AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797
11. ఎరుకల భాష: వర్ణసమామ్నాయము
డా. వి.ఎం. సుబ్రహ్మణ్యశర్మ
సహాయ ఆచార్యులు,
భాషాశాస్త్ర విభాగం,
ఢిల్లీ విశ్వవిద్యాలయం.
సెల్: +91 9866707774. Email: vmssharma@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
తెలుగురాష్ట్రాలలో మాట్లాడబడే ఒక గిరిజన భాష ఎరుకల. పూర్వ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఎరుకలను తమిళ మాండలికంగా గ్రియర్సన్ (1906), శ్రీనివాస వర్మ (1978) లాంటి భాషా శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. సుబ్రహ్మణ్య శర్మ(2007) తెలంగాణ ప్రాంతం ఎరుకల భాష పైన పరిశోధన చేశారు. వీరి అభిప్రాయం ప్రకారం ఎరుకల భాషకూ తమిళ భాషకూ మధ్య పరస్పరావగాహన క్షమత లేకపోవడం ఒక కారణమైతే, ఎరుకల భాషీయులు ఎరుకల భాషను ఒక ప్రత్యేక భాషగా చెప్పుకోవడం కూడా ఇంకొక కారణంగా భావించి ఎరుకల భాషను ఒక ప్రత్యేక భాషగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతం ఎరుకల భాషను భాషాశాస్త్ర పరంగా కంటే వారి సాహిత్యం, సంస్కృతి, మరియు సామాజిక అంశాల పైన థర్ స్టన్(1909) , వీరయ్య (2000 ), పీపుల్స్ సర్వే ఆఫ్ ఇండియా (2015 ) లాంటి పరిశోధనలు చేశారు. ఎరుకల భాష తెలుగు మాండలికమా? , తమిళ మాండలికమా? లేదా ప్రత్యేక భాషా? అనే అంశాలు పరిశోధనాంశాలే అయినప్పటికీ ప్రస్తుత పత్రం ఎరుకల భాష వర్ణసమామ్నాయాన్ని భాషాశాస్త్ర దృష్ట్యా వివరించడం జరిగింది.
Keywords: ఎరుకల భాష, హల్లులు, అచ్చులు, వాటి వ్యాప్తి, భాషాశాస్త్రం . సంక్షిప్త పదాల వివరణ: ఎ.ప. “ఎరుకల పదం”, తె.అ. “ తెలుగు అర్థం”
1. ఉపోద్ఘాతం:
కృష్ణముర్తి (2003) ద్రావిడ భాషలను నాలుగు కుటుంబాలుగా విభజించారు. 1. South Dravidian (SDI), 2. South Central Dravidian (SDII), 3. Centra Dravidian (CD), 4. North Dravidian (ND) గా విభజించారు. ఎరుకల భాష గురంచిన ప్రస్తావన ఈ విభజనలో కనిపించలేదు . సుబ్రహ్మణ్యం (2007) ద్రావిడ భాషలు అనే పుస్తకంలో కూడా ఎరుకల గురించి ప్రస్తావన లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్నో భాషలు అంతరించిపోతున్న సందర్భంలో త్రిప్పట జీవనం కలిగి నేటికీ వారి భాషలోనే వ్యవహారం కొనసాగిస్తున్న ఎరుకల లాంటి భాషల పైన పరిశోధన ఎక్కువగా జరగలేదనే చెప్పాలి. ఈ పరిశోధన అంతరాన్ని (research gap) పరిగణలో తీసుకొని భాషా విశ్లేషణలో ప్రాథమిక సోపానమైన వర్ణ శాస్త్ర అధ్యయనంలో అనివార్యమైన వర్ణసమామ్నాయాన్ని సామాన్య భాషాశాస్త్ర సిద్ధాంతాల దృష్ట్యా విశ్లేషించే ప్రయత్నం జరిగింది.
