headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-05 | May 2023 | ISSN: 2583-4797

6. నేతన్నల జీవితం: చేనేత కథలు

g_a_raju
గంగవరపు అశోక్ రాజు

పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9676295097. Email: ashokaraja.g@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రపంచానికి వస్త్రాన్ని అందించిన నేతకారుని యొక్క వృత్తి నైపుణ్యాన్ని, నేతన్నల జీవితాన్ని, వారి యొక్క జీవన విధానాన్ని, ఆర్థిక స్థితిగతులను కథలుగా మలిచి చేనేత కథలలోని జీవత్వాన్ని విశ్లేషణ పద్ధతిలో పరిశీలించి నేతన్నల కుటుంబ పరిస్థితులను పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం. 1994 లోనే ఆచార్య తుమ్మల రామకృష్ణ మరో ఇద్దరి రచయితలతో కలిసి 'పల్లె మంగలి కథలు' వేశారు. డాక్టర్ డి.నర్సింహారెడ్డి, పులుగు సురేష్ ప్రధాన సంపాదకులుగా 2005లో 'చేనేత గుండె కోత' పేర చేనేత కవితల, కథల సంకలనం వచ్చింది. ఈ క్రమంలో 2016లో 'పడుగు పేకలు' పేర వచ్చిన చేనేత కథా సంకలనంలోని కుటుంబ కథల పరిచయం ఆవశ్యకం.

Keywords:చేనేత, మగ్గం, కార్మికుడు, చేతి వృత్తులు, నేత చీర, సాలెగూడు

1. ఉపోద్ఘాతం:

గ్రామజీవనానికి వెన్నెల స్తంభాలాంటివి కులవృత్తులు. పారిశ్రామిక విప్లవానికి ముందు దేశంలోని చాలా గ్రామాలు స్వయం పోషకంగా ఉండి దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలుగా ఉండేవి. ఏ గ్రామాన్ని సందర్శించిన పచ్చని పొలాలతో పనిముట్ల చప్పులతో కళకళలాడేవి. ముఖ్యంగా అందెలు ధరించి హంస నృత్యం చేసినట్లు చేనేత మగ్గాల సవ్వడిలతో మారుమరోగిపోయేవి. దేశ కుటీరానికి రెండు 'ఎనగర్ర' లాంటి రైతన్న, నేతన్నలు చేతినిండా పనులతో, కడిపెడు పిల్లలతో, ఇంటి నిండా ఆనందంతో ఉండేవారు. ఆంగ్లేయ పరిపాలనలో కులవృత్తుల చేతుల్ని నిర్దాక్షిణ్యంగా నరికేశారు. అప్పటికి ఇప్పటికీ కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వృత్తి కార్మికుల జీవన విధానం ఏ మాత్రం మారలేదు. అటువంటి వృత్తి కార్మికులలో నేత చేనేత కార్మికుల జీవనం అత్యంత దయనీయ స్థితిలో ఉన్నది. అసలు ఏమిటి చేనేత? చేనేత యొక్క కథ ఏమిటో తెలుసుకుందాం.

2. చేనేత వృత్తి:

ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన చేతి వృత్తి, హస్తకళ - చేనేత. దీనికి ముడి సరుకు పత్తి. పత్తికి పుట్టినిల్లు భారతదేశం. ఇక్కడి నుంచి ఇది ఇతర దేశాలకు పోయింది. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పింది, బట్టలు కట్టడం అలవాటు చేసింది మన భారతీయులే!. ఈ నాగరికత ఒక్క నాడే హఠాత్తుగా అభివృద్ధి కాదు అది సమాజ పరిణామంతో పాటు అలవాడిన విద్య. మొదటి నారతో వస్త్రాలు తయారు చేసేవారు. ఆ తరువాత పత్తి నుండి నూలు వాడికి బట్టలు నేసారు. ప్రపంచంలో అత్యధికంగా చేనేతను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. చేనేత కార్మికుల నైపుణ్యం పట్టుచీర కొంగులో వధూవరులను చిత్రీకరించింది. బతుకమ్మను పూజించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రమైంది. దేశ విదేశాల్లో గద్వాల, పోచంపల్లి, ధర్మవరం పేర్లని ప్రాచుర్యంలోకి తెచ్చింది. సిద్దిపేట గొల్ల భామల్ని చిత్రిక గడుతుంది. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ చేనేతలు హోయలు పోతున్నాయి.

