headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-14 | December 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. చైతన్య శిఖరం ‘అయ్యం కాళీ’

డా. జి. తిరుమల వాసుదేవరావు

ఉపన్యాసకుడు మరియు చరిత్ర శాఖ అధ్యక్షుడు,
ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల,
నగరి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సామాజిక అసమానతలు ఉన్న దేశం మేధోపరంగాను, ఆర్థికంగాను అభ్యున్నతి సాధించలేదు. దేశంలో నెలకొన్న ఈ సామాజిక అసమానతలను నిర్మూలించడానికి ప్రయత్నించడమే కాక, నిర్మాణాత్మకమైన కృషిచేసి ఆధునిక భారతదేశంలో నవ సమాజ స్థాపనకు బాటలు వేసిన భారతదేశపు ముద్దుబిడ్డ అయ్యం కాళీ. సామాజిక వివక్ష, అసమాన తలపై నిబద్ధతతో కూడిన అలుపెరగని పోరాటం చేసిన అయ్యం కాళీ నిర్ణయాత్మకమైన ఫలితాలను సాధించాడు. బహుముఖమైన ప్రతిభను కనపరుస్తూ ఒకవైపున తన వర్గానికి విముక్తి పోరాటంలో నాయకత్వం వహించి దశ దిశా నిర్దేశం చేస్తూ మరొకవైపున చట్టసభల ద్వారా శాసనబద్ధమైన మార్పులకు కృషి చేయడమేకాక, ముందు చూపుతో విద్య యొక్క ప్రాధాన్యతను గ్రహించి తమ వర్గంలో విద్యాభివృద్ధి కొరకు నిరంతరం తపించడం అయ్యం కాళీ యొక్క దార్శనికతను తెలుపుతున్నది. తరతరాల సంప్రదాయ నిర్బంధాల నుండి బయటపడడానికి మహిళల పోరాటానికి ముందుండి నాయకత్వం వహించడం అయ్యం కాళీ మూర్తిమత్వంన్ని ప్రతిబింబిస్తున్నది. అయ్యం కాళీ కార్యదక్షతకు దేశంలో అన్ని రంగాలలోనూ పులయర్ కులం వారి ప్రాతినిధ్యం గుర్తుగా నిలుస్తున్నది. అయ్యం కాళీ గురించి, అతడి జీవిత కాలంలోని పరిస్థితుల గురించి వివిధ పరిశోధన వ్యాసాలలో వెల్లడి అయిన అంశాలను క్రోడీకరిస్తూ, ఆ కాలంనాటి సమాజ పరిస్థితులు మరియు అయ్యం కాళీ చేసిన సామాజిక అభ్యుదయ కృషి గురించి సమగ్ర చిత్రాన్ని అందించే ప్రయత్నం ఈ వ్యాసంలో చేస్తున్నాము

Keywords: కులవ్యవస్థ, పులయర్ కులం, సామాజికన్యాయం, కల్లుమాలసమరం, మానవ హక్కులు

1. ఉపోద్ఘాతం:

కులవ్యవస్థ అసంఘాతాలతో కూడిన అవ్యవస్థ. ఇందులోని అంటరానితనం మరింత అన్యాయం. కుల దొంతరలలో అడుగున ఉన్న పంచము కులాలపై అమానవీయ నిబంధనలు విధించి, వారి ఆర్థిక మూలాలను బలహీనపరిచి, మానవ హక్కులు నిరాకరించి, వారిని జంతువుల స్థాయికి తీసుకువచ్చారు.

కులవ్యవస్థ కరుడుగట్టి కాటిన్యాన్ని కనపరిచిన కేరళ ప్రాంతంలో ట్రావెన్ కోర్ సంస్థానం పిచ్చి సంప్రదాయాల ఆశ్రమంగా పేరు పొందింది[1]. కారు చీకటిలో క్రాంతి వీరుడిగా ఒక దళిత వైతాళికుడు అయ్యంకాళీ ఆవిర్భవించి, పకృతి ధర్మాన్ని, మానవ సమాజ ధర్మాలను మంటగలిపిన అగ్రకుల అధికారం పై నిరంతర పోరాటాన్ని చేస్తూ తన జాతిని జాగృత పరిచాడు [2]. 