2. పూర్వ –పరిశోధన:
గ్రియర్సన్ (1906) లింగ్విస్టిక్స్ సేర్వే అఫ్ ఇండియా, నాలగవ భాగమైన ముండ మరియు ద్రావిడ భాషలు అనే సంపుటిలో కొరవ/ ఎరుకల గురించిన పరిశోధన కనిపిస్తుంది. తమిళ ప్రాంతంలోని ఎరుకల భాష ఆధారంగా జరిగిన ఈ విశ్లేషణలో కొరవను ప్రత్యేక భాషగా చెబుతూ “ .... Korava has sometimes been considered as a separate language. T’his is not, however, this case, though is it not derived from the colloquial Tamil of the present day. There are several points in which the dialect differs from Tamil and agrees with other Dravidian languages”. కొరవకు, తమిళానికి దగ్గర పోలికలుగల భాషా నిర్మితి ఉందంటూ ....... “The whole structure is however almost the same as in Tamil” అనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఉచ్ఛారణపద్దతి, నామవాచాకాలు, విభక్తి ప్రత్యయాలు, సంఖ్యవాచాకాలు, సర్వనామాలు, క్రియలను గూర్చి క్లుప్తంగా వివరించారు.
శ్రీనివాస వర్మ (1975) ఎరుకలను దక్షిణ ద్రావిడ భాషలకు చెందినది గా తమ ‘తమిళ – ఎరుకల భాషాల తులనాత్మక పరిశీలన ’ అనే వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. ఎరుకల భాష తెలుగులోని పదాలను అరువు తెచ్చుకున్నది, ఆ కారణంగా కూడా రెండు భాషల మధ్య దగ్గరసంబంధం కనిపిస్తుందని అన్నారు. తమ వ్యాసంలో తమిళ –ఎరుకల భాషలకు గల సామ్యాలు-తేడాలను చర్చించారు.
వర్ణాలు (phonemes), వచన ప్రత్యయాలు (number markers), సంఖ్యలను గురించి తమ వ్యాసంలో క్లుప్తంగా వివరించారు. అయితే ఈయన పరిశోధన కూడా తమిళ, తమిళ ప్రభావం ఉన్న ఆంధ్రా ప్రాంతం ఎరుకల నుండి సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎరుకల భాష యొక్క వర్ణసమామ్నాయం అనేది ఇప్పటి వరకు జరగలేదని తెలుస్తుంది. సుబ్రహ్మణ్య శర్మ (2007) తన ఎం.పిల్ సిద్ధంత గ్రంథంలో ఎరుకల వర్ణ శాస్త్రాన్ని విపులంగా చర్చించారు.
3 . సమాచార సేకరణ పద్ధతి:
ప్రస్తుత పరిశోధనలో వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఎరుకల వారి నుండి సమాచారాన్ని సేకరించాను. ఎరుకలకలో అనేక వృత్తులు అవలంబిస్తున్న వారున్నారు. అందులో ముఖ్యంగా పందులు పెంచేవారు, చాపలు అల్లేవారి నుండి సమాచారాన్ని తీసుకున్నాను. సమాచారా సేకరణ C.I.I.L (Central Institute of Indian Languages) (2016 ) వారు అంతరించి పోతున్న భాషలను విశ్లేషించడానికి తయారు చేసిన ప్రశ్నావళి ఆధారంగా దత్తాంశ సేకరణ చేశాను. ఎరుకల భాష వ్యవహర్తలైన స్త్రీ పురుషుల నుంచి సమాచార సేకరణ చేశాను. వారు మాట్లాడుతున్న సమయంలోనే వారి ఉచ్ఛారణను ధ్వన్యాత్మక లిపిలో రాసుకోవడమే కాకుండా రికార్డ్ కుడా చేసుకున్నాను. సమాచార సేకరణ 25-50 మధ్య వయస్సు గల ఎరుకల భాష వ్యవహర్తల నుండి సమాచారం సేకరించాను.
