AUCHITHYAM | Volume-3 | Issue-9 | September 2022| ISSN: 2583-4797
3. "సురవరం మొగ్గలు" నూతనకవితాప్రక్రియ పరిచయం
డా. మంగళగిరి శ్రీనివాసులు
సహాయ ఆచార్యులు(సి), పీ.జీ.సెంటర్ గద్వాల,
పాలమూరు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం. చరవాణి: 9491388662.
ఉపోద్ఘాతం:
తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగం మొదటిదశ 1801 నుండి 1900 వరకు,ఆ తర్వాత రెండవదశ 1901 నుండి ప్రారంభమై నేటి వరకు కూడ కొనసాగుతు న్నప్పటికి కాలానుగుణంగా ఈ ఆధునికయుగ సాహిత్యంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులోనే నూతన ఆవిష్కరణలు కూడ జరిగాయి.తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగం మొదటిదశ 1801 నుండి 1900 వరకు,ఆ తర్వాత రెండవదశ 1901 నుండి ప్రారంభమై నేటి వరకు కూడ కొనసాగుతు న్నప్పటికి కాలానుగుణంగా ఈ ఆధునికయుగ సాహిత్యంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులోనే నూతన ఆవిష్కరణలు కూడ జరిగాయి.
తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు ప్రభావంతో వైవిధ్యభరితమైన భాష శైలులతో విస్తృతంగా ఈ కాలానికి నూతన ప్రక్రియల ద్వారా కవులుసమాజంలో కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి పాఠక వర్గం ఆదరణకు దగ్గరవుతున్నది సాహిత్యం. దీని వల్ల తెలుగు సాహిత్యంలో అనేకమైనటువంటి నూతన ప్రక్రియలు వెలుగులోకి వచ్చిన ముత్యాల సరాలు,గజల్స్, నానిలు,రుబాయిలు,మణిపూసలు మొదలగునవి ఎన్నో ప్రక్రియలు సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి.అలాంటి తరుణంలో భీంపల్లి శ్రీకాంత్ హస్తముల్లో అందంగా రూపుదిద్దుకున్న అత్యాధునిక నూతన ప్రక్రియ మొగ్గలు కూడా పాఠకులలో సుస్థిర స్థానం దక్కించుకున్నది.
ఆధునిక మొదటిదశ ఉత్తరార్థంలో 1896 మే 28న సురవరం ప్రతాపరెడ్డి గారు జన్మించి ఆధునిక రెండవ దశలో తన విశిష్ట సేవలను అందించి తెలుగు ప్రజలకు, తెలంగాణ సమాజంలో సాహిత్య వైతాళికుడు పేరును గడించాడు.
బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తిగా, కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, పత్రిక సంపాదకుడిగా భిన్న కోణాలలో తెలుగు భాష సాహిత్య సేవ చేస్తూ వచ్చినటువంటి ఘనుడుసురవరం ప్రతాపరెడ్డి.
కోస్తా ప్రాంతం నుంచి వెలువడే ఒకానొక వారపత్రికలో తెలంగాణలో కవులే లేరని ఉన్నవారిలో కవితాశక్తియే లేదని తెలుగు మాట్లాడడమే అక్కడి వారికి తెలియదని ఏమేమో ఒక పత్రికలో రాశారు. దానిని చూసిన సురవరం ప్రతాపరెడ్డి మూలనున్న కవులను పైకితీసి 183 పూర్వ కవుల కవితలను 354 ఆధునికుల కవితలతో గోల్కొండ కవుల సంచిక ను సిద్ధం చేసి ప్రచురించారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణ సాహిత్యం నలుమూలలా వ్యాపింప చేసిన కార్యసాధకుడు సురవరం.
