headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. చరిత్రకు సజీవసాక్ష్యం 'రామడుగు' శిల్పులు

డా. నల్ల మల్లయ్య

అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ
కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ,
హనుమకొండ, తెలంగాణ.
సెల్: +91 9441121301, Email: nallamallaiahedu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలంగాణా రాష్ట్రంలో సంప్రదాయశిల్పకారులున్న గ్రామము రామడుగు. ఈ గ్రామము కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలో ఉంది. ఇక్కడి శిల్పులు తయారు చేసిన విగ్రహాలు వారి ఊరు పేరు మీదనే పిలువబడుతుండడం విశేషం. స్థానికంగా లభించే రాయి, కర్ర మొదలగు ముడిపదార్థాలతో అందమైన విగ్రహాలను తయారు చేయడమే గాక విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఈ వృత్తి చాలా మందికి జీవన వృతిని కల్పిస్తున్నది. రామడుగు దగ్గరలోని పెగడపల్లి మండలం వెంగళాయిపేటలో లభించే అమృత శిలను ఉపయోగించి శిల్పులు వివిధ రకాల దేవతా విగ్రహాలను చెక్కుతూ జీవనోపాది పొందుతున్నారు. గతమెంతో ఘనకీర్తి కలిగిన ఈ శిల్పులు ఈ రోజు సరియైన ఆదరణ లేక, యంత్రాల పోటీని తట్టుకోలేక రాయి దొరకక మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిరాశాజనకంగా జీవిస్తున్నారు. ఈ రామడుగు శిల్పకారుల వృత్తి నైపుణ్యం, వారి జీవన విధానం ప్రాముఖ్యత గురించి తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. క్షేత్ర పర్యటన నిర్వహించి విషయదాతల నుండి సమాచారాన్ని సేకరించడం జరిగింది.

Keywords: రామడుగు, హస్తకళాకారుల గ్రామం, రాముడు పాదం, అమృత శిలా రాయి, సాంప్రదాయ నియమాలు.

1. ఉపోద్ఘాతం:

రామడుగు, తెలంగాణలోని హస్తకళాకారుల గ్రామం, శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పులు స్థానిక వస్తువులతో విగ్రహాలను సృష్టిస్తారు, చాలా మందికి జీవనోపాధిని అందిస్తారు. అయితే, ఆదరణ లేకపోవడం, యంత్రాల నుండి పోటీ మరియు ముడి పదార్థాల కొరత కారణంగా వారు సవాళ్లను ఎదుర్కొంటారు. సమీపంలో ఉన్న శ్రీరాముని పాదముద్ర ఉన్న గ్రామాన్ని శాతవాహనులు, కాకతీయులు మరియు అసఫ్జాహీలు పరిపాలించారు. కరణం బ్రాహ్మణులు నిర్మించిన రాతి కోట నేటికీ ఉంది. విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన శిల్పులు సుమారు 500 సంవత్సరాల క్రితం కోటను నిర్మించడానికి ఇక్కడ స్థిరపడినట్లు సమాచారం. సాంప్రదాయకంగా స్వర్ణకారులు అయినప్పటికీ, వారు ఇప్పుడు శిల్పాలను తయారు చేయడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. గ్రామంలో 1249 కుటుంబాలు ఉన్నాయి, 30 స్వర్ణకార కుటుంబాలలో కొన్ని మాత్రమే ఇప్పటికీ శిల్పాలను తయారు చేస్తున్నాయి. రామడుగు కళాకారులు, వారి దైవిక నైపుణ్యానికి ప్రసిద్ధి చెందారు, దేవుళ్ల విగ్రహాలు, రాజకీయ నాయకులు మరియు హీరోల విగ్రహాలను సృష్టిస్తారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగల అమృత శిలా రాయిని, చెక్కడానికి చేతి పనిముట్లను ఉపయోగిస్తారు. విగ్రహాలు సాంప్రదాయ నియమాల ప్రకారం, పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి. ఒకప్పుడు వంట చేయడానికి రాతి పలకలను తయారు చేసిన ఈ కళాకారులు ఇప్పుడు శబ్ద ఆంక్షలు, దుకాణాల అద్దెలు, విద్యుత్ బిల్లులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, వారు సమాజంలో ఐక్యత మరియు గౌరవాన్ని కొనసాగిస్తారు, తరచుగా ప్రాజెక్ట్‌లలో కలిసి పని చేస్తారు. అయితే విగ్రహాలను విక్రయించకుంటే ఆర్థిక భారం వారిపైనే పడుతుంది. రామడుగు శిల్పులు విగ్రహాల తయారీతో పాటు బుర్రకథ కథలు చెప్పడం, పురోహితులుగా వివాహాలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు వంటి ఇతర వృత్తులలో కూడా నిమగ్నమై ఉన్నారు. వారి రచనలు, ముఖ్యంగా ఖాసిం రజ్వీ యొక్క బుర్రకథ, నిజాం పాలనలో ప్రజాదరణ పొందింది. రామ, లక్ష్మణ, సీత విగ్రహాల పోటీలో వడ్లూరి లక్ష్మీనరసయ్య గెలుపొందడంతో వారు ప్రభుత్వ అధికారుల నుండి అవార్డులు మరియు గుర్తింపు పొందారు.

ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న నర్సింగారావు చెఱువులో ఉన్న బుంగ వద్ద రాముని ఎడమ పాదం ముద్ర ఉన్నందున ఈ గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చిందంటారు. ఈ గ్రామాన్ని శాతవాహనులు, కాకతీయులు, ఆనఖాజాహీలు వరిపొలించినట్లు తెలుస్తున్నది. ఆదివాసీల చివరి పాలనా కాలంలో దేశముఖుగా పనిచేసిన కరణం బ్రాహ్మణులు ఈ గ్రామంలో పెద్దరాతి కోటను నిర్మించారు. ఎత్తైన గోడలతో, దర్వాజలతో నిర్మించిన ఈ కోట చూపరులను బాగా ఆకర్షిస్తున్నది. నేటికిని చెక్కుచెదరకుండా ఉండటం దీనిని నిర్మించిన శిల్పుల నైపుణ్యంను ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

2. రామడుగు శిల్పుల చరిత్ర: 

శాతవాహనుల కాలంలో శిబ్బులు ఈ రామడుగు గ్రామానికి తరలి వచ్చారంటారు లేదా 500 ఏళ్ళ క్రితం గడికోట నిర్మించడానికి వచ్చి యిక్కడనే స్థిరపడిపోయారనే మరో కథనం కూడా ఉంది. మొదట్లో మూడు కుటుంబాలు వచ్చి యిచ్చట స్థిరపడ్డాయి. వీరు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు. విశ్వబ్రాహ్మణులనగా మను (ఇనుము - కమ్మరి) మయ (చెక్క-వడ్రంగి), త్రష్ట (ఇత్తడి-రంచర), శిల్పి. (ట), బ్రహ్మఋషులు (బంగారం-స్వర్ణకారులు). ఇందులో స్వర్ణకారులు శిల్పులుగా శిల్పాలను చెక్కినారు. స్వర్ణకారులలో కదారి పెందోట, వల్లూరి, కట్ట, కోటగిరి, షెఖిల ఇంటిపేరుగల వారున్నారు. ఉమ్మడి కుటుంబాలుగా జీవించేవారు. ఉదాహరణకు సహపంక్తి భోజనాలు కూడా చేసేవారు. వడ్లూరి వెంకయ్య ఇంటికి ఒకే దర్వాజ ఉండేది. దానిలో పన్నెండు కుటుంబాలకు చెందిన పద్దెనిమిది మంది నివసించేవారు. వీరందరు కూడా ఈ దర్వాజగుండానే నడిచేవారు. జొన్నగటుక, దంపుడు బియ్యంతో ఆహారాన్ని తీసుకునేవారు.

సాధారణంగా స్వర్ణకారుల వృత్తి ఆభరణాలు తయారు చేయడం కాని ఇక్కడ వీరు ఆభరణాలు చేయకుండా శిల్పాలు తయారు చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ గ్రామంలో పన్నెండు వందల నలుభై తొమ్మిది కుటుంబాలు ఉండగా, అందులో ముప్ఫై స్వర్ణకార కుటుంబాలున్నాయి. వీరిలో కొన్ని  కుటుంబాల వారు మాత్రమే శిల్పాలను తయారు చేస్తున్నారు.