హకేట్ (1948) ప్రతిపాదించిన ప్రిన్సిపుల్స్ అఫ్ ఫోనేమిక్ అనాలిసిస్ని ఆధారంగా చేసుకొని ఒక భాషలోని వర్ణాలను స్థాపించే పద్దతి ప్రాచుర్యంలో ఉంది. మొట్టమొదట భాషను ధ్వన్యాత్మక లిపిలో లేదా వర్ణనాత్మక లిపిలో రాసుకోవడం మొదటి సోపానం. మనం విన్న హల్లులు లేదా అచ్చులు ద్వనులా ? వర్ణాలా ? అని మనం తెలుసుకోవాలి అంటే, అవి కనిష్ఠ భేదక యుగ్మాలుగా ఉన్నప్పుడే వర్ణాలుగా చెప్పవలసి వస్తుంది. పల్లి, బల్లి అనే జంట కనిష్ఠ భేదక యుగ్మం ఎందుకంటే ప బదలు బ అనే ధ్వనిని చేర్చడం వల్ల అర్థాలలో మార్పు వస్తుంది కాబట్టి వీటిని కనిష్ఠ భేదక యుగ్మం అని అంటారు. ఒకవేళ కనిష్ఠ భేదక యుగ్మాలు లేని సందర్భంలో వాటి పరిసరాల వ్యాప్తిని బట్టి పరిపూరక నియతి (complementary distribution) లో, అంటే రెండు ధ్వనులు రెండు వేరు వేరు పరిసరాల్లో వస్తే వాటిని మనం సార్థకాలుగా గుర్తిస్తాము. కానీ వర్ణ సమామ్నాయమలో చేర్చము. ఒకవేళ ఒక భాషలో త,ద, చ,జ లు వర్ణాలుగా ఏర్పాటైన తరువాత క,గ మధ్య కనిష్ఠ భేదక యుగ్మాలు లేకున్నా principle of neatness of pattern అనే సూత్రాని బట్టి క,గ లను కూడా ఆ భాషలో వర్ణాలుగా నిర్ధారిస్తాము. ఈ రకంగా వర్ణాలని నిర్మించే పద్దతిని డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ (వర్ణనాత్మక భాషాశాస్త్రం) అని అంటాము. ప్రస్తుత పత్రంలో డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ పద్దతులను అవలంబించడం జరిగింది.
4. ఎరుకల భాష వర్ణసమామ్నాయము:
ఎరుకల భాషలో 27 వర్ణాలున్నాయి, అందులో 17 హల్లులు, పది అచ్చులు. అచ్చులలో ఐదు హ్రస్వాచ్చులు, ఐదు దీర్ఘాచ్చులు.
ఉచ్ఛారణ ప్రయత్నం(క్రింది వైపు ) |
ఉచ్ఛారణ స్థానం (కుడి వైపు ) |
ఉభయోష్ఠ |
దంతమూలీయం |
మూర్ధన్య |
తాలవ్య |
కంఠ |
స్పర్శ |
|
ప బ |
త ద |
ట డ |
చ జ |
క గ |
ఊష్మ |
|
|
స |
|
|
|
కంపిత |
|
|
ర |
|
|
|
అనునాసిక |
|
మ |
న |
|
|
|
పార్శ్వ |
|
|
ల |
|
|
|
అంతస్థ |
|
వ |
|
|
య |
|
ఎరుకల హల్లులను పరిశీలించినట్లయితే ఛాంస్కి(1968) చేసిన ధ్వనుల విభజన ఎరుకల స్పర్శ ధ్వనుల విషయంలో స్పష్టంగా వర్తింస్తుంది. ఎరుకల స్పర్శ ధ్వనులలో శ్వాస(ప ,త ,ట చ, క ) నాద (బ,ద,డ,జ,గ) భేదకత్వం ఉన్న అన్ని స్థానాలలో కన్పిస్తుంది. కాబట్టి అయన చేసిన నిరుద్ద (Non-continuant), అనిరుద్ధ (Continuant) విభజన ఎరుకల హల్లుల విషయంలో స్పష్టంగా వర్తింస్తుంది. అనిరుద్ధ వర్ణాలలో మాత్రం ఉష్మశ్వాసం తప్ప మిగలిన అన్ని వర్ణాలు కేవలం నాదాలే. అయితే ఉష్మశ్వాసమైన ‘స ’ వర్ణమే తప్ప దానికి నాద ప్రతిబింబము వర్ణముగా లేదు.