అయ్యంకాళీ కేరళ ప్రాంతంలో పులయర్ అనే దళిత కులంలో మాల, అయ్యన్ దంపతులకు 28 ఆగస్టు 1863 లో జన్మించారు[3]. బాల్యంలో కాళీ అని పిలవబడిన వీరు తండ్రి పేరును కలుపుకొని అయ్యం కాళీ గా మారాడు.ద్రావిడ మూలాలు గల పులయర్ కులం వాళ్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో విస్తరించి ఉన్నారు. తనకు, పరమ శివునికి అడ్డంగా ఉన్న నందీశ్వర విగ్రహాన్ని (శివలోకనాథర్ ఆలయం,తిరుపున్కూర్)ఆత్మ శక్తితో జరిపి, చిదంబరం లోని నటరాజశేఖరుడి లో లీనమైన శైవ ఋషులైన (పెరియ పురాణం) నయనార్లలో ఒకరైన నందనార్ [4] (నాలైప్పోవన్ - దేవాలయానికి రేపు వెళ్లబోయేవాడు) ఈ పులియర్ కులం వారే. పులయర్ లకు భూమి హక్కు వీళ్లకు నిషేధించడంతో వ్యవసాయ కట్టు బానిసలుగా జీవనం కొనసాగించేవాళ్లు. పులయర్ కులస్తులను వ్యవసాయానికి ఉపయోగపడే ఒక జంతువుగా చూసేవారు భూస్వాములు[5].

2. విల్లువండియాత్ర:

ట్రావెల్ కోర్ రాజులు కుల సంప్రదాయాలకు సంరక్షకులుగా మారి చట్టాలను కట్టుదిట్టంగా అమలు పరుస్తూ సమాజాన్ని అనాకరీకరించారు [6]. ప్రభుత్వ రహదారుల్లో పులయర్ కులం వారి ప్రయాణం నిరాకరించబడింది [7]. ఈ నిర్బంధాలపై కలత చెందిన అయ్యాం కాళీ ఉన్నత కులం వారి వస్త్రధారణను అనుసరిస్తూ తలపాగ ధరించి అగ్రవర్ణాల వారికే పరిమితమైన ఎడ్ల బండిపై ప్రయాణం చేస్తూ అగ్రవర్గాల కులదుహంకారానికి సవాలుగా నిలిచాడు. నిరంతర చైతన్య జ్వాల అయిన అయ్యంకాళీ ఎద్దుల బండి పై 1893లో చేసిన ఈ ప్రయాణం “విల్లువండి యాత్ర”, “స్వాతంత్రం కొరకు యాత్రగా” చరిత్రలో ప్రసిద్ధిగాంచింది [8]. చరిత్ర గమనంలో అయ్యంకాళి పోరాటం సమ సమాజ స్థాపన దిశగా ఒక ముందడుగుగా గుర్తించబడింది.

అయ్యంకాళీ జరుపుతున్న మానవ హక్కుల ఉద్యమానికి క్రమంగా పులయర్ కులంలోని చైతన్యవంత యువకులు వీరికి మద్దతుగా నిలిచారు. 1898- 1899 ప్రాంతంలో బలరామపురం, కజకూటం మరియు కనియాపురం మొదలైన ప్రాంతాలలో దళిత వర్గాలకు, ఆధిపత్య కులాలకు తీవ్ర సంఘర్షణలు జరిగి రక్తం చిందింది.

3. సాధు జన పరిపాలన సంఘం:

కేరళ ప్రాంతంలో సంస్కరణ వాదులైన స్వామి నారాయణ గురు,అయ్యపు స్వామికల్ నుండి ఉద్యమ స్ఫూర్తిని పొందిన అయ్యంకాళీ ,1907 లో పీడిత జనుల కోసం “సాధు జన పరిపాలన సంఘం” ఏర్పాటు చేశాడు[9]. మతాంతీకరణ అణిచివేయబడిన కులాల వాళ్ళ సమస్యలను పరిష్కరించదని, సిరియన్ క్రైస్తవులు కుల వివక్షను పాటిస్తూనే ఉన్నారని అయ్యంకాళీ పేర్కొనేవాడు. అయ్యంకాళీ నినాదం “విద్య మరియు ఐక్యమత్యం ద్వారా ప్రగతి”. డాక్టర్. అంబేద్కర్ గారి “బోధించు, సంఘటితపరుచు, పోరాడు” నినాదం కు దీనితో సారూప్యత ఉండడం గమనించదగిన విషయం.