3. చెక్కే శిల్పాలు:

మొదట్లో వీరు కోటగోడలు నిర్మించగా ఆ తర్వాత బావులకు రాతి కట్టడాలు, రాతి ఖనీలు వేసి జీవించారు. తరువాత దేవతల, రాజకీయ నాయకులు, వీరుల విగ్రహాలను చెక్కడం ప్రారంభించారు. జిల్లాలలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఆలయం నిర్మించినా అక్కడ రామడుగు శిల్పులు తయారు చేసిన శిల్పం ఉంటుందని అంటారు.

3.1 దేవతా విగ్రహాలు: 

500 ఏళ్ళ క్రితం నిర్మించిన కరీంనగర్ మండలం నగునూర్ శివాలయం, రామడుగు విఠలేశ్వరాలయం, కొండగట్టు ఆలయం, సింహద్వారము, మల్లాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వరాలయం, రామడుగు శివారు ప్రాంతంలోని పురాతన మునీశ్వరుల గుట్టపై ఉన్న ఋషుల విగ్రహాలు, బోయినిపల్లి మండలం కోరెం వెంకటస్వామి ఆలయం, అదిలాబాద్ జిల్లా గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, గోదావరిఖనిలోని కోట్ల నర్సింహస్వామి ఆలయం, కొడిమ్యాల మండలం. నల్లగొండలోని నర్సింహస్వామి ఆలయం రామడుగు శిల్పకారులు రూపొందించినవే.

రాజకీయ నాయకుల విగ్రహాలు : గోదావరిఖనిలోని బాలగంగాధర్ తిలక్ ఉజ్వల పార్కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం, కరీంనగర్ వెంకటేశ్వరాలయం ఎదుట ఉన్న అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం మొ||నవి. వీరు తయారు చేసినవే కావడం విశేషం.

3.2 వీరుల విగ్రహాలు: 

కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్లోని వీర జవాను విగ్రహం వంటి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు వివిధ రకాల విగ్రహాలను కూడా చెక్కేవారు, పూర్వం విగ్రహాలు తయారు . చేయగా మిగిలిన రాయితో రాతిచిప్పలను తయారు చేస్తారు. వాటిలో వందుకున్న అన్నం, కూర గాని, వేడి చేసిన పులుసు కాని తింటే చాలా రుచిగా ఉండేదట. ఇప్పుడు ఆ చిప్పలను వాడటం లేదు. కాబట్టి తయారు చేయడంలేదు.

4. అనుష్టానాలు/ పవిత్రత: 

విగ్రహాలను తయారు చేసే ముందు వారు పవిత్రతకు అత్యధిక ప్రాధాన్యత నిస్తారు. సాంప్రదాయాల్ని కాపాడుట కొరకు నియమ నిష్టలతో దేవతా విగ్రహాలను చెక్కడం జరుగుతుంది. గుట్ట నుండి మంచి రోజులలో మాత్రమే రాయిని తీసుకొస్తారు. నాలుగు రోజుల ముందు అక్కడికి చేరి సరియగు రాయిని ఎంచుకొని రాయిని తెస్తారు.

5. ఉపయోగించే శిలలు - శిలల రకాలు: 

చేతి పనిముట్లతో విగ్రహాలు రూపొందించడానికి అనువైన -రాయి అమృత శిల మాత్రమే. ఈ రాయి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయపేటలో మాత్రమే లభిస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే స్వభావం ఈ రాయి సొంతం. దీనిలో రోజ్ గ్రానైట్, గ్రానైట్ రాయితో శిల్పాలు తయారు చేస్తున్నారు. ఈ రాతి గనులు ప్రభుత్వ భూమిలోనే ఉన్నాయి. రాయిని తియ్యడానికి తూటాలను కూడా వాడుతుంటారు. ఫలితంగా భూమిపై ఉన్న రాయి లోపలికి వెళ్ళిపోయి భవిష్యత్లో కొరత ఏర్పడవచ్చు.

