర్తించవచ్చు.‘అపకారికి ఉపకారము’ చేయాలి అని సుమతీ పద్యంలో ఒక వాక్యం ఉంది. అది తూచా తప్పకుండా ఈ కథలో తమ్ముడి పాత్ర తన అన్న వదిన పట్ల ప్రవర్తించడం అందరు మెచ్చదగినది అని మనం గుర్తించాలి. రచయిత ఈ కథలోని కొన్ని పాత్రల ద్వారా ఏది మంచి, ఏది చెడు అనేవిషయాన్ని మనకు తెలియజేశాడు. చెడుబుద్ది కలిగి ఉంటే వారి జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియజేశాడు. ఓపిక, ముందుచూపు వున్న ‘‘తమ్ముడి’’ పాత్ర ద్వారా రచయిత చాలా నీతి విషయాలను మనకు తెలియజేశాడు.

2.2 అక్కా - చెల్లెలు కథ:

‘‘ఒక ఊరిలో ఒక రైతు ఉంటాడు. అతనికి ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద కూతురు షావుకారు, చిన్న కూతురు పేదరాలు. అక్కకు డబ్బుందని గర్వమెక్కువ. అక్క తన కుమారుని పెండ్లికి చెల్లెలను పిలవకుండా అందరినీ పిలుస్తుంది. చెల్లెలు మాత్రం అక్క పిలవక పోయిన ఆకార్యానికి పోతుంది. అక్క పలకరించకుండా చెల్లెల్ని అంట్లు శుభ్రం చేయమంటుంది. అక్క చెల్లెలకు అన్నం పెట్టకుండా ఇంటికి తిరిగి పంపిస్తుంది. దాన్ని తలచుకుని దారిలో ఒక దేవతకు తన బాధ చెప్పుకుంటుంది. దారిలో ఒక చచ్చిన పాము కనబడుతుంది. దాన్ని తీసుకు వచ్చి ముక్కలుగా చేసి చెల్లి తన పిల్లలకు కూర చేసి కంచాలలో పెడుతుంది. అవి ముత్యాలు, రత్నాలుగా మారిపోతాయి. వాటితో భవనాలు కట్టి దానిలోహాయిగా ఉంటుంది. అక్క ఆ విషయం తెలుసుకుని తాను కూడా ఒక బ్రతికిన పామును చంపి, వండి తన పిల్లలకు పెడుతుంది అంతే అందరు చనిపోతారు.5

ఈ కథలో దేవుడు మంచి వారికి, నిజాయితీ గల వారికి ఓర్పు, గుణం కలిగిన వారికిసాయంచేస్తానని రచయిత మనకు ‘‘చెల్లి’’ పాత్ర ద్వారా తెలియజేశాడు. ఇది ‘‘అక్షరాల నిజం అని మనం గ్రహించాలి. అక్క పిలవకపోయిన చెల్లి పెండ్లికి పోయి ఎన్నో అవమానాలు పొందింది. చెల్లికి అక్క మీద ఎంత ప్రేమ ఉందో మనం గుర్తించవచ్చు. అమ్మ తరువాత అక్క తనకంటే చిన్నవాళ్ళకు తల్లిగా ఉంటుందని పెద్దలు చెపుతుంటారు. కాని ఆలోచన ఈ కథలో అక్క పాత్రకు లేదు. వయస్సులో పెద్దది కాని బుద్ధిలో తక్కువ అని చెప్పవచ్చు. స్వార్థపరురాలు అని తన ప్రవర్తన ద్వారా తెలుస్తు వుంది. ఇలాంటి అక్కలు సమజానికి, కుటుంబాలకు చీడపురుగులు లాంటి వారనీ చెప్పవచ్చు. ఈ కథలో చెల్లి వయస్సులో చిన్నది. బుద్ధిలో గొప్పదనీ, ఈమె నేటి స్త్రీలకు ఆదర్శంగా ఉందని గుర్తించవచ్చు. దైవం మీద తన బారం వేసి, చచ్చిన పామును తన పిల్లలకు ఆహారంగా పెట్టింది. ఇక్కడ తను తన కర్మఫలాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించింది. అయితే నేటి స్త్రీలు ఈ కథలోని చెల్లి పాత్రలాగా ఒక విషయంలో అనుసరించకూడదు. అది ‘‘పిల్లలకు విషం పెట్టడం’’ అట్ల ఏ తల్లీ చేయకూడదు. ఇది క్షమించరాని తప్పు ఈ కథలో అక్క అత్యాశపరురాలు అని తెలుస్తూ వుంది. చెల్లికి దేవుడు తోడు అయి ఆమె సంపన్నురాలు అయింది. అదే విధంగా ఈమె (అక్క) సంపన్నురాలు అవ్వాలని బ్రతికిన పామును చంపి తన పిల్లలకు పెట్టడం ఎలా వుందంటే ‘‘పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు’’ వుందని తెలుస్తూ ఉంది. అక్క ఈ కథలో తన చెల్లి పట్ల ప్రవర్తించిన తీరు ‘‘రక్త సంబందమునకు’’ మాయని మచ్చ వంటిది. దురాశ దు:ఖానికి చేటూ అంటారు. ఆ విధంగా ఈ కథలో అక్క పాత్ర, తన పిల్లలు అందరు చనిపోతారు. అత్యాశకు పోయి ఈ కథలో అక్క పాత్ర ప్రాణం మీదికి తెచ్చుకుంది. మొత్తం మీద రచయిత ఈ కథలో అక్క, చెల్లి పాత్రలు ద్వారా సమాజానికి చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు.