నిరుద్ద స్పర్శాల ఉత్పత్తి స్థానాలు వరుసగా ఉభయోష్ఠ, దంత, మూర్థ, తాలు, కంఠాలు. పైన చెప్పినట్లుగా ప్రతిస్థానంలోనూ శ్వాస,నాద భేదకత్వంతో వర్ణ యుగ్మాలున్నాయి. ప బ, త ద, ట డ, చ జ, క గ జతలలో చ,జ లు స్పర్శ వర్ణాలే కాక స్ప్రుష్టోష్మాలు (Affricates) కుడా. ఎరుకలలో రెండు మాత్రమె అనునాసిక వర్ణాలు ఉన్నాయి. అవి ఉభయోష్ఠ, దంతమాలీయ , మ, న వర్ణాలు. ఈ భాషలో ‘ర’ అనే కంపితం ‘ల’ పార్శికం కనబడుతున్నాయి. య, వ అను అంతస్థలు కూడా ఎరుకల భాషలో ఉన్నాయి.
ఎరుకలలో మహాప్రాణ ధ్వనులు లేవు. ఆదాన పదాల్లోని మహా ప్రాణ ధ్వనులు మహాప్రాణత్వాన్ని కోల్పోతాయి. ఉదాహరణకు ధోతి అనే పదం దొతి గా పిలవబడుతుంది. ఈ భాషలో కంఠమూలీయ ఊష్మము కూడా లేదు. ఆదాన పదాల్లో ఉన్న ‘హ’ కారం ‘గ’ మారుతుంది. ‘పదిహేను’ పదిగేనుగా మారుతుంది. అదేవిధంగా ‘బహుమానం’ బాగుమానంగా మారుతుంది. ద్రావిడభాషా లక్షణంగా చెప్పే డ, ళ వర్ణాలు ఈ భాషలో ప్రత్యేక వర్ణాలుగా కనబడవు. ఇది ప్రత్యేకంగా కనిపించే లక్షణం.
5. ఎరుకల హల్లులు భేదక యుగ్మాలు (Contrasting pairs):
ప, బ వర్ణాల మధ్య భేదకత్వం పదాదిలో కన్పిస్తుంది.
ఎరుకల పదం (ఎ . ప ) తెలుగు అర్థం (తె . అ)
పొట్ట ఆడ
బుట్ట బుట్ట
త, ద వర్ణాల మధ్య భేదకత్వం పదాది, పద మధ్య స్థానాల్లో కన్పిస్తుంది.
ఎ.ప తె. అ ఎ.ప తె.అ
తడ అల అత్త అత్త
దడ దడ అద్ది అన్ని
ట, డ వర్ణాలు:
పదాది, పద మధ్య స్థానాల్లో ట, డ లు భేదకత్వంలోనూ పదాంతంలో స్వేచ్ఛా ప్రవృత్తిలో ఉంటాయి.
పదాది పద మధ్య పదాంతం
ఎ.ప తె . అ ఎ.ప తె . అ ఎ.ప తె.అ
టోపీ టోపీ నెంటో చుట్టం కాటు అడవి
డాబా డాబా నెండు ఎడ్రకాయ కాడు అడవి
చ, జ వర్ణాలు పదాది, పద మధ్యమంలో కన్పిస్తాయి.