3. నేతన్నల జీవితం:

చేనేత వృత్తికి పూర్వం ఎంత ఆదరణ ఉందో నేత నేత కార్మికుని ఇల్లు ఎంత సందడిగా ఉంటుందో "తిరిగొచ్చిన వెలుగు" కథలో రామయ్య పాత్ర తన బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ "హు - ఆ రోజులే వేరు-" నిట్టూర్చాడు రామయ్య. అప్పటి కాలంలో ఇంటి నిండా డబ్బూ, ధాన్యం తొనికేసలాడేది. వాకిట్లో - పెద్ద పీట మీద రంగురంగు దారాలు పేర్చిన బతుకమ్మలోలే కుప్పలు కుప్పలుగా కొలువై ఉండేది. అమ్మ దారాల చిక్కుతీస్తుంటే అతడు తల్లి వెంట పరుగులు పెట్టేవాడు. ఇంటి నిండా పదిమంది రేయింబవళ్లు పనిచేస్తున్న సమయానికి 'మాల్' అసలు అందక అటు సేఠూ - ఇటు గిరాకీ పోట్లాటకు దిగేవారు. రామయ్య కైతే నాయన పని చేస్తుంటే ఎప్పుడు పొద్దుగూకిందో కూడా తెలిసేది కాదు."1 (సుధాకర్, చొప్పదండి, తిరిగొచ్చిన వెలుగు కథ) (సంపాదకులు మేడికుర్తి ఓబులేసు,వెల్దండి శ్రీధర్, సంగిశెట్టి శ్రీనివాస్, పడుగుపేకలు కథా సంకలనం, పుట:526) 

ఆ కాలంలో నేత కార్మికునికి చేతినిండా పని దొరికేది. ఇంటి నిండా పనివాళ్ళు గుమస్తాలు, వ్యాపారస్తులు ఇలా అందరికీ పని ఉండి నేతన్న ఇల్లు కోలాహలంగా ఉండేది. "ఆరోజు నేసిన చీరలూ - ధోవతులూ వరుస క్రమంలో సర్ది పదవుతుంటే నిద్రపోయేవాడు చిన్నారి రామయ్య. ఆ గడియ సేపు లుంగీలూ, తువ్వాళ్లు నేయమని ఆర్డర్ ఇచ్చిన సరుకు ఇందాక వచ్చిందని ఎవరెవరో వచ్చి పోతుండేవారు. ఒకరకంగా ఇల్లంతా రేపో మాపో పెళ్లి జరగబోయే లగ్గ పిల్లులాగా సందడి సందడిగా ఉండేది."2 (సుధాకర్, చొప్పదండి, తిరిగొచ్చిన వెలుగు కథ) ( అదే పుట:528) ఈ విధంగా నేత కార్మికుని ఇల్లు లాగా ఉండి చేతినిండా పని ఉండి సందడిగా సరదాగా ఉండేది.

'సాలెగూడు' కథలో నేత నేసే పద్దతిని చెబుతూ నూరో నెంబర్ దారాన్ని గురించి చెప్తారు రచయిత్రి  ఈ కథలోని పాత్రలు వర్ష కరుణ వారి సంభాషణలో నేత ప్రస్తావన "అవునూ రాత్రి పూట కూడా నేస్తారా?" విస్తు పోయాను నేను. "అవును రాత్రి వేళల్లోనే ఎక్కువ నేస్తారు ఎందుకంటే ఆ సమయంలో అయితే పోగులు తెగకుండా వస్తుంది నేత... మరి నువ్వురో నెంబరు దారమైతే అమిత సన్నగా ఉంటుంది. పోగు తెగిందనుకో అది మళ్ళీ మరో పని... బూడిద చేత్తో వాటిని కలుపుకోవాల్సి ఉంటుంది" తెగిన పోగులు ఉరితాళ్లు అవుతున్నాయి అన్నట్లుగా చెప్పింది కరుణ."3 (ప్రతిమ,వి, సాలెగూడు కథ) ( అదే క.సం. పుట: 348) ఈ కథలో రచయిత్రి పాత్ర చిత్రణ సహజంగా ఉంటుంది.