2.3 రేచీకటి అల్లుడు కథ:
‘‘ఒక ఊరిలో సుంకన్న అనే వ్యక్తి తనకు రేచీకటి ఉందని ఎవ్వరికి చెప్పకుండా వివాహం చేసుకుంటాడు. ఒకరోజు అత్తగారింటికి వెళ్తాడు. అత్తగారు భోజనం పెడుతుంది. పాయసం వేస్తా ఉంటే, అతనికి ఏదో అనిపించి వద్దు అత్తా అంటాడు. రాత్రి భార్య అతనితో పాయసం బాగుందని చెపుతుంది. వెంటనే గొంగళి కప్పుకుని వంట ఇంటిలోకి వెళ్తాడు. గిన్నెలో పాయసం లేదు, రుచి చూడటానికి మూతి పెట్టాడు అందులో ముఖం ఇరుక్కు పోతుంది. ఇంటిలో అందరు దొంగని చావగొడతారు. ముసుగు తీసిన తరువాత అల్లుడు అసలు విషయం చెప్పగా అందరు నవ్వుకుంటారు.6

ఈ కథలో సుంకన్న తనకు రేచీకటి వున్న విషయం పెళ్ళికి ముందే చెప్పాలి. అలా చెప్పకుండా మోసంతో అమ్మాయిని వివాహం చేసుకుని తన లోపమును కప్పిపుచ్చుకున్నాడు. ఇది క్షమించరాని తప్పు. సుంకన్న స్వార్థ పూరితం కలిగిన వ్యక్తి అని మనం గుర్తించాలి. పెళ్ళి అయినాక కనీసం భార్యకు అయిన తన లోపమును చెప్పివుంటే బాగుంటుంది. భార్యకు కూడా తెలియకుండా ఆ లోపంతో అత్తగారు ఇంటికి పోయి అందరితో అవమానాలు పొందాడు. నేటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు కోకోల్లలుగా వుంటారు. వారందరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళి అంటే ‘‘నూరుఏళ్ళు పంట’’ అని పెద్దలు చెపుతుంరు.భార్య భర్తలు అంటే పార్వతీ పరమేశ్వరులులాగా ఉండాలి. పాలల్లో నీళ్ళు కలసిపోయినట్లు భార్య భర్తలు వుండాలి. ఇద్దరిమధ్య రహస్యాలు ఏవీ ఉండకూడదు. దాపరికాలు కూడా వుండకూడదు. అలా ఉంటే ఒకరిని ఒకరు మోసం చేసుకొన్నట్లు అవుతుంది. భార్య భర్తల బంధానికి విలువ వుండదు. కాని వీటి అన్నింటికి వ్యతిరేకంగా ఈ కథలో సుంకన్న పాత్ర ఉంది. కనీసం భార్యకు కూడా తన లోపాన్ని చెప్పకుండా ఆమెతో కాపురం చేశాడు. పెళ్ళి కాక ముందు స్త్రీలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ‘‘ఆశలు అన్నీ అడియాసలు అయ్యాయి’’