6. వృత్తి పరికరాలు:

చేతి పనిముట్లయిన ఉలి, సుత్తి, గన్ను, ఆకురాయి, డబ్బా చిన్న చూర్ణము, పెద్ద చూర్ణము, సానరాయి, సమ్మెట లాంటి వస్తువులను వాడుతూ కొలతలు వేసుకొని మార్క్ వేస్తూ చెక్కుతారు. విగ్రహం రూపం రావడానికి 6, 7 సార్లు చెక్కాల్సి వుంటుంది. గ్రైండర్ రాయితో విగ్రహాన్ని నునుపుగా తయారు చేస్తారు. షాపుల్లో దొరికే సుత్తి, ఉలి, గ్రైండర్, ఆకురాయి, గన్ను, డబ్బా చిన్న చూర్ణం, డబ్బా పెద్ద చూర్ణం, సమ్మెట వంటి పరికరాలను ఉపయోగిస్తారు.

7. వృత్తి పరికరాలు-అనుష్టానాలు: 

పండుగల సమయంలో వృత్తి పరికరాలను శుభ్రపరిచి పూజించడం తరుచుగా చేస్తూండేవారు. ఉగాది పండుగ రోజున వృత్తిలో ఉపయోగించే పనిముట్లన్నింటిని కడిగి, శుభ్రపరిచి కంకణాలు కట్టి బ్రహ్మంగారి చిత్రపటం ముందు ఉంచి పూజిస్తారు. పాటలు పాడేవారు. కొత్తసాలు మొదలు పెట్టేవారు.

8. దైనందిన జీవితం: 

వృత్తినే దైవంగా భావించి చాలా నియమ నిష్టలతో జీవించే ఈ శిల్పకారులకు సమాజంలో చాలా గౌరవం ఉండేది. ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో ఏదైనా పని ఉంటే ఐదు కులాలవారు (విశ్వబ్రాహ్మణులు) కలిసి పనిచేసేవారు. శిల్పులలో ఐక్యత అనేది ఉండటంతో వ్యాపారం బాగానే సాగేది. ఎవరైనా భోజనానికి పిలిస్తే చెంబు తీసుకొని మడికట్టుకుని వెళ్ళేవారు. చాపలలో కూర్చోని ఇస్తారాకులలో భోజనం చేసేవారు. బ్రాహ్మణులు దేవాలయాన్ని ఆక్రమించిన తర్వాత శిల్పులను గర్భగుడిలోనికి రానిచ్చేవారు కాదు. నేడు షాపు పెట్టుకుని స్వతహాగా కుటుంబ సభ్యులంతా కలిసి తయారు చేస్తుంటే, కొందరు కూలి పని వారిని వినియోగించి విగ్రహాలను తయారు చేస్తున్నారు.

9. ఆర్థిక భారం:

ఉలితో పనిచేసేటప్పుడు చప్పుడు వస్తుంది కాబట్టి ఇండ్లలో కాక షాపులను కిరాయికి తీసుకొని తయారు చేస్తున్నారు. షాపు కిరాయి, కరెంటు బిల్లు ఎక్కువై ఆర్థిక భారం పడుతుంది. గ్రామాలలో గొడవలు రావడం, నచ్చక పోవడం మొ||లగు కారణాల చేత చాలా రోజుల వరకు తయారైన విగ్రహాలను తీసుకెళ్ళకపోవడం చేత కూడా ఆర్థిక భారం పడుతుంది.

10. శిల్పులు - ఇతర వృత్తులు: 

శిల్పులు విగ్రహాల తయారీతో పాటు ఇతర వృత్తులను చేసేవారు. అవి ముగ్గురు వ్యక్తులు కలిసి తమ పరికరాలతో బుఱ్ఱకథలు చెప్పేవారు. నైజాంల పరిపాలనా కాలంలో వీరు చెప్పిన 'ఖాసిం రజ్వి బుట్టకథ అత్యంత ఆదరణ పొందినట్లు తెలిపారు. గురు విద్యలో మంత్రాలు నేర్చుకుని పూజారులుగా వివాహాలను జరిపించేవారు, ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా కొందరు చేస్తున్నారు.

