AUCHITHYAM | Volume-3 | Issue-9 | September 2022 | ISSN: 2583-4797
5. "కవితా పూరణం" - ఒక కవితా ప్రక్రియ పరిచయం
కే. జయంత్ కుమార్
ఉపాధ్యాయుడు (PRT), భారతీయ విద్య భవన్, NIRDPR , రాజేంద్రనగర్ ,
హైదరాబాద్, తెలంగాణా. చరవాణి: 9703673692. ఈమెయిల్: jayanthbvb@gmail.com
ఉపోద్ఘాతం:
మనకు ఎన్నెన్నో కవితా ప్ర క్రియలు ఉన్నాయి . ఈ ప్రక్రియలో కవితా లాలసను, పాఠకుల ఆలోచనా సరళిని అనుసరించి కవుల సౌలభ్యానుసారము - ఈ ప్రక్రియ ను ఒక పరిశోధనా వ్యాసముగా వెలువరించుచున్నాను. సాధారణంగా ఒక కవితను రాయటానికి అర్థవంతమైన పదముల కూర్పును భావయుక్తము గా ,కవి అనుకున్న విధముగా కొన్ని కవితా సౌరభాలను అందించగలడు. అందులో వచన కవిత సౌరభం ఒకటి. అందులో ఆది ప్రాస కానీ, మధ్య ప్రాస కానీ లేదా అంత్య ప్రాస కానీ ఉపయోగించి అనుకున్న అంశము పై కవిత ను రాస్తాడు. అయితే ఇక్కడ ఛందో బద్ధత కూడా అవసరం లేదు . భావ వ్యక్తీకరణ ముఖ్యం. అలాగే నేను పేర్కొన్న కవితా పురాణం కూడా ఈ కోవ కి చెందినదే .
లక్షణం :1. ఒక సమస్యను కవితా వస్తువుగా తీసుకుని , ఆ వస్తువును కవిత గా రాయాలి . ఇక్కడ ఆ కవిత పద్య రూపం లో ఉంటుంది కానీ అది పద్యం కాదు . ఎందుకంటే, అది ఛందో బద్ధముగా ఉండదు. కాబట్టి దానిని పద్య రూపం లో ఉన్న కవిత గానే భావించాలి .
- ఈ పద్య రూపంలో ఉన్నా గానీ, దీనికి భావాన్ని ప్రకటింపజేసే పద్ధతిలో ప్రతిపదార్థం కానీ , లేక భావాన్ని కానీ లేదా రెండింటినీ రాయ వచ్చును , లేకపోతే కవితను మాత్రమే పద్యరూపం లో రాయ వచ్చును .
- కవి దానిని భావ యుక్తముగా, రాస్తున్నాడా లేదా అనేది ముఖ్యం .
- దీనికి ఛందస్సు అవగాహన లేని వారు కూడా రాయవచ్చును.
- ఈ రచనలు (కవితా పూరణలూ ) పూర్వ కవులు రాసిన పద్యాలను పోలి ఉంటుంది . దీనిని పద్యరూపంలో ఉన్న కవిత గా భావించి తెలుగు భాషా కళామతల్లికి ఒక మకుటంలో కలికి తురాయి గా వెలుగొందింప జేసే బాధ్యత, నవ కవులు , రచయితలు ముఖ్యంగా పాఠకులు , ప్రచురణ కర్తల పై కూడా ఉన్నది. ఈ ప్రక్రియ సాహితీ ప్రియులకు హస్తభూషణం గా కూడా ఉంటుంది.
ఉదాహరణ 1 : kavitha puranam 22.10.2018
దత్త పాదం :
"ఖర పాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్"
పూరణ :
జరా మరణము గల భక్తుల సృజనయగు జగజ్జననిసృష్టి కారకులైన య
ప్పరమేశ్వరుని మనోవాంఛితులైన సుజనభక్త పరమాణువుల నిశ్చల. చిత్తచాంచల్య ము లేక బ్రహ్మ
మరయంగానర్ధనారీశ్వర దర్శనము నాకు నవవిధ భక్తిమార్గముల
. నరయగానాత్మయందే గల ఆ సోమశే
ఖరపాదార్చనమొక్కటే హితము కల్గన్ జేయుముమ్మాటికిన్ !
