headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797

6. భారత స్వాతంత్య్ర పోరాటంలో చెంచుల పాత్ర

డా. కప్పెర కృష్ణగోపాల్

M.A., B.Ed., Ph.D.,
అతిథి అధ్యాపకులు, శ్రీ ఉమామహేశ్వరీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
కొండనాగుల, బాలమూర్ (మం.), నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం.
సెల్: +91 9490899811. Email: kapperakrishnagopal@gmail.com

Download PDF


Keywords: చెంచు, స్వాతంత్య్రపోరాటం, ఉయ్యాలవాడ, బ్రిటీష్, కాకతీయులు, గోపాలకృష్ణ, కప్పెర

ప్రవేశిక (నేపథ్యం):

చెంచులవారు చాలా వరకు నిరక్షరాస్యులు. వీరి పుట్టుపుర్వోత్తరాల గురించి వీళ్ళల్లో విద్యావంతులకు తప్ప ఇతరులకు చాలా వరకు తెలియదు. వీళ్ళు అనాగరిక సమాజంలో నివసిస్తున్నారు. చదువుకున్న విద్యావంతులు, ఉద్యోగస్తులు నాగరిక సమాజంలో నివసిస్తున్నారు. వీరు అనాగరిక సమాజంలో నివసిస్తున్న వారితోపాటుగా తమ సంస్కృతీ, సంప్రదాయాన్ని సగర్వంగా పాటిస్తూ ఉండటం అత్యంత విశేషమైనది.

భారత స్వాతంత్య్ర పోరాటంలో చెంచుల పాత్ర:

భారత స్వాతంత్య్ర చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం 1857నాటి మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధానికి పదేళ్ళ ముందే బ్రిటీష్‌ దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సాయుధపోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మి, దానికోసం ప్రాణాలర్పించిన యోధుడు.

1846 జూన్‌ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847, ఫిబ్రవరి 22న ఆయన మరణంతో ముగిసింది.

18వ శతాబ్దపు తొలి రోజుల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్థ ఉండేది. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటీష్‌ వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటీష్‌ ప్రభుత్వ పాలనా వ్యవస్థ కిందికి వచ్చారు. బ్రిటీష్‌ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశ్యంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి వారికి నెల వారీ భరణాలను ఏర్పాటుచేసింది.

ఆయన తన స్వగ్రామం ఉయ్యాలవాడ పాలెగాడుగా ఉండేవాడు. తండ్రిపేరు పెదమల్లారెడ్డి, తండ్రి తరఫున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసల భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో ఆయనకు ఇస్తూ వచ్చిన భరణాన్ని ఆయన మరణంతో రద్దు చేసింది బ్రిటీష్‌ ప్రభుత్వం.

ఆయన కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాలో 66 గ్రామాలకు అధిపతి. ఉయ్యాలవాడ, రూపనగుడి, గుళ్ళదుర్తి, ఉప్పులూరు, గిద్దలూరు మొదలైన గ్రామాలలో ఆయన నిర్మించిన కోటలు ఇప్పటికీ ఉన్నాయి.

తిరగబడ్డ తెలుగువీరుడు :

1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కోసం అనుచరుడిని కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తాసిల్దారు, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తానని చెప్పడంతో తిరుగుబాటుకు బీజం పడిరది. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర పాలెగాళ్ళు ఆయనతో చేతులు కలిపారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాంఖాన్‌, కర్నూలుకు చెందిన పాపాఖాన్‌, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరిన వారిలో ఉన్నారు. నరసింహారెడ్డికి 2,000 (రెండువేల) మంది సైన్యం ఉండేది. ఆ రెండువేలలో ఆదిమజాతి చెంచులు (250) రెండు వందల యాభై మంది సైన్యం ఉండేది.

1846 జులై 10వ తేదీన ఆయన 500 మంది బోయసైన్యం, 250 మంది చెంచు సైన్యంతో కోయిల కుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను కొల్లగొట్టాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా కొల్లగొట్టాడు. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనను పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్‌నాట్‌, కెప్టెన్‌ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు ఆయనను పట్టుకోలేక వెనుదిరిగాయి.

ఉయ్యాలవాడను పట్టి ఇచ్చిన వారికి వేయి రూపాయల బహుమతి బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించింది. జులై 23వ తేదీన కెప్టెన్‌ వాట్సన్‌ నాయకత్వంలో వచ్చిన సైన్యం గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి ఆయన తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటీష్‌ సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు ఆయన కడప చేరాడు. 1846 అక్టోబర్‌ 6న నల్లమల కొండల్లోని పేరు సోమల వద్ద గల జగన్నాధాలయంలో సేదతీరుతున్నాడని తెలుసుకున్న కడప కలెక్టర్‌ కాక్రేన్‌ సైన్యంతో ముట్టడిరచి ఆయనను బంధించింది.

బహిరంగ ఉరి - వీరమరణం :

బ్రిటీష్‌ ప్రభుత్వం నరసింహారెడ్డికి ఉరిశిక్షను, అతని అనుచరులకు ఇతర శిక్షలను విధించింది. బహిరంగ ఉరికి రెండు వేల మంది ప్రజలు హాజరయ్యారు. బ్రిటీష్‌ ప్రభుత్వం, 1847 ఫిబ్రవరి 22, సోమవారం ఉదయం 7 గంటలకు జుర్రేటి ఒడ్డున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బహిరంగంగా ఉరితీసింది. ఉరి దృశ్యాన్ని చూసిన చెంచులు, ప్రజలు మౌనంగా రోదించారు.