గోల్కొండ పత్రిక ద్వారా నిజాం ప్రభుత్వంపై ధ్వజమెత్తి వారి సంకుచితత్వాన్ని ఖండిస్తూ సంపాదకీయ వ్యాసాలు రాస్తూ సురవరం ప్రతాపరెడ్డి ప్రజా సేవ చేశారు ఇతరులను చైతన్యవంతుల్ని చేస్తూ ఉద్యమాలలో పాల్గొనేవారు.శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి సంస్థల ద్వారా విశిష్ట సేవలందించారు. పరిషత్తుకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.సురవరం వెలువరించిన రచనలు 1.గోల్కొండ కవుల సంచిక, 2.ఆంధ్రుల సాంఘిక చరిత్ర, 3.సురవరం ప్రతాపరెడ్డి కథలు, 4.హైందవ ధర్మ వీరులు, 5.హిందువుల పండుగలు, 6.రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలు కూడా రచించారు.అలాసాహితీలోకంలో ప్రత్యేక స్థానం సంపాదించాడు సురవరం ప్రతాపరెడ్డి. అటువంటి సురవరం ప్రతాపరెడ్డి మీద భీంపల్లి శ్రీకాంత్ *సురవరం మొగ్గలు* పేరిట పుస్తకం వెలువరించడం అభినందనీయం.
మొగ్గలు పక్రియను భీంపల్లి శ్రీకాంత్ 2017 నవంబర్ లో యాదృచ్ఛికంగానే మొదలుపెట్టారు. మొగ్గలకు అంకురార్పణ చేసిన అనతి కాలంలోనే విస్తృతంగా ఆదరణ పొందింది. దాదాపు వెయ్యికి పైగా మొగ్గలు రాశారు భీంపల్లి శ్రీకాంత్ వారి సహవాసం లోనే మరో కవి బోల యాదయ్య మొగ్గలు అధికంగా వ్రాశారు.
మొగ్గలు కవితా లక్షణాలు:
మొగ్గలు మూడు పాదాల కవిత్వం
ఎలాంటి అక్షర నియమం కానీ, ఛందస్సు కానీ లేదు.
ప్రతి పాదంలో మూడు నుంచి ఐదు పదాలు ఉండాలి.
ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు.
మూడు పాదాలలో మొదటి పాదానికి కొనసాగింపుగా రెండవపాదం వుండాలి. అంటే మొదటిపాదంలో వాక్యం అంతం కారాదు.
మొదటి రెండు పాదాలు భావయుక్తంగా, అర్ధవంతంగా చెబితే,దానిని సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం ముక్తాయింపుగా ఉంటుంది.
మరోవిధంగా చెప్పాలంటే కొన్నిసార్లు మొదటి రెండు పాదాలు ఒక "సంశ్లిష్ట వాక్యం"లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చు. ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా, సామెతగా చెప్పబడుతుంది. ఈ మూడవపాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని, సూక్తిని, సామెతను చెప్పినట్లవుతుంది.
వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు. మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవపాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తంచేయడం ఎంతో రమణీయపొందిక.
మొగ్గలు కవితా ప్రక్రియలో ఇప్పటికీ 30కి పైగా కవితా సంపుటాలు వెలువడ్డాయి. వందల మందికి పైగా కవులు మొగ్గలు ప్రక్రియలో కవిత్వ పరిమళాలను వేదజల్లుతున్నారు. సాహితీ వైతాళికుడు సురవరంను స్మరించుకుంటూ 124వ జయంతిని పురస్కరించుకుని 124 మందితో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సురవరం మొగ్గలు పుస్తకం ద్వారా సురవరం హృదయాన్ని ఆవిష్కరించారు.
సురవరం మొగ్గలు పుస్తకం డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సంపాదకత్వంలో పాలమూరి సాహితీ మహబూబ్నగర్ ప్రచురణతో 28 మే 2020న ముద్రించడం జరిగింది.దీనికి ఆర్థికంగా,హార్దికంగా సౌజన్యమూర్తి పాలమూరు జిల్లా సాహిత్య సాంస్కృతికబందు, గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖమంత్రి అండదండలతో,సూచనలతో దీనిని స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి గారికి అంకితం ఇచ్చారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖమంత్రి, శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డా.భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ అధ్యక్షులు, డా. గుంటి గోపి, బోలయాదయ్య లు ముందుమాటలు రాయగా అందమైన అక్షరాలతో గుండ అరుణ్ కుమార్ హస్తల్లోంచి పాఠకులకు అందిన సురవరం మొగ్గలు గూర్చి...