ప్రతి కార్మికుడు తన వృత్తిలో నేర్పు ని సాధించి, నైపుణ్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటాడు. అదేవిధంగా నేత కార్మికులు ఏ విధంగా పనిచేస్తారో పనిచేస్తారో హత్య అనే కథలో ఈ విధంగా చెబుతాడు రచయిత "తండ్రి సుబ్బనాగులు మగ్గం నేస్తూనే ఉన్నాడు. జిడ్డు కట్టిన ముఖాన్ని ఆ నేస్తున్న గుడ్డకే ఆచంపై చెంప రుద్దుతున్నాడు. తప్పిపోయిన వన్నె చికాకుగా తీస్తున్నాడు. మధ్య మధ్యలో ఉయ్యాల ఊపుతున్నాడు." ఏడవకే అమ్మొచ్చే అదిగదిగో "అంటున్నాడు . ఎండ వేడి ఎక్కువవుతుంది. నేత బరక వస్తుంది. షావుకారు ఏమంటాడోనని లోలోన భయం చీరకి కమ్మేనందున మరీ బాధ. చాక్లెట్ కి నీలి నాడేసాడు. ఇంకా నీలి రెండు కవ్వల గుండు తీసేయాలని సణుక్కుంటూ తీస్తున్నాడు."4 (కనక సుందరరావు,బి, హత్య కథ) (అదే క.సం.పుట:124) ఈ కథలో నేతన్న మగ్గం నేస్తూ పిల్లవాడి ఉయ్యాల ఊపుతూ తన మా కుటుంబ స్థితిని గుర్తు తెచ్చుకుంటూ పడుతున్న మనోవేదనను సహజంగా రచించారు.

3.1. ఆర్థిక స్థితిగతులు:

ఆచారాల వలన, అవసరాల వలన, దురాలవాట్ల వలన, దళారీల వలన నేత కార్మికునికి ఆర్థిక సమస్యలు తీవ్రత దాల్చి, అవసరాల నిమిత్తం అప్పులు చేయడం, అప్పులు తీర్చలేక ఆస్తులు కోల్పోవడం, సరిగ్గా పని లేక, ఆదాయం లేక, నేత కార్మికుని కుటుంబాలు ఏ విధంగా చిన్నాభిన్నమవుతున్నాయో ఈ కథలలో మనం గమనించవచ్చు.

సరైన ఆదాయం లేక అసలే జీవితం అంతంత మాత్రమే గడుస్తుంటే, కొందరు నేతన్నల నిర్లక్ష్య ధోరణి అవసరానికి మించిన అప్పులు చేసేటువంటి అజ్ఞానపు ఆలోచనల వల్ల కుటుంబార్థిక స్థితి దిగజారుతుందన్న విషయాన్ని చెబుతూ సాలెగూడు కథలో స్త్రీ పాత్ర ద్వారా అప్పులు బాధలను తెలుపుతుంది రచయిత్రి. ఈ కథలో ఇంట్లోకి అప్పు చేసి మరి టీవీ కొన్నందుకు నేతన్న భార్య ఈ విధంగా బాధపడుతుంది. "ఈ చిన్నప్పులన్నీ తీర్చడం కోసం పెద్దప్పు చేస్తాడంట... ఎట్ట చేసేది రా మీ నాయనతో ఎల్లకాలం ఇయ్యే బాధలు గదా... చేతిలో అంత పని పెట్టుకొని నాలుగు కోకలు నేసుకుందామని లేకుండా బతికినంత కాలం ఇట్నే అప్పులు అప్పులతో గడిపేస్తినే... చిన్నపిల్లలు పారేసుకున్న వస్తువుని గుర్తు తెచ్చుకొని గుర్తుతెచ్చుకొని ఏడుస్తున్నట్లుగా ఉందామె."5 (ప్రతిమ,వి, సాలెగూడు కథ) (అదే క.సం.పుట:342)

ఈ కథలో ప్రసార మాధ్యమాలు అనవసరమైన వస్తువుల కోసం సామాన్యుని ఆకర్షించి, మధ్యతరగతి జీవితాలలో చిచ్చులు పెడుతున్నటువంటి ప్రసారమాధ్యమాల్ని ద్వేషిస్తుంది వర్ష పాత్ర. "మనకి అవసరమైనవి అనవసరమైనవి కూడా సరుకులు బజారులోకి వచ్చి మనల్ని ఊరిస్తున్నాయి మన ఆలోచనలని జీవితాల్ని పక్కదారి పట్టిస్తున్నాయి....ప్చ్ సరుకుల విశ్వరూపాన్ని ప్రజల మెదళ్ళలోకి జొప్పిస్తున్న ఈ ప్రచార సాధనాల మీద విరక్తి కలిగింది."6 (ప్రతిమ,వి, సాలెగూడు కథ) (అదే క.సం.పుట: 351)నిజంగా మధ్యతరగతి కుటుంబీకుల జీవితాలలో ఈ ప్రసారమాధ్యమాలు చిచ్చురేపి, సామాన్యుని చేత అనవసరపు ఖర్చులు చేయించి, సామాన్యుని ఆర్థిక స్థితిని మరింత దిగజార్చి ధనవంతులకు ధనాన్ని సమకూర్చుపెడుతున్నాయి.