పదాది పద మధ్య
ఎ.ప తె . అ ఎ.ప తె . అ
చిగురు చిగురు చెంచి సంచి
జిగురు జిగురు గెంజి గంజి
క, గ వర్ణాలు పదాది మధ్య ధ్వనుల్లో భేదకత్వం కల్గి ఉంటాయి.
పదాది పద మధ్య
ఎ.ప తె. అ ఎ.ప తె.అ
కెయ్ చెయ్యి పెంక పెంకు
గెయ్ గుహ పంగ పండు
ర, వ లు పదాదిలో భేదకత్వం కలిగి ఉంటాయి.
పదాది
ఎ.ప తె.అ
రాయ్ రేపు
వాయ్ నోరు
డ, ద లు కేవలం పద మధ్యలో భేదకత్వం కలిగి ఉంటాయి.
పదాది
ఎ.ప తె.అ
ఊడు ఇల్లు
ఊదు ఊదు
6. ఎరుకల భాష: హల్లుల వ్యాప్తి (Distribution of phonemes ):
వర్ణం పదాది పద మధ్య పదాంతం
(p) ప పెల్లు ‘పండ్లు’ బెల్పు ‘బలుపు’ కూపు ‘కొడవలి’
(b) బ బేరు ‘పెద్ద’ రాంబార్ ‘రాత్రి’ ----------
(t) త తెన్ని ‘నీళ్ళు’ పాతు ‘చూడు’ ---------
(d) ద దగ్గు ‘దగ్గు’ క్యాద ‘గాడిద’ --------
(ʈ) ట టమాట ‘టమాట’ ముట్ట ‘గుడ్డు’ కాటు ‘అడివి’
(ɖ) డ డిర్రేంగల్ ‘చేపలు పట్టేవారు’ కుండువ ‘కుండ’ మాడ్ ‘ఎద్దు’
(c) చ చక్రం ‘చక్రం’ కుల్చి ‘స్త్రీ’ -----------
(j) జ జెట్ట ‘జెట్ట’ గెంజి ‘గంజి’ -----------
(k) స కెత్తి ‘కత్తి’ కొక్కు ‘కొంగ’ ఓక్ ‘పంచాయతి’
(g) గ గుంట ‘పిల్ల’ నింగులు ‘మీరు’ కాగ్ ‘నీళ్లు కాచే పాత్ర’
(s) స సరం ‘’గొంతు’’ ఇస ‘భాగం’ నేస్ ‘నిన్న’
(r) ర రెగం ‘రక్తము’ సోరు ‘అన్నం’ కోర్ ‘పిండి’
(v) వ వాయ్ ‘నోరు’ అవిలి ‘వారు’ కోయ్ సావ్ ‘కోడిపుంజు’
(y) య యాప సెడి ‘వేపచెట్టు’ముయ్యి ‘మూతి’ నాయ్ ‘కుక్క ’
(m) మ మొగురు ‘జుట్టు’ తెంబి ‘తమ్ముడు’ కెగం ‘మెడ ’
(n) న నెరం ‘నరం’ నాను ‘నేను’ బగుమాన్ ‘బహుమతి’
(l) ల లోట ‘చెంబు’ నాలు ‘నాల్గు’ కోల్ ‘కట్టే’
ఎరుకల భాషలో ఉన్న అన్ని హల్లు వర్ణాలు పదాదిలో వస్తాయి, పద మధ్యలో కుడా వస్తాయి. కాని పదాంతంలో మాత్రం బ, త, ద, చ, జ, గ లు రావు. ఇవి కాక మిలిగిన హల్లులు పదాంతంలో వచ్చినప్పటికీ, ఏదో ఒక అచ్చు ధ్వని జోడించి పలకడం జరుగుతుంది. అయితే ఆ అచ్చు ధ్వని పాక్షిక ఉచ్ఛారణ కలిగి ఉంటుంది. ఆ అచ్చు ధ్వని లేకుండా కుడా వారి వ్యవహారం కన్పిస్తుంది. ఉదా: మాడ్ (లేదా) మాడు ‘ఎద్దు’, కూప్ లేదా కూపు ‘కొడవలి’.