భావం : చావు పుట్టుకలు గల భక్తుల ను సృజియించినట్టి జగన్మాత , మరియు సృష్టి కారకులగు ఆ పరమేశ్వరుని యొక్క మనో వాంఛితులైనట్టి,మంచి భక్త జనులగు పరమాణువుల లాంటి వారైనట్టి ,చలనము లేనట్టి చపల చిత్తము లేక జ్ఞానమును తెలుసుకొనగా , ఆ అర్థ నారీశ్వరుని దర్శనము నాకు తొమ్మిది విధముల భక్తి మార్గములలో వెతకగా ,ఆత్మ యందె కల ఆ సోమశేఖరుని పాదములను అర్చించడమొక్కటే నాకు హితము ముమ్మాటికీ. అని ఈ కవితా పూరణము గల దత్త పాదము యొక్క భావము .
ఉదాహరణం 2 : కవితాపూరణం : 12 .09 .2018
దత్త పది : " కారము కన్నులన్ బడినన్ కల్గును మోదము మానవాళికిన్ "
పూరణం :
స్వార్థము వీడిన సహాయము నన్ ,
సేవా తత్పరతన సక్రియా కర్మము నన్ ,
కృతజ్ఞుల పాలిటి కల్పవృక్ష మది(ధి) కారము
కన్నులన్ బడినన్ కల్గును మోదము మానవాళికిన్ ||
ఉదాహరణ 3 : కవితా పూరణం: 28.01. 2020)
దత్త పాదం : " మంచి వారల కెంచి చూడగా మంచి రోజులు రావులే "
పూరణం :
ఇంచుక స్వీయ కర్మలందుపరులకు సహాయమందించు సుజనులే
సంచిత పాప కర్మల నాచరించు కుజనులు చె డుత్రోవలోని వారలే
పంచిన దుష్కర్మలను అనుభవించె డు సుజనుల జీవితపథమ్ముల
నుంచి పయనించే మంచి వారలకెంచి చూడగా మంచిరోజులు రావులే ||
ప్రతిపదార్థము:
- ఇంచుక = కొంచెమైనా ; 2. స్వీయ కర్మలందు = స్వంత పనులందు
- పరులకు = ఇతరులకు ; 4. సహాయము = ఉపకారము
- అందించు = చేయు ; 6. సుజనులే = మంచివారే
- సంచిత = సంప్రాప్తించిన దుష్కర్మలను ;
- ఆచరించు = చేసి ఇబ్బంది పెట్టేవారు ; 9. కుజనులు = దురాత్ములు / దుర్మార్గులే ; 10. చేదు త్రోవలో ని = చెడు మార్గములో పయనించు
- వారలే = వారే ; 12. పంచిన కుకర్ములు = వారి ద్వారా ఆచరింపజేసిన చెడు పనులను ; 13. అనుభవించెడు = ప్రత్యక్షంగా / పరోక్షంగా చేయించ బడినవారు ; 14. సుజనుల = సజ్జనుల / మంచివారల ; 15. జీవితపథమ్ము ల = జీవిత మార్గముల నుంచి ; 16. పయనించే = ప్రయాణం సాగించే ; 17. మంచి వారలకు = సుజనులకు ; 18. ఎంచి చూడగా = వెతికి చూడగా / చూసినా కూడా ; 19. మంచి రోజులు = శుభ దినాలు / మేలు కలుగు రోజులు ; 20. రావులే = రాజాలవులే/ కనిపించవులే .
భావం : కొంచెమైనా తమంతట తాము స్వతాహా ,స్వంతపనులతో ఇతరులకు సహాయము చేయు మంచివారే, సంప్రాప్తింపబడిన దుష్కర్మల ను ఆచరించే కుజనులను చేసి, ఇబ్బంది పెట్టే దుర్మార్గులు/ దురాత్ములే వారిద్వారా ప్రేరేపించాపబడిన చెడు పనులను ప్రత్యక్షంగా / పరోక్షంగా అనుభవించిన మంచి మనుషుల జీవిత మార్గముల నుంచి ప్రయాణం సాగించే సుజనులకు వెతికి చూసినా కూడా శుభ దినాలు / మేలు కలుగు రోజులు రాజాలవులే/ కనిపించవులే . అని భావం @@@@
ఉదాహరణ 4 : కవితా పూరణం 24.12.2019
దత్తపాదం:" దానము | చేయగా | గలుగు | దారుణ | వేదన | సజ్జనా | ళికిన్ "
పూరణం :
పానము | చేయుచూ | ఈశ్వర | తలంపు| లో తప | ము చేయు | నెపమున్
దానవేం | ద్రుని భ | క్తికి ము | దమంది| న యప్ప | రమేశ్వ| రుకరుణన్
తానొసం | గినవ | రముల | తో గర్వ | ముపొంది| నదాన | వరాజే
దానము | చేయగా | గలుగు | దారుణ | వేదన | సజ్జనాళికిన్
వ్యాఖ్య: సుహృద్భావము తో చేయు సత్కర్మ ఎల్లప్పుడూసజ్జనులకు శాంతి ని చేకూర్చును కానీ దుష్ఠ భావనతో చేయు సత్కర్మలు సజ్జనులకు వేదన కల్గించును.