తండ్రి చనిపోవడం వలన సుబ్బనాగులకు ఏ విధంగా నష్టం వచ్చిందో హత్య కథలో రచయిత కనకసుందరరావు గారు ఈ విధంగా వివరించారు "తండ్రిని పాతేయడానికి ఆచారం కొడుకు చేత 2000 అప్పు చేయించింది. అది ఇప్పుడు సానబెట్టిన కత్తిలా పదునెక్కుతోంది. బతుకేమో డబ్బా రేకుల రోజురోజుకు తుప్పెక్కుతోంది. పెళ్లీడుకొచ్చిన కూతురు. మళ్ళీ ఖర్చు. బాకీ తీర్చకపోతే షావుకారు గుడిసె ఇచ్చేయమంటాడు! అన్ని ఖర్చులే! ఎలా?"7 ( కనక సుందరరావు, బి, హత్య కథ) (అదే క.సం.పుట: 125) ఈ విధంగా ఆచార సంప్రదాయాల వలన, సరైన ఆదాయం లేని నేతన్నల జీవితం ప్రశ్నార్ధకంగా మారుతుంది.

సాలెగూడు కథలో తగిన ఆదాయం లభించనప్పటికిని కులవృత్తి మీదే ఆధారపడి, వృత్తిని గౌరవించి, ఇంకా నేత వృత్తినే కొనసాగిస్తున్నటువంటి నేతన్నల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కరుణ పాత్ర ద్వారా రచయిత్రి చెప్పిన తీరు అత్యంత సహజంగా ఉంటుంది. శేషు అనే కార్మికుని నేత పని చూడడానికి వారి ఇంట్లోకి వెళదాం అని వర్షా అంటే కరుణ వద్దు అంటూ "ఏం లేదు వర్షా, శేషన్న వాళ్ళ పరిస్థితి మరి ఘోరంగా ఉండాది. ఒకప్పుడు పముజుల వీరాస్వామి అంటే ఊరంతాటికీ గొప్ప. ఆ వీరాస్వామి కొడుకే ఈ శేషన్న. ఈరోజు నా భార్య భర్తలు ఇద్దరికీ ఉండేది ఒకటే గుడ్డ. శేషన్న గుంటలో దిగితే ఆ గుడ్డ తీసి భార్యకిస్తాడు. ఆమె గుంటలో దిగితే శేషన్న బయటకు వస్తాడు. ఇది వాళ్ళ పరిస్థితి" కళ్ళ నీళ్లు పెట్టుకుంది కరుణ." ప్రపంచానికే బట్ట కట్టడం నేర్పిన నేతన్నకి ఒంటిని కప్పుకోవడానికి నూలు పోగు లేదు. "హు"8 (ప్రతిమ, వి, సాలెగూడు కథ) (అదే క.సం.పుట:348) అంటూ భారంగా నిట్టూరు స్తుంది వర్ష. ఇది కథే అయినప్పటికిని వాస్తవంలో కూడా చాలామంది నేతన్నల దుర్బరస్థితి ఈ విధంగానే ఉంది. ఇప్పటికీ చేతి వృత్తిని నమ్ముకుని, నేత నేస్తున్న చాలామంది నేత కార్మికులు అత్యంత దారిద్ర జీవితాన్ని అనుభవిస్తున్నారు.

3.2. ఆకలి చావులు, ఆత్మహత్యలు:

దేశానికి అన్నం పెట్టే వెన్నెముక రైతన్నైతే, మానవుని మానాన్ని కప్పి సంస్కృతి సంప్రదాయాలను కాపాడే వ్యక్తి నేతన్న. అటువంటి నేతన్న కాలక్రమణా వచ్చిన మార్పులలో పని లేక, తిండి లేక, చివరికి వస్త్రాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో వస్తున్న మార్పులే కాక విదేశాల్లో జరిగే యుద్ధాలు వాటి పరిణామాల వలన కూడా నేతన్నల జీవితం కష్టమైపోతుంది. సామాన్య మానవుడు పేదరికంలో తిండి లేక కడు దయనీయ పరిస్థితులలో ఆకలితో మరణిస్తున్నారు. ఆకలితో మరణించే వారిలో వృత్తి కార్మికుల సంఖ్య అధికంగా ఉంది.