7. ఎరుకల భాష - అచ్చు వర్ణాలు:
ఎరుకల భాషలో ఉన్న మొత్తం అచ్చులు పది. అందులో ఐదు హ్రస్వాలు, ఐదు దీర్ఘాలు. అవి నాలుక ఎత్తును బట్టి ఉన్నత, మధ్య,నిమ్న స్థానాలలోనూ, నాలుక స్థానాన్ని(ముందు, వెనక) బట్టి అగ్ర, కేంద్ర పశ్చిమ స్థానాలోనూ విస్తరించి ఉన్నాయి. వీటిలో అగ్రాచ్చులు అవ్యోష్ఠ అచ్చులు. పశ్చిమాచ్చులు ఓష్ఠ అచ్చులు.
అగ్ర కేంద్ర పశ్చిమ
ఉన్నత ఇ, ఈ ఉ, ఊ
మధ్య ఎ, ఏ ఒ, ఓ
నిమ్న అ, ఆ
అచ్చులు-భేదక యుగ్మాలు :
ఇ, ఈ ల మధ్య భేదకత్వం పదాదిన కన్పిస్తుంది.
ఎ.ప తె. అ
ఇపు ఇప్పుడు
ఈపు వీపు
ఎ, ఏ మధ్య భేదకత్వం పదాది, పద మధ్యలో :
ఎ. ప తె. అ ఎ, ప తె, అ
ఎగి బాట కెడు చెడు
ఏగు ఏడు కేరు అడుగు
అ, ఆ ల మధ్య భేదకత్వం పదాది పద మధ్యలో కన్పిస్తుంది .
ఎ. ప తె. అ
అరు ‘కోయు’ నడు ‘నడుపు’
ఆరు ‘ఆరు’ నాడు ‘దేశం’
ఒ, ఓ ల భేదకత్వం పదాదిలో కన్పిస్తుంది.
ఎ. ప తె. అ
ఒగి ‘తన్ను’
ఓగు ‘ఎనిమిది
ఉ, ఊ ల మధ్య భేదకత్వం పదాదిలో కన్పిస్తుంది.
ఎ. ప తె. అ
ఉను ‘తిను’
ఊరు ‘ఊరు’
పైన పేర్కొన్న అచ్చులలోని ప్రతిజతలోను హ్రస్వ , దీర్ఘాలకు మధ్య భేదకత్వం ఉంది కాబట్టి దీర్ఘం ఈ భాషలో వర్ణస్తాయిని కలిగి ఉంది.
ఎరుకలలో ఉన్నత అచ్చులకు, మధ్య అచ్చులకు, నిమ్న అచ్చులకు కూడా భేదకత్వం ఉంటుంది.
ఇ,ఎ ల భేదకత్వం:
పదాది పదమధ్య
ఎ. ప తె.అ ఎ. ప తె.అ
ఇదు ఇతడు తిరి తిరుసు
ఎదు ఎవడు తెరి తాకు
ఇ, అ ల భేదకత్వం:
పదాది పద మధ్య
ఎ. ప తె.అ ఎ. ప తె.అ
ఇవిలి ‘వీళ్ళు ‘ ఒగి ‘తన్ను’
అవిలి ‘వాళ్ళు’ ఒగ ‘ఎండ’
ఎ, అ ల భేదకత్వం:
పదాది పద మధ్య
ఎ. ప తె.అ ఎ. ప తె.అ
ఎదు ‘ఎవరు ’ నెల్లు ‘వడ్లు’
అదు ‘ఆమె ’ నల్ల ‘మంచి’
ఉ, ఒ ల మధ్య భేదకత్వం :
పదాది పద మధ్య
ఎ. ప తె.అ ఎ. ప తె.అ
ఉండె ‘తిన్నాను’ సుట్ట ‘చుట్టు’
ఒండు ‘ఒకటి’ సొట్టో ‘బాబాయి’
ఒ, అ ల భేదకత్వం:
పదాది పద మధ్య
ఎ. ప తె.అ ఎ. ప తె.అ
ఒల్ల ‘తెల్ల’ కొర్గు ‘కోతి’
అల్ల ‘వద్దు’ కర్గు ‘పాము’
అ, ఒ ల భేదకత్వం పద మధ్యలో కన్పిస్తుంది.