భావము :
సురాపానం చేయుచూ ,ఈశ్వరుని మదిలో కల్గిన తలంపు తో ,తపము చేయు కారణముచే, తపస్సును చేసిన ఆ దానవ రాజు భక్తికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు తానొసంగిన వరములతో గర్వముపొందిన ఆ రాక్షస రాజే దానము చేయగా గలుగు దారుణ వేదన కలుగు మంచివారికి . ఏలనంటే తాము అనుకున్న రాక్షస కృత్యము లనే అమలు పరచే పనుల నేపథ్యములో ఇది జరిగిందని నా భావము.
సందేహం : నేను రాసిన భావం వేరు, మీరు వర గర్వితులైన రాక్షసులు కనక దానం చేస్తే వేదనలు కలుగుతాయి అని రాశారు, నేను దుష్టుల స్నేహం వలన వేదనలు కలుగుతాయి అని రాశాను, ఇంకొక్కసారి చూడండి - బహుశా నేను సరిగ్గా చెప్పలేకపోయానేమో.
వ్యాఖ్య: ఏ రాక్షస రాజైతే గర్వముచే దానముచేయుచున్న అప్పటికీ , తానూ అనుకున్న వికృత ప్రణాళికలను అమలుపరిచే సందర్భములో మంచివారికి కూడా నష్టము కలుగునని భావము. భావములో కూడా నేను చెప్పాను. అంటే ఫలితాన్నీ ఇచ్చే భగవంతుడు బేధభావాన్ని చూపించనప్పటికీ దాని adverse effects different గా ఉంటాయని భావం. అంటే మంచివారికి ఒకలాగా , చెడ్డవారికి మరొకలాగా అని అర్థం . kjk
సందేహం: aa raakshasa raaje daanamu cheyaga kalugu daanamu chesina manchivaariki " ..... ee line meaning enti????? manchi vaaru daanamu chesina rakshasulu chesina phalithame vasthundana??? చిట్టా మైత్రేయి .
వ్యాఖ్య : ఇక్కడ దుష్టులే రాక్షసులు- ఇంకా రాక్షసులే దుష్టులు . వరగర్వితులు అంటే తమకు తోచిన పనులతో ఇతరులకు నష్టము కలిగించేవారు. తప్పక అర్థబలం, అంగబలం చూసుకొని విర్రవీగేవారని అర్థం . ఈ యుగంలో రాక్షసులంటే దుష్టులే అని అర్థం . kjk
సందేహం: ithey ippudu manushulu daanam cheyyala ??? vadda??? చిట్టా మైత్రేయి .
మానవులు సదుద్దేశం తో దానం చేస్తే, మంచి ఫలితాలను అందుకుంటారు . అంటే పాజిటివ్ approach చాలా మంచిగా ఉంటుంది.: kjk
ఇప్పుడు వచన కవితా సౌరభం ఉదాహరణలు
ఉదాహరణ 1 : వచన కవితా సౌరభం - 21 . 03 . 2020 ప్రపంచ కవితా దినోత్సవం - సందర్భంగా : అంశం : కళాకారుల - కళామతల్లి -
జననం గొప్పది - జీవనం శ్రేష్ఠమైనది
జ్ఞానం ప్రవాహమైనది - లోకం అనంతమైనది
కాలం ఎవరికోసం నిలువనిది - సంతోషం కావలిసినది
ఒక కాళిదాసు - ఒక రామదాసు - ఇలలో తమదైన ముద్ర
ఒక తులసీదాసు - ఒక కబీర్ దాసు - ద్విపద మాలికా ముద్ర
ఒక సుబ్బులక్ష్మి - ఒక బేగం అఖ్తర్ - శాస్త్రీయ గాన కౌశలం
ఒక సినారె - ఒక ఖయ్యామ్ - సినీ గీత రచనా లాలాసం
ఒక సుందరాచారి - ఒక ఇక్బాల్ - దేశ భక్తి గీత గౌరవం
ఒక దేవులపల్లి - ఒక షెల్లీ - భావకవితా మయ ప్రపంచం
ఒక ఘంటశాల - ఒక రఫీ - చలనచిత్ర గీతా లాపనం
ఒక సుశీల - ఒక సౌమ్య (లతా )నేపథ్య గాయనీ స్వర గళం
ఒక కవిత్రయం - ఒక నిరాలా , ద్వివేదీ , దినకరుని రచనావైవిధ్యం
వీరందరి తో పాటుగా - ప్రపంచం లో మనకు తెలిసిన - తెలియని
ఎందరో కవుల - రచయితల- గాయకుల సమాగమం - తో పాటు
ఎదుగుతున్న యువ - కవుల కవయిత్రుల మనో వాంఛల సోపానం
భావితరాల పాటిహాకుల కు అందించే వివిధ కృతుల సమర్పణం !!!