సురవరం మొగ్గలులో కవులుగా బోల యాదయ్య, బండారు సునీత, కపిలవాయి వెంకటేశ్వర్లు, దార్ల రాఘవేంద్రాచారి, రాజశేఖర్ సిద్ధాంతి,ఓర్సు రాజ్ మానస, శైలజా శ్రీనివాస్,వావిలిపల్లి రాజారావు,గన్నోజు శ్రీనివాసాచారి,యలమర్తి అనురాధ, సత్య నీలిమ,ఉప్పరి తిరుమలేష్,బైరోజు చంద్రశేఖర్,మల్లేకేడి రామోజీ, బైరోజు రాజశేఖర్, తెలుగు తిరుమలేష్, కట్టా అనితారమణ, పోతుల ఉమాదేవి, పోలె వెంకటయ్య, సైదులు ఖేతావత్, ధనాశి ఉషారాణి, డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు, వేముల కోటయ్య, దుగ్గి గాయత్రి, రామగిరి సుజాత, సిహెచ్ శ్రీనివాసరావు, జక్కు కృష్ణమూర్తి గౌడ్,చెన్న పద్మ, మర్యాద సురేందర్ రెడ్డి, కనుమ ఎల్లారెడ్డి, కడల శ్రీమంత్, ఊర ఈశ్వర్ రెడ్డి, కె.యస్ అరుణ, మద్దినేని జ్యోతి, కె. సువర్ణ దేవి, డాక్టర్ బైరోజు శ్యాంసుందర్, డా. గోపీనాథ్ రాథోడ్, పులి జమున, జె.హరికృష్ణ జీ, సనా అర్షిన్, ఇల్లూరి వెంకట్రామయ్య శెట్టి, పరిమి వెంకట సత్యమూర్తి, రాచమల్ల మల్లికార్జున్, సుభాషిణి ప్రత్తిపాటి, నింగిరెడ్డి కాంతారెడ్డి, జి.శాంతా రెడ్డి, డా.చీదెళ్ల సీతాలక్ష్మి, రుద్రాక్షలమఠం ప్రభులింగశాస్త్రి, జుర్రు నారాయణ , మేడిచర్ల హరి నాగభూషణం, యలకంటి భాస్కర్ , బొమ్ము విమల, బర్క శశాంక్, కర్నాటి రఘురాములు గౌడు, కమ్మరి శిరీష, గాండ్ల వీరమణి, ఆచార్య గిడ్డి వెంకటరమణ, పొన్నగంటి ప్రభాకర్, డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ, యం. వనజ , పోమాల హనుమంతు, జి శ్రీదేవి, సి.శేఖర్ , అన్నపూర్ణ యంజాల, ఘాలి లలిత ప్రవల్లిక, కంచరాన భుజంగరావు, అంబటి భానుప్రకాష్, ఎ.హరిశంకర్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, సృజామి, టి.అంబుజ, పాతూరి అన్నపూర్ణ , రావూరి వనజ, బాటసారి, రవి చంచల, నందిగామ కిషోర్ కుమార్, డా.తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, బొడ్డుపల్లి ఖాజన్న , సముద్రాల కుమారస్వామి, సహాని, సముద్రాల శ్రీదేవి, లలితా రెడ్డి, వురిమళ్ల సునంద, బోరవెల్లి పవన్ కుమార్, షాహిన్ సుల్తాన, కోట్ల శైలజా రెడ్డి, కడారి పెద్దయ్య , జక్కులపల్లి గోపాల్, కొలంట్ల రామకృష్ణ, ఆర్.చెన్నయ్య, కల్లూరి ప్రభాకరాచారి, రాణి లీలావతి, బాదెపల్లి వెంకటయ్య గౌడ్, కొప్పోలు యాదయ్య , రామా రత్నమాల, అనుపటి హేమలత, కూర హనుమయ్య, కపిలవాయి అశోక్ బాబు, కొలిపాక శ్రీనివాస్, సుంకరి బసవరాజప్ప, కె.రాధికా రాణి, కపిలవాయి ఆనంద్ వర్ధన్, ఆకుండి శైలజ, ముడుంబై శేషపణి, యం.వీరకుమారి, కన్నోజు కవితాదేవి, ఎం.వి.ఉమాదేవి, రమాదేవి బాల బోయిన, మూర్తి శ్రీదేవి, డాక్టర్ ఎ.జయంతి, భూచంద్ర , జి మురళీధర్ రావు, సర్ఫరాజ్ అన్వర్, నెల్లూరు వెంకటలక్ష్మి , కె.పాండురంగ విఠల్ , అయిత అనిత, వేమూరి కమలాకర్ సుజాత, పెసరు లింగారెడ్డి, కల్వకోలు మద్దిలేటి, కోణం పరుశరాములు, రాసామొళ్ల చంద్రయ్య, ఈవేమన, డా.గుంటి గోపి, డా.భీంపల్లి శ్రీకాంత్ ల కవిత మొగ్గలున్నాయి.