హత్య కథలు ఆకలి వలన మరణించిన సుజాత పాత్ర ఎటువంటి పరిస్థితులలో మరణించినదో రచయిత జీవధారలాంటి భాషలో వివరించారు."ఆకలి సుజాత పేగుల్ని కొరుకుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి లేవడానికి కూడా ఓపిక లేదు. గొంతు పెడచగట్టుకు పోతోంది. మంచం మీద ఉండలేక గోడను పట్టుకొని బయటకు వచ్చి చూసింది సుజాత. పిల్లలు ఒకరి మీద ఒకరు ఇసుకపోసుకుంటున్నారు. పక్కింటి ఆవిడ బియ్యం కడిగి పోసిన కడుగు నీళ్లు తపేల్లో కనిపించాయి. దోసెలతో తాగి నిదానంగా వెళ్లి ఏడుస్తున్న పాప దగ్గర పడుకుని రొమ్ము నోట్లో వేసింది."9 (కనక సుందరరావు, బి, హత్య కథ) (అదే క.సం.పుట:129) నాలుగు రోజుల నుంచి అన్నం లేక,వండుకోవడానికి సరుకులు లేక, నేత పనిచేసే తన భర్త అప్పు కోసం తిరిగి తిరిగి అప్పు పుట్టక వేరే ఊరు వెళ్ళితే అతను అప్పు చేసి సరుకులు తెచ్చేసరికి ఇంట్లో సుజాత ఆకలి చావు అతనికి ఎదురవుతుంది. ఇటువంటి దయనీయ పరిస్థితులలో నూతనల జీవితం దుర్భరంగా సాగుతుంది.

పేదరికంలో ఉన్నవారు ఆకలి చావులతో మరణిస్తుంటే, మధ్యతరగతి స్థితిలో ఉన్న చాలామంది నేతన్నలు అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో అనేకమంది నేత కార్మికులు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. "నైట్రాఫ్" అనేది నేత పనిలో రంగుల్లో కలిపేటటువంటి ఒక విష పదార్థం. ఇదే నేతన్నలకు వరము మరియు శాపము. పని బాగా సాగాలంటే వస్త్రానికి రంగులు అద్దాలంటే ఈ నైట్ రఫ్ పదార్థాన్ని ఉపయోగిస్తారు. చేతికి చల్లగా తగిలి వస్త్రానికి మంచి రంగును ఇచ్చే ఈ పదార్థం. నేతన్నల ఆత్మహత్యలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పదార్థాన్ని నోట్లో వేసుకుంటే పావుగంటలో మనిషి చనిపోతాడు. చాలామంది నేత కార్మికులు ఈ పదార్థాన్ని తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అయితే రాజకీయ నాయకుల దృష్టిలో నేతన్న ఆత్మహత్యలు ఏ విధంగా ఉంటాయో సాలెగూడు కథలో  ఒక నేతన్న పాత్ర తెలుపుతుంది. "మంత్రి ఏమన్నాడో చదివినా..." పేపర్ చూస్తూనే ప్రస్తావించాడు కిష్టయ్య.."ఈ చేనేత పనోళ్లంతా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నారు అంట". 'ప్చ్'  "ఆకలి ఎట్లుంటదో తెలిస్తే ఇట్ట మాట్లాడతారంట ఎదవ నాయాళ్ళు?". చుట్టూ నోట్లో పెట్టుకుని కొరుకుతూ అన్నాడు పెద్దాయన. ఎండుటాకుల రాలిపోతున్న నేతన్నల మీద మన నేతలు ఇటువంటి హీనమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు...'ప్చ్' ప్రపంచానికే బట్ట కట్టడం నేర్పిన ఐదు వేల ఏళ్ల నాటి మన భారతీయ సంస్కృతి సిగ్గుతో తలదించుకుంది."10 (ప్రతిమ,వి, సాలెగూడు కథ) (అదే క.సం.పుట:349) ఇలా వృత్తి కార్మికుల ఆత్మహత్యలు మనం రోజు పేపర్లలో చూస్తూనే ఉంటాం కానీ అంతగా పట్టించుకోము. కానీ వారి జీవితాలను దగ్గర నుండి పరిశీలిస్తే వారి వ్యథలు మనకు అర్థమవుతాయి.