సకల కళాకోవిదులకు - ప్రపంచ కవితా దినోత్సవ శుభా కాంక్షలు ****
ఉదాహరణ 2 : వచన కవిత రుబాయి ( సౌరభం )
కవితా కన్యక.
ఎందుకనో ప్రకృతి సమస్యల కీ విచారం
పరికించిన కవికి కలుగును సులభతరం
కలం కదిలించిన జరుగును కవితా కౌశలం
జీవిత గమ్యంలో విషయమౌను మనోరంజితం
ఇదే ఇదే కన్నుల ప్రతిక్రియ భావాల సంబురం ......
భావనలు చెప్పును ఆలోచన తరంగాల వచన కేళి
మది తెలుపును ఆచరణ ప్రతి క్రియల సంగమ ప్రహేళి
కనులన్ పరికించిన ఆత్మీయ భావనల చిత్ర రచనల రంగేళి
కవిజన కావ్య కన్యకా రూప సోయగమ్ముల అపురూప చిత్రకేళి
అదే అదే తలచి పాఠక జనుల మది పులకింతల అంబరం......
పెదవుల వెలువడున్ నవజాత భావనల రసచందనం
శరీరాకృతి కనిపించున్ నవవిధ భంగిమల సౌష్ఠ చందం
లీలగా అగుపించును శిల్ప కళా కన్య నృత్య శ్రవణ బంధం
చిత్రించిన కలుగును గతవైభవ జీవన చైత్ర వర్ణ కదంబం
ఏదో ఏదో కలిగెను రసభావగీతి పలువిధముల సుందరం .....
నీవే నీవే ఆ కావ్య కన్యక !
ఉదాహరణ 3 :
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - వచన కవితా సౌరభం
విశ్వ మహిళ ల్లారా మీకు శుభాకాంక్షలు 08.03. 2020 .
ప్రకృతి పురుషుల అద్వితీయ కలయిక ఈ జాగత్తనే కుటుంబము
ఈ కలయిక లో ప్రథమస్థానం కూడా ప్రకృతి అనేడి మహిళే
మహిళలంటే -సృష్టి - స్థితి - లయ కారిణి కానీ శక్తి రక్షణపోషణలే
ప్రకృతి రక్షణయే మన జగతి వికాసం . మహిళే -
పాపగా -పారాడి- లాలింప బడుతూ.,
కూతురిగా - మురిపించి , మరిపిస్తూ .,
కన్యగా - అందంగా, ఆనందంగా అలరిస్తూ .,
యువతిగా - ఆదరిస్తూ, ఉద్యోగాలని నెఱపుతూ .,
భార్యగా - కుటుంబాన్ని, జీవితాలని సంభాళిస్తూ .,
కుటుంబం- దేశం అనే పరిమళ సుమాలను గుభాళింప జేస్తూ .,
శక్తి - యుక్తులు ; మంత్ర - యంత్రాగముల చే ప్రకాశిత మౌతున్న
ఓ విశ్వ జనీన ( ప్రపంచ) మహిళల్లారా మీకందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు
ఉదాహరణం 4 : శిల్పానికే ప్రాణం వస్తే ... ( వచన కవితా సౌరభ సోయగం )
ఇది సంభాషణా యుతంగా వ్రాసినది.