11. శిల్పులు - అవార్డులు, ప్రశంసలు: 

వీరు తయారు చేసిన విగ్రహాలకు ప్రభుత్వ అధికారుల చేత అవార్డులు, ప్రశంసలను కూడా అందుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ (పేరు చెప్పలేదు) విగ్రహాల తయారీలో పోటీలు నిర్వహించడంతో అందులో వడ్లూరి లక్ష్మీనర్సయ్య గారు తయారు చేసిన రాముడు, లక్ష్మణుడు, సీతతో కూడిన విగ్రహానికి ప్రథమ బహుమతి లభించింది.

12. ముగింపు:

ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే విగ్రహాలను తయారు చేస్తూ మిగితా సమయంలో ఖాళీగా కూర్చోవలసి వస్తుంది. వీరి పిల్లలు వృత్తి పని మానుకుని కూలిపని, ప్రైవేటు ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. వీరు తమ పిల్లలను ఈ వృత్తికి రానీయకుండా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. సహకార సంఘంలో ఐక్యత లేక విఫలం కావడం, మధ్యవర్తుల ద్వారా అమ్మకాలు, మిషన్ కట్టింగ్ తో తయారైన విగ్రహాలను తెప్పించుకోవడం మొ||లగు కారణాల చేత ఈ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.

పెట్టుబడి పెట్టి కూలీలతో దేవతా విగ్రహాలను తయారు చేయించి నిలువ చేసిన వాటికి గిరాకి ఎక్కువగా ఉండవచ్చు. సహకార సంఘంను పటిష్టపరిచి పనిముట్లను అందజేస్తూ శిక్షణను ఇప్పిస్తూ ప్రభుత్వం శిల్పులకు పెన్షన్, జీతాలు చెల్లించినట్లయితే ఈ వృత్తి ఈలాగే కొనసాగే అవకాశముంది. వృత్తిని కాపాడాలని పాత తరం వారు చేస్తుంటే, నేటి తరం వారు చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు.

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఈనాడు దిన పత్రిక, కరీంనగర్, తేది 21-12-2014.
  2. రమణయ్య, జైసేట్టి. (2008). హిస్టరీ అండ్ కల్చర్  ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ . నాగజ్యోతి ప్రింటర్స్, హైదరాబాద్.
  3. రవ్వ, శ్రీహరి. (2003). తెలంగాణా మాండలికం – తీరుతెన్నులు. నక్క లక్షమ్మ చెన్నయ్య గార్ల రెండ స్మారకోపన్యాసం.
  4. రాధాకృష్ణ శర్మ, యం. (1972). టెంపుల్స్ అఫ్ తెలంగాణా. హైదరాబాద్.
  5. రామచంద్రమూర్తి,  య న్. యస్. (1983). ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ప్రొసీడింగ్స్ అఫ్ ఆంధ్రప్రదేశ్  హిస్టరీ కాంగ్రెస్, వరంగల్.
  6. వెంకటేశ్వరరెడ్డి, అన్నపరెడ్డి. (1989) మరుగున పడ్డ వారసత్వం. తెలుగు అకాడమి, హైదరాబాద్.
  7. సుందరం, ఆర్.వి. (1983). ఆంధ్రుల జానపద విజ్ఞానం. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
  8. సుబ్బాచారి, పులికొండ. (2000). తెలుగులో కులపురాణాలు – ఆశ్రిత వ్యవస్థ. ప్రజాశక్తి డైలీ పబ్లిషింగ్, హైదరాబాద్.

విషయ దాతలు:

  1. నిరంజనచారి (52) రామడుగు గ్రామం, కరీంనగర్ జిల్లా తేది 05-12-2015.
  2. వెంకటేశం వడ్లూరి (74) కరీంనగర్ పట్టణం తేది 01-01-2017.
  3. హన్మంతు వడ్లూరి (60) రామడుగు గ్రామం, కరీంనగర్ జిల్లా తేది 31-05-2015.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]