ఇందులోని కవులందరు కూడా రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించారని చెప్పావొచ్చు.ఒకటి సురవరం ప్రతాపరెడ్డి జీవిత అంతరంగం గూర్చి మరొకటి మొగ్గలు ప్రక్రియలో సురవరం ప్రతాపరెడ్డి అనే వస్తువుకు తగ్గట్లుగా భావవ్యక్తీకరణతో, అక్షరాల నిర్మాణంతో సమన్వయ లోపం లేకుండా కవులు మొగ్గలను అందంగా రాసారు.
మచ్చుకు కొన్ని సురవరం మొగ్గలు....
బోల యాదయ్య రాసిన సురవరం మొగ్గలులో ఒకటి అతని మది సంద్రంలో పూసిన ఓనమాలేరాచరికాన్ని అంతం చేసే వ్యాసాలైనవి.సురవరం అక్షరాలు రాచరికాన్ని అంతం చేసే నేస్తాలు.
బైరోజు రాజశేఖర్ రాసిన మొగ్గలులో ఒకటితేనెల తెలుగు భాషకు వెలుగులు నింపాలనిఅహరహం శ్రమించిన నిత్య కృషీవలుడుసాహితీ చైతన్యశీలి సురవరం ప్రతాపరెడ్డి.
తెలుగు తిరుమలేష్ రాసిన మొగ్గలులో ఒకటి ఆంధ్రుల సాంఘిక చరిత్రతోతెలుగువారికి వెలుగులు చిందించాడు.తెలంగాణ సాహితీ శిఖరం సురవరం
సైదులు ఖేతావత్ రాసిన మొగ్గలు లో ఒకటి అణగారిన తెలంగాణ పేదప్రజలకుచైతన్య రథ సారధై ముందుకు సాగిందిఉదయించే సూర్యుడు సురవరం.
డా. గుంటి గోపి రాసిన మొగ్గలులో ఒకటిపత్రిక కోసం ఎన్నో అవతారాలను ఎత్తుతూనేఅన్ని ఆటంకాలను అధిగమించిన దైర్యశాలియువతరానికి స్ఫూర్తి సురవరం కలం.
డా. భీంపల్లి శ్రీకాంత్ రాసిన మొగ్గలులో ఒకటికొడిగట్టుకుపోతున్న తెలుగు భాష ఉద్దరణకుప్రాణవాయువు నిచ్చిన అసలు సిసలు అక్షరదీపంసురవరం తెలుగు భాషోద్దరణ చైతన్య దీప్తి.
అంటూ సురవరం కవితమొగ్గలను ఒకొక్క కవి 5 (ఐదు) మొగ్గలు చొప్పున 124 మంది కవులు వారి వారి మొగ్గలను పొందుపరిచిన ఉత్తమ గ్రంధం. సురవరం ప్రతాపరెడ్డి జీవనశైలిని సామాజిక దృక్పథంతో కవులు వ్యక్తం చేసిన మొగ్గలు రేపటి తరానికి ఆదర్శప్రాయం.మొగ్గలు చరిత్రలో నిలిచి ఉండే అక్షరాలు. సురవరం ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 25న గుండెపోటుతో మనకు బౌతికంగా దూరమైన అందరిలోనూ సజీవం ఉంటారు.