4. ఊరుత్తంబలంఉద్యమం - వ్యవసాయకార్మికులసమ్మె:

సామాజిక హోదా పెంచుకోవడానికి విద్య అత్యంత ఆవశ్యకమని గ్రహించిన అయ్యం కాళీ, ఈ సాధుజన పరిపాలనా సంఘం ద్వారా పులయ కులంలొ విద్యావ్యాప్తికి కృషి చేశాడు[10]. అణిచివేయబడిన కులాల విద్యార్థుల పాఠశాల ప్రవేశాన్ని అగ్ర కులస్తులు అంగీకరించలేక చివరికి “ఊరుత్తంబలం”గ్రామంలో పాఠశాలను తగలబెట్టారు. దీనికి ప్రతిస్పందనగా అయ్యంకాళి వ్యవసాయ కార్మికుల సమ్మెను ప్రారంభించారు[11].

అవర్నుల పిల్లలకు చదువు నిరాకరిస్తే అందుకు ప్రతిగా తాము పొలం పనులను బహిష్కరిస్తామని ప్రకటించి, అయ్యంకాళీ నాయకత్వంలో ట్రావెన్ కోర్ సంస్థానంలో మొదటిసారిగా వ్యవసాయ కార్మికులతో సమ్మె నిర్వహించారు. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ కనీస మానవ హక్కుల కొరకు వీరు ఈ సమ్మెను సంవత్సరంకు పైగా కాలం కొనసాగించారు. చివరికి ఈ పులయ కులానికి కొంతమేరకు మానవ హక్కులు గుర్తించబడి సమ్మె విరమించబడింది. పులయర్ వర్గం వాళ్లు వీరిని గౌరవ సూచకంగా “ఊర్పిళ్లై, మూతపిల్లై” (లీడర్ ఆఫ్ ది ల్యాండ్) అని పిలవడం ప్రారంభించారు.

5. బాలికలవిద్య

1914లో ట్రావెన్ కోర్ మహారాజు అవర్ణుల ఒత్తిడికి గురై అణిచివేయబడిన కులాల విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రవేశానికి అంగీకరించారు. ఈ సందర్భంగా అగ్రవర్ణాల నుండి ఎదురుగుతున్న తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొని “పంచమి” అనె ఒక పులయర్ విద్యార్థినిని విజయవంతంగా పాఠశాలలో చేర్పించి, కేరళ ప్రాంతంలో సంచలనాన్ని సృష్టించాడు అయ్యంకాళీ. బాలికల విద్యపై అయ్యం కాళీ పడిన తపన భారత రాజ్యాంగ రూపకల్పన లో పాల్గొన్న 9 మంది మహిళలలో ఒకరైన పులయర్ వర్గానికి చెందిన దాక్షాయిని రూపంలో ప్రతిభంభించింది. విద్య హక్కు కోసం అయ్యం కాళీ నిర్వహించిన “ఊరుత్తంబలం” ఉద్యమం కేరళ పునరుద్యోనోద్యమ చరిత్రలో ఒక ముందడుగుగా నిలిచింది[12].

6. కళ్ళుమల పోరాటం:

క్రింది కులాల మహిళల వస్త్రధారణ డ్రెస్ (కోడ్ ఆంక్షలు) పై నిర్బంధాలు విధిస్తూ చాదసులు మహిళా జాతి కీర్తిని, గౌరవాన్ని కళంకితం చేశారు. మద్రాసు గవర్నర్ అయిన సర్ చార్లెస్ ఎడ్వర్డ్ ట్రెవెల్యన్ ఒత్తిడి వలన ట్రావెన్కోర్ రాజు నాడార్ కులం వారికి ఈ కుల నిబంధనలలో కొన్ని సరళింపులు ఇచ్చినా మిగిలిన వెనకబడిన కులాల వారి పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు[13].