ఈ కథలోని భార్యకు. ఇంక అత్తగారు మానసికంగా క్రుంగిపోతారు. మన అదృష్టం ఇంతే అనుకొని ఈ కథలో సుంకన్న భార్య, అత్తగారు వాళ్ళు సర్దుకుపోతారు. ఇది అందరు మెచ్చదగిన విషయం. కొంతమంది అత్తగార్లు విషయం తెలుసుకొన్న వెంటనే విడాకులు ఇప్పించటం, వేరే పెళ్ళి చేయడం లాంటివి చేస్తారు. ఈ కథలో సుంకన్న అత్తగారుఅలా చేయలేదు. భార్య భర్తలకు సర్ది చెప్పి కూతురు కాపురాన్ని నిలబెట్టి పంపుతారు. సమాజానికి ఆదర్శంగా నిలిచారు. లోపాలు లేని వ్యక్తి ఎక్కడా వుందురు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక లోపం వుంటుంది. ఆలోపం వుంది అని పెళ్ళి చేసకోకూడదని ఎక్కడా చట్టం లేదు. ప్రతివ్యక్తి సమాజంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు వుంది. కాకపోతే కలిసి బ్రతికే బార్య భర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది స్త్రీలు లోపాలు ఒప్పుకుని సర్దుకుపోయి కాపురం చేస్తారు. కొంతమంది స్త్రీలు ఒప్పుకోరు చట్ట ప్రకారం విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. అంతే కాకుండా స్త్రీకి కొంత డబ్బు, ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల నేటి యువత బాగా ఆచితూచీ పెళ్ళి విషయంలో అడుగు పెట్టాలి. ఈ విషయాలు పురుషులకు, స్త్రీలకు ఇద్దరికి వర్తిస్తా పురుషులే కాదు స్త్రీలు కూడా వివాహ విషయంలో మోసాలు చేస్తూంటారు. అందరుకాదు, కొంతమంది స్త్రీలు అని మనం గుర్తించాలి. మొత్తం మీద స్త్రీలు గానీ, పురుషులు గానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున, పెద్దలు చూసి పెళ్ళిల్లు చేస్తుంటారు. అలాంటి భార్యభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించాలి. తల్లిదండ్రులు సుఖ, సంతోషాలు పిల్లల జీవితాలతో ముడిపడి ఉంటాయి. వారిని కూడా భార్య భర్తలు దృష్టిలో పెట్టుకోవాలి. షాపులో వస్తువులు కొన్నట్లు మనుషులను కొని పెళ్ళిల్లుచేయలేము. మనం ‘‘మనుషులం’’ అది గుర్తు పెట్టుకోవాలి. షాపులో నచ్చని వస్తువును తీసుకొనిపోయి మార్చి, వేరే వస్తువులు తెచ్చుకుంటాము. అట్లా భార్య భర్తలను మార్చి పెళ్ళిల్లు చేయలేము. ప్రాణం మీదికి వచ్చినపుడు మార్చి వేరే పెళ్ళిల్లు చేస్తారు. మన పెద్దవాళ్ళు చిన్న చిన్న తప్పులకు విడాకులు తీసుకొని వేరే పెళ్ళి చేసుకోవడం అది మానవ జన్మకు మాయని మచ్చవంటిది అని మనం గుర్తించాలి. ఈ కథలో సుంకన్న లోపాన్ని తన భార్య, అత్తగారు తెలుసుకున్నాక సర్దుకుపోయారు. తల్లిదండ్రులు అంటే ఈ కథలోని అత్తలు, భార్యలాగా ఉండాలనీ ఈ కథ ద్వారా రచయిత మనకు సందేశం ఇచ్చారు.

2.4 మా మల్లన్న సచ్చిపాయకథ:

‘‘ఒక రోజు చాకలి ఆమె రాణి వద్దకు వచ్చీ మా ‘‘మల్లన్న’’ చనిపోయాడు అంటుంది. (గాడిద) రాణి ‘మనిషి’ అనుకుని ఏడుస్తుంది. ఆమెను చూచిరాజు ఏడుస్తాడు. తరువాత మంత్రి - సైనికులు - ఏడవగా చివరగా ఒక వ్యాపారి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు. అని కారణం అడుగగా ఒకరిమీద ఒకరు చెప్పుకుంటారు. అపుడో చాకలి ఆమె మల్లన్న అంటే మా ‘‘గాడిద’’ అని చెపుతుంది. అందరు నవ్వుకుంటారు.7