"తిరిగొచ్చిన వెలుగు" కథలో రచయిత సుధాకర్ ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే నేతన్నలు, వారు ఆ స్థితికి రావడానికి గల కారణాలను వివరిస్తూ, ఆత్మహత్య కంటే కూడా బ్రతకడం గొప్ప అని, కులవృత్తి కాకుండా వేరే పని చేసుకుని కూడా ఎలాగైనా బ్రతకాలి అని, సమస్యలకు చావు పరిష్కారం కాదని చెబుతూ 70 ఏళ్ళ రామయ్య పాత్ర ద్వారా "నాయనా శంకరి! నువ్వు చెప్పినట్టే కానీ బిడ్డ! మల్ల నేను నేత మొదలు పెడతా. నాకోసం కాకున్నా నీకోసం. సావడం తెలివి కాదురా! బతకడమే తెలివి. బతుకుతా నీకోసం బతికి సాధిస్తా..."గుండెలు ఎగిరెగిరి పడుతుంటే ఏడుస్తున్నాడు"11 (సుధాకర్, చొప్పదండి, తిరిగొచ్చిన వెలుగు కథ) (అదే క.సం.పుట:531) 

ఈ విధంగా బ్రతుకు మీది విశ్వాసం కోల్పోయి క్షణికావేశంలో అర్ధాంతరంగా ప్రాణాలు తీసేసుకునే నేత కార్మికులకు విన్నపముగా రచయిత సుధాకర్ గారు ఎలాగైనా బ్రతకాలి అనేటువంటి ఉత్సాహాన్ని నింపి నేతన్నల జీవితానికి పరిష్కార మార్గాన్ని చూపించారు.

4. ముగింపు:

మనం చదివే ప్రతి కథలో కూడా ఒక జీవి మనుగడకు కావలసిన అంశాలు ఉంటాయి. అయితే "పడుగు పేకలు" కథ సంకలనంలో చేనేత కార్మికుల వృత్తి నైపుణ్యము మాత్రమే కాకుండా వారి యొక్క కుటుంబాలు ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ వారి ఆత్మహత్యలకు పరిష్కార మార్గాలను చూపించే అనేక కథలు ఇందులో ఉన్నాయి. వీటిని చదవడం వలన నేత కార్మికుల కళా కౌశలం, సమాజంలో వారి స్థితి తెలియడంతో పాటు, కాలక్రమేణా వచ్చిన మార్పులతో జీవితం చిన్న భిన్నం చేసుకునే సామాన్యులకు పరిష్కార మార్గాన్ని చూపించే ప్రోత్సాహం, ఉత్సాహాన్ని నింపే కథలు తెలుసుకోవడం చాలా అవసరం.సమాజంలో ఉన్న చేనేత కార్మికుల జీవన విధానాన్ని తెలుసుకోవడం ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు మరియు వృత్తి కార్మికుల జీవన సంఘర్షణను తెలుసుకొని వారికి తగు ప్రోత్సాహం అందించాలని ఆశిద్దాం.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఓబులేసు, మేడికుర్తి, శ్రీధర్, వెల్దండి, శ్రీనివాస్,సంగిశెట్టి ,(2016). పడుగు పేకలు కథా సంకలనం, ఎ ఫోరం ఫర్ కన్సర్నడ్ బిసీస్, హైదరాబాద్, తెలంగాణ.
  2. కృష్ణమూర్తి, భద్రిరాజు, (1971), ద్వితీయ సంపుటి(చేనేత పదాలు), మాండలిక వృత్తి పదకోశం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్.
  3. జయప్రకాష్, ఎస్, (2009), పరిశోధన విధానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  4. రామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి, (2017), తెలుగు సర్వస్వము (బుక్:3),పెన్నేటి పబ్లికేషన్స్,కడప
  5. సత్యవాణి, జై.వెం. (2012). తెలుగులో ప్రక్రియా వైవిధ్యం, తెలుగు అకాడమి, హైదరాబాద్.
  6. స్వామి, ననుమాస. (2012). వృత్తి పురాణాలు - పటం కథలు, తెలుగు అకాడమి, హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]