అగ్రకుల దుహంకారంతో దళిత మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వస్త్రధారణ పై నిర్బంధాలు విధించారు. నడుము పైభాగం పై వస్త్రధారణ చేయకూడదని, మెడలో రాళ్లను దారంతో ముడివేసిన దండలు ధరించాలని మరియు ఇనుముతో చేసిన చెవి కమ్మలు ధరించాలని నిబంధనలు విధించారు. పులయర్ మహిళలు ఈ కుల నిబంధనలను ధిక్కరించినందుకు కఠిన శిక్షలకు గురికా బడ్డారు. అమానవీయంగా దారుణంగా ఉన్న క్రింది కుల మహిళల జీవన పరిస్థితులు అయ్యంకాళీ గారిని కలిసి వేసింది. వీరి పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టారు. అభ్యుదయ భావాలు గల అయ్యం కాళీ ఈ నిర్బంధాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పిడికిలి బిగించి మహిళల ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. క్రింది కులాల మహిళలపై జరుగుతున్న అరాచకాల ను అంతం చేయడానికి కుల చట్టాలను ధిక్కరించాలని, సామాజిక సంస్కరణలకు అయ్యంకాళీ పిలుపు ఇచ్చాడు.

కొల్లం లోని ఫిరంగి మైదానంలో అయ్యంకాళీ ఇచ్చిన పిలుపునందుకొని వేల సంఖ్యలో పులయర్ మహిళలు తరలివచ్చి తరతరాలుగా బానిసత్వానికి చిహ్నాలుగా ఉన్న ఇనప కమ్మలను, రాళ్ల దండలను మహిళలు తీసి విసిరి వేశారు[14]. ఈ సామాజిక చైతన్య పోరాటాన్ని “కళ్ళుమల” పోరాటం అని పిలుస్తారు. ఈ మహిళా ఉద్యమం కేరళ ప్రాంతంలో సంచలనాన్ని సృష్టించింది. అణగారిన కుల స్త్రీల ఆత్మగౌరవం మరియు సాధికారత కోసం పరివర్తన ఉద్యమానికి నాంది పలికింది.

7. సమసమాజసంస్థాపన ప్రయత్నంలో అయ్యంకాళీ కృషి:

4 డిసెంబర్ 1911 లో అయ్యంకాళీ ట్రావెన్ కోర్ ప్రజా ప్రాతినిధ్య సభ “శ్రీ మూలం ప్రజా సభ” కు ప్రతినిధిగా నామినేట్ అయ్యాడు. 25 సంవత్సరాల పాటు అసెంబ్లీ సభ్యుడిగా ఉంటూ, అణిచివేయబడిన కులాల అభ్యున్నతి కొరకు కృషి చేశాడు. 1936 లో అణిచివేయబడిన కులాల ఆలయ ప్రవేశ చట్టాల రూపకల్పనలో అయ్యంకాళి ప్రభావం అపారమైనది. జాతిపిత మహాత్మ గాంధీ 14 జనవరి 1937 లో వెంగళూరులో అయ్యం కాళీ ని కలిశారు. వేలాదిమంది సాధుజన పరిపాలన సమితి సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో అయ్యం కాళీ, గాంధీ ని తాను మరణించే లోగా తన కుటుంబం (కులం) లో పదిమంది బి.ఏ పట్టభద్రులు ఉండేలా సహాయం చేయమని కోరుకున్నాడు [15]. అయ్యంకాళీ నిస్వార్థతకు గాంధీ ఎంతో ఆనందపడ్డారు.