ఈ కథలో చాకలి ఆమె జంతువులకు మనుషుల పేర్లు పెట్టింది. తనకు మూగ జీవుల మీద ఎంత ప్రేమవుందో తెలుస్తూ వుంది. నేటి సమాజంలో కన్న తల్లిదండ్రులు చనిపోయెను పిల్లలు ఏడవకుండా ఉండారు. అలాంటిది ఈ కథలో మల్లన్న అనే గాడిద చనిపోతే చాకలి ఆమె ఏడ్చింది. దాని మీద ప్రేమ ఎంత గొప్పగా పెంచుకుందో తెలుస్తూ వుంది. తను ఏడుస్తూ, తన ఏడుపు ద్వారా రాషి... అందరిని కంటతడ పెట్టించింది. ఈ కథలో వ్యాపారి చాలా తెలివైన వ్యక్తి అని చెప్పాలి. అందరి ఏడుపుకు కారణం అడిగీ, జవాబు చాకలి ఆమె ద్వారా చెప్పించాడు. చివరగా అందరు నవ్వేటట్లు చేశాడు. ఎవరు అయినా సరే ఏదైన ఒక విషయం చెప్పినపుడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయాలి అపుడ అసలు విషయం బయట పడుతుంది. అట్లా ఈ కథలో రాణి చాకలి ఆమెను అడిగి వుండాలి అడగలేదు. అందువలనే అందరు ఏడవల్సి వచ్చింది. సమాజంలో వ్యక్తులు ఎలా వుండలంటే ఈ కథలోని వ్యాపారిలాగా చాలా తెలివిగా ఉండాలి. అపుడే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది వుండదు అని రచయిత ఈ కథ ద్వారా మనకు సందేశం ఇచ్చాడు.

3. ముగింపు:

జానపద కథలల్లో ఊహలు, అద్బుతాలు, ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఉన్నప్పటికి అవి మనకు ఏదో ఒక నీతిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి కథలు మరెన్ని కథలు రాయడానికీ, సేకరించడానికీ, భవిష్యత్తువారు ముందుకు రావాలనీ నా ఆశ. ఇలాంటి జానపదకథలు గ్రామీణ ప్రాంతాలల్లో స్త్రీల నోలల్లో పుట్టగొడుగులులాగా పుట్టుకు వస్తు వుంటాయి. అలాంటి వాళ్ళదగ్గర ఈ కథలు సేకరించి పుస్తక రూపంలో తేవాలి. నేటి పిల్లలుకంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లకు దగ్గర అయిపోయారు. అలాంటి వాళ్ళ మనస్సు మార్చాలంటే ఇలాంటి కథలు సేకరించి ముద్రించీ, పిల్లలకు, పెద్దలకు అందించాలి. వాటిని చదివేటట్లు చేయాలి. అలా చేయడం ద్వారా వాళ్ళ మనస్సు ఆహ్లాదకరంగాను, నీతివంతులు గాను, ఏది ఊహకాదో తెలుసుకుని సమాజంలో జీవిస్తారు.

4. పాదసూచికలు:

  1. రాయలసీమ బాలసాహిత్యం, పుట. 27
  2. తెలుగు జానపద కథలు, పుట. 11
  3. తూర్పుగోదావరి జిల్లా జనపదకథలు ఒక పరిశీలన, పుట. 13
  4. నల్లకుక్క, పుట. 11
  5. పైదే. నల్లకుక్క, పుట. 5
  6. నక్కబావ పిల్లిబావ, పుట. 66
  7. కిర్రు కిర్రు లడ్డప్పా పుట. 31

5. ఉపయుక్త గ్రంథసూచి:

  1. కృష్ణకుమారి, నాయని. తెలుగు జానపద గేయం గాధలు. తెలుగు అకాడమి, హైదరాబాదు, 1990.
  2. కృష్ణయ్యర్‌, కోలార్‌. దేశవిదేశాల జానపదకథలు. ఓం పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌. 2006.
  3. గోపినాధ్‌, అమళ్ళదిన్నె. రాయలసీమ జానపదగేయాలు. రవీంద్ర పబ్లికేషన్స్‌, అనంతపురం, 1995.
  4. ప్రభావతి, గుడివాడ. బాలకథాసాహిత్యం విద్యావిలువలు. తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ, గుంటూరు, 1994.
  5. సరస్వతి, పి. జానపదసాహిత్యము పిల్లలు పాటలు. తెలుగు పరిశోధన ప్రచురణలు, హైదరాబాద్‌, 1989.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]