జక్కన, ఢంకన మున్నగు శిల్పుల వయ్యారాల శిల్ప వనితల సౌందర్య రస పోషణలో ,పర్యాటకుల వీక్షణ , ఆలోచనల స్వరూపములో శిల్పాల అంతరంగముల సంభాషణలో ,
మొదటి శిల్పం: నన్ను చెక్కిన జక్కన, నన్ను రాతి కళాత్మక నగలచే అలంకరించబడి , తిలకించ బడుచుంటిని చెలీ ,
మరియొక శిల్పం : నేను రామ ప్ప తీర్చిదిద్దిన నాగిని, నా యోగిని ఎంతబాగుగా అలం క రించుకుంన్నామో చూడవే హలా .
మొదటి శిల్పం : చె న్నకేశవస్వామి చెంత సప్త స్వరములచే నే నాట్యము చేసేద మీ అంతరంగమున వీక్షించవే సఖీ .
మూడవ శిల్పం : మహారాష్ట్ర శిల్ప కన్యకను అజంతా శిల్ప సుందరి ని నన్ను ఏంతో సుందరంగా చిత్రించారే నెలతా
నాల్గవ శిల్పం : నేను కూడా అక్కడి దానినే , ఎల్లోరా శిల్ప మంజరిని నన్ను వీక్షించినవారు ఎన్నడూ మరచి పోలేరు కదా లలనా
ఐదవ శిల్పం : నేను స్తంభాకృతిలో ఉన్నా, మొత్తం గుడి భారాన్ని గాలిలో ఉంటూ మోస్తున్నాను లేపాక్షి లో చూ డవే వనితా
ఇప్పుడు మన అందరి గొప్పతనం తో పాటు ఇంకా చిత్ర విచిత్ర శిల్పకళా మంజరులను చూపవే చెలీ , కలయ చూద్దామా?
మెత్తటి శిల్పం ,యుద్ధానికి వెళుతున్న యోధులు , సకల జంతుజాలములు , లత పుష్పాధికములను శిలలలో మలచారే వయ్యారీ
శిల్పులు విశ్వ కర్మ , సంతతి వారు కారే ,వారే బహుముఖ ప్రజ్ఞా శాలురు , అభినవ బ్రాహ్మలు . స్థపతులే శిల్ప కళా రాజుకారే పడతీ
వస్త్రాల పైన నమూనాలు , ఆలయాల పైన నగిషీలు శిల్పుల ప్రత్యేకతలు చెప్పకనే చెబుతున్నవి , మననే వీక్షించే వీక్షకులే కాంతా
ప్రాచీన ఆలయాల పైన శిల్ప శాస్త్ర ప్రావీణ్యం, ఆరోగ్య సూచనల విన్యాసం , ఇతర శాస్త్రాల మేళవింపు కలగలిపిన విజ్ఞానమే ఇంతీ
సుందర శాస్ర విశ్లేషణం వీక్షకులకు, పరిశోధకులకు, భావితరాలకు ఈ రసఝరులు , సకల కళల అభివృద్ధికి జీవితానికి, ఆదర్శప్రాయం
అందుకే శిలలపై శిల్పాలు చెక్కినారూ మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు .గతం నుండి వర్తమానం పిదప భవిష్యత్తు
కాకతీయులు ,రాష్ట్ర కూటులు ,చాళుక్యులు ,చోళులు - పాండ్యులు , హొయసలులు , విజయనగర రాజులు , పల్లవులు
మొదలగు ఎన్నో రాజవంశములు చేయూతతో శిల్ప సంపదచే మిశ్రితమైన విస్తృత పరిచినారీ ఆలయాలు , కట్టడాలు .
ఎన్ని చెప్పినా , పర్యాటకులందరూ , ప్రత్యేకించి సాంఘి క శాస్త్ర ఉపాధ్యాయులు , విద్యార్థులు క్షేత్ర పర్యటనలో
గుహాలయాలు , దుర్గమ ఆలయాలు , శిల్ప సమూహములచే ఉన్న ఆలయాలు బేలూరు , హళేబీడు , ఓరుగల్లు ,అజంతా - ఎల్లోరా
మహా బలిపురం , ఖజురాహో , బేలం గుహలు మొదలైనవాటిని దర్శిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుందే చెలీ .
ఓ శిల్ప రత్నములారా ! మీ అంతరంగ సంభాషణలు మమ్ములను ఉత్తేజ పరచు చున్నవి మీ ప్రాభవాన్నిపరిరక్షించె ద మే మెల్లప్పుడూ !...