ఎ. ప తె.అ
కాల్ ‘కాలు’
కోల్ ‘కట్టే’
ఉ, అ ల భేదకత్వం కేవలం పదాంతం లో కన్పిస్తుంది.
ఎ. ప తె.అ
కొల్లు ‘కొట్టు’
కుల్ల ‘త్రాగు’
8. ఎరుకల భాషలో అచ్చుల వ్యాప్తి:
ప్రతి భాషలో అన్ని వర్ణాలు అన్ని పరిసరాల్లో రావచ్చు,రాకపోవచ్చు. ఎరుకల అచ్చులు పదంలో వచ్చే స్థానాన్ని బట్టి పదాది, పద మధ్య, పదాంతాలుగా క్రింద ఇవ్వడం జరిగింది.
అచ్చు పదాది పద మధ్య పదాంతం
ఇ ఇల్ల ‘లేదు’ ఇవిలి ‘వీరు’ ఎగి ‘బాట’
ఈ ఈద ‘గాలి’ నీను ‘నీవు’ ----
ఎ ఎర్ర ‘ఎర్ర గెడ్డి ‘గడ్డి ’ ఉండే ‘తిన్నాను’
ఏ ఏరి ‘వాగు’ కెరు ‘అడుగు’ -----
అ అడుపు ‘పొయ్యి’ కర్గు ‘తాడు’ చంక ‘చంక’
ఆ ఆని ‘తాబేలు’ కాపాన ‘కాయ’ వా ‘రా’
ఉ ఉడ్కాన్ ‘డబ్బు’ ముట్ట ‘గుట్ట’ ఉను ‘తిను’
ఊ ఊట ‘వాసన’’ మూడు ‘మూడు’ -----
ఒ ఒడుము ‘శరీరము’ పొండు ‘భార్య’ ఇగారో ‘వియ్యంకుడు’
ఓ ఓడి ‘కల్లు’ సోలం ‘జొన్న’ ------
ఎరుకల అచ్చులన్నీ పదాదిలో, పదమధ్యలో కూడా వస్తాయి. పదాంతంలో హ్రస్వ అచ్చులు అన్నీవస్తాయి. దీర్ఘాచ్చుల్లో ‘అ’ కారం మాత్రమె పదాంతంలో కనిపిస్తుంది. నిర్దేశిక సర్వనామలైన ‘ఆ, ఈ, ఏ ’ లు ఏకాక్షరాలు అయినందువల్ల ఆ పదాలు దీర్ఘాచ్చులతో అంతమౌతాయని గనక భావించినట్లయితే ఈ మూడు పై సూత్రానికి అపవాదాలు.
9. ముగింపు:
ప్రస్తుత పత్రంలో ఎరుకల భాషలోని వర్ణసమామ్నాయాన్ని భాషాశాస్త్ర దృష్టికోణంతో విశ్లేషించడం జరిగింది. ఎరుకల హల్లులు, అచ్చులు పదంలోని ఏ స్థానంలో వస్తాయి , అనే విశ్లేషణ కుడా చేయడం జరిగింది. పదానికి దాని లోని అక్షరాల(Syllable)కు ఉన్న సంబంధాన్ని విశ్లేషించవలసిన వచ్చిన, లేదా ఒక పదంలోని ఉన్న అక్షరాల నియతిని ఏ విధంగా విశ్లేషించాలి అనే విషయంలో, ఏ హల్లులు onset position లో వస్తాయ, ఏ హల్లులు coda position లో వస్తాయి అని నిర్ధారించడం చాలా అవసరం. ఈ విశ్లేషణకు నాందిగా అసలు ఎరుకలలో ఎన్ని హల్లులు, ఎన్ని అచ్చులు ఉన్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత పరిశోధన జరిగింది. ఎరుకల భాషకు భవిష్యత్తులో లిపి తయారు చేయడానికీ, ఎరుకల భాషకూ సంగణన వ్యాకరణం(Computational grammar) వ్రాయడానికి కూడా ఈ ప్రస్తుత విశ్లేషణ ఉపయోగపడుతుంది.