నిరంతరం వర్గ చైతన్యంతో తన సోదర సోదరీమణుల కు మానవ హక్కుల కొరకు పోరాడిన సార్థక జన్ముడైన అయ్యంకాళి అనారోగ్యంతో బాధపడుతూ అవిశ్రాంతంగా కృషిచేసి 1941 జూన్ 18 న తన 77వ ఏట జీవన యాత్ర ముగించాడు. తిరువనంతపురం లోని అతని జన్మస్థలమైన వెంగనూర్ లో అయ్యంకాళి గారిని స్మరించుకుంటూ ఒక స్మారక చిహ్నాన్ని, పాఠశాలను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వ తపాలా శాఖ 2002 లో వీరిని స్మరిస్తూ తపాలా స్టాంపును విడుదల చేసింది.

భారతదేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అయ్యంకాళీ గారిని “భారత దేశము గర్వించదగిన గొప్ప కుమారుడు” అని కీర్తించారు. అయ్యంకాళీ నీ కేరళ స్పార్టకస్ అని, “విముక్తి ప్రదాత” అని గౌరవిస్తారు. న్యాయం మరియు సమానత్వం కోసం పోరాటంపై అయ్యంకాళి వారసత్వం యొక్క శాశ్వత ప్రభావాన్ని నొక్కిచెప్పారు [16].

నందనార్, రవి దాస్, మరియు చోఖామేళా అనే ముగ్గురు దళిత సాధువులకు అంబేద్కర్ గారు తన “అంటరానివారు ఎవరు మరియు వారు ఎందుకు అంటరానివారుగా మారారు?” అనే పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. వీటిలో నందనార్ పులయర్ కులానికి చెందినవాడు[17].

8. ముగింపు:

దేశంలోని వివిధ వర్గాల ప్రజలను సమైక్యపరచడానికి అడ్డంకులు కల్పిస్తున్న అంతరాలను తొలగించి సమైక్య భారతజాతిని ఏర్పాటు చేయడానికి కృషిచేసే వ్యక్తులను నిజమైన దేశభక్తులుగా మనం పరిగణించ- వలసి ఉంటుంది. కాల ప్రవాహంలో వివిధ అంతర్గత, బహిర్గత కారణాల వలన హిందూ మతంలో హెచ్చు తగ్గులతో కూడిన కుల వ్యవస్థ ఏర్పడి దేశ సమైక్యతను దెబ్బతీసి, దేశాన్ని విదేశీదండయాత్రలకు బలి చేసింది.

ఆధునిక భారతదేశ చరిత్రలో కులపరమైన, సామాజికపరమైన అంతరాలను తొలగించడానికి కృషిచేసిన ప్రముఖులలో అయ్యంకాళీది కీలకపాత్ర. మీరు ఒక వైపు సామాజిక వివక్షపై పోరాడుతూనే మరొకవైపున క్రింది వర్గాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తూ సమాజ ఆధునీకరణకు బాటలు వేశాడు. 

అణిచివేయబడిన వర్గాల మహిళలపై విధించబడిన మానవీయ నిబంధనల నిర్మూలనకు ముందుండి పోరాటం నిర్వహించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. వీరి కార్యక్రమాలు దూరదృష్టిగల ముందు చూపుతో, నిర్మాణాత్మకతో నిండి ఉండి అంతర్లీనంగా దేశ అభ్యుదయానికి, నవ సమాజ నిర్మాణానికి బాటలు వేశాయి.

9. పాదసూచికలు & ఉపయుక్తగ్రంథసూచి:

  1. స్వామి వివేకానంద పూర్తి రచనల నుండి ఎంపికలు, కలకత్తా, 1998, పేజీలు 284-285. 
  2. మెండెల్సన్, ఆలివర్; విక్జియానీ, మరికా (1998), ది అన్‌టచబుల్స్: సబార్డినేషన్, పావర్టీ అండ్ ది స్టేట్ ఇన్ మోడ్రన్ ఇండియా, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్.
  3. సంజయ్ కుమార్ (2019) దక్షిణ భారతదేశంలో సంస్కరణ ఉద్యమాలు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ సైన్సెస్. 8(8); పేజీలు .45-54.
  4. ఎబెలింగ్ సాస్చా., (2010) టుమారో ఫర్ నందనార్ : మిడివల్ ఇండియన్ అంన్ టచుబుల్ సెయింట్, ఎడిటర్-ఇన్-చీఫ్: పీటర్ షాక్, హిస్టోరియా మతం 30, అసిత అప్సలిమ్సిస్, ఉప్ప్సల విశ్వవిద్యాలయం, స్వీడన్. పేజీలు.15-42.
  5. అదూర్, కె.కె. రామచంద్రన్ నాయర్, కేరళలో బానిసత్వం, న్యూఢిల్లీ, 1986, పేజి.41. 
  6. జెఫ్రీ, రాబిన్ (1976), ది డిక్లైన్ ఆఫ్ నాయర్ డామినెన్స్: సొసైటీ అండ్ పాలిటిక్స్ ఇన్ ట్రావెన్‌కోర్ 1847–1908, ససెక్స్ యూనివర్శిటీ ప్రెస్. 
  7. మాధవన్, K. S. (2008). కేరళలో దళితుల గుర్తింపు ఏర్పడింది. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, 69, పేజీలు. 764–770. 
  8. దివ్య, ఎస్. (2018). అయ్యంకాళి యొక్క విల్లువండి యాత్ర: కేరళలో ప్రజాస్వామ్య సంస్కృతి వైపు ఉద్యమం. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనలిటికల్ రివ్యూస్.5(2): పేజీలు.1046-48.
  9. ప్రతీక, ఎస్. (2019), సాధుజన పరిపాలన సంఘం. ఇండియా జర్నల్ గురించి ఆలోచించండి. 22 (14),పేజీలు.7188-7191.
  10. గ్రీష్మామ్, జి. (2022). శ్రీ మూలం ప్రజా సభలో సబాల్టర్న్ వాయిస్. కాంటెంపరరీ వాయిస్ ఆఫ్ దళిత్, 14(2), .1 పేజీలు 57-163. 
  11. సబీనా జకారియాస్. (2022) హెజిమోనీ మరియు మార్జినలైజేషన్ యొక్క కథనాలు: భారతదేశ చరిత్ర పురాణాలను పునర్నిర్మించడం. సాంస్కృతిక ఇంటర్‌టెక్ట్స్. 12: పేజీలు 157-171.
  12. వర్గీస్, జెంటిల్ టి., సాధు జనం అయ్యంకాళి నిర్మాణం మరియు ట్రావెన్‌కోర్‌లో కొత్త గుర్తింపు కోసం బానిస కులాల పోరాటాలు 1884 -1941,(2016) పీ.హెచ్డీ థీసిస్ ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్. 
  13. హార్డ్‌గ్రేవ్ జూనియర్, R. L. (1968). బ్రెస్ట్ క్లాత్ వివాదం: దక్షిణ ట్రావెన్‌కోర్‌లో కుల స్పృహ మరియు సామాజిక మార్పు. ది ఇండియన్ ఎకనామిక్ & సోషల్ హిస్టరీ రివ్యూ, 5(2), పేజీలు 171-187. 
  14. రూపా ఫిలిప్, (2023) ఈస్తటిక్స్ ఆఫ్ ప్రొటెస్ట్, ఎ స్టడీ ఆఫ్ సెలెక్ట్ దళిత ఉమెన్స్ మెమోయిర్స్ ఇన్ ఇంగ్లీష్ ఎడ్: ఫిమేల్ నేరేటివ్స్ ఆఫ్ ప్రొట్స్, 1వ ఎడిషన్. రూట్‌లెడ్జ్ ఇండియా. పేజీలు 15. 
  15.  రామబద్రన్, సుదర్శన్ మరియు గురు ప్రకాష్ పాశ్వాన్. ఆధునిక దళిత చరిత్ర రూపకర్తలు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2021.
  16.  సూరజ్ యెంగ్డే(2023) దళిత చరిత్రలు, మహమ్మారి చరిత్రలు. వర్తమాన చరిత్ర; 13 (1): పేజి 433-516. 
  17.  ఆదిత్య, ఐ., బి.ఆర్. అంబేద్కర్ యొక్క పొలిటికల్ థింకింగ్ యొక్క మూల్యాంకన అధ్యయనం: ఒక క్లిష్టమైన అండర్‌పిన్నింగ్. హిస్టారికల్ రీసెర్చ్ లెటర్, వాల్యూం. 48, 2019.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]