విప్లవకారులను భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిల కుంట్ల కోటలో ఉరికొయ్యకు వేలాడదీసి ఉంచారు.

1323వ సంవత్సరమున కాకతీయ సామ్రాజ్యం పతనం అయ్యింది. పతనం కంటే ముందుగా అనగా 1318-1319వ సంవత్సరంలో కాకతీయసామ్రాజ్య విస్తరణ కోసం, సామంతరాజులతో పోరాడుతూ గుంటూరు జిల్లా, నల్లగొండ జిల్లాకు సమీపంలోని ఎత్తిపోతలకు వచ్చి యుద్ధం చేసిన కత్తులను శుభ్రంచేసుకొని అక్కడే విడిదిచేసినప్పుడు, ఆ ప్రాంతములోని చెంచులు వీరికి సహకరించారని అక్కడ ఉన్న చెంచులు చెబుతుంటారు.

అక్కడ నుండి దేవరకొండ మీదుగా ప్రతాపరుద్రుడు, నల్లమల్ల తొలి అడుగు అయిన మహబూబ్‌నగర్‌జిల్లా, అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూర్‌ గ్రామంలోకి వచ్చి ఎతైన కొండపై ప్రతాపరుద్రుడు కోట నిర్మించి, అక్కడే కొన్ని నెలలు బసచేశాడు. నిజాం ప్రభువుల అండ చూసుకొని కొందరు సామంతరాజులు దండెత్తి వచ్చినప్పుడు, ప్రతాపరుద్రునికి అండగా నల్లమల్ల చెంచులు వారిపై తిరగబడి యుద్ధం చేశారు అని మన్ననూర్‌ గ్రామంలోని కలిమేని లింగమయ్య అనే వృద్ధుడు వివరించాడు.

1323వ సంవత్సరంలో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ 2వ ప్రతాపరుద్రునిపై దండెత్తి వచ్చి కాకతీయ సామ్రాజ్యాన్ని వశంచేసుకొని, నీవు ముస్లీం మతంలో కలవమని కోరగా చావనైనా చస్తానుకాని మీ మతంలో చేరను అని చెప్పడంతో ప్రతాపరుద్రున్ని బందీగా పట్టుకొని ఢల్లీికి తీసుకవెళ్తున్న మార్గంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి-మహారాష్ట్రకు మధ్యలో ఉన్న నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని చరిత్ర చెబుతుంది.

ముగింపు:

భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మహోజ్వల శక్తి ఆయన జరిపిన  సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. బ్రిటీష్‌ దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు. ఈ వీరుడితోపాటుగా కర్నూలుజిల్లా నల్లమల ప్రాంతపు చెంచులు కూడా వీరికి సహకరించి వారి రాజనీతిని నిలుపుకున్నారు. బ్రిటీష్‌ వారిక వ్యతిరేకంగా కర్నూలు జిల్లా కోయిల కుంట్ల, పొద్దుటూరు ఖజానాలపై మెరుపుదాడి చేసి ఖజానాను కొల్లగొట్టారు. అందుకు తిరుగబడ్డ వారు వీర చెంచులు అని వీరిని అక్కడి ప్రాంతం వారు పరిగణిస్తారు.

భారత స్వాతంత్య్ర పోరాటంలో చెంచుల పాత్ర అమోఘం. కాకతీయ సామ్రాజ్యం పాలించిన రెండో ప్రతాపరుర్రుదునికి సహకరించిన చెంచుల గురించి భారత స్వాతంత్య్ర పోరాటంలో చెంచులు రాయల సీమ ముద్దుబిడ్డ బ్రిటీష్‌ దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సహకరించి వారితోపాటుగా యుద్ధంలో పాల్గొన్న చెంచులు కూడా వీరులుగా భావిస్తూ, వారి గురించి పరిచయం చేస్తున్న వ్యాసం ఇది.

ఉపయుక్త గ్రంథాలు :

  1. శ్యామల, కె. (2011). చెంచు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం
  2. జ్యోతి, మిర్యాల. (2011). చెంచు భాషాకళారూపాలు, 
  3. చెన్నయ్య, కె. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు
  4. కాంతయ్య, బత్తుల. దళిత్‌ ఆవాజ్‌
  5. ప్రభాకర్‌, డి.కె. దొమ్మరుల చరిత్ర- సంస్కృతి
  6. శివరామకృష్ణ, (2007). కొండకొనల్లో తెలుగు గిరిజనులు 
  7. మాల కొండయ్య, శ్రీరామ. కుర్రు చరిత్ర
  8. ప్రసాద్‌, కలేకూరి. ఆంధ్రప్రదేశ్‌ దళితులు

మౌఖిక సేకరణ :

  1. చెంచు నర్సింహ ఎస్‌. 46 సం॥ గాయకుడు, అహోబిలం, ఆళ్ళగడ్డ
  2. చెంచు మల్లమ్మ, 56 సం॥ హరికథ కథకురాలు, సున్నిపెంట, శ్రీశైలం

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "AUGUST-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర/ సామాజికశాస్త్ర సంబంధమైన పరిశోధనపత్రాలను/ వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, కళాశాలల అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధనవ్యాసాన్ని సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాసాలు పంపడానికి చివరి తేదీ: 20-JULY-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "AUGUST-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]