ఎరుకల భాషకు NEP 2020 దృష్ట్యా మాతృభాషలోనే విద్యాబోధన తలపెట్టదలిస్తే, వారి మాతృ భాషలోనే వాచకాలను తయారుచేయడానికి కుడా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎరుకలే కాకుండా ఇతర గిరిజన భాషల పైన కుడా భాషాశాస్త్ర దృష్టికోణంతో జగవలసిన పరిశోధన ఆవశ్యకతను గుర్తుచేసుకుంటూ, ఇటువంటి పరిశోధనల అవసరాన్ని, విధానాన్ని, కొంతవరకు చర్చించడం జరిగింది.
ఉపయుక్త గ్రంథాలు:
- బర్రో, టి. & ఏం ఎమెనో. 1984. ద్రావిడియన్ ఎటిమాలాజికల్ డిక్షనరీ, అక్సఫర్డ్.
- ఛాంస్కీ, ఎన్ .& ఎం. హాల. 1968. ది సౌండ్ పాటర్న్స్ ఆఫ్ ఇంగ్లిష్. హార్పర్ & రో. న్యూయార్క్.
- దేవి, జి. ఎన్, ఏ. ఉషా దేవి & డి. చంద్ర శేఖర్ రెడ్డి.2015. భారతీయ భాషల ప్రజా సర్వేక్షణ: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భాషలు: సంపుటి -3, భాగం-1. ఎమెస్కో.
- గ్రియర్సన్, జి. ఎం. 1906. లింగ్విస్టిక్స్ సర్వే ఆఫ్ ఇండియా.
- హకేట్, సి. ఎఫ్. 1958. ఎ కోర్స్ ఇన్ మోడరన్ లింగ్విస్టిక్స్. నుయార్క్.
- కృష్ణముర్తి, బి. హెచ్. 2003. ద్రవిడియన్ లాంగ్వేజెస్. కేంబ్రిడ్జి.
- లాంగ్వేజ్ డాక్యుమెంటేషన్ హ్యాండ్ బుక్. 2016. స్కీమ్ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ప్రెసర్వేషన్ ఆఫ్ ఎన్డేంజర్డ్ లాంగ్వేజెస్. మైసూరు.
- సుబ్రహ్మణ్యం, పి. ఎస్.2006. ద్రావిడ భాషలు. పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ. హైదరాబాద్.
- సుబ్రహ్మణ్య శర్మ, వి.ఎమ్. (2009). ఎరుకల భాష - వర్ణనాత్మక అధ్యయనం. అముద్రిత ఎం. ఫిల్. సిద్ధాంత గ్రంథం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు.
- శ్రీనివాస వర్మ. జి. ఎరుకల డైలేక్ట్. అన్నామలైనగర్ : అన్నామలై యూనివర్సిటీ.
- శ్రీనివాస వర్మ. జి. ‘తమిళ – ఎరుకల భాషాల తులనాత్మక పరిశీలన’. అన్నామలైనగర్ : అన్నామలై యూనివర్సిటీ.
- థర్స్టన్,ఇ . 1909. కాస్ట్స్ అండ్ ట్రయిబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా, మద్రాసు.
- వీరయ్య, పాలపర్తి. 2000. ఎరుకల : ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవక్ సంఘ, విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.